మేయర్ హత్యానంతరం ‘థ్యాంక్స్’ చెప్పిన దుండగులు!? | After the murder of the mayor 'thyanks' said the assailants !? | Sakshi
Sakshi News home page

మేయర్ హత్యానంతరం ‘థ్యాంక్స్’ చెప్పిన దుండగులు!?

Published Thu, Nov 19 2015 2:13 AM | Last Updated on Mon, Aug 13 2018 3:10 PM

మేయర్ హత్యానంతరం ‘థ్యాంక్స్’ చెప్పిన దుండగులు!? - Sakshi

మేయర్ హత్యానంతరం ‘థ్యాంక్స్’ చెప్పిన దుండగులు!?

దారులు చూపించిన వాళ్లు మేయర్ పక్కనే ఉన్నారా..?
మోహన్ అనుచర వర్గంపై పోలీసుల దృష్టి

 
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్‌ల హత్య వెనుక పలు ఆసక్తికర విషయాలు ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. మేయర్ దంపతులపై కాల్పులు జరిపిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లే దుండగులు సంఘటన స్థలంలోనే ఉన్న ఓ వ్యక్తికి ‘థ్యాంక్స్’ చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారంలో మేయర్ వర్గానికి చెందిన వాళ్లపై పో లీసులు దృష్టి సారించారు. కొత్త వ్యక్తులకు మేయర్ చాంబర్ ఎక్కడుందనే విషయం తెలియదు. ముసుగు ధరించి మే యర్ చాంబర్‌లోకి ముగ్గురు దుండగులు వెళుతున్న సమయంతో వాళ్ల కాళ్లకు మగాళ్ల చెప్పులు, బూట్లు కనిపించడంతో అప్రమత్తమైన మేయర్ అనుచరులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

మేయర్‌కు బాగా తెలిసిన వ్యక్తులే హంతకులకు చాంబర్ లోపలకు వెళ్లడానికి దారి చూపించినట్లు తెలుస్తోంది. ఇక హత్య చేసిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయ ప్రధాన తలుపులు మూశారు. ఈ సమయంలో హంతకులు కార్యాలయం నుంచి తప్పించుకునే అవకాశం లేదు. అయితే కార్పొరేషన్ కార్యాలయంపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు ప్రజారోగ్యశాఖ విభాగం పక్కనున్న ప్రహరీగోడ దూకవచ్చనే సలహా నిందితులకు ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మేయర్ హత్యోదంతంలో మేయర్ దంపతుల అనుచర వర్గం, పార్టీ నాయకులను కూడా పోలీసులు సందేహించాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement