సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనాతో అనాథలైన పిల్లలను గుర్తించే పనిలో ఉన్నామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనురాధ పేర్కొన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. '' ఇప్పటివరకు 154 మంది పిల్లలు కోవిడ్ వల్ల అనాథలయ్యారు. అనాథలుగా మారిన 56 మంది పిల్లల పేరిట ఇప్పటికే రూ.10లక్షల చొప్పున డిపాజిట్ చేశాం. దేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదట ఈ పథకం తీసుకొచ్చారు.
ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. రానున్న కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి జిల్లాలో పిల్లల కోసం కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. అంగన్‌వాడీల ద్వారా పిల్లలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం'' అంటూ వివరించారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేసే పనిలో ఉన్నట్లు అనురాధ తెలిపారు.
చదవండి: ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులను గుర్తించండి
Comments
Please login to add a commentAdd a comment