Women and Child Welfare
-
మహిళా శిశు సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా శిశు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అధ్యక్షతన శనివారం చింతన్ శివిర్ కార్యక్రమం జరిగింది. సదస్సుకు తెలంగాణ నుంచి మంత్రి సీతక్క, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్న ప్రత్యేక పథకాలు, సాధించిన పురోగతి, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహకారంపై సీతక్క ప్రసంగించారు. తెలంగాణలో 35,700 అంగన్వాడీ కేంద్రాలను నడుపుతున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా స్వయం సహాయక బృందాల మహిళలతో.. అంగన్వాడీ చిన్నారులకు రంగురంగుల యూనిఫామ్‌లను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. మహిళ, శిశు సంక్షేమం విషయంలో కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా పెరగాలని సీతక్క కోరారు. -
Pune Porsche car crash: మైనర్ నిందితునికి బెయిలు.. జడ్జిల తొలగింపు
పుణే: పోర్షే కారు దుర్ఘటనలో మైనర్ నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన కేసులో జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ)కి చెందిన ఇద్దరు జడ్జిలను మహారాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. విధానపరమైన లోపాలు, దుష్ప్రవర్తన, నిబంధనలు పాటించకపోవ డంవంటి ఆరోపణలపై ఎల్.ఎన్.దన్వాడే, కవితా థోరట్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూసీ డీ) దర్యాప్తు కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కల్పించిన అధికారాలను దుర్వినియోగం చేసిన ట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరి ని యామకాన్ని రద్దు చేసింది. పుణేలోని కళ్యా ణి నగర్ ప్రాంతంలో ఓ బిల్డర్ కుమారుడైన 17 ఏళ్ల బాలుడు మద్యం మత్తులో పోర్షే కారు నడిపి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఐటీ నిపుణులు మృతి చెందారు. అప్పటి జేజేబీ జడ్జిలు నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఆ షరతులలో రోడ్డు భద్రతపై 300 పదాల వ్యాసం రాయాలని ఉంది. ఇది జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
‘సంపూర్ణ’ ఆరోగ్యం
సాక్షి, అమరావతి: ఆరోగ్యవంతమైన భావి తరాల కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. డబ్బులకు వెనుకాడకుండా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఖర్చు చేస్తూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. డ్రై రేషన్ కింద అందించే సరుకుల నాణ్యతను నిరంతరం సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఫౌండేషన్ స్కూళ్లలో చిన్నారుల బోధనపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆంగ్ల భాషలో పరిజ్ఞానం, ఉచ్చారణ బాగుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతల కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ టేక్ హోం రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. గతంతో పోలిస్తే ఐదు రెట్లు అధికంగా వ్యయం రక్తహీనత, పౌష్టికాహారలేమి రాష్ట్రంలో పూర్తి తొలగిపోవాలనే లక్ష్యంతో భారీ ఖర్చు గర్భిణిలు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారం కోసం గత ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.450 – రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు ఏటా సుమారు రూ.2,300 కోట్లు వ్యయం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. పౌష్టికాహారాన్ని అందించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద ఒక్కొక్కరికీ రూ.850 చొప్పున ఖర్చు చేస్తుండగా సంపూర్ణ పోషణ ప్లస్ కోసం రూ.1,150 చొప్పున వ్యయం చేస్తున్నట్లు చెప్పారు. రక్తహీనత, పౌష్టికాహార లేమి లాంటి సమస్యలు రాష్ట్రంలో పూర్తిగా తొలగిపోవాలన్న లక్ష్యంతో ఇంత ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలన్నీ మంచి ఫలితాలనిచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఫ్యామిలీ డాక్టర్లు అంగన్వాడీల సందర్శన తప్పనిసరి ఫ్యామిలీ డాక్టర్లు గ్రామాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా అంగన్వాడీలను సందర్శించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. పిల్లలు, తల్లులు, బాలింతల ఆరోగ్యాన్ని పరిశీలించి ఏమైనా సమస్యలుంటే మంచి వైద్యాన్ని అందించాలని సూచించారు. బాలికా విద్య ప్రోత్సాహ పథకాలపై అవగాహన బాల్య వివాహాల నిరోధం, అక్షరాస్యత పెంపు, బాలికలు ఉన్నత చదువులు అభ్యసించేలా ప్రోత్సహించే లక్ష్యంతో తెచ్చిన అమ్మ ఒడి, కళ్యాణమస్తు, వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు ఎలా ఉపయోగపడతాయో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా పథకాలు బాల్య వివాహాలను ఎలా నిరోధిస్తాయో వివరించాలన్నారు. కళ్యాణమస్తు కింద లబ్ధి పొందాలంటే వధూవరులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధన అందుకే విధించామన్నారు. రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలపై ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీల్లో పరిశుభ్ర వాతావరణం అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందుకోసం క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలన్నారు. టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండాలని, అంగన్వాడీ కేంద్రాలకు మరమ్మతుల సమయంలో ఈ అంశాన్ని ప్రాధాన్యతగా పరిగణించాలని సూచించారు. చిన్నారులకు బోధనలో నాణ్యతకు పెద్దపీట ఫౌండేషన్ స్కూల్ చిన్నారులకు విద్యా బోధనలో నాణ్యతకు పెద్దపీట వేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇప్పుడున్న విద్యా విధానం కాకుండా ఇతర మార్గాలను కూడా పరిశీలించాలని సూచించారు. ఫౌండేషన్ స్కూల్ (పీపీ–1, పీపీ–2) పిల్లల్లో ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం, ఫోనిటిక్స్, ఉచ్ఛారణ లాంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. నిర్దేశించుకున్న సిలబస్‌ను వినూత్న బోధనా విధానాలతో నేర్పించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. పునాది బాగుంటే పై తరగతుల్లో సాఫీగా చిన్నారులకు మూడో తరగతి నుంచే టోఫెల్ పరీక్షకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొదలైందని సీఎం జగన్ చెప్పారు. ఇప్పుడు పీపీ–1 నుంచి రెండో తరగతి పిల్లల మీద దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల మెదడు గరిష్టంగా వికసించే వయసు కాబట్టి వినూత్న బోధనా విధానాల ద్వారా మంచి భాషా జ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వయసులో పునాది గట్టిగా ఉంటే పై తరగతుల్లో విద్యార్థుల ప్రయాణం సాఫీగా సాగుతుందన్నారు. మాంటిస్సోరి విద్యా విధానంపై సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. అధికారులు తొలుత మాంటిస్సోరి స్కూళ్లను పరిశీలించాలని సూచించారు. సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ ఎండీ ఏ.బాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతులు కల్పన) కమిషనర్ కాటమనేని భాస్కర్, పౌర సరఫరాల శాఖ ఎండీ జి.వీరపాండ్యన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఏ.విజయ సునీత తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణతో నెలకు అందించే రేషన్ సరుకులు – 2 కిలోలు రాగి పిండి – 1 కేజీ అటుకులు – 250 గ్రాముల బెల్లం – 250 గ్రాముల చిక్కీ – 250 గ్రాముల ఎండు ఖర్జూరం – 3 కేజీల బియ్యం – 1 కేజీ పప్పు – అర లీటర్ వంటనూనె – 25 గుడ్లు – 5 లీటర్ల పాలు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్‌తో నెలకు అందే రేషన్ సరుకులు – 1 కేజీ రాగి పిండి – 2 కిలోలు మల్టీ గ్రెయిన్ ఆటా – 500 గ్రాముల బెల్లం – 500 గ్రాముల చిక్కీ – 500 గ్రాముల ఎండు ఖర్జూరం – 3 కేజీల బియ్యం – 1 కేజీ పప్పు – అర లీటరు వంటనూనె – 25 గుడ్లు – 5 లీటర్ల పాలు -
మహిళా శిశు సంక్షేమ శాఖలో 12,128 పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ చెప్పారు. మహిళలు, శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే సీఎం జగన్ ధ్యేయమని తెలిపారు. శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందిస్తూ.. టీడీపీ హయాంలో మహిళా శిశు సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక మహిళా శిశు సంక్షేమ శాఖలోని వివిధ విభాగాల్లో 12,128 పోస్టులను భర్తీ చేసినట్లు వివరించారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 4,018 పోస్టులనే భర్తీ చేసిందన్నారు. ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని మహిళలు, పిల్లలకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం లభించేలా వైఎస్సార్ సంపూర్ణ పోషన్ ప్లస్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. జూన్ నాటికి ఉద్ధానం ప్రాజెక్టు పూర్తి: మంత్రి రజిని ఉద్ధానం ప్రాంతంలోని దాదాపు 8 లక్షల మందికి ప్రాణాధారమైన ఉద్ధానం మంచి నీటి ప్రాజెక్టు జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి రానుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు సమయంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. టీడీపీ హయాంలో ఉద్ధానం ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధలు పడినా పట్టించుకోలేదని విమర్శించారు. ఆ ప్రాంత ప్రజల కష్టాలను కళ్లారా చూసిన సీఎం జగన్ దానిపై బాగా ఆలోచించి మూల కారణమైన మంచి నీటి సమస్యను పరిష్కరిస్తున్నారని చెప్పారు. 100 కి.మీ.దూరం నుంచి మంచి నీటిని తరలించేందుకు రూ.750కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తున్నారని తెలిపారు. అక్కడ కిడ్నీ రోగుల వైద్యం కోసం 200 పడకల ఆసుపత్రి, కిడ్నీ వ్యాధులపై పరిశోధనకు రీసెర్చి సెంటర్‌ను నిరి్మస్తున్నారని చెప్పారు. జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు: మంత్రి జోగి రమేష్ నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఏర్పాటు చేస్తున్న జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. అసెంబ్లీలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 21,25,778 ఇళ్లలో 4,40,756 ఇళ్లు పూర్తయి లబ్దిదారులు ఆనందంగా గృహప్రవేశాలు కూడా చేశారన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే రూ.42,973 కోట్లు ఖర్చు చేశామన్నారు. సీఎం వైఎస్ జగన్ నియోజకవర్గ స్థాయిలో సమీక్షిస్తూ పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణం జరిగేలా మార్గదర్శనం చేస్తున్నారన్నారు. ఓటీఎస్ కింద డబ్బులు కట్టిన వారికి వెంటనే ఇళ్ల పత్రాలు అందిస్తామని చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ఆటంకంగా ఉన్న కోర్టు కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో మిగిలి ఉన్న పేదలకు ఇళ్ల కోసం త్వరితంగా భూసేకరణ చేస్తామన్నారు. -
మహిళలు, పిల్లలకు ఆరోగ్య భద్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మహిళలు, పిల్లల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నివారించి, ఆరోగ్యంగా ఉంచాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మస్థాయిలో కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. తొలి దశలో 8 అంశాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్ర బిందువుగా సుస్థిర ప్రగతి లక్ష్యాల సూచికలను సాధించడం ద్వారా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేందుకు ఈ నెల 16 నుంచి ఇంటింటి సర్వే చేపట్టింది. వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేసి, రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్న మహిళలు, పిల్లలను గుర్తించి, వారికి అవసరమైన మందులు, పౌష్టికాహారాన్ని అందించి ఆరోగ్యంగా తీర్చీదిద్దడానికి చర్యలు చేపట్టింది. వారికి ముందులు, ఆహారం సరఫరాను గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు నిరంతరం పర్యవేక్షిస్తారు. ఇప్పటికే 40 లక్షల ఇళ్లలో సర్వే పూర్తయింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఈ సర్వే కోసం వలంటీర్లకు ప్రాధాన్యత గల 8 సుస్థిర ప్రగతి లక్ష్యాల సూచికలతో ఓ అప్లికేషన్ కూడా రూపొందించింది. 2,65,979 క్లస్టర్ల వారీగా 1,59,29,858 కుటుంబాలను వీరు కలుసుకుంటున్నారు. రక్తహీనత, బరువు తక్కువ, పౌష్టికాహార లోపాలతోపాటు పిల్లల్లో స్కూల్ డ్రాపవుట్స్ పాఠశాలల్లో మహిళా టాయిలెట్ల నిర్వహణ, విద్యుత్, తాగునీటి సదుపాయాలపై సర్వే చేస్తున్నారు. ఆ వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. వాటిని పరిశీలించిన అధికారులు తదనుగుణంగా చర్యలు చేపడతారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, 11, 12 తరగతుల్లో పిల్లల ఎన్రోల్మెంట్ రేషియోతోపాటు డ్రాపవుట్స్ లేకుండా ఆ ఈడు పిల్లలందరూ విద్యా సంస్థల్లో ఉండేలా సర్వే ద్వారా చర్యలు చేపడుతున్నారు. పిల్లలు ఎవ్వరైనా స్కూల్‌కు రాకపోతే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి, మళ్లీ బడిలో చేర్పించేందుకు వలంటీర్లు చర్యలు తీసుకుంటారు. స్కూళ్లలో కనీస మౌలిక వసతుల వివరాలు సేకరించి, లోపాలుంటే వెంటనే సరిచేస్తారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇంటింటి సర్వే పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ సమీర్ శర్మ సమీక్షించారు. సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. 8 సుస్థిర ప్రగతి సూచికల లక్ష్యాల సాధనకు సర్వే అంశాలు ఇవే ► కౌమారదశలో ఉన్న 10 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు మహిళల్లో రక్తహీనత కలిగిన వారు ఎంత శాతం ఉన్నారు? ► 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల గర్భిణుల్లో రక్తహీనత కలిగిన వారు ఎంత శాతం ఉన్నారు? ► ఎదుగుదల లేక కుచించుకపోయిన ఐదేళ్ల లోపు పిల్లలు ఎంత మంది ఉన్నారు? ► తక్కువ బరువుగల ఐదేళ్లలోపు పిల్లలు ఎంత మంది ఉన్నారు? ► ఎలిమెంటరీ స్కూల్స్‌లో 1 నంచి 10వ తరగతి వరకు ఎన్రోల్మెంట్ రేషియో ► ఉన్నత విద్యలో 11, 12 తరగతుల్లో స్థూల నమోదు నిష్పత్తి ► స్కూళ్లలో విద్యుత్, తాగునీరు అందుబాటు ఎంత శాతం ఉన్నాయి? ► స్కూళ్లలో ప్రధానంగా బాలికల టాయిలెట్ల నిర్వహణ, స్థితి ఎలా ఉంది? ఈ నెల 25లోగా సర్వే పూర్తి మహిళలు, పిల్లల ఆరోగ్యం.. ప్రధానంగా రక్తహీనత, పౌష్టికాహార లోపాలను గుర్తించేందుకు రాష్ట్రం అంతటా తొలిసారిగా పెద్ద ఎత్తున ఇంటింటి సర్వే చేపట్టాం. ఈ నెల 25కి సర్వే పూర్తవుతుంది. సర్వే కోసం ప్రత్యేకంగా నమూనా ఫారమ్‌ను రూపొందించాం. సర్వేలో వివరాల ఆధారంగా రక్త హీనత, పౌష్టికాహార లోపాలు గల, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారిపై దృష్టి సారించి, వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంంటాం. తద్వారా 8 అంశాల్లో సుస్థిర ప్రగతి సూచికల లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించడమే ధ్యేయం. – గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ -
స్త్రీ,శిశు సంక్షేమ శాఖకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు
-
'కోవిడ్‌తో అనాథలైన పిల్లలను గుర్తిస్తున్నాం'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనాతో అనాథలైన పిల్లలను గుర్తించే పనిలో ఉన్నామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనురాధ పేర్కొన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. '' ఇప్పటివరకు 154 మంది పిల్లలు కోవిడ్ వల్ల అనాథలయ్యారు. అనాథలుగా మారిన 56 మంది పిల్లల పేరిట ఇప్పటికే రూ.10లక్షల చొప్పున డిపాజిట్ చేశాం. దేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదట ఈ పథకం తీసుకొచ్చారు. ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. రానున్న కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి జిల్లాలో పిల్లల కోసం కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. అంగన్వాడీల ద్వారా పిల్లలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం'' అంటూ వివరించారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేసే పనిలో ఉన్నట్లు అనురాధ తెలిపారు. చదవండి: ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులను గుర్తించండి -
విద్యా, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: విద్యా, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: అర్చకులపై ఏపీ సర్కార్ వరాల జల్లు.. శరణ్య.. నువ్వు డాక్టర్ కావాలమ్మా! -
ఆడుతూ.. పాడుతూ ఏబీసీడీ
► ప్రీ–స్కూల్ కార్యకలాపాలకు అవసరమైన అంశాలను అభివృద్ధి చేయడానికి అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ విడుదల చేసింది. ఆటలు, చదువుకు సంబంధించిన సామగ్రితో ప్రీ–స్కూల్ కిట్‌ను అంగన్వాడీ కేంద్రాలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ► ఈ కిట్‌లో అన్ని రకాల పుస్తకాలు, వివిధ వస్తువులు ఉంటాయి. కిట్ విలువ రూ.5 వేలు ఉంటుంది. ప్రతి స్కూలుకు ఒక కిట్‌ను అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సాక్షి, అమరావతి: అంగన్వాడీ స్కూళ్లలో సమూల మార్పులు రాబోతున్నాయి. ఆట పాటల ద్వారా చిన్నారులను అలరిస్తూ విద్యా బుద్ధులు నేర్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రీ స్కూల్ సిలబస్‌ను రూపొందించింది. ఇకపై రాష్ట్రంలో అంగన్వాడీ స్కూళ్లన్నీ వైఎస్సార్ ప్రీ ప్రైమరీ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్పు చెందుతాయి. ప్రీ–స్కూల్ సిలబస్‌కు అనుగుణంగా అన్ని ప్రాజెక్టుల చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు, సూపర్వైజర్లకు శిక్షణ పూర్తయింది. అంగన్వాడీ కార్యకర్త హోదాను అంగన్వాడీ టీచర్‌గా మారుస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ టీచర్లకు జనవరి 18 నుంచి 22 మధ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వీరిలో ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని మెరుగు పరచడానికి కూడా చర్యలు తీసుకుంటోంది. యూ ట్యూబ్ లింక్ ద్వారా భాగస్వామ్యం చేసి, వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ప్రీ–స్కూల్ పిల్లలు సమర్థవంతంగా విద్య నేర్చుకోవటానికి 25 ముఖ్య కార్యకలాపాల కోసం గుర్తించిన, అభివృద్ధి చేసిన వీడియోలపై అంగన్వాడీ టీచర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సహాయంతో ఈ వీడియోలను అభివృద్ధి చేశారు. 25 కొత్త కార్యకలాపాలు ఇలా.. క్రమబద్దీకరణ, తోలు బొమ్మలు – కర్రతోలు బొమ్మలు, ఇసుక పేపర్ సంఖ్యలు వర్ణమాలలు – అక్షరమాల, ఫ్లాష్ కార్డుల ద్వారా కథలు, సంఖ్యలు – అక్షరాలు, బిబ్స్ వర్ణమాలలు – సంఖ్యలు – అక్షరమాల (ఒక చిన్నారి మెడలో రంగు రంగుల అక్షరమాల వేసి, ఇతర పిల్లలతో వాటిని చెప్పించడం), వేలు తోలు బొమ్మలు, సౌండ్ బాక్స్‌లు, నంబర్ – వర్డ్ డిస్క్, నంబర్ పిక్చర్ మ్యాచింగ్, రేఖాగణిత ఆకార పెట్టె, సంఖ్య డొమినోస్ (వివిధ రంగుల్లో ఉన్న చుక్కలను గుర్తించి లెక్కపెట్టడం), సంభాషణ కార్డులు, స్టీరియో గ్నోస్టిక్ క్లాత్ బ్యాగ్ (కొన్ని వస్తువులను చూపుతూ ఒక సంచిలో వేశాక, అవి ఏమిటో చెప్పమనడం) ఎన్ఎస్సీ (సంఖ్య, ఆకారం, రంగు) బ్లైండ్ ఫోల్డ్ (కళ్లకు గంతలు కట్టాక, వస్తువులను గుర్తించడం), సీవీసీ వర్డ్ బుక్స్, బెల్స్ మోగించడం, ఉడెన్ బోర్డులను ఉపయోగించడం, దువ్వెన కార్యాచరణతో అద్దం (అద్దంలో చూసి చేయడం), మట్టితో కార్యకలాపాలు, తోలు బొమ్మ థియేటర్, సంఖ్య అసోసియేషన్ స్టాండ్ (వివిధ రంగుల్లో ఉన్న నంబర్లపై రింగ్ విసరడం), వ్యతిరేక పదాలు, ఏకవచనం– బహువచన పదాలు, సరదాగా సరిపోల్చండి అనే 25 రకాల యాక్టివిటీలతో ప్రీ స్కూళ్లలో పిల్లల మెదళ్లకు పదును పెట్టనున్నారు. వినూత్న విధానంలో బోధన కోసం ఓ అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన వస్తువులు వచ్చే నెల నుంచి అంగన్వాడీ స్కూళ్లు – ఫిబ్రవరి 1 నుంచి అంగన్వాడీ స్కూళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 55,600 అంగన్వాడీ స్కూళ్లలో సుమారు 8.50 లక్షల మంది పిల్లలు చదువుతో పాటు పౌష్టికాహారాన్ని అందుకుంటున్నారు. – తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు 66.6 శాతం మంది తల్లులు సమ్మతించారు. పట్టణాల్లో కాస్త తక్కువ సుముఖత ఉంది. పల్లెల్లో పూర్తి స్థాయిలో పిల్లను పంపించేందుకు తల్లులు అంగీకరించారు. – కరోనా సమయాన్ని అధికారులు ఉపయోగించుకున్నారు. స్కూళ్లు మూసి వేయడం వల్ల పిల్లల రేషన్, గుడ్లు, పాలు వంటివి ఇంటి వద్దకు సరఫరా చేయడం వల్ల ఆ సమయంలో మూడేళ్ల వయసున్న (వెయ్యి రోజులు) పిల్లల సంరక్షణపై ప్రత్యేకంగా ప్రణాళిక తయారు చేశారు. ఇప్పుడు ఈ ప్రణాళికను ఉపయోగించాలని నిర్ణయించారు. పిల్లల పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇస్తూనే సైన్స్ పరంగా పిల్లలు ఆడుకుంటూ నేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యూ ట్యూబ్ చానల్ ఏర్పాటు – స్త్రీ శిశు సంక్షేమ శాఖ పిల్లల కోసం యూ ట్యూబ్ చానల్‌ను రూపొందించింది. ఛానల్లో టీచర్లకు అవసరమైన ఇంటర్వ్యూలు, పిల్లలకు అవసరమైన కార్యకలాపాలు ఉంటాయి. ఎర్లీ ఎడ్యుకేషన్‌లో మంచి మార్పులు పిల్లల్లో నూతన ఆలోచనలు తీసుకురావడంతో పాటు ఆడుకుంటూ అన్ని అంశాలను శాస్త్రీయ పద్ధతిలో నేర్చుకునే విధంగా అంగన్వాడీలలో కార్యకలాపాలు రూపొందించాము. ఎర్లీ ఎడ్యుకేషన్‌లో 25 రకాల నూతన పద్ధతులతో బోధన ఉంటుంది. ఇందుకు అనుగుణంగా సిలబస్ రూపొందించాము. స్కూళ్లు మొదలు కాగానే పుస్తకాలు సరఫరా చేస్తాము. పిల్లల్లో పౌష్టికాహార లోపాలను నివారించడంతో పాటు మంచి విద్యను ప్రాథమిక దశలో నేర్చుకునేందుకు ఈ కార్యకలాపాలు ఉపయోగపడతాయి. – డాక్టర్ కృతిక శుక్ల, డైరెక్టర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ. -
అక్క, చెల్లెమ్మలకు అండగా..
సాక్షి, అమరావతి : మహిళాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దఎత్తున నిధులు కేటాయించింది. పిల్లల్ని చక్కగా చదివించి.. వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దటం మహిళల వల్లే సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో వివిధ పథకాల కింద భారీ కేటాయింపులు చేసింది. మహిళా సాధికారత దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ముందుకు సాగుతోంది. అమ్మ ఒడికి రూ.6 వేల కోట్లు ►జగనన్న అమ్మ ఒడి పథకం కింద 42,33,098 మంది తల్లులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించారు. ►జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఏటా నిధులు జమ చేస్తోంది. వసతి దీవెన కింద ఏడాదికి రూ.20 వేలు, విద్యా దీవెన కింద కాలేజీ ఫీజు ఎంతైతే అంత తల్లి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. ఈ రెండు పథకాల కోసం రూ.5,009 కోట్లను బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ►వైఎస్సార్ చేయూత పథకం కింద 45–60 ఏళ్ల మధ్య వయసు గల మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించి.. వారిని పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ దిశగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలమహిళల కోసం ఈ ఏడాది రూ.3,000 కోట్లు కేటాయింపులు చేశారు. డ్వాక్రా మహిళలకూ భారీ నిధులు ►స్వయం సహాయక సంఘాల్లో ఉంటూ పొదుపు చేసుకుంటున్న మహిళలకు తగిన సార్థకత చేకూర్చేందుకు వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి డ్వాక్రా మహిళలు బ్యాంకులకు బకాయిపడిన రుణం రూ.27,168.83 కోట్లను 2020–21 నుంచి నాలుగు విడతలుగా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందుకోసం ఈ ఏడాది రూ.6,300 కోట్లు ప్రతిపాదించింది. ►వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద 45 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు గల ప్రతి కాపు మహిళకు జీవనోపాధి కోసం ఏటా రూ.15 వేల చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. ఇందుకోసం ఈ బడ్జెట్లో రూ.350 కోట్లు కేటాయించారు. ►వడ్డీలేని రుణాల ద్వారా పొదుపు సంఘాల మహిళలకు ఆర్థిక పరిపుష్టి చేకూర్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది. ఇందులో భాగంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద బడ్జెట్లో రూ.1,365.08 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మహిళా, శిశు సంక్షేమానికి 3,456 కోట్లు బడ్జెట్ కేటాయింపుల్లో మహిళా, శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అగ్రతాంబూలమిచ్చింది. మహిళలు అభివృద్ధి పథంలో పయనించినప్పుడే రాష్ట్రాభివృద్ధి మరింత ముందుకెళుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేకసార్లు చెప్పారు. ఇందుకు అనుగుణంగానే మహిళలు, శిశువులు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.3,456 కోట్లు కేటాయించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణం, పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల అంగన్వాడీల్లోని పిల్లలు, గర్భిణుల్లో రక్తహీనత సమస్యను తొలగించే లక్ష్యంతో పోషకాహార పంపిణీ నిమిత్తం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, హిజ్రాల సంక్షేమానికి పథకాలను తెచ్చింది. కోవిడ్–19 విపత్తు సమయంలోనూ అంగన్వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఇళ్లకే పోషకాహారాన్ని సరఫరా చేస్తున్న ప్రభుత్వం.. గత ఏడాది కంటే ఈసారి అధికంగా నిధులను ఆ వర్గాల వారి కోసం వెచ్చించనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేసింది. కేటాయింపుల్లోని కొన్ని.. ►రాష్ట్రంలో 257 ఐసీడీఎస్ ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీటి పరిధిలో 48,770 అంగన్వాడీలు, 6,837 మినీ అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. ►అంగన్వాడీ పిల్లల్లో పోషణ లోపం, పెరుగుదల ఆగిపోవడం, తక్కువ బరువు ఉండటం, మహిళల్లో రక్తహీనత సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని చేపడుతోంది. ఈ పథకానికి బడ్జెట్లో రూ.1,250 కోట్లు కేటాయించింది. ►దీంతోపాటు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకానికి రూ.250 కోట్లు కేటాయించింది. 7 సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థల పరిధిలో విస్తరించిన 77 గిరిజన ప్రణాళిక, షెడ్యూల్ మండలాల్లోని 0.66 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, 6 నెలల నుంచి 72 నెలల్లోపు వయసు గల 3.18 లక్షల మంది చిన్నారులు ఈ పథకం కింద లబ్ధి పొందుతారు. ►జగనన్న అమ్మ ఒడి : రూ.6 వేల కోట్లు ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.3,000 కోట్లతో ‘వైఎస్సార్ చేయూత’ ►డ్వాక్రా మహిళల బ్యాంక్ బాకీలు తీర్చేందుకు ‘వైఎస్సార్ ఆసరా’ కింద రూ.6,300 కోట్లు ►జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనకు రూ.5,009 కోట్లు ►‘కాపు నేస్తం’ కింద రూ.350 కోట్లు ►వైఎస్సార్ సున్నా వడ్డీ రూ.1,365.08 కోట్లు ►దిశ బిల్లు అమలుకు రూ. 50 కోట్లు ►మహిళా సంక్షేమ భవనాల నిర్మాణాలకు రూ. 72 కోట్లు ►వైఎస్సార్ సంపూర్ణ పోషణ రూ.1,250 కోట్లు ►వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ రూ.250 కోట్లు ►జాతీయ మహిళా పోష్టకాహార పథకం రూ.1,577 కోట్లు ►ఏ డబ్యూసీ భవనాల నిర్మాణాలకు రూ. 194.62 కోట్లు ►అంగన్వాడీ భవనాల నిర్మాణానికి రూ. 23.98 కోట్లు ►విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమం రూ.76.01కోట్లు -
అమ్మాయిల వివాహ వయసు పెంపు
సాక్షి, న్యూఢిల్లీ : మహిళా, శిశు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ముఖ్యంగా తాము తీసుకొచ్చిన బేటీ బచావ్, బేటీ పడావ్ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందన్నారు. మహిళా,శిశు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలపై కేంద్ర బడ్జెట్ 2020 లో రూ .28,600 కోట్లు కేటాయించాలని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రతిపాదించారు. (బడ్జెట్ 2020 : డిగ్రీ స్థాయిలోనే ఆన్లైన్ కోర్సులు) ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాసం కోసం ప్రవేశ నమోదులో అబ్బాయిలకన్నా అమ్మాయిల నమోదు ఎక్కువగా ఉందని మంత్రి వెల్లడించారు. బాలికలు ముందు వరుసలో ఉన్నారని, బాలురకన్నా 5 శాతం ఎక్కువ ఉన్నారని తెలిపారు. అలాగే పౌష్టికాహారం, ప్రధానంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం కోసం భారీ నిధులను కేటాయించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కీలకమైన అంశాన్ని మంత్రి ప్రతిపాదించారు. దేశంలో మహిళ వివాహం చేసుకోవడానికి కనీన వయస్సును 18 సంవత్సరాలు కాగా ఇప్పుడు ఆ వయస్సును పెంచాలని ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. అయితే, దీనిపై సమగ్రమైన అధ్యయనం జరగాలని, అందుకోసం ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. వచ్చే ఆరు నెలల్లో ఈ టాస్క్‌ఫోర్స్ తన నివేదికను అందిస్తుందని వెల్లడించారు. 6 లక్షల మంది అంగన్వాడీలకు సెల్ఫోన్లు పౌష్టికాహారం, ఆరోగ్యం ప్రత్యేక శ్రధ్ద 2020-21కి నూట్రిషన్ సంబంధిత కార్యక్రమానికి రూ. 35600 కోట్లు 6 నెలలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ చదవండి : బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ -
‘బ్లాక్‌మార్కెట్‌కు బాలామృతం’పై సమగ్ర విచారణ
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లో చిన్నారులకు అందించే బాలామృతం పంపిణీలో అక్రమాలు జరుగుతున్న తీరుపై ‘బ్లాక్‌మార్కెట్‌కు బాలామృతం’ అనే శీర్షికతో ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. చిన్నారులకు పంపిణీ చేసే బాలామృతం కవర్లు పొలాల్లో కుప్పలుగా దొరకడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పంపిణీ ఎలా జరుగుతుందనే అంశంపై సంబంధిత అధికారులతో ఆరా తీశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జగదీశ్వర్‌ను ఆదేశించారు. దీంతో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారిని విచారణ అధికారులుగా ఆయన నియమించారు. బాలామృతం ప్యాకెట్లు పంపిణీ జరిగిన తీరు, వినియోగంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. రైతు పొలంలో కుప్పలుగా ఉన్న ప్యాకెట్లు ఎక్కడివో కూడా పరిశీలించాలన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా పంపిణీ, లబ్ధిదారులు, వినియోగం తదితర వివరాలు సమర్పించాలని ఆదేశించడంతో అధికారులు సైతం హుటాహుటిన విచారణ క్రమాన్ని మొదలుపెట్టారు. మరోవైపు బాలామృతం పంపిణీపై నిఘా ఏర్పాటు చేయాలని, నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ‘బాలామృతం పక్కదారి’పై ఆరా కేశంపేట: ‘బ్లాక్ మార్కెట్‌కు బాలామృతం’శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు స్పందించారు. హైదరాబాద్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సునంద, రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ మోతీ తదితరులు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రికార్డులను, బాలామృతంను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులు బాలామృతంను సక్రమంగా తీసుకెళ్తున్నారా లేదా అని చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి ఆరా తీశారు. పొలంలో పడేసిన బాలామృతం ఖాళీ ప్యాకెట్లను పరిశీలించారు. ఎవరైనా బాలామృతం ప్యాకెట్లను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కొత్తపేట సర్పంచ్ కమ్లేకర్ నవీన్‌కుమార్, షాద్‌నగర్ ఐసీడీఎస్ సీడీపీఓ నాగమణి, సూపర్వైజర్లు పద్మ, విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. -
ప్రతి గ్రామ సచివాలయంలో హెల్ప్‌లైన్
-
అందరికీ అందాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏ విధానమైనా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు చేరడానికే తప్ప నిరాకరించడానికి కాదని, ఈ విషయంలో అధికారులందరూ స్పష్టతతో ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు సంతృప్తికర స్థాయిలో (శాచ్యురేషన్) అందించడానికే ఈ విధానాలున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. బయోమెట్రిక్/ ఐరిస్/ వీడియో స్క్రీనింగ్ వంటివన్నీ ఆ పథకం లబ్ధిదారుడికి చేరిందనే ఆధారం కోసం తప్ప, నిరాకరించడానికి కాదని స్పష్టం చేశారు. మహిళా శిశు సంక్షేమంపై సోమవారం ఆ శాఖ మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి సంక్షేమ పథకాల అమలుపై మార్గ నిర్దేశం చేశారు. అత్యవసర విషయాలకు ప్రత్యేక మెకానిజం గ్రామ సచివాలయాల నుంచి వస్తున్న అత్యవసర విషయాలపై ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం స్పందించడానికి ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రతి గ్రామ సచివాలయంలో ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా సంక్షేమం విషయంలో గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల సహకారం తీసుకోవాలని చెప్పారు. 1008 కేసుల్లో వేధింపులకు గురైన మహిళలకు ఇవ్వాల్సిన పరిహారం రూ.7.48 కోట్లను గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీఎం అక్కడికక్కడే స్పందిస్తూ తక్షణం నిధులు విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో వివిధ ఘటనల్లో బాధితులకు సహాయం చేయడానికి ఒక్కో జిల్లా కలెక్టర్‌కు కోటి రూపాయల చొప్పన నిధిని కేటాయించాలని సూచించారు. నిధి ఖర్చు అవుతున్న కొద్దీ.. కోటి రూపాయలకు తగ్గకుండా నిల్వ ఉండేలా వారం రోజుల్లో మళ్లీ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఒక విధానం తీసుకురావాలని అధికారులకు సూచించారు. బాల్య వివాహాల నియంత్రణపై అవగాహన కల్పించాలని, వాటిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్కూళ్లలో చేరని విద్యార్థులను గుర్తించండి అంగన్వాడీల నుంచి స్కూళ్లలో చేరని పిల్లలను గుర్తించడంతో పాటు వారిని వెంటనే ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. దాదాపు ఏడు వేల మంది అంగన్వాడీల నుంచి స్కూళ్లలో చేరలేదని గుర్తించినట్లు ఈ సందర్బంగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. అంగన్వాడీల నుంచి స్కూళ్లలో చేరని పిల్లలకు ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి తర్వాత వారి సామర్థ్యాలను బట్టి ఆయా తరగతుల్లో చేర్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మిగతా పిల్లలతో సమానంగా రాణించేలా వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీలపై ప్రత్యేక యాప్ రూపొందించాలని, పిల్లలకు అందుతున్న భోజనం, వారి సంరక్షణపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సీఎం పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్లను ఆ దిశగా సమాయత్తం చేయాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమంపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎస్సార్ భాగస్వామ్యంపై దృష్టి సారించాలి అంగన్వాడీ కేంద్రాల స్థితిగతులపై పూర్తి నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్కూళ్లలో చేపడుతున్న నాడు – నేడు తరహాలో మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలను అంగన్వాడీ కేంద్రాల్లో కూడా చేపట్టడానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. మూడేళ్లలో ఈ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఎన్నారైలు, సంస్థలు, దాతల సహాయం తీసుకుందామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ రూపకల్పనకు ఇదివరకే ఆదేశాలు ఇచ్చామని, ఎవరు సహాయం చేసినా వారి పేర్లు పెడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై కార్పొరేట్, వివిధ ప్రైవేట్ సంస్థలకు పూర్తి సమాచారం ఇవ్వాలని, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద వారి భాగస్వామ్యానికి అవకాశాలు కల్పించాలన్నారు. ఇదిలా ఉండగా గ్రామ న్యాయాలయాల ఏర్పాటు అంశంపై ఇప్పుడున్న పరిస్థితి ఏమిటో తనకు తెలియజేయాలని ముఖ్యమంత్రి కోరారు. భూ వివాదాలు, ఇతరత్రా వివాదాలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలని, వీటిని దశాబ్దాల తరబడి నాన్చుతూ న్యాయం జరగని పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. గ్రామ న్యాయాలయాలపై తనకు పూర్తి వివరాలు అందజేయాలన్నారు. మహిళల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి మహిళల్లో రక్తహీనత సమస్యపై ముఖ్యమంత్రి స్పందిస్తూ మహిళల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, రక్త హీనత రాకుండా చర్యలను చేపట్టాలని సూచించారు. రక్తహీనత ఉన్న మహిళలను గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించడంతో పాటు, రక్తహీనత రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు వివరించారు. టెస్ట్ – ట్రీట్ – ట్రాక్ విధానంలో రక్తహీనతను అధిగమించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గర్భవతులకు ఎలాంటి ఆహారం ఇస్తున్నారని ముఖ్యమంత్రి ఆరా తీశారు. దీనిపై అధికారులు వివరిస్తూ ఒక్కొక్కరిపై రోజుకు రూ.22.50 ఖర్చు చేస్తున్నామన్నారు. ఏయే సరుకులకు ఎంత ఖర్చు చేస్తున్నారని విడిగా వివరాలు రూపొందించాలని, మరింత నాణ్యతగా పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు ఎలాంటి పద్ధతులు, విధానాలు రూపొందించాలో ఆలోచించి నివేదిక ఇవ్వాలన్నారు. మహిళా, శిశు సంక్షేమంలో గ్రామ వలంటీర్లకు భాగస్వామ్యం కల్పించాలని, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. వయసుకు తగ్గ బరువులేని వాళ్లు 17.2 శాతం, వయసుకు తగ్గ ఎత్తు లేనివాళ్లు 30.2 శాతం ఉన్నట్లు ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఇచ్చే ఆరోగ్య కార్డులను దీనికోసం వాడుకోవాలని, అందులో ఈ వివరాలు నమోదు చేయాలన్నారు. దివ్యాంగుల విషయంలో ఉదారంగా ఉండాలని చెప్పారు. వారికి ఎలాంటి పరికరాలు కావాలన్నా అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మద్యానికి బానిసలైన వారి కోసం కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటు అంశంపై దృష్టి పెట్టాలని, దీనిపై ఒక ప్రణాళిక సిద్ధం చేసి తనకు అందజేయాలన్నారు. -
మహిళా శిశుసంక్షేమ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
మహిళా శిశుసంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: మహిళా శిశుసంక్షేమ శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ సమావేశంలో.. సంక్షేమ పథకాల అమల్లో అధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు. సంక్షేమ పథకాల అమల్లో అనుసరిస్తున్న విధానాలు పథకాలను నిరాకరించేలా ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. పథకాలు సంతృప్తికర స్థాయిలో లబ్ధిదారులకు అందించడానికే ఈ విధానాలు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. బయోమెట్రిక్, ఐరిస్, వీడియో స్క్రీనింగ్ వంటివన్నీ ఆ పథకం లబ్ధిదారుడికి చేరేందుకు ఉపయోగపడలే కానీ.. వాటి కారణంగా నిరాకరించకూడదని సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లో ఒక హెల్ప్‌లైన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయంలో అవసరాల కొరకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. గ్రామాల నుంచి వస్తున్న అత్యవసర విషయాలపై ప్రభుత్వం, యంత్రాంగం స్పందించడానికి ప్రత్యేక మెకానిజం ఉండాలని సీఎం సూచించారు. దీని కొరకు ప్రతి గ్రామ సెక్రటేరియట్లో ఒక హెల్ప్‌లైన్ ఉండాలన్నారు. గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల సహకారాన్ని తీసుకోవాలన్నారు. 1008 కేసుల్లో వేధింపులకు గురైన మహిళలకు ఇవ్వాల్సిన పరిహారం రూ.7.48 కోట్లను గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకురావడంతో.. వెంటనే నిధులను విడుదల చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న వైఎస్ జగన్ ఆదేశించారు. ఇదే సమయంలో వివిధ ఘటనల్లో బాధితులకు సహాయం చేయడానికి జిల్లా కలెక్టర్‌కు కోటి రూపాయల చొప్పన నిధిని కేటాయించాలని సీఎం నిర్ణయించారు. నిధి ఖర్చు అవుతున్న కొద్దీ... కోటి రూపాయలకు తగ్గకుండా నిల్వ ఉండేలా వారంరోజుల్లో మళ్లీ మంజూరు చేయాలన్నారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి.. మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీఎం తీవ్రంగా స్పందించారు. వెంటనే నివారణ చర్యలను చేపట్టాలని ఆదేశించారు. టెస్ట్–ట్రీట్–టాక్ విధానంలో ఈ రక్తహీనతను అధిగమించే చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. రక్తహీనత ఉన్న మహిళలను గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించడంతో పాటు రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నట్లు సీఎంకి వివరించారు. అలాగే పౌష్టికారంలో భాగంగా గర్భవతులకు ఏ విధమైన ఆహారంగా ఇస్తున్నారని సీఎం అడిగి తెలుసుకున్నారు. రోజుకు రూ.22.5లు ఖర్చుచేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. మరింత నాణ్యమైన, పౌష్టికరమైన ఆహారాన్ని అందించడంపై దృష్టిపెట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమంలో గ్రామవాలంటీర్లకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. పిల్లలకు అందుతున్న భోజనం, వారి సంరక్షణపై ఎప్పటికప్పుడు సమీక్షచేయాలని, దీని కొరకు అంగన్వాడీ వర్కర్లను మోటివేట్ చేయాలన్నారు. అలాగే బాల్య విహహాల నియంత్రనపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలిని వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపై సీఎం ఆరా తీశారు. గ్రామ న్యాయాలయాల ఏర్పాటు అంశంపై ఇప్పుడున్న పరిస్థితి ఏంటో తనకు తెలియజేయాలన్నారు. భూ వివాదాలు, ఇతరత్రా వివాదాలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలని, వీటిని దశాబ్దాల తరబడి నాన్చి న్యాయం జరగని పరిస్థితి ఉండదన్నారు. స్కూళ్ల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాలు.. అంగన్ వాడీ భవనాల సెంటర్ల స్థితిగతులపై పూర్తినివేదిక సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. స్కూళ్లలో చేపడుతున్న నాడు – నేడు తరహా కార్యక్రమాలను చేపట్టడానికి ప్రణాళిక తయారుచేయాలన్నారు. మూడేళ్లలో ఈపనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.. ఎన్నారైలు, సంస్థలు, దాతల సహాయం తీసుకుందామని అధికారులకు సూచించారు. దీనికోసం ప్రత్యేక పోర్టల్ రూపకల్పనకు ఇదివరకే ఆదేశాలు ఇచ్చామని సీఎం గుర్తుచేశారు. ప్రభుత్వం పాఠశాలలకు ఎవరు సహాయం చేసినా వారి పేర్లు పెడతామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యాక్రమాలపై కార్పొరేటు, వివిధ ప్రైవేటు సంస్థలకు పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులకు తెలిపారు. అలాగే దివ్యాంగుల విషయంలో ఉదారంగా ఉండాలని, వారికి ఎలాంటి పరికరాలు కావాలన్నా అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీల నుంచి స్కూళ్లలో చేరని పిల్లలను వెంటనే గుర్తించి, వారిని వెంటనే ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని అధికారులను ఆదేశించారు. -
మహిళలు, పిల్లలకు రక్షణలేని దేశం ముందుకు పోలేదు
హైదరాబాద్: మహిళలకూ, పిల్లలకూ రక్షణ కల్పించలేని దేశం ఎన్నటికీ ముందుకు పోలేదని ఫోరం ఫర్ గుడ్ గవ ర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి అన్నారు. మహిళలు ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువుదీరుతారని పురాణాల్లో ఉందని, చదువుల కోసం సరస్వతిని, డబ్బు కోసం లక్ష్మీదేవిని పూజించడం మన సంస్కృతిలోనే ఉందని, కానీ ఆ మహిళలకూ, పిల్లలకూ రక్షణ లేకుండా పోయిందన్నారు. కైలాస్ సత్యార్థి పిల్లల ఫౌండేషన్, నెట్వర్క్ ఆఫ్ ప్రొటెక్షన్ చైల్డ్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అత్యాచార రహిత భారతదేశం’కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకుల ప్రతిజ్ఞ పోస్టర్‌ను ఆయన శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు, పిల్లల భద్రత కోసం రాజకీయ నాయకుల వద్ద ప్రతిజ్ఞ తీసుకోవడం ఎంతో మంచి కార్యక్రమమే, కానీ నేతలు మాటపై నిలబడతారన్న నమ్మకం ఉండటంలేదన్నారు. పిల్లల రక్షణలో భారతదేశం ప్రపంచంలో 97వ స్థానంలో ఉందని, ఇది విచారకరమని పేర్కొన్నారు. మహిళలపై అత్యాచార కేసుల సత్వర పరిష్కారానికి ప్రతిరాష్ట్రంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని, బాధితులకు ఏడాదిలోపు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, పిల్లల రక్షణ, భద్రత, చదువు కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని సూచించారు. రాజకీయ పార్టీలతోనే పరిష్కారం.. కైలాస్ సత్యార్థి పిల్లల ఫౌండేషన్ ప్రతినిధి రమణ్ చావ్లా మాట్లాడుతూ పిల్లలు, మహిళల భద్రతలేమి అనేది సామాజిక సమస్య అనీ, దీన్ని రాజకీయ పార్టీల నేతల చొరవతోనే పరిష్కరించగలమని అన్నారు. అత్యాచారరహిత భారతదేశం కోసం అన్ని రాజకీయ పార్టీల నేతల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నామని, ఎన్నికల్లో గెలవగానే పార్లమెంట్లో గళం విప్పేలా చూడటం, కేంద్ర బడ్జెట్లో పిల్లలు, మహిళల భద్రత కోసం 10 శాతం బడ్జెట్ కేటాయించే విధంగా కృషి చేయడం తమ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 450 మంది ఎంపీలు, పార్టీల ప్రముఖులు ప్రతిజ్ఞాపత్రంపై సంతకం చేసినట్లు చెప్పారు. తెలంగాణలో కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి లాంటి ప్రముఖులతోపాటు 34 మంది ఎంపీ అభ్యర్థులు, నేతలు ప్రతిజ్ఞాపత్రంపై సంతకం చేసి తమ ఉద్యమంలో భాగస్వామ్యం అయినట్లు తెలిపారు. తమతోపాటు సుమారు 50 వరకు స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రచార ఉద్యమంలో పాల్గొంటున్నాయ ని చెప్పారు. ఎన్నికల ఫలితాలు రాగానే గెలిచిన ఎంపీలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి మహిళలు, పిల్లల రక్షణ కోసం పార్లమెంటులో గళం విప్పేలా చొరవ తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆశ్రిత, ఎస్ఆర్డీ, బచ్పన్ బచావో ఆందోళన్, ఎంబీ ఫౌండేషన్ ప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనంలో ‘గుడ్ల’గూబలు!
సాక్షి, అమరావతి: అంగన్వాడీ చిన్నారులు, సర్కారీ స్కూళ్లలో చదివే నిరుపేద విద్యార్థులకు ఉచితంగా అందించాల్సిన కోడిగుడ్ల పంపిణీలో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో జిల్లాల వారీగా ఉన్న కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు టెండర్లను రాష్ట్రస్థాయిలోకి మార్చి రూ.120 కోట్లకు పైగా గుటుక్కుమనిపించారు. పలుచోట్ల అధికార పార్టీ నేతలే కోడిగుడ్ల పంపిణీని సబ్ కాంట్రాక్టుగా దక్కించుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. గతేడాది కోడిగుడ్ల సరఫరాలో లోపాలపై రాష్ట్ర ఫుడ్ కమిషన్ పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఫలితం శూన్యం. గుడ్డు రూ.3 ఉన్నా రూ.4.68 పైసలు గతంలో పాఠశాల విద్యాశాఖ, స్త్రీ శిశుసంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలవారీగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు కోడిగుడ్ల సరఫరా బాధ్యతలు అప్పగించేవారు. గత ఏడాది వరకు పిల్లలకు వారానికి 3 కోడిగుడ్లు చొప్పున అందించగా ఈ ఏడాది ఐదుకి పెంచారు. వారానికి మూడుసార్లు చొప్పున రాష్ట్రంలో పిల్లలకు 1.80 కోట్ల గుడ్లు సరఫరా కావాలి. అయితే అప్పుడు మార్కెట్లో గుడ్డు రిటైల్ ధర రూ.3 మాత్రమే ఉన్నా రూ.4.68గా ఫిక్స్డ్ ధరను నిర్ణయించడం గమనార్హం. వాస్తవానికి కోడిగుడ్ల ధరలు రోజువారీ మారుతూ ఉంటాయి. మార్పులకు తగ్గట్టుగా కాకుండా ఫిక్స్డ్ ధరలు నిర్ణయించి అక్రమాలకు తెరతీశారు. మరోవైపు హోల్‌సేల్‌లో కొటే రేటు భారీగా తగ్గుతుంది. గుడ్డు ధర మార్కెట్లో రిటైల్‌గా రూ.5 నుంచి 6 వరకు ఉన్నప్పుడే హోల్‌సేల్‌లో రూ.4గా ఉంది. కానీ మార్కెట్ రేటుకన్నా ఎక్కువకు కాంట్రాక్టును రాష్ట్రంలో ముగ్గురికి అప్పగించారు. వీరెవరికీ గతంలో కోడిగుడ్ల పంపిణీలో అనుభవం కానీ, వ్యాపారంతో సంబంధం కానీ లేదు. ఏడాదిలో (విద్యా సంవత్సరంలో సెలవులుపోను మిగిలిన 10 నెలలకు) 72 కోట్ల గుడ్లు సరఫరా చేయాలన్నది కాంట్రాక్టు. ఒక్కో కోడిగుడ్డుపై రిటైల్ మార్కెట్ ధరకన్నా రూ.1.68 ఎక్కువగా ధర నిర్ణయించడంతో ప్రభుత్వ ఖజానానుంచి రూ.120 కోట్లు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఈ సొమ్ము కాంట్రాక్టర్ల ద్వారా పెద్దలకు చేరింది. ఈ ఏడాది కోడిగుడ్ల సంఖ్యను 5కి పెంచి ఇదే కాంట్రాక్టర్లకు మళ్లీ సరఫరా బాధ్యత అప్పగించారు. గత ఏడాదితో పోలిస్తే అదనంగా మరో 40 శాతం గుడ్లు అంటే 120 కోట్ల కోడిగుడ్లను అందించాల్సి ఉంటుంది. అదే రేటుకు కట్టబెట్టడంతో చెల్లింపులు కూడా అదనంగా చేయాల్సి రావడంతో ఖజానాపై మరింత భారం పడనుంది. గుడ్లు తగ్గిన పాతవారికే కాంట్రాక్టు రాష్ట్రంలోని అంగన్వాడీల్లో గత ఏడాది జూన్ వరకు విద్యార్థులకు 49,12,15,382 గుడ్లు సరఫరా కావాల్సి ఉండగా 37,06,81,037 గుడ్లు మాత్రమే పంపిణీ అయ్యాయి. 12,05,34,345 గుడ్లు సరఫరా కాలేదు. ఇక పాఠశాలలకు సంబంధించి కూడా వారానికి 3 గుడ్ల చొప్పున 52 కోట్ల గుడ్లు సరఫరా కావలసి ఉండగా 30 శాతం గుడ్లు కూడా సరఫరా కాలేదని ఏపీ ఫుడ్ కమిషన్ పరిశీలనలో తేలింది. ఈ ఏడాది నుంచి వారానికి 5 గుడ్లు అందించాలని నిర్ణయించడంతో పాఠశాలలకు 70 కోట్ల గుడ్లు, అంగన్వాడీలకు 50 కోట్ల గుడ్లు మొత్తంగా 120 కోట్ల గుడ్లు సరఫరా కావాలి. గత ఏడాది గుడ్ల సరఫరాలో 30 శాతం వరకు కోతపడినా ప్రభుత్వం తిరిగి పాతవారికే ఈ కాంట్రాక్టును ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతలే సబ్ కాంట్రాక్టులు తీసుకొని పిల్లల సొమ్ము మింగేస్తుండడంతో ప్రభుత్వం మౌనం దాలుస్తోంది. తక్కువ బరువు గుడ్లు సరఫరా కోడిగుడ్లు పక్కదారి పట్టకుండా కలర్ కోడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినా ఫలితం లేదు. పిల్లలకు ఇవ్వాల్సిన గుడ్లను బయట మార్కెట్లో విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల పాడైన గుడ్లను సరఫరా చేసి జేబులు నింపుకొంటున్నారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం ప్రకారం విద్యార్ధులకు 45 నుంచి 52 గ్రాముల బరువుండే గుడ్లు అందించాలి. కానీ పిల్లలకు అందించే గుడ్ల బరువు 30 గ్రాముల లోపే ఉంటోంది. మరీ చిన్నవిగా 20 గ్రాముల బరువు ఉండే గుడ్లు కూడా ఇస్తున్నారు. కొన్నిచోట్ల దారుణంగా ట్రే బరువును కలిపేసి గుడ్లు బరువుగా చూపిస్తున్నారు. గత ఏడాది దాదాపు ఆరేడు నెలల పాటు 60 నుంచి 65 శాతం మాత్రమే గుడ్లు పంపిణీ అయినట్లు ఏపీ ఫుడ్‌కమిషన్ పరిశీలనలో తేలింది. -
వంట.. ఫుడ్ లేదు, పిల్లలూ లేరు..
ధారూరు వికారాబాద్ : అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, తల్లులు, గర్భిణులకు ఇవ్వాల్సిన ఫుడ్డు, గుడ్డు లేకపోడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళా శిశు సంక్షేమశాఖ రీజినల్ ఆర్గనైజర్ వీరమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని నాగారం, దోర్నాల్, మదన్‌పల్లి, బానాపూర్, మదన్పల్లితండాల్లోని అంగన్వాడీ కేంద్రాలను చూసి ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు. రికార్డుల్లో ఓ రకంగా, వాస్తవంగా మరోరకంగా ఉండడం, పిల్లలు, తల్లులు, గర్భిణులకు ప్రతీరోజు వండి పెట్టేందుకు ఆహార పదార్థాలు లేకపోయిన, వండి పెడుతున్నట్లు టీచర్లు చెప్పడంతో ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు రాకున్నా వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. వండి తినబెడుతున్నామని చెప్పడం, వంట వండటం అనేది నీటిమీద రాతలనీ అక్కడే ఉన్న కొంతమంది చెప్పడంతో అబద్దాలు ఎందుకు చెబుతున్నారని ఆమె టీచర్లను నిలదీశారు. ఆహార పదార్థాలు ఇళ్లకు పంపిణీ చేసినట్లు ముందుగానే రికార్డుల్లో తల్లులు, గర్భిణుల సంతకాలు తీసుకోవడంతో ఆమె మండిపడ్డారు. నెలకు రెండుసార్లు ఇవ్వాల్సిన గుడ్లు ఇవ్వకున్నా ఇచ్చినట్లు సంతకాలు తీసుకోవడం తనిఖీల్లో బయటపడింది. సూపర్వైజర్ సుశీల తరుచూ తనిఖీ చేస్తున్నారా అంటే లేదనే సమాచారం. పంపిణీ చేసినట్లు ఎందుకు నమోదు చేశారని ప్రశ్నిస్తే మౌనం వహించారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. వికారాబాద్ పీడీ, సూపర్వైజర్లు బాద్యతా రాహిత్యంతోనే అంగన్వాడీ కేంద్రాలు అస్తవ్యస్తం అవుతున్నాయ ని ఆమె పేర్కొన్నారు. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలనీ ఉన్నతాధికారులకు నివేదిక పంపను న్నామన్నారు. మదన్‌పల్లితండాలో టీచరు, ఆయా లేకపోయిన ఉన్నట్లు అక్కడి వారు చెప్పడంపై ఆశ్చర్యానికి గురిచేసింది. అంగన్వాడిల్లో జరుగుతున్న అవకతవకలను క్షుణ్ణంగా పరిశీలించిన వివరాలు నమోదు చేసుకుని వెళ్లిపోయారు. -
బాల్యం..బలహీనం..
సాక్షి, హైదరాబాద్ : రేపటి పౌరుల ఆరోగ్యం సంకటంలో పడుతోంది. సరైన పౌష్టికాహారం అందక సతమతమవుతోంది. వయసుకు తగిన ఆహారం లేక చిన్నారులు బక్కచిక్కిపోతున్నారు. చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గత నెలలో చేపట్టిన అధ్యయనంలో సగం మంది చిన్నారులు పౌష్టికాహార సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. వీరిలో పావు శాతం మంది ఆరోగ్యం ప్రమాదకరంగా ఉండగా.. 10 శాతం మంది తీవ్ర పౌష్టికాహార సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఆరోగ్యంగా 51 శాతం మందే.. రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులు 16,72,812 మంది ఉండగా.. 8,09,600 మంది ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేశారు. వీరిలో 4,14,225 మందే ఆరోగ్యంగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. 1,81,200 మంది (22%) వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. మరో 10% మంది పిల్లల్లో పౌష్టికాహార సమస్య తీవ్రంగా ఉండగా.. 16% చిన్నారుల్లో అనారోగ్య సమస్యలు లేకున్నా ఎత్తుకు తగ్గ బరువు లేనట్లు అధికారులు గుర్తించారు. మొత్తంగా 51% మంది చిన్నారులు మాత్రమే ఆరోగ్యంగా ఉన్నట్లు పరిశీలనలో వెల్లడైంది. తక్కువ బరువుతోనే సగం జననాలు అప్పుడే పుట్టిన శిశువు బరువు కనీసం 2.4 కిలోలు ఉండాలి. అప్పుడే శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారిస్తారు. కానీ రాష్ట్రంలో సగం వరకు జననాలు తక్కువ బరువుతోనే నమోదవుతున్నాయి. గర్భస్థ సమయంలో తల్లులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్లే తక్కువ బరువుతో పిల్లలు పుడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కొందరు మూడు పూటలు ఆహారం తీసుకుంటున్నా.. ఒకే రకం పోషక విలువలున్న పదార్థాలు తీసుకుంటుండటంతో చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం ఉంటోందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రతి 100 జననాల్లో 49 మంది పిల్లలు తక్కువ బరువుతోనే పుడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వెయ్యి జననాల్లో 39 మంది శిశువులు.. లక్ష ప్రసవాల్లో 95 మంది తల్లులు మృతి చెందుతున్నారు. -
ప్రతి పెళ్లీ నమోదు కావాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరిగే ప్రతి పెళ్లిని చట్ట ప్రకారం నమోదు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. అన్ని గ్రామాల్లో కచ్చితంగా వివాహాలను నమోదు చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. వీటికి అనుగుణంగా పంచాయతీలకు డీపీవోలు సర్క్యులర్ పంపారు. వివాహాల నమోదుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ‘పంచాయతీల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. మహిళా, శిశు సంక్షేమ శాఖ వెబ్సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసి అందుబాటులో ఉంచాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలి. మీ–సేవ కేంద్రాల్లోనూ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలి’అని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. దశాబ్దాలు గడుస్తున్నా.. బాల్య వివాహాలను అరికట్టడం, వివాహానికి చట్టబద్ధత కల్పించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం మ్యారేజెస్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం ప్రతి పెళ్లిని తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. కానీ చట్టం అమల్లోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా వివాహాల నమోదులో ఆశించిన పురోగతి లేదు. ఇప్పటివరకు వివాహాల రిజిస్ట్రేషన్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనో.. తహసీల్దార్ కార్యాలయాల్లోనో నమోదయ్యేవి. తాజాగా పంచాయతీ స్థాయిలో ధ్రువీకరిస్తే సరిపోతుందని ప్రభుత్వం నిబంధనలు సడలించింది. అయినా పెద్దగా పురోగతి లేకపోవడంతో వివాహాల రిజిస్ట్రేషన్‌తో అనేక రకాల ఉపయోగాలున్నాయని ప్రచారం చేస్తూ గ్రామాల్లో నమోదు పెంచాలని పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. -
కేటాయింపులు 26% పెంపు
మహిళా శిశు సంక్షేమం గర్భిణులకు రూ.6 వేలు నేరుగా వారి ఖాతాల్లో జమ గతేడాది రూ.17,640 కోట్లు ఈ ఏడాది రూ.22,095 కోట్లు న్యూఢిల్లీ: 2017–18 బడ్జెట్లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు 26శాతం నిధులు పెంచారు. గతేడాది రూ.17,640 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.22,095 కోట్లకు పెంచారు. ఇందిరా గాంధీ మంత్రిత్వ సహయోగ్ యోజనకు 2016–17 లో రూ.634 కోట్ల నిధులుండగా, ఈసారి నాలుగు రెట్లు పెంచి రూ.2,700 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద కాన్పు, టీకాల ఖర్చుల నిమిత్తం గర్భిణులకు రూ.6వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతా ల్లో జమ చేస్తారు. ఇదివరకున్న ప్రసూతి లబ్ధి పథకం స్థానంలో కొత్తగా ఈ కార్యక్రమం అమలవుతుంది. ఈ పథకం గతంలో దేశవ్యాప్తంగా 53 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఆర్థికమంత్రి జైట్లీ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా.. కొత్తగా గ్రామీణ స్థాయిలో ‘మహిళా శక్తి కేంద్రాలు’ నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 14 లక్షల ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాలకు రూ.500 కోట్ల నిధులు కేటాయించారు. ప్రధాని మోదీ మానస పుత్రిక ‘బేటీ బచావో–బేటీ పఢావో’ పథకానికి ఈ బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ఇది గతేడాదితో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ. నిర్భయ నిధికి గతేడాదిలాగే ఈసారి కూడా రూ.500 కోట్లు ఇచ్చారు. 2013లో ప్రారంభమైన ఈ ఫండ్‌కు ఇప్పటిదాకా రూ.3 వేల కోట్లు మంజూరయ్యాయి. శిశు సంరక్షణ పథకానికి గతేడాది రూ.400 కోట్లుండగా, ఈసారి సమగ్ర శిశు వికాస పథకం కింద ఈ కార్యక్రమాన్ని కలిపేసి మొత్తంగా రూ.648 కోట్లు కేటాయించారు. అన్ని మంత్రిత్వ శాఖలలో మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి 2016–17లో రూ.1,56,528 కోట్లుగా ఉన్న నిధులను 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.1,84,632 కోట్లకు పెంచినట్లు అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. -
తల్లీబిడ్డల ఆరోగ్యం పైలెట్ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : తల్లి–బిడ్డ ఆరోగ్యం, పౌష్టికాహారం, సామాజిక ఆరోగ్య అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించి ఆన్లైన్లో పొందుపరిచే ఒక బృహత్తర కార్యక్రమాన్ని దేశంలో పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసిందని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్టు అమలు తీరుపై కలెక్టర్ సమీక్షించారు. మాతా, శిశు మరణాల సంఖ్యను ఏ విధంగా తగ్గించాలో, పిల్లలకు పోషకాహారం అందిస్తున్న తీరు, గర్భం దాల్చిన నాటి నుంచి కాన్పు జరిగే వరకు మహిళ తీసుకోవాల్సిన ఆరోగ్య చర్యలు సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కామన్ అప్లికే షన్ సాఫ్ట్వేర్ విధానాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి అంగన్వాడీ కార్యకర్తకూ స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం జరుగుతుందని, ఈ సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరచాల్సి ఉంటుందన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ కె.కోటేశ్వరి, డీసీహెచ్ఎస్ డాక్టర్ కె.శంకరరావు పాల్గొన్నారు. -
మహిళా, శిశు సంక్షేమానికి రూ. 1,552 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మహిళా, శిశు సంక్షేమానికి 2016-17 బడ్జెట్లో రూ. 1,552 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ప్రణాళికా బడ్జెట్ కింద రూ. 1,481. 83 కోట్లు కేటాయించగా, ప్రణాళికేతర బడ్జెట్ కింద రూ. 70.74 కోట్లు కేటాయించారు. ప్రణాళికా బడ్జెట్లో గత బడ్జెట్ కంటే ఈసారి రూ. 166 కోట్లు అదనంగా కేటాయించగా, ప్రణాళికేతర బడ్జెట్లో కూడా రూ. 47 లక్షలు ఎక్కువగా కేటాయించడం గమనార్హం. కాగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్లు బంగారుతల్లి పథకానికి నిధులు కేటాయించలేదు. సాంఘిక భద్రత, సంక్షేమం కోసం ఈ ఏడాది రూ. 697. 37 కోట్లు కేటాయించారు. గత ఏడాది సాంఘిక భద్రత, సంక్షేమం కోసం రూ. 730 .91 కోట్లు కేటాయించగా, ఈసారి తగ్గింది. ఐసీడీఎస్‌లో వృత్తి సేవల కింద అంగన్వాడీ వర్కర్ల చెల్లింపులకు వివిధ పద్దుల కింద వందలాది కోట్ల రూపాయలు కేటాయించారు. ఆరోగ్యలక్ష్మి కింద రూ. 396.77 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఈ కేటాయింపులు కేవలం రూ. 35.68 కోట్లు మాత్రమే. బాలికా సంరక్షణ పథకం కింద రూ. 26.62 కోట్లు కేటాయించారు. ఐసీడీఎస్ వేతనాలకు కూడా గత సంవత్సరం కంటే రూ. 67 కోట్లు తగ్గించి బడ్జెట్ కేటాయింపులు జరిపారు. ఈసారి రూ. 50 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. గర్భిణులు, శిశువుల పౌష్టికాహారం కోసం కిందటేడు కంటే రూ. 200 కోట్లు అదనంగా కేటాయించడం విశేషం. -
ఆడబిడ్డలపై చిన్నచూపు
* హైదరాబాద్‌లో అధికంగా లింగవివక్ష * ఆందోళన వ్యక్తంచేస్తున్న కేంద్ర, రాష్ట్రాలు * బాలికల రక్షణ, విద్యాభివృద్ధికి కేంద్రం ప్రత్యేక కార్యక్రమం * మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అవగాహన కు ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: ప్రపంచానికే ఐటీ గమ్యంగా మారిన రాష్ట్ర రాజధానిలో లింగవివక్ష కూడా అధికంగానే ఉందంటే.. ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెంది నప్పటికీ ఇక్కడ బాలికలు, మహిళల పట్ల వివక్ష పెరుగుతూనే ఉందని పలు సంస్థలు చేసిన సర్వేలు, ప్రభుత్వ అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రభుత్వం 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం కూడా.. ఆరేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి వెయ్యిమంది మగ పిల్లలకు కేవలం 914 మందే ఆడపిల్లలున్నట్లు తేలింది. 2001లో ఆరేళ్లలోపు మగ, ఆడ పిల్లల నిష్పత్తి 1000: 943 ఉండగా, పదేళ్ల అనంతరం ఆడపిల్లల సంఖ్య మరింతగా దిగజారడం ఆందోళనకర పరిణామంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. తల్లి గర్భం లోని ఆడశిశువు బయటకు రాకుండానే అంతమౌతోం దన్న నిజం.. అధికారుల పరిశీలనలో తేటతెల్లమైంది. ముఖ్యంగా.. రాజధాని శివారు జిల్లాలైన నల్లగొండ, మహబూబ్‌నగర్‌ల నుంచి ఎక్కువమంది నగరానికి వలస వస్తుం డడం, తమకు పుట్టబోయేది ఆడపిల్ల అని స్కానింగ్ పరీక్షల ద్వారా తెలుసుకొని గర్భంలోనే చిదిమేస్తుండడం ఈ పరిస్థితికి కారణమని అధికారవర్గాలే అంగీకరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా.. ఇటువంటి పరిస్థితులున్న 100 జిల్లాలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం లింగవివక్షను రూపుమాపేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఆడ పిల్లల భద్రత, విద్యాభివృద్ధి కోసం ‘బేటీ బచావో.. బేటీ పడావో’పేరిట ఈ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో.. బేటీ పడావో.. కార్యక్రమం అమలు బాధ్యతలను రాష్ట్రంలో మహిళా శిశు సం క్షేమ శాఖ చేపట్టింది. జాతీయ సగటు(1000: 918)కన్నా ఆడపిల్లల సంఖ్య తక్కువగా నమోదైన హైదరాబాద్ జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయంచేసి ఈ కార్యక్రమా లు నిర్వహించేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సి ద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ కార్యక్రమం అమలుకు జాయింట్ డెరైక్టర్ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించింది. బహిర్గతం చేస్తే.. హత్య చేసినట్లే.. ప్రభుత్వపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్కానింగ్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ ల్యేబొరేటరీల యాజమాన్యాలు తమ వ్యాపార దృక్పథాన్ని వీడడం లేదు. పుట్టబోయేది ఆడబిడ్డో, మగబిడ్డో ముందుగానే చెప్పడం నేరమని తెలిసినా, డబ్బుకు కక్కుర్తిపడి స్కానింగ్ సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నారు. సమాచారం బహిర్గతం చేసినవాళ్లు.. ఆడపిల్లలను హత్య చేసినట్లే. ప్రభుత్వం పరంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలి. - శ్యామ్ సుందరి, బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమ నోడల్ అధికారి -
‘ఫుల్ మీల్స్’కు మనీ నిల్
15 నుంచి ఐసీడీఎస్‘ఒక్కపూట భోజనం’ {పారంభించాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఎమ్మెల్యేలతో {పారంభానికి ఏర్పాట్లు ఇప్పటి వరకు అంద ని నిధులు ఆందోళనలో అంగన్వాడీలు రెండు నెలలుగా అందని వేతనాలు హన్మకొండ అర్బన్ : ప్రభుత్వం మహిళా శిశు, సంక్షేమం కోసం ప్రారంభిస్తున్న వన్డే ఫుల్ మీల్స్ పథ కం అంగన్వాడీ వర్కర్లను ఆందోళనకు గురిచేస్తోంది. పథకం అమలుకు ప్రభుత్వం నుంచి తమకు నయా పైసా అందలేదని, సరుకులు కూడా కేంద్రాలకు చేరలేదని ఇలాంటి పరిస్థితు ల్లో పథకం ప్రారంభించేది ఎలా అంటూ అంగన్వాడీ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు అంగన్వాడీ వర్కర్లకు అక్టోబర్, నవంబర్ నెలల వేతనాలే ఇంతవరకు ఇవ్వలేదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు కొత్త పథకం ప్రారంభానికి సరుకులు కొనుగోలు చేయడం సాధ్యం కాదని అధికారులకు స్పష్టం చేస్తున్నారు. అన్ని కేంద్రాల్లో సరుకులు సరఫరా చేశాక కార్యక్రమం ప్రారంభిస్తే కొంతలో కొంత ఇబ్బంది తగ్గుతుందంటున్నారు. 15 నుంచి ప్రారంభానికి ఏర్పాట్లు.. కేయూలో ఇటీవల జరిగిన సమావేశంలో ఒక్క పూట భోజనం పథకంపై అధికారులు చర్చించారు. జిల్లాలో ఈ నెల 15న పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా శనివారం ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని సెక్టార్లవారీగా సమావేశాలు నిర్వహించారు. సెక్టార్‌కు కొన్ని కేంద్రాలు ఎంపిక చేసుకుని స్థానిక ఎమ్మెల్యేలతో ప్రారంభానికి సమయం కూడా తీసుకున్నారు. తప్పని పరిస్థితి ఉంటే 15న కార్యక్రమం ప్రారంభించి తర్వాత జనవరి ఒకటి నుంచి పూర్తి స్థారుులో అమలు చేయాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రారంభ కార్యక్రమమైనా బియ్యం, కోడిగుడ్లు, పాలు, పప్పు దినుసులు, వంటలకు, ఏర్పాట్లకు కలిపి ఎంత లేదన్నా కనీసం రూ.3 వేల వరకు ఖర్చవుతుంది. ఇప్పటికే జీతాలు రాక ఇబ్బందిపడుతున్న అంగన్వాడీలకు ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఇబ్బందికరంగా మారనుంది. ఇబ్బందులున్నా కార్యక్రమం నిర్వహించాలి ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి కొన్ని ఇబ్బందులున్నా అమలు చేయాల్సిందే. ఇదే విషయం శనివారం నిర్వహించిన సమావేశంలో ఆదేశాలిచ్చాం. 15న ప్రారంభానికి కొన్ని కేంద్రాలు ఎంపిక చేసుకున్నాం. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని వాటి కోసం స్థానిక ఎమ్మెల్యే సమయం కోరాం. లబ్ధిదారులకు కేంద్రాల్లో అన్నం పెట్టాలి. మెనూ ప్రకారం ఆహారం ఇవ్వాలి. జనవరి ఒకటి నుంచి పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. - సుమితాదేవి, హన్మకొండ రూరల్ సూపర్వైజర్ -
పరిశీలనకు వస్తే అవమానించారు
పాతగుంటూరు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కార్పొరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ చంద్రమౌళి అత్తిలి మంగళవారం స్థానిక మహిళా శిశు సంక్షేమ కార్యాలయ పరిశీలనకు వచ్చారు. అంగన్వాడీ కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయని అధికారులను ప్రశ్నించారు. ఈ కార్యాలయమే ఇలా ఉంటే అంగన్వాడీ కేంద్రాలు ఎలా ఉంటాయో అని ఆయన వాఖ్యానించారు. ఆయన తీరును గమనించిన సిబ్బంది నకిలీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనే అనుమానంతో నగరంపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆయనను మహిళా ప్రాంగణానికి తీసుకెళ్లారు. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా ఆ సంస్థ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. ఇంతలో నగరంపాలెం సీఐ శ్రీనివాసరావు రంగంలోకి దిగి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కార్పొరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సంస్థ డెరైక్టర్ దినేష్ పాల్‌కు ఫోన్ చేసి వాకబు చేశారు. ఆయన అసలైన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబరేనని దినేష్పాల్ సీఐకు వివరించారు. తనను అవమానించారని చంద్రమౌళి ఆవేదన వ్యక్తం చేశారు. స్పష్టంగా తెలుసుకున్న తరువాత మీడియా, పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని వాపోయారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్దలపై ఆప్యాయత చూపండి
వృద్ధుల సమస్యలకు 1090 టోల్‌ఫ్రీ నంబర్ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ రాయచూరు/రాయచూరు రూరల్ : జీవన సంద్యా సమయంలో ఉన్న పోషకులను ఆప్యాయతతో పలకరించి వాత్సల్యం చూపుతూ ఆత్మాభిమానంతో జీవించేలా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ పిలుపు ఇచ్చారు. నగరంలోని ఐఎంఎ కార్యాలయంలో జిల్లా న్యాయసేవా ప్రాధికార సంఘం, న్యాయవాదుల సంఘం, విద్యాశాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన సీనియర్ సిటిజన్ దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.ఆధునిక యుగంలో అవిభక్త కుటుంబంలో పెద్దలను గౌరవించే సామరస్యం కొరవడిందన్నారు. యువకులు ఆర్థిక స్వావలంబనకు లీనమై పెంచిన పెద్దలను మరచి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవిత సంధ్యా సమయంలో ఒంటరితనంతో వృద్ధులు తల్లడిలుతున్నారన్నారు.ఈ నేపథ్యంలో వారిని ఆదరించి అక్కున చేర్చుకోవాలన్నారు. సీనియర్ సిటిజన్ 2007 చట్టం మేరకు పెద్దలకు అన్ని సౌకర్యలు కల్పించడం జరుగుతుందన్నార..రాయచూరు జిల్లాలో 38,082 మంది వృద్ధులకు నెలకు రూ.500చొప్పున, 14,042 మందికి రూ.750 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. అనంతరం సినీయర్ సిటిజన్లను మంత్రి సన్మానించారు. వృద్ధుల సమస్యల పరిష్కారానికి 1090 టోల్‌ఫ్రీ నంబర్ అంతకుముందు మంత్రి పాటిల్ వృద్ధుల సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సురక్ష సంస్థ సహాయవాణి కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. వృద్ధులు తమ సమస్యలను 1090 కు ఫోన్ చేసి వివరిస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. కార్యక్రమంలో జిల్లాధికారి శశికాంత్ సెంథిల్, సీఈఓ జ్యోత్స్న, ఎస్పీ నాగరాజ్, ఏఎస్పీ పాపయ్య, రిమ్స్ వైద్యాధికారి రమేష్‌బాబు, వసంతకుమార్, శరణప్ప, మహాదేవప్ప, శిశు సంక్షేమ శాఖ జిల్లాధికారి లక్ష్మికాంతమ్మ, తాలూకా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వీరనగౌడ పాల్గొన్నారు. -
స్థాయి సంఘాల ఎన్నిక ఏకగ్రీవమే
సమన్వయానికి ప్రతిపక్ష పార్టీలు ఓకే.. టీఆర్ఎస్కు ఆరు, టీడీపీకి ఒకటి సభ్యుల స్థానాలతోనే కాంగ్రెస్ సంతృప్తి నేడు జెడ్పీ స్థాయి సంఘాల ఎన్నికలు జిల్లా పరిషత్ : జిల్లా పరిషత్‌లో కీలకమైన స్థాయి సంఘాల్లో సభ్యుల నియామకంలో అధికార పార్టీదే హవా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుదీరిన 60 రోజుల్లో స్థాయి సంఘాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ గడువు వచ్చే నెల 5వ తేదీతో ముగియనుండగా, జిల్లా పరిషత్ సమావేశంలో ఆదివారం స్థాయి సంఘాల ఎన్నికల కో సం ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అధికార పార్టీకి చెందిన మంత్రులతో పాటు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొనే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు రాజ్యసభ సభ్యు లు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ముగ్గురు రాజ్యసభ, ముగ్గురు లోక్‌సభ మొత్తం ఆరుగురు ఎంపీలు ఉన్నారు. అధికార పా ర్టీకి చెందిన వారిలో ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఐదుగురు ఎమ్మె ల్యేలు ఉండగా ప్రతిపక్షాలకు చెందిన వారిలో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. జిల్లా పరి షత్ పీఠాన్ని టీడీపీ, కాంగ్రెస్‌లోని తిరుగుబాటు సభ్యులతో టీఆర్ఎస్ దక్కించుకున్నప్పటికీ సభ్యులందరికీ కమిటీల్లో స్థా నం కల్పించడంలో ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. వారం రోజులుగా చర్చలు స్థాయి సంఘాల ఎన్నిక విషయమై వారం రోజులుగా టీఆర్ఎస్ నాయకులు తమ జెడ్పీటీసీ సభ్యులతో సమావేశమై ఏ సభ్యుడు ఎందులో ఉండాలనే విషయమై చర్చించారు. పంచాయతీరాజ్ చట్ట ప్రకారం జెడ్పీ స్థాయి సంఘాల్లోని నాలుగు కమిటీలకు చైర్పర్సన్, ఒక కమిటీకి వైస్ చైర్మన్ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. మిగిలిన రెండు కమిటీలపై కొద్దిపాటి సందిగ్ధత నెలకొన్నా అధికార పార్టీ ముఖ్యనేతలు చర్చల ద్వారా పరిష్కరించినట్లు తెలిసింది. మహిళా, శిశు సంక్షేమం ఉన్న 5వ కమిటీకి సంగెం, రఘునాథపల్లి జెడ్పీటీసీల పేర్లు పరిశీలనలో ఉండగా 6వ కమిటీ అయిన సోషల్ వెల్ఫేర్‌కు పర్వతగిరి జెడ్పీటీసీ పేరు ఖరారైనట్లు సమాచారం. టీడీ పీకి చెందిన చెట్టుపల్లి మురళీధర్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున ఆయన వ్యవసాయం ఉన్న మూడో కమిటీకి నేతృత్వం వహిస్తారు. దీంతో ఆరు కమిటీలకు టీఆర్ఎస్, ఒక కమిటీకి టీడీపీ నేతలు ప్రాతిని థ్యం వహిస్తారు. కాంగ్రెస్ సభ్యులు మెజార్టీగా ఉన్నప్పటికీ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా వారు రెండు వర్గాలుగా చీలిపోయారు. దీంతో వారికి కమిటీలను కైవసం చేసుకునే అవకాశం లేకుండా పోయింది. చైర్పర్సన్, వైస్ చైర్మన్లు ప్రాతినిథ్యం వహించే కమిటీలు మినహా మిగిలిన రెండు కమిటీల్లో ఒక కమిటీలో చైర్మన్‌గా తమకు అవకాశమివ్వాలని కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యు లు చైర్‌పర్సన్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల దృష్టికి తీసుకెళ్లగా.. వారు తిరస్కరించారని సమాచారం. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనాయకులతో చర్చించినా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నందున చేసేదేం ఉండదని చెప్పినట్లు తెలుస్తోంది. చివరకు ముఖ్య కమిటీల్లో తమకు సభ్యులుగానైనా అవకాశం కల్పించాలన్న కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుల ప్రతిపాదనలకు అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు ఒకటి, ఏడో కమిటీల్లో వారికి స్థానం దక్కనున్నట్లు తెలిసింది. కాగా, స్టాండింగ్ కమిటీల్లో ఎవరెవరెకి ఏయే కమిటీల్లో స్థానం కల్పించాలన్న నిర్ణయం జరిగిపోవడంతో ఆదివారం నాటి సమావేశం మొక్కుబడిగానేసాగే అవకాశం కనిపిస్తోంది. ఏర్పాట్లలో జెడ్పీ అధికారులు... జెడ్పీ స్టాండింగ్ కమిటీల ఎన్నికలకు పో టీ జరుగుతుందని ప్రచారం కావడంతో వారం రోజులుగా జెడ్పీలోని మీటింగ్ విభాగం ఉద్యోగులు కసరత్తు ప్రారంభిం చారు. పంచాయతీరాజ్ చట్టం పుస్తకాల ను చదివి వడపోసి నిబంధనలను పరిశీ లించారు. అలాగే, ఎన్నికలు నిర్వహిం చాల్సి వస్తే అవసరమయ్యే ఫార్మాట్లను రూపొందించుకుని, బ్యాలెట్లు కూడా సిద్ధం చేశారు. చివరకు సంఘాలన్నీ ఏకగ్రీవం కానున్నట్లు తేలడంతో ఉద్యోగులు ఊనిరి పీల్చుకున్నారు. -
బాధ్యతలు చేపట్టిన మ్రంతులు
జంగారెడ్డిగూడెం మహిళా శిశు సంక్షేమ, గనుల శాఖల మంత్రి పీతల సుజాత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆదివారం సచివాలయంలో వారికి కేటాయించిన ఛాంబర్లలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి దేవస్థానం ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు, వేదపండితులు హాజరయ్యారు. వారు బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో వేదపండితుల వేదాశీర్వచనం ఇచ్చారు. -
‘బంగారు తల్లి’ భారమా
సాక్షి, సంగారెడ్డి: ఇంకా పుట్టక ముందే ఆ పసిగుడ్డుల ధర నిర్ణయమవుతోంది. తల్లి గర్భం నుంచి ‘వేరుపడి’న మరుక్షణమే అంగడి సరుకులా చేతులు మారిపోతున్నారు. ఆడ పిల్ల పుట్టిందని కన్నవాళ్లే ఆ బంగారు తల్లులను అమ్మేస్తున్నారు. బారసాలలో జోల పాటలు వినాల్సిన పసిప్రాయం బేరసారాల లెక్కలు విని వెక్కివెక్కి ఏడుస్తోంది. అధికారులు అప్పుడప్పుడూ దాడులు చేసినా అమ్మలు మారడం లేదు...అమ్మేయడాలు ఆగడం లేదు. సాక్షాత్తు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సొంత ఇలాఖాలోనే ముక్కు పచ్చలారని శిశువు విక్రయాల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇక ఆమె సొంత నియోజకవర్గమైన నర్సాపూర్‌లోని కౌడిపల్లి మండలంలో శిశువు విక్రయాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అమాయక గిరిజనులు కన్న బిడ్డలను గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకున్న ఘటనలు ఇక్కడి తండాల్లో అనేకం. మే 2012 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఇప్పటి వరకు 12 శిశు విక్రయాలు వెలుగు చూశాయి. వీటిలో ఏడు ఘటనలు కౌడిపల్లి మండల పరిధిలో జరగ్గా, నర్సాపూర్, శివ్వంపేట, చిన్నశంకరంపేట, వర్గల్, రామాయంపేటలలో ఒక్కో ఘటన వెలుగు చూసింది. ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు 9 శిశు విక్రయాలు జరగడంతో అధికారులు రంగంలో దిగి వారిని రక్షించ గలిగారు. అందులో 8 మంది బంగారుతల్లులే(ఆడ శిశువులు) కావడం గమనార్హం. ఇక జిల్లాలో 2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 42 నవజాత శిశువులు అనాథలుగా రోడ్డుపాలు కావడంతో అధికారులు సంగారెడ్డిలోని శిశు గృహంలో చేర్పించారు. అందులోనూ 33 మంది బంగారుతల్లులే ఉన్నారు. ఆస్పత్రి ఖర్చులు చాలు ! రెక్కాడితే డొక్కాడని పేద గిరిజనులు ఆడ పిల్లను పెంచి పెళ్లి చేసే స్థోమత లేక పుట్టిన వెంటనే వదిలించుకునే మార్గాలు చూస్తున్నారు. కనీసం ఆస్పత్రి ఖర్చులు ఇస్తే చాలన్నట్లు అత్యంత చౌకగా ఆడ శిశువులను అమ్మేసిన ఘటనలూ జిల్లాలో వెలుగు చూశాయి. ఎన్నో వ్రతాలు చేసి...ఎన్నెన్నో నోములు నోచి...కనబడ్డ దేవుళ్లందరికీ మొక్కినా సంతానప్రాప్తి కలగక విసిగి వేసారిన జంటలు శిశువులను కొనేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ దత్తత తీసుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా చాలా మంది శిశువుల కొనుగోలుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో కౌడిపల్లిలోని కొందరు దళారులను ఆశ్రయించి పిల్లలు పుట్టక ముందే బేరసారాలు చేస్తున్నట్లు సమాచారం. విషయం బయటకు పొక్కితేనే అధికారులు దాడులు చేసి ఆ చిన్నారులను రక్షించగలుగుతున్నారు. ఎవరికీ తెలియకుండా గుట్టుగా నిత్యం ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కౌడిపల్లిలో శిశు విక్రయాలను అరికట్టడం కోసం ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా ..ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు. తల్లి పొత్తిళ్లలో ఒలలాడాల్సిన పసికూనలు అంగట్లో సరుకులా అమ్ముడవుతూనే ఉన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇలాఖాలో జరిగిన కొన్ని శిశు విక్రయాలు.. కౌడిపల్లి మండలం వెలిమకన్నకు చెందిన గిరిజన దంపతులు మెదక్ మండలం వాడితండాకు చెందిన కుటుంబానికి రూ.4 వేలకు ఆడ శిశువును విక్రయించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో గత నెల 24న అధికారులు శిశువును తీసుకువచ్చి శిశు గృహంలో చేర్పించారు. దయ్యాలతండాకు చెందిన ఓ జంట అక్టోబర్ 11న ఆడ శిశువును హైదరాబాద్‌కు చెందిన ఉపాధ్యాయురాలికి అమ్మేశారు. కేసు పెడతామని అధికారులు హెచ్చరించడంతో తల్లిదండ్రులు శిశువును వెనక్కి తీసుకొచ్చి పెంచుకుంటున్నారు. గౌతాపూర్లోని దంపతులు తమ ఆడ శిశువును చండూరుకు చెందిన ఓ కుటుంబానికి విక్రయించారు. అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో వెనక్కి తెచ్చుకున్నారు. సదాశివపల్లిలో మార్చి 10న కొల్లి యశోద అనే మహిళ దేవులపల్లికి చెందిన కుటుంబానికి తన శిశువును అమ్ముకుంది. శిశు రక్షణ కమిటీ శిశువును రక్షించి వెనక్కి తీసుకొచ్చింది. కౌడిపల్లి మండలంలోని ఓ యువతి పుట్టకముందే తన శిశువును అమ్మకానికి పెట్టింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు ఆమెను స్వధార్ హోంలో చేర్పించారు. శిశువు పుట్టిన తర్వాత శిశు గృహంలో చేర్పించిన ఆమె ఎక్కడికో వెళ్లిపోయింది. నర్సాపూర్ మండలం ఎల్లాపూర్‌లో గత మార్చి 22న ఓ జంట అప్పుడేపుట్టిన తమ ఆడ శిశువును అమ్మేశారు. పత్రికల్లో వార్తలు రావడంతో అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఆ దంపతులు పాపను వెనక్కి తీసుకున్నారు. -
కోర్టుల్లో సూపర్వైజర్ పోస్టుల వివాదం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: మహిళా శిశు సంక్షేమ శాఖలో ఇటీవల నిర్వహించిన గ్రేడ్-2 రెగ్యులర్ సూపర్వైజర్ పోస్టుల వివాదం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారంటూ ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చెందినవారు వివిధ కోర్టులను ఆశ్రయించారు. లోకాయుక్త నుంచి సుప్రీంకోర్టు వరకు సూపర్వైజర్ పోస్టుల కేసులు నడుస్తున్నాయి. ఇటీవల హైకోర్టు, సుప్రీంకోర్టు బెంచ్‌లకు వెళ్లిన ఈ కేసులు వాయిదా పడిన విషయం విదితమే. తాజాగా మరోమారు విచారణకు తేదీలను కోర్టులు ఖరారు చేశాయి. ఈనెల 4న ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, 6న హైకోర్టు, 9న సుప్రీంకోర్టు, 12న లోకాయుక్త కోర్టుల్లో సూపర్వైజర్ల నియామకాల విచారణలు జరగనున్నాయి. సాధారణ న్యాయస్థానాల నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు కేసులు నడుస్తుండటంతో ఏ కోర్టు ఎలాంటి ఉత్తర్వులు వెలువరిస్తుందోనని సూపర్వైజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సుదీర్ఘ కాలం తరువాత మహిళా శిశు సంక్షేమశాఖలో గ్రేడ్-2 రెగ్యులర్ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో ఖాళీగా 305పోస్టులను 3887మంది అభ్యర్థులు రాత పరీక్ష రాశారు. అందులో 248 మందిని రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయడంతోపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వడమే తరువాయిగా ఉన్న సమయంలో సూపర్వైజర్ పోస్టుల నియామకాలు అడ్డగోలుగా జరిగాయంటూ కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు కోర్టులను ఆశ్రయించారు. గుంటూరు జిల్లాకు చెందిన సునీత అనే కార్యకర్త ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, రమాదేవి అనే అంగన్వాడీ కార్యకర్త హైకోర్టును ఆశ్రయించారు. నెల్లూరు జిల్లాకు చెందిన సునీత అనే అంగన్వాడీ కార్యకర్త సుప్రీంకోర్టును, సమాచార హక్కు చట్టం రాష్ట్ర అధ్యక్షుడు టీ గంగాధర్ లోకాయుక్తను ఆశ్రయించారు. నోటిఫికేషన్ నుంచే పోస్టుల ప్రక్రియ వివాదాస్పదమైంది. కాంట్రాక్టు సూపర్వైజర్లుగా విధులు నిర్వర్తిస్తున్నవారు ఏటా ఏప్రిల్‌లో తమ సర్వీసును రెన్యువల్ చేయించుకోవలసి ఉంటుంది. అయితే ఈ ఏడాది వారి సర్వీసు రెన్యువల్ కాలేదు. నోటిఫికేషన్ వెలువడిన అనంతరం అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న తరువాత కంటిన్యూషన్ ఆర్డర్ ఇచ్చారు. వాస్తవానికి నోటిఫికేషన్ వెలువడేనాటికి వారు గాలిలో ఉన్నారంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా శిక్షణా కేంద్రాలకు చెందిన ఇన్స్ట్రక్టర్లకు రిజర్వేషన్ కేటాయించడాన్ని తప్పుపడుతూ మరికొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఆందోళనలో అంగన్వాడీలు తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టులను ఆశ్రయించిన అంగన్వాడీ కార్యకర్తల పరిస్థితి ‘అడకత్తెరలో పోకముక్క’లా మారింది. తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టులను ఆశ్రయించడాన్ని సమర్ధించుకుంటున్నప్పటికీ ఆ తరువాత జరిగే పరిణామాలను తలచుకొని ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం జరగకపోయినా ఆ తరువాత విధులు నిర్వర్తించే సమయంలో అధికారుల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వస్తాయోనని కొంతమంది కలవరపడుతున్నారు. ఇప్పటికే ఆ శాఖకు చెందిన అధికారి ఒకరు కోర్టులకు వెళ్లిన వారి వివరాలను ప్రాజెక్టుల వారీగా సేకరిస్తున్నట్లు తెలిసింది. కోర్టు కేసులు ముగిసిన తరువాత విధి నిర్వహణకు సంబంధించి వారిపై తమ ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధం అవుతున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. -
సూపర్వైజర్ పోస్టులు.. సర్కస్ ఫీట్లు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసీడీఎస్ గ్రేడ్-2 సూపర్వైజర్ రెగ్యులర్ పోస్టుల నియామకాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. డెరైక్టరేట్ స్థాయిలోనే అక్రమాలకు బీజం పడటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. నిబంధనలకు పాతరేశారంటూ ఇప్పటికే గుంటూరు జిల్లా పత్తిపాడు ప్రాజెక్టుకు చెందిన అంగన్వాడీ కార్యకర్త హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా లోకాయుక్త కూడా జోక్యం చేసుకుంది. సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టీ గంగాధర్ ఫిర్యాదుతో జస్టిస్ సుభాషణ్‌రెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని పది మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక ఐఎఫ్ఎస్ అధికారి, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన ఆరుగురు రీజనల్ డిప్యూటీ డెరైక్టర్లకు నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 12వ తేదీలోగా సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి సమగ్రమైన నివేదికలు అందించాలని ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1741 గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టులకు ఈ ఏడాది జూలై రెండో తేదీ నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థుల వయసు దగ్గర నుంచి అర్హత వరకు నిబంధనలను పక్కన పెట్టేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను సైతం పక్కన పెట్టేశారు. అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేటర్ అండ్ ఇన్స్ట్రక్టర్లకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. కాంట్రాక్టు సూపర్వైజర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వకపోవడం, వారు యథావిధిగా రెగ్యులర్ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం, వారికి హాల్‌టికెట్లు పంపించడం కూడా వివాదాస్పదమైంది. గుంటూరు జిల్లా పత్తిపాడు ప్రాజెక్టు పరిధిలోని పెదనందిపాడు అంగన్వాడీ కార్యకర్త ఎం రమాదేవి హైకోర్టును ఆశ్రయించగా, సూపర్వైజర్ల పోస్టులకు సంబంధించి కౌంటర్ (డబ్ల్యూఏ 1746) ఇవ్వాలంటూ మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, కమీషనర్, సాధారణ పరిపాలన శాఖ కమిషనర్లతోపాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, రీజనల్ డిప్యూటీ డెరైక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. తాజాగా లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి జోక్యం చేసుకొని మహిళా శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమీషనర్లతోపాటు ప్రకాశం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కర్నూలు, విశాఖపట్నం, వరంగల్, హైదరాబాద్ కలెక్టర్లతోపాటు సంబంధిత రీజనల్ డిప్యూటీ డెరైక్టర్లకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్నవారు లోకాయుక్తకు అందించే సమాధానాన్ని బట్టి రాత పరీక్ష రాసిన అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న’ చందంగా కొంతమంది మహిళా శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం అభ్యర్థులకు శాపంగా పరిణమించింది. ఏ రోజు ఏం జరుగుతుందోనని అభ్యర్థులు ఉత్కంఠకు గురవుతున్నారు. -
పూర్తిస్థాయి బడులుగా అంగన్వాడీ కేంద్రాలు
సదాశివపేట, న్యూస్‌లైన్: అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి బడులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా నవంబరు 1 నుంచి అమలులోకి రానుంది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. పని గంటలు పెంచడం ద్వారా పిల్లలకు ప్రాథమిక స్థాయి విద్యకు ముందే ఆటపాటలతో పాటు విద్యపై కనీస పరిజ్ఞానం పెంచి పాఠశాలల్లో రోజంతా గడిపే విధంగా సన్నద్ధం చేయాలనే అలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల పనివేళలు అంగన్వాడీ కేంద్రాలు గతంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకే పనిచేసేవి. అయితే ప్రభుత్వం సమగ్ర శిశు సంరక్షణ పథకాన్ని బలోపేతం చేసేందుకు పనిగంటలను పెంచాలని నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కేంద్రాలను నిర్వహించాలని శ్రీ శిశు సంక్షేమ శాఖా ముఖ్య కార్యదర్శి నీలం సహానీ ఈనెల 21న ఉత్తర్వులు జారీ చేసినట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. కార్యకర్తలు, అయాలకు వేతనాల పెంపు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలందించాల్సి ఉంటుంది. పనిగంటలు పెరగడంతో పాటు సంబంధిత అంగన్వాడీల వేతనాలను కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కార్యకర్తలకు రూ. 3700 వేతనం చెల్లిస్తున్న ప్రభుత్వ మరో రూ. 500 అదనంగా పెంచుతూ రూ. 4200 చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాల్లో అయాలుగా పనిచేస్తున్న వారికి గతంలో రూ. 1950 చెల్లిస్తుండగా ప్రస్తుతం వారికి కూడా మరో రూ. 250 అదనంగా పెంచారు. అయాలకు మొత్తంగా రూ. 2200 చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అంగన్వాడీ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తోంది. పనిగంటలు పెంచిన ప్రభుత్వం వేతనాలు స్పల్పంగా పెంచి చేతులు దులుపుకుందని వారు విమర్శిస్తున్నారు. కనీసవేతనా చట్టం అమలు చేసి పని వేళలు పెంచాలని సీఐటీయూ డివిజన్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేస్తున్నారు. లక్ష్యం నెరవేరేనా.. గ్రామీణ ప్రాంతాల్లో చాలమంది చిన్న పిల్లలు, గర్భిణులు పౌష్టి కాహారం లోపానికి గురవుతున్నారని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. వారిలో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు కోడిగుడ్లు ఇతర పౌష్టికాహారన్ని అందిస్తుంది. అయితే లబ్ధిదారులకు అందవలసిన పౌష్టికాహారం చాల చోట్ల పక్కదారి పడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న కార్యకర్తలకు ఇంటింటా సర్వే, ఓటర్ల నమోదు లాంటి అదనపు విధులు కేటాయించడం కూడా అంగన్వాడీల పనితీరు మెరుగుపడకపోవడానికి కారణమనే విమర్శలు వినవస్తున్నాయి. -
ఐసీడీఎస్‌లో నిధుల స్వాహా..?
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఓ అధికారిణి రూ.75 లక్షలు స్వాహా చేశారని ఆ శాఖలో జోరుగా చర్చ సాగుతోంది. ఆదిలాబాద్ రూరల్ సీడీపీవోపై ఆ కార్యాలయంలోనే పనిచేసే యూడీసీ ఫిర్యాదు చేసిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదుపై స్పందించిన అదనపు జాయింట్ కలెక్టర్ వెంకటయ్య విచారణ చేపట్టారని, ఇటీవల సీడీపీవో కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను సీజ్ చేశారని సమాచారం. దీనిపై ఆయన నివేదిక తయారు చేసి కలెక్టర్ అహ్మద్‌బాబుకు అందజేసినట్లు సమాచారం. ఈ మేరకు కలెక్టర్ ఐసీడీఎస్ పీడీ, రూరల్ సీడీపీవో, సంబంధిత సూపర్వైజర్లను శనివారం విచారణ కోసం పిలిపించారు. అయితే కలెక్టర్ వివిధ సమావేశాలతో బిజీగా ఉండడంతో రాత్రి వరకు ఈ వ్యవహారం కొలిక్కి రాలేదు. మరోపక్క సీడీపీవోపై సస్పెన్షన్ వేటు పడిందని ఆ శాఖలో సాయంత్రం నుంచి పుకార్లు వినిపించాయి. అయితే అది వాస్తవం కాదని ఏజేసీ వెంకటయ్య తెలిపారు. కలెక్టర్ ఆదేశాలకనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయని వివరించారు. రూ.75 లక్షలు స్వాహా..? ఐసీడీఎస్ ఆదిలాబాద్ రూరల్ సీడీపీవోగా ప్రభావతి కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. ఆమె ముథోల్ ఇన్చార్జి సీడీపీవోగానూ వ్యవహరిస్తున్నారు. కాగా ఐసీడీఎస్ కార్యాలయంలో యూడీసీగా ఉన్న రాణి ఏప్రిల్ 16న ఆదిలాబాద్ రూరల్ సీడీపీవో కార్యాలయానికి బదిలీపై వచ్చారు. ఆ సమయంలో ఆమెకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పజెప్పకుండా కొన్ని రిజిస్టర్లు, సర్వీసు బుక్‌లు మాత్రమే ఇచ్చారని, రూ. 58.71 లక్షలు పేమెంట్ కాని నిధులు ఖాతాలో ఉండడంతో ఈ విషయంలో సీడీపీవోను ఆమె ప్రశ్నించినట్లు శాఖలో చెప్పుకుంటున్నారు. అదేవిధంగా రూ.10 లక్షలకు సంబంధించిన చెక్కులు కూడా బ్యాంక్‌లో బౌన్స్ అయినట్టు పేర్కొంటున్నారు. ఈ నిధులు ఎక్కడివి, దానికి సంబంధించిన రికార్డులు ఏవి అనే విషయంలో సీడీపీవో, యూడీసీ మధ్య వివాదం మొదలై తారస్థాయికి చేరుకుందని శాఖ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. కాగా ఆ నిధులు అంగన్వాడీలకు సంబంధించి భవనాల అద్దె, అంగన్వాడీలు, ఆయాల టీఏ, అమృతహస్తం, అంగన్వాడీలకు అదనపు గౌరవ వేతనం, వంట చెరుకు, వీవో బిల్స్ తదితర వాటికి సంబంధించి సీడీపీవో అంగన్వాడీలకు ఇవ్వకుండా కాజేస్తున్నారని ఆమె ఏజేసీకి ఫిర్యాదు చేశారు. అంగన్వాడీల లోపాలను ఎత్తిచూపుతూ ఆయాలు, వర్కర్లను నయానబయాన బెదిరించి వారికి డబ్బులు అందించినట్లుగా బలవంతంగా సంతకాలు తీసుకొని నిధులను స్వాహా చేశారని యూడీసీ తన ఫిర్యాదులో వివరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఏజేసీ నాలుగు రోజుల కిందట సీడీపీవో కార్యాలయాన్ని తనిఖీ చేసినప్పుడు సీడీపీవో ప్రభావతితోపాటు పలువురు ఉద్యోగులు కార్యాలయంలో లేరు. ఆ క్రమంలోనే టీఏ బిల్లుల్లో పలు అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. సీడీపీవో కార్యాలయంలో పనిచేసే అటెండర్‌కు కూడా ఈ వ్యవహారంలో పాత్ర ఉందన్న ప్రచారం సాగుతోంది. ఆమె ఆదేశాలకనుగుణంగా సదరు అటెండర్ అంగన్వాడీల నుంచి వ్యవహారాన్ని చక్కదిద్దడంలో సిద్ధహస్తుడని చెప్పుకుంటున్నారు. -
సూపర్వైజర్ల పరీక్షపై సందిగ్ధం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రేడ్-2 సూపర్వైజర్ రెగ్యులర్ పోస్టుల భర్తీలో సందిగ్ధం నెలకొంది. పరీక్షలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారంటూ ఓ అంగన్వాడీ కార్యకర్త హైకోర్టును ఆశ్రయించింది. కౌంటర్ ఇవ్వాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికారులు మాత్రం ఈ నెల 27వ తేదీన యథావిధిగా రాత పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు హైకోర్టు జోక్యం చేసుకోవడం.. ఇంకోవైపు రాత పరీక్ష నిర్వహిస్తుండటంతో సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. మహిళా శిశు సంక్షేమశాఖ రీజినల్ పరిధిలో 305 పోస్టులకు 3,887 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష సమీపిస్తున్న సమయంలో అధికారుల తీరుపై హైకోర్టు జోక్యం చేసుకోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏం జరిగిందంటే.. మహిళాశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1,741 గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టులకు ఈ ఏడాది జూలై 2వ తేదీన నోటిఫికేషన్ జారీ చేశారు. అదేనెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనలను ఆ శాఖ ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడంతో సమస్య తలెత్తింది. ప్రభుత్వ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి 36 సంవత్సరాల వరకు అవకాశం ఉంది. అయితే సూపర్వైజర్ పోస్టులకు మాత్రం వయసు పరిగణనలోకి తీసుకోకుండా నోటిఫికేషన్ జారీ చేయడంతో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్ కో ఆర్డినేటర్ అండ్ ఇన్స్ట్రక్టర్ లకు 5శాతం రిజర్వేషన్ ఇస్తూ తీసుకున్న నిర్ణయం కూడా వివాదాస్పదమైంది. జోనల్ క్యాడర్‌కు సంబంధించి ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్ల విధానం కూడా చర్చకు దారితీసింది. కాంట్రాక్టు సూపర్వైజర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి ఏటా ఏప్రిల్‌లో కంటిన్యూషన్ ఆర్డర్ ఇస్తారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో వారికి కంటిన్యూషన్ ఆర్డర్ రాలేదు. కాంట్రాక్టు సూపర్వైజర్లు యథావిధిగా రెగ్యులర్ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం.. వారికి హాల్‌టికెట్లు ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్టుల్లో అంగన్వాడీల నియామకాలకు అభ్యర్థుల వయసును కూడా పక్కన పెట్టారు. 21 సంవత్సరాలు నిండాలని నిబంధనలున్నా అంతకంటే తక్కువ వయసు వారికి కార్యకర్తలుగా పోస్టింగ్ ఇచ్చారు. వీటితో పాటు మరికొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ గుంటూరు జిల్లా పత్తిపాడు ప్రాజెక్టు పరిధిలోని పెదనందిపాడు అంగన్వాడీ కార్యకర్త ఎం.రమాదేవి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్డు న్యాయమూర్తులు చంద్రయ్య, కోదండరామ్‌లు సూపర్వైజర్ల పోస్టులకు సంబంధించి కౌంటర్ (డబ్ల్యుఏ 1746) ఇవ్వాలంటూ మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, సాధారణ పరిపాలనశాఖ కమిషనర్లతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, రీజనల్ డిప్యూటీ డెరైక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇదీ.. జరుగుతోంది మహిళా శిశు సంక్షేమశాఖలో అనేక సంవత్సరాల తరువాత రెగ్యులర్ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అదే సమయంలో కొంతమంది దళారీలు రంగంలోకి దిగారు. బేరసారాలు సాగిస్తున్నారు. పోస్టు ఇప్పిస్తామంటూ పెద్దమొత్తంలో నగదు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థుల ఆతృతను ఆసరా చేసుకుని కొన్నిచోట్ల అడ్వాన్స్ కింద రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్న తమకు రెగ్యులర్ పోస్టు వస్తుందన్న ఆశతో కొంతమంది అభ్యర్థులు దళారులు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి కౌంటర్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో అభ్యర్థుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల అభ్యర్థులకు ఒంగోలులో నిర్వహించనున్న సూపర్వైజర్ పోస్టుల ఎంపిక పరీక్షకు ఈ నెల 27వ తేదీ ఉదయం 8గంటలకల్లా హాజరు కావాలని అధికారులు కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అదేరోజు ఉద్యోగులు జాతీయ రహదారి దిగ్బంధనానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకొని సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరుకాకుంటే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలని ఐసీడీఎస్ ప్రాజెక్టులకు ఆదేశాలు వెళ్లాయి.