తల్లీబిడ్డల ఆరోగ్యం పైలెట్ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక
Published Fri, Sep 2 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : తల్లి–బిడ్డ ఆరోగ్యం, పౌష్టికాహారం, సామాజిక ఆరోగ్య అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరిచే ఒక బృహత్తర కార్యక్రమాన్ని దేశంలో పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసిందని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్‌లో వైద్య, ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్టు అమలు తీరుపై కలెక్టర్ సమీక్షించారు. మాతా, శిశు మరణాల సంఖ్యను ఏ విధంగా తగ్గించాలో, పిల్లలకు పోషకాహారం అందిస్తున్న తీరు, గర్భం దాల్చిన నాటి నుంచి కాన్పు జరిగే వరకు మహిళ తీసుకోవాల్సిన ఆరోగ్య చర్యలు సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కామన్ అప్లికే షన్ సాఫ్ట్‌వేర్ విధానాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి అంగన్‌వాడీ కార్యకర్తకూ స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం జరుగుతుందని, ఈ సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరచాల్సి ఉంటుందన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ కె.కోటేశ్వరి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కె.శంకరరావు పాల్గొన్నారు.
Advertisement