పెద్దలపై ఆప్యాయత చూపండి | Show affection for elders | Sakshi
Sakshi News home page

పెద్దలపై ఆప్యాయత చూపండి

Published Thu, Oct 2 2014 2:06 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Show affection for elders

  • వృద్ధుల సమస్యలకు 1090 టోల్‌ఫ్రీ నంబర్
  •  మంత్రి శరణు ప్రకాష్ పాటిల్
  • రాయచూరు/రాయచూరు రూరల్ :  జీవన సంద్యా సమయంలో ఉన్న పోషకులను ఆప్యాయతతో పలకరించి వాత్సల్యం చూపుతూ ఆత్మాభిమానంతో జీవించేలా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని  రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ పిలుపు ఇచ్చారు. నగరంలోని ఐఎంఎ కార్యాలయంలో జిల్లా న్యాయసేవా ప్రాధికార సంఘం, న్యాయవాదుల సంఘం, విద్యాశాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన సీనియర్ సిటిజన్ దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.ఆధునిక యుగంలో అవిభక్త కుటుంబంలో పెద్దలను గౌరవించే సామరస్యం కొరవడిందన్నారు.

    యువకులు ఆర్థిక స్వావలంబనకు లీనమై పెంచిన పెద్దలను మరచి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవిత సంధ్యా సమయంలో ఒంటరితనంతో వృద్ధులు తల్లడిలుతున్నారన్నారు.ఈ నేపథ్యంలో వారిని ఆదరించి అక్కున చేర్చుకోవాలన్నారు.  సీనియర్ సిటిజన్ 2007 చట్టం మేరకు  పెద్దలకు అన్ని సౌకర్యలు కల్పించడం జరుగుతుందన్నార..రాయచూరు జిల్లాలో 38,082 మంది వృద్ధులకు నెలకు రూ.500చొప్పున, 14,042 మందికి రూ.750 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. అనంతరం సినీయర్ సిటిజన్లను మంత్రి సన్మానించారు.
     
    వృద్ధుల సమస్యల పరిష్కారానికి 1090 టోల్‌ఫ్రీ నంబర్

    అంతకుముందు మంత్రి పాటిల్ వృద్ధుల సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్‌పీ కార్యాలయంలో  సురక్ష  సంస్థ సహాయవాణి కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. వృద్ధులు తమ సమస్యలను 1090 కు ఫోన్ చేసి వివరిస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు.
     
    కార్యక్రమంలో జిల్లాధికారి శశికాంత్ సెంథిల్, సీఈఓ   జ్యోత్స్న, ఎస్పీ నాగరాజ్, ఏఎస్పీ పాపయ్య, రిమ్స్ వైద్యాధికారి రమేష్‌బాబు, వసంతకుమార్, శరణప్ప, మహాదేవప్ప, శిశు సంక్షేమ శాఖ జిల్లాధికారి లక్ష్మికాంతమ్మ, తాలూకా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వీరనగౌడ పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement