ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి గురువారం రణరంగంగా మారింది.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదంటూ మహిళా ఉద్యోగిని అనురాధ ఇవాళ ఆత్మహత్యాయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతేకాకుండా అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారంటూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిరసన తెలుపుతున్న సీఐటీయూ నాయకుడు ఈశ్వర్‌రావును చితక్కొట్టి ఆస్పత్రికి తరలించారు. దీంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేపట్టడంతో ఆస్పత్రి పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.