ESI Hospital
-
Korutla: మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి
కోరుట్ల: నాలుగేళ్లలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది కోరుట్లకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు బెజ్జారపు వేణు–మాధవిల కూతురు మౌనిక. ఆమె 2013లో ఎం.ఫార్మసీలో గోల్డ్‌మెడల్ సాధించింది. మౌనిక వివాహం సాఫ్ట్వేర్ ఇంజినీర్ శేఖర్‌తో జరిగింది. అనంతరం మళ్లీ చదువుపై దృష్టిపె ట్టి, 2019లో వీఆర్వో ఉద్యోగం సాధించింది. ఆ జాబ్ చేసూ్తనే అదే ఏడాది ఫార్మసిస్ట్ పోస్టుకు ఎంపికైంది. ప్రస్తుతం హై దరాబాద్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌గా పని చేస్తోంది. 2022 డిసెంబర్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా దరఖాస్తు చేసుకుంది. 6 నెలల కష్టపడి చదివి, పరీక్ష రాయగా శుక్రవారం రాత్రి ఫలితాలు వెలువడ్డాయి. ఆమె రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. తన భర్త శేఖర్ ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ ఉద్యోగాలు సాధించానని తెలిపింది. -
కాకినాడలో శరవేగంగా ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం
-
ESI Hospital: రోగి సహాయకురాలిపై ఈఎస్ఐ క్యాంటిన్ సిబ్బంది లైంగికదాడి
హైదరాబాద్: ఈఎస్ఐసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి సహాయకురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. బీహెచ్ఈఎల్ ఆర్సీ పురానికి చెందిన యువకుడు అనారోగ్యంతో సనత్‌నగర్ ఈఎస్ఐసీ మెడికల్ కళాశాల బోధన ఆసుపత్రిలో చేరాడు. అతడికి సహాయంగా అతడి సోదరి(19) అక్కడే ఉంటూ సేవలు అందిస్తోంది. ఈ నెల 16న రాత్రి భోజనం చేసేందుకు క్యాంటిన్‌కు వచ్చి తిరిగి వార్డుకు వెళుతుండగా క్యాంటీన్లో పనిచేసే షాబాబ్ (33) అనే వ్యక్తి ఆమెను వెంబడించి ల్యాబ్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు షాబాద్‌ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఈఎస్ఐ ఆసుపత్రిలో అత్యాచారానికి పాల్పడ్డ యువకుడి అరెస్ట్
హైదరాబాద్: ఈఎస్ఐ ఆసుపత్రిలో ఓ రోగి సోదరిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లిఫ్ట్‌లో ఆమెను బలవంతంగా తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు షాబాద్ అనే యువకుడు. మూడు రోజుల నుంచి పరారీలో ఉన్న షాబాద్‌ను ఎస్ఆర్ నగర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తన సోదరుడి చికిత్స కోసం కర్ణాకట నుంచి ఈఎస్ఐ ఆసుపత్రికి యువతి రాగా, అక్కడ ఈ దారుణం చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన 19 ఏళ్ల యువతి.. సోదరుడు జారి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే అతన్ని నగరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చేర్పించారు. అతడికి సాయంగా ఉండేందుకు అతని సోదరి ఆసుపత్రికి రాగా, క్యాంటీన్లో పని చేసే షాబాద్ ఆమెపై కన్నేశాడు. ఆమెతో మాటలు కలుపుతూ పరిచయం పెంచుకున్నాడు. అయితే ఆమె లిఫ్ట్‌లో వెళుతున్నప్పుడు బలవంతంగా రెండో అంతస్తులోని చీకటి ప్రదేశానికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. -
గుడ్‌న్యూస్! శంషాబాద్‌లో ఈఎస్ఐ ఆస్పత్రికి కేంద్రం ఆమోదం
కార్మికులకు మెరుగైన వైద్య సేవలందించేందుకుగాను రాష్ట్రంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఎట్టకేలకు ఏడాదిన్నరకు మోక్షం లభించింది. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్రయాదవ్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు 190వ ఈఎస్ఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 8 ఈఎస్ఐ వంద పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నామని, రాష్ట్రంలోని శంషాబాద్‌లో ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించనున్నామని అధికారికంగా ప్రకటించారు. దీంతో కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ శివారులో గగన్‌పహాడ్, కాటేదాన్, సాతంరాయి పారిశ్రామికవాడలతోపాటు కొత్తూరు, నందిగామ, బాలా నగర్, షాద్‌నగర్ పారిశ్రామిక వాడలకు శంషాబాద్ చేరువలో ఉంది. దీనికితోడు నగర శివారులోని అన్ని పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఇక్కడికి రాకపోకలు సాగించేందుకు ఔటర్ రింగు రోడ్డు వంటి అనువైన అనుసంధాన రహదారులు, రైల్వే కనెక్టివిటీ ఉంది. (చదవండి: నో రూల్స్.. ఆర్టీఏ అధికారులని బురిడీ కొట్టిస్తున్న బీమా సంస్థలు) -
చందాదారులకు శుభవార్త.. ఈఎస్ఐలో 24/7 మందులు!
సాక్షి, హైదరాబాద్: కార్మిక రాజ్య బీమా (ఈఎస్ఐ) చందాదారులకు శుభవార్త. ఇప్పటివరకు కేవలం ఓపీ పనివేళల్లోనే ఈఎస్ఐ నాచారం ఆస్పత్రిలో రోగులకు మందులు లభిస్తుండగా అతిత్వరలో ప్రతిరోజూ 24 గంటలపాటు అక్కడ మందులు లభించనున్నాయి. ఇందుకోసం నాచారం ఆస్పత్రిలో 24 గంటలపాటు మందులు అందించేలా ఒక మెడికల్ స్టాల్‌ను కార్మిక శాఖ ఏర్పాటు చేయనుంది. ఈఎస్ఐ ఖాతాదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర కార్మిక సంక్షేమ, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ఇటీవల జరిగిన ఈఎస్ఐ అధికారుల సమావేశంలో వెల్లడించారు. మందుల కొనుగోలుకు ఇప్పటికే రూ. 37 కోట్లు విడుదల చేశామన్నారు. ముందుగా నాచారం ఆస్పత్రిలో 24/7 మందుల పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టి ఆ తర్వాత మరో రెండు ఈఎస్ఐ ఆస్పత్రుల్లోనూ దీన్ని అమలు చేసేందుకు కార్మిక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు జ్వరం మొదలు బీపీ, షుగర్, హృద్రోగాలకు సంబంధించిన మందులను ప్రధాన ఆస్పత్రులతోపాటు క్షేత్రస్థాయిలోని డిస్పెన్సరీల్లోనూ ప్రత్యేక కోటా కింద కేటాయించి నిల్వలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలని కార్మిక శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ఈఎస్ఐ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితోపాటు మరో మూడు ఆస్పత్రులు, 70 డిస్పెన్సరీలు ఉండగా వాటికి అదనంగా 25 ప్యానెల్ క్లినిక్‌లు ఉన్నాయి. ఈఎస్ఐ పరిధిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో దాదాపు అన్ని రకాల రోగులకు మందులను పంపిణీ చేస్తున్నారు. -
మీకు తమాషాగా ఉందా.. మంత్రి హరీశ్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/రామచంద్రాపురం: ‘కార్పొరేట్ ఆస్పత్రిలో మాదిరిగా అన్ని సౌకర్యాలున్నాయి. 55 మంది డాక్టర్లు.. 56 మంది నర్సులు పనిచేస్తున్నారు. కానీ, బెడ్ ఆక్యుపెన్సీ రేషియో మాత్రం 25 శాతమా? జనవరిలో 24 శాతం, ఫిబ్రవరిలో 29 శాతం, జూన్‌లో 49 శాతం.. డాక్టర్లు ఫుల్.. పేషెంట్లు నిల్’అంటూ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రూ.20.50 కోట్లతో ఆధునీకరించిన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఈఎస్ఐ ఆస్పత్రి భవనాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం వైద్యుల పనితీరుపై హరీశ్‌రావు సమీక్షించారు. ఆయా వైద్య విభాగాల అధిపతులతో ముఖాముఖి నిర్వహించి వైద్యుల పనితీరు తక్షణం మెరుగుపరుచుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించారు. ముగ్గురు గైనకాలజిస్టులు నెల మొత్తానికి చేసిన డెలివరీలు కేవలం మూడు. ఎంబీబీఎస్‌లు పనిచేసే పీహెచ్‌సీల్లో రోజుకు నాలుగైదు డెలివరీలు అవుతున్నాయి. నలుగురు వైద్యులు నాలుగేళ్లుగా విధులకు హాజరుకావడం లేదు. అయినా ఎందుకు పేరోల్ (వేతనాల జాబితా)లో ఉంచారు’అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కార్మికులకు అధునాతన వైద్యం అందించేందుకు శంషాబాద్‌లో మరో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మించనున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. వైద్యులతో ముఖాముఖి సాగిందిలా.. మంత్రి: నమస్కారం డాక్టర్ పద్మజగారూ.. గైనకాలజీ విభాగంలో ఎంతమంది ఉన్నారు.. జూలైలో ఎన్ని డెలివరీలు చేశారు. డాక్టర్ పద్మజ: ముగ్గురు డాక్టర్లం ఉన్నాం సర్, మూడు ఆపరేషన్లు చేశాం. మంత్రి: నీ వేతనం ఎంత చెప్పమ్మా.. నాకు నెలకు రూ.రెండు లక్షలు.. మీకు ఎంత? డాక్టర్ పద్మజ: రూ.1.90 లక్షలు సర్. మంత్రి: ముగ్గురు గైనకాలజిస్టులు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. ఈ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలున్నా పనిచేయకపోతే మిమ్మల్ని ఏమనాలి? డాక్టర్ పద్మజ: గతంలో ఇక్కడ బాగా పనిచేశాం సర్. ప్రస్తుతం ఆస్పత్రిలో బ్లడ్ నిల్వలు లేవు. మంత్రి: నార్మల్ డెలివరీ చేయడానికి బ్లడ్ ఎందుకమ్మా? అవసరం పడితే పక్కనే ఉన్న పటాన్చెరు ఏరియా ఆస్పత్రిలో భారీగా రక్తం నిల్వలున్నాయి. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో నెలకు 700 డెలివరీలు చేస్తున్నారు. అనస్తీషియా డాక్టర్ ఉన్నారు. జనరల్ సర్జన్ ఉన్నారు. గైనకాలజిస్టులున్నారు. కానీ, ఒక్క డెలివరీ చేయకపోతే అందరూ ఎందుకమ్మా? డాక్టర్ పద్మజ: ఇకపై బాగా పనిచేస్తాం సర్, డెలివరీలు చేయడం ప్రారంభిస్తాం. మానవత్వం ఉండాలి మంత్రి: ఆర్థోపెడిక్ విభాగంలో ఎంతమంది ఉన్నారు? జూలైలో ఎన్ని ఆపరేషన్లు చేశారు. డాక్టర్ నీరజ: ఒక్క ఆపరేషన్ కూడా చేయలేదు సర్. మంత్రి : అల్ట్రాసౌండ్ ఉంది. డిజిటల్ ఎక్స్‌రే ఉంది. రెండు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. అన్ని ఆధునిక సౌకర్యాలున్నాయి. కానీ, జూలైలో ఒక్క ఆపరేషనూ చేయలేదు. ఓ ప్రైవేటుకు ఆస్పత్రికి వెళ్దాం. అక్కడ రోజుకు ఎన్ని ఆపరేషన్లు అవుతున్నాయో చూద్దాం. రూ.లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నారు. కార్మికుల కోసం కనీసం పనిచేయరా? మానవత్వం ఉండాలమ్మా.. డాక్టర్ నీరజ : ఇకపై చేస్తాం సర్.. ఇది కూడా చదవండి: ఉద్యోగ నోటిఫికేషన్లో ట్విస్ట్.. అభ్యర్థులకు షాక్! -
మెడికల్ చెకప్‌కి వెళ్లిన ఛటర్జీకి అవమానం!... ముఖం మీదే చెప్పులు విసిరి.....
న్యూఢిల్లీ: బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీని టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్రేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు, నటి అర్పిత ముఖర్జీ నివాసంలో కూడా సోదాలు నిర్వహించిన అధికారులు ఇప్పటివరకు సుమారు రూ.50కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పార్థ ఛటర్జీని అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని మెడికల్ చెకప్ కోసం జోకాలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఐతే అక్కడ ఛటర్జీకీ ఊహించని అవమానం ఎదురైంది. ఐఎస్ఒఐ ఆస్పత్రి వెలుపల ఒక మహిళ ఛటర్జీ ముఖం పైనే చెప్పులు విసిరి ఘోరంగా అవమానించింది. ఆ తర్వార సదరు మహిళ మాట్లాడుతూ...తాను మందులు కొనుక్కోవడానకి ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపింది. ఫ్లాట్లు, ఏసీ కార్లు కొనుక్కునేందుకు అతను పేదలను దోచుకుంటున్నాడని విమర్శించింది. ఇలాంటి వాళ్లను కాళ్లుచేతులు కట్టి వీధుల్లోకి ఈడ్చుకెళ్లాలంటూ.. తిట్టిపోసింది. అంతేకాదు ఆ చెప్పుల ఇక తాను ధరించను అంటూ ఛటర్జీ మండిపడింది. మరోవైపు తృణమాల్ కాంగ్రెస్ ఛటర్జీని సస్సెండ్ చేయడమే కాకుండా బెంగాల్ మంత్రివర్గం నుంచి తొలగించింది. (చదవండి: Partha Chatterjee: మమత కేబినెట్లో కీలక మార్పులు.. ఒక్కరికి ఒకే పదవి!) -
ఈఎస్ఐలో కోవిడ్ చికిత్స
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వ్యాప్తి తీవ్ర మవుతున్న సమయంలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) అప్రమత్తమైంది. వైరస్ బారిన పడుతున్న ఈఎస్ఐ చందాదారులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన సేవలందించేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో కోవిడ్–19 చికిత్స కోసం ప్రత్యేక విభాగాలను తెరవాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆస్పత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో కోవిడ్–19 ఇన్ పేషంట్ (ఐపీ) సేవలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఈఎస్ఐ ప్రాంతీయ సంచాలకులు (ఆర్డీ), డైరెక్టర్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (డీఐఎంఎస్), ఈఎస్ఐ మెడికల్ కళాశాలల డీన్లకు తాజాగా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని కోవిడ్–19 ప్రత్యేక ఆస్పత్రిగా మార్చారు. ఇక్కడ సాధారణ సర్వీసులు కొనసాగిస్తూనే, కరోనా బాధితులకు చికిత్స అందిస్తారు. ఇందుకోసం 50 సాధారణ, 54 వెంటిలేటర్, ఆక్సిజన్‌తో కూడిన బెడ్లు, 21 వెంటిలేటర్, ఆక్సిజన్‌తో కూడిన ఐసీయూ బెడ్లు కేటాయించారు. ఇప్పటికే చికిత్సలు ప్రారంభించా రు. మరోవైపు నాచారం ఈఎస్ఐతో పాటు జీడిమెట్లలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రిలోనూ కోవిడ్ చికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఈఎస్ఐ చందాదారులకు, ఈఎస్ఐ కార్డుదారులకే సేవలందిస్తారు. డిస్పెన్సరీల్లో కోవిడ్–19 కిట్లు! రాష్ట్రంలో 21 లక్షల మంది ఈఎస్ఐ చందాదారులున్నారు. వారి కుటుంబ సభ్యులను కలుపుకుంటే దాదాపు 80 లక్షల మంది లబ్ధిదారులున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 110 ఈఎస్ఐ డిస్పెన్సరీల ద్వారా చందాదారులకు ఉచిత వైద్య సేవలందుతున్నాయి. ప్రస్తుతం ఈ డిస్పెన్సరీల్లో జనరల్ చెకప్ సేవలు, అవసరమైన వారికి మందులు అందిస్తున్నారు. తాజాగా కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో బాధితులకు కోవిడ్–19 కిట్లు అందించే అంశాన్ని ఈఎస్ఐసీ పరిశీలిస్తోంది. పాజిటివ్ వచ్చి లక్షణాలున్న బాధితులకు సమీప డిస్పెన్సరీల్లోని వైద్యుల సలహా తీసుకుని మాత్రలు వేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అదేవిధంగా సాధారణ లక్షణాలతో ఉన్న వారికి కోవిడ్–19 కిట్‌ను అందించే ఏర్పాట్లు చేయాలని డీఐఎంఎస్‌లకు ఈఎస్ఐసీ ఆదేశించింది. -
కరోనా కాటుకు బలి.. తీరిగ్గా 15 నెలల తర్వాత సమాచారం.. తీరని క్షోభ
సాక్షి, యశవంతపుర: బెంగళూరులోని రాజాజీనగర ఈఎస్ఐ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం రెండు కుటుంబాలకు తీవ్ర ఇబ్బంది తెచ్చిపెట్టింది. కరోనాతో చనిపోయిన ఇద్దరి మృతదేహాలను తీరిగ్గా 15 నెలల తరువాత వారి కుటుంబాలు తీసుకెళ్లాలని సమాచారం ఇచ్చారు. వివరాలు.. చామరాజపేటకు చెందిన మహిళ (40), కేపీ అగ్రహారకు చెందిన వ్యక్తి (35)లు 2020 జూలైలో కరోనాతో ఈఎస్ఐ ఆస్పత్రిలో చేరారు. కొన్నిరోజులకే మరణించారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో కొత్తగా మార్చురీని నిర్మించి, పాత మార్చురీని ఉపయోగించడం మానేశారు. పై ఇద్దరి మృతదేహాలు పాత మార్చురీలో ఉన్నట్లు సిబ్బంది ఇటీవల గుర్తించి వారి బంధువులకు తీసుకెళ్లాలని సమాచారం పంపారు. కానీ బీబీఎంపీ రికార్డుల్లో అప్పట్లోనే వారి కుటుంబాలకు మృతదేహాలను అప్పగించినట్లు, అంత్యక్రియలు పూర్తయి డెత్ సర్టిఫికెట్ జారీచేసినట్లు ఉంది. ఇప్పుడీ మానసిక క్షోభ ఏమిటని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి ఈ అమానుషంపై విచారణ చేయాలని మాజీ మంత్రి సురేశ్‌కుమార్ కార్మిక శాఖ మంత్రి శివరామ్ హెబ్బార్‌ను డిమాండ్ చేశారు. నిర్లక్యం వహించిన బీబీఎంపీ, ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
రూ. 46 లక్షలు ఖర్చు చేసినా ప్రాణం దక్కలే..!
గీసుకొండ: కరోనా రక్కసి ఓ కుటుంబంలో కల్లోలం సృష్టించింది. ఓ వ్యక్తి ఏకంగా రూ.46 లక్షలు ఖర్చు చేసినా.. ప్రాణాలు దక్కలేదు. పైగా కుటుంబం మొత్తం కుదేలైంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారానికి చెందిన పోలెబోయిన రాజన్‌బాబు (45) ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. నగరంలోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటూ ఐరన్, సిమెంట్ వ్యాపారంతో పాటు జిమ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల రాజన్‌బాబు, భార్య, ఇద్దరు కుమారులకు కరోనా వైరస్ సోకింది. అందరూ హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో రాజన్‌బాబు ఆరోగ్యం క్షీణించడంతో ముందుగా స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. హైదరాబాద్‌లోని మియాపూర్, సాగర్ రింగ్‌రోడ్డు, జేఎన్టీయూ హౌసింగ్ బోర్డు కాలనీలో గల మూడు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం రోజుకు రూ.లక్షకు పైగా వెచ్చించారు. ప్రాణాలు దక్కితే చాలు అని ఖర్చుకు వెనుకాడలేదు. డబ్బుల కోసం ఫ్లాట్‌ను అమ్మేశారు. కాగా, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డబ్బు తీసుకుంటూనే రాత్రిపూట ఆక్సిజన్ తీసివేస్తున్నట్లు గుర్తించారు. ఇష్టానుసారంగా డబ్బులు గుంజుతూ.. సరైన వైద్యం అందించడం లేదని అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున రాజన్‌బాబు మృతి చెందాడు. మొత్తంగా చికిత్స కోసం ఫ్లాట్ అమ్మగా వచ్చిన డబ్బుతో పాటు ఇతరత్రా అన్నీ కలిసి రూ.46 లక్షలు వెచ్చించినా ఆయన ప్రాణాలు దక్కలేదు. భార్య, ఇద్దరు కుమారులు ఇంకా చికిత్స పొందుతున్నారు. కాగా, ఇటీవల రాజన్‌బాబు తల్లి, సోదరి కూడా కరోనాతో మృతి చెందారు. కరోనా కాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురు బలికావడంతో స్థానికంగా విషాదం నెలకొంది. -
కార్మికులకు మెరుగైన వైద్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చెప్పారు. కార్మికులకు ఇబ్బంది లేకుండా రాష్ట్రంలోని అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గుణదల మోడల్ డిస్పెన్సరీలో ఆన్లైన్ విధానాన్ని సోమవారం కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మితో కలిసి మంత్రి జయరాం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కార్మికుల సొమ్మును కూడా దోచుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల సొమ్మును వారి వైద్యం, సంక్షేమం కోసమే ఖర్చు చేస్తోందని తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసుకోవడం ద్వారా కార్మికులు వారి సమయాన్ని ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే.. రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందనే నమ్మకంతో సీఎం వైఎస్ జగన్.. ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలు కూడా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందే అవకాశాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువస్తే.. ఆయన తనయుడు సీఎం జగన్ ఇప్పుడు ప్రతి ఒక్క జబ్బును ఆరోగ్య శ్రీలో చేర్చి పేదలకు మెరుగైన వైద్యమందిస్తున్నారని చెప్పారు. ప్రజల సంక్షేమంతో పాటు విద్య, ఆరోగ్యానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి మాట్లాడుతూ.. ఆన్లైన్ సేవల విధానాన్ని 78 డిస్పెన్సరీలు, 4 ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అమలు చేస్తామన్నారు. ఈఎస్ఐ డైరెక్టర్ ఎల్‌ఎస్‌బీఆర్ కుమార్, కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, ప్రాంతీయ సంచాలకులు కాశీనాథన్ పాల్గొన్నారు. -
ఈఎస్‌ఐలోనే అచ్చెన్నకు వైద్య పరీక్షలు
సాక్షి, అమరావతి: ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడుకి అదే ఈఎస్ఐ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇది యాధృచ్చికమే అయినప్పటికీ ఆయనకు చేదు అనుభవమే. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని కోవిడ్ పరీక్షలకు కేటాయించడంతో ఇతర వైద్య సేవలను ఈఎస్ఐ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారు. దీంతో కోర్టుకు హాజరు పరచడానికి ముందు అచ్చెన్నాయుడును ఈఎస్ఐ ఆసుపత్రి క్యాజువాలిటీకి తీసుకువచ్చారు. అక్కడ ఆర్ఎంఓ డాక్టర్ శోభ పర్యవేక్షణలో వైద్యులు ఆయనకు బీపీ, సుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా టెస్ట్ కోసం స్వాబ్ సేకరించారు. మిగిలిన ఆరుగురికి కూడా వైద్య పరీక్షలు చేశారు. ఇదిలా ఉండగా తనకు ఇటీవల పైల్స్ సర్జరీ జరిగిందని, కారులో ఉదయం నుంచి కూర్చొని ప్రయాణించడం వల్ల సర్జరీ జరిగిన చోట నొప్పిగా ఉందని అచ్చెన్నాయుడు చెప్పడంతో ప్రభుత్వాసుపత్రికి చెందిన సర్జన్ పరీక్షలు చేశారు. బీపీ, షుగర్ సాధారణ స్థితిలోనే ఉన్నట్టు నిర్ధారించారు. (చదవండి : టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్) రెండు ఎఫ్ఐఆర్లు.. ► ఈఎస్ఐ స్కామ్‌లో ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో అచ్చెన్నాయుడితో సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు వారిని రోడ్డు మార్గంలో విజయవాడ గొల్లపూడిలోని రీజినల్ ఆఫీసుకి తరలించారు. ► శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులు వారందరినీ ప్రాథమికంగా ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిని సుమారు గంటసేపు ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతరం అచ్చెన్నాయుడు, రిటైర్డ్ డైరెక్టర్ చింతల కృష్ణప్ప రమేష్ కుమార్‌పై ఒక ఎఫ్ఐఆర్, మిగతా ఐదుగురు నిందితులు ఈటగాడి విజయకుమార్, జనార్థన్, ఇవన రమేష్‌బాబు, ఎంకేపీ చక్రవర్తి, గోనెవెంకట సుబ్బారావుపై మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిసింది. ఏసీబీ అధికారులతో న్యాయవాదుల వాగ్వాదం ► ఏసీబీ రీజినల్ కార్యాలయంలో అచ్చెన్నాయుడుని కలిసేందుకు వచ్చిన న్యాయవాదులు ఏసీబీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమను లోపలికి అనుమతించాలంటూ హడావుడి చేశారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులే బెయిల్ పిటిషన్ కాగితాలు లోపలకు తీసుకెళ్లి అచ్చెన్నాయుడితో సంతకాలు పెట్టించుకొని వచ్చి న్యాయవాదులకు అందజేశారు. ఏం జరుగుతుందో చూద్దాం.. ► లోపలికి వెళ్తున్నా.. ఏం జరుగుతుందో చూద్దాం.. అంటూ ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టైన అచ్చెన్నాయుడు గొల్లపూడిలోని ఏసీబీ రీజినల్ కార్యాలయం వద్ద మీడియా వద్ద ముక్తసరిగా వ్యాఖ్యానించారు. ఏసీబీ అధికారులు రమ్మన్నారని, అందువల్ల ఇక్కడికి వచ్చానని తెలిపారు. అధికారులు తనను ఇంతవరకు ప్రశ్నించలేదని, బయటకు వచ్చాక అన్ని విషయాలు చెబుతానన్నారు. -
వంద పడకల ఈఏస్ఐ ఆసుపత్రికి కార్మిక శాఖ అమోదం
-
డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోళ్లు వద్దు
సాక్షి, అమరావతి: కార్మిక రాజ్యబీమా ఆస్పత్రుల (ఈఎస్ఐ)లో ఇకపై డిస్ట్రిబ్యూటర్ల నుంచి మందుల కొనుగోళ్లు చేయకూడదని, ఉత్పత్తి దారుల (మాన్యుఫాక్చరర్స్) నుంచి మాత్రమే కొనుగోళ్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోళ్లు చేయడం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలు జరిగి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. నేరుగా ఉత్పత్తిదారుల నుంచే కొనుగోలు చేయడం వల్ల నాసిరకం మందులు సరఫరా అయ్యే అవకాశం ఉండదని, అలా చేస్తే వారిని బాధ్యులు చేయవచ్చునని, పైగా తక్కువ ధరలకే వచ్చే అవకాశం ఉందని అధికారుల అభిప్రాయం. డిస్ట్రిబ్యూటర్ల నుంచి గానీ, వ్యక్తుల నుంచి గానీ, ఏజెంట్ల నుంచి గానీ కొనుగోలు చేస్తే నాసిరకం మందులు సరఫరా అయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాంటి వారి నుంచి కొనుగోలు చేస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేవలం ఉత్పత్తి దారుల నుంచి మాత్రమే కొనుగోళ్లు చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐ అధికారులు మాత్రం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నేడో రేపో ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.300 కోట్ల వరకు మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో గత మూడు మాసాలుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కె.రాజేంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేశారు. విచారణ పూర్తికావడంతో త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు తెలిసింది. కొంతమంది అధికారులతో పాటు ఒకరిద్దరు ప్రముఖ కాంట్రాక్టర్లు, తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన ఓ మంత్రి కొడుకు మందుల కొనుగోళ్ల అవినీతిలో కీలక పాత్ర పోషించినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. మంత్రి కొడుకు చిన్న చిన్న స్లిప్పుల్లో సంతకాలు చేసి ఇచ్చినా కూడా దాని ఆధారంగా నామినేషన్ కింద మందులు సరఫరా చేశారని వెల్లడైంది. వంద రూపాయల సరుకు సరఫరా చేస్తే, వెయ్యి రూపాయలకు చేసినట్టు చూపించారు. పైగా రూపాయి మాత్రను పది రూపాయల రేటుకు కొనుగోలు చేసినట్టు కూడా విచారణాధికారుల దృష్టికి వచ్చిందని తెలిసింది. ఇదిలా ఉండగా, ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల అక్రమాలపై తెలంగాణ ఏసీబీ అధికారులు బుధవారం ఏపీ ఈఎస్ఐ కార్యాలయానికి వచ్చారు. తెలంగాణలో అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్ల పాత్ర ఇక్కడ కూడా ఉండటంతో విచారణలో భాగంగా ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. -
ఈఎస్ఐ కాలేజీకి ‘సూపర్’ సొగసులు
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి సేవలు విస్తృతం కానున్నాయి. ఈఎస్ఐ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఆస్పత్రికి అనుబంధంగా కేంద్ర ప్రభు త్వం 2016లో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతో కారి్మక కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందుతుండగా.. తాజాగా ఈ కాలేజీలో డీఎన్బీ (డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డు) కోర్సులు ప్రారంభించేందుకు కేంద్రం ఆమో దం తెలిపింది. ఇప్పటివరకు యూజీ కోర్సులతో కొనసాగుతున్న ఈ కాలేజీలో ఇకపై డీఎన్బీ కోర్సులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ అధ్యక్షతన జరిగిన ఈఎస్ఐసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. డీఎన్బీ పరిధిలో అన్నీ సూపర్ స్పెషాలిటీ కోర్సులే కావడంతో సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో కారి్మకులకు ఆధునిక సేవలు అందనున్నాయి. వీటితోపాటు స్పెషల్ పీజీ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రుల్లో డీఎన్బీ, స్పెషల్ పీజీ కోర్సులు ప్రారంభిస్తున్న వాటిలో మొదటిది సనత్‌నగర్ ఈఎస్ఐ కాలేజీనే కావడం విశేషం. కొత్త కోర్సును వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు అధికారు లు చర్యలు వేగవంతం చేశారు. 2019–20 వార్షిక సంవత్సరం బడ్జెట్లో సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రికి రూ.180 కోట్లు కేటాయించగా.. కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని రూ.200 కోట్లకు పెంచింది. -
కడవరకూ జగన్‌తోనే ఉంటాం: ఎంపీ భరత్‌రామ్
సాక్షి, తాడితోట (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి వంద పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఈఎస్ఐ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. అన్ని విభాగాల్లో శిథిలావస్థకు చేరిన గదులను చూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్థన్‌ను కలిసి ట్రామాకేర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. పేపర్‌మిల్లు, ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థల నుంచి సీఎస్ఆర్ నిధులను సేకరించి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి నాడు– నేడు కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత ఆసుపత్రి ఫొటోలు తీయించి అభివృద్ధి చేసిన తరువాత తిరిగి ఫొటోలు తీస్తామన్నారు. కడవరకూ జగన్‌తోనే ఉంటాం... వైఎస్సార్ సీపీ ఎంపీలు బీజేపీకి టచ్‌లో ఉన్నారంటూ ఎంపీ సుజనాచౌదరి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ భరత్‌రామ్ స్పందించారు. సుజనాచౌదరి మైండ్ గేమ్ ఆడుతున్నారని, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూర్చున్న ఎంపీలను చూసి వైఎస్సార్ సీపీ ఎంపీలు టచ్‌లో ఉన్నారనుకుంటున్నారని పేర్కొన్నారు. నిజమైన వైఎస్సార్ సీపీ ఎంపీలు కడవరకూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటారన్నారు. 22 మంది ఎంపీలూ జగన్ నాయకత్వంలో పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారక్ప్రసాద్, ఆర్ఎంవో డాక్టర్ రామకృష్ణ, సివిల్ సర్జన్లు కోటేశ్వరరావు, పద్మావతి, ప్రదీప్, రామారావు తదితరులు పాల్గొన్నారు. సెగ్మెంట్‌కు మొబైల్ వాటర్ ట్యాంక్ రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక మొబైల్ వాటర్‌ట్యాంకు ఉండే బాగుంటుందని దానిపై ఆలోచించాలని ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లను ఆదేశించారు. శనివారం స్థానిక మార్గాని ఎస్టేట్స్‌లో ఆయన కార్యాలయంలో ఎంపీ ల్యాడ్స్‌పై పార్లమెంటు పరిధిలోని ఆర్డబ్ల్యూఎస్ డీఈలతో సమీక్షించారు. ఈ సందర్భంగా భరత్‌రామ్ మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మొబైల్ వాటర్ ట్యాంకర్ ఉంటే ఆ నియోజకవర్గ పరిధిలోని ఏదైనా గ్రామంలో మంచినీటి సమస్య వస్తే నీరు అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. మొబైల్ ట్యాంకులు సులువుగా చిన్న వీధులలో మలుపు తిరగడానికి అవకాశం ఉంటుందన్నారు. వాటర్ హెడ్ ట్యాంకులు పైపులైను నిర్మాణాలు శాశ్వత నిర్మాణాలని, వాటికి కొంత సమయం పడుతుందని ఈలోపు వాటర్ ట్యాంకులు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజినీర్లు ఈ విషయంపై ఏవిధంగా చేస్తే బాగుంటుందో చెప్పాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై ఎంపీ ఆరాతీయగా గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామ సచివాలయాలను నిర్మిస్తామని డీఈలు తెలిపారు. ప్రస్తుతం వాటి నిర్మాణాలకు పరిపాలనా పరమైన ఆమోదాలు వచ్చాయన్నారు. సమావేశంలో పార్లమెంటు పరిధిలోని డీఈలు ఎస్.రవికుమార్, సీహెచ్ రమేష్, పి.శ్రీనివాస్, ఎంఎస్ స్వామి పాల్గొన్నారు. -
ఈఎస్ఐ ఆస్పత్రిలో వైద్యం అందట్లేదని రోగులు ఆవేదన
-
నామినేషన్‌పై మందుల కొను‘గోల్మాల్’
సాక్షి, అమరావతి : కార్మిక రాజ్య బీమా (ఈఎస్ఐ) పరిధిలోని ఆస్పత్రుల్లో మరో భారీ కుంభకోణానికి అధికారులు తెరతీశారు. గత ప్రభుత్వ హయాంలో మందుల కొనుగోళ్లలో విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలు జరిగాయని తేలడంతో ఓ వైపు విజిలెన్స్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తుంటే మరోవైపు ఈఎస్ఐ పరిధిలోని ఆస్పత్రుల్లో కనీస మందులు లేక కార్మికులు, వారి కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ ఏమీ పట్టని అధికారులు తాము అనుకున్నదే రూలు అన్నట్టు వందల కోట్ల రూపాయల విలువైన మందుల కొనుగోళ్ల విషయంలో అక్రమాలకు మార్గం సుగమం చేశారు. పారదర్శకంగా మందుల కొనుగోలు జరగాలంటే ఇ–ప్రొక్యూర్మెంట్ పద్ధతి సరైనదని భావించిన అధికారులు కొత్త సర్కారు రాగానే ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు. అప్పటి కార్మిక శాఖ అధికారిగా ఉన్న ఐఏఎస్ అధికారి మాధవీలత ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రక్రియ మొదలు పెట్టారు. అయితే కొద్ది రోజులకే ఆమె కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆ తర్వాత లావణ్యవేణి అనే మరో అధికారి ఈ శాఖకు వచ్చారు. ఈమె ఆధ్వర్యంలో టెండర్లు పూర్తి చేసి, ఎల్1గా నిలిచిన కంపెనీల నుంచి మందులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తీరా ఎల్1గా నిలిచిన కంపెనీలపై ఫిర్యాదులున్నాయని, మామూలు ధరల కంటే ఎక్కువ రేటు ఉందని ఇ–ప్రొక్యూర్మెంట్ విధానాన్ని నిలిపివేశారు. నామినేషన్ కింద మందుల సరఫరాకు అనుమతి ఇచ్చేందుకు ఈఎస్ఐ డైరెక్టరే కొన్ని కంపెనీలను ఎంపిక చేశారు. నామినేషన్ కింద అయితే భారీగా డబ్బులొస్తాయని భావించిన అధికార వర్గాలు ఈ విధానానికి తెరలేపాయని సమాచారం. ఇదే సమయంలో తక్కువ ధరకు మందులు ఇస్తామని చెప్పిన కంపెనీలు ఎందుకు ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలో పాల్గొన లేదన్నదానికి అధికారుల నుంచి జవాబు లేదు. దీంతో రెండు మాసాల పాటు ఇద్దరు ఐఏఎస్ అధికారులు కసరత్తు చేసిన ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్ల విధానం మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ధరలు మామూలుగా ఉన్నాయన్న కమిటీ ఇ–ప్రొక్యూర్మెంట్ పూర్తయ్యాక రేట్లు ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు రాగానే రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) కొనుగోలు చేసే మందుల ధరకూ, ఈఎస్ఐ ఇప్రొక్యూర్మెంట్లో కోట్ చేసిన ధరలకూ బేరీజు వేయాలని ఉన్నతాధికారులు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. చంద్రశేఖర్, రామకృష్ణ, గాంధి అనే ముగ్గురు వైద్యులతో కూడిన కమిటీ సుమారు 265 రకాల మందుల ధరలను పరిశీలించింది. ఈఎస్ఐ టెండర్లలో పాల్గొన్న కంపెనీలు వేసిన ధరలకూ, ఏపీఎంఎస్ఐడీసీ ధరలకూ తేడా లేదని తేల్చింది. ఇలాంటప్పుడు ఇ–ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అమలు చేయాలని కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఆదేశాలు జారీ చేశారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా నామినేషన్ ద్వారా కొనుగోళ్లవైపే మొగ్గు చూపారు. ఇప్పటికే ఏఏ కంపెనీకి ఆర్డర్లు ఇవ్వాలో కూడా నిర్ణయించి వారికి జిల్లాల వారీగా మందుల ఇండెంట్ ఇచ్చారు. తొలి దశలో సుమారు రూ.40 కోట్లతో మందులు కొనుగోలు చేయనున్నారు. ధరలు ఎక్కువని ఇస్తున్నాం ఇ–ప్రొక్యూర్మెంట్ టెండరులో ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే నామినేషన్ కింద ఇస్తున్నాం. ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేసే మందులు అదే ధరకు వచ్చినా వాటినెవరైనా తింటారా? మా రోగులు అలాంటి మాత్రలు తినరు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు లేని విషయం వాస్తవమే. అందుకే నామినేషన్ కింద ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తున్నాం. పైగా ఈఎస్ఐ మందుల టెండర్లలో పాల్గొన్న కంపెనీల ద్వారా మందులు కొంటే రూ.230 కోట్లు నష్టం వస్తుంది. – సామ్రాజ్యం, ఈఎస్ఐ డైరెక్టర్ -
వరంగల్‌లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
దేశంలోని ప్రతి జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం.. వరంగల్‌లో ఈఎస్ఐ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అన్నారు. సంపర్క్ అభియాన్, జనజాగరణ కార్యక్రమాల్లో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన సోమవారం ఇక్కడికి వచ్చారు. సాక్షి, న్యూశాయంపేట: దేశంలోని ప్రతి జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం.. వరంగల్‌లో ఈఎస్ఐ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అన్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన సంపర్క్ అభియాన్, జనజాగరణ కార్యక్రమాల్లో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన సోమవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా హన్మకొండ రాంనగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సంపర్క్ అభియాన్, జనజాగరణ సభలో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణం తమ దృష్టికి వచ్చిందని పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలో వచ్చిన వందరోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజామోదం లభించిందని చెప్పారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని ఇందులో వేరే దేశం జోక్యాన్ని సహించేది లేదన్నారు. కశ్మీర్‌తో పాటు, దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ రాబోయే రోజుల్లో అధికారంలో వస్తుందని, రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలచుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలని, కలిసికట్టుగా పనిచేసి టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణంపై సీబీఐ చేత దర్యాప్తు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర ప్రతినిధి బృందం కేంద్రమంత్రికి మెమోరండం సమర్పించింది. సంపర్క్ అభియాన్ భాగంగా కాకతీయ మాజీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ వంగాల గోపాల్‌రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, ప్రముఖ కవి రచయిత ప్రొఫెసర్ రామాచంద్రమౌళిలను కలుసుకున్నారు. సభలో రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీ జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, వన్నాల శ్రీరాములు, మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు, పార్టీ అర్బన్, రూరల్‌జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు డాక్టర్ విజయలక్ష్మి, రావుల కిషన్, మల్లాది తిరుపతిరెడ్డి, బన్న ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలి చారిత్రాత్మకమైన వరంగల్ జిల్లాలో ఉన్న నిరుద్యోగుల కోసం భారీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి కేంద్ర మంత్రిని కోరారు. గతంలో ఉన్న ఆజంజాహి మిల్లు మూత పడడంతో వేలాది మందికి ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఆసియాలోనే పెద్ద మార్కెట్ ఉన్న వరంగల్‌లో స్పైసెస్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని, ఉన్న స్పైసెస్ బోర్డును తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని సమర్పించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సాధుల దామోదర్, తోట నర్సింహరావు, కొత్త కిషోర్‌కుమార్, సారయ్య, గౌరిశెట్టి శ్రీనివాస్, రాజు, దేశబత్తుల రమేష్, పోతుకుమారస్వామి, బిజెపీ నాయకులు రావు పద్మారెడ్డి, ఎడ్ల అశోక్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ధర్మారావు, వన్నాల శ్రీరాములు, వంగాల సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోదీ పాలనకు మద్దతుగా నిలవాలి వరంగల్: దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీ పాలనకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అన్నారు. వరంగల్‌లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో సోమవారం వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని అర్టికల్ 371ను రద్దు చేసి కాశ్మీర్ ప్రజలకు నిర్బంధం నుంచి విముక్తి కల్పించారని పేర్కొన్నారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాలపై ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సంపర్క్ అభియాన్, జనజాగరణ్ కార్యక్రమాలు నిర్విహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా వరంగల్ పట్టణంలో మేధావులను, కవులను, వ్యాపార, వాణిజ్య వర్గాలను కలుసుకున్నామని చెప్పారు. -
నీ వెంటే నేను..
నాగేశ్వరరావు, నాగరత్నం దంపతులు. వీరుఅనారోగ్యంతో మూడు రోజుల క్రితం ఈఎస్‌ఐఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో భర్త ఆదివారం రాత్రి కన్నుమూశాడు. ఆయన మృతదేహాన్ని కుత్బుల్లాపూర్ సర్కిల్ ఎస్‌ఆర్‌నాయక్ నగర్‌లోని నివాసానికి తరలించారు. భర్తను కడసారి చూసేందుకు భార్య ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో వస్తుండగా మార్గమధ్యలోనే మరణించింది. ఈ ఘటన కుటుంబసభ్యులనుకలచి వేసింది. కుత్బుల్లాపూర్: అనారోగ్యంతో మృతి చెందిన భర్తను కడసారి చూపు చూసేందుకు అంబులెన్స్‌లో వస్తూ మార్గమధ్యలోనే భార్య మృతి చెందిన విషాద సంఘటన కుత్బుల్లాపూర్ సర్కిల్ ఎస్ఆర్ నాయక్‌నగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం, కోడేరు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు (70), నాగరత్నం(65) దంపతులు బతుకుదెరువు నిమిత్తం 20 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి కుత్బుల్లాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. మూడు రోజుల క్రితం భార్యాభర్తలిరువురూ అనారోగ్యానికి గురికావడంతో వారిని ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి నాగేశ్వరరావు మృతి చెందాడు. మృతదేహాన్ని ఎస్ఆర్ నాయక్‌నగర్‌లోని ఇంటికి తీసుకువచ్చిన కుటుంబసభ్యులు కడసారి చూపు కోసం నాగరత్నంను అంబులెన్స్‌లో ఇంటికి తీసుకువస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. ఓ వైపు తండ్రి.. మరో వైపు తల్లి ఒకేసారి కన్నుమూయడంతో వారి కుమారులు కన్నీటి పర్యంతమయ్యారు. కడసారి చూపు కోసం వస్తున్న ఆమె భర్తను చూడకుండానే కన్ను మూయడంతో ఎస్ఆర్ నాయక్ నగర్లో విషాదం నెలకొంది. సుభాష్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుని గా కొనసాగుతున్న గుబ్బల లక్ష్మీనారాయ ణ మాజీ ఎమ్మెల్యే, కూన శ్రీశైలంగౌడ్‌కు సన్నిహితుడు. వీరి మరణ వార్త విన్నవెంటనే శ్రీశైలంగౌడ్ అక్కడికి వచ్చి కుటుంబసభ్యులను ఓదార్చారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.ఎస్.వాసు, మాజీ కౌన్సిలర్ రంగారావు, పలు పార్టీల నేతలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
జిల్లాకో ఈఎస్ఐ ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. ఇప్పటికే 400 జిల్లాల్లో ఈఎస్ఐ ఆస్పత్రులను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. వచ్చే నాలుగేళ్లలో అన్ని జిల్లాల్లో ఈఎస్ఐ ఆస్పత్రులను తెరిచి కార్మిక కుటుంబాలకు అత్యాధునిక వైద్య సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించతలపెట్టిన ఓపీడీ భవనానికి బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఈఎస్ఐ ఆస్పత్రిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని ఆదర్శ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కొత్తగా నిర్మించనున్న ఓపీడీ భవనాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.124 కోట్లతో నిర్మిస్తున్న ఈ బ్లాకులో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. కారి్మకుల సంఖ్య తక్కువ ఉన్న చోట్ల ఈఎస్ఐ లబ్ధిదారులు కాని వారికి కూడా సేవలు అందించనున్నట్లు వివరించారు. దేశంలోని 40 కోట్ల మంది అసంఘటిత రంగ కారి్మకులకు నెలవారీగా రూ.3,000 పింఛను అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రకటించాలి సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రకటించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. వైద్య సేవల రంగంలో కేంద్ర ప్రభుత్వం పలు విప్లవాత్మక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈఎస్ఐకి సంబంధించిన పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈఎస్ఐ ఆసుపత్రుల పనితీరు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల కంటే మెరుగ్గా ఉందని కితాబిచ్చారు. రాష్ట్రంలో 18 లక్షల మంది కార్మికులు ఈఎస్ఐ పరిధిలో ఉన్నారని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి తెలిపారు. -
గంటపాటు లిఫ్టులో నరకం
సాక్షి, ఆరిలోవ(విశాఖపట్నం) : హెల్త్‌సిటీ ఈఎస్ఐ ఆస్పత్రిలో బుధవారం లిఫ్ట్ మొరాయించింది. కింద నుంచి పైఅంతస్తుకు రోగులు, వారి బంధువులు వెళుతుండగా మధ్యలో నిలిచిపోయింది. దీంతో లిఫ్టులో ఉన్నవారు హాహాకారులు చేశారు. సుమారు గంటపాటు నరకం చూశారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో రెండు లిఫ్ట్‌లున్నాయి. వాటిలో ఇప్పటికే ఒకటి మొరాయించి మూలకు చేరింది. ఉన్నది కూడా ఇప్పుడు మొరాయించింది. ఉదయం 10 గంటల సమయంలో ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ నమోదు చేసుకొని మూడో ఫ్లోర్లో ఉన్న వైద్యులను కలవడానికి కొందరు రోగులు, వారికి తోడుగా వచ్చిన బంధువులు లిఫ్ట్‌లో వెళ్లదలచారు. చిన్న లిఫ్ట్ కావడంతో దానిలో నలుగురు మాత్రమే పట్టే సామర్థ్యం ఉంది. కానీ ముగ్గురు రోగులతో పాటు మరో నలుగురు వారి సహాయకులు (మొత్తం ఏడుగురు) లిఫ్ట్‌లో ఎక్కేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో వారు ఎక్కిని వెంటనే లిఫ్ట్ తలుపులు మూసుకొన్నాయి. ఒక్క అడుగు పైకి లేచి లిఫ్టు అక్కడే నిలిచిపోయింది. ఆ తలుపులు తెరుచుకోలేదు. దీంతో లోపల ఉన్నవారంతా పెద్ద కేకలు పెడుతూ రక్షించడంటూ బయట ఉన్నవారిని వేడుకున్నారు. దీంతో ఆస్పత్రిలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఆస్పత్రి సిబ్బంది, రోగులు, వారి బంధువలు లిఫ్ట్ వద్దకు పారొచ్చారు. లిఫ్ట్ తలుపులు తెరవడానికి నానా హైరాన పడ్డారు. బోల్టులు విప్పినా తలుపులు తెరుచుకోలేదు. ఇనుప రాడ్లు తీసుకొచ్చి సిబ్బంది తలుపులు బద్దలుగొట్టడానికి ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. లిఫ్ట్ లోపలకు ఆక్సిజన్ మరో పక్క లోపల ఉన్నవారికి గాలి ఆడక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. అసలే చిన్న లిఫ్ట్‌లో ఏడుగురు ఉన్నారు. అప్పటికే సుమారు గంట నుంచి లోపల ఉండిపోయారు. లోపల ఉక్కపోతతో పాటు ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. వైద్యుల సలహాతో సిబ్బంది ఆక్సిజన్ సిలిండరు తీసుకొచ్చి లిఫ్ట్ లోపలకు పైపు ద్వారా పంపించారు. దీంతో లోపల ఉన్నవారికి ఊరట కలిగింది. అయినా బయటపడతామోలేదోనని కేకలు వేస్తున్నారు. కొంతసేపటికి మొదటి ఫ్లోర్‌లోకి కొందరు వెళ్లిరాడ్లు, రెంచీలు సహాయంతో పైనుంచి లిఫ్ట్ బోల్టులు విప్పి తలుపులు పక్కకు నెట్టారు. అప్పుడు గాని లోపల ఉన్నవారు బయటకు రావడానికి వీలుపడలేదు. ఈతతంగమంతా సుమారు గంటకు పైగా పట్టింది. లిఫ్ట్‌లో ఉన్నవారంతా క్షేమంగా బయటకు రాగలగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నానా హైరానాతో సిబ్బంది ప్రత్యామ్నాయ చర్యలతో వారిని క్షేమంగా బయటకు తీసుకురావడంతో అంతా అభినందించారు. అనంతరం పాడయిన ఆ లిఫ్ట్ ఎవరూ ఎక్కకుండా మూసేశారు. -
నిర్మల్ పై మనసు పెట్టమ్మా.!
సాక్షి, నిర్మల్: ఈ ప్రాంతవాసుల రవాణా సౌకర్యం మెరుగు పర్చేందుకు ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్‌లను కలుపుతూ రైల్వేలైన్ నిర్మించాలని ఉమ్మడి జిల్లాకు చెందిన అప్పటి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, అప్పటి ఎంపీ నగేశ్‌లు కేంద్రాన్ని కోరారు. మూడేళ్ల కిందట ఢిల్లీలో అప్పటి కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభును కలిశారు. ఈ రైల్వేలైన్ నిర్మాణంలో సగం వాటా భరిస్తామంటూ సీఎం కేసీఆర్ స్వయంగా ఇచ్చిన లేఖను ఆయనకు అందించారు. రాష్ట్రం సగం ఖర్చుకు ముందుకు రావడంతో కేంద్రం కూడా వెంటనే పచ్చజెండా ఊపింది. దాదాపు రూ.2,720 కోట్లతో నిర్మాణానికి ముందుకు వచ్చింది. కానీ.. ఇప్పటి వరకు రైల్వేశాఖ ఒక్కపని కూడా చేపట్టలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ(మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్) కూడా కుదుర్చుకోలేదు. రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ఏడాది క్రితం సికింద్రాబాద్, నాందేడ్‌లలో పలుమార్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో రాష్ట్ర ఎంపీలు భేటీ అయ్యారు. ఇందులో ఆర్మూర్ – నిర్మల్ –ఆదిలాబాద్ లైన్ నిర్మాణాన్నీ లేవనెత్తారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంటామని అప్పట్లో చెప్పినా.. ఇప్పటికీ ముందడుగు పడలేదు. ఎప్పటి నుంచో ఉంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అగ్రభాగాన ఉన్న ఆదిలాబాద్‌కు హైదరాబాద్ నుంచి నేరుగా రైల్వేలైన్ నిర్మించాలనే ప్రతిపాదన దశాబ్ధాల క్రితం నుంచి ఉంది. ప్రస్తుత మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడే పీవీ నర్సింహారావు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. రాష్ట్ర రాజధాని సమీపంలోని పటాన్చెరువు నుంచి ఆదిలాబాద్‌కు వయా ఆర్మూర్, నిర్మల్ మీదుగా పారిశ్రామిక–వెనుకబడిన ప్రాంతాలను కలుపుతూ రైల్వేలైన్ వేయాలని నిర్ణయించారు. 2009 రైల్వే బడ్జెట్లోనే లైన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ రహదారి వెంట ఈ లైన్ నిర్మించాలన్న ప్రతిపాదనలూ చేశారు. కొన్నేళ్లకు సర్వే కూడా పూర్తిచేశారు. తీరా.. 317 కిలోమీటర్ల దూరభారంగా ఉన్న ఈ లైన్ నిర్మాణానికి రూ.3,771కోట్లు పెట్టడం లాభదాయకం కాదేమో.. అంటూ అప్పట్లో రైల్వేశాఖ చేతులెత్తేసింది. ఆ తర్వాత ఏళ్లు గడిచిపోయాయి. ఈ లైన్నిర్మాణం మూలనపడింది. మళ్లీ రెండున్నరేళ్ల కిందట అప్పటి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, అప్పటి ఎంపీ నగేశ్‌లు పట్టుబట్టి సీఎం కేసీఆర్‌ను సగం వాటా భరించేందుకు ఒప్పించారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి అప్పటి కేంద్రం రైల్వేమంత్రి సురేశ్ప్రభుతోనూ పచ్చజెండా ఊపించారు. ఈసారి పటాన్చెరు నుంచి కాకుండా పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వేమార్గంలో ఉన్న ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు 137కి.మీ. రైల్వేలైన్ వేస్తే సరిపోతుందని తేల్చారు. కేంద్రం 2017లో పచ్చజెండా ఊపినా రైల్వేలైన్ పనులు ప్రారంభం కాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తర్వాత ఈ అంశంపై ఎలాంటి స్పందన కూడా చూపలేదు. ప్రతిసారి కేంద్ర బడ్జెట్ వచ్చినప్పుడల్లా రైల్వేలైన్ తెరపైకి వస్తూనే ఉంది. ఈఎస్ఐ కూడా.. రైల్వేలైన్‌తో పాటు జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. మూడేళ్ల కిందటే అప్పటి కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయను కలిసి విన్నవించారు. ఈ మేరకు ఆయన నిర్మల్‌లో ఈఎస్ఐ ఆస్పత్రితో పాటు భైంసాలో డిస్పెన్సరీ మంజూరు చేస్తామని చెప్పారు. అనంతరం ఈఎస్ఐ అధికారులు జిల్లా కేంద్రానికి వచ్చారు. ఇక్కడి అధికారులు స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయ భవనాన్ని చూపించారు. దానిపై ఈఎస్ఐ అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత దత్తాత్రేయ మంత్రి పదవీ నుంచి దిగిపోవడంతో ఫైల్ పెండింగ్‌లో పడింది. మళ్లీ దీనిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి కొత్తగా బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్‌ను కలిసి ఆస్పత్రి ఏర్పాటుపై వివరించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించినా ఇప్పటికీ ఈఎస్ఐ ఆస్పత్రి కోసం ముందడుగు పడలేదు. దీంతో పాటు బాసర్, భైంసాల మీదుగా బోధన్, బాన్సువాడల నుంచి సరిహద్దులో జాతీయ రహదారి నిర్మాణం పెండింగ్‌లోనే ఉంది. జిల్లాకు రావాల్సిన కేంద్రీయ విద్యాలయం ఇప్పటికీ ఊసు లేదు. ఈసారి ఆదిలాబాద్ నుంచి బీజేపీకే చెందిన ఎంపీ సోయంబాపురావు ఉండటంతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈసారైన కేంద్రం జిల్లాపై కరుణించాలని జిల్లావాసులు కోరుతున్నారు. రైల్వేలైన్ కోసం కృషి చేస్తా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు రైల్వేలైన్ నిర్మాణం విషయాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తాను. త్వరలోనే రైల్వేలైన్ నిర్మాణంపై కదలిక తీసుకువచ్చేలా, రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేయించడంపైనా కృషిచేస్తాను. దీంతో పాటు ఇతర కేంద్ర పథకాలను తీసుకువచ్చేందుకు నావంతు ప్రయత్నం చేస్తాను. – సోయం బాపురావు, ఎంపీ, ఆదిలాబాద్ -
నేనే సీనియర్ని.. ఆ సీటు నాది!
సాక్షి, అమరావతి: విజయవాడలోని కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ)లో గతంలో ఇన్చార్జి డైరెక్టర్‌గా పనిచేసిన డాక్టర్ కె.రమేష్‌కుమార్ సోమవారం హల్చల్ చేశారు. తానే సీనియర్‌నని, తనకు కోర్టు ఆర్డర్ ఉందంటూ డైరెక్టర్ కుర్చీ లాక్కుని కూర్చున్నారు. అంతేగాకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులను కార్యాలయంలో ఉంచడంతో అక్కడి సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుత డైరెక్టర్ డా.విజయకుమార్ తన సీటులోకి వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. రెండేళ్ల కిందట డా.రమేష్‌కుమార్ ఇక్కడ ఇన్చార్జి డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో మందుల కొనుగోళ్లకు సంబంధించి ఆయనపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో కేసులు నమోదై ఉన్నాయని, విజిలెన్స్ విచారణ కూడా జరుగుతోందని అధికారవర్గాలు తెలిపాయి. అనంతరం ఆయనను అక్కడి నుంచి తొలగించి తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రికి పంపారు. తాజాగా సోమవారం తనకు కోర్టు ఆర్డర్ ఉందంటూ డైరెక్టర్ సీటులో కూర్చోవడంతో ఉదయం నుంచి సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులను సంప్రదించకుండానే.. వాస్తవానికి ఎవరైనా కోర్టు ఆర్డరు తీసుకొచ్చినా దానిని ప్రభుత్వానికి పంపాలి. అక్కడ ఆ కోర్టు ఆర్డరును ఆమోదించి, సదరు వ్యక్తికి ప్రత్యేక ఆర్డర్ ఇస్తారు. ఈ ఆర్డరు తీసుకున్నాక ఆ సీటులో కూర్చోవాలి. కానీ డా.రమేష్‌కుమార్ ప్రభుత్వాన్నిగానీ, ఉన్నతాధికారులనుగానీ సంప్రదించకుండా నేరుగా వచ్చి కార్యాలయంలోని సీటును ఆక్రమించుకోవడంతో ఈ గందరగోళం నెలకొంది. దీనిపై అటు ప్రభుత్వ ఉన్నతాధికారులుగానీ, కార్మిక ముఖ్య కార్యదర్శిగానీ స్పందించకపోవడంతో వివాదం సోమవారం సాయంత్రం వరకూ కొనసాగుతూనే ఉంది. సంతకాల కోసం నా దగ్గరికే రావాలి తన విధులకు ఎవరూ అడ్డు రాకూడదని, సంతకాల కోసం తన వద్దకే రావాలని డా.రమేష్‌కుమార్ హుకుం జారీచేయడంతో సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుత డైరెక్టర్‌గా ఉన్న డా.విజయకుమార్‌ను చాంబర్లోకి కూడా రానివ్వలేదు. ఉన్నతాధికారులు తక్షణమే దీనిపై స్పందించాలని సిబ్బంది కోరుతున్నారు.