కాకినాడలో దారుణం | A Woman Was Murdered Brutally Near ESI Hospital In Kakinada | Sakshi
Sakshi News home page

కాకినాడలో దారుణం

Jan 3 2019 6:04 PM | Updated on Jan 3 2019 6:25 PM

A Woman Was Murdered Brutally  Near  ESI Hospital In Kakinada - Sakshi

గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చునని..

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రి వద్ద దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను వివస్త్రను చేసి ఘోరంగా హత్య చేశారు. మృతదేహంపై గాయాల ఆనవాళ్లు ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీంలను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఆరేళ్ల కిందట ఇదే ప్రదేశంలో ఓ యువకుడు యువతిపై అత్యాచారం చేసి ఘోరంగా హత్య చేశాడు. ఇన్నేళ్ల తర్వాత ఇదే ప్రదేశంలో మరో ఘోరం చోటుచేసుకుంది.

పీలేరులో మరో మహిళ
పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరు మండలం వరంపాటి వారిపల్లిలో మరో మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. మృతురాలు వరలక్ష్మి అనే వివాహితగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే వరలక్ష్మీ హత్యకు కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement