Kakinada: Police Launches Women Drop at Home - Sakshi
Sakshi News home page

కాకినాడ పోలీసుల కీలక ముందడుగు.. వుమెన్‌ డ్రాప్‌ ఎట్‌ హోం

Published Wed, Dec 8 2021 10:14 AM | Last Updated on Wed, Dec 8 2021 12:36 PM

Police Launches Women Drop at Home In Kakinada - Sakshi

కాకినాడ: మహిళల భద్రతే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ కీలక ముందడుగు వేసింది. ‘వుమెన్‌ డ్రాప్‌ ఎట్‌ హోం’ పేరుతో సరికొత్త సేవలకు ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు మంగళవారం శ్రీకారం చుట్టారు. ఉద్యోగినులు, విద్యార్థినులు, ఇతర మహిళలు రాత్రి వేళ గమ్యస్థానం చేరుకోవడానికి ఈ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. మహిళలపై నేరాలు రాత్రి వేళల్లో అధికంగా జరుగుతున్నాయన్న గణాంకాల నేపథ్యంలో ఈ సేవలను ప్రారంభించామన్నారు.

రోజూ రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ ఈ వాహన సేవలు అందుబాటులో ఉంటాయి. వాహనంలో పోలీస్‌ డ్రైవర్‌తో పాటు ఓ మహిళా కానిస్టేబుల్‌ ఉంటారు. వాహనం నియంత్రణ జిల్లా పోలీస్‌ కంట్రోల్‌ రూముకు అనుసంధానమై ఉంటుంది. కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఈ సేవలను నేరుగా పర్యవేక్షిస్తారు.

94949 33233 లేదా 94907 63498 నంబర్లకు ఫోన్‌ చేసి ‘వుమెన్‌ డ్రాప్‌ ఎట్‌ హోం’ వాహన సేవలను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ సేవలు కాకినాడ నగర పరిధిలో మాత్రమే అందుబాటులో ఉంటాయని, భవిష్యత్తులో జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాలకూ విస్తరించనున్నామని ఎస్పీ తెలిపారు.
(చదవండి: ప్రకాశంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement