Woman Death
-
వరకట్న వేధింపులకు యువతి బలి
అత్తాపూర్: వరకట్న వేధింపులతో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అత్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నాగన్న తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని బీదర్‌కు చెందిన స్వప్న(27)కు అత్తాపూర్ పాండురంగ నగర్‌కు చెందిన అమరే‹Ùకు రెండున్నర సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇటీవల కొద్దిరోజులుగా అమరేష్ అదనంగా కట్నం కావాలని భార్యను వేధిస్తున్నాడు. పెళ్లి సమయంలో పెట్టిన బంగారాన్ని తన అవసరాల నిమిత్తం తాకట్టు పెట్టడంతో పాటు అదనంగా డబ్బు కావాలని డిమాండ్ చేస్తూ వేధించసాగాడు. ప్రతిసారి ఇంటి నుంచి డబ్బులు తేలేక..వేధింపులు తట్టుకోలేక శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీలో ‘జీబీఎస్’ తొలి మరణం
సాక్షి,గుంటూరు:ఆంధ్రప్రదేశ్‌లో గులియన్ బారే సిండ్రోమ్(జీబీఎస్)తొలి మరణం నమోదైంది. గులియన్ బారే సిండ్రోంన వైరస్ బారిన పడిన కమలమ్మ అనే మహిళ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం(ఫిబ్రవరి16) తుది శ్వాస విడిచారు.కమలమ్మది ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లిగా అధికారులు గుర్తించారు. రెండు రోజుల క్రితం కమలమ్మ వైరస్ బారిన పడ్డారు. తీవ్ర జ్వరంతో పాటు కాళ్లు చచ్చుబడి పోవడంతో చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న మరికొందరికి గుంటూరు జీజీహెచ్‌లో డాక్టర్లు చికిత్సనందిస్తున్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన బాధితులకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. ఈ వైద్య పరీక్షల్లో బాధితులకు జీబీఎస్ సోకినట్లు గుర్తించారు. నలుగురు బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా బాధితుల్లో జీబీఎస్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు దీని గురించి ఆందోళన అవసరం లేదని డాక్టర్లు ఇప్పటికే ప్రకటించారు. -
దారుణం.. మరదలిని హత్య చేసిన బావ
కొరుక్కుపేట: కుటుంబ కలహాల కారణంగా అక్క భర్త తన మరదలిని గొంతు కోసి హత్య చేసిన ఘటన తిరువొత్తియూర్లో కలకలం రేపింది. వివరాలు.. తిరువొత్తియూర్‌లోని సెల్వ కుమార్ ఆయపిళ్‌లై గార్డెన్ ఏరియాకు చెందిన ధనలక్ష్మి ఉదయం ఇంటి ముందు ముగ్గు వేసే పనిలో ఉన్నారు. తనతో పాటు సోదరి సెల్వి కూడా ఉంది. అంతలో ధనలక్ష్మి అక్క సెల్వి భర్త కాళీముత్తు అక్కడికి వచ్చాడు. అక్కడ కుటుంబ గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో ధనలక్ష్మి, కాళీ ముత్తు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన కాళీముత్తు దాచిన కత్తితో ధనలక్ష్మి మెడపై నరికి పారిపోయాడు. ధనలక్ష్మి రక్తపుమడుగులో కుప్పకూలిపోయింది. ఈ శబ్ధం విని ఇరుగుపొరుగు వారు గుమిగూడి చూడగా ధనలక్ష్మి ప్రాణాలతో పోరాడుతూ పడి ఉండడం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మార్గమధ్యంలోనే ధనలక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై తివొత్తియూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జీవితం నచ్చలేదంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగి..
నగరంలో 18.. 28.. 29 ఏళ్ల వయసున్న ముగ్గురు యువకులు, 22 ఏళ్ల ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమ విఫలమైందని ఒకరు..ఈ జీవితం నచ్చలేదంటూ మానసిక వేదనతో మరొకరు.. పరీక్ష సరిగా రాయలేదనే భయంతో ఓ యువకుడు, అనారోగ్యం వేధిస్తోందని ఓ యువతి ఉసురు తీసుకున్నారు. క్షణికావేశం.. జీవితమంటే ఏర్పడిన భయం.. మానసిక ఒత్తిడితో బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఎంతో భవిష్యత్తు ఉన్న నలుగురు ప్రాణాలు తీసుకోవడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 1 ప్రియురాలికి వీడియో కాల్ చేసి.. ప్రేమ వ్యవహారంలో మనస్పర్థల కారణంగా ఓ యువకుడు ప్రియురాలికి వీడియో కాల్)(Video call) చేసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాములు తెలిపిన ప్రకారం.. ఒడిశాలోని గంజాం జిల్లా జిల్లుండ జరడ గ్రామానికి చెందిన ధర్మ ప్రధాన్ (29) ఇరవై రోజుల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి రాయదుర్గంలోని అపర్ణ సైట్లో క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. అక్కడే లేబర్ కాలనీలో నివాసం ఉంటూ మంగళవారం సాయంత్రం 4.55 గంటల సమయంలో ఓ యువతికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అంతకు ముందు చేతిపై కత్తితో కోసుకొని..ఆ తర్వాత వీడియో కాల్ చేసినట్లుగా ఎస్ఐ రాములు పేర్కొన్నారు. ప్రేమ వైఫల్యమే కారణమై ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు. వీడియో కాల్ అందుకున్న యువతి హైదరాబాద్‌లో మరో సైట్లో పనిచేస్తున్న తమ బంధువులకు ఫోన్‌చేసి ధర్మ ప్రదాన్ విషయాన్ని చెప్పి అప్రమత్తం చేసింది. వెంటనే వారు సైట్‌లోని లేబర్ కాలనీకి వచ్చి చూడగా యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. వెంటనే రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం మృతుడి బంధువులు రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 2 అనారోగ్య సమస్యలతో ఐటీ ఉద్యోగిని .. అనారోగ్య సమస్యలతో ఐటీ ఉద్యోగి (IT employee) ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్‌స్టేషన్(Madhapur Police Station) పరిధిలో చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ చెందిన రిటోజ బసు(22) మాదాపూర్ సిద్దిఖ్‌నగర్ జోలో స్టెర్లింగ్ కో లివింగ్ హాస్టల్లో స్నేహితునితో కలసి నివాసం ఉంటున్నారు. గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్నారు. ఆమె స్నేహితుడు కోల్‌కత్తాకు చెందిన హర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి ఒక నెలక్రితమే హాస్టల్‌కు వచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఈ లోపే అనారోగ్య సమస్యల కారణంగా ఒత్తిడికి గురైన రిటోజ బసు హాస్టల్ భవనం ఆరవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్లోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 3 జీవితం నచ్చలేదంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపిన ప్రకారం..జగిత్యాల జిల్లా బూగారం మండలం భోపాల్‌పూర్ గ్రామానికి చెందిన గంతుల కుమార్ (28) ఎంబీఏ పూర్తి చేసి గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. బీకే గూడ సంజయ్ గాం«దీనగర్ కాలనీలో గంగాధర్ అనే స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. బుధవారం ఉదయం గంగాధర్ బయటికు వెళ్లి తిరిగి 10 గంటల సమయంలో రూమ్‌కు వచ్చాడు. లోపలి నుంచి గడియ వేసి ఉండటంతో తలుపులు తట్టినా లోపల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో కిటికీలో నుంచి చూడగా కుమార్ ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి విచారణ జరిపారు. గదిలో ఓ సూసైడ్ నోట్‌ను స్వా«దీనం చేసుకున్నారు. ‘నాకు జీవితం నచ్చలేదు. నన్ను క్షమించండి’ అని నోట్ రాసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.4 పరీక్ష భయంతో సీఏ విద్యార్థిపరీక్ష సరిగా రాయలేదని ఓ సీఏ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా మాన్వి మండలం కరిటిగుడ్డ గ్రామానికి చెందిన రాజుశెట్టి కుమారుడు ఎస్.అమర్జీత్ (18) ఎస్ఆర్ నగర్ బాపూనగర్‌లోని జీవీ క్రేజీ పీజీ హాస్టల్లో ఉంటూ లక్ష్య కళాశాలలో సీఏ చదువుతున్నాడు. 2024 డిసెంబరు 22న పరీక్షలు రాసి సొంత గ్రామానికి వెళ్లాడు. పరీక్ష సరిగా రాయలేదని ఇంట్లో కుటుంబ సభ్యుల వద్ద బాధపడ్డాడు. ఫెయిల్ అవుతానేమో అని భయం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో గత జనవరి 27న మరో పరీక్ష రాయాల్సి ఉండటంతో తిరిగి నగరానికి వచ్చి హాస్టల్‌నే ఉంటున్నాడు. మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్లాల్సి ఉండగా ఆరోగ్యం బాగాలేదని రూమ్మేట్ సుబ్రమణ్యంతో చెప్పి గదిలో ఉండిపోయాడు. రాత్రి 10.30 గంటల సమయంలో సుబ్రమణ్యం వచ్చి చూడగా లోపలి నుండి లాక్ చేసి ఉంది. ఎంత పిలిచినా పలుకక పోవడంతో అనుమానం వచ్చి హాస్టల్ నిర్వాహకులకు చెప్పగా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా అమర్జీత్ ఉరి వేసుకుని కనిపించాడు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరిపారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లయిన రోజే ప్రాణాలు తీసుకుంది
సత్యవేడు: పెళ్లయిన రోజే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఆంబాకంలో కలకలం రేపింది. పోలీసుల కథనం.. తమిళనాడుకు చెందిన ధనంజయ, రతి దంపతుల కుమార్తె ఆర్తీ(20) అక్కడే ఓ ప్రయివేటు కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతోంది. సత్యవేడు మండలం ఆంబాకానికి చెందిన సమీప బంధువు సూర్య వారితో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం సూర్యకు, ఆర్తీకి వివాహం జరిపించారు. ఆ తర్వాత తిరుత్తణిలోని సుబ్రమణ్యస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి సత్యవేడు మండలంలోని ఆంబాకానికి వచ్చారు. రాత్రి దుస్తులు మార్చుకుని వస్తానని చెప్పి గదిలోకి వెళ్లిన ఆర్తీ ఎంతకీ రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా.. ఆమె ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే సత్యవేడు వైద్యశాలకు ఆమెను తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మంగళవారం పోస్టుమార్టం అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించినట్టు ఎస్ఐ రామస్వామి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ప్రేమ’ వేధింపులకు యువతి బలి
జవహర్‌నగర్: ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించడంతో తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుషాయిగూడ ఏసీపీ మహేష్‌కుమార్, జవహర్‌నగర్ సీఐ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం..దమ్మాయిగూడ పరిధిలోని న్యూ భవానీనగర్‌లో నివసించే పొనగంటి తానేష్, పద్మ దంపతుల కుమార్తె పూర్ణిమ (19) ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ ట్యూషన్లు కూడా చెబుతుంది. ఈ నెల 24వ తేదీన కళాశాలకు వెళ్లి ఇంటికి వచ్చిన పూర్ణిమ..పిల్లలకు ట్యూషన్ చెబుతూ మధ్యలో బాత్రూమ్లోకి వెళ్లి యాసిడ్ తాగి పడుకుంది. యాసిడ్ తాగానని ట్యూషన్‌కి వచ్చిన పిల్లలకు చెప్పడంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు. నిఖిల్ అనే యువకుడి వేధింపుల కారణంగానే పూరి్ణమ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు నిఖిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
నేను చనిపోతున్నా.. నా బిడ్డ జాగ్రత్త
జ్యోతినగర్(రామగుండం): ‘అమ్మా.. నాన్న.. నన్ను క్షమించండి.. ప్రేమ వివాహం చేసుకుని మీకు దూరంగా ఉన్నా.. మొదట్లో ఎంతో ప్రేమగా చూసుకున్న మా ఆయన నిత్యం వేధిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక పోతున్నా. నేను చనిపోతున్నా.. నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి’.. అంటూ సెల్ఫీ వీడియో తీసి ఒక వివాహిత బలవన్మరణానికి పాల్ప డింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద పల్లి జిల్లా ఎన్టీపీసీ ఆటోనగర్‌లో నివసిస్తున్న నరేందర్ (32), గోదావరిఖనికి చెందిన దేవర కొండ దీప్తిని 2021న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. నరేందర్, దీప్తి స్థానిక అన్నపూర్ణ కాలనీలోని ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయి తే, కట్నం తీసుకు రావాలని నరేందర్ కొంతకాలంగా దీప్తిని వేధిస్తున్నాడు. ఇదే విషయమై శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన దీప్తి.. భర్త వేధిస్తున్నందున చనిపోతున్నానని సెల్ ఫోన్లో సెల్ఫీ వీడియో తీసింది. ఉరేసుకున్న దీప్తిని గమనించిన నరేందర్ తన మిత్రుల సాయంతో ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. కాగా, తన బిడ్డను నరేందర్ చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని.. దీప్తి తండ్రి దివాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐ ప్రవీణ్, ఎస్ఐ ఉదయ్‌కిరణ్ తెలిపారు. -
ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి..
బనశంకరి: అపార్టుమెంట్లో అసోం యువతి హత్యకు గురైంది. ఈ ఘటన బెంగళూరు ఇందిరానగర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. యువతి మాయ గోగాయ్ (26) హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ అదే ప్రాంతంలో నివసిస్తోంది. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం మాయ, ప్రియుడు ఆరవ్ అర్ని ఇందిరానగరలో ఓ సర్వీసు అపార్టుమెంటులో ఫ్లాటు బుక్ చేసుకుని వెళ్లినట్లు సీసీ కెమెరాలో నమోదైంది. 24న ఆదివారం మాయ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. హత్య తర్వాత హంతకుడు సిగరెట్ తాగుతూ సోమవారమంతా మృతదేహంతోనే కాలం గడిపాడు. మంగళవారం ఉదయం క్యాబ్‌బుక్ చేసుకుని ఉడాయించాడు. తరువాత అపార్టుమెంటు సిబ్బంది శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ముక్కలు చేసి తరలించాలని ప్లాన్ చేసి ఉంటాడని, చివరకు ఆ ప్రయత్నం విరమించుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. యువతిని ఆరవ్ ఆర్నీ ఊపిరాడకుండా చేసి చాకుతో పొడిచి హత్యచేశాడు. చేతులను కూడా కసితీరా పొడిచాడు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆరవ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
రైలు ఎక్కుతుండగా జారిపడి...
కోరుట్ల: రైలు ప్రమాదంలో గాయపడిన ఓ యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. కోరుట్లలోని ప్రకాశం రోడ్‌కు చెందిన సామల్ల గణేశ్–నీరజ దంపతులు తమ కూతురు ఉదయశ్రీతో కలిసి, గత సోమవారం తిరుపతి వెళ్లేందుకు వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ రైలు ఎక్కుతుండగా ఉదయశ్రీ ప్రమాదవశాత్తు జారిపడి, తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు వెంటనే ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. ఒక్కగానొక్క కూతురి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో కోరుట్లలో విషాదం నెలకొంది. -
మహిళ దారుణ హత్య
నందికొట్కూరు: మండల పరిధిలోని నాగటూరు గ్రామ సమీపంలోని పొలంలో శుక్రవారం సాయంత్రం మహిళ దారుణ హత్యకు గురైంది. నాగటూరు గ్రామానికి చెందిన గొల్ల నరసింహులు, శిరీష (26) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా శుక్రవారం మొక్కజొన్న పొలం పనులకు వెళ్లిన శిరీషను సొంత మామ గొల్ల కురుమన్న హత్య చేసినట్లు తెలుస్తోంది. పంట కోత కోసిన చేనులో కంకులు ఏరుతున్న సమయంలో బండరాయితో తలపై మోది హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ రామాంజనేయులు, సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్, సురేష్‌బాబు, లక్ష్మీనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని నందికొట్కూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతిరాలి సోదరుడు అశోక్ ఫిర్యాదు మేరకు మామపై హత్య కేసు, భర్త నరసింహులు, అత్త మహేశ్వరి, ఆడపచులపై వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు టౌన్ సీఐ తెలిపారు. కాగా గొల్ల కురుమన్నపై 2017లో ఓ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న కురుమన్నను ఎన్కౌంటర్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తల్లి హత్యకు గురికావడంతో పిల్లలు అనాథలయ్యారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
శామీర్‌పేట్: ట్రాక్టర్ ట్రాలీని వింగర్ వ్యాన్ ఢీ కొట్టిన ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన శుక్రవారం జినోమ్‌వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తుర్కపల్లి జినోమ్‌వ్యాలీ ఫేస్ 1లోని యూనిక్యూ బయోటెక్ ఫార్మా కంపెనీకి చెందిన ఉద్యోగులు శుక్రవారం ఉదయం వ్యాన్‌లో హైదరాబాద్ నుంచి కంపెనీకి వస్తున్నారు. వారి వాహనం మజీద్‌పూర్– తుర్కపల్లి వద్ద ముందు వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీని ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీ వింగర్ వ్యాన్ లోపలికి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ముందు సీట్లో కూర్చున్న ఏవీలైన్(31), అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న జినోమ్‌వ్యాలీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.శామీర్‌పేట్: ట్రాక్టర్ ట్రాలీని వింగర్ వ్యాన్ ఢీ కొట్టిన ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన శుక్రవారం జినోమ్‌వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తుర్కపల్లి జినోమ్‌వ్యాలీ ఫేస్ 1లోని యూనిక్యూ బయోటెక్ ఫార్మా కంపెనీకి చెందిన ఉద్యోగులు శుక్రవారం ఉదయం వ్యాన్‌లో హైదరాబాద్ నుంచి కంపెనీకి వస్తున్నారు. వారి వాహనం మజీద్‌పూర్– తుర్కపల్లి వద్ద ముందు వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీని ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీ వింగర్ వ్యాన్ లోపలికి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ముందు సీట్లో కూర్చున్న ఏవీలైన్(31), అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న జినోమ్‌వ్యాలీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బెంగళూరు హార్రర్ మిస్టరీ
బనశంకరి: బెంగళూరు నగరంలోని వయ్యాలికావల్ మునేశ్వరనగరలో సంచలనం సృష్టించిన యువతిని హత్యచేసి 30 ముక్కలుగా కత్తిరించి ఫ్రిజ్‌లో కుక్కిన కేసులో హంతకుని కోసం 6 పోలీస్ బృందాలు గాలింపు ప్రారంభించాయి. అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహం ముక్కల నమూనాలను మరిన్ని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. సుమారు వారం కిందట యువతిని హత్య చేసి ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టి హంతకుడు పరారయ్యాడు. ఫ్రిజ్ ఆన్‌లో ఉండడంతో వాసన రాలేదు. కానీ అప్పుడప్పుడు కరెంటు పోయినప్పుడు ఆ భాగాల నుంచి రక్తం బయటకు కారి దుర్వాసన రాసాగింది. ఇంట్లో ఒంటరిగా ఉంటానని.. హతురాలిని మహాలక్ష్మి (29)గా గుర్తించారు. ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ఆమె గతంలో పెళ్లి చేసుకుని విడిపోయింది. సోదరుడు హుకుంసింగ్ భార్య దీపికతో కలిసి ఈ ఇంట్లో 15 రోజుల కిందటే బాడుగకు దిగారు. నేను ఒంటరిగా ఉంటానని దీపికతో గొడవపడి మరో ఇంటికి పంపించింది. తల్లి మీనారాణా అప్పుడప్పుడు ఇంటికి వచ్చి యోగక్షేమాలు తెలుసుకుని వెళ్లేది. మహాలక్ష్మి ఒక మెన్స్ బ్యూటీ పార్లర్లో పనిచేస్తూ అక్కడే పనిచేసే ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండేది తెలిసింది. కొద్దిరోజులనుంచి ఇద్దరికి విభేదాలు వచ్చాయి. రెండురోజుల క్రితం ఇంటి వద్దకు వచ్చి వెళ్లాడని స్థానికులు తెలిపారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. నలుగురిపై అనుమానం 20వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో మీ చెల్లెలి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని పై అంతస్తులో ఉండే జీవన్ప్రకాశ్ అన్న హుకుంసింగ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. అతడు తల్లికి ఫోన్ చేయగా, రాత్రి కావడంతో ఉదయం వెళ్లి చూద్దామని అనుకుంది. తరువాత శనివారం వచ్చి చూడగా ఇంటికి బయటి నుంచి తాళం వేసి ఉంది. జీవన్ప్రకాశ్ నుంచి మరో తాళం తీసుకుని ఇంట్లోకి వెళ్లి చూడగా దుస్తులు చెల్లాచెదరుగా కనిపించాయి. ఫ్రిజ్‌లో నుంచి రక్తం లీక్ అవుతుంది. లోపల మృతదేహం ముక్కలు ముక్కలుగా అంతటా నింపి ఉండడంతో భయభ్రాంతులకు గురయ్యారు. ఈ కేసులో అష్రఫ్, ముక్త, శశిధర్, సునీల్ అనే నలుగురిపై అనుమానం ఉందని మృతురాలి తల్లిదండ్రులు వయ్యాలికావల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీరందరూ మెన్స్ బ్యూటీ సెలూన్లో సహోద్యోగులు. ఉత్తరాఖండ్‌కు చెందిన అష్రఫ్తో సన్నిహితంగా ఉండేది. హార్రర్ సినిమాలో మాదిరి జరిగిన ఈ దారుణ హత్యోదంతంతో ఆ వీధిలో జనం భయాందోళనలో ఉన్నారు. హంతకుని జాడ తెలిసిందని, త్వరలోనే అరెస్ట్‌చేస్తామని పోలీసులు తెలిపారు. -
పీజీ హాస్టల్లో యువతి హత్య
బనశంకరి: మహిళా పీజీ హాస్టల్లోకి చొరబడిన ఓ దుండగుడు యువతి గొంతుకోసి హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బెంగళూరు కోరమంగల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బిహార్ కు చెందిన కృతికుమారి (24) హతురాలు. వివరాలు.. ఎంబీఏ పూర్తిచేసిన కృతి బెంగళూరుకు చేరుకుని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కోరమంగలలో వీఆర్ లేఔట్‌లోని పీజీలో ఉంటోంది. మంగళవారం ఉదయం ఆఫీసుకు వెళ్లి రాత్రి తిరిగివచ్చింది. దుండగుడు రాత్రి 11.10 నుంచి 11.30 మధ్య పీజీ యజమాని, మహిళా సెక్యూరిటీ గార్డు కళ్లు గప్పి పీజీలోకి చొరబడి మూడవ అంతస్తులోని కృతికుమారి రూమ్‌లోకి వెళ్లి చాకుతో గొంతుకోసి అక్కడ నుంచి ఉడాయించాడు.తెలిసినవారి పనేనా?కొన్ని గంటల తరువాత విషయం తెలిసి పోలీసులు చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం సెయింట్‌జాన్స్ ఆసుపత్రికి తరలించారు. తెలిసినవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అనుమానాలున్నాయి. ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. పీజీ చుట్టుపక్కల రోడ్లలో సీసీ కెమెరాల చిత్రాలను పోలీసులు సేకరించి హంతకుని కోసం గాలింపు చేపట్టారు. ఈ హత్యతో పీజీలోని యువతులు భయభ్రాంతులకు గురయ్యారు.హంతకుడెవరో తెలిసింది: డీసీపీఆగ్నేయ విభాగ డీసీపీ సారా ఫాతిమా మాట్లాడుతూ పీజీ యజమాని నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది. హంతకుని ఆచూకీ తెలిసిందని త్వరగా అరెస్ట్ చేస్తామని ఆమె తెలిపారు. -
నాసిక్‌లో హిట్ అండ్ రన్.. మహిళ మృతి
నాసిక్: ముంబయిలో బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టి మహిళ మృతి చెందిన ఘటన మరువక ముందే మరో హిట్ అండ్ రన్ ఘటన మహారాష్ట్రలో జరిగింది. నాసిక్ నగరంలోని గంగాపూర్ రోడ్డులో 36 ఏళ్ల వైశాలి షిండేను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. కారు వేగంగా ఢీకొట్టడంతో ఆమె ఏకంగా 20 మీటర్ల దూరంలో ఎగిరి పడింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. మహిళను ఢీకొట్టిన అనతరం కారు ఆగకుండా వెళ్లిపోయింది. ఈ మధ్యే ముంబయి నగరంలోని వర్లిలో దంపతులు స్కూటర్‌పై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలయింది. కారు ఢీకొట్టడమే కాకుండా మహిళను ఒకటిన్నర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లింది. ఈ కేసులో నిందితుడు, అధికార శివసేన నేత కొడుకు అయిన మిహిర్షాను మూడు రోజుల తర్వాత అరెస్టు చేశారు. అంతకుముందు ఇదే ఏడాది పుణెలో పోర్షే కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. -
యడ్యూరప్పపై కేసు పెట్టిన మహిళ మృతి
బెంగళూరు: బీజేపీ సీనియర్‌నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు పెట్టిన మహిళ మరణించింది. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించిందని సమాచారం. బెంగళూరు డాలర్‌సిటీలోని యడ్యూరప్ప ఇంటికి ఈ ఏడాది ఫిబ్రవరి2న తన కూతురుతో కలిసి వెళ్లానని, ఈ సందర్భంగా తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని మహిళ కేసు పెట్టింది. దీంతో మార్చి 14న బెంగళూరు సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో యడ్యూరప్పపై పోక్సో చట్టంలోని సెక్షన్ 8తో పాటు ఐపీసీ 354ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది.అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మహిళకు శ్వాససంబంధ సమస్య రావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించారని, చికిత్స పొందుతూ ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు. యడ్యూరప్పపై లైంగికదాడి కేసును ప్రస్తుతం కర్ణాటక సీఐడీ దర్యాప్తు చేస్తోంది. కేసు పెట్టిన యువతి తల్లి మరణించినప్పటికీ ఆమె స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతుందని సీఐడీ అధికారులు తెలిపారు. అయితే లైంగికదాడి ఆరోపణలను యడ్యూరప్ప అప్పట్లో ఖండించారు. -
అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్‌బోర్డ్ ప్రయాణం
ఖమ్మం: ఆర్టీసీ బస్సులో తలుపు వద్ద నిలుచున్న వివాహిత ప్రమాదవశాత్తు జారి వెనుక టైరు కింద పడి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కొణిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన దూరి అనూష (26) ఖమ్మంలోని డీమార్ట్‌లో పనిచేస్తోంది. శనివారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు కొణిజర్లలో ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కింది. అప్పటికే ప్రయాణికుల రద్దీ ఉండటంతో ఆమె ఫుట్‌బోర్డ్‌పై నిలబడింది. బస్సు ఎంపీడీఓ కార్యాలయం సమీపానికి రాగానే మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు బస్సు డ్రైవర్ యత్నించాడు. ఇంతలోనే ఎదురుగా ద్విచక్రవాహనం రాగా డ్రైవర్ బ్రేక్ వేయడంతో తలుపు వద్ద నిలబడిన అనూష జారి రోడ్డుపై పడింది. అప్పటికే బస్సు కదలడంతో వెనుక టైరు ఆమె పైనుంచి వెళ్లగా నడుము భాగం నుజ్జునుజ్జయి ఘటనా స్థలిలోనే మృతి చెందింది. మృతురాలికి భర్త అశోక్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం పనిచేస్తున్న ఆమె మృతి చెందిందనే సమాచారంతో కుటుంబీకులు చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. కాగా, అనూష మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శంకర్రావు తెలిపారు. -
అద్దెకివ్వడమే శాపమయ్యింది! ఏకంగా ప్రియుడితో కలిసి..
యశవంతపుర: కోనసంద్రలో ఈ నెల 10న జరిగిన దివ్య అనే మహిళ హత్య కేసును కెంగేరి పోలీసులు ఛేదించారు. ఇంటిలో అద్దెకు ఉన్న యువతి దివ్యను గొంతు పిసికి చంపేసినట్లు నిర్ధారించారు నిందితురాలిని అరెస్ట్ చేశారు. వివరాలు.. గురుమూర్తి, దివ్య దంపతులకు చెందిన ఇంటిలోని ఒక పోర్షన్లో కోలారు జిల్లాకు చెందిన మోనిక (24) అనే యువతి అద్దెకు ఉండేది. ప్రియుడినే భర్తగా చూపి ఇల్లు అద్దెకు తీసుకుంది. ప్రైవేట్ సంస్థలో డేటా ఎంట్రీ అపరేటర్‌గా పని చేస్తుంది. ప్రియుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. విలాసాలకు అలవాటు పడిన మోనిక తన ప్రియుడికి క్యాంటర్ వాహనం కొనివ్వాలని డబ్బు కోసం ప్రయత్నించింది. ఇంటి యజమాని దివ్య మెడలో ఉన్న బంగారంపై మోనికాకు కన్నుపడింది.దివ్య భర్త గురుమూర్తి కెంగేరి శివనపాళ్యంలో సెలూన్ నడుపుతుండగా, అత్తమామలు ఉదయం పనులకెళ్లి రాత్రికి వచ్చేవారు. దివ్య తన రెండేళ్ల చిన్నారితో ఇంటిలో ఉండేది. గమనించిన మోనిక.. ఈ నెల 10న ప్రియునితో కలసి దివ్యను గొంతుపిసికి హత్య చేసి ఆమె మెడలోని 36 గ్రాముల బంగారం చైన్ తీసుకొని ఉడాయించారు. పోలీసులు అనుమానంతో మోనికను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం బయట పడింది. ప్రియుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
పెళ్లి పీటలెక్కాల్సిన యువతి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): పెళ్లి పీటలెక్కాల్సిన యువతి.. సకాలంలో వరకట్నం డబ్బులు సమకూరలేదన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటనపై పోలీసుల కథనమిది. తంగళ్లపల్లికి చెందిన అత్తారి లక్ష్మి–గిరి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు శైలజ(19) సంతానం. ఏడేళ్ల క్రితమే భర్త గిరి అనారోగ్యంతో మృతి చెందాడు. ఇటీవల కూతురు శైలజకు కొడిమ్యాల మండలం దమ్మాయిపేటకు చెందిన యువకుడితో పెళ్లి సంబంధం కుదిరింది. రూ.4 లక్షలు వరకట్నం ఇచ్చేందుకు అంగీకరించారు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందకపోవడంతో తల్లి పడుతున్న కష్టాలను చూడలేక శైలజ మనోవేదనకు గురైంది. ఈక్రమంలోనే బుధవారం ఉదయం ఇంట్లో చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బిడ్డకు జన్మనిచ్చి.. తల్లి మృత్యుఒడికి
కోలారు: ప్రసవం కోసం వచ్చిన మహిళ కాన్పు తరువాత కన్నుమూసింది. దీంతో బిడ్డ తల్లి లేని అనాథ అయ్యింది. ఈ ఘటన కోలారు నగరంలోని ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే బాలింత మరణించిందని భర్త, అత్తమామలు ఆరోపిస్తున్నారు. 24 గంటలు కాకుండానే వివరాలు.. తాలూకాలోని జంగాలహళ్లి గ్రామానికి చెందిన భవాని (26) అనే గర్భిణి సోమవారం ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రిలో చేరింది. సాయంత్రం వైద్యులు సిజేరియన్ చేయగా పాప పుట్టింది. మంగళవారం ఉదయం బాలింతకు కడుపు నొప్పి రాగా నర్సు ఇంజెక్షన్ ఇచ్చింది. తరువాత కొద్దిసేపటికి భవాని మృతి చెందింది. శిశువు తలపై కూడా గాయం కనిపించింది. దీనిని బట్టి సిజేరియన్‌లో సక్రమంగా చేయలేదని భర్త ఆరోపించి ఘటనపై నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరాడు. శిశువు కళ్లు తెరవక ముందే తల్లిని కోల్పోయిందని నానమ్మ రత్నమ్మ రోదించింది. నిర్లక్ష్యం లేదు: వైద్యాధికారి జిల్లా ఆస్పత్రి సర్జన్ డాక్టర్ విజయకుమార్ ఆస్పత్రిలో ఎవరూ నిర్లక్ష్యం చేయలేదని, వారంలో 45 సిజేరియన్లు జరిగాయి, ఎక్కడా సమస్య కాలేదు. మహిళ మృతిపై విచారణ చేస్తామని తెలిపారు. -
అత్తింటి వేధింపులకు వివాహిత బలి
మైసూరు : కట్నం వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హొసకోటెలో చోటు జరిగింది. 12 సంవత్సరాల క్రితం మైసూరు తాలూకా బొమ్మనహళ్లికి చెందిన విజయలక్ష్మి(35)ని నంజనగూడు తాలూకాలోని హొసకోటెకు చెందిన హరీష్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో బంగారం కట్నంగా సమర్పించారు. అయితే అదనపు కట్నం తేవాలని భర్తతోపాటు అత్త మల్లిగమ్మ, మామ మహాదేవమూర్తి, మరిది రాఘవేంద్రలు వేధించేవారు. దీంతో పెద్దలు పంచాయితీ నిర్వహించి సర్ది చెప్పారు. అయినప్పటికీ వేధింపులు ఆపలేదు. దీంతో బిళిగెరె పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కూడా పంచాయితీ చేశారు. అయినా భర్త, అతని కుటుంబ సభ్యులు పద్దతి మార్చుకోలేదు. వేధింపులు కొనసాడంతో విజయలక్ష్మి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో బిళిగెరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
Hyderabad: ట్యాంకర్ ఢీ కొట్టి.. ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగింది
హైదరాబాద్, సాక్షి: భరత్ నగర్ ఫ్లైఓవర్ పై ఘోరం జరిగింది. వాటర్ ట్యాంక్ ఢీ కొట్టడంతో స్కూటీపై వెళ్తున్న ఓ యువతి కింద పడిపోయింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు ఆమె నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని సునీతగా పోలీసులు ధృవీకరించారు. సునీత స్వస్థలం కర్నూల్ శ్రీశైలం. నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. గురువారం ఉదయం కూకట్ పల్లి నుంచి ఎర్రగడ్డ వైపు వెళ్తుండగా.. ఓ వాటర్ ట్యాంక్ దూసుకొచ్చింది. వెనుక నుంచి ఆమె వెళ్తున్న స్కూటీని ఢీ కొట్టింది. దీంతో ఆమె కిందపడిపోయింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగి అక్కడిక్కడే ఆమె మృతి చెందింది. యాక్సిడెంట్‌ను చూసేందుకు అటుగా వెళ్లే వాహనదారులు ఆగిపోవడంతో.. ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
యువతి దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని చంద్రపూర్‌లో మా గృహం వెనుక ఓ యువతి దారుణ హత్యకు గురయ్యింది. పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని పొలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు మా గృహంలో మేనేజర్‌గా పనిచేస్తున్న లక్ష్మీ మాఝి(23)గా గుర్తించారు. జిల్లాలోని కాసీపూర్ సమితి నకిటిగుడ గ్రామానికి చెందిన ఈమె ఐదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం మా గృహం వెనుక కాలిపోయిన యువతి మృతదేహాన్ని గుర్తించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పొలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పొస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియలేదు. పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి తండ్రి బాలేదార్ మాఝి తన కుమార్తెను దారుణంగా తగులబెట్టి హత్య చేశారని పొలీసులకు ఇచ్చిన ఫిర్యాదులొ పేర్కొన్నారు. -
ఆటోలోంచి కిందపడి యువతి మృతి
చింతలమానెపల్లి(సిర్పూర్): పత్తి ఏరేందుకు వెళ్తూ ప్రమాదవశాత్తు యువతి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బాలాజీ అనుకోడ గ్రామ పంచాయతీ పరిధిలోని పాల్వాయినగర్కు చెందిన దుర్గం అఖిల(18) బుధవారం గంగాపూర్ శివారులోని పత్తి చేనులో పత్తి ఏరడానికి ట్రాలీ ఆటోలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడింది. అపస్మారస్థితిలోకి వెళ్లడంతో వెంటనే కౌటాల ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదని, వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. -
మహిళ దారుణ హత్య.. వాట్సాప్ ఫోటోల ద్వారా మృతదేహం గుర్తింపు
రామగిరి(నల్లగొండ): ఓ మహిళను దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని దుండగులు. ఈ సంఘటన తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలంలోని వెలుగుపల్లి గ్రామానికి చెందిన వల్లందాసు ఈదయ్య కూమార్తె మంజుల(34)కు ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన రవికుమార్‌తో వివాహం జరిగింది. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. మంజులకు ఆమె భర్తతో 7సంవత్సరాలుగా గొడవలు జరుగుతుండడంతో తల్లిగారి ఊరైన వెలుగుపల్లిలో ఉంటుంది. అయితే మంజుల రెండు నెలలుగా నల్లగొండలోని మెడికల్ కళాశాలలో వంటపని చేస్తోంది. బుధవారం మంజుల సోదరుడు బైక్‌పై ఆమెను నల్లగొండలో డ్యూటీ వద్ద వదలివెళ్లాడు. గురువారం ఉదయం అనిశెట్టి దుప్పలపల్లి నుంచి బసిరెడ్డిపల్లికి వెళ్లే దారిలో మంజుల గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో దారుణంగా హత్యకు గురైంది. ఉదయం ఈ ఘటనను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు శాలిగౌరారం సీఐ రాఘవరావు, ఎస్సై ఎన్.ధర్మా హత్య జరిగిన చోటుకు చేరుకుని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. మంజుల మెడకు చున్నీ బిగ్గరగా చుట్టి తలపై కొట్టడంతో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో లంచ్ బాక్సు, చెప్పులతో పాటు హత్యకు ఉపయోగించిన ఆటో జాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెడ్‌బాడీ ఆచూకీ తెలియకపోవడంతో అనిశెట్టి దుప్పలపల్లి సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వాట్సాప్ ద్వారా మృతదేహం గుర్తింపు.. హత్య జరిగిన వివరాలను, డెడ్‌బాడీ ఫొటోలను పోలీసులు చుట్టు పక్కల ఉన్న గ్రామాల వారి వాట్సాప్ గ్రూప్‌లకు పంపించారు. మధ్యాహ్నం వరకు కూడా వివరాలు తెలియలేదు. వెలుగుపల్లికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో ఫొటోలు రావడంతో మంజుల సోదరుడు ఆమె వేసుకున్న దుస్తుల ను గుర్తించి వెంటనే పోలీసులను సంప్రదించాడు. మిస్టరీగా మిగిలిన హత్య.. మంజుల హత్య మిస్టరీగా మిగిలింది. సంఘటన స్థలంలో హత్యకు ఉపయోగించిన ఆటో జాకీ తప్ప పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అదే విధంగా మంజుల ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. హత్య జరగడానికి ముందు మంజుల ఎవరితో మాట్లాడింది అనే ఫోన్ సంభాషణ వివరాలను తీసేపనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఫోన్ సంభాషణ బయటకు వస్తే కేసు వీడనుంది. -
జీవితం మీద విరక్తితో.. వివాహిత తీవ్ర నిర్ణయం..!
పాన్‌గల్: అనారోగ్యం కారణంతో మనస్తాపం చెంది ఓ వివాహిత ఉరేసుకుని మృతిచెందిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ వేణు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కేతేపల్లికి చెందిన కాకం కాశమ్మ(38) కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో కూలి పనలు చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ నుంచి మంగళవారం సొంత గ్రామానికి చేరుకుంది. మనస్తాపంతో బుధవారం తెల్లవారుజామున ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, అనారోగ్యంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com పాము కాటుతో మహిళ మృతి నర్వ: పాము కాటుకు గురై మహిళ మృతిచెందిన సంఘటన నర్వ మండలం పెద్దకడ్మూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దకడ్మూర్కి చెందిన ఎల్లంపల్లి కుర్వ అక్కెమ్మ(45) తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లింది. అక్కడ మోకాలి వద్ద పాము కాటు వేయడంతో భయంతో ఇంటికి వచ్చింది. చుట్టుపక్కల వారు వెంటనే ఆమెను మక్తల్ మండలం గుడిగండ్ల వద్ద నాటువైద్యానికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ పరిస్థితి విషమించడంతో నర్వ పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. ఇక్కడి వైద్య సిబ్బంది మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రైవేటు వాహనంలో తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్తతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇది చదవండి: ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై హత్యాయత్నం.. దాడిచేసింది వారే..! -
వివాహిత దారుణ హత్య.. పోలీసుల అదుపులో భర్త!
పశ్చిమ గోదావరి: పెనుగొండ శివారు అడ్డపుంత బోదే వద్ద వివాహిత హత్యకు గురైంది. హత్యచేసి పంటబోదేలో పాడేసి హంతుకులు పరారయ్యారు. వివరాల్లోకి వెళితే మంగళవారం ఉదయం అడ్డపుంతలో గుత్తుల చిన సత్యనారాయణ కౌలు చేస్తున్న పంట బోదేలో ఓ మహిళ మృతదేహం ఉందని గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. 25 ఏళ్లు వయస్సు ఉంటుందని భావించిన మహిళ శవం బోర్లా పడి పంటబోదేలో తేలుతూ ఉండడంతో సంచలనంగా మారింది. మహిళ వీపుపైనా, ఎడమ భుజంపైనా, చాతిపైన పదునైన ఆయుధంతో పొడిచిన గాయాలు ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ కె.రవిమనోహరచారి, సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఎస్సై ఎస్‌ఎన్‌వీవీ రమేష్ పరిశీలించి, వీఆర్వో ప్రసాద్ ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని మహిళ మృతదేహంగా కేసు నమోదు చేశారు. ఎస్పీ యు.రవిప్రకాష్ హుటాహుటిన పెనుగొండ చేరుకుని సంఘటన ప్రాంతాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. అయితే సాయంత్రానికి మృతురాలు చివటం నందినిగా గుర్తించారు. పోలీసుల అదుపులో ఆమె భర్త చివటం రాంప్రసాద్ ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. దొంగరావిపాలెంకు చెందిన పితాని నందినిను చివటం రాంప్రసాద్ 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యపై అనుమానంతోనే హత్య చేసి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. వీరికి 18 నెలలు కుమారుడు సైతం ఉన్నాడు. చివటం రాంప్రసాద్ హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
అలల తాకిడికి గురై హైదరాబాద్ యువతి మృతి
చీరాల టౌన్: అంతవరకు కుటుంబసభ్యులతో కలి సి సరదాగా అలలతో సంతోషంగా ఆడుకుంది. బహుషా ఆ సంతోషాన్ని తట్టుకోలేక అలలు యువతిని తనలోకి లాగేసుకొని ప్రాణాలు తీశాయి. కుటుంబ సభ్యులతో వాడరేవు సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు వచ్చిన కుటుంబంలో విహారం విషాదాన్ని నింపింది. చీరాల రూరల్ ఈపురుపాలెం ఎస్ఐ పి.జనార్దన్ వివరాల మేరకు.. దసరా సెలవుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నాంపల్లికి చెందిన సమియా (24) కుటుంబ సభ్యులు నలుగురితో ఆదివారం ఉదయాన్నే వాడరేవుకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి తీరంలో సముద్రంలో స్నానం చేస్తుండగా సమియా ఒక్కసారిగా అలల తాకిడికి గురైంది. సమీపంలోని మత్య్సకారులు, తోటి పర్యాటకులు అలల తాకిడికి గురై సముద్రంలో కొట్టుకుపోతున్న సమియాను రక్షించి హుటాహుటిన చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. తీవ్ర అపస్మారక స్థితిలోకి వెళ్లిన సమియా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. సరదాగా తీరంలో గడిపేందుకు వచ్చిన ఓ కుటుంబంలో సముద్రం తీవ్ర విషాదాన్ని నింపింది. చేతికి అందివచ్చిన తమ కుమార్తె అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని చీరాల ఏరియా వైద్యశాలలో మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ జనార్దన్ తెలిపారు. -
ఇంజక్షన్ వికటించి వివాహిత మృతి
వరంగల్: మండల కేంద్రానికి చెందిన శ్యామల స్వాతి(23) ఇంజక్షన్ వికటించి మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రెండు రోజుల నుంచి జ్వరం వస్తుండడంతో స్వాతి చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ స్రవంతి నర్సింగ్ హోమ్‌లో చేరింది. దీంతో ఆమె రక్తాన్ని టెస్ట్ చేయగా మలేరియా, డెంగీ నెగెటివ్ వచ్చాయి. అయితే ప్లేట్స్ లెట్స్, బీపీ తక్కువగా ఉండడంతో సాయంత్రం వైద్యుడు వరప్రసాద్ చికిత్స నిర్వహించారు. బీపీ అదుపులోకి రావడానికి ఇంజక్షన్ ఇవ్వగా ఆమె మృతి చెందింది. ఈ విషయంపై మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు వరప్రసాద్‌ను నిలదీశారు. ఇంజక్షన్ చేసిన తర్వాతే స్వాతికి మాట రాలేదనని, పిచ్చిగా అరిచిందని తెలిపారు. వరంగల్ తీసుకెళ్తుంటే మృతి చెందిందని ఆరోపించారు. ఈ విషయంపై డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఒక్కొకసారి రిపోర్ట్‌లో నెగెటివ్ వచ్చినా పరిస్థితి విషమిస్తుందన్నారు. బీపీ తక్కువగా ఉండడం వల్ల ఇంజక్షన్ చేసి వరంగల్‌కు తీసుకెళ్లాలని చెప్పానన్నారు. స్వామి మృతి విషయంలో తన నిర్లక్ష్య ఏమీ లేదన్నారు. ఈ విషయంపై డీఎంహెచ్ఓ అప్పయ్యను వివరణ కోరగా బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మృతురాలికి భర్త కార్తీక్, కూతురు ఉంది. -
జీవితంపై విరక్తితో.. మహిళ తీవ్రనిర్ణయం..!
మంచిర్యాల: జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజవర్థన్ వివరాల ప్రకారం.. మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన దామరకొండ శంకరమ్మ (50) భర్త పర్వతాలు సంవత్సరం క్రితం మరణించాడు. అప్పటి నుంచి ఆమె నర్సింగాపూర్‌లోని స్వంత ఇంటి వద్ద ఒంటరిగా ఉంటుంది. భర్త లేకపోవడంతో పాటు ఉన్న ముగ్గురు కుమారులు దగ్గర లేకపోవడంతో మానసికంగా కృంగిపోయింది. బుధవారం సాయంత్రం ఇంట్లోని పురుగుల మందు తాగి పడిపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపాడు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కూతురు బతుకు ఆగమైందని..
నల్గొండ: కూతురు బతుకు ఆగమైందని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నకిరేకల్‌లోని కాటమయ్య బజారుకు చెందిన దొమ్మాటి రామలక్ష్మయ్య రిటైర్డ్ టీచర్. ఇతడి భార్య మంగమ్మ అలియాస్ మమత (48) వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెల వివాహం జరిగినప్పటికీ పెద్ద కూతురు ఉషారాణి నాలుగేళ్ల క్రితం విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. చిన్న వయసులోనే కూతురుకు విడాకులు తీసుకోవడంతో తల్లి మంగమ్మ మానసికంగా కుంగిపోయి ఈనెల 29న శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. అపస్మారస్థితిలో పడి ఉన్న ఆమెను పక్కింట్లో ఉంటున్న సోదరుడు జనార్దన్ చూసి తొలుత స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి నల్లగొండ, హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఆమెను సోమవారం నకిరేకల్‌కు తీసుకువచ్చారు. ఇంటికి వద్దకు వచ్చిన తరువాత మరోసారి మమత అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మంగమ్మ మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతురాలి భర్త రామలక్ష్మయ్య ఫిర్యాదు మేరకు సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సుధీర్‌కుమార్ తెలిపారు. కాగా, మంగమ్మ మృతదేహానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీపీసీసీ నేత దైద రవీందర్ నివాళులర్పించి సంతాపం తెలపారు. -
షాపింగ్ కోసం షార్ట్‌కట్ రూట్.. ట్రాక్టర్ సడన్ బ్రేక్ వేయడంతో
శ్రీకాకుళం రూరల్ : మండల పరిధిలోని తండేవలస ఆర్టీవో కార్యాలయం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.ఇందుమతి (18) అనే యువతి మృతిచెందింది. రూరల్ ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. సరుబుజ్జిలి మండలం రొట్టవలసకు చెందిన ఇందుమతి ఇటీవలే డిప్లమో పూర్తిచేసింది. తండ్రితో కలిసి శ్రీకాకుళంలో షాపింగ్ చేసేందుకు ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయల్దేరారు. షార్ట్‌కట్ రూట్లో తండేవలస నుంచి శ్రీకాకుళం వస్తుండగా ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్ సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి ఢీకొట్టారు. దీంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ హత్య కేసులో ఐదుగురు అరెస్టు
అనకాపల్లి :మండలంలోని వనుగుపల్లి పంచాయతీ తియ్యగెడ్డ గ్రామంలో హత్యకు గురైన మహిళ కేసును పోలీసులు మూడు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. ఈ సంఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పాడేరు సీఐ సుధాకర్ తెలిపారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జి.మాడుగుల మండలం కొరాపల్లి గ్రామానికి చెందిన కొర్రాబు బోడకొండమ్మ అలియాస్ గాయత్రిని అదే పంచాయతీ రూడిబయలు గ్రామానికి చెందిన పాంగి గణపతి అనే వ్యక్తి మూడో భార్యగా పెళ్లి చేసుకునేందుకు పాడేరు మండలం తియగెడ్డ గ్రామంలో తన పిన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. బోడకొండమ్మ అనారోగ్యంతో మృత్యువాత పడిందని దహన సంస్కారాలు పూర్తి చేశామని బోడకొండమ్మ తండ్రి కొరాబు త్రిమూర్తికి గణపతి తెలిపాడు. దీంతో అనుమానం వచ్చిన త్రిమూర్తి ఈ నెల 18న పాడేరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎస్ఐ లక్ష్మణరావు ఈ నెల 19న తియగెడ్డ గ్రామానికి వెళ్లి మృతదేహాన్ని పాతి పెట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పాతి పెట్టిన చోట పైన కట్టెలతో కల్చినట్టు గుర్తించిన ఎస్ఐ లక్ష్మణరావు విషయాన్ని సీఐ సుధాకర్‌కు నివేదించారు. సీఐ సుధాకర్ పాడేరు తహసీల్దార్‌ను వెంటపెట్టుకొని సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలి మెడ చుట్టూ ఉరి వేసిన గుర్తులు ఉండడాన్ని చూసి హత్య కేసుగా నమోదు చేశారు. కేసు ధర్యాప్తులో భాగంగా పలు విషయాలు వెలుగు చూసాయి. మొదటి నిందితుడు పాంగి గణపతికి గతంలోనే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మృతురాలిని మూడో భార్యగా చేసుకుంటానని చెప్పి ఒంగోలులో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ ఆమెతో సహజీవనం చేశాడు. మృతురాలు గణపతిని తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకువెళ్లమని చెప్పడంతో ఈ నెల 14న తియగెడ్డ గ్రామంలో గల తన పిన్ని ఇంటికి తీసుకువచ్చాడు. అక్కడ కూడా ఉండడానికి ఇష్టపడని బోడకొండమ్మ తాను కొరాపల్లిలో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తానని చెప్పింది. అయితే ఆమె ఎక్కడికీ వెళ్లడానికి వీలు లేదని, తనతో ఉండకపోతే చంపేస్తానని గణపతి బెదిరించాడు. అతని మాట వినని బోడకొండమ్మ ఈ నెల 16న ఉదయం 7గంటలకు కొరాపల్లి గ్రామానికి వెళ్లేందుకు సిద్ధపడుతూ ఉండగా ఆమెను చున్నీతో మెడ చుట్టూ గట్టిగా లాగి హత్య చేశాడు. అనంతరం విషయాని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారి సహకారంతో మృతదేహాన్ని గ్రామ శివారులో పాతి పెట్టి సాక్షాలు లేకుండా ప్రయత్నం చేశాడు. ఈ సంఘటనలో జి.మాడుగుల మండలం కొరాపల్లి పంచాయతీ రూడిబయలు గ్రామానికి చెందిన పాంగి గణపతి, అతనికి సహకరించిన అదే గ్రామానికి చెందిన పాంగి శోభన్, పాంగి మహేష్‌బాబు, పాంగి లక్ష్మమ్మ, పాంగి భారతిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
భర్త తన మాట వినడం లేదని ఆత్మహత్య
బాల్కొండ: భర్త తన మాట వినడం లేదని మనస్తాపం చెంది భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముప్కాల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై భాస్కరచారి తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన పన్నీరు రేవతి(37), కిషన్ దంపతులు. సోమవారం కిషన్ తన చెల్లికి రూ.2వేలు పంపడంతో, భర్తతో భార్య గొడవ పడింది. భర్త తన మాట వినకుండ డబ్బులు పంపుతున్నాడని ఆమె మనస్తాపం చెందింది. ఈక్రమంలో మంగళవారం ఉదయం భర్త కిషన్, చిన్నకుమారుడు అభినవ్ వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఉ న్న పెద్ద కుమారుడు అభినయ్ నిద్రలేచి చూసేసరికి తల్లి ఉరి వేసుకుంది. అతడు తన బాబాయ్ సహయంతో తల్లిని కిందకు దించి వెంటనే బాల్కొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు సూచించడంతో పెర్కిట్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి కమ్మం ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఒంటరితనం భరించలేక యువకుడు.. బిచ్కుంద(జుక్కల్): మండలంలోని ఓ రైస్‌మిల్లులో లేబర్‌గా పని చేస్తున్న ఓ యువకుడు ఒంటరితనం భరించలే క ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శ్రీధర్‌రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. మండంలోని గోపన్‌పల్లి గ్రామంలోని వెంకటసాయి రైస్‌మిల్లులో గత కొంతకాలంగా బీహార్‌కు చెందిన యువకుడు సరోజ్ కుమార్ (20) లేబర్‌గా పనిచేస్తుండేవాడు. గత కొన్ని రోజుల నుంచి అతను ఇంటికి దూరంగా ఉన్నానని బాధపడుతూ, తరచూ బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక అమ్మాయితో ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి రైస్‌మిల్‌లో లేబర్లందరూ భోజనం ముగించుకుని నిద్రిస్తున్న సమయంలో సరోజ్ కుమార్ ఒక తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటరితనంతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి అన్న దిలీప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఒకరు.. గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏఎస్సై గంగారాం తెలిపిన వివరాలు ఇలా.. మండలకేంద్రంలోని దుర్గా నగర్‌కు చెందిన దర్బ స్తు శ్రీనివాస్(38) వారంరోజుల పాటు భార్య, పి ల్లలతో కలిసి అత్తవారింటికి వెళ్లాడు. మూడు రోజుల క్రితం భార్య పిల్లలను అక్కడే ఉంచి ఒక్కడే గాంధారికి తిరిగి వాచ్చాడు. సోమవారం రాత్రి ఆర్థి క ఇబ్బందులు కారణంగా సొంతింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం కాలనీ వాసులు గమనించి బంధువులకు సమాచారం ఇ చ్చారు. మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. కాగా మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. పరీక్షలు సరిగా రాయలేదని విద్యార్థి.. ఖలీల్‌వాడి: డిగ్రీ పరీక్షలు సరిగా రాయలేదని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలో మంగళవారం చోటుచేసుకుంది. మూడో టౌన్ ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. నగరంలోని పంబోలి కాలనీకి చెందిన మహేష్(20) ఓ ప్రయివేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. ఈక్రమంలో ఇటీవల నిర్వహించిన పరీక్షలను మహేష్ సరిగా రాయలేదు. దీంతో మంగళవారం అతడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈమేరకు మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రాణం తీసిన బంగారం గొలుసు
(సంగారెడ్డి): అగ్నిసాక్షిగా పెళ్లి జరిగి నెలరోజులే అయ్యింది. చిన్న బంగారం గొలుసు పోయిందని భర్త పంచాయితీతో ఆమె మనోవేదనకు గురైంది. ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ రేకుల ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... సదాశివ పేట మండలం రేండ్లపల్లి గ్రామానికి చెందిన కొలుకూరి లక్ష్మి కూతురు అఖిల (19) వివాహం హత్నూర మండలం పన్యాల గ్రామానికి చెందిన నీరుడి భాగయ్యతో గత నెల ఏడో తేదీన జరిగింది. నాలుగు రోజుల క్రితం ఇస్రాలాబాద్ గ్రామంలో బంధువుల ఇంటికి అఖిల వెళ్లింది. భర్త భాగయ్య బంగారు గొలుసు కనిపించడం లేదని భార్య అఖిలకు ఫోన్ చేశారు. తాను తీసుకెళ్లలేదని బదులిచ్చింది. దీంతో అఖిలను బంధువుల ఇంటి భర్త భాగయ్య బుధవారం పన్యాలకు తీసుకొచ్చాడు. అత్తింటివారు మందలించారో తెలియదుగానీ గురువారం సాయంత్రం అత్తగారింట్లో అఖిల మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీంతో భర్త భాగయ్య, కుటుంబీకులు మృతదేహాన్ని మంచంపై పండబెట్టారని గ్రామస్తులు తెలిపారు. ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే హత్య చేశారో తెలియదు. విషయం తెలుసుకున్న జిన్నారం సీఐ వేణుకుమార్, ఎస్ఐ లక్ష్మారెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పన్యాల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బంగారం కోసమే తన కూతురిని హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. భర్త వేధింపులతోనే ఆత్మహత్య: ఎస్ఐ బంగారం గొలుసు తీశావని భర్త వేధింపులతోనే అఖిల ఆత్మహత్య చేసుకుందని ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. భర్త వేధించడం వల్ల అవమానం భరించలేక అఖిల ఆత్మహత్య చేసుకున్నట్టు రాసిన సూసైడ్ నోట్ కూడా దొరికిందని ఎస్ఐ తెలిపారు. మతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు..
బోయినపల్లి(చొప్పదండి): పదోతరగతిలో మంచి జీపీఏతో పాసైన ఓ విద్యార్థిని సెల్‌ఫోన్ వాడొద్దని మందలించడంతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బోయినపల్లి మండలం విలాసాగర్లో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. విలాసాగర్‌కు చెందిన శేఖర్–లావణ్య దంపతుల కూతురు పోలె శరణ్య (16), ఇటీవలే పదోతరగతిలో 8.3 జీపీఏతో పాసైంది. శనివారం సెల్‌ఫోన్ చూస్తుండగా శరణ్యను తండ్రి మందలించడంతో రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే పడుకుంది. తెల్లారి చూసేసరికి శరణ్య కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో వెతుకుతుండగా సాయంత్రం ఓ బావిలో శరణ్య శవమై కనిపించింది. సెల్‌ఫోన్ వాడొద్దని మందలించినందుకు మనస్థాపం చెందిన శరణ్య మర్లపేట నుంచి విలాసాగర్ వెళ్లే దారిలోని ఓ వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణం చెందినట్లు తండ్రి శేఖర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ పేర్కొన్నారు. -
ఎస్ఐ భార్య అనుమానాస్పద మృతి.. అక్క కూతురిని పెళ్లి చేసుకోవాలని
కర్ణాటక: సబ్ ఇన్స్పెక్టర్ భార్య అనుమానస్పద స్థితిలో ఉరి వేసుకొని శవమైన సంఘటన బెంగళూరు దక్షిణ నియోజకవర్గం బేగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పటేల్ లేఔట్లో జరిగింది. మృతురాలు ఎస్ఐ రమేష్ భార్య శిల్ప (33). వివరాలు.. కాలేజీలో చదివే రోజుల్లో రమేష్, శిల్పా ఇద్దరూ ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. తరువాత రమేష్‌కు ఎస్ఐ ఉద్యోగం వచ్చింది, కొన్నాళ్లకు ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. కానీ కొద్దిరోజులకే కాపురంలో కలతలు వచ్చాయి. శిల్పను కులం పేరుతో వేధించినట్లు, రోజూ గొడవపడేవారని ఆరోపణలు వచ్చాయి. దాంతో శిల్ప భర్త రమేష్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టడంతో పోలీసులు పెద్దల సమక్షంలో ఇద్దరికీ రాజీ పంచాయతీ చేసి పంపించారు. అక్క కూతురిని పెళ్లి చేసుకోవాలని ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంట్లో శిల్ప ఉరికి వేలాడింది. శిల్పను ఎలాగైనా వదిలించుకోవాలని హత్య చేసి ఇది ఆత్మహత్యగా చెబుతున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇద్దరూ ప్రేమించుకుని సహజీవనం చేశారని, పెళ్లి చేసుకోమంటే రమేష్ ఒప్పుకోలేదని తెలిపారు. కానీ ఆమె ఫిర్యాదు చేస్తే ఉద్యోగం పోతుందనే భయంతో రిజిస్టర్ పెళ్లి చేసుకుని, వేధింపులకు దిగాడని చెప్పారు. ఆమెకు ఖర్చులకు, ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చేవాడు కాదని, తామే పుట్టింటి నుంచి పంపేవారమని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. రమేష్ ఆస్తి కోసం అక్క కుమార్తెను పెళ్ళి చేసుకోవాలనుకున్నాడని, అందుకే శిల్పను అంతమొందించాడని విలపించారు. బేగూరు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టగా రమేష్ పరారీలో ఉన్నాడు. -
ఏం జరిగిందో పాపం..! అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం
లక్కవరపుకోట: మండలంలోని గోల్డ్‌స్టార్ జంక్షన్ నుంచి గేదులవానిపాలెం గ్రామం వెళ్లే రహదారిలో జమ్మాదేవిపేట సమీపంలో గల సరస్వతి లేఆవుట్ వద్ద కళ్లేపల్లి గ్రామానికి చెందిన వెలుగులో బుక్ కీపర్ గోకేడ ఉమామహేశ్వరి(29) అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. గురువారం వెలుగుచూసిన ఈ విషయం తెలుసుకున్న మండల వాసులు ఒక్కసారిగా ఉల్కిపడ్డారు. స్థానికులు, ఎస్సై ముకుందరావు తెలియజేసిన మేరకు వివరాలిలా ఉన్నాయి. సరస్వతి లేఅవుట్ సమీపంలో చిలకావాని చెరువులో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారు. వారిలో ఒక కూలీ సేద తీరేందుకు పక్కనే గల గట్టువద్దకు వచ్చి నిలబడి సమీపంలో మృతదేహాన్ని గుర్తించి తోటి కూలీలకు తెలిపాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి డీఎస్సీ ఆర్.గోవిందరావు, ఎస్సై ముకుందరావులు సిబ్బందితో చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహం ఫొటోను వాట్సాప్ గ్రూప్‌లో సెండ్ చేయుగా కళ్లేపల్లి గ్రామానికి చెందిన గోకేడ ఉమామహేశ్వరిగా కొంతమంది గుర్తించారు. వెంటనే మృతురాలి కుటుంబసభ్యులకు విషయం చేరవేయగా వారు ఘటనా స్థలానికి చేరుకుని ఉమామహేశ్వరిగా గుర్తించారు. ఇదిలా ఉండగా విజయనగరం జిల్లా కేంద్రంలో వెలుగు ఆధ్వర్యంలో సమావేశం ఉందని ఉమామహేశ్వరి బుధవారం ఉదయం 9 గంటలకే ఇంటి నుంచి బయల్దేరి వెళ్లింది. రాత్రికి ఇంటికి రాకపోవడంతో ఆరా తీయగా ఆమె సమావేశానికి హాజరుకాలేదని అధికారులు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమైన తరువాత ఆమెను ఎక్కడో చంపేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసి ఉంటారని పోలీసులు భావించారు. క్లూస్ టీమ్, డాగ్స్వాడ్లు వచ్ఛి పరిసర ప్రాంతాల్లో పరిశీలించినప్పటికీ ఎటవంటి ఆధారాలు లభించేలేదు. మృతురాలి భర్త నాయుడు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. బిక్కుబిక్కుమంటూ ఇద్దరు పిల్లలు కాగా మృతురాలికి నవనీత్ (13),సాద్విక్ (12) ఇద్దరు మగ పిల్లలు కలరు. మా అమ్మ విజయనగరం మీటింగ్‌కు వెళ్లింది తిరిగి వస్తుందని చెప్పడంతో అక్కడ ఉన్న వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ ఈ తరహా ఘటనలు జరగకపోవడంతో మండలవాసులు భయభ్రాంతులకు లోనయ్యారు. పోలీసులు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. విజయనగరం ఫోర్ట్: విద్యుత్ షాక్‌తో ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. నగరంలోని కేఎల్‌పురంలో ఓ ఇంటికి విద్యుత్ సరఫరా వచ్చి పోతుండడంతో యాజమాని పక్క వీధిలో ఉన్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ టెక్కలి అప్పలరాజు (40)ను తీసుకొచ్చాడు. అక్కడ మూడు విద్యుత్ ట్రాన్సఫార్మర్లు ఉండగా ఆపాల్సిన ట్రాన్సఫార్మర్ కాకుండా వేరే ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ సరఫరా నిలిపివేసి విద్యుత్ పోల్ ఎక్కడంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించగా షాక్‌కు గురై కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. వెంటనే గృహ యజమాని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం కేజీహెచ్‌కు తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. విద్యుత్ పోల్ ఎక్కిన ఎలక్ట్రీషియన్ విద్యుత్‌శాఖకు సంబంధించిన వ్యక్తి కాదని ఎస్ఈ నాగేశ్వరావు తెలిపారు. అనధికారిగా విద్యుత్ పోల్ ఎక్కితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ సమస్యల నివారణ కోసం 1912 ట్రోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. గుర్తు తెలియని యువకుడు.. గజపతినగరం: గజపతినగరం రైల్వే స్టేషన్ యార్డులో గుర్తు తెలియని యువకుడు(23)మృతి చెందాడు. ఈ ఘటనపై విజయనగరం రైల్వే ఎస్సై వి.రవివర్మ మాట్లాడుతూ అనారోగ్యం వల్ల గానీ, వడదెబ్బ వల్ల గాని మృతి చెంది ఉండవచ్చన్నారు. మృతుడి శరీరంపై ఎటువంటి గాయాలు లేవని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. బొబ్బిలి: గరుగుబిల్లి మండలం నాగూరుకు చెందిన అక్కేన తవిటినాయుడు(53) ఈనెల 9న తెర్లాం మండలం నందబలగ వెళ్లి వస్తుండగా కారాడ వద్ద కోళ్లవ్యాన్ ఢీకొనడంతో ప్రమాదానికి గురయ్యాడు. ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్టు ఎస్సై చదలవాడ సత్యనారాయణ తెలిపారు. -
ప్రియుడు మృతిచెందాడని.. పనిచేస్తున్న ఇంట్లోనే..
గద్వాల క్రైం: తను ప్రేమించిన యువకుడు మృతిచెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గద్వాలలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ రామస్వామి కథనం మేరకు.. పట్టణంలోని గంటవీధికి చెందిన బోయ రామేశ్వరి (22) డిగ్రీ పూర్తి చేసింది. చదువుకొనే రోజుల్లో కర్నూలుకు చెందిన జయంత్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే కుటుంబ సమస్యల కారణంగా జయంత్ ఈ నెల 14న ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి రెండ్రోజుల క్రితం స్నేహితురాలైన సంగీతతో కలిసి ప్రియుడి అంత్యక్రియలకు హాజరైంది. అప్పటి నుంచి తీవ్ర మనోవేదన, మనస్తాపానికి గురైంది. రామేశ్వరి, సంగీత కొంతకాలంగా గాం«దీచౌక్‌లో ఉండే రామతులసి ఆరోగ్య బాగోగులు చూసేందుకు ఆమె ఇంట్లో విధులు నిర్వర్తిస్తుండేవారు. ఈ క్రమంలో పనిచేస్తున్న ఇంట్లోనే ఎవరూ లేని సమయంలో సోమవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స్నేహితురాలైన సంగీత మంగళవారం ఉదయం విధులకు వచ్చి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. రామేశ్వరి తల్లి కుర్మక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
మహిళ మృతికి అబార్షన్ ట్యాబ్లెట్లే కారణమా?
ఖమ్మం: మండలంలోని మాలబంజర గ్రామానికి చెందిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందగా.. ఈ ఘటనపై సుజాతనగర్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన భూక్యా దివ్య (26)కు అదే గ్రామానికి చెందిన జగపతితో వివాహం జరిగింది. దివ్యకు మొదటి, రెండు కాన్పుల్లో మగ పిల్లలే జన్మించారు. మూడు నెలలుగా రుతుస్రావం కాకపోవడంతో ఈ నెల 5న రుతుస్రావం కోసం ట్యాబెట్లు వేసుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం రక్తస్రావానికి గురికాగా వైద్యం నిమిత్తం ఆమెను కుటుంబ సభ్యులు కొత్తగూడెం తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కాగా, కాన్పు ఇష్టం లేక గర్భాన్ని తొలగించుకోవాలనే ఉద్దేశంతో అబార్షన్ ట్యాబెట్లు వేసుకొందనే ప్రచారం జరుగుతోంది. చండ్రుగొండ మండలం మేకలబండకు చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడు గర్భస్రావం ట్యాబ్లెట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.తిరుపతిరావు తెలిపారు. -
హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి అల్లుడితో లాడ్జికి వెళ్లిన అత్త.. షాకింగ్ ట్విస్ట్!
భద్రాచలంఅర్బన్: పట్టణంలో ఆదివారం ఓ లాడ్జిలో అనుమానాస్పదంగా మృతి చెందిన రావూరి అరుణ (35)ను ఆమెకు అల్లుడు వరసయ్యే ఆంజనేయులు హత్య చేసినట్లు సోమవారం అరుణ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అరుణ హైదరబాద్‌లో ఆమె భర్త కృష్ణారావుతో కలిసి కోళ్ల ఫారంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈనెల 14వ తేదీన అరుణ.. తనకు కడుపులో నొప్పి వస్తోందని, ఆమె సొంత గ్రామం అయిన తిరువూరులో వైద్యులకు చూపించుకుని వస్తానని చెప్పి హైదరాబాద్ నుంచి బయలుదేరింది. ఖమ్మం జిల్లాలోని కప్పలబంధం గ్రామానికి చెందిన ఆంజనేయులు (అరుణ భర్త కృష్ణార్జున్‌రావు మేనల్లుడు)తో కలిసి భద్రాచలం పట్టణానికి చేరుకొని లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. ఒక రోజు అదే గదిలో ఇద్దరూ కలిసి ఉన్నారని, ఇది తెలిస్తే పరువుపోతుందని గ్రహించిన అరుణ గదిలో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు లాడ్జి నిర్వాహకులు ఆదివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. ఇదే విషయాన్ని అరుణ కుటుంబ సభ్యులకు తెలిపామని పోలీసులు చెప్పారు. సోమవారం అరుణ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు పరిశీలించి ఆమె మెడ చుట్టూ కమి లి ఉన్న గాయాన్ని బట్టి ఆంజనేయులే చీర ను అరుణ గొంతుకు చుట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉంటాడని ఫిర్యాదు చేసి నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠి నంగా శిక్షించాలని వారు కన్నీటిపర్యంతమ య్యారు. ఇందుకు సంబంధించి పోలీసులు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ నాగరాజురెడ్డి తెలిపారు. -
బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణ.. భర్త, ఆడపడచుతో గొడవ..
హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మూసాపేట్, భరత్‌నగర్ ప్రాంతానికి చెందిన మురారి అనూష(32)కు గత ఫిబ్రవరి 12న విజయవాడకు చెందిన నాంచారయ్యతో వివాహం జరిగింది. నాంచారయ్య సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, బీటెక్ పూర్తి చేసిన అనూష ఉద్యోగాన్వేషణలో ఉంది. మూడురోజుల క్రితం ఇంట్లో జరిగిన వేడుకలో భర్త, ఆడపడచుతో గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వచ్చింది. అయినా భర్త, ఆడపడుచు ఫోన్‌చేసి గొడవ పడుతుండటంతో మనస్తాపానికి లోనైంది. ఈ నేపథ్యంలో బ్యాంకు పని నిమిత్తం ఎస్ఆర్నగర్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటికి వచ్చిన అనూష నేరుగా గగన్‌విహార్ భవనం 11వ అంతస్తు పైకి ఎక్కి సోదరుడికి వాయిస్ మెసేజ్ చేసి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి సోదరుడు కార్తీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మేనమామ వేధింపులే కారణం..!
నిజామాబాద్ : మేనమామ వేధింపుల కారణంగానే కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని అభిజ్ఞగౌడ్(23) ఆత్మహత్య చేసుకుంది. తనకు వరుసకు మేనమామ అయిన నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం డొంకేశ్వర్‌కు చెందిన సందీప్‌గౌడ్ మానసికంగా వేధించడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మృతురాలు సూసైడ్ నోట్లో పేర్కొంది. తాటిపాముల కిరణ్ కుమార్‌గౌడ్, స్వప్నల కుమార్తె అభిజ్ఞగౌడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. ప్రస్తు తం ఆమె కామారెడ్డిలో స్థిరపడిన తల్లిదండ్రుల వద్ద ఉంటూ వర్క్‌ఫ్రం హోమ్‌గా విధులు నిర్వహించేది. అభిజ్ఞ కామారెడ్డి లోని ఇంట్లో గురువారం ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకుంది. మేనమామ మానసిక వేధింపులు ఎవ్వరికీ చెప్పుకోలేక పోయానని సూసైడ్ నోట్లో పేర్కొంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కామారెడ్డి నుంచి భిక్కనూరుకు శుక్రవారం తీసుకొచ్చారు. మధ్యాహ్నం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. -
మహిళ మృతదేహానికి రెండేళ్ల తర్వాత పోస్టుమార్టం
గన్నవరం: రెండేళ్ల క్రితం అనుమానానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ వివాహిత మృతదేహానికి మంగళవారం స్థానిక ముస్లిం శ్మశానవాటికలో పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం...స్థానిక ఇస్లాంపేటకు చెందిన సఫియాబేగంకు 2015లో విజయవాడకు చెందిన సలిముల్లా షరీఫ్‌తో వివాహం జరిగింది. వివాహం అనంతరం గుంటూరులోని ఓ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న సఫియాబేగం 2020 సెప్టెంబర్ 6 న ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని గన్నవరం తీసుకువచ్చి ఖననం చేశారు. కొన్ని రోజుల తర్వాత సఫియాబేగం మృతిపై అనుమానాలు రావడంతో సెప్టెంబర్ 19న ఆమె తల్లిదండ్రులు గుంటూరు పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు. సఫియాబేగం మృతికి ఆమె భర్త సలిముల్లా షరీఫ్‌తో పాటు అత్తమామలు కారణమంటూ వారు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో పురోగతి లేకపోవడంతో పాటు ఆరేళ్ల కుమారుడిని పట్టించుకోకుండా షరీఫ్ మరో పెళ్లి చేసుకోవడంతో ఇటీవల మృతురాలి తల్లిదండ్రులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్ ఉత్తర్వుల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో మంగళవారం తహసీల్దారు సీహెచ్ నరసింహారావు సమక్షంలో పట్టాభిపురం సీఐ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహంలోని పలు అవశేషాలను సేకరించి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించనున్నట్లు సీఐ తెలిపారు. -
అడ్డగోలు ఈఎంఐలు.. భర్తపై కోపంతో బలవన్మరణం
కృష్ణా (మచిలీపట్నం): ఇంట్లో వాయిదాల పద్ధతిపై కొనుగోలు చేసిన వస్తువుల కారణంగా ఏర్పడిన వివాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అనవసరమైన ఖర్చులు పెడుతూ పిల్లల భవిష్యత్తును గాలికి వదిలేస్తున్నాడంటూ భర్తపై కోపం తెచ్చుకున్న భార్య ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో బుధవారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ నాగకళ్యాణి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మచిలీపట్నం అరుణోదయకాలనీకి చెందిన రాగోలు సత్యవతి (25) అదే కాలనీకి చెందిన అశోక్‌బాబును ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు. ప్రస్తుతం నారాయణపురంలో నివాసం ఉంటున్నారు. సజావుగా సాగిపోతున్న వీరి కాపురంలో ఈఎంఐలు కలతలు రేపాయి. భర్త ఇంట్లోకి అవసరమైన ఫ్రిజ్, వాషింగ్ మిషన్ తదితర వస్తువులను వాయిదాల పద్ధతిలో ఇటీవల కొనుగోలు చేశాడు. ప్రతి నెల వాయిదాలు చెల్లించటం కష్టంగా మారటంతో సత్యవతి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా అప్పులు చేసి వస్తువులు కొనుగోలు చేయటం మనకు అవసరమా అంటూ మందలించటం మొదలుపెట్టింది. ఈ విషయంలో భార్యభర్తల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతుండగా బుధవారం తీవ్ర మనస్తాపానికి చెందిన సత్యవతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి తండ్రి రాజేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
కిచిడీలో ఉప్పెక్కువైందని.. భార్య గొంతు నులిమాడు
థానే: మహారాష్ట్రలోని థానే జిల్లాలో శుక్రవారం మరో ఘోరం చోటుచేసుకుంది. కిచిడీలో ఉప్పు ఎక్కువగా ఉందని కోపంతో ఓ వ్యక్తి భార్యను గొంతు నులిమి చంపేశాడు. భయందర్‌లోని ఫాఠక్ రోడ్డు ప్రాంతానికి చెందిన నీలేశ్ ఘాఘ్ (46) తనకు వడ్డించిన కిచిడీలో ఉప్పు ఎక్కువగా ఉందంటూ భార్య నిర్మల (40)తో గొడవ పెట్టుకున్నాడు. తీవ్ర ఆవేశంతో గొంతు నులిమి చంపేశాడు. అతనిపై హత్య కేసు నమోదైంది. గురువారం థానే జిల్లాలోని రబోడిలో ఓ వ్యక్తి టిఫిన్ పెట్టలేదని కోడలిని తుపాకీతో కాల్చి చంపడం తెలిసిందే. చదవండి: (చాయ్‌తోపాటు టిఫిన్ ఇవ్వలేదని.. కోడలిపై మామ చేసిన పనికి అంతా షాక్!) -
వదినమ్మ కనిపించడం లేదని.. ఆఖరికి అతడే!
సాక్షి, మోర్తాడ్: తన వదినమ్మ కనిపించడం లేదు.. ఎలాగైనా వెతికి పెట్టండి అంటూ రోజు పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతూ అమాయకుడిగా నటించిన వ్యక్తే వివాహిత హత్య కేసులో ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చారు. ఏమి ఎరగని వాడిలా తిరుగుతున్న నిందితుడిని పక్కా వ్యూహంతో ఊచలు లెక్కించేలా చేశారు. సుంకెట్‌కు చెందిన అంజమ్మ(35) జనవరి 24న అదృశ్యం అయింది. ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అంజమ్మ తన చిన్న మామ కుమారుడు నరేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో వివాదం ముదరడంతో నరేష్ పక్కా ప్లాన్‌తో ఆమెను పెర్కిట్ శివారులోని గుట్టపై హత్య చేశాడు. ఇదంతా చేసిన నరేష్ తనకు ఏమి తెలియనట్లు ఇంటికి చేరుకుని అంజమ్మ అత్త, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు స్టేషన్‌కు వచ్చి మిస్సింగ్ కేసు నమోదు చేయించాడు. అంతేకాక తరుచూ స్టేషన్‌కు వచ్చి తన వదిన మిస్సింగ్ కేసులో ఏమైనా వివరాలు తెలిశాయా అంటూ అడిగేవాడు. నరేష్ వ్యవహారశైలిపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో నరేష్ తప్పు ఒప్పుకొని పెర్కిట్ శివారులో దాచి ఉంచిన మృతదేహాన్ని చూపించాడు. -
పిల్లలు పుట్టడం లేదని బొడ్డుపేగు తిన్న వివాహిత.. ఆ తర్వాత..
నాదెండ్ల: బొడ్డుపేగు తింటే పిల్లలు పుడతారనే మూఢ నమ్మకానికి ఓ వివాహిత బలైన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మండలంలోని తూబాడుకు చెందిన ఆటో డ్రైవర్ రవికి రెండేళ్ల కిందట సన్నితతో వివాహమైంది. పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నెల 13వ తేదీన వేరే మహిళ ప్రసవించడంతో బొడ్డుపేగు తెచ్చిన కుటుంబ సభ్యులు సన్నిత చేత తినిపించారు. చదవండి: స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. ఇంటి నుంచి తీసుకెళ్లి.. రెండు రోజుల తర్వాత ఆమె అనారోగ్యానికి గురైంది. నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. శనివారం సన్నిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే తన కుమార్తెను అత్తింటి వారు తరచూ వేధిస్తూ ఆమె చేత విషపదార్థం తినిపించి హత్య చేశారంటూ సన్నిత తల్లి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. పట్టిచ్చిన సీసీ కెమెరా
కృష్ణలంక (విజయవాడ తూర్పు): వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. ఓ వివాహిత తన భర్తతో సహజీవనం చేస్తున్న మహిళ గొంతు కోసి, రోకలిబండతో తలపై మోది హత్య చేసింది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. సీఐ పి.సత్యానందం కథనం మేరకు.. రాణిగారితోటలోని కరెంట్ ఆఫీస్ రోడ్డులో రౌతు సత్య(35) తన భర్త, కుమార్తెతో నివసిస్తోంది. ఏడేళ్లుగా సత్య విజయవాడ నగర పాలక సంస్థలో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఆమె కుమార్తె సీవీఆర్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతూ అప్పుడప్పుడు క్యాటరింగ్ పనులకు వెళ్తుంటుంది. సత్య భర్తకు మద్యం, గుట్కా, ఖైనీ అలవాటు ఉండటంతో అప్పుడప్పుడు దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఏడాది క్రితం రాణిగారితోటకు చెందిన ముఠా పనిచేసే ఒరుసు ఆదినారాయణతో సత్యకు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారం నేపథ్యంలోనూ సత్య, ఆమె భర్త మధ్యలో గొడవలు జరిగేవి. సత్య భర్త ఇంటిలో లేని సమయంలో ఆదినారాయణ ఆమె వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. ఈ విషయం ఆదినారాయణ భార్య మల్లేశ్వరికి తెలియడంతో ఆమె తరచూ సత్యతో గొడవపడి కొట్టేందుకు కూడా ప్రయత్నించేది. సుమారు 20 రోజుల క్రితం సత్య తీరు నచ్చక ఆమె భర్త గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మూడు రోజులకు ఆదినారాయణ సత్యతో ఇంటిని ఖాళీ చేయించి, లక్కీ బార్ పక్క వీధిలో మరో ఇంటిలోకి తల్లీకుమార్తెలను చేర్చాడు. అప్పటి నుంచి ఆదినారాయణ నిత్యం ఆ ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మల్లేశ్వరి ఆగ్రహంతో సత్య వద్దకు వెళ్లి గొడవపడి, చంపేస్తానని బెదిరించింది. ఎలాగైనా సత్యను చంపాలని నిర్ణయించుకున్న మల్లేశ్వరి గురువారం రాత్రి సుమారు 8.30 నుంచి తొమ్మిది గంటల సమయంలో సత్య ఇంటికి వెళ్లింది. ఇద్దరి మధ్య కొంతసేపు ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తురాలైన మల్లేశ్వరి తనతో తెచ్చుకున్న బ్లేడుతో సత్య గొంతు కోసింది. తీవ్రంగా రక్తస్రావమై కిందపడిపోయిన సత్య తలపై పక్కనే ఉన్న రోకలిబండతో బలంగా మోదింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మల్లేశ్వరి తన వెంట తెచ్చుకున్న చాకు, బ్లేడ్‌ను తీసుకుని తలుపులు వేసి అక్కడ నుంచి వెళ్లిపోయింది. గురువారం మధ్యాహ్నం క్యాటరింగ్ పనికి వెళ్లిన సత్య కుమార్తె రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి తలుపులు తీసి చూడగా తల్లి రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో వేలి ముద్రలు సేకరించి రోకలి బండను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సత్య కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టిచ్చిన సీసీ కెమెరా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీఐ పి.సత్యానందం ఆధ్యర్యంలో సమీపంలోని సీసీ కెమెరా పుటేజీలు సేకరించారు. అందులో మల్లేశ్వరి సంచి తీసుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. డాగ్ స్క్వాడ్ కూడా ఘటనాస్థలం నుంచి మల్లేశ్వరి ఇంటి వద్దకు వెళ్లి ఆగింది. ఆమెను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. తన భర్తతో వివాహేతర సంబంధం వద్దని పలుమార్లు హెచ్చరించినా లెక్కచేయకపోవడంతో సత్యను హత్య చేశానని మల్లేశ్వరి అంగీకరించిందని పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన బ్లేడు, దానితో పాటు ఒక చాకు ఉన్న సంచిని సైడు కాలువలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో మద్యం సీసా, రెండు కాల్చిన సిగరెట్ ముక్కలు ఉండడాన్ని బట్టి హత్యలో మల్లేశ్వరితో పాటు ఇంకా ఎవరి ప్రమే యమైనా ఉండి ఉంటుందని స్థానికుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సామూహిక ఆత్మహత్యలు! ఐదుగురు కూతుళ్లతో సహా తల్లి బావిలోకి దూకి..
జైపూర్: భర్తతో నిరంతర తగాదాలతో మనస్తాపం చెందిన ఓ ఇల్లాలు ఐదుగురి కూతుళ్లతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఘటనలో ఆరుగురూ మృతి చెందారు. ఆదివారం ఉదయం గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను వెలికితీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా మృతురాలిని శివలాల్ బన్జారా భార్యగా గుర్తించారు. బాదందేవి (40) ఏడుగురు పిల్లల తల్లి. ఘటనలో బాదందేవితోపాటు సావిత్రి (14), అంకాలీ (8), కాజల్ (6), గుంజన్ (4), అర్చన (ఏడాది వయసు) మృతి చెందగా, మిగతా ఇద్దరు కూతుళ్లు గాయత్రి (15), పూనమ్ (7) నిద్రపోవడంవల్ల తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. దుప్పట్లను విక్రయించే పని చేసే శివలాల్‌కు, భర్య బాదందేవికి తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఐతే సంఘటన సమయంలో శివలాల్ ఇంటివద్దలేనని, బంధువు మృతి చెందితే సంతాపం తెల్పడానికి శనివారం రాత్రి పొరుగూరికి వెళ్లినట్లు తెలిపాడు. సంఘటన గురించి తెలియడంతో ఆదివారం ఉదయం తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఐతే భార్య ఎందుకు చనిపోవాలనుకుందో మాత్రం పోలీసులకు తెల్పలేదు. మృతుల ఇంటికి కేవలం వంద మీటర్ల దూరంలోనే బావి ఉంది. మృతదేహాల పోస్టుమార్టం రిపోర్టు రావల్సి ఉంది. ఈ సంఘటనపై సీఆర్పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నామని ఎస్హెచ్ఓ రాజేంద్ర మీనా మీడియాకు తెలిపారు. చదవండి: మహిళ ఎకౌంట్లో పొరపాటున రూ. 7.7 కోట్లు జమ.. దొంగతనం కేసు! -
తమ గుట్టు రట్టు కాకుండా ఉండేందుకు.. మహిళ ప్రాణం తీసి!
పావగడ: దొంగతనానికి వెళ్లిన దుండగులు తమ గుట్టు రట్టు కాకుండా ఉండేందుకు ఓ మహిళను దారుణంగా హతమార్చారు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని పావగడ తాలూకా మురారాయనహళ్లికి చెందిన గంగమ్మ (55) సోమవారం రాత్రి తన ఇంటికి తాళం వేయకుండా చుట్టుపక్కల మహిళలతో కలిసి ఇంటి బయట అరుగు మీద బారాకట్ట ఆడుతూ ఉంది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత తన ఇంటిలోకి వెళ్లిన ఆమె అప్పటికే లోపలకు చొరబడి దొంగతనానికి ప్రయత్నిస్తున్న దుండగులను చూసి భయంతో కేకలు వేసింది. ఆ సమయంలో ఛార్జింగ్ వైర్‌ని ఆమె గొంతుకు బిగించారు దుండగులు. వారితో పెనుగులాడి తప్పించుకున్న ఆమె కేకలు వేస్తూ ఇంటి బయటకు పరుగున వచ్చింది. అదే సమయంలో ఆమెను అనుసరిస్తూ వచ్చిన దుండగులు బండరాయితో ఆమె ముఖంపై కొట్టి హతమార్చారు. గంగమ్మ కేకలు విని పొరుగున ఉన్న యువకుడు బయటకు రావడం గమనించి నలుగురు దుండగులు అక్కడి నుంచి చీకట్లోకి పారిపోయారు. సమాచారం అందుకున్న పావగడ సీఐ లక్ష్మీకాంత్, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. దుండగుల ఆచూకీ కోసం స్నిప్పర్ డాగ్‌ను రంగంలోకి దించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, భర్త చనిపోయిన తర్వాత గంగమ్మ ఒంటరిగా జీవిస్తోంది. ఇద్దరు కుమార్తెలకు వివాహమై స్థానికంగానే మరో ప్రాంతంలో నివాసముంటున్నారు. -
Rangareddy: ఆస్పత్రిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాజేంద్ర నగర్ పరిధిలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సుదీప్తి అనే మహిళ.. అదే ఆసుపత్రిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోవడం కలకలంరేపింది. అనారోగ్యంతో బాధపడుతున్న సుదీప్తి ఈనెల 6వ తేదిన బండ్లగూడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఈ క్రమంలో.. ఆరోగ్యం కుదుటపడటంతో నిన్ననే డిశ్చార్జ్ కావాల్సిన మహిళ తన రూమ్‌లో.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. -
గర్భిణి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
సాక్షి, నర్సంపేట (వరంగల్): వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఏడు నెలల గర్భిణి లావణ్య(24) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. దీంతో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళనకు దిగారు. దుగ్గొండి మండలం మదిర గ్రామానికి చెందిన పెరుమాండ్ల మల్లారెడ్డి– నీలమ్మ దంపతుల కుమార్తె లావణ్యను నెక్కొండ మండలానికి చెందిన అనుముల నర్సింహారెడ్డి– రేణుక దంపతుల కుమారుడు రాకేష్‌రెడ్డికి ఇచ్చి సంవత్సరం క్రితం వివాహం జరిపించారు. కొద్ది రోజుల తర్వాత భార్యాభర్తలు హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ క్రమంలో లావణ్య గర్భం దాల్చడంతో పుట్టింటికి వచ్చి ఉంటుంది. శనివారం సాయంత్రం ఆమెకు నొప్పులు రాగా, నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రాత్రి నొప్పులు ఎక్కువ కావడంతో ఆస్పత్రి సిబ్బంది ఇంజక్షన్ వేయడంతో తగ్గాయి. తిరిగి ఆదివారం ఉదయం నొప్పులు ఎక్కువ కావడంతో మళ్లీ ఇంజక్షన్ వేయగా, కొద్ది సేపటికే లావణ్య మృతి చెందినట్లు ఆమె అత్త రేణుక తెలిపారు. దీంతో ఆగ్రహించిన మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చదవండి: పెట్రోల్ బంకులో పనిచేసే యువతి.. మైనర్ బాలుడిని ట్రాప్ చేసి.. -
Vizianagaram: ట్రైనింగ్‌కు వచ్చిన మహిళా ఎస్సై ఆత్మహత్య
విజయనగరం: విజయనగరం జిల్లా పీటీసీ ట్రైనింగ్ సెంటర్లో విషాదం చోటుచేసుకుంది. ట్రైనింగ్‌కు నిమిత్తం వచ్చిన ఒక మహిళా ఎస్సై ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.. భవానీ అనే ఎస్సై రాత్రి హస్టల్లో ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటి పీఎస్‌కు చెందిన భవానీ.. 2018లో పోలీసు ఉద్యోగంలో చేరింది. రాజోల్లో పోలీస్ ట్రైనింగ్ పూర్తిచేసుకుంది. ఆ తర్వాత సఖినేటిపల్లిలో పీఎస్‌లో మొదటి పోస్టింగ్‌లో చేరింది. భవానీ స్వస్థలం కృష్ణాజిల్లా కోడూరు మండంల పాలెం గ్రామంగా పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: శ్మశానంలో ‘డాక్టర్’ చదువు -
పిలవడానికి వస్తే ప్రాణం పోయింది
తుమకూరు: ఇంటి పైకప్పు కూలడంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన తుమకూరు జిల్లా శిరా తాలూకా గౌడగెరె సమీపంలో ఉన్న యరువరహళ్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రత్నమ్మ (55) తన ఇంటి పక్కనే ఉన్న లక్ష్మమ్మ ఇంటికి వచ్చింది. పనికి రావాలని చెబుతుండగా ఒక్కసారిగా పైకప్పు కూలిపోయి రత్నమ్మపై పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇదే సమయంలో ఇంటిలో ఉన్న లక్ష్మమ్మ, వెంకటేశ్‌లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. శిరా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: మైసూరులో పట్టపగలే నగల దుకాణంలో దోపిడీ -
ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం: డాక్టర్ల నిర్లక్ష్యంతోనే..
సాక్షి, మంచిర్యాల: డాక్టర్ నిర్లక్ష్యంతో వృద్ధురాలు మృతిచెందిన సంఘటన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ కుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గోదావరిఖనికి చెందిన కడారి అయిలమ్మ(65)ను అనారోగ్యం కారణంగా కుటుంబ సభ్యులు ఈనెల27న చేర్పించారు. నాలుగు రోజులుగా కొంత అనారోగ్యంతో బాధపడుతుండగా చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రాణాపాయం లేదని కొంత చికిత్స అవసరమని అడ్మిట్ చేసుకున్నారు. బుధవారం ఉదయం, సాయంత్రం వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పిన ఆసుపత్రి వైద్యుడు రాత్రి మాత్రం ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయని పేర్కొన్నాడు. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో అయిలమ్మ కుటుంబ సభ్యులు వేరే చోట నుంచి సిలిండర్ తీసుకొచ్చారు. అయితే ఆక్సీమీటర్‌తో పాటు సిలిండర్ బిగించడానికి స్పానర్ కూడా ఆసుపత్రిలో లేవు. పరిస్థితి విషమించిన అయిలమ్మకు చికిత్స చేసేందుకు డాక్టర్ రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అయిలమ్మ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బావమరిది స్కెచ్.. అక్కను చంపాడనే కోపంతో..
సాక్షి, జనగామ(వరంగల్): అక్కను చంపాడనే కోపంతో బావపై బామ్మర్ధి హత్యాయత్నం చేసిన ఘటన జనగామ జిల్లా నడిబొడ్డున బుధవారం జరిగింది. మద్యం మత్తులో గంట పాటు జరిగిన గొడవలో బావ కత్తిపోట్లకు గురయ్యాడు. వివరాలు.. జనగామ జిల్లా నర్మెట మండలం ఉప్పలగడ్డ తండాకు చెందిన కారు డ్రైవర్ బానోతు చంద్రశేఖర్ రాయపర్తి మండలం ఆరెగూడెం తండాకు చెందిన సరితను గత ఏడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు. భార్యా భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో.. తరుచూ గొడవ పడేవారు. కుటుంబంలో కలహాలు ముదిరి పోవడంతో భర్త చంద్రశేఖర్ తనభార్య సరితను 2021 ఫిబ్రవరిలో హత్య చేశాడు. రెండు నెలలుగా జైలులో ఉన్న చంద్రశేఖర్ ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. తన అక్కను చంపేశాడని కోపం పెంచుకున్న బామ్మర్ధి రమేష్ బావపై దాడి చేసేందకు అదును కోసం ఎదురు చూశాడు. వైన్స్‌లో ముదిరిన గొడవ... జిల్లా కేంద్రంలో బుధవారం కలుసుకున్న వీరు సిద్దిపేట రోడ్డులోని ఓ వైన్స్‌లో మద్యం సేవించేందుకు వెళ్లారు. ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో పక్కనే ఉన్న మిగతా మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో బయటకు వచ్చారు. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న బామ్మర్ధి రమేష్ తనవెంట తెచ్చుకున్న కత్తితో బావ చంద్రశేఖర్‌పై మొదటిపోటు వేశాడు. చంద్రశేఖర్ పారిపోతుండగా... వెంబడించాడు. ఐసీఐసీఐ బ్యాంకు సమీపంలో డివైడర్ ఎక్కి అటువైపు దూకుతుండగా.. మరో కత్తిపోటు వేయడంతో చంద్రశేఖర్ అక్కడే కుప్పకూలిపోయాడు. చంద్రశేఖర్‌పై కూర్చుని మెడ, చెవి, చేయిపై కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో కొందరు యువకులు రమేష్‌ను పట్టుకుని చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ బాలాజీవరప్రసాద్, ఎస్సై శ్రీనివాస్ సంఘటన స్థలానికి పరుగున చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న చంద్రశేఖర్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించి... రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఏసీపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ రమేష్ అక్క సరితను బావ చంద్రశేఖర్ హత్య చేశాడనే కోపంతోనే ఈ ఘటనకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
మమ్మీ ఎందుకు మాట్లాడుతలేదు.. ఎస్సైని ప్రశ్నించిన చిన్నారి..
సాక్షి, తంగళ్లపల్లి(కరీంనగర్): ‘పోలీస్ అంకుల్ మా మమ్మీని అప్పటి నుంచి పిలుస్తున్నా పలుకుతలేదు.. ఏమైంది అంకుల్’ అంటూ ఆ చిన్నారులు ప్రశ్నించడంతో అక్కడున్నవారు కన్నీ టిపర్యంతమయ్యారు. ఈ ఘటన తంగళ్లపల్లి మండలంలోని రామచంద్రపూర్‌లో శని వారం జరిగింది. గ్రామస్తులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గడ్డం దినకర్–వైష్ణవిలకు దీపాన్స్, హిమాన్స్ సంతానం. దినకర్ మెడికల్ షాపు నిర్వహిస్తుండగా, వైష్ణవి ఇంటి వద్దే ఉంటుంది. బంధువుల ఇంటిలో ఫంక్షన్‌కు వెళ్లి శనివారం వచ్చిన వైష్ణవి(28) బట్టలు ఉతికేందుకు స్నానం గదిలోకి వెళ్లింది. బట్టలను బకెట్లో నానబెట్టి పక్కనే ఆన్‌చేసి ఉన్న హీటర్‌ను ప్లగ్ నుంచి వేరుచేసేందుకు ప్రయత్నించగా.. విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి విగతజీవిగా పడి ఉంది. ఎస్సై లక్ష్మారెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా తమ కూతురు మరణంపై అనుమానం ఉందంటూ వైష్ణవి తల్లిగారు జిల్లెల్ల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఎస్సై వారితో మాట్లాడి శాంతింపజేశారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఫిర్యాదు రాలేదని ఎస్సై తెలిపారు. -
యువకుడితో ఫోన్ మాట్లాడవద్దన్నందుకు ఎంత పనిచేసింది..
సాక్షి, చిన్నంబావి (మహబూబ్‌నగర్): తండ్రి మందలించడంతో కూతురు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇది. స్థానికుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా చిన్న బావి మండలంలోని అయ్యవారిపల్లికి చెందిన బొక్కలమ్మ, కురుమయ్య దంపతులకు కూతురు భువనేశ్వరి (16), కుమారులు అక్షయ కుమార్,హేమంత్ ఉన్నారు. కూతురు గత ఏడాది పదోతరగతి పాసైనా ఇంటి వద్దే ఉంటుంది. కాగా, మంగళవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఫోన్లో మాట్లాడుతుండటం, ఎస్ఎంఎస్లు పంపడాన్ని పెద్ద తమ్ముడు చూశాడు. ఈ విషయమూ తండ్రికి చెప్పడంతో మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై అదే అర్థరాత్రి పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం కొల్లపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది. ఈ సంఘటనతో ఆకుటుంబలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
సాక్షి, హస్తినాపురం: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం పిల్లగుంట్ల తండాకు చెందిన కవిత, విజయ్ దంపతులు ఇంజాపూర్ గ్రామంలోని సుందరయ్యకాలనీలో నివాసం ఉంటున్నారు. ఈనెల 18న కవిత కరోనాతో మృతి చెందిందని చెప్పి ఆమె భర్త విజయ్ చెప్పాడని కవిత కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాన్ని హుటాహుటినా గ్రామానికి తరలించి అంత్యక్రియలు చేశారన్నారు. అంత్యక్రియలలో పాల్గొన్న కవిత కుటుంబ సభ్యులు కరోనా టెస్ట్ చేయించుకుంటే అందరికీ నెగెటివ్ వచ్చింది. తమ కూతురిని పథకం ప్రకారం హత్య చేసి కరోనాతో చనిపోయిందని నమ్మించి మోసం చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నల్గొండ జిల్లా పిఏపల్లి మండల తహసీల్దార్ సమక్షంలో పాతిపెట్టిన కవిత మృదేహాన్ని పోలీసులు వెలికి తీసి సోమవారం పంచనామా చేశారు. రిపోర్ట్ వస్తే కవిత మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు. చదవండి: రూ. 2 కోట్ల కోసం కిడ్నాప్.. కోవిడ్ శవంగా అంత్యక్రియలు -
పాపం.. ఎలుక తప్పించుకుంది.. మహిళ దొరికింది..
సాక్షి, హసన్‌పర్తి(వరంగల్) : ఎలుకను మింగేందుకు యత్నించిన పాము అది తప్పించుకోవడంతో అక్కడే ఓ మహిళపై కాటు వేయగా ఆమె మృతి చెందింది. హన్మకొండ 65వ డివిజన్ చింతగట్టులోని సుభాష్‌నగర్‌కు చెందిన పుల్లా కమలమ్మ(55) మరికొందరితో కలిసి మంగళవారం ఉదయం బయట కూర్చుని మాట్లాడుతోంది. కాగా, కమలమ్మ వెనుక వైపు నుంచి ఎలుక వెళ్తుండగా.. దానిని పట్టుకునేందుకు పాము వచ్చింది. అయితే, ఎలుక క్షణంలో తప్పించుకోవడంతో పాము కింద కూర్చోని ఉన్న కమలమ్మ చేతిపై కాటు వేసింది. పరిస్థితిని గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. చదవండి: అదేమో కింగ్ కోబ్రా.. ఆ యువతి ఎలా పట్టేసుకుందో! -
Shamirpet: దారుణ హత్య.. బంగారం కోసమేనా..?
శామీర్‌పేట్: ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైన ఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధి లాల్‌గడి మలక్‌పేట గ్రామానికి చెందిన పొలంపల్లి లక్ష్మి(60), భర్త చనిపోగా కూతుళ్లకు వివాహం చేసి, కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కాగా అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాల్లో రక్తపుమడుగులో పడి ఉన్న లక్ష్మిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలకు తీవ్రగాయలై మృతి చెందినట్లు గుర్తించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహకారంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. నగలు, నగదు కోసం హత్య జరిగిందా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్‌పేట సీఐ సుధీర్‌కుమార్ తెలిపారు. అనంతరం పేట్‌బషీరాబాద్ ఏసీపీ ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలసుకున్నారు. ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారం కనిపించడం లేదని పోలీసులకు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్‌పేట పోలీసులు తెలిపారు. చదవండి: పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమ జంట బలవన్మరణం -
ముస్లిం యువత మానవత్వం..
గుంటూరు మెడికల్: కరోనాతో చనిపోతున్న వారికి కుటుంబ సభ్యులు సైతం దూరంగా ఉంటున్న నేపథ్యంలో.. ఆ బాధితులకు వారి వారి ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు గుంటూరుకు చెందిన ముస్లిం యువకులు. గుంటూరు జిల్లా మండల కేంద్రమైన దుగ్గిరాలలో 48 ఏళ్ల మహిళ కరోనాతో చనిపోవడంతో కుటుంబీకులు భౌతికకాయాన్ని ముట్టుకునేందుకు భయపడిపోయారు. సామాజిక మాధ్యమాల ద్వారా గుంటూరు కోవిడ్ ఫైటర్స్ గురించి తెలుసుకుని గురువారం వారిని సంప్రదించారు. దీంతో కోవిడ్ ఫైటర్స్‌కు చెందిన పఠాన్ అల్లాభక్షు, పఠాన్ ఫిరోజ్‌ఖాన్, హబీబ్ అన్సారీ, పఠాన్ ముజీబ్‌బాషా తమ సొంత అంబులెన్స్‌లో దుగ్గిరాల వెళ్లారు. సదరు మహిళ భౌతిక కాయాన్ని తెనాలి శ్మశానవాటికకు తరలించి, హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, గతేడాది నుంచి ఇప్పటివరకు తాము కరోనాతో చనిపోయిన 223 మందికి అంత్యక్రియలు చేశామని వారు తెలిపారు. కరోనాతో చనిపోయిన వారికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు చేసే పరిస్థితి లేనప్పుడు.. తమను సంప్రదిస్తే ఆ కార్యం నెరవేరుస్తామని చెప్పారు. 8143222456, 9848940304 నంబర్లలో తమను సంప్రదించాలని కోరారు. చదవండి: సంక్షేమ పథకాల మొత్తం లబ్ధిదారులకు ఇవ్వాల్సిందే.. హత్యా..ఆత్మహత్యా?: బాలిక అనుమానాస్పద మృతి -
చేయి నరికి.. ఎత్తుకెళ్లి
నిజామాబాద్ అర్బన్: ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఆపై చేయి నరికి ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఆదివారం అర్ధరాత్రి వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆస్పత్రి ఆవరణలోని మార్చురీ విభాగం ఎదుట మహిళా మృతదేహం ఉండటాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది.. వైద్యాధికారులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు విచారణ చేపట్టారు. నగరంలోని గోసంగి కాలనీకి చెందిన శైలజ (28)గా గుర్తించారు. చేతిని నరకడంతో తీవ్ర రక్తస్రావం అయి ఘటనా స్థలంలోనే మహిళ మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, రాత్రి 10 గంటల సమయంలో తన భార్య ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లినట్లు భర్త శివానంద్ పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని తీసుకొచ్చి పడేశారా? ఈ హత్య కేసులో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు.. మహిళను వేరేచోట హత్య చేసి ఇక్కడ పడేసినట్లు అనుమానిస్తున్నారు. ‘చేతిని నరికితే తీవ్ర రక్తస్రావం అవుతుంది. అయితే..మృతదేహం వద్ద పెద్దగా రక్తం లేదు. ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారు’అని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఆస్పత్రి చుట్టుపక్కల డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించినా ఫలితం దక్కలేదు. ఆదివారం రాత్రి ఆస్పత్రిలోకి ఎవరెవరు ప్రవేశించారు. మార్చురీ వైపు ఏ మైన వాహనాలు వెళ్లాయా..? అనే కోణాలపై సీసీ కెమెరాల్లో పరిశీలిస్తున్నారు. అయితే.. కొన్నిచోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీ సులు గుర్తించారు. మహిళకు సంబంధించిన ఫోన్ కాల్స్, ఎవరైన శత్రువులు ఉన్నారా అని అతని కుటుంబీకుల ద్వారా విచారణ చేపడుతున్నారు. ఆస్పత్రి వెనుక భాగంలో మహిళ మృతదేహాన్ని తీసుకొచ్చి పడేసిన ఘటన ఎస్పీఎఫ్ దృష్టికి రాకపోవడం విశేషం. -
విమానంలో కరోనాతో మరణించిన మహిళ
వాషింగ్టన్: ఈ ఏడాది జూలై చివరలో లాస్ వెగాస్ నుంచి డల్లాస్ వెళ్లే స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు టెక్సాస్‌కు చెందిన మహిళ మరణించిన సంగతి తెలిసిందే.అయితే ఆమె కోవిడ్ -19 తో మరణించినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. స్పిరిట్ ఫ్లైట్ జూలై 24 సాయంత్రం లాస్ వెగాస్ నుంచి డల్లాస్-ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న మహిళ అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె ఎంత సేపటికి స్పందించకపోవడంతో ఆ విమానాన్ని అల్బుకెర్కీ వద్ద ఆపేశారు. అయితే ఫ్లైట్ అక్కడికి వచ్చే సరికే సదరు మహిళ చనిపోయిందని ఆల్బుకెర్కీ ఇంటర్నేషనల్ సన్‌పోర్ట్ ప్రతినిధి స్టెఫానీ కిట్స్ చెప్పారు. అయితే ఆ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు టెక్సాస్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ విమానంలో అపస్మారక స్థితిలోకి వెళ్లి శ్వాస ఆగిపోయిందని తెలిపారు. విమానంలో ఒక సభ్యుడు ఆమెకు సీపీఆర్ చేయడానికి ప్రయత్నించడని కానీ ఫలితం లేకపోయింది అని తెలిపారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటంటే తాజాగా ఆమె రిపోర్ట్లు వచ్చే వరకు సదరు మహిళ కరోనాతో మరణించినట్లు విమాన సిబ్బందికి తెలియదు. ఈ ఘటన విమానాల్లో ప్రయాణించే వారి భద్రతపై పలు అనుమానాలు రేకెత్తిస్తుంది. ఈ విషయం గురించి స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఎరిక్ హాఫ్మేయర్ మాట్లాడుతూ మహిళ కుటుంబానికి, స్నేహితులకు ఎయిర్‌లైన్స్ తరుపున సంతాపం తెలిపారు. కరోనావైరస్కు సంబంధించి ఎయిర్‌లైన్స్ తన ప్రోటోకాల్స్ ఫాలో అవుతుదని, తప్పకుండా ఏ తప్పు జరగదనే నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు. అయితే ఆ మహిళతో కాంటాక్ట్ అయిన అభ్యర్థులను ట్రేస్ చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: ‘అతను చనిపోయింది మా వ్యాక్సిన్ వల్ల కాదు’ -
విషాదం: భర్తకు కరోనా రావడంతో..
కర్నూలు (టౌన్): కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని..జాగ్రత్తలు తీసుకుంటే నయమవుతుందని అధికారులు, డాక్టర్లు చెబుతున్నా కొందరు భయం వీడటం లేదు. తీవ్ర ఒత్తిడికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. శనివారం కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో ఇలాంటి సంఘటనే జరిగింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని గాయత్రీ ఎస్టేట్‌లో ఉన్న ఓ అపార్టుమెంటులో గురువయ్య, రాజ్యలక్ష్మి (68) దంపతులు నివసిస్తున్నారు. పదేళ్ల క్రితమే కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడంతో కోడలు, మనవడి వద్ద ఉంటున్నారు. గురవయ్యకు ఇటీవల కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో హోంఐసోలేషన్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్య తీవ్ర ఆందోళనకు గురైంది. చనిపోవాలని నిర్ణయించుకుని శనివారం ఉదయం బయటకొచ్చి పడిదెంపాడు వద్ద కేసీ కెనాల్లో దూకింది. అటువైపు వస్తున్న ఆటో డ్రైవర్ గమనించి వెంటనే నీటిలోకి దూకి బయటకు తీసుకొచ్చాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా కరోనా సోకిందని తేలగానే ఇరువురం చనిపోదామంటూ రాజ్యలక్ష్మి భర్తతో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. -
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో విషాదం
సాక్షి, విజయవాడ: తీవ్ర మనస్తాపంతో ప్రభుత్వాసుపత్రి భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నగరంలో చోటు చేసుకుంది. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న మహిళను వైద్యులు డిశ్చార్జ్ చేయగా, ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన మహిళ ఆసుపత్రి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చల్లపల్లి మండలం నారాయణపురానికి చెందిన ఆదిలక్ష్మిగా ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. మరోవైపు కుమారుడికి కరోనా సోకడంతో ఓ వృద్ధుడు విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌పై ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే సమీపంలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి అతడిని కాపాడారు. అనంతరం జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు మచిలీపట్నంకు చెందిన నాగేశ్వరరావుగా గుర్తించారు. -
కరోనా : నగ్నంగా బైటికొచ్చి..వృద్ధురాలిని కొరికి
సాక్షి, చెన్నై : కోవిడ్-19 (కరోనా వైరస్) నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. హోం క్వారంటైన్ లో ఉన్న ఒక వ్యక్తి దారుణంగా ప్రవర్తించిన వైనం కలకలం రేపింది. విదేశాలనుంచి ఇటీవల తిరిగి వచ్చిన వ్యక్తి (34) ని పోలీసులు క్వారంటైన్ లో వుంచారు. అయితే ఏమైందో ఏమో తెలియదుగానీ, క్వారంటైన్ నుంచి బయటికి నగ్నంగా పరుగులు పెట్టాడు. అంతేకాదు వృద్ధురాలు (90) మరణానికి కారకుడయ్యాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం శ్రీలకం నుంచి తమిళనాడులోని థేని జిల్లాకు వచ్చిన వ్యక్తిని ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్ లో ఉంచారు అధికారులు. అయితే శుక్రవారం రాత్రి నిర్బంధంలోంచి నగ్నంగా బయటికి వచ్చిన అతగాడు ఆరు బయట నిద్రిస్తున్న వృద్దురాలిపై దాడి చేసి, ఆమె గొంతు కొరికాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు పెట్టడంతో అప్రమత్తమైన చుట్టుపక్కల వారు అతణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే వృద్దురాలిని ఆసుపత్రికి తరలించినా ఫలితంలేకపోయింది. థేని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. దీంతో ఈ ప్రాంతంలో ఆందోళన చెలరేగింది. అయితే గతవారం విదేశాలనుంచి తిరిగి వచ్చిన అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదని తెలుస్తోంది. -
ఖాకీ నిర్లక్ష్యం ప్రాణం తీసింది!
పంజగుట్ట: జరగరానిది జరిగినప్పుడు హడావుడి చేసే పోలీసులు ఆపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. నగరంలోని పంజగుట్ట పోలీసుస్టేషన్ వద్ద మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసి, బుధవారం ఉస్మా నియా ఆస్పత్రిలో మృతిచెందిన లోకేశ్వరి ఉదంతమే దీనికి నిదర్శనం. చెన్నైకి చెందిన లోకేశ్వరి (37) శ్రీనివాస్‌ను 2000లో వివాహం చేసుకుంది. కుమార్తె పుట్టిన తర్వాత వీళ్లు విడిపోయారు. లోకేశ్వరికి 2012లో మాట్రిమోనియల్ సైట్ ద్వారా నగరంలోని వారసిగూడకు చెందిన ఎస్.ప్రవీణ్‌కుమార్ పరిచయమయ్యాడు. 2013లో ఆమెను నగరానికి తీసుకువచ్చిన ప్రవీణ్ ఆమెతో సహజీవనం కొనసాగించాడు. అప్పట్లో సోమాజిగూడలో నగల దుకాణం నిర్వహించారు. మనస్పర్థలు రావ డంతో లోకేశ్వరిపై ప్రవీణ్ 2014లో పంజగుట్ట పోలీసుస్టేషన్లో చోరీ కేసు నమోదు చేయించాడు. ఈ కేసులో అరెస్టయి బెయిల్‌పై వచ్చిన ఆమె.. కుమార్తెను తీసుకుని చెన్నై వెళ్లిపోయింది. కేసు నమోదు చేయని పోలీసులు... ప్రవీణ్ తనకు రూ.7.5 లక్షలు ఇవ్వాలని లోకేశ్వరి చెబుతోంది. అతనికి ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో స్నేహితుడు కన్నన్‌తో శుక్రవారం ఇక్కడికి వచ్చింది. ప్రవీణ్ కోసం వెతికినా దొరక్కపోవడం, ఫోన్లో అందుబాటులోకి రాకపోవడం తో శుక్రవారమే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రవీణ్‌ను ఫోన్ ద్వారా సంప్రదించిన పోలీసులు అతడి మాటలు నమ్మి కేసు నమోదు చేసేది లేదంటూ లోకేశ్వరితో చెప్పేశారు. దీంతో ఏసీపీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్న ఆమె ఆ పేరుతో ఫిర్యాదును సిద్ధం చేయించి మంగళవారం పంజగుట్ట ఠాణా వద్దకు వచ్చింది. 2 లీటర్ల పెట్రోల్‌ను తన వెంట తెచ్చుకుంది. ప్రవీణ్ మోసం.. పోలీసులు ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో ఆవేదన చెందిన లోకేశ్వరి ఠాణా ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. 70 శాతం కాలిన ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు వెంట ఉన్న కన్నన్ను మంగళవారమే అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ పేరుతో లోకేశ్వరి సిద్ధం చేసిన లేఖను మాయం చేశారు. బుధవారం లోకేశ్వరి మృతిచెందడంతో పోస్టుమార్టం నిర్వహించి ఆమె వస్తువుల్ని కన్నన్‌కు అప్పగించి రహస్యంగా చెన్నైకు పంపించేశారు. బుధవారం ప్రవీణ్‌పై చీటింగ్, ఆత్మహత్యకు ప్రేరేపించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పంజగుట్ట పోలీసులు త్వరలోనే అరెస్టు చేస్తామని చెబుతూ నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. ప్రవీణ్‌ను ఫోన్లో సంప్రదించాం: తిరుపతన్న, పంజగుట్ట ఏసీపీ ‘2014లో లోకేశ్వరిపై నమోదైన కేసు అదే ఏడాది లోక్ అదాలత్‌లో రాజీ అయింది. తాజాగా లోకే శ్వరి శుక్రవారం పంజగుట్ట పోలీసుస్టేషన్‌కు వచ్చి ప్రవీణ్‌పై ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్సై.. ప్రవీణ్‌ను ఫోన్లో సంప్రదించారు. లోకేశ్వరి ఆరోపణల్ని ఖండించిన ప్రవీణ్.. తాను బెంగళూరులో ఉన్నానని, 2 వారాల్లో వస్తానని చెప్పాడు. ఆర్థిక కారణాల నేపథ్యంలో ఆమె కుటుంబం మృతదేహాన్ని చెన్నై తీసుకువెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించే స్థితిలో లేదని తెలిసింది. -
మహిళ దారుణ హత్య
సాక్షి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని పెద్దచెరువు మత్తడి కాలువ సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ హత్యకు గురైన సంఘటన సోమవారం వెలుగు చూసింది. సంఘటన స్థలంలో తలలేని మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి పడి ఉంది. వారం రోజుల క్రితం హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద చెరువు మత్తడి వాగు దగ్గర గుర్తుతెలియని ఓ శవం పడి ఉందని సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. తల లేని మృతదేహాన్ని గుర్తించి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో వారం క్రితం హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతురాలి వయసు 34 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలను రప్పించి ఆధారాలను సేకరించారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్హెచ్ఓ జగదీష్, ఎస్సైలు రవికుమార్, గోవింద్ ఘటన స్థలాన్ని సందర్శించారు. అక్కడే పోస్టుమార్టం పూర్తి చేయించారు. ఇటీవల అదృశ్యమైన వారి వివరాలను పరిశీలిస్తున్నారు. ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడవేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
పెళ్లైన నాలుగు నెలలకే...
జీవితంపై కోటి ఆశలతో కొత్త కాంతులతో నాలుగు నెలల కిందటే ఆమె అత్తవారింట అడుగు పెట్టింది. కన్నవారు కూడా మేనరిక వివాహం కావడంతో తమ బిడ్డకు కొండంత భరోసా ఉంటుందని ఆశ పడ్డారు. ఇటు కన్నవారు...అటు అత్తవారు అంతా ఒకే కుటుంబ సభ్యులు కావడంతో ఆమె తన జీవితం ఇక పూల పాన్పే అనుకొంది. ఇంతలోనే ఏమైందో...అత్తవారింట అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఇటు కన్నవారు...అటు అత్తవారింట విషాదం నెలకొంది. మృతదేహానికి అంత్యక్రియలు ఏర్పాట్లు జరిగే సమయానికి శ్మశానవాటిక వద్దకు వచ్చిన పోలీసులు దాన్ని నిలుపు చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆ వివాహిత మృతి వెనుక ఏమైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... కొమరాడ: మండలంలోని విక్రంపురం పంచాయతీ కొత్తమార్కొండపుట్టి గ్రామానికి చెందిన మేలాపు త్రినాధ, మధు దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో పెద్ద కుమార్తె మేలాపు సౌజన్య(20)కు మధుకుమేనల్లుడైన కళ్లికోట గ్రామానికి చెందిన మిరియాల అప్పలనాయుడు కుమారుడు హరీష్‌తో ఈ ఏడాది ఏప్రిల్ 1న వివాహం జరిపించారు. అనంతరం సౌజన్య తల్లిదండ్రులు ఉపాధి కోసం విజయవాడ వెళ్లారు. సౌజన్య కూడా వివాహ అనంతరం ఆషాడం కోసం కన్నవారింటికి వెళ్లి ఈ నెల ఏడో తేదీనే కళ్లికోటలోని అత్తవారింటికి వచ్చింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం సౌజన్య అత్తవారింటి వారు అంతా పొలం పనులకు వెళ్లిపోగా ఇంట్లోనే సౌజన్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అత్తవారింటి వారు పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చి చూడగా సౌజన్య మంచంపై పడి ఉండడంతో ఒక్కసారిగా గొల్లుమన్నారు.108కి ఫోన్ చేయగా ఫలితం లేకపోవడంతో పార్వతీపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు సౌజన్యను పరీక్షించి మృతి చెందినట్టు వెల్లడించారు. దీంతో ఏం జరిగిందోనంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసుల అనుమానంతో... సోమవారం సాయంత్రం మృతి చెందిన సౌజన్య మృతదేహానికి మంగళవారం ఉద యం అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామంలోని శ్మశానవాటికి వద్దకు తీసుకువెళ్లగా సీఐ అరంగి దశరధ తన బృందంతో వచ్చి నిలుపు చేయించారు. ఇదే సమయంలో ఉప తహసీల్దార్ సూర్యనారాయణ నేతృత్వంలో కూడా ఓ బృందం శ్మశాన వాటికి వద్దకు చేరుకొంది. సౌజన్య మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొమరాడ ఇన్చార్జి ఎస్ఐ లోవరాజు వద్ద సాక్షి ప్రస్తావించగా తమకు అందిన సమాచారంతోనే శ్మశాన వాటికి వద్దకు చేరుకొని అంత్యక్రియలు నిలుపు చేశామని, పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
కాకినాడలో దారుణం
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను వివస్త్రను చేసి ఘోరంగా హత్య చేశారు. మృతదేహంపై గాయాల ఆనవాళ్లు ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఆరేళ్ల కిందట ఇదే ప్రదేశంలో ఓ యువకుడు యువతిపై అత్యాచారం చేసి ఘోరంగా హత్య చేశాడు. ఇన్నేళ్ల తర్వాత ఇదే ప్రదేశంలో మరో ఘోరం చోటుచేసుకుంది. పీలేరులో మరో మహిళ పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరు మండలం వరంపాటి వారిపల్లిలో మరో మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. మృతురాలు వరలక్ష్మి అనే వివాహితగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే వరలక్ష్మీ హత్యకు కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు. -
ఆ ట్రీట్మెంట్ ఆమె పాలిట శాపమైంది..
స్పెయిన్ : ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నమే ఆమె పాలిట శాపంగా మారింది. మృత్యువు తేనెటీగ రూపంలో కాటువేసి ప్రాణాలు తీసింది. తేనెటీగలు కుట్టించడం ద్వారా నొప్పుల నుంచి ఉపసమనం పొందడానికి చేసే’ ఎపిథెరపి’ ఆక్యుపంక్చర్ విధానం ఓ మహిళ ప్రాణం తీసింది. ఈ ఘటన స్పెయిన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. స్పెయిన్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ గత రెండేళ్లుగా కండరాళ్ల బిగుతుదనం, ఒత్తిడి తగ్గించుకోవడానికి ఈ థెరపీని చేయించుకుంటోంది. అయితే కొద్ది రోజుల ముందు థెరపీలో భాగంగా తేనెటీగతో కుట్టించుకోగా స్పృహ కోల్పోయింది. యాంటీ ఎపీ వెనమ్ ఇచ్చినప్పటికి ప్రయోజనం లేక పోవడంతో ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె తేనెటీగ కుట్టడం ద్వారా వచ్చిన అలర్జీ కారణంగా కోమాలోకి వెళ్లిన్నట్లు తెలిపారు. కొద్ది రోజుల పాటు కోమాలో ఉన్న ఆమె అనంతరం మరణించింది. వెయ్యి సంవత్సరాలకు పైగా వాడుకలో ఉన్న ఈ ప్రాచీన వైద్య విధానం ద్వారా ఇప్పటి వరకు ఎవరికీ ప్రాణ నష్టం కలగలేదని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటిసారని, నైపుణ్యం లేని వారు చేయడం వల్లే ఇలా జరిగి ఉంటుందని తెలిపారు. ఆక్యుపంక్చర్ విధానంలో సూదుల ద్వారా లేదా తేనెటీగలు కుట్టించడం ద్వారా ఇలా రెండు రకాలుగా చేస్తారు. తేనెటీగల విధానం ద్వారా ప్రమాదం ఉన్నప్పటికీ ప్రమోజనాల దృష్ట్యా అందరూ ఈ తరహా వైద్యం చేయించుకోవటానికే మొగ్గు చూపుతుంటారు. -
మిస్టరీగా.. గుర్తుతెలియని మహిళ హత్యోదంతం..!
పరువు హత్యా.. ప్రియుడే కాటేశాడా? మిర్యాలగూడ రూరల్ : మండల పరిధిలోని తుంగపహాడ్ శివారులో ఇటీవల వెలుగుచూసిన గుర్తుతెలియని మహిళ హత్యోదంతం కేసు మిస్టరీ వీడడం లేదు. అసలీ హత్యపై ఇప్పటి వరకు ఫిర్యాదు కూడా అందకపోవడంతో కేసు ఛేదన ఖాకీలకు సవాల్‌గా మారింది. గుర్తుతెలియని మహిళగా.. మండల పరిధిలోని తుంగపహాడ్ శివారులోని అడవిదేవులపల్లి రోడ్డులో ఈ నెల 6వ తేదీన గుర్తుతెలియని మహిళను హత్యచేసి ఆపై కాల్చేసిన విషయం తెలిసిందే. హత్యోదంతంపై ఎవరూ ఫిర్యాదు కూడా చేయకపోవడంతో గుర్తుతెలియని మహిళగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూడు బృందాలు.. మూడు ప్రాంతాలు సీఐ రమేష్‌బాబు నేతృత్వంలో వాడపల్లి, అడవిదేవులపల్లి, మాడ్గులపల్లి పోలీస్స్టేషన్ల ఖాకీలు మూడు బృందాలుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని అన్ని జిల్లాలతో పాటు ఉమ్మడి రాష్ట్రాల రాజధాని హైదరాబాద్‌లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. తొలు త రెండు రాష్ట్రాలోని అన్ని పోలీస్స్టేషన్ల వారీగా మిస్సింగ్ కేసులపై దృష్టిపెట్టినా ఇప్పటి వరకు అలాంటి కేసులు తారస పడలేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఇప్పటికే హత్యోదంతం వెలుగులోకి వచ్చి ఆరు రోజులు గడుస్తున్నా కేసులో పురోగతి కనిపించకపోవడంతో ఖాకీలు తలపట్టుకుంటున్నారు. ఏది ఏమైనా కేసును సాధ్యమైనంత త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు పేర్కొన్నారు. అంతుచిక్కని ప్రశ్నలెన్నో.. సదరు గుర్తుతెలియని మహిళ ఎవరు..? ఏ ప్రాంతానికి చెందింది..? ఎక్కడో హత్యచేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి కాల్చేశారా..? పోస్టుమార్టం నివేదికలో గర్భిణిగా తేలింది. అయితే, సగం కాలిన మహిళ కు పుస్తెమెట్టెలు లేవు. దీంతో పరువు కోసం కుటుంబ సభ్యులే హత్య చేశారా..? లేక పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియుడే కాటేశాడా..? ఇలా అంతుచిక్కని ప్రశ్నలెన్నో పోలీసులకు సవాల్‌గా మిగిలాయి. పోస్టుమార్టం నివేదికలో.. సగం కాలిన మహిళ మృతదేహాన్ని పోలీసులు అదే రోజు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే సరైన వైద్య సౌకర్యాలు లేవని ఇక్కడి వైద్యులు పోస్టుమార్టం చేయడానికి నిరాకరించారు. దీంతో పోలీసులు ఉన్నతాధికారుల ద్వారా ఉస్మానియా ఆస్పత్రి వైద్యులను రప్పించి ఈ నెల 8వ తేదీన గుర్తుతెలియని మహిళ మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. నివేదికలో సదరు మహిళ గర్భిణిగా తేలింది. -
ప్రసవానికొస్తే ప్రాణం పోయింది..
జనగామ: నిండు గర్భిణి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోకి ప్రసవానికి వస్తే ఆమెకు పుట్టిన శిశువుతోపాటు ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ దారుణం జరిగిందని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన జనగామలోని స్వర్ణ కళామందిర్ థియేటర్ సమీపంలోగల సూర్యవాణి ఆస్పత్రిలో మంగళవారం జరిగింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచకు చెందిన వాతాల లలిత(30) నిండు గర్భిణి కావ డంతో భర్త యాదగిరి ఈ నెల 5వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో సూర్యవాణి ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. రాత్రి లలితకు ఆపరేషన్ చేయగా, కడుపులోనే మగ బిడ్డ చనిపోయి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతిచెందిన శిశువును అదే రోజు తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం నుంచి లలిత పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లకు సమాచార మిచ్చినా పెద్దగా స్పందించలేదు. ఉదయం 11 గంటల సమయంలో వచ్చిన డాక్టర్ లలిత పరిస్థితి విషమంగా ఉందని ఆగమేఘాల మీద అంబులెన్స్ మాట్లాడి హైదరాబాద్‌కు పంపించారు. ఆస్పత్రికి వెళుతున్న క్రమంలో ఉప్పల్ సమీపంలో లలిత మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. కేవలం ఆపరేషన్ చేసే సమయంలో అలసత్వం వహించడంతోనే శిశివు, లలిత మృతి చెందినట్లు బంధువు దయాకర్ ఆరోపించారు. లలిత కడుపు భాగంలో పక్క నుంచి రక్త కారుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సిబ్బందితోనే పని కానిచ్చేశాకరని, వైద్యులు కూడా అందుబాటులో లేరన్నారు. సూర్యవాణి, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎదుట కుటుం బ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదిహేనేళ్ల క్రితం కూతురు మృతి మృతురాలి పెద్ద కూతురు అనూష సరిగ్గా పదిహేనేళ్ల క్రితం మార్చి 3న విద్యుదాఘాతంతో మృతిచెందింది. తొమ్మిదేళ్ల వయస్సులో ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు తల్లిదండ్రులను ఒంటరి చేసి వెళ్లి పోయింది. మరో పాప కోసం పదిహేనేళ్ల తర్వాత ఎదురు చూస్తున్న ఆ కుటుంబానికి అనుకోని విషాదం ఎదురైంది. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లిన లలిత కడుపులోనే రాత్రి శిశువు(మగబిడ్డ) మృతి చెందగా... మరుసటి రోజు తల్లి అనంతలోకాలకు చేరడంతో భర్త.. కుటుంబ సభ్యులు పుట్టెడు ఖంలో మునిగి పోయారు. మా తప్పేమీలేదు : డాక్టర్ స్వప్న లలితను అడ్మిట్ చేసే సమయంలో ఆమె క్రిటికల్ కండిషన్లో ఉంది. భర్త అనుమతి తీసుకున్న తర్వాతే ఆపరేషన్ మొదలు పెట్టాం. లలిత కడుపులోనే శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు తెలియజేశాం. రాత్రి సమయంలో పక్కనే ఉన్న కుటుంబసభ్యులు వాటర్ తాగించడంతో పరిస్థితి విషమించినట్లు గుర్తించాం. లలితకు బీపీ, షుగర్ ఉంది. ఆపరేషన్‌లో ఎలాంటి లోపం లేదు. -
జీపు ఢీకొని వలస కూలీ మృతి
కృష్ణాయపాలెం (మంగళగిరి టౌన్): రాజధాని పుణ్యమా అంటూ వెనుకబడిన జిల్లాల నుంచి తక్కువ కూలికి వేలాది మంది కార్మికులు రాజధాని ప్రాంతానికి వస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేటు కంపెనీల్లో పని చేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందినా పట్టించుకునే వారే లేకపోవడంతో కుటుంబలకు తీరని వ్యథే మిగులుతోంది. తాజాగా రాజధాని పరిధిలోని మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో సోమవారం ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. తెలిసిన వివరాల ప్రకారం.. కృష్ణాయపాలెంలో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు బి.ఎస్.ఇ.పి.ఎల్. అనే కంపెనీ కాంట్రాక్టు చేజిక్కించుకుంది. పనులు చేసేందుకు తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా నుంచి వందలాది మంది కూలీలు గ్రామానికి వచ్చారు. ఆదివారం ఎత్తిరాల తిమ్మమ్మ (26) రోడ్డుపై రాళ్లు ఏరుతుండగా సంస్థకు చెందిన ఓ జీపు రివర్స్‌లో వస్తూ యువతిని ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందింది. సంస్థ ప్రతినిధులు సోమవారం కూడా జీపు డ్రైవర్‌ను, జీపును పోలీసులకు అప్పగించకపోవడం గమనార్హం. చర్యలు శూన్యం.. ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. కంపెనీ యజమానులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించేందుకు సన్నాహాలు చేశారు. విషయం కాస్తా బయటకు పొక్కడంతో చేసేదేం లేక పోస్టుమార్టం చేసేందుకు మృతదేహాన్ని మంగళగిరి ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించి మార్చురీలో భద్రపరిచారు. వైద్యులు సోమవారం సాయంత్రానికి కూడా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. ఎక్కడ ప్రమాదం జరిగినా పోలీసులు వెంటనే మృతదేహాన్ని స్వాధీనపరచుకుని పోస్టుమార్టం నిర్వహించి, సంబంధిత వాహనంపై కేసు నమోదు చేస్తారు. కానీ రాజధానిలో ఏం జరిగినా బయటకు రాకపోవడం, రెండు మూడు రోజుల తర్వాత బయటకు వస్తుండటం గమనార్హం. -
కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య
పటాన్చెరు టౌన్ : కడుపునొప్పి తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఉన్నాయి. పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌కు చెందిన నర్సమ్మ(33) ఇస్నాపూర్‌లో నివాసముంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో రోజువారి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. కొంత కాలంగా తీవ్రమైన కడుపునొప్పి, తలనొప్పితో బాధపడుతోంది. నొప్పి ఎక్కువగా వచ్చినప్పుడల్లా టాబ్లెట్లు వేసుకునేది. ఈ క్రమంలో సోమవారం ఉదయం కూడా తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో లోపలి నుండి గడియ పెట్టుకుని ఇంటి పైకప్పుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి రాధమ్మ పోలీసులకు తెల్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇల్లు దగ్ధం.. మహిళ సజీవ దహనం
సాక్షి, అనంతపురం రూరల్: అనంతపురం నగరంలో శుక్రవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఇందిరానగర్‌లో గుడిసెకు నిప్పంటుకుని ఓ మహిళ సజీవ దహనం అయింది. మృతురాలిని ఒంటరి మహిళ రజియాబీగా గుర్తించారు. ఈ సంఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మోక్షం కోసం మహిళ ఆత్మాహుతి
సాక్షి, టీ.నగర్(చెన్నై): మూఢభక్తితో ఓ మహిళ ఆత్మాహుతి చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగంలో సంచలనం కలిగించింది. ఆలస్యంగా వెలుగుచూసిన సంఘటన వివరాలు.. శ్రీరంగం సాత్తారవీధికి చెందిన సత్యనారాయణ నగరాభివృద్ధి కార్యాలయ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి ఏడేళ్ల క్రితం మృతిచెందారు. ఆయన భార్య పట్టమ్మాళ్(85). ఆదివారం వైకుంఠ ఏకాదశి ముగింపు సందర్భంగా నమ్మాళ్వార్ మోక్షసిద్ధి కార్యక్రమంలో పాల్గొంది. అనంతరం ఇంటికి వచ్చిన పట్టమ్మాళ్ స్నేహితురాలు రాజ్యలక్ష్మికి ఆధార్, రేషన్ కార్డు ఇతర పత్రాలను అందజేసింది. సోమవారం ఉదయం పట్టమ్మాళ్ ఇంటికి వెళ్లిన రాజ్యలక్ష్మి తలుపు తట్టినప్పటికీ తెరవలేదు. కిటికీ నుంచి తొంగిచూసిన ఆమెకు లోపల పట్టమ్మాళ్ శరీరం కాలుతూ కనిపించింది. వెంటనే స్థానికుల సాయంతో ఇంటి తలుపులు పగులగొట్టి పట్టమ్మాళ్‌పై నీళ్లు పోశారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు తెలిసి కోయంబత్తూరులోని బంధువులకు సమాచారం ఇచ్చారు. సమాచారంతో అక్కడికి వచ్చిన శ్రీరంగం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీరంగం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని మంగళవారం బంధువులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు రాజ్యలక్ష్మి, ఇరుగుపొరుగువారి దగ్గర ప్రాథమిక విచారణ జరపగా నమ్మాళ్వార్ మోక్షసిద్ధి పొందేరోజున ఎవరైనా చనిపోతే మోక్షం పొందుతారని పట్టమ్మాళ్ తరచూ చెప్పినట్లు వారు పేర్కొన్నారు. -
యువతి అనుమానాస్పద మృతి
లంగర్‌హౌస్: పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై సోమవారం అనుమానాస్పదస్థితిలో యువతి మృతదేహం లభించింది. లంగర్‌హౌస్ ఇన్స్పెక్టర్ ఎంఏ జావీద్, మృతురాలి కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కర్ణాటకకు చెందిన రాజేశ్వరి అత్తాపూర్‌లో నివసిస్తోంది. ఆమెకు కూతురు కావ్యశ్రీ(21), కుమారుడు ఉన్నారు. మూడేళ్ళ క్రితం ఆమె భర్త రవీష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రాజేశ్వరి అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ బాధ్యతలు తీసుకున్న ఆమె కుమార్తె కావ్యశ్రీ ఏడాదిన్నరగా మాదాపూర్‌లోని డీఎల్ఎఫ్ సంస్థకు అనుబంధమైన యూనిసిస్లో సెక్యూరిటీ విభాగంలో పని చేస్తోంది. సోమవారం ఉదయం నిద్ర లేచేసరికి కావ్యశ్రీ కనిపించకపోవడంతో విధులకు వెళ్లి ఉంటుందని తల్లి భావించింది. అయితే ఉదయం 7.30 ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెం.74 సమీపంలోని ర్యాంపు దారిపై అనుమానాస్పద స్థితిలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన వాహనచోదకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న లంగర్‌హౌస్ పోలీసులు క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కావ్యశ్రీ సెల్‌ఫోన్ కాల్ డిటేల్స్,, సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అన్నీ అనుమానాలే... ♦ కావ్యశ్రీ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావ్యశ్రీ ఇళ్లు అత్తాపూర్‌లోని పిల్లర్ నెం.130 సమీపంలో ఉండగా, ఆఫీస్‌కు వెళ్లేందుకు ఆమె తరచూ పిల్లర్ నెం.128 వద్ద ఆటో ఎక్కేది. ♦ మృతదేహం లభ్యమైన పిల్లర్ నెం.74 నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఫ్లైఓవర్ పైకి వెళ్ళే వాహనాలు మాత్రమే నడుస్తుంటాయి. ద్విచక్ర వాహనాలకు కూడా ఈ రోడ్డులో అనుమతి లేదు. మృతురాలు అక్కడికి ఎందుకు వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ♦ కావ్యశ్రీ యూనిఫాం, టిఫిన్ బాక్సు సోమవారం ఆమె మృతదేహం వద్ద లభించలేదు. మృతదేçహానికి 150 మీటర్ల దూరంలో ఆమె చెప్పులు పడి ఉండటమూ అనుమానాలకు తావిస్తోంది. ఆమె ఫోన్ సైతం మరికొంత దూరంలో పడుంది. ♦ ఒక వేళ ఏదైనా వాహనం ఆమెను ఢీ కొట్టి ఉన్నా ఆమె ఒంటిపై గాయాలు ఉండాలి. అయితే మృతదేహంపై నడుము వద్ద మాత్రమే గాయమైంది. ఆమె ముక్కు, నోరు, చెవుల నుంచి తీవ్ర రక్తస్రావమైంది. నుదురు తదితర ప్రాంతాల్లో కమిలిన గాయాలు కనిపిస్తున్నాయి. ♦ కావ్యశ్రీ ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వచ్చిందనే అంశం పైనా స్పష్టత లేదు. సోమవారం ఉదయం తమకు కనిపించలేదని, రోజూ బయటకు వచ్చే సమయంలో మాత్రం రాలేదని కుటుంబీకులు చెబుతున్నారు.