ఆటోలోంచి కిందపడి యువతి మృతి | Young Woman Died In Road Accident | Sakshi
Sakshi News home page

ఆటోలోంచి కిందపడి యువతి మృతి

Dec 21 2023 1:25 PM | Updated on Dec 21 2023 1:25 PM

Young Woman Died In Road Accident - Sakshi

చింతలమానెపల్లి(సిర్పూర్‌): పత్తి ఏరేందుకు వెళ్తూ ప్రమాదవశాత్తు యువతి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బాలాజీ అనుకోడ గ్రామ పంచాయతీ పరిధిలోని పాల్వాయినగర్‌కు చెందిన దుర్గం అఖిల(18) బుధవారం గంగాపూర్‌ శివారులోని పత్తి చేనులో పత్తి ఏరడానికి ట్రాలీ ఆటోలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడింది.

అపస్మారస్థితిలోకి వెళ్లడంతో వెంటనే కౌటాల ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదని, వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై సురేశ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement