
గద్వాల క్రైం: తను ప్రేమించిన యువకుడు మృతిచెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గద్వాలలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణ ఎస్‌ఐ రామస్వామి కథనం మేరకు.. పట్టణంలోని గంటవీధికి చెందిన బోయ రామేశ్వరి (22) డిగ్రీ పూర్తి చేసింది. చదువుకొనే రోజుల్లో కర్నూలుకు చెందిన జయంత్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.
అయితే కుటుంబ సమస్యల కారణంగా జయంత్ ఈ నెల 14న ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి రెండ్రోజుల క్రితం స్నేహితురాలైన సంగీతతో కలిసి ప్రియుడి అంత్యక్రియలకు హాజరైంది. అప్పటి నుంచి తీవ్ర మనోవేదన, మనస్తాపానికి గురైంది. రామేశ్వరి, సంగీత కొంతకాలంగా గాం«దీచౌక్‌లో ఉండే రామతులసి ఆరోగ్య బాగోగులు చూసేందుకు ఆమె ఇంట్లో విధులు నిర్వర్తిస్తుండేవారు. ఈ క్రమంలో పనిచేస్తున్న ఇంట్లోనే ఎవరూ లేని సమయంలో సోమవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుంది.
స్నేహితురాలైన సంగీత మంగళవారం ఉదయం విధులకు వచ్చి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. రామేశ్వరి తల్లి కుర్మక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment