
అత్తాపూర్: వరకట్న వేధింపులతో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అత్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ నాగన్న తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని బీదర్‌కు చెందిన స్వప్న(27)కు అత్తాపూర్ పాండురంగ నగర్‌కు చెందిన అమరే‹Ùకు రెండున్నర సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.
ఇటీవల కొద్దిరోజులుగా అమరేష్ అదనంగా కట్నం కావాలని భార్యను వేధిస్తున్నాడు. పెళ్లి సమయంలో పెట్టిన బంగారాన్ని తన అవసరాల నిమిత్తం తాకట్టు పెట్టడంతో పాటు అదనంగా డబ్బు కావాలని డిమాండ్ చేస్తూ వేధించసాగాడు. ప్రతిసారి ఇంటి నుంచి డబ్బులు తేలేక..వేధింపులు తట్టుకోలేక శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.