ఖమ్మం: మండలంలోని మాలబంజర గ్రామానికి చెందిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందగా.. ఈ ఘటనపై సుజాతనగర్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన భూక్యా దివ్య (26)కు అదే గ్రామానికి చెందిన జగపతితో వివాహం జరిగింది. దివ్యకు మొదటి, రెండు కాన్పుల్లో మగ పిల్లలే జన్మించారు. మూడు నెలలుగా రుతుస్రావం కాకపోవడంతో ఈ నెల 5న రుతుస్రావం కోసం ట్యాబెట్లు వేసుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనంతరం రక్తస్రావానికి గురికాగా వైద్యం నిమిత్తం ఆమెను కుటుంబ సభ్యులు కొత్తగూడెం తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కాగా, కాన్పు ఇష్టం లేక గర్భాన్ని తొలగించుకోవాలనే ఉద్దేశంతో అబార్షన్ ట్యాబెట్లు వేసుకొందనే ప్రచారం జరుగుతోంది. చండ్రుగొండ మండలం మేకలబండకు చెందిన ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు గర్భస్రావం ట్యాబ్లెట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.తిరుపతిరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment