tablets
-
భారత్‌లో పెరిగిన ట్యాబ్ సేల్స్.. కారణం ఇదే
2024 ఏప్రిల్ - జూన్ మధ్యలో భారతదేశంలో ట్యాబ్ సేల్స్ భారీగా పెరిగినట్లు 'ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్' (IDC) వెల్లడించింది. మూడు నెలల్లో 1.84 మిలియన్ యూనిట్ల ట్యాబ్ విక్రయాలు జరిగినట్లు.. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 128.8 శాతం పెరిగినట్లు సమాచారం.వరల్డ్‌వైడ్ క్వార్టర్లీ పర్సనల్ కంప్యూటింగ్ డివైస్ ట్రాకర్ ప్రకారం.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేసింది. ఇది విక్రయాలు గణనీయంగా పెరగడానికి దోహదపడిందని తెలుస్తోంది. డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్‌లు అన్నీ కూడా అమ్మకాలు పెరగడానికి దోహదపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.మొత్తం ట్యాబ్ విక్రయాలలో.. 23.6 శాతం వాటాతో ఏసర్ గ్రూప్ మొదటి స్థానంలో.. ఆ తరువాత రెండు, మూడు స్థానాల్లో శామ్సంగ్, యాపిల్ వంటివి ఉన్నాయి. నాలుగో స్థానంలో లెనోవో ఉంది. షియోమీ ఐదో స్థానంలో నిలిచింది. కీలకమైన విద్యా ఒప్పందాలు, చిన్న & మధ్య తరహా వ్యాపారం విభాగం ఊపందుకోవడంతో వాణిజ్య విభాగం పటిష్టంగా మారింది. దీంతో ట్యాబ్స్ వినియోగం భారీగా పెరిగిందని దక్షిణాసియా డివైసెస్ రీసెర్చ్ మేనేజర్ భరత్ షెనాయ్ అన్నారు. -
టాబ్లెట్ త్వరగా పనిచేయాలంటే ఇలా చేయండి!
టాబ్లెట్ వేసుకున్న తర్వాత కుడి పక్కకు ఒరిగి కూర్చున్నా లేదా కుడిపక్కకే ఒరిగి పడుకున్నా కడుపులో టాబ్లెట్ త్వరగా కరిగి, ప్రతి కణానికీ అందుతుందంటున్నారు జాన్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు. ‘‘టాబ్లెట్ వేసుకున్నాక రక్తంలోకి వెళ్లడానికి ముందు అది చిన్న పేగుల్లోకి వెళ్లాలి. అయితే అలా వెళ్లాలంటే... కడుపును దాటాక టాబ్లెట్ మొదట చిన్నపేగుల తలుపు (వాల్వ్) ‘పైలోరస్’నూ దాటాక కరిగి రక్తంలో చేరాలి. కుడిపక్కకు ఒరగడం వల్ల అది మరింత వేగంగా, ప్రభావవంతంగా చేరుతుందన్నది వారి మాట. (చదవండి: అన్యురిజమ్స్ అంటే?) -
పెయిన్‌కిల్లర్స్ అబ్యూజ్..! పెయిన్ తగ్గించడమా? ప్రాణసంకటమా?
మోకాళ్లూ, వెన్నుపూసల అరుగుదలకు కారణమయ్యే ఆర్థరైటిస్, స్పాండిలోసిస్ వంటి సమస్యలూ, కొన్ని ఇన్ఫెక్షన్ల తర్వాత కలిగే బాధలూ, నొక్కుకుపోయే నరాలతో కలిగే నొప్పుల తీవ్రత వర్ణించడానికి అలవి కాదు. భరించలేని నొప్పి కలుగుతుంటే ఒకే ఒక మాత్ర వేయగానే ఉపశమనంతో కలిగే హాయి కూడా అంతా ఇంతా కాదు. అందుకే నొప్పి నివారణ మాత్రలకు కొందరు అలవాటు పడతారు. పెయిన్ కిల్లర్స్ అదేపనిగా వాడితే మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వాటి గురించి తెలుసుకుని, పెయిన్ కిల్లర్స్‌ను విచక్షణతో వాడాలనే అవగాహన కోసం ఈ కథనం.భరించలేనంత నొప్పి తీవ్రమైన బాధను కలగజేస్తుంది. ఆ నొప్పిని తగ్గించే మందును అదేపనిగా వాడుతూ ఉంటే అంతకు మించిన కీడు తెచ్చిపెడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కొందరు మొదటిసారి డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు రాసిచ్చిన మందుల్ని పదే పదే వేసుకుంటూ ఉంటారు. దాంతో కొంతకాలానికి కొన్ని అనర్థాలు రావచ్చంటూ హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.నొప్పి నివారణ మందులతో కలిగే దుష్పరిణామాలు... పొట్టలోపలి పొరలపైన : నొప్పి నివారణ మందులు వేసుకోగానే కడుపు లోపలి పొరలపై మందు దుష్ప్రభావం పడవచ్చు. దాంతో కడుపులో గడబిడ (స్టమక్ అప్సెట్), వికారం, ఛాతీలో మంట, కొన్నిసార్లు నీళ్లవిరేచనాలు లేదా మలబద్దకం వంటివి కలగవచ్చు. నొప్పినివారణ మందుల వాడకం దీర్ఘకాలం పాటు కొనసాగితే పొట్టలోకి తెరచుకునే సన్నటి రక్తనాళాల చివరలతో పాటు కడుపులోని పొరలు దెబ్బతినడం వల్ల కడుపులో పుండ్లు (స్టమక్ అల్సర్స్) రావచ్చు.అందుకే నొప్పి నివారణ మాత్రలను పరగడపున వేసుకోవద్దని డాక్టర్లు స్పష్టంగా చెబుతారు. ముందుగా కడుపులో రక్షణ పొరను ఏర్పరచే పాంట్రపొజాల్ వంటి మందులను పరగడపున వాడాక లేదా ఏదైనా తిన్న తర్వాతనే పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు.హైపర్‌టెన్షన్ ఉన్నవారిలో: హైబీపీతో బాధపడే కొందరిలో పెయిన్ కిల్లర్స్ వల్ల రక్తపోటు మరింత పెరగడంతో ప్రధాన రక్తనాళాల చివరన ఉండే అతి సన్నటి రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదముంటుంది. దాంతో గుండె పనితీరుపై ఒత్తిడి పెరగడం కారణంగా గుండెజబ్బులు రావచ్చు.కాలేయంపై దుష్ప్రభావం: ఒంటిలోకి చేరే ప్రతి పదార్థంలోని విషాలను (టాక్సిన్స్‌ను) మొదట విరిచేసి, వాటిని వేరుచేసేది కాలేయమే. ఆ తర్వాత వడపోత ప్రక్రియ మూత్రపిండాల సహాయంతో జరుగుతుంది. అందుకే ఒంటిలోకి చేరగానే పెయిన్ కిల్లర్స్ దుష్ప్రభావం తొలుత కాలేయం మీదే పడుతుంది.కిడ్నీలపైన: కడుపులోకి చేరే అన్ని రకాల పదార్థాలు రక్తంలో కలిశాక వాటిని వడపోసే ప్రక్రియను మూత్రపిండాలు నిర్వహిస్తాయి. దాంతో పెయిన్‌కిల్లర్ టాబ్లెట్స్లోని హానికర విషపదార్థాల ప్రభావాలు వడపోత సమయంలో మూత్రపిండాలపైన నేరుగా పడతాయి. అందుకే పెయిన్‌కిల్లర్స్ దుష్ప్రభావాలు కిడ్నీలపైనే ఎక్కువ. ఆ కారణంగానే... మిగతా దుష్ప్రభావాలతో పోలిస్తే... పెయిన్ కిల్లర్స్ కిడ్నీలను దెబ్బతీస్తాయనే అవగాహన చాలామందిలో ఎక్కువ.నొప్పినివారణ మందులు అతి సన్నటి రక్తనాళాలను దెబ్బతీసే ప్రమాదం ఉన్నందునా... అలాగే రక్తాన్ని వడపోసే అతి సన్నటి రక్తనాళాల చివర్లు కిడ్నీలో ఉన్న కారణాన ఇవి దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. రక్తం వడపోత కార్యక్రమం పూర్తిగా సజావుగా జరగాలంటే కిడ్నీల సామర్థ్యంలో కనీసం 30 శాతమైన సరిగా పనిచేయడం తప్పనిసరి.నొప్పి నివారణ మందులు కిడ్నీల సామర్థ్యాన్ని దెబ్బతీయడం వల్ల ‘ఎనాల్జిసిక్ నెఫ్రోపతి’ అనే జబ్బుతో పాటు దీర్ఘకాలిక వాడకం ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్–సీకేడీ’కి దారితీసే ప్రమాదం ఉంది. అయితే కిడ్నీలు దెబ్బతింటూ పోతున్నా, వాటి పనితీరు మందగించే వరకు ఆ విషయమే బాధితుల ఎరుకలోకి రాదు.రక్తం పైన: ఏ మందు తీసుకున్నా అది అన్ని అవయవాలకు చేరి, తన ప్రభావం చూపడానికి ముందర రక్తంలో ఇంకడం తప్పనిసరి. అప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్లేట్‌లెట్స్‌పై దుష్ప్రభావం పడినప్పుడు కోయాగ్యులోపతి వంటి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు.చివరగా... తీవ్రమైన నొప్పిని కలిగించే ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, స్పాండిలోసిస్ వంటì వ్యాధుల చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఔషధాల తయారీలోనూ గణనీయమైన పురోగతి కారణంగా గతం కంటే మెరుగైన, తక్కువ సైడ్ఎఫెక్ట్స్ ఉన్న మందులు అందుబాటులోకి వచ్చాయి.వీటితో ఉపశమనం మరింత త్వరితం. దుష్ప్రభావాలూ తక్కువే. అందుకే డాక్టర్లు అప్పుడెప్పుడో రాసిన మందుల చీటీలోని నొప్పి నివారణ మాత్రలను వాడకుండా మరోసారి డాక్టర్‌ను సంప్రదించాలి. దాంతో నొప్పి తగ్గడంతో పాటు దేహంలోని అనేక కీలకమైన అవయవాలను రక్షించుకోవడమూ సాధ్యపడుతుంది.దుష్ప్రభావాల లక్షణాలూ లేదా సూచనలివి...– ఆకలి లేకపోవడం లేదా అకస్మాత్తుగా బరువు పెరగడం, మలం నల్లగా రావడం, తీవ్రమైన కడుపునొప్పి నొప్పితో మూత్ర విసర్జన జరగడం లేదా మూత్రం చిక్కగా లేదా ఏ రంగూ లేకుండా ఉండటం – చూపు లేదా వినికిడి సమస్య రావడం ∙వీటిల్లో ఏది కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తాము వాడుతున్న నొప్పి నివారణ మందుల వివరాలు, తమ లక్షణాలను డాక్టర్‌కు తెలపాలి.దుష్ప్రభావాలను తగ్గించే కొన్ని జాగ్రత్తలివి...నొప్పి నివారణ మందులు వాడాల్సి వచ్చినప్పుడు వాటి దుష్పరిణామాలను వీలైనంతగా తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలంటూ డాక్టర్లు సూచిస్తుంటారు. అవి... – పరగడుపున నొప్పి నివారణ మందుల్ని వాడకూడదు. – అవి వేసుకున్న తర్వాత మామూలు కంటే కాస్త ఎక్కువ నీరు తాగడం మేలు. – కొన్ని రోజులు వాడాక నొప్పి తగ్గకపోతే మళ్లీ డాక్టర్ సలహా తర్వాతే వాటిని కొనసాగించాలి. – పెయిన్ కిల్లర్స్ వాడేవారు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ తరచూ మూత్రపిండాలు, బీపీ, గుండె పనితీరును తరచూ పరీక్షింపజేసుకుంటూ ఉండాలి.ఇవి చదవండి: కిడ్నీ వ్యాధిని జయించాడు -
నకిలీ మందుల తయారీదారులపై దాడులు
సాక్షి, హైదరాబాద్: నకిలీ మందుల తయారీ కేంద్రం గుట్టుర ట్టు చేసేందుకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ), హైదరాబాద్ సీపీ టాస్‌్కఫోర్స్ బృందం అధికారులు కలిసి ‘ఆపరేషన్ జై’పేరిట అంతర్రాష్ట్ర ఆపరేషన్ చేపట్టారు. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో నెక్టార్ హెర్బ్స్ అండ్ డ్రగ్స్ పేరిట ఈ నకిలీ మందుల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ట్టు అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు నకిలీ మందులను సరఫరా చేస్తున్నట్టు పక్కా ఆధారాలు సేకరించారు. దాడిలో మొత్తం రూ.44.33 లక్షల విలువైన నకిలీ మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ జైకు సంబంధించిన వివరాలను డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. మలక్‌పేట్‌లో లింకులు ఉత్తరాఖండ్ వరకు.. నకిలీ మందుల విక్రయానికి సంబంధించి విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు డీసీఏ అధికారులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మలక్‌పేట్‌లోని ఓ మెడికల్ దుకాణంలో ఫిబ్రవరి 27న సోదాలు చేపట్టగా రూ.7.34 లక్షల విలువైన ఎంపీఓడీ–200 ట్యాబ్లెట్లు పట్టుబడ్డాయి. ఈ నకిలీ మందులను విక్రయిస్తున్న అర్వపల్లి సత్యనారాయణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మీర్‌పేట్‌కు చెందిన గాండ్ల రాములు నుంచి తాను ఈ నకిలీ ట్యాబ్లెట్లు కొనుగోలు చేసినట్టు అతను అంగీకరించాడు. ఈ సమాచారంతో డీసీఏ అధికారులు గాండ్ల రాములును అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌కు చెందిన విషాద్ కుమార్, సచిన్ కుమార్ల నుంచి కొనుగోలు చేస్తున్నట్టు తెలిపాడు. సచిన్ కుమార్, విషాద్ కుమార్‌లు వాట్సప్ కాల్స్ ద్వారా తన నుంచి ఆర్డర్లు తీసుకుని ఉత్తరాఖండ్ నుంచి మందులను పంపుతున్నట్టు పేర్కొన్నాడు. ఈ సమాచారం మేరకు డీసీఏ, టాస్‌్కఫోర్స్ అధికారులు ఉత్తరాఖండ్‌లో ఆపరేషన్ చేపట్టారు. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో నెక్టార్ హెర్బ్స్ అండ్ డ్రగ్స్ సంస్థలో ఫిబ్రవరి 29న డీసీఏ అధికారులు సోదాలు నిర్వహించారు. సచిన్ కుమార్ నకిలీ ట్యాబ్లెట్లను తయారు చేసి, వివిధ కంపెనీల లేబుల్స్ అతికించి లక్ష నకిలీ ట్యాబ్లెట్లను రూ.35 వేలకు విక్రయిస్తున్నట్టు ఆధారాలు సేకరించారు. ఆ సంస్థనుంచి మొత్తం రూ. 44.33 లక్షల విలువైన నకిలీ ట్యాబ్లెట్లు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. -
బీదర్ కేంద్రంగా ‘నిట్రావెట్’ దందా
సాక్షి, హైదరాబాద్: హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరు జేబు దొంగల అరెస్టుతో చిక్కిన తీగ లాగితే.. కర్ణాటకలోని బీదర్ కేంద్రంగా సాగుతున్న నిట్రావెట్ టాబ్లెట్స్ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది.నగర కొత్వాల్ సందీప్ శాండిల్య, డీసీ పీలు సునీల్‌దత్, చక్రవర్తి గుమ్మిలతో కలిసి శనివా రం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించా రు. మల్లేపల్లిలోని మాన్గార్ బస్తీకి చెందిన ఎన్.చక్రధారి గుల్బర్గా నుంచి నిట్రావెట్ మాత్రలను అక్రమంగా ఖరీదు చేసి, నగరానికి తరలించి విక్రయిస్తుంటాడు. తీవ్రమైన రక్తపోటు, మధుమేహ వ్యా ధులతో బాధపడుతున్న వారికి రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రపట్టదు. ఈ కారణంగా వైద్యులు రోగులకు ఈ మాత్రలను ప్రిస్రై్కబ్ చేస్తారు. నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు గత ఆదివారం చక్రధారిని అరెస్టుచేసి విచారిస్తున్న సమయంలోనే బీదర్‌కు చెందిన బిర్జు ఉపాధ్యాయ వీటిని సరఫరా చేస్తున్నట్లు బయటపెట్టాడు. దీంతో ఈ సమాచారాన్ని టాస్‌్కఫోర్స్ పోలీసులు టీఎస్ నాబ్‌కు అందించారు. -
ప్రెగ్నెన్సీలో షుగర్.. తల్లీ, బిడ్డకు ప్రమాదం, ఆ ట్యాబ్లెట్‌తో..
నాకిప్పుడు ఏడో నెల. షుగర్ ఉందని చెప్పారు. Metformin 100mg అనే మాత్రలు వేసుకోమన్నారు. ఇది ప్రెగ్నెన్సీలో వేసుకోవచ్చా? మాత్రలు వేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలి? – పి. కృష్ణశ్రీ, భీమవరం Metformin అనే మాత్రలను ప్రెగ్నెన్సీలో వాడవచ్చు. డయాబెటిస్‌కి ఇది మంచి మెడిసిన్. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్‌ని 80 శాతం స్ట్రిక్ట్ డైట్‌తో మేనేజ్‌చేస్తారు. కానీ షుగర్ పెరిగినప్పుడు మాత్రలు లేదా ఇన్సులిన్‌ను సజెస్ట్ చేస్తారు. షుగర్ నియంత్రణలో లేకపోతే తల్లికి, బిడ్డకు ప్రమాదం ఉంటుంది. ఈ జెస్టేషనల్ డయాబెటిస్‌ని సులభంగా గుర్తించి .. స్ట్రిక్ట్‌గా హోమ్ మానిటరింగ్ చేసి నియంత్రణలోకి తెస్తే షుగర్ వల్ల తలెత్తే సమస్యల ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఉండదు. బిడ్డ అధిక బరువుతో పుట్టడం, ప్రసవమప్పుడు ఇబ్బందులు, అధిక రక్తస్రావం, అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి రావడం వంటి చాన్సెస్ తగ్గుతాయి. Metformin .. .. షుగర్ మరీ డౌన్ కాకుండా.. hypoglycemia episodes రిస్క్‌ను తగ్గిస్తుంది. ఇన్సులిన్‌తో ఈ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఈ మాత్రతో ఉండే ఏకైక ఇబ్బంది.. కడుపు ఉబ్బరం. అందుకే మాత్రలను ఎప్పుడూ తిన్న వెంటనే వేసుకోవాలి. తక్కువ మోతాదులో మొదలుపెట్టి.. నాలుగు రోజులకు మోతాదు పెంచి కావలసిన మోతాదుకు అడ్జస్ట్ చేస్తారు. షుగర్ రీడింగ్స్ నార్మల్ అయితే అదే మోతాదును కొనసాగిస్తారు. రెండు వారాల్లో కంట్రోల్ కాకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తారు. మాత్రల విషయానికి వస్తే.. రోజూ ఇంట్లో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని మానిటరింగ్ చేస్తూ మాత్రల మోతాదును నిర్ధారిస్తారు. -
ఎప్పటికి యవ్వనంగా ఉండాలని..వందకిపైగా టాబ్లెట్లు, కొడుకు రక్తం..
యవ్వనంగానే ఉండాలనే అందరూ అనుకుంటారు. కానీ అది కుదరుదు. కాలానుగుణంగా వయసు రీత్య వచ్చే మార్పులను యథాతథాంగా ఆమోదించాల్సిందే. దేనికైనా కొంత వరకే అవకాశం. ఆ తర్వాత కనుమరుగు కాక తప్పదు. ఇది ప్రకృతి నియమం కూడా. దీనికి విరుద్ధంగా చేయాలనుకున్న పనులు ఇంతవరకు వికటించాయే గానీ సఫలం కాలేదు. కానీ ఇక్కడొక మిలీనియర్ దాన్ని సఫలం చేసి తిరగ రాయలనుకుంటున్నాడు. ఎప్పటకీ యవుకుడిలా మంచి దేమధారుఢ్యంతో ఉండాలని అతడు చేస్తున్న పనులు వింటే షాక్ అవుతారు. మల మూత్ర విసర్జనలు సైతం.. వివరాల్లోకెళ్తే..యూఎస్‌కి చెందిన టెక్ మిలీనియర్ బ్రయాన్స్ జాన్సన్‌కి ఓ వింత కోరిక పుట్టింది. ఎప్పటికీ నవయవ్వనంగా ఉండాలనే ఆలోచన వచ్చింది. అందుకోసం యాంటీ ఏజింగ్ అనే ప్రక్రియకు తెరతీశాడు. అందులో భాగంగా అతడు రోజుకు దాదాపు వందకు పైగా అంటే.. దగ్గర దగ్గర 111 మాత్రలు హాంఫట్ చేస్తాడట. ఇక దీని వల్ల తన శరీరంలో ఉత్ఫన్నమయ్యే మార్పులను పర్యవేక్షించేలా ఆర్యోగ్య పర్యవేక్షణకు సంబందించిన అత్యాధునిక పరికరాలతో నిరంతరం పర్యవేక్షిస్తాడు. అవి ఏకంగా అతడి మల మూత్ర విసర్జనలను సైతం పరిక్షించి శరీరంలో వచ్చే మార్పులను పసిగట్టి చెబుతుందట. అలాగే ప్రతి రోజు బేస్ బాల్ టోపీని ధరిస్తాడు. అది అతడి నెత్తిపై వృధ్యాప్య లక్షణాలు కనిపించే తెల్ల జుట్టును డిటెక్ట్ చేసి దాన్ని రిపేర్చేస్తుందట. ప్రస్తుతం జాన్సన్ వయసు 46 ఏళ్లు. అయితే అతడు తన అవయవాలన్నీ 18 ఏళ్ల యువకుడి మాదిరిగే మారేలా చేయడం అతని ఆశయం, ఆశ కూడా. నిజానికి జాన్సన్ తన ప్రాసెసింగ్ కంపెనీ బ్రెయిన్ ట్రీ సొల్యూషన్స్‌ను ప్రముఖ దిగ్గజ ఈబే కంపెనీకి రూ. 6 వేల కోట్లకి విక్రయించడంతో.. జాన్సన్ దిశ తిరగబడిందనే చెప్పాలి. ఇక అక్కడ నుంచి పలు వ్యాపారాలతో మిలీనియర్‌గా మారాడు. జాన్సన్(ఎడమ వైపు), తన కొడుకుతో దిగిన ఫైల్ ఫోటో యాక్సిడెంట్ కాకూడదని.. ఇక జాన్సన్‌కి సడెన్‌గా ఇలా యువ్వనంగా మారాలనే వింత కోరిక ఎలా పుట్టిందో గానీ అందుకోసం అతడు తన జీవనశైలిలో ఎన్ని మార్పులు చేశాడంటే..ఒకప్పుడూ లాస్ఏంజిల్స్ వీధుల్లో గంటకు 16 మైళ్ల వేగంలో ఆడి కారులో రయ్యి.. రయ్యి.. మని వెళ్లే ఆ వ్యక్తి కాస్త..ఇప్పుడూ తానే స్వయంగా నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటు వెళ్తున్నాడు. పైగా ఎక్కడకైనా బయలుదేరే ముందు డ్రైవింగ్ మంత్రాన్ని జపిస్తాడట. ఇది ఎందుకంటే?.. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇంతలా యవ్వనంగా మారాలని కోట్లు కోట్లు ఖర్చు చేస్తున్న డబ్బు, అతడి కష్టం వృధా అయిపోతాయి కదా!అందుకని. ప్రాజెక్ట్ బ్లూప్రింట్తో.. మనోడు అక్కడితో ఆగలేదు యవ్వనంగా ఉండాలని ఏకంగా తన కొడుకు రక్తాన్ని ఎక్కించుకుంటున్నాడట. రోజు దాదాపు 30 మంది వైద్యుల బృందం ఎమ్మారై వంటి స్కానింగ్‌లు నిర్వహించి.. శరీరంలో ఎక్కడ కొలస్టాల్ పెరుగుతుందో చెక్ చేస్తారు. వృద్ధాప్య ఛాయలు వచ్చేలా జరగుతున్న మార్పులను గమనిస్తుంటారు. అందుకు తగ్గ ట్రీట్మెంట్ వెంటనే అందిస్తారట జాన్సన్‌కి. పైగా ఆ వైద్య బృందం బ్లూప్రింట్ అనే ప్రాజెక్ట్‌తో జాన్సన్‌ని తిరిగి యవ్వనంగా అయ్యేలా అతడి ఏజ్‌ని వెనక్కు తీసుకొచ్చే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేగాదు జాన్సన్ కొల్లాజెన్,స్పెర్మిడిన్, క్రియేటిన్ వంటి పోషకాలతో నిండిన "గ్రీన్ జెయింట్" స్మూతీతో రోజును ప్రారంభిస్తాడట. ఇక జాన్సన్ ఇలా యవ్వనంగా మారేందుకు ఏడాదికి సుమారు రూ. 16 కోట్లు దాక ఖర్చు పెడుతున్నాడు. నిజం చెప్పాలంటే.. మన జాన్సన్ అత్యంత ఖరీదైన వ్యక్తి అనాలి. అతడు చెప్పిన ప్రకారం యవ్వనంగా మారాలని చేస్తున్న ఖర్చును కనుగా టాలీ చేస్తే అతడి విలువ ఏకంగా మూడు వేలు కోట్లు. వామ్మో!..ఏందిరా నీకు ఈ పిచ్చి కోరిక అనిపిస్తుంది కదా!. ఈ మహానుభావుడు పెట్టే ఖర్చు ఒక దేశం అభివృద్ధి లేదా ఓ రెండు పట్టణాలు అదీ కాదంటే..కనీసంచాలా అట్టడుగు కుగ్రామాల అభివృద్ధికి ఖర్చు చేస్తే బాగుపడతాయి. ఎందరో నిరుపేదల కష్టాలు తీరతాయని అనిపిస్తుంది కదా!. (చదవండి: ఎనిమిదో ఖండం! 375 ఏళ్లుగా !..వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడుతున్నారా?మీరు డేంజర్లో ఉన్నట్లే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రాణాలను కాపాడే యాంటీబయోటిక్స్ ఒక్కోసారి ప్రాణాంతకమవుతున్నాయి. విచ్చలవిడి వినియోగం కొంప ముంచుతోంది. ప్రతి చిన్న రోగానికీ పెద్ద మందు వేయడం శరీరానికి భారంగా మారింది. జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న వాటికి కూడా ఖరీదైన, మోతాదుకు మించి యాంటీబయోటిక్స్‌ను వాడుతున్నారు. దీంతో కొన్ని రకాల బాక్టీరియా హై డోస్ (తీవ్ర మోతాదుతో కూడిన) యాంటీబయోటిక్స్కూ లొంగని పరిస్థితి ఎదురైంది. దీనివల్ల జరగాల్సిన నష్టం కంటే ఎక్కువగా జరుగుతున్నట్టు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాంటీబయోటిక్స్ గురించి కొన్ని నిజాలు.. ►ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా రూ.240 కోట్ల విలువైన యాంటీబయోటిక్స్ వినియోగంలో ఉన్నట్టు అంచనా. ► డాక్టరు సూచించినవి కాకుండా నేరుగా కౌంటర్ సేల్ అంటే మందుల షాపు వద్దకెళ్లి వాడుతున్న వారు 30 శాతం మంది. ► ఉదాహరణకు ఒక వ్యాధి తగ్గాలంటే ఐదురోజుల కోర్సు పూర్తి చేయాలి. కానీ మూడురోజులకే జబ్బు తగ్గిందని ఆపేస్తున్నారు. ► చిన్న చిన్న జ్వరాలు, జలుబు, దగ్గు, విరేచనాలు వంటి జబ్బులకు యాంటీబయోటిక్స్ వాడేవాళ్లు ఎక్కువయ్యారు. ►యాంటీబయోటిక్స్‌కు జబ్బులు తగ్గకపోతే రోగం ముదిరి ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండాలి. దీనివల్ల ఆర్థికంగా చితికిపోతారు. ► ఎక్కువ వినియోగంలో ఉన్న యాంటీబయోటిక్స్...అజిత్రోమైసిన్, సెఫాక్సిమ్, సెఫడోక్సిమ్, నార్‌ఫ్లాక్సిన్, సెఫ్ట్రియాక్సోన్, ఆఫ్లాక్సోసిన్, సిప్రోఫ్లాక్సిన్, సిఫ్రాన్, సెప్ట్రాన్, మోనోసెఫ్, టాజోబ్యాక్టమ్ వంటివి. నియంత్రణ ముఖ్యం యాంటీ బయోటిక్స్ వాడేముందు డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి. యాంటీ బయోటిక్స్ వాడేటప్పుడు కోర్సు పూర్తయ్యే వరకూ మధ్యలో మానెయ్యొద్దు. డాక్టర్ సూచించిన మోతాదే వాడాలి. మెడికల్ స్టోర్‌కు వెళ్లి మనకు మనమే యాంటీబయోటిక్ తెచ్చుకోకూడదు. చిన్న చిన్న జబ్బులకు యాంటీబయోటిక్స్ వాడటం మంచిది కాదు. యాంటీ బయాటిక్ ఎలా వాడాలి? బాధితులకు వచ్చిన వైద్య సమస్య ఆధారంగా, దాని తీవ్రతను బట్టి... దానికి ఏ తర్చహా యాంటీబయాటిక్స్ వాడాలి, అది కూడా ఎంత మోతాదులో వాడాలి, దాన్ని ఎంతకాలం పాటు వాడాలన్న విషయాలు వైద్యులకే తెలుస్తాయి. ఒకవేళ మందుల మోతాదును తక్కువగా ఇస్తుంటే... రోగకారక క్రిములు క్రమంగా యాంటీబయాటిక్స్ తమపై పనిచేయని విధంగా నిరోధకత (రెసిస్టెన్స్)ను పెంచుకోవచ్చు. అందుకే డాక్టర్లు నిర్దేశించిన మేరకు మాత్రమే, వారు చెప్పిన కాల వ్యవధి వరకే వాటిని వాడాలి.వ్యాధి తీవ్రతను బట్టి యాంటి బయాటిక్స్ వాడాల్సి ఉంది. కానీ చాలా మంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. యాంటీ బయాటిక్స్ మందులు ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీ, కాలేయ వ్యాధుల బారిన పడి మంచాన పడుతున్నారు. యాంటీ బయాటిక్స్ అధిక మోతాదులో వాడడం వల్ల ప్రస్తుతం కొత్త చిక్కు వచ్చి పడింది. బాక్టీరియాలు సైతం యాంటీ బయాటిక్స్ మందులకు అలవాటు పడడంతో శరీరంలో సహజ సిద్ధంగా ఉండే వ్యాధి నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రమాదకర స్థాయికి యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగిపోవడం వల్ల ఇప్పటికైనా నియంత్రణ చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి దేశంలోని చాలా కాంబినేషన్ యాంటీబయాటిక్స్‌ను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. రెండు మూడురకాలకు చెందిన యాంటీ బయాటిక్స్‌ను కలిపి (కాంబినేషన్) వాడటం సరైంది కాదని పేర్కొంది. కాంబినేషన్ మందులను కుష్టు, క్షయ వంటి వ్యాధులకు వాడాలి. కానీ మన వద్ద చిన్న చిన్న రోగాలకు కూడా కాంబినేషన్ ఔషధాలు వాడుతున్నారు. ఒకటి అవసరమైనచోట రెండు వాడటం వల్ల కూడా ఆ మందు పనిచేయని పరిస్థితి వస్తుంది లొంగకపోతే పెద్ద ప్రమాదం యాంటీబయోటిక్స్ మందులు పరిమితంగా ఉంటాయి. ఒక్కసారి ఈ మందులకు బ్యాక్టీరియా లొంగకపోతే తర్వాత కష్టం. కొత్త జబ్బులు వచ్చినప్పుడు ఈ మందులు పనిచేయవు. ఈ పరిస్థితులను అధిగమించడం చాలా కష్టమవుతుంది. పరిమిత మోతాదులో వాడాలి. – డా.సీహెచ్.ప్రభాకర్‌రెడ్డి,హృద్రోగ నిపుణులు మోతాదుకు మించి వాడితే... యాంటీబయోటిక్స్ పరిమితంగా వాడాలి. జబ్బును బట్టి డాక్టర్ ప్రిస్కిప్షన్ మేరకే కోర్సు వాడాలి. అలాగని రెండ్రోజులు వాడి వదిలేయకూడదు కూడా. పరిమిత మోతాదులో జబ్బును బట్టి వాడితేనే మంచిది. లేదంటే కొన్ని జబ్బులు మొండికేసే అవకాశం ఉంటుంది. –డా.ఫణి మహేశ్వరరెడ్డి, జనరల్ సర్జన్ -
కాలం చెల్లిన మందుల విక్రయం.. జర జాగ్రత్త!
రంగారెడ్డి: మండల కేంద్రంలోని పట్నం మహేందర్‌రెడ్డి జనరల్ ఆస్పత్రిలో కాలం చెల్లిన మందులు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఓ వ్యక్తి ఆరోపించాడు. మండలంలోని పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రికి రెండు రోజుల కిత్రం చేవెళ్లకు చెందిన ఓ వ్యక్తి తన రెండేళ్ల కొడుకుకు చర్మ సమస్య ఉందని వెళ్లారు. వైద్యులను సంప్రదించగా మందులు రాసి ఇచ్చారు. దీంతో అక్కడే ఉన్న మెడికల్షాపులో మందులు తీసుకొని ఇంటికి వెళ్లి పరిశీలించగా గత రెండు నెలల కిత్రమే ఎక్స్పైర్ అయినట్లు ఉంది. దీంతో వెంటనే ఆస్పత్రి ఇన్చార్జి వినోద్‌రెడ్డికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. సోమవారం తనిఖీ నిర్వహించి చర్యలు తీసుకుంటామని వినోద్‌రెడ్డి తెలిపారు. ఉన్నత వైద్యాధికారులు మెడికల్ దుకాణాలపై తనిఖీలు నిర్వహించి పేద ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై ఆస్పత్రి ఇన్చార్జి వినోద్‌రెడ్డిని సాక్షి సంప్రదించగా అవును ఈ విషయం తన దృష్టికి ఉదయమే బాధితుడు ఫోన్లో చెప్పాడని తెలిపాడు. ఆస్పత్రిలోని మెడికల్ షాపులో తనిఖీ చేయించి కాలం చెల్లిన మందులు ఉంటే తొలగిస్తామని తెలిపారు. -
కంప్యూటర్ల దిగుమతిపై నియంత్రణ
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం గురువారం నియంత్రణలు విధించింది. చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇకపై ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు దిగుమతిదారులు ప్రభుత్వం నుంచి అనుమతి, లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నియంత్రణల విధింపునకు పలు కారణాలు ఉన్నప్పటికీ పౌరుల భద్రతను పరిరక్షించడం అన్నింటికన్నా ప్రధానమైనదని ఆయన వివరించారు. ఆంక్షలు విధించడమనేది దిగుమతులను పూర్తిగా నిషేధించే ఉద్దేశంతో తీసుకున్నది కాదని, వాటిని నియంత్రించడం మాత్రమే లక్ష్యమని చెప్పారు. దీనివల్ల దేశీయంగా ధరలేమీ పెరగబోవని తెలిపారు. కొన్ని మినహాయింపులు ఉంటాయి.. ‘ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆల్–ఇన్–వన్ పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా చిన్న స్థాయి కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై తక్షణమే నియంత్రణలు అమల్లోకి వస్తాయి‘ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అయితే, కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉంటాయని పేర్కొంది. ఆగస్టు 3 కన్నా ముందుగానే లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసిన కన్సైన్మెంట్లను దిగుమతి చేసుకోవచ్చని వివరించింది. ఆగస్టు 4 నుంచి దిగుమతిదారు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ఆర్అండ్డీ, టెస్టింగ్, రిపేర్ అండ్ రిటర్న్ తదితర అవసరాల కోసం కన్సైన్మెంట్కు 20 ఐటమ్‌ల వరకు దిగుమతి చేసుకునేందుకు లైసెన్సు తీసుకోనక్కర్లేదని వివరించింది. ఈ–కామర్స్ పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేసే ఒక ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, పీసీ, లేదా అల్ట్రా స్మాల్ ఫారం ఫ్యాక్టర్ కంప్యూటర్లకు కూడా మినహాయింపులు వర్తిస్తాయి. అయితే, వాటికి వర్తించే సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతులపై ఆంక్షల వల్ల దేశీయంగా ఆయా ఉత్పత్తుల రేట్లు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. బిలియన్ డాలర్ల కొద్దీ దిగుమతులు.. 2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. భారత్ ఈ తరహా ఉత్పత్తులను ఏటా 7–8 బిలియన్ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం భారత్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో 65 శాతం వాటా ఎల్రక్టానిక్స్, యంత్రాలు, ఆర్గానిక్ రసాయనాలు ఉంటున్నాయి. రోజువారీ ఉపయోగించే మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, సోలార్ సెల్ మాడ్యూల్స్ మొదలైన వాటి కోసం ఎక్కువగా చైనాపైనే ఆధారపడాల్సి ఉంటోంది. దీన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. -
ట్యాబ్లెట్లలో పురుగులు
పాములపాడు: రోగాలను నయం చేసే మందుల్లో పురుగులు పడిన ఘటన ఆత్మకూరు పట్టణంలో వెలుగుచూసింది. మండలంలోని జూటూరు గ్రామానికి చెందిన భాస్కర్ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 22న భార్య విజయలక్ష్మికి అనారోగ్యంగా ఉండటంతో ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించి నాలుగు రకాల మందులు రాసిచ్చారు. అక్కడే ఉన్న తరుణ్ తేజ్ మందుల దుకాణంలో వీటిని కొనుగోలు చేశారు. అయితే బుధవారం ఉదయం ట్యాబ్లెట్ వేసుకునేందుకు షీట్ ఓపెన్ చేయగా Axeduracv 500 ట్యాబ్లెట్‌కు రంధ్రాలు పడి పురుగులు బయటకు రావడంతో ఆందోళనకు లోనయ్యారు. ట్యాబ్లెట్ల తయారీ తేది ఫిబ్రవరి 2023 కాగా.. ఎక్స్పైరీ గడువు జులై 2024 వరకు ఉంది. అయినప్పటికీ ఇలా జరగడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై మాయలూరు ఫార్మసిస్టు సత్యనారాయణరెడ్డిని వివరణ కోరగా తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడమే కారణమన్నారు. ముడి పదార్థం నాసిరకం కావడంతోనే ఇలా జరిగి ఉంటుందన్నారు. ప్యాకింగ్ సరిగా లేకపోయినా పురుగులు అందులో చేరుతాయన్నారు. పురుగులు తప్పనిసరిగా చనిపోవాలని, అలా జరగలేదంటే ట్యాబ్లెట్ నాసిరకం అనే విషయం అర్థమవుతుందన్నారు. ఈ కంపెనీ కూడా చెప్పుకోదగ్గది కాదన్నారు. -
మహిళ మృతికి అబార్షన్ ట్యాబ్లెట్లే కారణమా?
ఖమ్మం: మండలంలోని మాలబంజర గ్రామానికి చెందిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందగా.. ఈ ఘటనపై సుజాతనగర్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన భూక్యా దివ్య (26)కు అదే గ్రామానికి చెందిన జగపతితో వివాహం జరిగింది. దివ్యకు మొదటి, రెండు కాన్పుల్లో మగ పిల్లలే జన్మించారు. మూడు నెలలుగా రుతుస్రావం కాకపోవడంతో ఈ నెల 5న రుతుస్రావం కోసం ట్యాబెట్లు వేసుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం రక్తస్రావానికి గురికాగా వైద్యం నిమిత్తం ఆమెను కుటుంబ సభ్యులు కొత్తగూడెం తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కాగా, కాన్పు ఇష్టం లేక గర్భాన్ని తొలగించుకోవాలనే ఉద్దేశంతో అబార్షన్ ట్యాబెట్లు వేసుకొందనే ప్రచారం జరుగుతోంది. చండ్రుగొండ మండలం మేకలబండకు చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడు గర్భస్రావం ట్యాబ్లెట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.తిరుపతిరావు తెలిపారు. -
మలబద్ధకమా! కాయం చూర్ణ ఇక గ్రాన్యూల్స్ రూపంలో
హైదరాబాద్: మలబద్ధకానికి ఔషధంగా గత 50 సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్న తమ ప్రతిష్టాత్మక ‘కాయం చూర్ణ’ ఇక గ్రాన్యూల్స్ (గుళికలు లేదా పలుకులు) రూపంలోనూ అందుబాటులోనికి రానుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. (వివో ఎక్స్ 90, 90ప్రొ స్మార్ట్ఫోన్లు లాంచ్, ధరలు చూస్తే) ఈ అడ్వాన్స్డ్ ఫార్ములా వల్ల చూర్ణ గొంతులో అతుక్కుపోవడం, అసౌకర్యం వంటి సమస్యలు తొలగిపోతాయని భావ్‌నగర్ కేంద్రంగా ఈ ఉత్పత్తిలో ఉన్న సేథ్ బ్రదర్స్ సంస్థ వివరించింది. జీలకర్ర రుచితో ఉండే ఈ కొత్త ప్రొడక్ట్ కడుపును శుద్ధి చేయడానికి మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రకటన పేర్కొంటూ.. ఆముదం, గులాబీ ఆకుల మేళవింపుతో ప్రొడక్ట్ రూపొందడం దీనికి కారణమని వివరించింది. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) -
ఈశాన్యంలో విరిసిన జాస్మిన్
రోడ్లు బాగుండవువాతావరణం సరిగా ఉండదు.అదీ గాక గంటల కొద్దీప్రయాణించే సమయం ఉండదు.అలాంటప్పుడు ప్రాణం పోసేమందులు అందాలంటే? డ్రోన్లే దారి.అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిననిక్ జాస్మిన్ మొత్తం ఈశాన్య రాష్ట్రాలకేమొదటి మహిళా డ్రోన్ ఆపరేటర్.గాల్లో మందులు పంపే ఈ సవాలునుఆమె సమర్థంగా స్వీకరించింది. ఈ సన్నివేశం ఎప్పుడూ జరిగేదే. రోడ్డు కూడా సరిగా లేని అటవీ ప్రాంతాల్లో విషజ్వరాలు పాకుతాయి. రోగి కదల్లేడు. అంబులెన్స్ రావడానికి సమయం పడుతుంది లేదా రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యి దగ్గరిలోని ఆస్పత్రికి వెళ్లాలన్నా గంటలు గంటలు పడుతుంది. లేదా ఏదో వాగు పొంగి రోడ్డు బ్లాక్ అవుతుంది. కొండ చరియలో, చెట్ల కొమ్మలో విరిగి పడతాయి. సరైన మందు పడితే రోగి ప్రాణాలు దక్కుతాయి. అప్పుడు ఏం చేయాలి?డ్రోన్ల ద్వారా మందులు చేరవేయడం సరైనదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహనకు వచ్చాయి. ఇందుకు అనేక స్టార్టప్ కంపెనీలు, డ్రోన్ల తయారీ సంస్థలు ప్రతిపాదనలు చేశాయి. సేవారంగంలో ఉన్న సంస్థలు కూడా ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతున్నాయి. దాంతో డ్రోన్ల ద్వారా మందుల పంపిణీ రెండేళ్ల క్రితం నుంచి ఉత్సాహంగా జరుగుతోంది. తెలంగాణలోని వికారాబాద్‌లో ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ కార్యక్రమం మొదలెట్టడం అందరికీ గుర్తే. ఈశాన్య రాష్ట్రాలలో డ్రోన్లు ఈశాన్య రాష్ట్రాలలో కొండ ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు ప్రాణాధార మందులు సకాలంలో చేరవేయడం ఎప్పుడూ సవాలే. కొండ దారుల్లో ప్రయాణం ఆలస్యం అవుతుంది. అదీగాక వాహనాలు వెళ్లలేని చోట్ల కూడా ఆదివాసీలు నివాసాలు ఉంటారు. వీళ్లను కాపాడాలంటే సరైన సమయంలో మందులు చేరవేయడం చాలా అవసరం. అందుకే ‘సస్టెయినబుల్ యాక్సెస్ టు మార్కెట్ అండ్ రిసోర్సెస్ ఫర్ ఇన్నోవేటివ్ డెలివరీ ఆఫ్ హెల్త్ కేర్’ (సమృద్) సంస్థ ఐపిఇ గ్లోబల్, నీతి అయోగ్‌లతో కలిసి మరికొన్ని దాతృత్వ సంస్థల భాగస్వామ్యంతో ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ ప్రాజెక్ట్‌లో భాగంగా అక్కడ డ్రోన్ల ద్వారా మందుల పంపిణి మొదలెట్టింది. అరుణాచలప్రదేశ్‌లో సాగుతున్న ఈ కార్యక్రమంలో డ్రోన్ ఆపరేట్ చేస్తున్న తొలి మహిళ నిక్ జాస్మిన్ సేవలు అందిస్తోంది. ఆమె మొదట పారాగ్లైడర్ అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్ జిల్లా నుంచి నిక్ జాస్మిన్ డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేస్తుంది. ఇందుకోసం అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద మందులు నిల్వ చేసే మందులు నిల్వ చేసే ఫ్రీజర్లు, ఫ్రిజ్‌లు ఉన్న మినీ హెలిపాడ్ వంటి స్టేషన్ వద్ద ఆమె విధులు నిర్వర్తించాలి. యాప్ ద్వారా ఫలానా చోటుకు మందులు పంపాలి అనే సందేశం రాగానే స్పందించాలి. ‘డ్రోన్లు 400 అడుగుల ఎత్తు నుంచి ప్రయాణం చేస్తాయి. 20 నుంచి 40 కిలోమీటర్ల దూరం వరకూ కచ్చితంగా ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకుంటాయి. రోజుకు పది ట్రిప్పులు వేయగలవు. మందుల ఉష్ణోగ్రతను మెయిన్‌టెయిన్ చేస్తూ ప్రయాణిస్తాయి. తమ సామర్థ్యాన్ని బట్టి బరువును మోస్తాయి’ అని తెలిపింది నిక్. ‘నేను ఎయిర్‌లైన్స్ టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. పారాగ్లైడింగ్ చేసేదాన్ని. మెడిసిన్ ఫ్రమ్ ది స్కై కోసం డ్రోన్ ఆపరేటర్ల ఉద్యోగం ఉందని తెలిసి అప్లై చేశాను. నా పారాగ్లైడింగ్ అనుభవం దృష్ట్యా ఉద్యోగం వచ్చింది’ అని తెలిపింది నిక్. ఊరు కదిలి వచ్చింది ఈ ఉద్యోగం కోసం నిక్కు శిక్షణ ఇచ్చారు. ‘డ్రోన్లోని అన్ని భాగాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన మందులు జాగ్రత్తగా ప్యాక్ చేయడం, ప్రీ ఫ్లైట్ పరీక్షలు, గాలి స్థితి, ఆడియో పైలట్ సిస్టమ్, జిపిఎస్ ట్రాక్ ఇవన్నీ సక్రమంగా ఉన్నాయనుకున్నాక డ్రోన్‌ను బయలుదేరదీయాలి’ అని తెలిపింది నిక్. ఆమె ఉద్యోగం మొదలెట్టిన రోజు ఆమెను చూడటానికి ఊరు ఊరంతా వచ్చింది. ‘విమానాలు దగ్గరి నుంచి ఎగరడం మా ఊరి వాళ్లు చూడలేదు. ఒక బుల్లి విమానం లాంటిది పైగా ఒక అమ్మాయి ఎగుర వేయడం వారికి వింత. అందుకని ఊరంతా కదిలి వచ్చి చూసింది’ అని నవ్వింది నిక్.‘ఇది సరదా ఉద్యోగం కాదు. చాలా బాధ్యత. నాకు ఈ ఉద్యోగం ఎంతో నచ్చింది’ అని చెప్పిందామె. -
ఈ కాఫ్ సిరప్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
కొంతమందికి వర్షాకాలం వస్తే చాలు... జలుబు, దగ్గు, కఫం. ఇంకొందరికి చలికాలంలో ఈ బాధలు వస్తాయి. అయితే ఈ కాలం ఆ కాలం అని కాకుండా కొందరు ఎప్పుడూ ఖంగ్ ఖంగ్... హాచ్ ∙హాచ్ ... అని అంటూ ఉంటారు. నానా విధాలైన దగ్గు మందులు, రకరకాలైన టాబ్లెట్లు వాడినా కొద్ది రోజులకే సమస్య షరామామూలే! అయితే, ఛాతీలో పట్టిన కఫం పోయి, దానివల్ల వచ్చే దగ్గు తగ్గడానికి ఆయుర్వేదం మంచి చిట్కాను చెబుతోంది. దీన్నిపాటించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. పైగా ఇందులో అన్ని సహజమైనవే వాడతాం కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇంట్లోనే ఈ ఆయుర్వేద మందును తయారు చేసుకోవచ్చు. ఏం చేయాలంటే ... ఈ మందును తయారు చేయడానికి ఇంట్లో ఉండే పదార్థాలే అంటే వెల్లుల్లి, మిరియాలు, లవంగాలు, పుదీనా, తులసి వంటివి సరిపోతాయి. ఇంతకూ కషాయం ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. ఆ నీళ్లు వేడెక్కుతున్నప్పుడే రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి వేయాలి. అలాగే పది మిరియాలు, పది లవంగాలు, చిన్న అల్లం ముక్కను కూడా బాగా దంచి అందులో కలిపి మరిగించాలి. చివర్లో ఆరు తులసి ఆకులు, గుప్పెడు పుదీనా ఆకులు, చిటికడు పసుపు వేసి మరిగించాలి. ఇవన్నీ బాగా మరిగాక కషాయంలా తయారవుతాయి. స్టవ్ మీదినుంచి దించి గోరువెచ్చగా మారాక వడకట్టుకోవాలి. ఈ కషాయాన్ని కాఫీ తాగుతున్నట్టు సిప్ చేస్తూ తాగాలి. ఇలా చేయడం వల్ల ఛాతీలోని కఫం వదులుతుంది. కఫంతో బాధపడుతున్నప్పుడు మూడు రోజులుపాటు ఈ కషాయాన్ని రోజూ తాగాలి. ఈ కషాయంలో వాడిన పదార్థాలన్నీ ఉత్తమమైనవే. వాటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కఫం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి త్వరగా తగ్గిపోతాయి. ఈ కషాయం రోగనిరోధక శక్తిని పెంచి ఇలాంటి వ్యాధులు ఏవి రాకుండా కా΄ాడుతుంది. దీని రుచి కూడా అంత ఇబ్బందిగా ఉండదు. కాబట్టి పిల్లలకు కూడా తాగించవచ్చు. దీనివల్ల దుష్ప్రభావాలు ఉండవు. ఈ కషాయాన్ని ఫ్రిజ్‌లో దాచుకొని మళ్ళీ వేడి చేసుకొని రెండు, మూడు రోజులపాటు తాగకూడదు. అలా చేయడంవల్ల అది ప్రభావవంతంగా పనిచేయదు. -
ఏం ఇంట్లో చూసినా మందు గోళీలే! పారేస్తే పాతరేసినట్టే! మరేం చేయాలి?
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌కు ముందేమో గాని, తర్వాత ప్రతీ ఇల్లూ చిన్నపాటి క్లినిక్‌లా మారింది. వాడినా, వాడకున్నా రకరకాల మాత్రలు ఇంట్లో పేరుకుంటున్నాయి. అయితే వాడని వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడం సరైన పనికాదంటున్నారు వైద్యులు. దానికి బదులుగా వాటిని పడేసేందుకు తొలిసారిగా డ్రాప్ బాక్స్‌లు నగరంలో అందుబాటులోకి వచ్చాయి. జలుబో, జ్వరమో మరొకటో.. చిన్నా చితకా వ్యాధులకు కూడా డాక్టర్ల నుంచి చాంతాడంత మందుల చిట్టీలు తప్పడం లేదు. ఎందుకైనా మంచిదని మనం వాటిని కొనకా తప్పడం లేదు. అయితే సాధారణంగా ఒకటి రెండు రోజులకే స్వస్థత చేకూరిన పరిస్థితిలో మందులు ఆపేసేవారే ఎక్కువ. అలాంటి వాటిలో యాంటీ బయాటిక్స్ ఎక్కువగా ఉండడం సాధారణమే. వీటిని సరైన పద్ధతిలో నిర్మూలించాలి లేదా గడువు ముగియకపోతే అవసరార్థులకు అందించాలే తప్ప ఎలా పడితే అలా పడేయవద్దని సూచిస్తున్నారు వైద్యులు. పారేస్తే.. పాతరేసినట్టే.. బెల్జియం లాంటి దేశాల్లో ముఖ్యంగా యాంటీబయాటిక్స్ విషయంలో కఠినమైన డ్రగ్ పాలసీ ఉంది. అక్కడ వీటిని హానికారక వ్యర్థాల కోవలో లెక్కిస్తారు. అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్ అధిక వినియోగం వల్ల ఆరోగ్యపరమైన నష్టాలొస్తాయి. ఉపయోగించనవి, అదనంగా ఉన్నవి నిర్లక్ష్యంగా పారవేయడంతో అవి నీటిలోకి చేరి కెనాల్స్ ద్వారా పంట పొలాల వరకూ చేరుతున్నాయి. దీంతో ఇది అంతిమంగా యాంటీమైక్రోబయాల్ నిరోధకత/యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎమ్ఆర్)కు దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు. డ్రాప్ బాక్స్‌ల ఏర్పాటు.. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో నిమ్స్‌కు చెందిన క్లినికల్ ఫార్మకాలజీ అండ్ థెరప్యూటిక్స్ (సీపీటీ) విభాగం ఆస్పత్రి ఆవరణలో రెండు డ్రాప్ బాక్స్‌లను అమర్చింది. అవుట్ పేషెంట్స్ బ్లాక్‌లో, స్పెషాలిటీ బ్లాక్‌లో మరొకటి చొప్పున వీటిని ఏర్పాటు చేశారు. వీటిని చోరుల నుంచి కాపాడే క్రమంలో బాక్స్‌లకు తాళాలు వేశారు. ఆస్పత్రి సిబ్బంది మొదలుకుని, రోగులు, సంబంధీకులు ఎవరైనా సరే ఇంట్లో అనవసరంగా కొనుగోలు చేసిన, ఉపయోగించని లేదా గడువు ముగిసిన యాంటీబయాటిక్స్ ఉన్నట్లయితే ఈ డ్రాప్ బాక్స్‌లో వేయవచ్చని తద్వారా ఈ బాక్స్‌లకు వచ్చే స్పందనను అనుసరించి భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. భస్మం.. క్షేమం.. ‘తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే మొదటిది. వీటి ద్వారా హానికారక రసాయనాలు కాలుష్యానికి కారణం కాకుండా నిరోధించవచ్చు’ అని చెప్పారు నిమ్స్ డీన్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్.బీరప్ప. ‘డ్రాప్ బాక్స్‌ల ద్వారా పోగుపడిన మందులను సేకరించి వాటిని 1200 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లో భస్మం చేయిస్తాం’ అని నిమ్స్ లెర్నింగ్ సెంటర్ ప్రొఫెసర్ సీపీటీ విభాగాధిపతి పి.ఉషారాణి చెప్పారు. -
Hiccups: ఎక్కిళ్లు ఆగకుండా వస్తున్నాయా?
సాధారణంగా ఎక్కిళ్లు వస్తే ఒకటి రెండు నిమిషాల్లో తగ్గిపోతాయి. కానీ కొంతమందికి ఒకపట్టాన తగ్గవు. తరచూ ఈ సమస్య వస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. నీళ్లు తగ్గినా ఈ సమస్య అలాగే ఉంటుంది. మనకు వెక్కిళ్లు రాగానే శ్వాస ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే డయాఫ్రమ్ కండరం సంకోచిస్తుంది. వెంటనే ఊపిరితిత్తుల్లోకి గాలి వేగంగా చేరుతుంది. ఫలితంగా స్వరపేటిక అకస్మాత్తుగా మూసుకుపోయి ’హిక్’అనే ధ్వనికి కారణమవుతుంది. అందుకే వీటిని ఇంగ్లిష్‌లో హికప్స్ అని పిలుస్తారు. తెలుగులో వెక్కిళ్లు అని పిలుస్తారు. దాదాపు 100కుపైగా భిన్న శారీరక పరమైన కారణాలు వెక్కిళ్లకు దారితీస్తాయి. అయితే ఇవన్నీ పెద్దగా అపాయాన్ని కలిగించవు. ఒక్కోసారి ఆగకుండా వెక్కిళ్లు వస్తుంటాయి. అందుకు కారణం లేకపోలేదు. కొన్ని రకాల మందుల వాడకం వల్ల కూడా వెక్కిళ్లు వస్తాయి. కొన్ని మత్తు మందులు, స్టెరాయిడ్స్, పార్కిన్సన్స్ వ్యాధికి తీసుకునే ఔషధాలు, కీమో థెరపీ విధానాలు కూడా వెక్కిళ్లకు దారితీస్తాయి. నవ్వడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, వేగంగా తినడం వంటి విధానాల వల్ల, ఒక్కోసారి అసలు ఎలాంటి కారణం లేకుండా కూడా వెక్కిళ్లు వచ్చే అవకాశముంది. ఆగకుండా ఎక్కిళ్లు వస్తుంటే ఏం చేయాలంటే... ► కొద్దిసేపు ఊపిరి బిగబట్టి ఉండాలి. ► కాసేపటి తర్వాత మళ్లీ గాఢంగా శ్వాస తీసుకుని, వదిలాలి ► అనంతరం... మరోసారి ఊపిరి బిగబట్టాలి. ► ఈ ప్రక్రియను కాసేపు ఇలాగే కొనసాగిస్తే ఎక్కిళ్లు ఆగే అవకాశం ఉంటుంది. ► ఇక గబగబా ఊపిరి తీసుకోవడం కూడా ఓ పద్ధతి. ► రెండు నిమిషాల పాటు ఇలా చేసిన తర్వాత.. ఎక్కిళ్లు ఆగుతాయి. ► ఆ తర్వాత మళ్లీ మామూలుగానే ఊపిరి తీసుకోవాలి. ► ఆకస్మాత్తుగా భయపెట్టడం వంటి చర్యతో ఎక్కిళ్లు ఆగుతాయంటారు గానీ అది అంత మంచిది కాదు. ► ఈ కొద్దిపాటి జాగ్రత్తలతోనూ ఎక్కిళ్లు ఆగకపోతే డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. -
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తీసుకుంటున్నారా.. పండ్ల రసంతో ట్యాబెట్లు తీసుకుంటే!
మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే అది శరీరానికి ఒక రోజుకు అవసరమయ్యే శక్తిని అందివ్వడమే కాకుండా ఆ రోజులో మిగతా సమయం అంతా అతిగా తినటాన్ని కూడా నియంత్రించి శరీరంలో సమతుల్యతను కాపాడుతుందన్న ఆరోగ్య నిపుణుల సలహా అందరికీ తెలిసిందే. చెప్తున్నారు. అయితే ఏది పడితే అది అనారోగ్యకరమైన తిండి తినడం కంటే కూడా బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడమే చాలా ఉత్తమం అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఒకవేళ కొన్నిసార్లు మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వెళ్లిన సందర్భాల్లో మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సమస్యా ఎదురు కాదు. ఉండదు. గుడ్లు ఒక అధ్యయనం ప్రకారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకుంటే ఆ వెంటనే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఆ రోజులోని మిగతా సమయంలో తీసుకునే ఆహారం కూడా ఎక్కువ, తక్కువ కాకుండా కావాల్సిన మేరకే తీసుకుంటాం. తద్వారా శరీరంలో కేలరీలు తగ్గుతాయి. అంతేకాకుండా రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయులు నియంత్రణలో ఉంటాయని వెల్లడైంది. గుడ్ల సొనలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటికి బలాన్నిస్తాయి. ఇవి శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ప్రోటీన్లు, పోషకాలు అందజేస్తాయి. ఓట్ మీల్ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకునే సమయం లేనప్పుడు ఓట్ మీల్‌కు ఓటెయ్యడం ఉత్తమం. దీనిని చాలా సులువుగా తయారు చేసుకోగలగడమే గాక చాలా ఉత్తమమైనది కూడా. ఎందుకంటే, ఓట్ మీల్స్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును అదుపు చేయడంలో తోడ్పడతాయి. రక్తపోటు, ఊబకాయం, హృద్రోగ సమస్యలు ఉన్నవారికి ఓట్ మీల్ మంచి బ్రేక్‌ఫాస్ట్. ఓట్ మీల్‌ను పాలతో కలుపుకొని తినడం లేదా ఉప్మాలా తిరగమోత వేసుకుని తినడం వల్ల ఈ సుగుణాలు అందుతాయి. చదవండి: Recipe: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి పండ్లు మీ రోజు ఫలవంతంగా సాగాలంటే ఉదయాన్నే పొట్టను పండ్లతో నింపేస్తే సరి. పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిలో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కావాల్సినంత ఫైబర్, శరీరానికి అవసరమయ్యే హైడ్రేషన్ కూడా పండ్ల ద్వారా లభిస్తుంది. ఒక కప్పు ఆపిల్ ముక్కలు, లేదా సిట్రస్ జాతికి చెందిన నారింజ, సంత్ర పండ్లు లేదా బెర్రీస్ ఏవైనా సరే మంచి బ్రేక్‌ఫాస్ట్ జాబితాలో ఉంటాయి. చదవండి: Health Tips: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా నట్స్, సీడ్స్ నట్స్ తినటానికి రుచిగా ఉండటమే కాదు, వాటి నుంచి శరీరానికి లభ్యమయ్యే పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. నట్స్ లో కేలరీలు చాలా ఉన్నా కొవ్వు ఏ మాత్రం రాదు. బరువు తగ్గటానికి నట్స్ చాలా ఉపయోగకరం, వీటిలో మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ శరీరానికి అందుతాయి. రోజు ఉదయం గుప్పెడు నట్స్ తీసుకోవటం ఆరోగ్యకరం. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్ శరీరంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుతూ, ఇన్సులిన్ ను అందిస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాలనుంచి రక్షణ లభిస్తుంది. ఒక విషయం సాధారణంగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా టాబ్లెట్స్ వేసుకోవడం సహజమే. ఐతే మంచినీళ్లతో మాత్రలు వేసుకుంటే ఫర్వాలేదు కానీ కొందరు టాబ్లెట్లను రకరకాల పద్ధతుల్లో వేసుకుంటుంటారు. అందులో భాగంగా పండ్ల రసంతో మాత్రలు తీసుకుంటే బాగా పని చేస్తాయనే ఉద్దేశ్యంతో నారింజ లేదా నిమ్మరసంతో కలిపి మాత్రలను మింగే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల మేలు జరగకపోగా, ప్రమాదం ఎదురుకావొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. నారింజ లేదా ఇతర సిట్రస్ పండ్లను తీసుకున్నప్పుడు, సిట్రస్ పండ్లలో ఉండే రసాయనాలు పేగులో చర్య జరిపి ఔషధం ప్రభావాన్ని తగ్గిస్తాయి. వీటి రసంతో ఔషధాన్ని తీసుకోవడం వల్ల ప్రేగు కణాలు వాటి రూపాన్ని మార్చుకుంటాయి. ఫలితంగా ఔషధంలో ఉన్న రసాయనం పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. కనుక అలా చేయరాదని వైద్యులు చెబుతున్నారు. -
ఇస్త్రీపెట్టె కొత్తదానిలా మెరవాలంటే ఇలా! ఈ విషయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు
సులువైన, ఉపయోగకరమైన వంటింటి చిట్కాలు మీకోసం.. ఇస్త్రీ పెట్టె క్లీనింగ్ ఇలా.. నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడా, వెనిగర్ వేసి కలపాలి. ఈ మిశ్రమంలో ఇయర్ బడ్స్‌ను ముంచి ఇస్త్రీ పెట్టె అడుగు భాగంలో ఉన్న రంధ్రాలను తుడిస్తే లోపల పేరుకున్న దుమ్ముధూళీ పోతాయి. పెట్టె అడుగుభాగాన్ని కూడా ఈ నీటిలో ముంచి వస్త్రంతో తుడిచి, తరువాత పొడి వస్త్రంతో తుడవాలి. ఇలా చేయడం వల్ల ఇస్త్రీపెట్టె అడుగు భాగంలో నలుపు మొత్తం పోయి కొత్తదానిలా మెరుస్తుంది. అయితే ఇలా తుడిచేటప్పుడు ఇస్త్రీపెట్టె ప్లగ్‌ను స్విచ్‌బోర్డు నుంచి తీసేయాలి. లెన్స్ క్లీన్ చేసే లిక్విడ్ అందుబాటులో లేనప్పుడు.. కళ్లజోడు రోజూ వాడడం వల్ల అద్దాల మీద చిన్నచిన్న గీతలు, దుమ్ము ధూళి పడుతుంటాయి. లెన్స్ క్లీన్ చేసే లిక్విడ్ అందుబాటులో లేనప్పుడు.. అద్దాల మీద కొద్దిగా వెనిగర్ రాయాలి. రెండు నిమిషాలు ఆగిన తరువాత మెత్తటి వస్త్రంతో తుడిస్తే గీతలు, దుమ్ము ధూళి పోతాయి. టేప్ వేస్తే.. ట్యాబ్లెట్స్, సిరప్ డబ్బాల మీద ఉన్న ఎక్స్పైరీ డేట్లు ఒక్కోసారి తడితగిలి చెరిగిపోతుంటాయి. డేట్ తెలియకపోతే ఆ మందును వాడడం కష్టం. ఇలా జరగకుండా ఉండాలంటే ట్యాబ్లెట్గానీ, సిరప్‌ను గాని తీసుకొచ్చిన వెంటనే ఎప్పటి నుంచి ఎప్పటివరకు వాడవచ్చో తెలిపే డేట్స్ మీద ట్రాన్స్పరెంట్ టేప్‌ను అతికించాలి. ఈ టేప్ ఉండడంవల్ల మందు అయిపోయేంత వరకు డేట్ చెరిగిపోకుండా ఉంటుంది. మూత బిగుసుకు పోకుండా నెయిల్ పెయింట్ తీసి వేసుకునేటప్పుడు మూత అంచుల మీద కారి గాలికి గట్టిపడిపోతుంది. దీంతో .. తీసిన వెంటనే రాకుండా మూత స్ట్రక్ అయిపోతుంది. మూత పెట్టేముందు పెయింట్ సీసా మూతి చుట్టూ ఉన్న పెయింట్‌ను శుభ్రంగా తుడిచి, ఇయర్ బడ్‌తో కొద్దిగా నెయ్యి లేదా నూనెను రాసి మూతపెట్టాలి. అప్పుడు మూత బిగుసుకు పోకుండా చక్కగా వస్తుంది. రబ్బర్ బ్యాండ్ మూటకట్టి వాషింగ్ మెషిన్లో పెద్దవాళ్ల బట్టలతోపాటు, సాక్సులు, కర్చీఫ్‌లు, చిన్న చిన్న బట్టలు వేయాలనుకున్నప్పుడు.. కూరగాయలు, పండ్లకు ఇచ్చే నెట్ బ్యాగ్‌లో చిన్నచిన్న బట్టలను వేసి రబ్బర్ బ్యాండ్ మూటకట్టి వాషింగ్ మెషిన్లో వేయాలి. అప్పుడు చక్కగా క్లీన్ అవ్వడంతోపాటు, మిగతా బట్టల్లో కలిసిపోకుండా ఉంటాయి. తాజాగా ఉండేందుకు టొమాటో తొడిమ తీసిన ప్రాంతంలో రెండు చుక్కలు నూనె రాసి రిఫ్రిజిరేటర్లో నిల్వచేస్తే ఎక్కువ రోజులపాటు రంగు మారకుండా తాజాగా ఉంటాయి. చదవండి: ఉల్లిపాయ రసంలో బాదం నూనె కలిపి జుట్టుకు పట్టిస్తున్నారా? కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి ముఖానికి రాస్తే! Korrala Idli- Millet Halwa: ‘సిరి’ ధాన్యాలు.. నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్ హల్వా తయారీ ఇలా.. -
యాంటీ‘భయో’టిక్స్!
సాక్షి, హైదరాబాద్: తుమ్మినా..దగ్గినా..నీరసమున్నా..ఆయాసమున్నా.. వొళ్లు నొప్పులు.. వైరల్ జ్వరం.. ఏదైనా ఒక్కటే మందు..యాంటీబయాటిక్. ఇలా చిన్నాచితకా రోగానికీ యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటం చాలామందికి అలవాటై పోతోంది. చివరి అస్త్రంగా వాడాల్సిన వాటిని తొలిదశలోనే వాడేస్తున్నారు. వైద్యులు సూచించక పోయినా కొందరు సొంతంగా వాడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల, నిజంగా అవసరమైనప్పుడు వాడినా అవి పనిచేయని పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంటే అప్పటికే మనుషుల్లో వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ క్రిములకు యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే శక్తి (యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్) వచ్చి ఉంటుందన్న మాట. వ్యవసాయ పంటలకు విచ్చలవిడిగా పురుగుమందులను (యాంటీబయాటిక్స్) చల్లుతున్నారు. అధిక పాల ఉత్పత్తి కోసం పాడి పశువులకు ఇంజెక్షన్లు (యాంటీబయాటిక్స్) ఇస్తున్నారు. ఈ విధమైన ఆహారం, పాలు తీసుకోవడం ద్వారా అప్పటికే మానవ శరీరంలో అధిక శాతం యాంటీబయాటిక్స్ ఉంటున్నాయని అధ్యయనాలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. 280 కోట్ల యాంటీబయాటిక్స్ ప్యాక్‌ల విక్రయం దేశంలో 2019లో 85 రకాలకు సంబంధించిన 280 కోట్ల యాంటీబయాటిక్స్ ప్యాక్‌లు అమ్ముడుపోయినట్లు లాన్సెట్ జర్నల్ తెలిపింది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, బోస్టన్ యూనివర్సిటీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యాంటీబయాటిక్స్‌పై చేసిన అధ్యయనం ఇటీవల లాన్సెట్‌లో ప్రచురితమైంది. ఇందులో 28 యాంటీబయాటిక్స్‌ను అత్యవసర మందుల జాబితాలో పెట్టారు. మిగితావి సాధారణ జాబితాలో ఉన్నాయి. కేంద్ర ఔషధ నాణ్యత నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) అనుమతి ఇచ్చిన యాంటీబయాటిక్స్ కేవలం 19 శాతమే కాగా మిగిలిన 81 శాతం రాష్ట్రాల ఔషధ నియంత్రణ సంస్థల పరిధిలో అమ్ముతున్నారు. వాస్తవానికి దేశంలోని చాలా కాంబినేషన్ యాంటీబయాటిక్స్‌ను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. రెండు మూడురకాలకు చెందిన యాంటీ బయాటిక్స్‌ను కలిపి (కాంబినేషన్) వాడటం సరైంది కాదని పేర్కొంది. కాంబినేషన్ మందులను కుష్టు, క్షయ వంటి వ్యాధులకు వాడాలి. కానీ మన వద్ద చిన్న చిన్న రోగాలకు కూడా కాంబినేషన్ ఔషధాలు వాడుతున్నారు. ఒకటి అవసరమైనచోట రెండు వాడటం వల్ల కూడా ఆ మందు పనిచేయని పరిస్థితి వస్తుంది. అయినా కంపెనీలు ఇష్టమొచ్చినట్లుగా మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. ఔషధాల నియంత్రణలో ఉన్న లోపాలను ఆధారం చేసుకొని దందా నిర్వహిస్తున్నాయి. అమ్ముడవుతున్న యాంటీబయాటిక్స్‌లో 85–90 శాతం ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రాక్టీషనర్లు రాస్తున్నవేనని అధ్యయనం తేల్చిచెప్పింది. ఆహారం ద్వారానే అత్యధిక శాతం యాంటీబయాటిక్స్! ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనం ప్రకారం మన దేశంలో మాంసం, పాలు, పాల పదార్థాలు, గుడ్లు, వివిధ రకాల పంటల (ఆహార పదార్ధాలు) వినియోగం ద్వారా 80 శాతం యాంటీబయాటిక్స్ మానవ శరీరంలోకి వెళ్తున్నాయని తేల్చింది. చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు బ్లడ్ ఇన్ఫెక్షన్లుగా మారితే, అక్కడున్న పెన్సిలిన్‌కు సంబంధించిన యాంటిబయాటిక్కు లొంగని పరిస్థితులు 65 శాతం ఉంటున్నట్లు తెలిపింది. దీంతో డోసు ఎక్కువున్న యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే ఉదర ఇన్ఫెక్షన్ బ్లడ్ ఇన్ఫెక్షన్గా మారితే.. యాంటీబయాటిక్స్‌కు లొంగని పరిస్థితులు 85 శాతం ఉంటున్నట్లు పేర్కొంది. శుభ్రత పాటించకపోవడంతో చేటు యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటానికి ఇన్ఫెక్షన్లే ప్రధాన కారణం. ఇప్పటికీ 54 శాతం ఇళ్లల్లో శుచీ శుభ్రత పాటించడం లేదు. సబ్బుతో చేతిని కడుక్కోలేని స్థితి ఉన్న ఇళ్లు 32 శాతం ఉన్నాయి. నీటి వసతి లేని ఆసుపత్రులు ఆరు శాతం ఉన్నాయి. పారిశుధ్యం సరిగా పాటించని ఆసుపత్రులు 22 శాతం ఉన్నాయి. వ్యర్థాలను సరిగా నిర్వీర్యం చేయని ఆసుపత్రులు 27 శాతం ఉన్నాయి. ఇలాంటి కారణాల వల్ల ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. వివిధ దశల్లో 90 రకాల వ్యాక్సిన్లు యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించేలా, ఇన్ఫెక్షన్ రాకుండా చూసేలా ప్రపంచవ్యాప్తంగా 90 రకాల వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉంది. చాలారకాల యాంటీబయాటిక్స్‌కు లొంగని, మొండి ఇన్ఫెక్షన్లకు కారణమైన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లు రాకుండా నిరోధించేందుకు ఈ వ్యాక్సిన్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్నాయి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
ఉచితంగానే మందులు... బయట కొనొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుప త్రులకు వచ్చే రోగులకు అవసరమైన మందులు అన్నింటినీ ఉచితంగా ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ మందులు రాశాక రోగులకు నిర్దేశిత రోజులకు అవసరమైనన్ని మందులు కాకుండా తక్కువ రోజులకు ఇస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక చాలామంది రోగులు ప్రైవేట్ మందుల దుకాణాల్లో ఔషధాలు కొనుగోలు చేస్తున్నారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోగులకు అవసరమై నన్ని మందులను ఉచితంగానే ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) మొదలు ఏరియా, సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల వరకు అన్ని చోట్లా దీన్ని అమలు చేస్తారు. వైద్యులు అక్కడుండే మందులనే రాసి రోగులు బయట కొనే పరిస్థితి లేకుండా చూడాల్సి ఉంటుంది. ఇన్‌పేషెంట్లు, ఔట్ పేషెంట్లు అందరికీ నిర్ణీత కోర్సు మేరకు మందులు ఇస్తారు. ఉదాహరణకు ఒక రోగికి బీపీ మాత్రలు నెల రోజులకు రాస్తే, ఇప్పటివరకు వారం రోజులకు సరిపోయేలా ఇచ్చేవారు. ఇకపై నెల రోజులకూ ఇవ్వనున్నారు. ప్రభుత్వం మందుల కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ నిధులు పూర్తిస్థాయిలో రోగులకు మందులు ఇచ్చేందుకు సరిపోతాయని వైద్య వర్గాలు వెల్లడించాయి. 12 జిల్లాల్లో సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో అవసరమైనన్ని మందులను అందుబాటులో ఉంచాలంటే ఆ మేరకు పంపిణీ కూడా చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం ఆలస్యం కాకుండా మందులను సరఫరా చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాలకు సరఫరా చేసేలా 12 జిల్లాల్లో సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిల్లో మూడు నెలలకు సరిపడా మందులు ఎల్లప్పుడూ నిల్వ ఉంటాయి. ఎప్పటికప్పుడు మూడు నెలల బఫర్ స్టాక్‌ను నిర్వహించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద రూ.43.20 కోట్ల నిధులతో 2022–23లో సిద్దిపేటలోని బోధనాసుపత్రి, వనపర్తి, మహబూబాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తారు. 2023–24 సంవత్సరంలో కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, భువనగిరి, గద్వాల జిల్లా ఆసుపత్రుల్లో, వికారాబాద్ ఏరియా ఆసుపత్రిలో, సూర్యాపేట బోధనాసుపత్రిలో నెలకొల్పుతారు. ఒక్కో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఏర్పాటుకు రూ.3.60 కోట్ల చొప్పున కేటాయించారు. ఈ స్టోర్ల నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఎలాంటి జాప్యం లేకుండా మందులు సరఫరా అవుతాయి. -
ఈ మందులకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ మందుల చీటీ (ప్రిస్కిప్షన్) లేకుండా 16 రకాల మందులను ఔషధ దుకాణదారులు విక్రయించవచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. లైసెన్స్ ఉన్న దుకాణదారులే వీటిని విక్రయించాలని స్పష్టం చేసింది. రోగి సమాచారాన్ని తీసుకొని మందులు ఇవ్వాలని పేర్కొంది. ఆయా మందులను ఐదు రోజుల వరకే వాడాలని, అప్పటికీ తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలని రోగులకు విజ్ఞప్తి చేసింది. ప్రిస్క్రిప్షన్ అవసరం లేని మందుల జాబితా 1) పొవిడోన్ అయోడిన్ – యాంటీ సెప్టిక్; 2) క్లోరోహెక్సిడైన్ గ్లుకోనేట్– మౌత్ వాష్; 3) క్లోట్రిమాజోల్ క్రీం (యాంటీ ఫంగల్); 4) క్లోట్రిమాజోల్ డస్టింగ్ పౌడర్(యాంటీ ఫంగల్); 5) డెక్స్ట్రోమితార్పన్ హైడ్రోబ్రోమైడ్ లొంజెస్– 5 ఎంజీ (దగ్గు తగ్గేందుకు); 6) డైక్లోఫినాక్ క్రీమ్/ఆయింట్మెంట్/జెల్ (నొప్పి తగ్గించేందుకు); 7) డైఫెన్‌హైడ్రామైన్ కాప్సూ్యల్స్–25 ఎంజీ (యాంటీ అలెర్జిక్); 8) పారాసిటమాల్–500 ఎంజీ మాత్రలు; 9) సోడియం క్లోరైడ్ నాజల్ స్ప్రే (ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం); 10) ఆక్సిమెటాజోలైన్ నాజల్ సొల్యూషన్ (ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం); 11) కీటొకోనాజోల్ షాంపూ (చుండ్రు నివారణ); 12) లాక్టులోస్ సొల్యూషన్ 10 గ్రా/15 ఎంల్ (మలబద్దక నివారణ); 13) బెంజోల్ పెరాక్సైడ్ (మొటిమల నివారణ); 14) కాలమైన్ లోషన్ (యాంటీ సెప్టిక్); 15) జైలోమిటాజోలైన్ హైడ్రోక్లోరైడ్ (ముక్కు దిబ్బడ తగ్గించేందుకు); 16) బిసాకొడిల్–5 ఎంజీ మాత్రలు (మలబద్దక నివారణ) -
Sakshi Cartoon: జ్వరం వస్తే గోలి వేశా! జ్వరం డబులైంది డాక్టర్!
జ్వరం వస్తే గోలి వేశా! జ్వరం డబులైంది డాక్టర్! -
జ్వరం గోలీకి ధరల సెగ!
సాక్షి, హైదరాబాద్: నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇప్పటికే విలవిల్లాడుతున్న సగటు జీవిపై మందుల భారం కూడా పడనుంది. జ్వరం బిళ్ల మొదలు బీపీ గోలీ వరకు సామాన్యులు ఎక్కువగా వినియోగించే దాదాపు 800 రకాల షెడ్యూల్డ్ మందులపై కేంద్రం ధరాభారం మోపింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆయా మందుల ధరలను 10.76 శాతం మేర పెంచుకొనేందుకు అనుమతిచ్చింది. 2020తో పోలిస్తే 2021 క్యాలెండర్ సంవత్సరానికి టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ)లో 10.7 శాతం మేర వచ్చిన మార్పునకు అనుగుణంగా ధరలను సవరించుకొనేందుకు సంబంధిత వర్గాలకు అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) మెమొరాండం విడుదల చేసింది. ఎక్కువ మంది వినియోగించేవే పెరుగుతాయి... జ్వరం, ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, చర్మవ్యాధులు, అనీమియా వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే అత్యవసర ఔషధాల ధరలన్నీ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెరుగుతాయి. ఇవిగాకుండా అత్యధికంగా వినియోగంలో ఉండే పారాసిటమాల్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనిడజోల్ వంటి ఔషధాల ధరలు కూడా పెరుగుతాయి. బలం కోసం వినియోగించే మల్టీ విటమిన్ల మందుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి నుంచే వేగంగా పెరుగుదల... దేశంలో ఔషదాల ధరల పెరుగుదల రెండేళ్లుగా కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి లాక్డౌన్, అనంతర పరిస్థితులకు అనుగుణంగా పలు రకాల మందుల ధరలు 20 శాతం దాకా పెరిగాయి. -
Corona Third Wave: బ్లాక్ మార్కెట్‌కు చెక్
సాక్షి, అమరావతి : కరోనా తొలి, మలి విడతల్లో విటమిన్ టాబ్లెట్లతోపాటు కొన్ని రకాల మందులకు తీవ్ర డిమాండ్ ఏర్పడడంతో మెడికల్ మాఫియా అప్పట్లో బ్లాక్ మార్కెట్ దందాకు తెరతీసింది. ప్రస్తుతం మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో ఔషధ నియంత్రణ శాఖ నాటి పరిస్థితులకు చెక్ చెబుతూ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. కరోనాకు సంబంధించిన 30 రకాల అత్యవసర మందుల నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆ శాఖ ఉన్నతాధికారులు వారంలో రెండుసార్లు 13 జిల్లాల ఔషధ నియంత్రణ అధికారులతో సమీక్షలు నిర్వహించి మార్కెట్లో మందుల నిల్వల సమాచారం సేకరిస్తున్నారు. ఏవైన మందుల నిల్వలు తక్కువగా ఉన్నట్లైతే డిమాండ్‌కు సరిపడా వాటిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇండెంట్ పెట్టిన వెంటనే మందులు సరఫరా చేసేలా పంపిణీదారులను ఆదేశిస్తున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తికి అనుమతులు ఇక కరోనా రోగుల చికిత్సలో వినియోగించేందుకు అవకాశమున్న మోల్నుపిరవిర్ మాత్రలను రాష్ట్రంలోనే తయారుచేసేందుకు ప్రభుత్వం లైసెన్స్‌లు ఇచ్చింది. దీంతో కరోనా మూడో దశ మందుల ప్రోటోకాల్ జాబితాలో ఈ మాత్రలకు అనుమతిస్తే వీటికి కొరత ఏర్పడే అవకాశం ఉండదు. నాట్కో, లారస్, దివీస్ ఫార్మా కంపెనీలు ఈ మందును తయారుచేయనున్నాయి. చిన్న పిల్లలు, గర్భిణులు, మరికొందరికి ఈ మందును వినియోగించకూడదని ఐసీఎంఆర్ వెల్లడించింది. అదే విధంగా కరోనా రెండో దశ చికిత్సలో కీలకంగా మారిన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు ప్రస్తుతం రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. పుష్కలంగా మందుల నిల్వలు రాష్ట్రంలో మందుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం పుష్కలంగా వాటి నిల్వలు ఉన్నాయి. ప్రభుత్వం పీఎస్ఏ (ఆక్సిజన్) ప్లాంట్లను భారీగా ఏర్పాటుచేసింది. దీంతో ఆక్సిజన్‌కు కొరత లేదు. ఎక్కడైనా ఎమ్మార్పీని మించి మందులు విక్రయిస్తే వినియోగదారులు ఔషధ నియంత్రణ శాఖకు ఫిర్యాదు చేయాలి. ఎక్కువగా వినియోగంలో ఉన్న మందులపై ప్రత్యేక నిఘా ఉంచాం. నకిలీ మందులు చెలామణి కాకుండా చూస్తున్నాం. – రవిశంకర్ నారాయణ్, ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ జనరల్ -
‘ఆ మూడు మాత్రలతో కరోనా కట్టడి..ప్రయోగాత్మకంగా రుజువు’
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి) : కరోనాను తరిమేసేందుకు ఆస్ప్రిన్, మిథైల్‌ప్రెడ్నిసోలాన్, అజిత్రోమైసిన్‌లు చాలని కాకినాడకు చెందిన ప్రముఖ సాంక్రమిక వ్యాధుల నిపుణుడు యనమదల మురళీకృష్ణ తెలిపారు. ప్రయోగాత్మకంగా ఈ విషయం రుజువైందంటూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 60 మంది కోవిడ్ బాధితులకు వారం పాటు ఆస్ప్రిన్ 150 ఎం.జీ. రోజుకొకటి, మిథైల్‌ప్రెడ్నిసోలాన్ 10 ఎం.జీ. ఉదయం, రాత్రి, అలాగే అజిత్రోమైసిన్ 250 ఎంజీ ఉదయం, రాత్రి ఇచ్చి వైద్యం అందిస్తే.. 59 మంది కేవలం వారంలో పూర్తిగా కోలుకున్నట్టు తెలిపారు. వారి సాచ్యురేషన్ స్థాయి 93 శాతం పైనే కొనసాగిందని పేర్కొన్నారు. తొలి నుంచి ప్రతిపాదనలో ఉన్న పారాసిట్మాల్, ఐవిర్‌మెక్ట్ర్‌న్, హైడ్రాక్సీక్లోరోక్వినోన్, డాక్సీసైక్లిన్ తీసుకున్న 60 మందిలో 8 మంది ఆరోగ్యం దిగజారి ఆస్పత్రి పాలైనట్టు వెల్లడించారు. తాను ప్రతిపాదించిన మూడు మాత్రలతో కోలుకున్న వారిలో నిస్సత్తువ నామమాత్రానికే పరిమితం కాగా, తొలి నుంచి ప్రతిపాదనలో ఉన్న మందులు వాడిన వారిలో దీర్ఘకాలిన నిస్సత్తువ, దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నట్టు తెలిపారు. తన పరిశోధనల సారాంశాన్ని అధ్యయన పత్రాల రూపంలో ఈ నెల 17, 18 తేదీల్లో అమెరికాలో జరిగిన ‘గ్లోబల్ సమ్మిట్ ఆన్ డిసీజెస్’లో సమర్పించినట్లు డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. తన అధ్యయనాన్ని కోయలిస్ గ్రూప్ స్కోపస్ ఇండెక్స్ అనే ప్రామాణిక పరిశోధనల డేటా బేస్‌లో ప్రచురిస్తారని మురళీకృష్ణ వెల్లడించారు. -
గుడ్‌న్యూస్: కోవిడ్ సోకితే ఇక ఇంట్లోనే మాత్రలు వేసుకుంటే చాలు!
లండన్/వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలమందికిపైగా ప్రాణాలను పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారికి చికిత్స అందుబాటులోకి వచ్చేసింది. కరోనా వైరస్‌కి చికిత్స లేదు నివారణే మార్గం అనుకుంటున్న సమయంలో ఒక గేమ్‌ఛేంజర్‌గా యాంటీవైరల్ మాత్రలు మార్కెట్లోకి రాబోతున్నాయి. బ్రిటన్, అమెరికాలు ఈ దిశగా ముందడుగు వేశాయి. ప్రపంచంలోనే కరోనా చికిత్స కోసం యాంటీ వైరల్ మాత్రకి ఆమోద ముద్ర వేసిన తొలి దేశంగా యూకే నిలిస్తే, అమెరికాలో ఫైజర్ కంపెనీ తయారు చేసిన మాత్ర 90శాతం మరణాలను నివారిస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. ఫ్లూ జ్వరం చికిత్సలో వాడే యాంటీ వైరల్ లాగెవ్రియో (మోల్నూపిరావిర్)ని కోవిడ్ చికిత్సకి అనుమతినిస్తూ బ్రిటన్‌కు చెందిన ది మెడిసన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) గురువారం అనుమతులు మంజూరు చేసింది. రిడ్జ్‌బ్యాక్ బయోథెరపిటిక్స్, మెర్క్ షార్ప్ అండ్ ధోమె (ఎంఎస్డీ) కంపెనీలు సంయుక్తంగా ఈ మాత్రను రూపొందించాయి. ‘కరోనా సోకితే ఇక ఆస్పత్రుల్లో చేరాల్సిన పని లేదు. ఇంట్లోనే ట్యాబ్లెట్ మింగొచ్చు. ప్రపంచంలోనే అలాంటి మాత్రకు అనుమతులిచ్చిన మొదటి దేశం మాదే’అని యూకే ఆరోగ్య శాఖ మంత్రి సజీద్ జావిద్ ప్రకటించారు. కరోనా వైరస్ లోడు స్వల్పంగా, ఓ మోస్తరుగా సోకిన వారిలో తీవ్రతరం కాకుండా ఈ మాత్ర నిరోధిస్తుంది. ఊబకాయం, 60 ఏళ్ల పైబడిన వయసు, షుగర్, గుండెకు సంబంధించిన సమస్యల్లో ఏ ఒక్కటి ఉన్న వారిలో అయినా ఈ టాబ్లెట్ బాగా పని చేస్తుందని ఇప్పటికే ప్రయోగాల్లో తేలింది. కరోనా సోకిన వెంటనే ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే అత్యంత శక్తిమంతంగా పని చేస్తున్నట్టుగా ఎంహెచ్ఆర్ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జునె రెయిన్ వెల్లడించారు. త్వరలో మార్కెట్లోకి ఫైజర్ మాత్ర కోవిడ్–19 మాత్రకు బ్రిటన్ ఆమోద ముద్ర వేసిన ఒక్క రోజులోనే అమెరికా ఫార్మసీ దిగ్గజం ఫైజర్ తమ కంపెనీ తయారు చేసిన యాంటీవైరల్ మాత్ర కూడా పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నట్టుగా వెల్లడించింది. కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ 90% మరణాలను ఆ మాత్ర నిరోధిస్తుందని తెలిపింది. ఇప్పటివరకు అమెరికాలో కరోనా సోకిన వారికి ఆస్పత్రుల్లో చేర్పించి ఇంజెక్షన్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇంట్లోనే అత్యంత సులభంగా వాడే మాత్రను తయారు చేసినట్టుగా ఫైజర్ కంపెనీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ మైకేల్ డోల్‌స్టెన్ శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం ఈ మాత్ర అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) పరిశీలనలో ఉందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోకుండా ఊబకాయం, మధుమేహం, గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్న 775 మందిపై ఫైజర్ ఈ టాబ్లెట్ ఇచ్చి చూస్తే 89% మందికి ఆస్పత్రి అవసరం రాలేదని వెల్లడించింది. ఒక్క శాతం మందిని ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం వచ్చింది. ప్రయోగాత్మకంగా ఈ టాబ్లెట్ ఇచ్చిన వారెవరూ మరణించలేదని ఆ కంపెనీ తెలిపింది. 90% సామర్థ్యంతో, 100 శాతం మరణాలను అరికట్టేలా ఈ మాత్ర పని చేస్తున్నట్టుగా మైకేల్ వివరించారు. ఈ కొత్త మాత్ర అనుమతులు ఇవ్వడానికి ఎఫ్‌డీఏ సన్నాహాలు చేస్తున్నప్పటికీ కరోనాపై వ్యాక్సినే బ్రహ్మాస్త్రమని అభిప్రాయపడుతోంది. మాత్రలు అందుబాటులోకి వస్తే ఆస్పత్రులపై భారం తగ్గుతుందని వైద్య రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
గౌతం గంభీర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌పై డ్రగ్ కంట్రోలర్ శాఖ దాఖలు చేసిన కేసులో స్టే ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గంభీర్ తరపున న్యాయవాది డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ చట్టం కింద ప్రాసిక్యూషన్‌కు స్టే ఇవ్వాలని కోరగా, కోర్టు ఈ విధంగా తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఫాబీప్లూ మందులకు డిమాండ్ భారీగా ఉంది. ఆ పరిస్థితుల్లో గంభీర్ ఫౌండేషన్ సుమారు రెండు వేలకు పైగా ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను ప్రజలకు పంచిన సంగతి తెలిసిందే. దీంతో ఫాబీఫ్లూ టాబ్లెట్లను అక్రమంగా నిల్వ చేసినట్లు గంభీర్‌పై ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆదేశానుసారం డీజీసీఐ.. గంభీర్ నిర్వహిస్తున్న ఫౌండేషన్ ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను అనధికారికంగా నిల్వ ఉంచడమే కాకుండా, పంపిణీ చేయడం డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ ప్రకారం నేరంగా పరిగణిస్తూ ఆ ఫౌండేషన్‌ను దోషిగా తేల్చింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో గంభీర్‌ను దోషిగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి మరింత పురోగతి విచారణ కోసం కోర్టు అధికారులకు ఆరు వారాల గడువు ఇచ్చింది. అయితే తాజాగా ఆ కేసుకు సంబంధించి గంభీర్ తరపు న్యాయవాది స్టే కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై ధర్మాసనం తీర్పునిస్తూ.. ఆ కేసులో మేం స్టే ఇవ్వలేమని, ఢిల్లీ హైకోర్టు ముందే మీ వాదనలు వినిపించాలంటూ తేల్చి చేప్పింది. -
నోరు తిరగని పేర్లు ఎలా పెట్టారో? :మంత్రి కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ‘పొసొకోనజోల్, క్రెసంబా, టొలిసిజిమాబ్, రెమిడెసివిర్, లిపొసొమల్ ఆంఫోటెరిసిన్, ఫ్లావిపిరవిర్, మాల్న్యూపిరవిర్, బరిసిట్రినిబ్.. ఇలా నోరు తిరగని పేర్లను మందులకు పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో మీకేమైనా తెలుసా? సరదాగా అడుగుతున్నా’అని మంత్రి కె.తారక రామారావు గురువారం ట్వీట్ చేశారు. కరోనా కష్టకాలంలో కూడా ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించే కేటుగాళ్ల గురించి 100కు ఫోన్‌చేసి సమాచారమివ్వాలని లేదా రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయాలని కోరారు. బ్లాక్ మార్కెట్ చేసే వారిపై పోలీసులు ఇప్పటివరకు 128 కేసుల నమోదుతో పాటు 258 మందిని అరెస్టు చేశారని తెలిపారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం మందులు కావాల్సిన వారు dme@telangana.gov.in లేదాentmcrm @telangana.gov.inల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
కరోనా: ఈ మందులు వాడుతున్నారా? అయితే జాగ్రత్త!
న్యూఢిల్లీ: ఐబూప్రూఫెన్ లాంటి కొన్ని పెయిన్ కిల్లర్లు కరోనా కారక ఇబ్బందులను మరింత పెంచుతాయని, హృద్రోగ, కిడ్నీ పేషెంట్లకు ఇవి ప్రమాదకారులని ఐసీఎంఆర్ హెచ్చరించింది. కరోనా సమయంలో నొప్పుల బాధకు ఎన్‌ఎస్‌ఏఐడీఎస్ (నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డగ్స్ర్)ను తీసుకోవద్దని, వీటి బదులు అవసరమైతే పారసిటమాల్ టాబ్లెట్లను వాడాలని సూచించింది. బీపీ, సుగర్, హృద్రోగులు కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఐసీఎంఆర్ కొన్ని సూచనలు చేసింది. సూచనలు, సలహాలు... ► బీపీకి వాడే ఏసీఈ ఇన్హిబిటర్లు(రామిప్రిల్ లాంటివి) కానీ, ఏఆర్బీలు(లోసార్టిన్ లాంటివి) కానీ కరోనా తీవ్రతను పెంచుతాయనేందుకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాల్లేవు. నిజానికి ఈ మందులు హృదయం పనితీరుకు మేలు చేయడంతోపాటు, అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. అందువల్ల సొంతంగా వీటిని మానేయాలనే నిర్ణయం తీసుకోవద్దు. అలా చేస్తే హృదయ సంబంధిత ముప్పు పెరుగుతుంది. ► కరోనా సోకిన రోగుల్లో 80 శాతం మందికి శ్వాససంబంధిత ఇన్ఫెక్షన్లు సాధారణంగా కనిపిస్తాయి. అయితే షుగర్, బీపీ, గుండె సంబంధిత సమస్యలున్నవారికి ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ముప్పు అధికమనే వాదన ఉంది. కానీ ఈ వాదన నిజం కాదు. ఈ సమస్యలున్నవారిలో కొందరికి మాత్రం కోవిడ్ లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి. అందువల్ల ఈ బాధలున్నవారు అధిక జాగ్రత్త తీసుకోవడం మంచిదే! షుగర్ అదుపులోలేని వ్యక్తులకు ఇన్ఫెక్షన్ల రిస్కు ఎక్కువ. ► కోవిడ్ సోకినా సరే ఇప్పటికే వివిధ సమస్యలకు మందులు వాడుతున్నవారు వాటిని కొనసాగించాలి, కేవలం డాక్టర్ సూచిస్తేనే మానేయాలి. ► సమూహాల్లోకి వెళ్లేటప్పుడు మాస్కు తప్పనిసరి. మాస్కును మూతి, ముక్కు, గడ్డం కవర్ చేసేలా ధరించాలి. దీంతోపాటు, సామాజిక దూరం పాటించడం వల్ల కోవిడ్‌ను కంట్రోల్ చేయవచ్చు. ► కుటుంబంలో ఒకరికి కరోనా వస్తే గైడ్‌లైన్స్ ప్రకారం ఐసోలేషన్ పాటించాలి, పరిస్థితి విషమిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి. ► మద్యపానం, ధూమపానం మానేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, క్రమబద్దమైన వ్యాయామం చేయడం, బీపీ, సుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం, కరోనా గైడ్‌లైన్స్‌ను కచ్ఛితంగా పాటించడం ద్వారా ప్రజలు కరోనాను కట్టడి చేయవచ్చు. చదవండి: Last 24 Hours: అక్కడ ఒక్క మరణం కూడా నమోదు కాలేదు -
నకిలీ మందుల గుట్టు రట్టు
సాక్షి, అమరావతి: యాంటీబయోటిక్స్ పేరుతో డొల్ల ట్యాబ్లెట్లు తయారు చేసి, దేశ వ్యాప్తంగా రోగులను మోసగిస్తున్న ముఠా బండారం బట్టబయలైంది. ఉత్తరాఖండ్ చిరునామాతో తయారైన ఈ నకిలీ మందులపై అనుమానం రావడంతో రాష్ట్రానికి చెందిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఆరాతీస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈ మందులను తయారు చేసిన కంపెనీ చిరునామాను బట్టి ఆరాతీస్తే ఉత్తరాఖండ్‌లోని ఉద్దంసింగ్ నగర్లో అలాంటి కంపెనీ లేదని తేలింది. విజయవాడ, రాజమండ్రి, పాలకొల్లు, భీమవరంలలో ఈ నకిలీ మందులు బయటపడ్డాయి. దీంతో సుమారు 45 రోజుల పాటు పరిశోధించిన ఔషధ నియంత్రణ శాఖ అధికారుల బృందం ఎట్టకేలకు ఈ కుంభకోణాన్ని ఛేదించింది. నకిలీ మందుల గుట్టు బయట పడిందిలా.. హెచ్‌పీహెచ్‌ఐఎన్ కంపెనీ తయారీ పేరుతో కొన్ని మందులు తొలుత భీమవరంలోని మందుల దుకాణాలకు చేరాయి. తనిఖీల ద్వారా ఈ విషయం ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు తెలిసింది. వారు ఆ మాత్రలను ల్యాబ్‌కు పంపించారు. ఇందులో ఎలాంటి మందు లేదని తేలింది. ఆ తర్వాత విజయవాడలోని హరిప్రియ మెడికల్స్ ద్వారా రాజమండ్రిలోని లోకేశ్వరి ఫార్మసీ వాళ్లు ఎక్కువగా అజిత్రోమైసిన్, సిఫిగ్జిమ్ ట్యాబ్లెట్లు కొన్నారు. వీటిని పరిశీలిస్తే ఇవి కూడా డమ్మీ అని తేలింది. ఆ తర్వాత పాలకొల్లులోనూ ఇలాంటి నకిలీ మందులే దొరికాయి. గొల్లపూడిలోని సహస్ర మెడికల్స్లోనూ కొన్ని నకిలీ మందులు లభించాయి. ఇవి విష్ రెమిడీస్ సంస్థ తయారు చేసినట్టు తేలింది. దీంతో ఏపీ ఔషధ అధికారుల బృందం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. చండీగఢ్‌లో మూలాలు బయటకు.. హెచ్‌పీహెచ్‌ఐఎన్ అనే కంపెనీ లేకుండా మందులెలా వచ్చాయి.. వీటికి మూలాలెక్కడ? అని ఆరా తీస్తే చివరకు చండీగఢ్‌లో బయటపడ్డాయి. క్యాన్ కేర్ అనే ఫార్మాసూటికల్ సంస్థ వీటిని తయారు చేసినట్టు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో ఆ సంస్థను ప్రశ్నించారు. అయితే ఎక్కడా ఆ మందులు తయారు చేసినట్టు ఆధారాలు లభించలేదు. మరింత లోతుగా పరిశీలించగా, హెచ్‌పీహెచ్‌ఐఎన్ మందులు మార్కెట్ చేసినట్టు, దానికి జీఎస్టీ చెల్లించినట్టు ఆధారాలు లభించాయి. దీంతో దొంగలు దొరికిపోయారు. వీరిపై వెంటనే అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించి కేసులు నమోదు చేశారు. కోవిడ్ సమయంలో ఎలాంటి మందులు తయారు చేసినా అమ్మకాలు బాగా ఉంటాయనే ఉద్దేశంతో ఇలా సొమ్ము చేసుకోవాలనుకున్నారు. 29 మందిపై చార్జిషీట్ నకిలీ మందులు తయారు చేసిన కంపెనీలు, వాటిని కొనుగోలు చేసిన ఇక్కడి ఫార్మసీ యాజమాన్యాలు మొత్తం 29 మందిపై చిర్జిషీట్ వేశారు. వీరిలో ఇప్పటికే చండీగఢ్‌లో నలుగురు జైలుకు వెళ్లారు. ఏపీలో నకిలీ మందులు కొనుగోలు చేసిన హరిప్రియ, కాళేశ్వరి ఫార్మసీ యాజమాన్యాల లైసెన్సులు రద్దు చేశారు. వీరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలని కోర్టును కోరనున్నారు. దేశ వ్యాప్తంగా నకిలీ మందులు అమ్ముతున్న విషయం గురించి ఏపీ ఔషధ నియంత్రణ అధికారులు కేంద్ర ఔషధ నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర సంస్థ అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. ఈ విచారణలో ఔషధ నియంత్రణకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ కె.రాజభాను, డ్రగ్ ఇన్స్పెక్టర్లు మల్లికార్జున రావు, వినోద్, అన్వేష్ రెడ్డి, ఎ.క్రిష్ణ, సబ్ ఇన్స్పెక్టర్ క్రిష్ణ, కానిస్టేబుల్ అచ్చన్నలు కీలక పాత్ర పోషించారు. తక్కువ కాలంలో ఛేదించగలిగాం నకిలీ మందులు అమ్ముతున్నారన్నది ఫిర్యాదుల ద్వారా రాలేదు. మేమే గుర్తించాం. వెంటనే అప్రమత్తమయ్యాం. వాటి మూలాలన్నీ శోధిస్తూ 45 రోజుల్లోనే అతి పెద్ద కేసును ఛేదించగలిగాం. వీళ్లందరికీ కఠిన శిక్ష పడేలా చార్జిషీట్ రూపొందించాం. నకిలీ మందుల విచారణకు వేసిన బృందం అద్భుతంగా పని చేయడం వల్లే తొందరగా కేసును ఛేదించగలిగాం. – రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణశాఖ -
తరచూ పారాసిటమాల్ తీసుకున్నా ప్రయోజనం సున్నా!
చాలా మంది వెన్నునొప్పికీ, నడుమునొప్పికి లాంటి నొప్పులకు పారాసిటమాల్ (అసిటమైనోఫెన్) తీసుకుంటూ ఉంటారు. హానిలేని మందుగా చాలామంది వైద్యులూ దీన్ని ఫస్ట్‌లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా ఇస్తూ ఉంటారు. నిజానికి తరచూ పారాసిటమాల్ వాడటం కూడా అంత మంచిది కాదంటున్నారు ఆస్ట్రేలియా అధ్యయనవేత్తలు. దాదాపు 1500 మంది వ్యక్తులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. నడుము, వెన్నునొప్పితో బాధపడుతూ ఉన్న ఆ గ్రూపులోని కొందరికి పారాసిటమాల్ ఇచ్చారు. ఇంకొందరికి కూడా పారాసిటమాల్ మాత్ర ఇచ్చారు కానీ నిజానికి అందులో ఏ మందూ లేదు. అంటే అసిటమైనోఫెన్ మందులేకుండా జాగ్రత్త తీసుకున్నారన్నమాట. పదిహేడు రోజుల తర్వాత పరీక్షించి చూడగా... నిజానికి మందు తీసుకున్నవారిలోనూ, మందుతీసుకోకుండా కేవలం ‘ప్లాసెబో’ఎఫెక్ట్‌తో ఉపశమనం పొందినవారిలోనూ పెద్దగా తేడా ఏదీ లేదని అధ్యయనవేత్తలు గుర్తించారు. అందుకే నడుము, వెన్ను నొప్పి వచ్చినప్పుడు పైపూత మందులు లేదా ఫిజియో వ్యాయామాలే మంచివంటున్నారు నిపుణులు. ఈ అధ్యయన ఫలితాలు ‘ల్యాన్సెట్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
శామ్సంగ్ డేస్ సేల్.. భారీ తగ్గింపు!
వాలెంటైన్స్ డే సందర్బంగా శామ్సంగ్ డేస్ సేల్ పేరుతో కొత్త సేల్‌ని తీసుకొనివచ్చింది. ఈ సేల్ లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లపై డిస్కౌంట్లను అందిస్తుంది. శామ్సంగ్ డేస్ సేల్ ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. శామ్సంగ్ డేస్ సేల్‌లో కొన్ని స్మార్ట్ఫోన్లు శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ ఎ71, గెలాక్సీ ఎం31, గెలాక్సీ ఎఫ్41 ఉన్నాయి. అలాగే టాబ్లెట్లలో గెలాక్సీ టాబ్ ఎస్7+, గెలాక్సీ టాబ్ ఎ7 వంటివి ఉన్నాయి. ఈ ఆఫర్లు శామ్సంగ్ ఇండియా ఆన్లైన్ స్టోర్, సెలెక్ట్ ఇ-కామర్స్ పోర్టల్స్, ప్రముఖ రిటైల్ అవుట్లెట్లలో లభిస్తాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా గెలాక్సీ టాబ్లను కొనుగోలు చేస్తే వినియోగదారులు పదివేల వరకు డిస్కౌంట్ లభించనుంది. చదవండి: ఆన్లైన్లో లీకైన ఆండ్రాయిడ్12 ఫీచర్లు రియల్ మీ ఎక్స్ 7 ప్రో ఫస్ట్ సేల్ -
8-10 టాబ్లెట్లు.. 4 గంటల మత్తు!
చెన్నై : మత్తుకు అలవాటు పడి మెడికల్ షాపులను దోచుకుంటున్న వ్యక్తిని సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నైకి చెందిన పింకీ అలియాస్ అరుణ్ కుమార్(21) మత్తుకు అలవాటు పడ్డాడు. మందు, గంజాయి కొనటానికి డబ్బులేని సమయంలో మెడికల్ షాపులనుంచి టాబ్లెట్లు దొంగతనం చేయటం మొదలుపెట్టాడు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వాడే ఖరీదైన మందులను మాత్రమే దొంగిలించేవాడు. తను దొంగతనం చేయబోయే షాపులలో ఆ టాబ్లెట్లు ఉన్నాయా లేదా అని విచారించుకునేవాడు. బాక్సుల మీద ఉన్న పేర్లను గుర్తుపట్టి వాటిని తీసుకెళ్లేవాడు. ( ఛీ! ఇదేం పాడు బుద్ధి సుందర్రాజు ) అనంతరం 8-10 టాబ్లెట్లను నీళ్లతో కలిపి ఓ మిశ్రమంలా తయారుచేసేవాడు. ఆ తర్వాత దాన్ని శరీరంలోకి ఎక్కించుకునేవాడు. దీంతో దాదాపు నాలుగు గంటలపాటు మత్తులో ఉండేవాడు. ఓ మెడికల్ షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ జరిపి అరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఇది వరకే పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. చదవండి : ‘నువ్వు ఆడా.. మగా? నీ గొంతు కుక్కలా ఉంది’ -
ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ హబ్‌గా భారత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్ పీసీల తయారీ కేంద్రంగా భారత్ మారడం ద్వారా ప్రపంచ మార్కెట్లో గణనీయమైన వాటాను పొందవచ్చు. విధానపర జోక్యంతో వీటి తయారీ పరిశ్రమ దేశంలో 2025 నాటికి రూ.7.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఇండియన్ సెల్యులార్, ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) బుధవారం వెల్లడించింది. ఈ సామర్థ్యం భారత పరిశ్రమకు ఉందని ధీమా వ్యక్తం చేసింది. ఇదే జరిగితే ప్రపంచ ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్స్ తయారీ పరిశ్రమలో భారత వాటా ప్రస్తుతమున్న 1 శాతం నుంచి 26 శాతానికి చేరుతుందని తెలిపింది. కొత్తగా 5 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పేర్కొంది. అలాగే రూ.5.62 లక్షల కోట్ల మేర విదేశీ మారకం భారత్‌కు వస్తుంది. రూ.7,500 కోట్ల విలువైన పెట్టుబడులూ ఉంటాయని ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్ల తయారీ అవకాశంపై ఐసీఈఏ–ఈవై రూపొందించిన నివేదిక తెలిపింది. ఇదీ ఎలక్ట్రానిక్స్ మార్కెట్.. భారత్‌లో ఎల్రక్టానిక్స్ మార్కెట్ రూ.4.87 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో అత్యధిక వాటా మొబైల్ ఫోన్లదేనని అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. ‘ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్ల విషయంలో ఇప్పటికీ దిగుమతులపై భారత్ ఆధారపడింది. అయిదేళ్లలో ల్యాప్టాప్స్ దిగుమతులు 42 శాతం ఎగసి రూ.31 వేల కోట్లు దాటింది. ఈ దిగుమతుల్లో చైనా వాటా ఏకంగా 87 శాతముంది. ఐటీ ఉత్పత్తుల్లో మొబైల్ ఫోన్ల తర్వాత ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ వరుసలో ఉన్నాయి. 2019 జాతీయ ఎల్రక్టానిక్స్ విధానం ప్రకారం.. 2025 నాటికి దేశంలో ఎల్రక్టానిక్స్ తయారీ రూ.30 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇందులో మొబైల్ ఫోన్ల విభాగం నుంచి రూ.14.2 లక్షల కోట్లు సమకూరనుంది’ అని వివరించారు. వ్యయాలు తగ్గితే.. దేశంలో ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ పీసీల మార్కెట్ చాలా చిన్నది. ఇక్కడ తయారైనవి అధికంగా యూఎస్, యూరప్ తదితర దేశాలకు ఎగుమతి కోసం ఉద్ధేశించినవి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఎల్రక్టానిక్స్ రంగానికి బూస్ట్‌నిస్తోంది. వ్యయాలు తగ్గితే ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ తయారీ అధికమవుతుంది. మొబైల్స్ తయారీలో ఉన్న భారతీయ సంస్థలకు ట్యాబ్లెట్స్ ఉత్పత్తిలో అపార అవకాశాలు ఉన్నాయి. అధిక విద్యుత్ టారిఫ్, పన్నులు, వ్యాపారానికి అనువైన పరిస్థితుల విషయంలో తయారీ సంస్థలకు అడ్డంకులు ఉన్నాయి. దీంతో వియత్నాం, చైనాలతో పోలిస్తే 10–20 శాతం తక్కువ పోటీలో ఉన్నాం. దీర్ఘకాలంలో ఈ సమస్యలను భారత్ పరిష్కరించాలి. ఎగుమతుల వృద్ధికి ప్రోత్సాహకాలను అందించాలి అని నివేదిక వెల్లడించింది. -
నెట్రావిట్ మాత్ర.. మత్తులోకి యాత్ర..
1956: శస్త్రచికిత్స తదితర సందర్భాల్లో రోగులకు మత్తు కలిగించడం కోసం శాస్త్రవేత్త పార్కే–డవీస్ కెటమ హైడ్రోక్లోరైడ్‌ను కనుగొన్నాడు. 1969: మత్తుకు బానిసైన వారు ఈ ఇంజెక్షన్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తుండటంతో దీనిని ‘నియంత్రణ మందు’గా మార్చారు. 2011: కెటమైన్ నుంచి పొడిని తయారుచేసి నిషా కోసం వాడుతుండటంతో కేంద్రం ఈ పొడిని నిషేధిత మాదకద్రవ్యాల జాబితాలో చేర్చింది. ప్రస్తుతం.. దీన్ని ఇంట్లోనే తయారుచేస్తూ విక్రయించే ట్రెండ్ నడుస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఇదొక్కటే కాదు.. మాదకద్రవ్యాలు కాని ఇలాంటి అనేక మత్తు ‘మందు’లకు యువత బానిసవుతోంది. సాధారణ రుగ్మతలు, శస్త్రచికిత్స చేసిన తర్వాత, అత్యవసర సమయాల్లో వాడే ఔషధాలు పక్కదారి పడుతున్నాయి. వీటిని విక్రయించేందుకు వ్యవస్థీకృత ముఠాలు పుట్టుకొచ్చాయి. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని పోలీసులు అంటున్నారు. పట్టుబడిన ఔషధాల్లో కొన్ని మెడికల్ షాపులు, డీలర్ల నుంచి బయటకు వచ్చినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. మాదకద్రవ్యాలతో పాటు ఈ ఔషధాల దుర్వినియోగంపైనా నిఘా పెట్టారు. ఈ ఔషధాలను ‘మత్తు’ కోసం వాడితే ఆరోగ్య సమస్యలొస్తాయని వైద్యులు చెబుతున్నారు. గతంలో విశాఖపట్నంతో పాటు నగరంలోని ఓయూ ఠాణా పరిధిలోనూ కెటమైన్ ఇంజెక్షన్లను అక్రమంగా కలిగిన వారిని పోలీసులు అరెస్టుచేశారు. టోలిచౌకి ప్రాంతంలో కెటమైన్ ఇంజెక్షన్‌ను వినియోగించి పొడిని తయారుచేయడం వెలుగులోకొచ్చింది. ఈ పొడిని ఇంట్లోనే తేలిగ్గా తయారు చేసుకుంటూ మత్తులో జోగుతున్నారు. దీన్ని వినియోగించే వారితో పాటు విక్రయించే వాళ్లు నగరంలో పలువురు ఉన్నారు. నగరంలో గంజాయికి బానిసైన యువత ప్రస్తుతం నెట్రావిట్ టాబ్లెట్స్ వాడుతున్నారు. వీటిని మహారాష్ట్ర నుంచి అక్రమంగా తెస్తున్నారు. నగర పోలీసులు ఇటీవల ఆసిఫ్‌నగర్ ప్రాంతంలో ఓ విక్రేతను అరెస్టుచేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. గంజాయిని సిగరెట్లో ఉంచి పీల్చినప్పుడు వెలువడే పొగతో తీవ్రమైన వాసన వెలువడుతుంది. దీంతో అందరి కంట్లో పడుతున్నామని భావిస్తోన్న యువత.. ప్రత్యామ్నాయంగా ‘నెట్రావిట్’ మాత్రల్లో మత్తును వెతుక్కుంటోంది. తీవ్ర రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారికి రాత్రిళ్లు సరిగా నిద్రపట్టక ఇతర రుగ్మతలు వచ్చే ఆస్కారం ఉంది. అందుకనే వైద్యులు వీరికి నెట్రావిట్ మాత్రలను ప్రిస్రై్కబ్ చేస్తారు. శస్త్రచికిత్స జరిగిన వారికీ ఆ నొప్పి తెలియకుండా ఒకట్రెండు రోజులు వీటిని రాస్తారు. ప్రస్తుతం యువత ఈ ‘మత్తు’ బారినపడటంతో కొందరు మహారాష్ట్ర నుంచి నెట్రావిట్ మాత్రల్ని నగరానికి అక్రమ రవాణా చేస్తున్నారు. 15 మాత్రలతో ఉండే స్ట్రిప్ ఖరీదు రూ.85 కాగా, గంజాయి బానిసలకు రూ.200కు అమ్ముతున్నారు. దగ్గు మందులే ఎక్కువ..: ఇటీవల పలువురు విద్యార్థులు, యువకులు ‘సేఫ్ డ్రగ్స్’ వైపు మొగ్గుచూపుతున్నారు. ఫుట్‌పాత్‌లపై ఉండే వారు సైతం వీటినే వాడుతున్నారు. వీరంతా వాడే వాటిలో దగ్గు మందు ప్రధానమైందని అ«ధికారులు చెబుతున్నారు. ఇంకా ఈ జాబితాలో నిద్రమాత్రలు, వైట్నర్ వంటివీ ఉన్నాయి. నిద్రమాత్రల్ని సేకరించడం కొంచెం కష్టం. వైట్నర్ను ఖరీదు చేయడం తేలికే అయినా, వాడేటప్పుడు ఇతరుల దృష్టిలో పడే అవకాశాలుంటాయి. దీంతో మత్తుకు బానిసలవుతున్న యువత, వైట్నర్ లభించని వారు దగ్గు మందును ఎక్కువ వాడుతున్నారు. సాధారణంగా దగ్గు మందుల్ని డెక్స్‌ట్రోమెథార్ఫిన్, కోడైన్‌లతో తయారుచేస్తారు. కోడైన్‌తో కూడిన ఈ రసాయనం నియంత్రిత జాబితాలో ఉన్న మాదకద్రవ్యం. మత్తును కలిగించే దీన్నికేవలం ఔషధాల తయారీకే వినియోగిస్తుంటారు. డెక్స్‌ట్రోమెథార్ఫిన్ కారణంగానే అనేక మంది దగ్గు మందులకు బానిసలవుతున్నారు. కండల కోసం ఇంజెక్షన్: అత్యవసర సమయాల్లో వినియోగించే మెఫన్‌టెరై్మన్ సల్ఫేట్ ఇంజెక్షన్‌ను నగర యువత స్టెరాయిడ్‌గా వాడుతోంది. జిమ్‌ల్లో ఎక్కువ సమయం గడిపి, కండలు పెంచడానికి, ఎక్కువ బరువులు ఎత్తడానికి ఈ సూది మందును తీసుకుంటోంది. దీన్ని అక్రమంగా యువతకు విక్రయిస్తున్న ముఠాను ఇటీవల టాస్‌్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మెఫన్‌టెరై్మన్ సల్ఫేట్ ఇంజెక్షన్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. రోగులకు సర్జరీలు చేసేటపుడు మత్తు (అనస్థీషియా) ఇస్తారు. ఈ ఇంజెక్షన్ రక్తపోటును అవసరమైన స్థాయిలో పెంచి, గుండె పక్కాగా పనిసేలా చూస్తుంది. గుండెపోటు వచ్చిన వారికి ఈ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. కాలక్రమంలో ఈ ఇంజెక్షన్ నగరంలో జిమ్‌లకు వెళ్తున్న యువతకు ‘అథ్లెట్స్ స్టెరాయిడ్’గా మారిపోయింది. మెడికల్ షాపులపై డేగకన్ను: ఇలాంటి ఔషధాలను నిబంధనల ప్రకారం వైద్యుడి చీటీ లేనిదే అమ్మడానికి లేదు. కొందరు అక్రమార్కులు వీటిని ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తెస్తున్నారు. నగరంలోని కొన్ని మెడికల్ షాపుల నిర్వాహకులు చీటీ లేకుండానే విక్రయించేస్తున్నారు. కొన్ని రకాలైన ఇంజెక్షన్లు కొరి యర్‌లో ఇతర రాష్ట్రాల నుంచి సిటీకి వస్తున్నాయి. ఈ నేపథ్యం లో నగరంలోని మెడికల్ దుకాణాలు, కొరియర్ సంస్థలపై పోలీ సులు డేగకన్ను వేశారు. మెడికల్ దుకాణాల నిర్లక్ష్య ధోరణిపైనా డ్రగ్ కంట్రోల్ అథారిటీస్‌కు లేఖ రాయాలని నిర్ణయించారు. మున్ముందు అనారోగ్య సమస్యలు ఈ మత్తు‘మందుల్ని’, స్టెరాయిడ్స్‌ను వినియోగించే వాళ్లకు తాత్కాలికంగా ఎలాంటి ఇబ్బంది లేకున్నా భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిని వాడే వారిలో విద్యార్థులు, యువతే ఎక్కువగా ఉన్నారు. వీటికి ఒకసారి అలవడితే.. అది దొరక్కపోతే పిచ్చివాళ్లుగా మారిపోతారు. వైద్యులు సైతం అత్యంత అరుదుగా రాసే కొన్ని ఔషధాలను అక్రమంగా వాడటం వల్ల గుండెజబ్బులతో పాటు కిడ్నీ, లివర్, మొదడుతో పాటు నరాల వ్యవస్థ దెబ్బతింటాయి. ఒక్కోసారి గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు పెరిగి తీవ్ర పరిణామాలు ఉంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లల వ్యవహారశైలిపై కన్నేసి ఉంచాలి. – డాక్టర్ పి.నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆస్పత్రి అమ్మే, కొనేవారిపైనా కేసులు వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని ఔషధాలను విక్రయించడం నేరం. ప్రధానంగా దగ్గు మందులతో పాటు మత్తును కలిగించే టాబ్లెట్లు, ఇంజెక్షన్లు వీటి కిందికి వస్తాయి. ఇలాంటివి విక్రయిస్తున్న ఔషధ దుకాణాలపై నిత్యం నిఘా ఉంచుతున్నాం. అమ్మిన వారితో పాటు కొన్న వారిపైనా కేసులు పెడుతున్నాం. ఇప్పటికే ఈ తరహా కేసులు పలు నమోదయ్యాయి. వైట్నర్ను మత్తు కోసం వాడుతున్నారనే సమాచారం ఉంది. – పి.రాధాకిషన్‌రావు, ఓఎస్డీ, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ -
గుణిషా అగర్వాల్ ‘డిజిటల్’ సాయం
నిరుపేద విద్యార్థుల ఇబ్బందులు గమనించింది ఓ టీనేజ్ అమ్మాయి. ఐటీ కంపెనీలను సంప్రదించింది. వారి సాయంతో విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తోంది. చెన్నై పోలీస్ కమిషనర్ మహేష్ కుమార్ అగర్వాల్ కుమార్తె పేరు గుణిషా అగర్వాల్. 12వ తరగతి చదువుతోంది. 17 ఏళ్ల గుణీషా తన తల్లి ఆన్లైన్ క్లాస్‌లో పాల్గొనడానికి ఇంట్లో పనిచేసే అతడి కుమార్తెకు ల్యాప్‌టాప్ ఇవ్వడం చూసింది. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు ఆన్లైన్లోనే చదువులు కొనసాగిస్తున్నారు. కానీ, వీరిలో చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు. వీరు ఆన్లైన్లో చదువుకోవాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ సమస్య ఒకటే కాదు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు వంటి పరికరాలు కావాలి. ఇదంతా గమనించిన గుణిషా అవసరమైన విద్యార్థులకు సహాయం చేయాలని సంకల్పించింది. కంపెనీల చొరవ చెన్నైలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి చాలా మంది విద్యార్థులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ల్యాప్‌టాప్‌లను గుణిషాకు విరాళంగా ఇస్తున్నారు. అలాగే, ఓ ఐటి కంపెనీ, థింక్‌ఫినిటీ అండ్ కన్సల్టింగ్ కూడా గుణిషాకు సహాయం చేయడానికి చొరవ తీసుకున్నాయి. ఈ సంస్థ 50,000 రూపాయలతో గుణిషా కోసం ఉచితంగా వెబ్‌సైట్‌ను తయారు చేసింది. అదే సంస్థకు చెందిన సాంకేతిక నిపుణులు విద్యార్థులకు ఇచ్చిన పాత పరికరాలను ఆన్లైన్ తరగతుల ప్రకారం ఫార్మాట్ చేస్తారు. సలహాదారు బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ, ‘ఐటి విభాగంలో పనిచేసిన తరువాత కూడా, విద్యార్థులకు సహాయం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. గుణిషా కారణంగా, మేం కూడా ఈ గొప్ప పనిలో పాల్గొనే అవకాశం లభించింది’ అని ఆనందంగా తెలిపారు. వారు ఇప్పటివరకు 25 పరికరాలను విద్యార్థులకోసం కేటాయించారు. ఈ వారం, మరో 15 మంది విద్యార్థులకు కంప్యూటర్ పరికరాలను ఇవ్వబోతున్నారు. ‘కరోనా కాలం కారణంగా కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారు. ఇటువంటి పరిస్థితిలో, చాలా పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని అవసరమైన వారికి అందిస్తే విద్యార్థులకు చాలా ఉపయోగంగా ఉంటాయి అనుకున్నాను. వాటిని అవసరమైన వారికి అందించడమే ఇప్పుడు నా బాధ్యత. తద్వారా వారి ఆన్లైన్ చదువులు నిరాఘాటంగా కొనసాగుతాయి’ అంటోంది గుణిషా. -
కోవిడ్-19కు డాక్టర్ రెడ్డీస్ నుంచి ట్యాబ్లెట్లు
కరోనా వైరస్ సోకి సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినియోగించగల ఫావిపిరవిర్ ఔషధాన్ని మార్కెట్లో విడుదల చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తాజాగా పేర్కొంది. అవిగాన్ బ్రాండుతో ఈ ఔషధ ట్యాబ్లెట్లను 200 ఎంజీ డోసేజీలో ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. రెండేళ్ల కాలావధి కలిగిన ఈ ఔషధ పూర్తి ప్యాక్ 122 ట్యాబ్లెట్లతో లభిస్తుందని తెలియజేసింది. దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చే యోచనతో ఆన్లైన్ ద్వారా 42 పట్టణాలలో వీటిని హోమ్ డెలివరీ సైతం చేస్తున్నట్లు వివరించింది. హెల్ప్‌లైన్ కేంద్రం ద్వారా ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకూ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ బాటలో సెప్టెంబర్ మొదటి వారానికల్లా కోవిడ్-19 చికిత్సకు మరో ఔషధం రెమ్‌డెసివిర్‌ను సైతం మార్కెట్లో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. ఫుజిఫిల్మ్ టొయామా నుంచి జపనీస్ దిగ్గజం ఫుజిఫిల్మ్ టొయామా కెమికల్ కంపెనీ నుంచి పొందిన గ్లోబల్ లైసెన్స్ ఒప్పందంలో భాగంగా వీటిని విక్రయిస్తున్నట్లు కంపెనీ వర్ధమాన మార్కెట్ల బ్రాండెడ్ మార్కెట్స్ సీఈవో ఎంవీ రమణ పేర్కొన్నారు. దేశీయంగా వీటి తయారీ, విక్రయం, పంపిణీలకు ప్రత్యేక హక్కులను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. ప్రస్తుతానికి ఈ ట్యాబ్లెట్లను జపాన్ నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో వీటి తయారీని ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. కోవిడ్-19 కారణంగా ఓమాదిరి సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినియోగించేందుకుగాను ఈ ట్యాబ్లెకు డీసీజీఐ అనుమతి ఉన్నట్లు వివరించారు. -
కోవిడ్-19కు ట్యాబ్లెట్లు- జెన్‌బర్క్ జోరు
కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను మార్కెట్లో విడుదల చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు బీఎస్ఈకి వెల్లడించడంతో ప్రవేశపెట్టనున్నట్లు జెన్‌బర్క్ ఫార్మా కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క యూఎస్ అనుబంధ సంస్థలో వాటా విక్రయ వార్తలతో ఐటీ సేవల సంస్థ మజెస్కో లిమిటెడ్‌కు సైతం డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జెన్‌బర్క్ ఫార్మా కరోనా వైరస్ సోకడంతో స్వల్ప లేదా మధ్యస్థాయి లక్షణాలతో ఇబ్బందిపడే రోగులకు ఉపశమనాన్ని ఇవ్వగల ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు జెన్‌బర్క్ ఫార్మాస్యూటికల్స్ తాజాగా వెల్లడించింది. ఇందుకు వీలుగా 200 ఎంజీ డోసేజీలో వీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో జెన్‌బర్క్ ఫార్మా షేరు బీఎస్ఈలో తొలుత 18 శాతం దూసుకెళ్లింది. రూ. 470 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని చేరింది. ప్రస్తుతం 6 శాతం జంప్‌చేసి రూ. 420 వద్ద ట్రేడవుతోంది. మజెస్కో లిమిటెడ్ పీఈ సంస్థ థోమా బ్రావోకు యూఎస్ అనుబంధ సంస్థను విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు మజెస్కో లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. యూఎస్ మజెస్కోలో మజెస్కో లిమిటెడ్‌కు 74 శాతం వాటా ఉంది. ఈ సంస్థను 59.4 కోట్ల డాలర్లకు(రూ. 4455 కోట్లు) విక్రయించేందుకు థోమా బ్రావోతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. వెరసి మజెస్కో రూ. 3154 కోట్లను అందుకోనుంది. ఈ నేపథ్యంలో మజెస్కో లిమిటెడ్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. 406 సమీపంలో ఫ్రీజయ్యింది. -
25 లక్షల సీ-విటమిన్ టాబ్లెట్ల పంపిణీ: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియోజకవర్గంలోని 1.60 లక్షల కుటుంబాలకు 25 లక్షల సీ–విటమిన్ టాబ్లెట్లు అందించారు. ఒక్కో కుటుంబానికి 15 చొప్పున వీటిని పంపిణీ చేశారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈ టాబ్లెట్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. (ఈ రోజు నాకెంతో ప్రత్యేకం: మహేష్) చంద్రగిరి నియోజకవర్గంలోసి విటమిన్స్ టాబ్లేడ్స్ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కార్డు లేని వారికీ ఉచిత రేషన్ చంద్రగిరి నియోజకవర్గంలో రేషన్‌కార్డులేని కుటుంబాలు 6 వేలు ఉన్నాయని, వాటికి ఉచితంగా రేషన్ అందించాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం తుమ్మలగుంటలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఆదేశించారు. (చంద్రబాబుకు నమస్కరిస్తున్నా: చెవిరెడ్డి) -
మందుల్లేవ్!
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఎంఐడీసీ) అధికారుల అవినీతి, అనాలోచిత నిర్ణయాల వల్ల ధర్మాస్పత్రులు దగా పడుతున్నాయి. రోగుల అవసరాలతో సంబంధం లేని, గడువు సమీపించిన నాసిరకం మందులు కొనుగోలు చేయడం, తీరా అవి ఎక్స్‌ఫైరీ అయినట్లు పేర్కొని గుట్టుచప్పుడు కాకుండా తిప్పి పంపడం ఇటీవల పరిపాటిగా మారింది. ఫలితంగా ప్రతిష్ఠాత్మక ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఖరీదైన మందుల సంగతేమో గానీ, బీపీ, షుగర్, బి–కాంప్లెక్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి సాధారణ మాత్రలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రోగులు మందుల చీటీ పట్టుకుని ప్రైవేటు ఫార్మసీలను ఆశ్రƬంచాల్సిన దుస్థితి తలెత్తుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగుల మందులకు భారీగా బడ్జెట్కేటాయించినట్లు ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కొన్ని రకాల మందులను ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధులతో కొనుగోలు చేసినా.. రోగుల అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేక పోతున్నారు. ఫలితంగా ఇన్‌పేషెంట్లతో పాటు అవుట్ పేషెంట్లకు మందుల కోసం ఇబ్బందులు తప్పడం లేదు. మందుల కొరతపై ఉస్మానియా ఆస్పత్రి అధికారులు ఇటీవల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు లేఖ రాయడం గమనార్హం. మందుల సరఫరా బంద్ ఉస్మానియా ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 2 వేల మంది రోగులు వస్తుండగా, ఇన్‌పేషెంట్ వార్డుల్లో వేయి మందికి పైగా చికిత్స పొందుతుంటారు. చిన్న, పెద్దా కలిపి ఇక్కడ రోజుకు 150–200 చికిత్సలు జరుగుతుంటాయి. సర్జకల్ డిస్పోజల్స్, సర్జికల్ బ్లేడ్స్, గ్లౌజులు సహా ఎక్సరే, సీటీ, ఎంఆర్ఐ ఫిలిమ్స్ సహా హెచ్ఐవీ రాపిడ్ కిట్స్ అందుబాటులో లేకపోవడంతో రోగులే సమకూర్చుకోవాల్సి వస్తోంది. అంతేకాదు డిసైక్లోఫెనిక్ సోడియం 50 ఎంజీ, ఎల్పీఎం 4 ఎంజీ, అజింత్రో, స్టెరిలేన్ వాటర్ ఫర్ ఇంజక్షన్ 10 ఎంఎల్, టెటనస్ టాక్సెడ్, ల్యాక్టోసెల్ సొల్యూషన్, యాసిడ్ కార్బల్ 100 ఎంజీ, లైసోల్ 500ఎంజీ, పారసిటమాల్ 100 ఎంజీ, సోడియం హైడ్రోక్లోరైడ్, కెటమిన్ 50ఎంజీ, డోపమిన్ 200 ఎంజీ, హెపటైటీస్–బి, హిమోగ్లోబిన్ సహా మొత్తం 120 రకాల మందులకు ఇరువై రోజుల క్రితమే టీఎస్ఎంఐడీసీకి ఇండెంట్ పంపారు. కానీ ఇప్పటి దాకా ఆయా మందులు సరఫరా చేయలేదు. ఇదిలా ఉంటే ఆస్పత్రికి రోజుకు సగటున 500 మంది మధుమేహులు వస్తుంటారు. టీఎస్ఎంఐడీసీ నుంచి ఇన్సులిన్ ఇంజక్షన్ల సరఫరా లేకపోవడంతో వారంతా బయట కొనుక్కోవాల్సి వస్తోంది. ఒక్కో ఇంజక్షన్‌కు రూ.150 వరకు ఖర్చు అవుతుండటంతో వీటిని కొనుగోలు చేసే శక్తి లేక మధుమేహులు తరచూ ఆందోళనకు దిగుతుండటం గమనార్హం. ఇలా ఒక్క ఉస్మానియాలోనే కాదు గాంధీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అవసరాలకు భిన్నంగా కొనుగోళ్లు తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు ఆస్పత్రులు, రోగుల అవసరాలతో సంబంధం లేకుండా ఇతర మందులు కొనుగోలు చేస్తుండడం, వినియోగం లేక ఏళ్ల తరబడి స్టోర్స్‌లోనే మగ్గిపోతుండడం, తీరా గడువు ముగియడంతో గుట్టుచప్పుడు కాకుండా పారబోయడం పరిపాటిగా మారింది. సర్జరీలు చేసే ఆస్పత్రులకు సరఫరా చేసే ‘ట్రమడాల్’ వంటి పెయిన్ కిల్లర్ మందులను అవసరం లేకపోయినా ఏరియా ఆస్పత్రులకు సరఫరా చేయడం తెలిసిందే. ఇటీవల నాంపల్లి ఏరియా ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ తర్వాత పారసిటమాల్‌కు బదులు పిల్లలకు ట్రమడాల్ ఇవ్వడం, ఇద్దరు పిల్లలు చనిపోవడం, ఆ సంస్థపై పెద్దెత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇవన్నీ పరిశీలిస్తే మందుల సరఫరా ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి తెలంగాణలోని అన్ని ఆస్పత్రులకు టీఎస్ఎంఐడీసీ మందులు సరఫరా చేస్తుంది. ప్రభుత్వం మందుల కోసం కేటాయించిన బడ్జెట్లో 80 శాతం నిధులు టీఎస్ఎంఐడీసికి, 20 శాతం నిధులు ఆస్పత్రికి కేటాయిస్తుంది. ఇలా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు ఏటా రూ.30 కోట్లకు పైగా కేటాయిస్తుంది. టీఎస్ఎంఐడీసీ సరఫరా చేయని మందులను ఆస్పత్రి వైద్యులే 20 శాతం వాటా నుంచి కొనుగోలు చేస్తుంటారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆయా ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. సీజన్లో రోజు వారి సగటు ఓపీ మూడు వేలకుపైగా నమోదైంది. అంచనాలకు మించి రోగులు రావడంతో మందుల కొరత తీవ్రమైంది. ఆరోగ్యశ్రీ, నిధులతో కొన్ని రకాల మందులు కొనుగోలు చేస్తున్నప్పటికీ రోగుల పూర్తిస్థాయి అవసరాలు తీర్చలేక పోతున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రగ్ మేనేజ్మెంట్ ద్వారా ఆరోగ్యశ్రీ రోగుల కోసం కొనుగోలు చేసిన మందులను సాధారణ రోగులకు సర్ధుబాటు చేయాల్సి వస్తోందని ఆయా ఆస్పత్రుల అధికారులు వాపోతున్నారు. -
జనం నెత్తిన రుద్దేస్తున్నారు..!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నాశిరకం మందులు రాజ్యమేలుతున్నాయి. తక్కువ ధరకు లభించే జనరిక్ మెడిసిన్, గడువు ముగిసిన ఖరీదైన బ్రాండెడ్ మందులకు కొత్తగా లేబుళ్లు అతికించి విక్రయిస్తున్నారు. వీటిని వేసుకున్న వారికి వ్యాధి తగ్గక పోగా మరింత ముదురుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పటికప్పుడు ఫార్మా కంపెనీలు, రిటైల్, హోల్‌సేట్ మెడికల్ దుఖానాల్లో తనిఖీలు నిర్వహించి గడువు ముగిసిన, నాశిరకం మందులను గుర్తించి, విక్రయదారులపై కేసులు నమోదు చేయాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు మామూళ్ల మత్తులో జోగుతుండటతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కేన్సర్, పక్షవాతం, కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న ఇన్‌పేషెంట్లకు గుట్టుచప్పుడు కాకుండా వీటిని అంటగడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రోగుల బంధువులు ఎవరైనా దీనిని గుర్తించి, ఫిర్యాదు చేయాలని భావించి డ్రగ్ ఇన్స్పెక్టర్లకు ఫోన్ చేస్తే...వారిలో పలువరు అసలు ఫోన్లే ఎత్తడం లేదు. డీసీఏ అధికారుల వైఖరితో విసుగుచెందిన రోగులు, వారి బంధువులు ఏసీబీని ఆశ్రయిస్తుండటం విశేషం. ఇటీవల డీఐ లక్ష్మిఓ రక్తనిధి కేంద్రం నుంచి నగలరూపంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన విషయం తెలిసిందే. తనిఖీలకు వచ్చి... రాష్ట్ర వ్యాప్తంగా 500పైగా మందుల తయారీ కంపెనీలు ఉన్నాయి. 27వేలకు పైగా హోల్‌సేల్, రిటైల్ దుఖానాలు కొనసాగుతున్నాయి. ఇందులో 80 శాతం కంపెనీలు, హో ల్‌సేల్ దుఖానాలు గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. వాస్తవానికి తుది గడువుకు మూడు నెలల ముందే స్టోర్‌లో నిల్వ ఉన్న మందులను గుర్తించి ఆయా ఔషధ కంపెనీలకు తిప్పి పంపాల్సి ఉంది. అయితే నగరంలోని కొన్ని ఆస్పత్రుల్లోని మందుల దుఖానాలు ఇందుకు విరుద్ధంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న అమాయక ఇన్పేషంట్లకు గుట్టుగా ఈ మందులను వాడుతున్నట్లు తెలిసింది. ఓపీ రోగులు కొనుగోలు చేసిన మందులు బయట ఎవరైనా గుర్తించే ప్రమాదం ఉండటంతో ఇన్‌పేషెంట్లకే వాటిని వినియోగిస్తున్నారు. దీంతో సర్జరీ తర్వాత ఒకటి రెండు రోజుల్లో నయం కావాల్సి గాయం వారం పదిరోజులైనా మానకపోవడం, వ్యాధి తీవ్రత తగ్గక పోవడానికి ఇదే కారణమని పలువురు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు ప్రతి మూడు నెలలకోసారి ఆయా దుఖానాల్లో తనిఖీలు నిర్వహించిగడువు ముగిసిన, సమీపించిన మందులను ముందే గుర్తించి నోటీసులు జారీ చేయాల్సి ఉంది. అయితే తనిఖీలకు వెళ్తున్న ఇన్స్పెక్టర్లలో పలువురుఫార్మసీల ముఖం చూడకుండానే బయటికి వెళ్లిపోతున్నట్లు తెలిసింది. తనిఖీలు ముమ్మరం చేశాం నాశీరకం మందులు అమ్ముతూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫార్మా కంపెనీలు, రిటైల్, హోల్‌సేల్ దుఖానాలపై డ్రగ్ కంట్రోల్ విభాగం ప్రత్యేంగా దృష్టిసారించింది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. నాశిరకం మందుల విక్రయాలను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నాం. తనిఖీల విషయంలో డీఐలు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2018లో 20,200 దుఖానాల్లో తనిఖీలు నిర్వహించి, 5700 ఉల్లంఘన లు గుర్తించాం. 20 నాశిరకం మందులను గుర్తించాం. లైసెన్స్ లేకుండా మందులు అమ్ముతున్న 64 దుఖానాలను సీజ్ చేశాం. వీరిలో 24 మందికి ఇప్పటికే శిక్షలు కూడా పడ్డాయి. 2019లో ఇప్పటి వరకు 13370 తనిఖీలు నిర్వ హించాం. 4780 ఉల్లంఘనలు, తొమ్మిది నాశిరకం మందులను గుర్తించి ఆ మేరకు కేసులు నమోదు చేశాం. లైసెన్సులు లేకుండా మందులు అమ్ముతున్న 42 మందుల దుఖానాలను సీజ్ చేశాం. 32 మందికి ఇప్పటికే శిక్షలు పడ్డాయి. వీటిలో గడువు ముగిసిన మందులు నిల్వ చేయడం, కనీస అర్హత లేని నాన్ఫార్మసిస్ట్ మందులు విక్రయిస్తుండటం, మందులు కొనుగోలు, విక్రయాలకు సంబంధించి రికార్డులు సరిగా నిర్వహించడం వంటి ఉల్లంఘనలే ఎక్కువగా ఉన్నాయి. –వెంకటేశ్వర్లు, జాయింట్ డైరెక్టర్, డీసీఏ -
మందుల దుకాణాల్లో మాయాజాలం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని మందుల దుకాణాల యజమానులు మాయాజాలం చేస్తున్నారు. ఒకే లైసెన్సుపై రెండు మూడు షాపులునిర్వహిస్తున్నారు. ఎమ్మార్పీ కంటే అధికధరలకు మందులు విక్రయిస్తున్నారు.మరోవైపు అనర్హులను ఫార్మాసిస్టులుగా నియమిస్తుండడంతో... వారు వైద్యుడొకటి రాస్తే బాధితులకు మరొకటి అంటగడుతున్నారు. ఎంఫార్మసీ, బీఫార్మసీ అర్హతలు లేని వారికి స్వల్పకాలిక శిక్షణనిచ్చి మందులవిక్రయాలు చేపడుతున్నారు. అనుమతి లేకుండా ఒకే ఆస్పత్రి భవనంలో రెండు మూడు ఫార్మసీ కేంద్రాలు నడుపుతున్నారు. వీటిలో చాలా వరకు బ్రాండెడ్ కంపెనీ మందులకు బదులు జనరిక్ మెడిసిన్అమ్ముతున్నారు. ఇలా మారుమూల ప్రాంతాల్లోని మందుల దుకాణాల్లోనే కాదు... నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, మందుల నాణ్యతను పరిశీలించాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు అక్రమాలకు పాల్పడుతూ పరోక్షంగా వారికే సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడిగినంత ఇవ్వని వారిని వేధింపులకు గురిచేస్తుండడంతో భరించలేక కొంతమంది ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.తాజాగా బోయిన్‌పల్లిలోని జనని వాలంటరీ బ్లడ్‌బ్యాంక్ నిర్వాహకురాలు ఏసీబీని ఆశ్రయించడానికి ఇదే కారణమని తెలిసింది. తనిఖీలు... మామూళ్లు గ్రేటర్లో 8,500లకు పైగా మందుల దుకాణాలు ఉండగా... 18 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు (డీఐ) ఉన్నారు. తనిఖీలు, శాంపిల్స్ సేకరణ, పరీక్షలు, కొత్త దుకాణాలకు లైసెన్సుల జారీ, పాత వాటికి రెన్యూవల్ తదితర పనుల కోసం ఒక్కో డీఐకి 400–500 దుకాణాలు కేటాయించారు. వీరు ఎప్పటికప్పుడు ఆయా దుకాణాలను తనిఖీ చేసి, మందుల నాణ్యతను పరిశీలించాల్సి ఉంది. అయితే తనిఖీల పేరుతో అనేక విధాలుగా వేధింపులకు గురిచేయడం, ఆ తర్వాత ఎంతో కొంత మొత్తానికి సెటిల్ చేసుకోవడం డీఐలకు పరిపాటిగా మారింది. గతంతో పోలిస్తే శివారు ప్రాంతాలు విస్తరించాయి. బోడుప్పల్, బీఎన్‌రెడ్డి, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, కర్మన్‌ఘాట్, నందనవనం, మీర్పేట్, చర్లపల్లి, నారపల్లి, జీడిమెట్ల, సూరారం, రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ తదితర బస్తీల్లో ఇప్పటికీ ఆర్ఎంపీలు చికిత్సలు అందిస్తున్నారు. వైద్య సేవలతో పోలిస్తే మందుల విక్రయాల్లోనే భారీగా లాభాలు వస్తుండటంతో.. ఎలాంటి అనుమతులు పొందకుండానే వారు ఆయా క్లినిక్స్‌లోనే మందులు విక్రయిస్తున్నారు. ప్రమాదకరమైన యాంటీబయోటిక్స్‌తో పాటు గర్భవిచ్ఛిత్తి మందులనూ విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల బేగంపేట సమీపంలోని ఓ యువతి గర్భ విచ్ఛిత్తి మందులు వాడి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే. స్వదేశీయే విదేశీ... గ్రేటర్ పరిధిలో 20 కార్పొరేట్ ఆస్పత్రులు, 85 పాలీక్లినిక్స్, 228 డయాగ్నోస్టిక్స్, 234 దంత ఆస్పత్రులు, 372 ఇరవై పడకల ఆస్పత్రులు ఉన్నాయి. 21–50 పడకల ఆస్పత్రులు 88 ఉండగా.. 101–200 పడకల ఆస్పత్రులు 94, 200కు పైగా పడకల ఆస్పత్రులు 13 ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లోకి ఆరోగ్య బీమా, ఆరోగ్య భద్రత, సీజీహెచ్ఎస్, ఇతర హెల్త్ ఇన్సూరెన్స్లున్న రోగులు వస్తే చాలు అందినకాడికి దోచుకుంటున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఆయా పేషెంట్లకు తక్కువ ఖరీదుతో కూడిన జనరిక్ మందులిచ్చి ఎక్కువ ధరున్న బ్రాండెడ్ మందులు ఇచ్చినట్లు బిల్లులు సమర్పిస్తున్నాయి. ఇక సర్జికల్ వస్తువులు, హృద్రోగులకు అమర్చే స్టంట్లు, కృత్రిమ మోకాళ్లు, విరిగిన ఎముకలను జాయింట్ చేసే స్టీల్ రాడ్స్ ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. ఇంపోర్టెడ్ డ్రగ్ కోటెడ్ స్టంట్ల పేరుతో స్వదేశీ కంపెనీలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన నాసిరకం స్టంట్లను అమర్చుతున్నాయి. గుండె రక్తనాళాలల లోపల వీటిని అమర్చుతుండడంతో రోగులు కూడా గుర్తించలేకపోతున్నారు. ఏ రోగికి ఏ కంపెనీ పరికరం అమర్చారు? దాని ఖరీదు ఎంత? రోగి ఎంత చెల్లించారు? తదితర వివరాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయకుండా యథేచ్ఛగా ఐటీ ఎగవేతకు పాల్పడుతున్నాయి. ఆస్పత్రుల అక్రమాలకు ఆయా ప్రాంతాల్లోని డ్రగ్ ఇన్స్పెక్టర్లు పరోక్షంగా సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డీసీఏలో వసూల్ రాజాలు ఫార్మాష్యూటికల్ కంపెనీ ఏర్పాటు చేయాలన్నా, ఆ కంపెనీ తయారు చేసిన మందులను మార్కెట్లోకి విడుదల చేయాలన్నా, చివరకు స్వచ్ఛందంగా ఓ రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేయాలన్నా, ఓ మెడికల్ షాపు పెట్టుకోవాలన్నా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) లైసెన్సు తప్పనిసరి. ఇదే అదనుగా డీసీఏలోని అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటు చేయాలంటే రూ.2 లక్షలకు పైగా ముట్టజెప్పాల్సి వస్తోంది. మెడికల్ షాపునకు (హోల్‌సేల్, రిటైల్) రూ.20 వేల నుంచి రూ. 50 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్‌ను ఇన్‌వార్డులో సమర్పించిన తర్వాత సంబంధిత అధికారి టేబుల్‌కు చేరుకోవాలంటే వారికి ముందే ఎంతో కొంత ఇవ్వాల్సిందే. తనిఖీకి వచ్చే ఇన్స్పెక్టర్కు అడిగినంత అందించాల్సిందే. లేదంటే వివిధ రకాల లోపాల పేరుతో సవాలక్ష కొర్రీలు పెట్టి లైసెన్స్ జారీ కాకుండా అడ్డుకుంటారు. పాతవాటిని పునరుద్ధరించరు. నేరుగా దరఖాస్తు చేయడం కంటే కన్సల్టెంట్‌ను సంప్రదించడం మంచిదనే అభిప్రాయమూ ఉంది. ఇందుకు డీసీఏ అధికారులే ఓ రక్తనిధి కేంద్రం నిర్వాహకుడితో ప్రత్యేకంగా కన్సల్టెన్సీ ఏర్పాటు చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 8,500 గ్రేటర్‌లోని మందుల దుకాణాలు డీఐ టార్గెట్స్:దిల్సుఖ్నగర్, మలక్‌పేటకు చెందిన ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్ (డీఐ) మందుల దుకాణాలు, రక్తనిధి కేంద్రాలకుప్రత్యేకంగా టార్గెట్లు విధించినట్లు ఆరోపణలున్నాయి. ఆయన పేరు చెబితేనే ఆయా ప్రాంతాల్లోనినిర్వాహకులంతా హడలిపోతున్నారు. -
మందుల్లేవ్
సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు ఖాళీ అయిపోయాయి. ఖరీదైన మందుల సంగతేమో కానీ సాధారణ బీపీ, షుగర్, బి–కాంప్లెక్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి సాధారణ మాత్రలు కూడా దొరకని పరిస్థితి తలెత్తింది. ఆస్పత్రిలో మందులు అయిపోయాయని, రోగులకు అవసరమైన మందులను వెంటనే పంపించాల్సిందిగా ఉస్మానియా ఆస్పత్రి ఫార్మసీ విభాగం.. తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఎంఐడీసీ)కి మూడుసార్లు ఇండెంట్లు పంపినా ఎలాంటి స్పందనా లేదు. నెల రోజుల్లో మూడు సార్లు ఇండెంట్లు పంపితే.. ఇండెంట్ పంపిన ప్రతిసారి ‘సరఫరా లేదంటూ’ తిప్పపంపడం గమనార్హం. ఇది ఒక్క ఉస్మానియా లోనే కాదు ప్రతిష్టాత్మాక గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ, పేట్లబురుజు, సుల్తాన్ బజార్, ఫీవర్, ఛాతి, మానసిక చికిత్సాలయాలతో పాటు సరోజినిదేవి కంటి ఆస్పత్రిలోనూ ఇదే దుస్థితి. రోగుల అవసరాలతో సంబంధం లేకుండా మందులు కొనుగోలు చేయడం, తర్వాత ‘ఎక్సైఫైరీ’ పేరుతో వాటిని గుట్టుచప్పుడు కాకుండా పారబోయడం పరిపాటిగా మారింది. అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రి ఫార్మసీలో మందులు లేకపోవడంతో వైద్యుడు రాసిన చీటి పట్టుకుని రోగి బంధువులు ప్రైవేటు పార్మసీలను ఆశ్రయింయించే పరిస్థితి దాపురించింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వివిధ సర్జరీలు చేయించుకుని, డిశ్చార్జైన రోగులకు తర్వాత నెలవారి ఫాలోప్ మందులు సైతం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అక్కడ సగం మందులతోనే సరి.. ఇక వనస్థలిపురం, మలక్‌పేట్, కింగ్‌కోఠి, గోల్కొండ, కొండాపూర్, నాంపల్లి, లాలాపేట్ ఏరియా ఆస్పత్రుల్లో పరిస్థితి మరోలా ఉంది. ఒక్కో ఆస్పత్రి వంద పడకల సామర్థ్యం ఉంటుంది. వాటిలో ఆర్థో, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, గైనకాలజీ విభాగాలు సైతం ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రికి మందుల కోసం ప్రతి మూడు నెలలకు ఓసారి రూ.3.5 లక్షల చొప్పున మంజూరు చేస్తుంది. 145 రకాల మందులు సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. ఆయా ఆస్పత్రుల్లో 30–35 రకాలకు మించి దొరకడం లేదు. ఒక్కో గర్భిణికి 100 బికాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇవ్వాలి. ఆస్పత్రికి ప్రతిరోజూ వంద మంది గర్భిణులు వస్తే ఒక్కొక్కరికి 30 గోళీల చొప్పున రోజుకు 3000 గోలీలు అవసరం. కానీ రోగుల నిష్పత్తికి తగినన్ని మందులు లేకపోవడంతో పది రాస్తే.. ఐదు గోళీలు ఇచ్చి పంపుతున్నారు. బి–కాంప్లెక్స్, కాల్షియం, డయోనిల్, ఫోలిక్ యాసిడ్ వంటి సాధారణ మందులతో పాటు ‘ఐసాక్స్ సుఫ్రిన్ హెచ్‌సీఎల్’ ఇంజెక్షన్లు కూడా దొరకడం లేదు. రోగులే వీటిని సమకూర్చు కోవాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఆస్పత్రుల అంతర్గత నిధులను వెచ్చించి కొనుగోలు చేసి, వాడుతున్నారు. బయట కొనుక్కోమన్నారు.. మాదాపూర్‌కు చెందిన రత్తమ్మ(40) దినసరి కూలీ. రెండు రోజుల క్రితం పనికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. గాయాలపాలైన రత్తమ్మను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ మందులు లేవని చెప్పి వైద్యులు బయట నుంచి మందులు తెచ్చుకోమన్నారని రత్తమ్మకు సహాయకురాలుగా ఉన్న ఆమె కూతురు సుశీల పేర్కొంది. రూ.150 విలువ చేసే మందులను కొనుగోలు చేశానని తెలిపింది. మందులు లేవన్నారు.. నూర్‌ఖాన్‌బజార్‌కు చెందిన రెహనాబేగంకు చేతి రెక్కలు నొప్పిగా ఉండడంతో ఉస్మానియాలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమెకు కుమారుడైన హైదర్ సహాయకుడిగా ఉన్నాడు. బుధవారం రాత్రి ఆస్పత్రిలో రెహనాబేగం వైద్యానికి కావాల్సిన మందులు లేవని వైద్యులు బయట నుంచి తెచ్చుకోవాలని చెప్పారు. దీంతో అతడు ఆస్పత్రి ఆవరణలోని మెడికల్ షాపులో కొనుగోలు చేశాడు. ఉస్మానియా ఆస్పత్రిలో సైతం మందులు లేకపోవడం శోచనీయం. అత్యవసరం మేరకు కొంటున్నాం ఉస్మానియా ఆస్పత్రిలో అత్యవసర మందులు సరఫరా పూర్తిగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ద్వారా జరుగుతుంది. అన్ని విభాగాల విభాగాధిపతులను సంప్రదించి వారి సూచనల మేరకు కమిటీ అత్యవసర మందులు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి సరఫరా చేస్తారు. టీఎస్ఎంఐడీసీ ద్వారా సరఫరా కాని మందులను ఆయా విభాగాధిపతుల సిఫార్సు మేరకు ఆస్పత్రి అంతర్గత నిధుల ద్వారా సమకూర్చుతున్నాం. కొత్తగా అవసరమైతే, ఆ విభాగం కమిటీ సూచనతో సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి తెప్పిస్తు న్నాం. – నాగేందర్, ఉస్మానియా ఆస్పత్రిసూపరింటిండెంట్ -
జ్వరానికీ మాత్రల్లేవు!
చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జ్వరంతో వచ్చే బాధితులకు మూడు రోజులకు పది పారాసిటమాల్ మాత్రలు ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఒక్కో బాధితులకు ఆరు మాత్రలే ఇస్తున్నారు. ఇదేమిటని అడిగితే స్టాకు లేదంటున్నారు. ఇక రెండు నెలలుగా పారాసిటమాల్ మాత్రలు సరఫరా లేకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది బయటి మెడికల్ దుకాణాల్లో రూ.10 లక్షలు అప్పుచేసి మాత్రలు కొన్నారు. బాకీ తీర్చమని దుకాణ నిర్వాహకులు ఒత్తిడి తేవడంతో హెచ్‌డీఎస్ నిధుల నుంచి రూ.7 లక్షలు చెల్లించారు.’’ చిత్తూరు అర్బన్: ఇదొక్కటేకాదు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి. రెండు నెలలుగా ప్రభుత్వం పారాసిటమాల్ మాత్రలను సరఫరానే చేయలేదు. ఫలితంగా రోజుకు సర్కారీ ఆస్పత్రికి వచ్చే చాలామంది జ్వరబాధితులకు పారాసిటమాల్ మాత్రలు లేవని చెబుతున్న సిబ్బంది రోగులనుతిప్పి పంపించేస్తున్నారు. జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్‌సీలతో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతో కలిపి రోజుకు జ్వరంతో వచ్చేవారి సంఖ్య పది వేల వరకు ఉంటుంది. ఒక్కసారి జ్వరంతో వచ్చే బాధితులను పరిశీలించిన వైద్యులు సూదిమందు వేయడంతో పాటు పది పారాసిటమాల్ మాత్రలను రాసిస్తారు. వీటిని మూడు రోజుల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు రెండు రోజులకే మాత్రలు ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి మాత్రలు, సూది మందులు, సిరప్‌లాంటి వాటిని రాష్ట్ర వైద్యశాఖ సరఫరా చేస్తుంది. ఇందుకోసం రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ)కు టెండర్లను అప్పగించి ప్రతి జిల్లాకు కావాల్సిన మందులను తిరుపతిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు (సీడీఎస్) పంపిణీ చేస్తారు. జిల్లా నుంచి ప్రతి వైద్యశాలకు ఏయే మందులు కావాలని ఈ–ఔషధి ద్వారా ఆన్లైన్లో అడిగితే వాటిని తిరుపతిలోని డ్రగ్‌స్టోర్ నుంచి తీసుకోవచ్చు. సంవత్సరంలో నాలుగుసార్లు మందుల జాబితాను ఈ–ఔషధి ద్వారా తీసుకోవాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలలు మూడు నెలలకు ఓసారి మందుల జాబితాను ఆన్లైన్లో ఉంచి సీడీఎస్ నుంచి వీటిని తీసుకుంటారు. జిల్లాకు జనవరిలో పారాసిటమాల్ మాత్రలు ఇచ్చిన ప్రభుత్వం దాని తరువాత ఇప్పటివరకు సరఫరాను ఇవ్వలేదు. గతనెల సీడీఎస్‌లో మిగిలిన మాత్రలను అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు సర్దేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఒక్కటంటే ఒక్క పారాసిటమాల్ మాత్ర సీడీఎస్‌లో నిల్వలేకపోవడం ప్రజారోగ్యంపై పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కనీసం నెల రోజులకు పారాసెట్మాల్ మాత్రలను జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో రిజర్వులో ఉండాలి. అంటే ఇప్పటికిప్పుడు జిల్లాకు 60 లక్షల పారాసిటమాల్ మాత్రల కొరత ఉంది. కొనుగోలుకు నిధులేవీ? ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర మందుల కొనుగోలుకు డీసెంట్రలైజ్డ్ లోక్ పర్చేస్ డ్రగ్స్ బడ్జెట్‌ను ప్రతి మూడు నెలలకోసారి విడుదలచేయాలి. ఒక్కో ఆస్పత్రికి 10 శాతం నిధులను ఆయా ఆస్పత్రుల పర్యవేక్షకుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలి. వీటితో అవసరమైన మందులను కొనుగోలు చేసుకుంటూ రోగులకు ఇబ్బందిలేకుండా అధికారులు జాగ్రత్త తీసుకుంటారు. అయితే ఏడాది కాలంగా ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇలాగైతే కష్టమని ప్రశ్నిస్తున్న వైద్యులకు ఓ ఉచిత సలహా ఇస్తున్నారు. మెడికల్ దుకాణాల్లో అప్పులు చేయమని చెబుతున్నారు. విధిలేక ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలలు రూ.లక్షల్లో అప్పులు చేశాయి. -
విటమిన్ ఏది?
నార్నూర్(ఆసిఫాబాద్): చిన్నారులకు భవిష్యత్‌లో ఎలాంటి కంటి చూపు సమస్యలు రాకూడదనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉచితంగా విటమిన్ ఏ అందిస్తోంది. కానీ గత ఆరు నెలలుగా జిల్లాలో ఈ మందు సరఫరా నిలిచిపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 126 సబ్‌సెంటర్లు.. జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 05 అర్బన్ హెల్త్సెంటర్లు, 126 సబ్‌సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 9 నెలల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులు దాదాపు 30వేల మంది ఉన్నారు. చిన్నారులకు ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు ద్వారా ఇంటింటికి లేదా సబ్సెంటర్లలో ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఏ విటమిన్ సిరప్‌ను ఒక టీ స్పూన్ వేయాల్సి ఉంటుంది. ఆరు నెలలుగా ఏ విటమిన్ సిరప్ లేని కారణంగా చిన్నారులకు వేయడం లేదు. ఆరు నెలలుగా నిలిచిన సరఫరా.. చిన్నారులకు కంటి చూపునకు సంబంధించిన సమస్యలు రాకూడదనే ఉద్దేశంలో ఏ విటమిన్ సిరప్‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. కానీ ఆరు నెలలుగా సబ్ సెంటర్లకు ఏ విటమిన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో చిన్నారులు రేచీకటి బారిన పడే అవకాశం ఉంది ఆరు నెలలకో డోసు.. తొమ్మిది నెలలు నిండిన చిన్నారులకు ప్రతీ ఆరు నెలలకోసారి ఏ విటమిన్ సిరప్‌ను 5 ఏళ్ల చిన్నారుల వరకు అందిస్తారు. ఆరు నెలలుగా సరఫరా లేకపోవడంతో ఒక డోస్ సమయం ముగిసి రెండో డోస్ వచ్చే సమయం ఆసన్నమైనా ఇప్పటి వరకు ఏ విటమిన్ సరఫరా కావడం లేదు. 100 మిల్లీలీటర్ల ఏ విటమిన్ బాటిల్‌ను 2 ఎంఎల్ చొప్పున 50 మంది చిన్నారులకు ఏఎన్ఎంలు అందిస్తారు. బయట దొరకని సిరప్ డబ్ల్యూహెచ్‌వో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా ఉచితంగా సరఫరా చేసే టీకాలు, సిరప్లు సకాలంలో జిల్లా స్థాయి అధికారులు తీసుకురాకుండా చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఏ విటమిన్ ఎక్కడా మార్కెట్లో లభించదు. దీంతో చిన్నారుల కంటిచూపుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఏ విటమిన్ సిరప్ 9నెలల చిన్నారుల నుంచి 5 ఏళ్లలోను చిన్నారులకు ప్రతి ఆరు ఆరునెలలలకొకసారి తొమ్మది డోసులు వేయడంతో జీవితంలో వీరికి కంటి చూపునకు సంబందించిన సమస్యలు తలెత్తవు. ఇది పూర్తిగా చేప నూనెతో తయారు చేసిన ద్రావణం కాబట్టి ఇది మార్కెట్లో ఎక్కడ లభించదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సబ్‌సెంటర్లకు ఏ విటమిన్ సిరప్‌ను సరఫరా చేయాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అందుబాటులో ఉండేలా చూస్తాం విటమిన్ ఏ సిరప్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికీ అన్ని పీహెచ్‌సీల నుంచి చిన్నారుల వివరాలతోపాటు ఇండెంట్ తెప్పించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా సరఫరా లేదు. ప్రభుత్వం నుంచి విటమిన్ ఏ సిరప్ రాగానే సబ్ సెంటర్లకు పంపిణీ చేస్తాం. – రాజీవ్‌రాజ్, జిల్లా వైద్యాధికారి ఆదిలాబాద్ -
మందు బిళ్లలకూదిక్కులేదు..!
విజయనగరం ఫోర్ట్ : ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు నరసమ్మ. ఈమెది నెల్లిమర్ల మండలం ఆత్మరాముని ఆగ్రహారం. నీరసంగా ఉందని కేంద్రాస్పత్రికి వచ్చింది. ఈమెను పరీక్షించిన వైద్యులు మల్టీవిటమిన్ మాత్రలు 30 రాశారు. ఆ చీటీ పట్టుకుని ఆస్పత్రిలో ఉన్న ఫార్మసీ గది వద్దకు వెళితే అక్కడ సిబ్బంది మందులు లేవని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగింది. గంట్యాడ మండలానికి చెందిన పి. పాపమ్మ అనే వృద్ధురాలు నిద్రలేమితో బాధపడు తూ కేందాస్పత్రికి వచ్చింది. ఆమెకు వైద్యులు అ ల్ప్రాజోలమ్ మందులు రాశారు. ఆ చీటీ పట్టుకుని ఫార్మసీ వద్దకు వెళితే మందులు లేవని చెప్పారు. దీంతో ఆమె నిరాశతో వెనుదిరుగింది. ఇది ఈ ఇద్దరి రోగులకు ఎదురైన అనుభవమే కాదు నిత్యం వందలాది మంది రోగులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. సర్కారీ ఆస్పత్రుల్లో మందుబిల్లలూ లేకపోవడంతో రోగులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా కేంద్రాస్పత్రితో పాటు, సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో కూడా మందుల కొరత వేధిస్తోందని రోగులు వాపోతున్నారు. ఇదీ పరిస్థితి... జిల్లాలో 68 పీహెచ్‌సీలు, 12 సీహెచ్‌సీలు, జిల్లా కేంద్రాస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. కేంద్రాస్పత్రిలో బీపీ వ్యాధికి వినియోగించే ఎటిన్‌లాల్ మాత్రలు, జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగించే పెంటాప్ మాత్రలు, గాయాలకు ఉపయోగించే సోప్రామైసిన్ మాత్రలు, నీరసానికి ఉపయోగించే మల్టీవిటమిన్ మాత్రలు, మానసిక రోగులకు ఉపయోగించే ఎమిట్రాపిన్, మందు బిళ్లలకూ దిక్కులేదు..! అల్ప్రాజోలమ్ తదితర మందులు లేవు. ప్రజారో గ్యానికి పెద్ద పీట వేస్తున్నామని గొప్పలు చెబుతు న్న చంద్రబాబు సర్కార్ మాటలకు చేతలకు పొం తన ఉండడం లేదు. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులంతా పేద, మధ్యతరగతి వర్గాలవారే. అయితే, ప్రభుత్వాస్పత్రుల్లో రోగాలు నమయ్యేం దుకు అవసరమైన మందులు దొరకకపోవడంతో పేద రోగులు అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేటు మందుల దుకాణాలే దిక్కు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. మందులు లేకపోవడంతో నిరుపేదలు సైతం ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం తీరువల్లే ఆస్పత్రుల్లో మందుల కొరత నెలకొందని రోగులతో పాటు కొందరు వైద్యులు సైతం విమర్శిస్తున్నారు. మందుల కోసం వచ్చేవారికి సమాధానం చెప్పలేక ఫార్మాసిస్టులు మదనపడుతున్నారు. ఇదే విషయాన్ని కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ కె.సీతా రామరాజు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా మందుల కొరత ఉన్న విషయం నా దృష్టికి రాలేదన్నారు. ఏవైనా మందులు లేకుంటే లోకల్‌గా కొనుగోలు చేసి అందిస్తామని చెప్పారు. -
ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ డేస్
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్‌తో మళ్లీ మన ముందుకు రాబోతుంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, గేమింగ్ హార్డ్‌వేర్, ఆడియో యాక్ససరీస్‌పై పలు డీల్స్‌ను ప్రకటించింది. అయితే ఏఏ తేదీల్లో ఈ సేల్‌ను నిర్వహించనుందో మాత్రం ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు. గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్‌లో భాగంగా లెనోవో ఫ్యాబ్ 2పై వెయ్యి రూపాయల డిస్కౌంట్ ఇస్తుంది. అదేవిధంగా లెనోవో ఫ్యాబ్ 2 ప్రొ ధర 30 వేల రూపాయల నుంచి 22,999కు తగ్గించింది. బెస్ట్ సెల్లింగ్ ల్యాప్‌టాప్‌లపై నాలుగు వేల రూపాయల వరకు డిస్కౌంట్‌ను అందించనుంది. ఇంటెల్ కోర్ ఐ5, కోర్ ఐ7 ప్రాసెసర్స్ ల్యాప్‌టాప్‌లను ఈ వెబ్సైట్ లిస్టు చేసింది. అదనంగా హోమ్ యూజ్ ల్యాప్‌టాప్‌లు కూడా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో లిస్ట్ అయ్యాయి. వీటి ధర 11,990 నుంచి ప్రారంభమవుతున్నాయి. డెల్ నుంచి బడ్జెట్ ల్యాప్‌టాప్‌లను 17,990 రూపాయలకు, లెనోవో నుంచి 18,990 రూపాయలకు అందిస్తుంది. ఈ సేల్‌లో భాగంగా గేమింగ్ ల్యాప్‌టాప్‌లను కూడా బెస్ట్ ధరల్లో అందుబాటులో ఉంచింది. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై ఎక్స్చేంజ్ కింద 12వేల రూపాయల తగ్గింపును ఇస్తుంది. ఆపిల్, శాంసంగ్, లెనోవో, మైక్రోమ్యాక్స్, ఐబాల్ వంటి బ్రాండుల టాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టబోతోంది. ఆపిల్ ఐప్యాడ్ మోడల్స్ ధర 24,900 రూపాయల నుంచి ప్రారంభమవనున్నాయి. ఐప్యాడ్ మోడల్స్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా లెనోవో ట్యాబ్ 4 సిరీస్‌పై 25 శాతం వరకు డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తుంది. అదనంగా శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్3పై 10,500 రూపాయల డిస్కౌంట్‌ను అందిస్తుంది. -
పాప నోట్లో పుండ్లు... తగ్గేదెలా?
మా పాప వయసు ఆరేళ్లు. మొన్నీమధ్య గొంతునొప్పి ఉందని అంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాం. పాప నోటిలోన, నాలుక మీద, గొంతులోపలి భాగంలో రెండు మూడుసార్లు పుండ్లలాగా వచ్చాయి. పాపకు గొంతులో ఇన్ఫెక్షన్లా కొంచెం ఎర్రబారింది. ఏమీ తినడానికి వీలుగాక విపరీతంగా ఏడుస్తోంది. మా పాప సమస్యకు మంచి సలహా ఇవ్వండి. – వైదేహి, ఖమ్మం మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయని తెలుస్తోంది. ఈ సమస్యను చాలా సాధారణంగా చూస్తుంటాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవి... ∙ఉద్వేగాల పరమైన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్), ∙బాగా నీరసంగా అయిపోవడం (ఫెటీగ్), ∙విటమిన్లు, పోషకాల లోపం... (ముఖ్యం విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ ల వంటి పోషకాలు లోపించడం) ∙వైరల్ ఇన్ఫెక్షన్లు (ప్రధానంగా హెర్పిస్ వంటివి) ∙గాయాలు కావడం (బ్రషింగ్‌లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని ఆహారపదార్థాల వల్ల అయ్యే అనేక గాయాల కారణంగా) ∙పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం పడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేకరకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తుంటాయి. మీరు లెటర్లో చెప్పిన కొద్ది పాటి వివరాలతో నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... మీ పాపకు విటమిన్ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వన్చే ఇన్ఫెక్షన్స్తో ఈ సమస్య వస్తున్నట్లు భావించవచ్చు. ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్‌లు, విటమిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి వారిలో చాలా అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు పైన పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడినిగాని సంప్రదించి వారి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి. గోడకున్న సున్నం తింటున్నాడు మా బాబు వయసు ఎనిమిదేళ్లు. ఇంట్లో పెచ్చుల్లా లేచిన సున్నాన్ని తింటున్నాడు. క్లాస్‌లో చాక్‌పీసులు కూడా తింటున్నాడని వాడి టీచర్ చెబుతున్నారు. వాడు తెల్లగా పాలిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. ఆ వయసులో ఉండాల్సినంత బరువు లేదు. మందులు వాడినా బరువు పెరగడం లేదు. మా అబ్బాయి విషయంలో ఏం చేయాలో తెలియజేయండి. – సుధారాణి, టెక్కలి మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను వైద్యపరిభాషలో పైకా అంటారు. అంటే... ఆహారంగా పరిగణించని నాన్–న్యూట్రిటివ్ వస్తువులను పదే పదే తినడం, ఆ అలవాటును దీర్ఘకాలం కొనసాగించడం అన్నమాట. ఈ కండిషన్ ఉన్న పిల్లలు ప్లాస్టర్, బొగ్గు (చార్కోల్), మట్టి, బూడిద, పెయింట్, బలపాలు, చాక్‌పీసులు లాంటివి తింటుంటారు. చిన్నపిల్లలు ముఖ్యంగా రెండేళ్లలోపువారు తమ పరిసరాలను తెలుసుకోవాలనే ఆసక్తితో నాన్–న్యూట్రిటివ్ వస్తువులను నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే పెద్ద పిల్లల్లోనూ ఇదే లక్షణం ఉంటే... అలాంటి కండిషన్‌ను తేలికగా తీసుకోకూడదు. ఈ కండిషన్ ఉన్నపిల్లల్లో చాలా సాధారణమైన సమస్యలు మొదలుకొని కొన్ని తీవ్రమైన మానసిక రుగ్మతల వరకు ఉండే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. నిర్దిష్టంగా ఇదే కారణమని చెప్పలేకపోయినప్పటికీ సాధారణంగా... కుటుంబంలో సంబంధాలు సవ్యంగా లేకపోవడం, పిల్లలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, కొన్ని మానసిక సమస్యలు, ఐరన్ లోపం, కడుపులో నులిపురుగుల వంటివి ఈ సమస్యకు కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. ఇలాంటి పిల్లల్లో రక్తహీనత కూడా చాలా సాధారణంగా చూస్తుంటాం. మీ అబ్బాయికి రక్తహీనత కూడా ఉందంటున్నారు కాబట్టి ఒకసారి కంప్లీట్ బ్లడ్పిక్చర్తో పరీక్షతో పాటు, రక్తంలో లెడ్ పాళ్లు ఉన్నాయేమో అని పరీక్ష చేయించడం చాలా ప్రధానం. ఆహారం విషయానికి వస్తే మాంసాహారంలో కాలేయం, కోడిగుడ్లు, కూరగాయల్లో బీన్స్, సోయాబీన్, పప్పుధాన్యాలు, బ్రకోలీ, మస్టర్డ్, పాలకూర, రాగి వంటి వాటిల్లో ఐరన్ పాళ్లు ఎక్కువ. మీరు మీ అబ్బాయికి పైన పేర్కొన్న ఆహార పదార్థాలతో పాటు కొద్దిగా కొవ్వుపాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వడం మంచిది. అదేవిధంగా విటమిన్–సి ఎక్కువగా ఉన్న తాజా పండ్లు ఎక్కువగా తినిపించాలి. మీరు ఒకసారి మీ అబ్బాయికి కడుపులోని నులిపురుగులు పోవడానికి మందులు వాడటం కూడా అవసరం. మీరు మీ పిల్లల వైద్యనిపుణుణ్ణి సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి. బాబుకు పాస్ పోసేటప్పుడు నొప్పి... మా బాబుకి పదేళ్లు. యూరిన్ పోసేటప్పుడు ఫ్రీగా కాకుండా కొంచెం, కొంచెంగా పోస్తుంటాడు. కొన్నిసార్లు పాస్ పోసేటప్పుడు నొప్పిగా ఉందంటాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే ఇన్ఫెక్షన్ ఉందని టాబ్లెట్స్ రాసిచ్చారు. అవి వాడినన్ని రోజులు తగ్గి, మళ్లీ మొదలవుతోంది. ఈ మధ్య సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మంచినీళ్లు ఎక్కువగా తాగిస్తే తగ్గినట్టే తగ్గి మళ్లీ మొదలైంది. దయచేసి మా బాబు సమస్యకి పరిష్కారం తెలియజేయండి. – రియాజుద్దిన్, గుంటూరు మీరు చెప్పిన దాన్ని బట్టి్ట మీ బాబుకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పవచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో కూడా తరుచుగా చూస్తుంటాం. ఇది అబ్బాయిల్లో ఒక శాతం ఉంటే అమ్మాయిల్లో 3–5 శాతం ఉంటుంది. అనేక కారణాల వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్లు వస్తు ఉండవచ్చు. ఉదా. సరైన విసర్జన అలవాట్లు లేకపోవడం (ఇంప్రాపర్ టాయిలెట్ ట్రెయినింగ్), బిగుతు దుస్తులు వంటి సాధారణ అంశాలు కాక.... యూరినరీ ట్రాక్ట్‌లో అబ్నార్మాలిటీస్, వాయిడింగ్ డిస్ ఫంక్షన్, వియు రిఫ్లక్స్, బ్లాడర్‌కు ఉండే న్యూరలాజికల్ సమస్యలు, యూరెథ్రల్ అబ్స్ట్రక్షన్, మలబద్ధకం వంటి రిస్క్ ఫ్యాక్టర్ల వల్ల పిల్లల్లో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తుండవచ్చు. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూరిన్ పరీక్షలతో పాటు కెయుబి, అల్ట్రాసౌండ్, ఎంసీయూజీ అనే టెస్ట్‌లు చేయించడం చాలా ప్రధానం. ఈ పరీక్షలు చెయ్యడం వల్ల ఎనటమికల్ సమస్యలేమయినా ఉన్నాయేమో తెలుసుకోవచ్చు. మీరు ఒకసారి యూరాలజిస్టును కలిసి తగిన సలహా, చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
పరి పరిశోధన
అన్ని మందులు ఒక్కటి చేసే త్రీడీ ప్రింటర్.. బీపీకి ఒక ట్యాబ్లెట.. షుగర్ ఉంటే ఇంకోటి. ఇతర జబ్బులకు మరిన్ని ట్యాబ్లెట్లు. ఈ కాలంలో కొంతమందికి ఈ బాధ తప్పనిసరి అయిపోయింది. కానీ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ పుణ్యమా అని త్వరలోనే ఈ పరిస్థితి మారిపోనుంది. రకరకాల మందులన్నింటినీ మన అవసరాలకు తగ్గట్టుగా ఒకే ట్యాబ్లెట్‌లోకి చేర్చి అందించేందుకు అమెరికాకు చెందిన విటే ఇండస్ట్రీస్ అనే స్టార్టప్ ఓ వినూత్న యంత్రాన్ని సిద్ధం చేసింది. ఈ యంత్రం చిటికెలో వేర్వేరు మందులను ఒక క్యాప్సూల్ రూపంలోకి చేర్చి అందిస్తాయి. ‘ద ఆటో కాంపౌండర్’ అని పిలుస్తున్న ఈ యంత్రం కారణంగా అవసరం లేకపోయినా అధిక మోతాదులో మందులు మింగాల్సిన పని తప్పుతుందని కంపెనీ సీఈవో జియానీ సిననన్ సింగ్ తెలిపారు. ఒక్కో మాత్ర తయారు చేసేందుకు ఈ యంత్రం పది నిమిషాలు మాత్రమే తీసుకుంటుందని, కేవలం ఏ మందులు ఎంత మోతాదులో ఇవ్వాలో కంప్యూటర్ ద్వారా చెబితే చాలని వివరించారు. సాధారణంగా వాడే మందులతో కూడిన పెట్టెల నుంచి తీసుకుని క్యాప్సూల్‌ను ముద్రించడం మొదలైపోతుందన్నారు. ప్రింటింగ్ పూర్తయిన ప్రతిసారి యంత్రం తనంతట తానే మొత్తం శుభ్రం చేసుకుంటుంది కాబట్టి దుష్ప్రభావాలకు అవకాశమూ తక్కువని వివరించారు. ఈ యంత్రం ఖరీదు ప్రస్తుతం దాదాపు మూడు లక్షల వరకూ ఉంటుంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఈ యంత్రాన్ని కొన్ని చోట్ల పరీక్షిస్తామని, ఆ తరువాత అవసరమైన మార్పులు చేర్పులు చేసి అందరికీ అందుబాటులోకి తెస్తామని సింగ్ తెలిపారు. కేన్సర్‌పై యుద్ధానికి శుక్రకణాలు! ప్రాణాంతక కేన్సర్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు తాజాగా శుక్రకణాలపై దష్టి పెట్టారు. గర్భాశయ ముఖద్వారా కేన్సర్ చికిత్సకు వాడే మందులను సమర్థంగా చేర్చేందుకు జర్మనీకి చెందిన లెబ్నిజ్ ఇన్స్టిట్యూట్ ఫర్ శాస్త్రవేత్తలు వీటిపై ప్రయోగాలు చేపట్టారు. అయస్కాంతాల ద్వారా శుక్రకణాలను హైజాక్ చేయడం.. ఆ తరువాత వాటిని కేన్సర్ కణితులు ఉన్నచోటికి మందులు సరఫరా చేయగల మాధ్యమంగా వాడుకోవడం ఈ ప్రయోగాల ముఖ్య ఉద్దేశం. డోక్సోరోబిన్ అనే మందుతో జరిపిన ప్రయోగాల్లో శుక్రకణాలు కేవలం మూడు రోజుల్లో దాదాపు 87 శాతం కేన్సర్ కణాలను నాశనం చేశాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హైఫింగ్ షూ తెలిపారు. శుక్రకణాల త్వచంలో మందును నిక్షిప్తం చేయగలగడం, తోకద్వారా కేన్సర్ కణాల్లోకి చొచ్చుకుపోగల సామర్థ్యం ఉండటం, కణంతో కలిసిపోగల లక్షణం ఉండటం వల్ల మందు సక్రమంగా వాడే అవకాశాలు పెరగడం శుక్రకణాలను ఎంచుకునేందుకు ఉన్న మూడు కారణాలని వివరించారు. అయితే ప్రస్తుతం తాము పరిశోధనశాలలో మాత్రమే ప్రయోగాలు జరిపామని, వాస్తవ పరిస్థితుల్లో ఈ పద్ధతి ఎలా పనిచేస్తుందన్నది పరిశీలించాల్సి ఉందని షూ వివరించారు. పరిశోధన వివరాలు ఏసీఎస్ నానో జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
విక్స్ యాక్షన్, డీకోల్డ్‌లపై పునఃపరిశీలన
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు నిషేధం ఎత్తేసిన విక్స్ యాక్షన్ 500, డీకోల్డ్ లాంటి ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్డీసీ) మందులను పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ బాధ్యతను డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు(డీటీఏబీ)కు అప్పగించాలని కోర్టు కేంద్రానికి సూచించింది. కోరెక్స్ దగ్గు మందు, క్రోసిన్ కోల్డ్, విక్స్ యాక్షన్ 500 ఎక్స్ట్రా, డీకోల్డ్, సారిడాన్, అస్కోరిల్, అలెక్స్ దగ్గు మందు, ఫెన్సెడిల్ దగ్గు మందు, గ్లెకోడిన్ దగ్గు మందు లాంటి ఔషధాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాలుచేస్తూ కేంద్రం దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది. ఎఫ్‌డీసీల వాడకంతో మనుషులు, జంతువులకు ముప్పు ఉందంటూ కేంద్రం వాటిని 2016లో నిషేధించగా,డిసెంబర్లో ఢిల్లీ హైకోర్టు అనుమతిచ్చింది. -
ట్యాబ్స్ విక్రయాలు 16 శాతం డౌన్
న్యూఢిల్లీ: ట్యాబ్లెట్స్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన జనవరి–మార్చి త్రైమాసికంలో 16 శాతం క్షీణతతో 7.6 లక్షల యూనిట్లకు తగ్గాయి. హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీలు ట్యాబ్లెట్స్‌కి ప్రచారం కల్పించకపోవడమే దీనికి కారణమని రీసెర్చ్ సంస్థ సీఎంఆర్ తెలిపింది. ఇక అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే జనవరి–మార్చి త్రైమాసికంలో ట్యాబ్లెట్స్ అమ్మకాలు 6 శాతంమేర క్షీణించాయని పేర్కొంది. ఇక డేటావిండ్ 34 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉందని తెలిపింది. దీని తర్వాతి స్థానాల్లో ఐబాల్ (16 శాతం), శాంసంగ్ (15 శాతం), మైక్రోమ్యాక్స్ (8 శాతం) ఉన్నాయని పేర్కొంది. ప్రభుత్వ రంగాల నుంచి ట్యాబ్లెట్స్కు డిమాండ్ ఉంటోందని సంస్థ తెలిపింది. -
అమెరికా ఆఫీసుల్లో వాటిపై నిషేధం
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలోని తమ దౌత్య కార్యాలయాల్లోకి సందర్శకులు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఐప్యాడ్లు లాంటి పరికరాలను తీసుకురాకుండా అమెరికా నిషేధం విధించింది. గురువారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది. చెన్నై కేంద్రంలో అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను ఇప్పటికే నిషేధించారు. ప్రపంచవ్యాప్తంగా తమ అన్ని కేంద్రాల్లోనూ అమెరికా ఇలాంటి చర్యలే చేపట్టింది. యూఎస్ ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రతను పెంచేందుకే ఈ మార్పులు చేస్తున్నామని ఢిల్లీ దౌత్య కార్యాలయం అధికార ప్రతినిధి వెల్లడించారు. వ్యక్తిగత ఎలక్ట్రానిక్ వస్తువులు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఐప్యాడ్లతో పాటు నెట్బుక్స్, క్రోమ్‌బుక్స్, ఐపాడ్లు, కిండిల్స్, మ్యాక్‌బుక్స్‌లను కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా దౌత్య కార్యాలయాల్లోకి సందర్శకులను మొబైల్ఫోన్లతో అనుమతిస్తామని చెప్పారు. చెన్నై కార్యాలయంలో మొబైల్ఫోన్లను కూడా అనుమతించబోమన్నారు. సందర్శకుల ఎలక్ట్రానిక్ వస్తువులు కార్యాలయం వెలుపల పెట్టుకునేందుకు ఎటువంటి ఏర్పాట్లు లేవని వెల్లడించారు. -
జనరిక్ మందులను పెద్ద అక్షరాలతో రాయాలి
మంత్రి కామినేని ఆదేశం కాకినాడ వైద్యం(కాకినాడ సిటీ): కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై వైద్యులందరూ విధిగా రోగులకు జనరిక్ మందులను పెద్ద అక్షరాలతో రాయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ధీరూబాయి లేబొరేటరీ పక్కన రూ.1.50 కోట్లతో కొనుగోలు చేసిన అత్యాధునిక జీఈ కంపెనీకి చెందిన 16 స్లైస్ సిటీ స్కాన్ మెషీన్‌ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటుబడ్జెట్లో ఉన్నా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యపరికరాలు, వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. జీజీహెచ్‌లో రోగులకు వైద్యులు సమష్టిగా నాణ్యమైన వైద్య సేవలందించడంతో ఓపీ సంఖ్య పెరుగుతుందన్నారు. ఆసుపత్రిలో 1,065 పడకలుండగా, 1,800 మంది ఇన్‌పేషెంట్లకు చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు. సిటీస్కాన్ ప్రస్తుతం విశాఖపట్టణం, కాకినాడలో ప్రారంభించామని, అనంతపురం, తిరుపతి, గుంటూరు ప్రభుత్వాసుపత్రుల్లో సిటీస్కాన్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వైద్య సిబ్బందికి బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టామన్నారు. రూ.20 కోట్లతో ఎంసీహెచ్ బిల్డింగ్ నిర్మాణంలో ఉందని, ఇది పూర్తయితే మరో 200 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆసుపత్రిలో శానిటేషన్ మెరుగుదలకు చర్యలు తీసుకున్నామన్నారు. నెలకు 1,000 ప్రసవాలు జరుగుతుండగా బేబీకిట్లను అందిస్తున్నామని, త్వరలో తల్లికి కూడా కిట్ అందిస్తామన్నారు. ఆసుపత్రికి 80 శాతం మందులు ప్రభుత్వం సరఫరా చేస్తుందని, మిగతా 20 శాతం మందుల కొనుగోలుకు నిధులు మంజూరు చేశామన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, డీఎంఈ డాక్టర్ బాబ్జి, జెడ్పీ అధ్యక్షుడు నామన రాంబాబు, డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రయ్య, సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ మహాలక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య పాల్గొన్నారు. స్టైఫండ్ కోసం ప్రశ్నించిన పీజీ వైద్యులపై మంత్రి ఆగ్రహం నాలుగు నెలలుగా స్టైఫండ్ విడుదల కావడం లేదని, మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరిన పీజీ వైద్యులపై మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీస్కాన్ ప్రారంభోత్సవానికి ప్రభుత్వాసుపత్రికి విచ్చేసిన మంత్రిని పలువురు పిజీ విద్యార్థులు కలుసుకుని స్టైఫండ్ కోసం అడిగారు. అభివృద్ధి కార్యక్రమం కోసం వస్తే. ఇప్పుడా స్లైఫండ్ కోసం అడిగేది..మీ సమస్యలు లేవనెత్తడానికి ఇదా సమయమంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వైద్యులై ఉండి కూడా ఇలా అడగడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించారు. అక్కడే ఉన్న డీఎంఈ డాక్టర్ బాబ్జి కలుగజేసుకుని తర్వాత మాట్లాడదాం అంటూ సర్ది చెప్పడంతో మంత్రి శాంతించారు. -
ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ : భారీ డిస్కౌంట్లివే!
ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్(ఎఫ్ఈఎస్)ను ప్రారంభించింది. నిన్నటి నుంచి మార్చి 24 వరకు మూడు రోజుల పాటు ఈ ఎక్స్‌క్లూజివ్ 3-డే ఈవెంట్ ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో భాగంగా మొబైల్స్, టెలివిజన్స్, ల్యాప్టాప్స్, ఎయిర్‌కండీషనర్స్, ఎలక్ట్రానిక్ డివైజస్, ఎలక్ట్రానిక్ యాక్ససరీస్, స్మార్ట్ గ్యాడ్జెట్లపై ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. రూ.5,999 కనీసమొత్తంలో ఫ్లిప్ కార్ట్ పై కొనుగోలు చేసిన ఎస్బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్స్ కు తక్షణమే 10శాతం డిస్కౌంట్‌ను ఫ్లిప్ కార్ట్ కల్పిస్తోంది. ఈ తక్షణ డిస్కౌంట్ ఆఫర్ ఈవెంట్ ముగిసేవరకు ఉంటుంది. ఐఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు... ప్రస్తుతం నడుస్తున్న ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ లో , ఐఫోన్ 7 అన్ని వేరియంట్ల కొనుగోలుపై 20 శాతం డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.13,500 ధర తగ్గింపును ఈ ఈ-కామర్స్ దిగ్గజం ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 6ఎస్ 32జీబీ వేరియంట్ ధరపై కూడా రూ.7000 వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇదే మొత్తంలో ఉంటుందని తెలిపింది. ఐఫోన్ 6 16జీబీ వేరియంట్ ధరను రూ.10,500 తగ్గించేసింది. ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. గూగుల్ పిక్సెల్, మోటో జెడ్, శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ డీల్స్.... ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ కింద ఎక్స్చేంజ్ ఆఫర్లో గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ పై రూ.20వేల వరకు, గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ పై రూ.13,500 వరకు ధర తగ్గిపోయింది. మోటో జెడ్, మోటో జెడ్ ప్లే లపై ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.13,500 డిస్కౌంట్ కల్పిస్తోంది. ఇలా శాంసంగ్ సీ9 ప్రొ, హానర్ 8, హ్యువాయ్ పీ9, సోని ఎక్స్‌పీరియా ఎక్స్ఏ ఆల్ట్రా వంటి స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ రేట్లను తగ్గించేసి, డిస్కౌంట్ ఆఫర్లను కల్పిస్తోంది. ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఆపిల్ ఐప్యాడ్, లెనోవో యోగా3, లెనోవో ఫ్యాబ్ 2 ప్రొ పాబ్లెట్, ఆపిల్ వాచ్, ఆసుస్ జెన్‌వాచ్3 వంటి వాటిపై కూడా డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. -
గిరిజనులకు దేవుడే దిక్కా?
మలేరియా మందులు అందుబాటులో లేవు పేదల వైద్యం పట్టని ప్రభుత్వం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం మారేడుమిల్లి : ఏజెన్సీలో మలేరియా తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియా మందులు లేకపోవడం చూస్తే ఈ ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అర్ధమవుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రెండురోజుల ఏజెన్సీ పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి మారేడుమిల్లి వనవిహారిలో బస చేసిన జగన్ గురువారం ఉదయం స్థానిక పీహెచ్‌సీని సందర్శించి రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడుతూ పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ముగ్గురు వైద్యా ధికారులకు ఒక్కరు మాత్రమే ఉన్నారని, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు అవసరం కాగా ఒకరే ఉన్నారని వారు తెలిపారు. పీహెచ్‌సీలోని సౌకర్యాలను పరిశీలించారు. రోగులకు వసతులు, మందులు అందుబాటులో ఉన్నాయా అని సిబ్బందిని ప్రశ్నించగా మలేరియా మందులకు కొరత ఉందని ఇండెంట్ పెట్టినా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి సరఫరా కాలేదని తెలిపారు. మలేరియా తీవ్రంగా ఉన్న ప్రాంతంలో కూడా అత్యవసరమైన మందులు లేకపోవడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల ఆరోగ్యంపై చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదన్నారు. సిబ్బందికి నాలుగు నెలల జీతాలు లేవని జగన్‌కు వివరించారు. జీతాలు లేకపోయినా క్షేత్రస్థాయిలో ఎలా సేవలు అందిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం పీహెచ్సీ ఆవరణలో నూతనంగా నిర్మాణం తలపెట్టి మధ్యలో నిలిచిపోయి భవనాన్ని పరిశీలించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మారేడుమిల్లి పీహెచ్‌సీని సందర్శించి ఏడాది గడుస్తున్నా భవన నిర్మాణంలో కదలిక లేకపోవడం వెనుక ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (బాబు), రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, మాజీ మంత్రులు పినిపే విశ్వరూప్, పిల్లి సుభాష్‌చంద్రబోస్, నాయకులు కర్రి పాపారాయుడు, జిల్లా కార్యదర్శి గొర్లె బాలాజీబాబు, జెడ్పీటీసీ సభ్యుడు సత్తిసత్యనారాయణరెడ్డి,ఎంపీపీ కుండ్ల సీతామహలక్షి్మ, ఎంపీటీసీ సభ్యుడు అనిల్‌ప్రసాద్ పలువురు నాయకులు పాల్గొన్నారు. -
2,240 ఫోన్లు కొట్టేశాడు..
చెన్నై:తమిళనాడులోని సంచలనాత్మక దొంగను పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి భారీ ఎత్తున మొబైల్స్, ఇతర పరికరాలు పట్టుబడడం పోలీసులను సైతం విస్మయపర్చింది. శనివారం ఉదయం ప్రవీణ్ నుంచి పోలీసులు వేల సంఖ్యలో కొట్టేసిన స్మార్ట్ ఫోన్లను రికవరీ చేశారు. వివరాల్లోకి వెళితే కత్తి చూపించి నగదు దోచుకున్నాడనే ఫిర్యాదు ఆధారంగా ప్రవీణ ఆచూకీకోం గాలిస్తున్న పోలీసులు పాలవక్కంలోని పాన్ బ్రోకర్ (వడ్డీ వ్యాపారి) హనుమాన్‌ని రామ్ ని అరెస్టు చేసి కూపీ లాగారు. ఈ విచారణ సందర్భంగా సంచలనాత్మక దొంగ ప్రవీణ్ కుమార్ ఆచూకీ తెలిసింది. అతడిచ్చిన సమాచారం ఆధారంగానే ప్రవీణ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు భారీ ఎత్తున మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ రోడ్, రాజీవ్ మహాత్మా గాంధీ సాలై ప్రాంతంలో ఒంటరిగా నడుస్తూ వ్యక్తులను కత్తితో బెదిరించి నుంచి నగదు , సెల్ ఫోన్లు దోచుకున్నట్టుగా నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు. ఇలా కొట్టేసిన ఫోన్లను వడ్డీ వ్యాపారికి విక్రయించేవాడని అంగీకరించాడన్నారు. ఇలా మొత్తం ఐదు కేసులు కుమార్ వ్యతిరేకంగా పెండింగ్‌లో ఉన్నాయని వారు తెలిపారు అతగాడినుంచి దాదాపు 2,240 స్మార్ట్ ఫోన్లను,10టాబ్లెట్ లను, లాప్టాప్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని చెప్పారు. -
ప్రతిఒక్కరూ డీఈసీ మాత్రలు మింగాలి
సూర్యాపేట : పట్టణంలోని 27, 28, 29, 30, 31వ వార్డుల్లో డీఈసీ మాత్రలు ప్రజలు వేసుకున్నారా లేదా అని కేంద్ర ప్రభుత్వ పైలేరియా ప్రతినిధి ఎం.లక్ష్మణ్ గురువారం అడిగి తెలుసుకున్నారు. కార్యాక్రమం నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా మలేరియా నియంత్రణ అధికారి ఓం ప్రకాష్ మాట్లాడుతూ ఎవరైనా డీఈసీ మాత్రలను మింగని వారు ఉంటే వారు తప్పకుండా మాత్రలు మింగాలని కోరారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి శుక్రవారం రోజు నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఆయన వెంట సీనియర్ ల్యాబ్ టెక్నిషియన్ శ్రీనాథ్, సబ్ యూనిట్‌అధికారి సముద్రాల సూరి, కస్తూరి నర్సింహ, స్వరూప, పుష్ప, స్రవంతి, సరిత, నాగలక్ష్మి తదితరులు ఉన్నారు. -
పైలేరియా నివారణ మాత్రల పంపిణీ
రేపాల : మండలంలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మంగళవారం పైలేరియా వ్యాధి నివారణ (డీఈసీ)మాత్రలను పంపిణీ కార్యక్రమాన్ని వైద్యాధికారి పోరెడ్డి వెంకటపాపిరెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా రేపాల పీహెచ్సీ పరిధిలో గల పలు గ్రామాలలో గల పాఠశాలలు, దళిత కాలనీలు, వసతి గహాల్లో ఈ మాత్రలను పంపిణీ చేసినట్లు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్య సిబ్బంది లక్ష్మినారాయణ, కళావతి, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు. -
డీఈసీ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
నల్లగొండ టౌన్ : ఈనెల 30న నిర్వహించనున్న సామూహిక డీఈసీ, ఆల్బెండోజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని సీఐఓ డాక్టర్ ఏబీ. నరేంద్ర, జిల్లా మలేరియాధికారి ఓంప్రకాశ్ కోరారు. శనివారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో జరిగిన క్లస్టర్ సమావేశంలో వారు మాట్లాడారు. పైలేరియా వ్యాధి నివారణ, నట్టల నివారణ కోసం మాత్రలను మింగించే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రెండేళ్ల లోపు చిన్నారులకు మాత్రలు అవసరం లేదని, 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలల్లోపు వయస్సు వారికి 1 డీఈసీ, ఒక ఆల్బెండోజోల్ మాత్రలను మింగించాలన్నారు. 5–14 సంవత్సవరాల్లోపు వారికి 2 డీఈసీ, ఒక ఆల్బెండోజోల్, 15 సంవత్సరాల పై వయసు వారికి వారందరికి 3డీఈసీ, ఒక ఆల్బెండోజోల్ మాత్రలను మింగించాలని సూచించారు. గర్భవతులు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారు మాత్రలు వేసుకోరాదని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మళ్లీ అదే సమస్య
సందేహం నా వయసు 18 ఏళ్లు. ఎత్తు 5.3, బరువు 43 కిలోలు. పీరియడ్స్ రెగ్యులర్‌గానే వస్తున్నాయి. అయితే, ఆ సమయంలో బాడీ పెయిన్స్ వస్తున్నాయి. ఒళ్లు వేడెక్కినట్లుగా ఉంటోంది. డాక్టర్‌ను కన్సల్ట్ చేస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పి టాబ్లెట్స్ రాశారు. కొన్నాళ్లు వాడాక తగ్గింది. ఇటీవల రెండు నెలలుగా మళ్లీ ఇదే సమస్య మొదలైంది. పీరియడ్స్ సమయంలో బాడీ పెయిన్స్‌తో పాటు విపరీతంగా తలనొప్పి వస్తోంది. నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఏమైనా ఉందా? - సుచిత్ర, వైజాగ్ కొంతమందిలో పీరియడ్స్ సమయంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల శరీరంలో నీరు చేరడం, ఒంటి నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పి, వికారంగా అనిపించడం వంటి రకరకాల సమస్యలు తలెత్తుతాయి. పీరియడ్స్ సమయంలో విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ల మోతాదును బట్టి, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఈ ఇబ్బందుల తీవ్రతలో హెచ్చుతగ్గులు ఉంటాయి. బ్లీడింగ్ ఆగిపోగానే ఈ ఇబ్బందులన్నీ తగ్గిపోయి తిరిగి సాధారణ స్థితికి రావడం జరుగుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చెప్పడం కష్టం. కాకపోతే, జీవనశైలిలో మార్పులు, వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల నొప్పులను తట్టుకునే శక్తి వస్తుంది. అలాగే, ఈ నొప్పుల తీవ్రత తక్కువగా అనిపిస్తుంది. పీరియడ్స్ వచ్చే ఆ రెండు మూడు రోజుల్లో నొప్పుల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నట్లయితే నొప్పి నివారణ మాత్రలను వాడుకోవచ్చు. కొందరి శరీర తత్వాన్ని బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో మూడు నుంచి ఆరు నెలల పాటు పిల్స్ వాడి చూడవచ్చు. నా వయసు 20. నేనిప్పుడు బీటెక్ చదువుతున్నాను. మొదటి నుంచీ నాకు పీరియడ్స్ 4-5 రోజులు అవుతుంది. ఆ సమయాల్లో కడుపు, నడుము నొప్పి బాగా ఉంటుంది. నా సమస్య ఏంటంటే... గత నాలుగు నెలలుగా పీరియడ్స్ సమయాల్లో, అలాగే పీరియడ్స్ అయిపోయిన వెంటనే... యోని, తొడల పై భాగంలో ర్యాషస్ అవుతున్నాయి. ప్యాడ్ పెట్టుకోవాలంటేనే భయంగా ఉంది. ఏ క్రీమ్ రాసుకుంటే తగ్గుతాయో చెప్పండి. - పి.కోమలి, హైదరాబాద్ కొంతమందిలో పీరియడ్స్ సమయంలో వాడే న్యాప్కిన్స్ పడకపోవడం వల్ల, తొడల దగ్గర అలర్జీ ర్యాషెస్, దురద ఉండవచ్చు. కొన్నిసార్లు 4-5 రోజులు వరుసగా ప్యాంటీ, న్యాప్కిన్ పెట్టుకునే ఉండడం వల్ల గాలి ఆడక తొడల దగ్గర, బ్లీడింగ్‌తో చెమ్మగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ లేదా అలర్జీ ఏర్పడి ర్యాషెస్, దురద రావచ్చు. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే న్యాప్కిన్స్ రోజంతా ఒకటే ఉంచుకోకుండా రెండు మూడు మార్చుకోవడం మంచిది. ఈ సమస్య నాలుగు నెలల నుంచే ఉంది కాబట్టి న్యాప్కిన్ వేరే కంపెనీ మార్చి చూడండి. పీరియడ్స్ సమయంలో లాక్టిక్ యాసిడ్ సొల్యూషన్‌తో యోని, తొడల దగ్గర కడుక్కోవడం మంచిది. న్యాప్కిన్ పెట్టుకునే ముందు క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ చల్లుకుంటే, అది చెమ్మను పీల్చుకుని చాలా వరకు ర్యాషెస్ రాకుండా తోడ్పడుతుంది. తర్వాత కూడా అలానే ఉంటే క్యాండిడెర్మాక్రీమ్ పెట్టుకుని చూడవచ్చు. అయితే అలాగే ఉంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. మా పాప వయసు 11 ఏళ్లు. ఆరు నెలల క్రితం మెచ్యూరైంది. ఇంత త్వరగా అవ్వడమేంటో మాకు అర్థం కావడం లేదు. కడుపునొప్పి కూడా ఉంటోంది. పీరియడ్స్ సమయాల్లో బాగా డల్ అవుతోంది. ఏమీ తినడం లేదు. నేనైతే 16ఏళ్లకు మెచ్యూర్ అయ్యాను. పాప ఇంత త్వరగా అవ్వడమేంటి? - రమ్య, నెల్లూరు ఆధునిక కాలంలో, జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిడి, టీవీలు, సినిమాలు, ఇంటర్నెట్ల ప్రభావం వల్ల మెదడు త్వరగా ప్రేరణకు గురయ్యి దాని నుంచి కొన్ని హార్మోన్లు తగిన మోతాదులో విడుదలై, అండాశయాలను ఉత్తేజపరచి, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లను విడుదల అవ్వటం ద్వారా అవి గర్భాశయం మీద ప్రభావం చూపి పీరియడ్స్ మొదలవుతాయి. ఇంతకు ముందు కాలంలో 13 నుంచి 16 సంవత్సరాల లోపల రజస్వల అయ్యేవారు. ఇప్పుడు కొంతమంది 10-11 సంవత్సరాలకే రజస్వల అవుతున్నారు. మీ అమ్మాయి సన్నగా ఉండడం వల్ల పీరియడ్స్ సమయంలో జరిగే మార్పులకు కొద్దిగా బలహీనపడి, ఇబ్బంది పడుతున్నట్టుంది. 11 సంవత్సరాలు అంటే... ఆడిపాడే చిన్నవయస్సు మరి. ఈ మార్పులకు అలవాటయ్యే వరకు పాపకి మీరు తల్లిగా ఎంతో మానసికంగా ఎంతో చేదోడు వాదోడుగా ఉండవలసి ఉంటుంది. మంచి పౌష్ఠికాహారం ఇవ్వండి. ఇంకా ఇబ్బందిగా అనిపిస్తే ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, వేరే సమస్యలు ఏమన్నా ఉన్నాయో పరీక్ష చేయించి తెలుసుకోవడం మంచిది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చెప్పడం కష్టం. కాకపోతే, జీవనశైలిలో మార్పులు, వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల నొప్పులను తట్టుకునే శక్తి వస్తుంది. డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్ -
10న పైలేరియా నివారణ మందుల పంపిణీ
ఎంజీఎం : జిల్లాలో పైలేరియా అధికంగా ఉన్న 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న 8,28,260 మందికి ఈ నెల 10న ఇంటింటికీ తిరుగుతూ మాత్రలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు డీఎంహెచ్ఓ సాంబశివరావు తెలిపారు. బుధవారం టీఎన్జీవోస్ భవన్లో 17 పీహెచ్‌సీల పరిధిలోని ఎస్పీహెచ్ఓలు, వైద్యాధికారులు, కమ్యూనిటీ హెల్త్ అధికారులు, హెచ్‌ఈఓలు, సబ్ యూనిట్ అధికారులు, హెల్త్సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పీహెచ్‌సీల పరిధిలో ఉన్న 5623 మంది పైలేరియా వ్యాధిగ్రస్తులతో మిగతా వారికి ఈ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సాముహిక మాత్రల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. ఈ వ్యాధిగ్రస్తులలో 1/3 మంది భారతీయులేననన్నారు. వ్యాధి నివారణ కోసం 2004 నుంచి సామూహిక మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. సమావేశంలో జోనల్ మలేరియా అధికారి జయశ్రీ, జిల్లా మలేరియా అధికారి పైడిరాజు, లక్ష్మణ్, సీనియర్ ఎంటమాలజిస్టు రమణమూర్తి, మాస్‌మీడియా అధికారి అశోక్‌రెడ్డి, ఎస్పీహెచ్ఓలు రామ్మోహన్, సుధీర్, రామారావు పాల్గొన్నారు. -
మెడికిల్ షాపుల్లో..శంకర్ దాదా ఎంబీబీఎస్‌లు
♦ మందుల విక్రయాలకు చెల్లుచీటీ ♦ విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ అమ్మకాలు ♦ అవి ఎలా పడితే అలా వాడితే దుష్ప్రభావం ♦ పశ్చిమ ప్రకాశంలో యథేచ్ఛగా విక్రయాలు జిల్లా వ్యాప్తంగా శంకర్ దాదా ఎంబీబీఎస్‌లు ఎక్కువయ్యారు. శంకర్ దాదాలు ఎవరో ఇప్పటికే మీకు గుర్తొచ్చి ఉంటుంది. ఓ సినిమాలో హీరో పాత్రధారి ఎంబీబీఎస్ చదవకుండానే తన తల్లిదండ్రులు, ప్రియురాలి మెప్పు పొందేందుకు నానాతంటాలు పడతాడు. ఎంబీబీఎస్ చదివిన వ్యక్తిలా ఎదుటి వారి ముందు కట్టింగ్ ఇస్తాడు. అది సినిమా.. జిల్లాలో అలాంటి శంకర్ దాదాలు చాలామందే ఉన్నారు. ఆర్ఎంపీల ముసుగులో కొందరు, మెడికల్ షాపుల యజమానుల ముసుగులో మరికొందరు రోగులకు మిడిమిడి జ్ఞానంతో మందులు ఇచ్చి అందిన కాడికి దండుకుంటున్నారు. మెడికల్ షాపుల యజమానులు ఔషధ నియంత్రణ మండలి నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. – మార్కాపురం రోగి అవసరాన్ని మందుల షాపుల యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ (మందుల చీటీ) లేకుండానే యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్నారు. ఔషధ నియంత్రణ మండలి నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ప్రమాణాలు పాటించకుండానే మందులు అమ్ముతున్నారు. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, కంభం, గిద్దలూరు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం తదితర పట్టణాల్లో మందుల షాపుల యజమానులు ఇచ్చిందే మాత్ర, అమ్మిందే ధరగా తయారైంది. నిబంధనలు తెలిసినా డాక్టర్లు సైతం తమ క్లినిక్‌ల్లో అనుమతులు లేకుండానే మందుల షాపులు పెట్టి విక్రయిస్తున్నారు. ఫార్మసిస్ట్‌ల సమక్షంలోనే మందులను విక్రయించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా అరకొర పరిజ్ఞానం ఉన్న వారు సైతం మందులు విక్రయిస్తున్నారు. ఫార్మసీ చదివిన వారి పేరుతో లైసెన్స్ తీసుకుని ఈ తతంగాన్ని సాగిస్తున్నారు. 24 మండలాల్లో 500 మెడికల్ షాపులు మార్కాపురం డ్రగ్ ఇన్స్పెక్టర్ పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి, కనిగిరి నియోజకవర్గాలు.. అంటే మెుత్తం 24 మండలాల్లో దాదాపు 500 మెడికల్ షాపులున్నాయి. వాస్తవానికి గ్రామీణ ప్రాంత ప్రజలు ఆస్పత్రుల ఫీజులు భరించలేక జ్వరం, దగ్గు, విరేచనాల నుంచి తాత్కాలిక ఉపశమనం కోసం మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారు. వీరి అవసరాన్ని గమనించిన మందుల షాపుల యజమానులు తమకు ఇష్టామొచ్చిన మాత్రతో పాటు అదనంగా ప్రతి రోగానికి యాంటిబయాటిక్స్ అమ్ముతున్నారు. పారాసిట్మల్ ట్యాబ్లెట్లలో సుమారు 20కి పైగా కంపెనీలు ఉన్నాయి. వాస్తవ ధర ఒక్కో ట్యాబ్లెట్ 25 పైసలు నుంచి 30 పైసలు మధ్య ఉండగా రోగికి రూ.1.50 నుంచి రూ.2లకు విక్రయిస్తున్నారు. డాక్టర్ రాసి ఇచ్చిన చీటీ లేనిదే మందులు విక్రయించకూడదన్న ఔషధ నియంత్రణ మండలి నిబంధనలు యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. కొంతమంది మందుల షాపుల యజమానులు ఒకడుగు ముందుకేసి మిడిమిడి జ్ఞానంతో ఇంజెక్షన్లు సైతం చేస్తున్నారు. మెడికల్ షాపుల్లో ఆర్ఎంపీలు ఆర్ఎంపీలు కొందరు మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. అర్హత ఉన్న కెమిస్ట్, డ్రగ్గిస్ట్‌లు మాత్రమే రోగులకు మందులు విక్రయించాలి. పశ్చిమ ప్రకాశంలో కొంతమంది మెడికల్ షాపుల యజమానులు తమకు తెలిసిన వారి సర్టిఫికెట్లతో మందుల షాపులు నిర్వహిస్తున్నారు. తమ ఇష్టామొచ్చిన ధరలతో అమ్ముతూ రోగుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. వైద్యులు రాసి ఇచ్చే మందులకు, మెడికల్ షాపుల యజమానులు ఇచ్చే మందులకు పొంతన ఉండకపోగా ఇదేమని ప్రశ్నిస్తే కంపెనీ తేడా.. మందు ఒక్కటే అంటూ సమాధానం చెబుతున్నారు. మార్కెట్లో వివిధ రకాల కంపెనీలు షాపుల యజమానులకు కమీషన్లు ఎక్కువగా ఇస్తుండటంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతి దుకాణంలో రికార్డులు, బిల్లు పుస్తకాలు తప్పనిసరిగా నిర్వహించాలి. వినియోగదారునికి ధరతో కూడిన బిల్లు ఇవ్వాలి. ఆచరణలో ఇవి అమలు కావటం లేదు. ఇవి మచ్చుకు కొన్నే.. 4 ఇటీవల కనిగిరి, దర్శి, రాజంపల్లి, బేస్తవారిపేట, గిద్దలూరుల్లో లైసెన్స్‌లు లేకుండా మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకుని మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించి వాటి యజమానులపై డ్రగ్ ఇన్స్పక్టర్ కేసులు నమోదు చేశారు. 4 బేస్తవారిపేటలో ఫిజిషియన్ శాంపిల్స్‌ను అమ్ముతుండగా గుర్తించి ఆ మందుల దుకాణంపై కేసు నమోదు చేశారు. 4 దర్శిలో ఒక మందుల షాపులో గేదెలు పాలు ఎక్కువగా వచ్చేందుకు ఆక్సిడోసిన్ నకిలీ మందును అమ్ముతుండగా సీజ్ చేశారు. ఇది చాల ప్రమాదకరమైన మందు. నకిలీ కావటం గమనార్హం. ఎటువంటి కంపెనీ పేరు, తయారీ, గడువు తేదీ దీనిపై లేదు. దీన్ని డ్రగ్ ఇన్స్పెక్టర్ స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తాం మందుల షాపుల యజమానులు మందులను అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయవచ్చు. అలా ఫిర్యాదు చేసిన వినియోగదారుల పేర్లు గోప్యంగా ఉంచుతాం. మందుల వాడకంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కరపత్రాలు పంచుతున్నాం. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. కొన్ని మందులను డాక్టర్ల ప్రిస్కిప్షన్ ఉంటేనే ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్లు మందులు ఇస్తే చర్యలు తీసుకుంటాం. మెడికల్ షాపుల యజమానులకు కూడా అవగాహన కల్పిస్తాం. – జయరాముడు, డ్రగ్ ఇన్స్పెక్టర్, మార్కాపురం -
దానికి ఏమైనా ట్యాబ్లెట్స్ ఉన్నాయా?
సందేహం మా వదిన ఆరు నెలల క్రితం ప్రెగ్నెంట్ అయింది. నాలుగో నెలలో తనకు అబార్షన్ జరిగింది. ఎలా అంటే.. చెకప్‌కు వెళ్లినప్పుడు పాప గుండె ఆగిపోయిందని చెప్పారు డాక్టర్. దాంతో రెండు రోజుల తర్వాత అబార్షన్ చేశారు. రెండు నెలలుగా బాధ పడుతూనే ఉంది. త్వరగా ప్రెగ్నెంట్ కావాలని కోరుకుంటోంది. ఈసారి ఆరోగ్యకరమైన పాప కావాలనుకుంటోంది. దానికి ఏమైనా ట్యాబ్లెట్స్ ఉన్నాయా? దయచేసి తనకు పరిష్కారం చెప్పండి. - ప్రవీణ, చౌటుప్పల్ పీరియడ్స్ సక్రమంగా ఉన్నవారిలో గర్భం వచ్చిన ఆరు వారాలకు.. అంటే నెల తప్పిన రెండు వారాలకు పిండంలో గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. ఆ తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోవడాన్ని మిస్డ్ అబార్షన్ అంటారు. పిండంలో జన్యుపరమైన సమస్యలు ఉన్నప్పుడు, తల్లిలో అదుపులో లేని మధుమేహం, థైరాయిడ్.. ఇంకా కొన్ని హార్మోన్ల అసమతుల్యత, తల్లి నుంచి బిడ్డకు రక్తం వెళ్లే రక్తనాళాలో సమస్య - అంటే రక్తం గూడుకట్టడం వంటి అనేక సమస్యల వల్ల 100లో 15 మందికి మొదటిసారి గర్భం అబార్షన్ అవ్వవచ్చు. ఒకసారి అలా అయినప్పుడు, మరోసారి అలాగే అవుతుందని ఏమీ లేదు. మొదట మీ వదినను డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చి, సంతోషంగా ఉంటూ ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకుంటూ మళ్లీ ప్రెగ్నెన్సీకి ప్రయత్నం చేయమనండి. తన వయసు, బరువు, పీరియడ్స్ సక్రమంగా ఉన్నాయా? లేదా? ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అన్న విషయాలను రాసి ఉంటే బాగుండేది. సాధారణంగా సమస్యలు ఏమీ లేకుండా, రెండు మూడుసార్లు అబార్షన్లు అయినప్పుడు మాత్రమే, భార్యాభర్తలిద్దరికి అనేక రకాల పరీక్షలు చెయ్యవలసి వస్తుంది. కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. నాకు రెండుసార్లూ నార్మల్ డెలివరీలే. మొదటి కాన్పులో సమస్యలు లేవు. రెండోసారి నాలుగేళ్ల తర్వాత పాప పుట్టింది. కొన్ని కుట్లు పడ్డాయి. కడుపు నొప్పి ఎక్కువగా ఉండడం వల్ల అటూ ఇటూ బాగా కదలడంతో కుట్లు ఊడిపోయాయి. డాక్టర్ దగ్గరకు వెళ్తే ట్యాబ్లెట్లు ఇచ్చారు. నాలుగు నెలలు అయినా కడుపు నొప్పి తగ్గడం లేదు. ఐదు నెలల గర్భిణినిలా కనిపిస్తున్నాను. గర్భానికి ముందు నా బరువు 58 కిలోలు. డెలివరీ టైమ్‌లో 73 కిలోలు. ఇప్పుడు 66 కిలోలు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషనూ చేయించుకున్నాను. డెలివరీ తర్వాత స్ట్రెయిట్‌గా పడుకొని, ఒక కాలుపై మరొక కాలు వేసుకొని పడుకోవాలని, గాలి లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కానీ కడుపు నొప్పి కారణంగా అలాంటి జాగ్రత్తలేమీ తీసుకోలేదు. గాలి లోపలికి వెళ్లడం వల్లే కడుపునొప్పి తగ్గట్లేదా? డెలివరీ తర్వాత పీరియడ్స్ కూడా అయిదు రోజులయ్యాయి. నా సమస్యకు పరిష్కారం తెలపండి. - మణి, అనంతపురం నార్మల్ డెలివరీ అయ్యి నాలుగు నెలలు అయినా... కడుపులో నొప్పి తగ్గడం లేదంటే, పొట్టలో ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యిండొచ్చు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయ్యిందన్నారు కాబట్టి, దాని వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండవచ్చు. లేదా ఆపరేషన్ వల్ల పొట్టలో కుట్లలో సమస్య లేదా పేగులు అతుక్కోవడం వంటి ఎన్నో కారణాల వల్ల ఇన్ని రోజులు నొప్పి ఉండొచ్చు. పొట్టలో పెరిగే బిడ్డను ఇముడ్చుకోవడానికి, పొట్ట కండరాలు, చర్మం బాగా సాగుతాయి. అలాగే తల్లి బరువు పెరిగేకొద్దీ పొట్టలో కొవ్వు కూడా పేరుకొని, కాన్పు అవ్వగానే అవి సాధారణస్థితికి రావాలంటే కష్టం. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి కండరాలు సాగిన తీరు, పేర్కొన్న కొవ్వును బట్టి, కాన్పు తర్వాత పొట్ట పెద్దగా, మళ్లీ 5-6 నెలల గర్భవతిగా ఉన్నట్టు కనిపిస్తుంది. దీనికి సరైన వ్యాయామాలు, నడక వంటివి ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో నేర్చుకొని, అనుసరించడం వల్ల పొట్ట చాలావరకు సాధారణ స్థితికి వస్తుంది. యోని భాగంలో వేసిన కుట్ల గురించి చూస్తే... మధ్యలో కుట్లు ఊడిపోతే, ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటే, వాటికవే మెల్లగా అతుక్కొని మానిపోతాయి. వాటివల్ల గాలి పోయి పొట్టనొప్పి రావడం లాంటివి ఏమీ ఉండవు. మళ్లీ ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి కడుపులో నొప్పికి గల కారణాలను తెలుసుకొని, తగిన చికిత్స తీసుకోవడం మంచిది. నా వయసు 46. మూడేళ్ల క్రితమే నాకు పీరియడ్స్ ఆగిపోయాయి. కానీ పోయిన నెల రెండు రోజుల పాటు బ్లీడింగ్ కనిపించింది. మళ్లీ ఈ నెల కూడా దగ్గర దగ్గర ఆ తేదీలోనే బ్లీడింగ్ అయింది. అలా దేనివల్ల అవుతుందో అర్థం కావడం లేదు. నా గర్భసంచికి ఏదైనా సమస్య వచ్చిందా లేక మరెందువల్ల అవుతుందో దయచేసి చెప్పగలరు. - అన్నపూర్ణ, కర్నూలు ఆడవారిలో పీరియడ్స్ ఆగిపోయిన సంవత్సరం తర్వాత కాలాన్ని మెనోపాజ్ దశ అంటారు. ఈ సమయంలో అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ పూర్తిగా తగ్గిపోవడం వల్ల పీరియడ్స్ ఆగిపోతాయి. పీరియడ్స్ ఆగిపోయిన సంవత్సరం తర్వాత బ్లీడింగ్ అవ్వడాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. గర్భాశయం లోపల పొరలో ఎండోమెట్రియల్ పాలిప్ ఏర్పడటం వల్ల గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, పుండ్లు, ఎండోమెట్రియల్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్, ఈస్ట్రోజన్ మాత్రలు వాడటం వల్ల ఎండోమెట్రియల్ పొర పెరగడం వల్ల, అండాశయాలలో గడ్డలు వంటి అనేక కారణాల వల్ల పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అవ్వవచ్చు. దీనిని అశ్రద్ధ చెయ్యడం అంత మంచిది కాదు. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, స్పెక్యులమ్ పరీక్ష, స్కానింగ్, పాప్ స్మియర్ వంటి పరీక్షలు చేయించుకోండి. అవసరమైతే ‘డి అండ్ సి’ పరీక్ష చేసి ముక్కని ఎండోమెట్రియల్ బయాప్సీ, సెర్వికల్ బయాప్సీకి పంపించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత పరీక్షలో వచ్చే రిపోర్ట్‌ను బట్టి చికిత్స సరిపోతుందా? లేక గర్భాశయాన్ని తొలగించవలసి వస్తుందా అనే నిర్ణయానికి రావొచ్చు. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
మీ స్మార్ట్‌ఫోన్ పగిలిందా?
♦ ఆన్లైన్లో మరమ్మతు సేవలందిస్తున్న జస్ట్‌లైక్‌న్యూ.ఇన్ ♦ ప్రస్తుతం ఫోన్లు, ట్యాబ్లెట్స్; త్వరలో ల్యాప్‌ట్యాప్స్, స్మార్ట్ వాచీలు కూడా ♦ ఉచిత డెలివరీ, 48 గంటల్లో రిపేరింగ్, 3 నెలల వారంటీ ♦ ఈ ఏడాదిలో ముంబై, చెన్నై, పుణెలకు విస్తరణ ♦ ఈ నెలాఖరులోగా రూ.3 కోట్ల నిధుల సమీకరణ ♦ ‘సాక్షి’ స్టార్టప్ డైరీతో కో-ఫౌండర్ రామకృష్ణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాధారణంగా ఏ ఎలక్ట్రానిక్ పరికరమైనా పాడైతే రెండు ఆప్షన్లుంటాయి. ఒకటి... రిపేరు చేయించటం. రెండోది... దాన్ని వదిలేసి కొత్తది కొనుక్కోవటం. అయితే స్మార్ట్ఫోన్ల విషయానికొస్తే చాలామంది రిపేరుకే ప్రాధాన్యమిస్తారు. ఒకవేళ మరీ రిపేరుకయ్యే మొత్తం ఎక్కువనుకుంటే మాత్రం... కొత్త ఫోన్ కొనుక్కుంటారు. కానీ ఇక్కడ చిక్కేంటంటే రిపేరు ఎక్కడ చేయించాలి అని!!?. ఎందుకంటే దగ్గర్లోని సాధారణ రిపేరింగ్ సెంటర్లో చేయిస్తే తక్కువ ఖర్చవుతుంది. కానీ గ్యారంటీ ఉండదు. ఇక సర్వీస్ సెంటర్‌కు తీసుకెళితే గ్యారంటీ ఉంటుంది కానీ ఖర్చు మాత్రం భారీగా ఉంటుంది. ఇదిగో... ఇలాంటి సందిగ్ధాన్నే వ్యాపారంగా చేసుకుంది ‘జస్ట్‌లైక్‌న్యూ’ బృందం!!. ఐఐటీ, ఎక్స్ఎల్ఆర్ఐ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన నలుగురు మిత్రులు అజిత్ పాణిగ్రహి, రాహుల్ అగర్వాల్, రామకృష్ణ చావ, విధి సింఘాల్ రూ.20 లక్షల పెట్టుబడితో గతేడాది ఏప్రిల్‌లో బెంగళూరు కేంద్రంగా జస్ట్‌లైక్‌న్యూ.ఇన్ను ప్రారంభించారు. సంస్థ సేవలు, విస్తరణ ప్రణాళిక గురించి కో-ఫౌండర్ రామకృష్ణ ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి ఏం చెప్పారంటే... 20 బ్రాండ్లు.. 10 వేల రకాల రిపేర్లు.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్ మోడల్స్, ట్యాబ్లెట్స్ను రిపేరు చేస్తున్నాం. 80 శాతం రిపేర్లు స్క్రీన్లు పగులుతున్నవే వస్తున్నాయి. దాదాపు 20 రకాల బ్రాండ్లు, 400 రకాల మోడల్స్‌లో 10 వేల రకాల రిపేర్లున్నాయి. ఉత్పత్తి పికప్, డెలివరీ రెండూ ఉచితమే. స్టాండ్‌బై మొబైల్, 3 నెలల వారంటీ ఇవ్వటం మా ప్రత్యేకత. 48 గంటల్లో రిపేర్ చేసి ఇంటికి డెలివరీ చేస్తాం. ఆయా ఉత్పత్తులను రిపేర్ చేసేముందు 25 కోణాల్లో పరీక్షలు నిర్వహిస్తాం. అందుకు సంబంధించిన క్యూసీ రిపోర్ట్‌ను కస్టమర్లకు ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తాం కూడా. ప్రతి నెలా 25 శాతం వృద్ధిని సాధిస్తున్నాం. ఈ మే నెలలో 2,000 ఉత్పత్తులను రిపేరు ఇందులో 80 శాతం స్మార్ట్ఫోన్లు, 20 శాతం ట్యాబ్లెట్స్ ఉన్నాయి. మూడేళ్లలో 15 నగరాలకు విస్తరణ.. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో సేవలందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి వచ్చే ఆర్డర్ల కోసం కొరియర్ సంస్థ డెల్హివరితో ఒప్పందం చేసుకున్నాం. మూడేళ్లలో దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరించాలనేది మా లక్ష్యం. ఈ ఏడాది ముగింపు నాటికి ముంబై, చెన్నై, పుణె నగరాలకు విస్తరించనున్నాం. సేవల విస్తరణ విషయానికొస్తే.. ఈ ఏడాదిలో ల్యాప్‌ట్యాప్స్, స్మార్ట్ వాచీల రిపేరింగ్ సేవల్లోకి ప్రవేశిస్తాం. రెండేళ్లలో ఫ్రాంచైజీ మోడల్ లో రిటైల్ ఔట్‌లెట్‌ను కూడా ప్రారంభిస్తాం. రూ.3 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం నెలకు రూ.40 లక్షల టర్నోవర్‌ను చేరుకుంటున్నాం. మా సంస్థలో 40 మంది ఉద్యోగులున్నారు. ఇందులో 15 మంది టెక్నీషన్స్. ‘‘గతేడాది జూలైలో ఏంజిల్ రౌండ్లో భాగంగా కోటి రూపాయల నిధులను సమీకరించాం. ఇండిగో కన్సల్టింగ్ మాజీ ఎండీ వికాస్ టండన్, కాపిలరీ టెక్నాలజీస్ సీఈఓ అనీష్‌రెడ్డి, ఇన్వెస్టరు వికాస్ సాలుగూటి మా సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఈ నెలాఖరులోగా రూ.3 కోట్ల నిధులను సమీకరిస్తాం. చర్చలు పూర్తయ్యాయి. ఇందులో ఏంజిల్ ఇన్వెస్టర్లతో పాటూ హెచ్‌బీసీ సెక్యూరిటీస్ ఎండీ హర్ష పప్పు, మైండ్‌ట్రీ చైర్మన్ కృష్ణ కుమార్, ఒరాకిల్ ఇండియా మాజీ ఎండీ సందీప్ మాథుర్లున్నారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
అసలు ఈ పీసీలకు ఏమైంది...?
ప్రపంచ చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ ప్రతి పదిమంది ఉద్యోగుల్లో ఒకరిని తొలగిస్తామని ఎందుకు ప్రకటించింది. 2017 మధ్య వరకు ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలలో పనిచేసే 12 వేల మంది ఉద్యోగులను ఎందుకు ఇంటికి పంపేస్తోంది? వీటన్నింటికీ సంస్థ చెప్పే సమాధానం ఒక్కటే.. పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) పరిశ్రమ పడిపోవడమని. అసలు మార్కెట్లో పీసీ అమ్మకాలకు ఏమైంది. ఈ అమ్మకాలు అంతలా పడిపోవడానికి కారణమేమిటి.. ఎప్పటి నుంచి అమ్మకాల క్షీణత ప్రారంభమైంది.. ఓసారి చూద్దాం. పీసీల ఎదుగుదల, తగ్గుదల 2011 వరకూ పీసీ పరిశ్రమకు ఫుల్ క్రేజ్ ఉండేది. ఎవరిని చూసినా ల్యాప్ టాప్ కొనాలని అనుకునేవాళ్లు. సాప్ట్ వేర్ ప్రొఫెషనల్స్, సాధారణ ఉద్యోగుల నుంచి అటు చదువుకునే పిల్లల వరకు అంతా ల్యాప్‌టాప్‌ల వైపే ఎక్కువగా మొగ్గు చూపేవారు. కాస్త ధర ఎక్కువైనా ఫర్వాలేదు గానీ, వాడుకోడానికి సులభంగా ఉంటుందని, ఎక్కడికైనా తీసుకెళ్లచ్చని అనుకునేవారు. అయితే 2016 సంవత్సరం మొదటి త్రైమాసికంలో నమోదైన ఫలితాల్లో పీసీల అమ్మకాలు ఒక్కసారిగా 10 శాతం పడిపోయాయి. కేవలం 6 కోట్ల పీసీలే అమ్ముడుపోయినట్టు గణాంకాలు చూపించాయి. ఇక అప్పటినుంచి మొదలైన అమ్మకాల క్షీణత, 2014లో కొంచెం ఫర్వాలేదు అనిపించినా, తర్వాత మళ్లీ పడిపోయింది. ప్రస్తుతం పీసీల పరిశ్రమల నేలచూపులే చూస్తోంది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొత్త వినియోగదారులను చేరుకోలేకపోవడం, వినియోగదారులు కూడా చాలావరకు ట్యాబ్లెట్ పీసీలు, స్మార్ట్ ఫోన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం పీసీల డిమాండ్ పడిపోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. స్మార్ట్ బూమ్ టెక్నాలజీ క్రమేపీ అభివృద్ధి చెంది స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి ప్రవేశించడంతో పీసీల డిమాండ్ దారుణంగా పడిపోయింది. 2016 నుంచి స్మార్ట్ ఫోన్ల బూమ్ మరీ ఎక్కువ కావడంతో పీసీల ఇండస్ట్రీ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. మొదట్లో స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ తక్కువగానే ఉన్నా.. తర్వాత ధర తగ్గడం, ఎక్కువ మోడళ్లు అందుబాటులోకి రావడంతో క్రమంగా ప్రపంచమే స్మార్ట్ ఫోన్ లోకంగా మారింది. గతేడాది స్మార్ట్ ఫోన్ల రవాణా 150 కోట్లకు ఎగబాకింది. మరోవైపు పీసీలకు ప్రత్యామ్నాయంగా వస్తున్న టాబ్లెట్లు సైతం పీసీల అమ్మకాలకు గండి కొడుతున్నాయి. పీసీ కొనుకోవాలనుకునేవారిలో చాలామంది టాబ్లెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. పీసీలు ఆఫర్ చేసే ప్రతి ఫీచర్లను టాబ్లెట్లు అందుబాటులోకి తేవడమే వీటి డిమాండ్‌కు ప్రధాన కారణం అవుతోంది. 2010లో టాబ్లెట్ల రవాణా 5శాతం ఉంటే, 2014లో అది కాస్తా 40 శాతానికి పెరిగింది. -
స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్‌లో వైఫై వేగం పెరగనుందా..?
న్యూయార్క్: మీరు వైఫైను ఉపయోగిస్తున్నారా? అది స్లోగా ఉంటోందా? ఇక మీ నెట్ కష్టాలు తీరిపోయినట్టే! భారత సంతతి చెందిన వ్యక్తి తాజా పరిశోధన టెలీకమ్యూనికేషన్స్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది. ఐఐటీ-మద్రాసు నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పట్టా పొందిన కృష్ణరామస్వామి.. ప్రస్తుతం కొలంబియా యూనివర్సిటీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన నాన్ రెసిప్రోకల్ సర్కులేటర్, ఫుల్ డూప్లెక్స్ రేడియోలను నానో స్కేల్ సిలికాన్ చిప్ లతో అనుసంధానించడం ద్వారా వేగంగా సమాచారాన్ని పంపే సిస్టంను కనుగొన్నారు. మొదటిసారి ఒక సర్కులేటర్ను సిలికాన్ చిప్‌తో అనుసంధానించామని, దీని ద్వారా మునుపటి కంటే అత్యుత్తమ పనితనాన్ని మనం గమనించవచ్చని ఆయన అన్నారు. గత సంవత్సరం కొలంబియా పరిశోధకులు ఫుల్ డూప్లెక్స్ రేడియో ఇంటిగ్రేటెడ్ సర్కూట్స్ టెక్నాలజీని ఆవిష్కరించారు. దాని ఫలితంగా ఒకే ఫ్రీక్వెన్సీ వద్ద ట్రాన్స్మిషన్, రిసెప్షన్లతో వైర్ లెస్ రేడియోలను వినియోగించడానికి అవకాశం ఏర్పడింది. రెండు యాంటెనాల సాయంతో ఒకే ఫ్రీక్వెన్సీతో సమాచారాన్ని చేరవేయడం సులభతరమయింది. ప్రస్తుత పరిశోధన వల్ల వైఫై టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఒకే యాంటెనా సాయంతో వైఫై కెపాసిటీని డబుల్ చేయడం వల్ల స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. ఒకే చిప్ మీద సర్కులేటర్ను ఉంచడం వల్ల మిగిలిన రేడియో భాగాలు సైజులో బాగా తగ్గిపోయి పనితనం పెరిగిందని మరో పరిశోధకుడు జిన్ జోహు వివరించారు. ఈ విజయాన్ని సాధించడానికి కృష్ణస్వామి టీమ్ లారెంజ్ రెసిప్రోసిటీను బ్రేక్ చేయవలసి వచ్చింది (ఎలక్ర్టోమ్యాగ్నటిక్ ఫోర్సెస్ ముందుకు, వెనుకకు ఒకే సమయంలో ప్రయాణించేలా చేయాల్సి వచ్చింది). భావి తరాలకు చెందిన గ్రాడ్యుయేట్లకు ఇటువంటి పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని భారత సంతతికి చెందిన మరో ఇంజనీర్ తెలిపారు. 2016 ఐఈఈఈ నిర్వహించిన ఇంటర్నేషనల్ సాలిడ్ స్టేట్ సర్కూట్స్ కాన్ఫరెన్స్‌లో ఈ పేపర్‌ను ప్రచురించారు. -
స్మార్ట్‌ఫోన్‌తో స్మార్ట్‌గా..
టొరంటో: మందబుద్ధితో బాధపడుతున్న వారిలో మానసిక స్థైర్యం పెంపొందడానికి స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, యూట్యూబ్‌లాంటి ఉపకరణాలు ఉపయోగపడుతున్నాయని ఒక పరిశోధనలో తేలింది. మందబుద్ధి ఉండి జీవితంలో విజయం సాధించినవారి అనుభవాలను చిత్రీకరించి, వాటిని బోధించడం ద్వారా మిగతావారిలో స్వీయ నియంత్రణ కలుగుతోందని కెనడాలోని మాంట్రియల్ కాంక్రోడియా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ‘ఈ ప్రయోగం కోసం 8 మంది మందబుద్ధిగల వారిపై పరిశోధనలు చేశాం. ఈ ప్రయోగ ఫలితాలను చిన్న చిన్న వీడియోలుగా తీసి ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి చూపించాం. వీటిని చూసినవారిలో స్ఫూర్తి కలిగింది. వారి జీవితంపై సంతృప్తి కలిగింది’ అని కాంక్రోడియా వర్సిటీ ప్రొఫెసర్ ఎన్ లూయిస్ డేవిడ్సన్ వివరించారు. -
వీటి రేటే సపరేటు!
♦ అన్నీ జనరిక్‌లే కానీ బ్రాండ్ల పేరిట భారీ ధరలు ♦ సేల్స్ సిబ్బందికి భారీ ఖర్చు.. వైద్యులకూ బహుమతులు ♦ స్టాకిస్ట్ నుంచి మందుల షాపుల దాకా భారీగా కమీషన్లు ♦ ఈ ఖర్చులకు లాభం కూడా కలిపి బ్రాండెడ్ మందుల ధరల నిర్ణయం ♦ పలు చోట్ల మామూలు దుకాణాల్లోనూ జనరిక్స్కూ భారీ ధరలు ♦ కొనేవారిలో అవగాహనతోనే చెక్ పెట్టగలమంటున్న నిపుణులు సాక్షి, బిజినెస్ ప్రత్యేక ప్రతినిధి: మధుమేహ రోగులు ఎక్కువగా వాడే మెట్ఫార్మిన్ ఔషధంతో ఎన్నో మందులు మార్కెట్లో ఉన్నాయి. వాటిలో కొన్ని టాబ్లెట్లు రూపాయికన్నా తక్కువ ధరకే దొరుకుతుండగా... కొన్ని ఒక్కొక్కటీ రూ.10కి పైనే ఉన్నాయి. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు అత్యవసరంగా వాడే మెరోపెనెమ్ ఇంజక్షన్‌ను ఓ కంపెనీ రూ.1,500కు విక్రయిస్తుండగా... మరో కంపెనీ రూ.57కే అమ్ముతోంది. ఇవేకాదు కొన్ని వందల రకాల మందుల్లో ఈ తేడాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇదెలా సాధ్యం, ధరల్లో ఇంత తేడాలున్నా ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది, మందుల నాణ్యతను నిర్ధారించే డ్రగ్ కంట్రోలర్ గానీ, మరో సంస్థగానీ ధరలను ఎందుకు నియంత్రించటం లేదు..? ఈ ప్రశ్నలకు జవాబు.. మందుల కంపెనీలు, ఆసుపత్రులు, నియంత్రణ సంస్థల నుంచి ఒక్కో రకంగా వస్తుంది. ఎవరెలా సమాధానం చెప్పినా... అందులో సామాన్యుడి గోడు కనిపించదనేది పచ్చినిజం. ఇండియాలో తయారవుతున్నవన్నీ జనరిక్ మందులే అయితే ధరల్లో ఎందుకింత తేడాలున్నాయనేది ప్రతి ఒక్కరికీ వచ్చే సందేహం. ఈ సందేహం తీరాలంటే... జనరిక్స్‌లో రకాల గురించి, కంపెనీల మార్కెటింగ్ వ్యూహాల గురించి తెలుసుకోవాలి. జనరిక్ రకాలను చూస్తే.. 1. బ్రాండ్ పేరు కాకుండా జనరిక్ సాల్ట్ (ఔషధం పేరు) మాత్రమే ఉండేవి: ఉదాహరణకు హైపర్‌టెన్షన్ చికిత్సలో వినియోగించడానికి డాక్టర్ రెడ్డీస్, జైడస్ క్యాడిలా సంస్థలు తయారుచేసే ఆమ్లోడిపిన్ బెసలైట్. ఇది రసాయనం పేరు మాత్రమే. ఈ కంపెనీలు వాటికి బ్రాండ్ పేరేమీ పెట్టకుండా జనరిక్ సాల్ట్ పేరుతోనే మార్కెట్లోకి తెచ్చాయి. బ్రాండ్ పేరు లేదు కనక వీటిని మార్కెట్ చేయడానిక్కూడా ప్రత్యేకంగా ఖర్చేమీ పెట్టరు. కాబట్టి తక్కువ ధరకే లభ్యమవుతాయి. నిపుణులు చెప్పేదేమంటే... డాక్టర్ రెడ్డీస్, జైడస్ అనే కంపెనీలే పెద్ద బ్రాండ్లు. కాబట్టి వీటినీ బ్రాండెడ్ జనరిక్స్గానే భావించాలి. ఏదో ఒక బ్రాండ్ పేరు పెట్టి విక్రయించే జనరిక్స్కన్నా ఇవి చౌకగానే లభిస్తాయి. 2. పాపులర్ కాని బ్రాండ్: కొన్ని కంపెనీలు వివిధ పేర్లతో బ్రాండింగ్ చేసి దీన్ని మార్కెట్ చేస్తుంటాయి. అయితే వీటిని పాపులర్ చేయటానికి మార్కెటింగ్‌పై ఎక్కువగా ఖర్చు పెట్టవు. సాధారణంగా వీటిని బల్క్‌గా ప్రభుత్వాలకు, ఆసుపత్రులకు సరఫరా చేయడానికి తయారుచేస్తారు. డాక్టర్ రెడ్డీస్, సిప్లా, అబాట్ వంటి పెద్ద కంపెనీల జనరిక్ సాల్ట్ మందుల కన్నా వీటి ధర కాస్త ఎక్కువగా.. పాపులర్ బ్రాండెడ్ కన్నా చౌకగా దొరుకుతాయి. 3. పాపులర్ బ్రాండ్: వీటిని పుష్కలంగా నిధులున్న బడా సంస్థలే తయారు చేస్తుంటాయి. అంటే ఒక బ్రాండ్ పేరుతో వీటిని ఉత్పత్తి చేసి ఊరుకోకుండా... దాని ప్రచారానికి నిధులను ఖర్చుచేస్తాయి. డాక్టర్ల సిఫారసులతో మందుల షాపుల్లో విక్రయించడానికే వీటిని తయారు చేస్తాయి. వీటి ఖరీదు చాలా ఎక్కువ. కొన్ని సందర్భాల్లో ఒకే కంపెనీ ఒక ఔషధాన్ని జనరిక్ సాల్ట్గాను, పాపులర్ బ్రాండ్గాను, పాపులర్ కాని బ్రాండ్‌గా కూడా విడుదల చేస్తుంటుంది. అంటే తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు ఏ ధరలో మందు కొనాలన్నా ఆ కంపెనీయే అమ్ముతుంది. అనుబంధ విభాగాల పేరిట వీటిని మార్కెట్ చేస్తుంటారు. ధరల్లో తేడాలెందుకు? జనరిక్స్‌లో రకాల మాట పక్కనబెడితే అసలు ధరల్లో ఇన్ని తేడాలెందుకనే ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పేవారే లేరు. తమ పేరు బయటకు రావద్దనే షరతుమీద కొందరు కొన్ని నిజాలు చెబుతుంటారు. రాష్ట్రంలో అతి పెద్ద ఫార్మా కంపెనీని నిర్మించిన తొలితరం పారిశ్రామికవేత్త ఒకరు తన చివరి రోజుల్లో అనధికారికంగా కొన్ని విషయాలను చెబుతుం డేవారు. ఫార్మా అనేది విష వలయంలా మారి పోయిందని చెప్పేవారు. కొందరు పెద్ద పదవుల్లో ఉన్న వైద్యులు మందుల ధరలకు సం బంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్నా... నిర్మాణాత్మకంగా అడుగులేసేవారు మాత్రం తక్కువ. (అసలు ఇండియాలో జనరిక్స్ పరిస్థితేంటి? చట్టాలేం చెబుతున్నాయి? అమెరికాలాంటి చోట్ల పరిస్థితేంటి? అక్కడివారికి మందుల్లో ఎందుకంత పొదుపవుతోంది? రేపటి సంచికలో..) ఏ కంపెనీ అయినా తయారీకయ్యే ఖర్చుల్ని బట్టే ధర నిర్ణయిస్తుంది. లాభాలనేవి అమ్మకాలపై ఆధారపడతాయి కాబట్టి.. అమ్మకాల్ని పెంచుకునేందుకు వివిధ మార్గాల్ని అనుసరిస్తుంటారు. అవి.. 1) నైతిక ప్రచారం (ఎథికల్ ప్రమోషన్): ఈ పద్ధతి పాటించే ఏ కంపెనీకైనా రాష్ట్రం మొత్తానికి సీ అండ్ ఎఫ్ ఏజెంట్ ఉంటారు. తన పరిధిలో 25-30 మంది డిస్ట్రిబ్యూటర్లకు, వారి నుంచి రిటైల్ షాపులకు మందులు సరఫరా అవుతాయి. సాధారణంగా సీ అండ్ ఎఫ్ ఏజెంట్‌కు 2 శాతం, డిస్ట్రిబ్యూటర్లకు 8-10 శాతం, రిటైలర్లకు 18-20 శాతం కమీషన్ ఉంటుంది. అంటే మొత్తమ్మీద 30-35 శాతం కమీషన్లే. ఇక కంపెనీలే రోగుల చేత వాటిని కొనిపించేందుకు తమ సేల్స్ సిబ్బందిని రంగంలోకి దించుతాయి. ఆ సిబ్బంది వైద్యులకు రకరకాల బహుమతులు ఇస్తారు. డాక్టర్ స్థాయిని బట్టి, వారి దగ్గరికొచ్చే రోగుల్ని బట్టి దేశీ, విదేశీ పర్యటనలు, ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలు, కార్లు వంటివి ఇస్తారు. మొత్తంగా కమీషన్లు, సేల్స్ యంత్రాంగానికయ్యే ఖర్చు, బహుమతుల ఖర్చు, కంపెనీల లాభం, మందుల తయారీ ఖర్చు.. అన్నీ కలసి ధర తడిసిమోపెడు అవుతుంది. అందుకే బ్రాండెడ్ జనరిక్స్ ధర ఎక్కువగా ఉంటుంది. 2) నేరుగా విక్రయించే జనరిక్స్: పేరులేకుండా విక్రయించే జనరిక్ సాల్ట్‌లకు (ఔషధం పేరు) సేల్స్ యంత్రాంగం, డాక్టర్ సిఫారసు ఉండ వు. వీటి అమ్మకాల కోసం కంపెనీలు మెడికల్ షాపులపైనే ఆధారపడతాయి. వీటిపై ముద్రించే ధర కొంత ఎక్కువే ఉంటుంది. మెడికల్ షాపులకు 70-80% డిస్కౌంట్ ధరకే ఇస్తారు. షాపులు వీటిని 50- 60% తక్కువ ధరకు అమ్మవచ్చు. కానీ చాలా దుకాణాల వారు వాటిపై ముద్రించిన ధరనే వసూలు చేస్తారు. ప్రత్యేకంగా కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన జనఔషధి స్టోర్లు, నవభారత్ నిర్మాణ్ వంటి మందుల షాపులు జనరిక్స్‌ను తక్కువ ధరలకే విక్రయిస్తున్నాయి. 3) పీ అండ్ డీ... (ప్రాపగండా అండ్ డిస్ట్రిబ్యూషన్): కొన్ని కంపెనీలకు స్టాకి స్ట్లు సైతం ఉండరు. ఇవి తమ ఉత్పత్తుల్ని విక్రయించడానికి ప్రచారం, పంపిణీ మార్గాన్ని అనుసరిస్తాయి. అంటే సొంత మెడికల్ షాపులున్న వైద్యులను, ఆసుపత్రులను ఇవి ఉపయోగించుకుంటాయి. తమ ఉత్పత్తులను విక్రయించాల్సిందిగా నేరుగా వారికే ఇస్తాయి. ఆ డాక్టరు స్థాయిని బట్టి వారికి ముందే ఏక మొత్తంగా డబ్బు ముట్టజెబుతాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉండదు గనుక అందుకు పెట్టే ఖర్చులో కొంత డాక్టరుకే ముడుపులిస్తాయన్న మాట. దీంతో సదరు వైద్యుడు తన దగ్గరకొచ్చే రోగులకు ఆ మందులే రాస్తారు. అవి ఆ షాపులోనే దొరుకుతాయి. దగ్గర్లోని మరో షాపులో వాటిని విక్రయించకూడదన్న షరతు మీదే వాటిని ఆ డాక్టరు విక్రయిస్తాడు. పైగా వీటి విక్రయాల్లో కమీషన్ కూడా ఎక్కువే. తక్కువకు విక్రయించకపోవటమే సమస్య సాధారణంగా అవసరమయ్యే చాలా మందులకు జనరిక్స్ ఉన్నాయి. అవి అన్ని షాపుల్లోనూ దొరుకుతాయి. కానీ జనఔషధి, నవభారత్ నిర్మాణ్ వంటివి మినహా చాలా దుకాణాలు జనరిక్స్‌ను కూడా వాటిపై ముద్రించి ఉన్న ధరకే విక్రయించటంతో సమస్య తలెత్తుతోంది. వినియోగదారుడు జనరిక్స్ కొనాలనుకున్నా అవి తక్కువ ధరకు అందే పరిస్థితి ఉండడం లేదు. డాక్టర్లకు సొంత మెడికల్ షాపులున్నచోట పరిస్థితి మరీ దారుణం. ఉదాహరణకు అత్యవసరంగా చేసే మెరోపెనెమ్ ఇంజెక్షన్ ధర రూ.2,800 వరకూ ఉంది. రోజుకు రెండు డోసులివ్వాలి. అత్యవసర మందు గనుక వైద్యులు తమ షాపులోని జనరిక్నే ఇస్తుంటారు. రూ.200-300కు దొరికే ఈ జనరిక్కూ రూ.2,800 వసూలు చేస్తుండడం దారుణం. అలాగే పైపరాసిల్లిన్ ప్లస్ టాజోబాక్టమ్ మందులు కూడా తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు వాడేవే. వీటి ధర రూ.250-300 వరకు ఉంటుంది. కానీ జనరిక్ రూ. 50కే దొరుకుతుంది. వైద్యులు వీటి విషయంలోనూ ఇలాగే చేస్తున్నారు. జనరిక్స్‌కు సంబంధించి ఈ కథనాలపై మీ అనుభవాలు, అభిప్రాయాలను మాకు సాక్షిహెల్త్15@ జీమెయిల్ ద్వారా మెయిల్ చేయొచ్చు -
మందుల మాయాజాలం..!
-
రాడో వాచీలు.. స్కాచ్ విస్కీ బాటిళ్లు.. పంచిపెడుతున్నారు
బెంగళూరు : పెద్దల సభలోకి వెళ్లాలంటే ఓటర్లకు 'పెద్ద'గా ఖర్చు పెట్టాలని వివిధ పార్టీల నాయకులు భావించినట్లున్నారు. అనుకున్నదే తడవుగా అలా ఇలా కాదు అత్యంత ఖరీదైన బహుమతులు అందిస్తూ... ఓటర్ల 'మతి' పోగోడుతున్నారు. పార్టీని బట్టి ఓటర్లకు చిన్న... పెద్ద నజరానాలు అందుతున్నాయి. పెద్ద పార్టీ అయితే స్విస్ రాడో వాచీలు అందిస్తూ... ఓటర్లను ఆకట్టుకుంటుంది. అలాగే చిన్న చితక పార్టీలు మాత్రం స్మార్ట్ ఫోన్లు.... ఐ పాడ్లు.... ల్యాప్ టాప్‌లు అందిస్తున్నాయి. దీంతో ఓటర్లు మాత్రం ఈ ఆఫర్లతో తడిసి ముద్దవుతున్నారు. ఓటర్ల కోసం ఇప్పటికే ఓ పెద్ద పార్టీ నాయకులు ఒక్కో రాడో వాచీ కోసం కనీసం రూ. 20 వేలు చెల్లించి... భారీ ఎత్తున కొనుగోలు చేశారని సాక్షాత్తూ... సదరు వాచీల పంపిణీదారుడే వెల్లడించడం కొసమెరుపు. కర్ణాటక రాష్ట్రంలో 25 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27వ తేదీన ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దార్వాడ్, బాగల్కోట్, విజయపూరీ జిల్లాలో ఫోన్లు.... ఐ పాడ్లు.... ల్యాప్ టాప్‌లు నాయకులు ఓటర్లకు అందిస్తున్నారు. కోలార్ జిల్లాలో అయితే రాడో వాచీలు ఓటర్ల చేతిలో తిరుగుతున్నాయి. అలాగే కోడుగు ప్రాంతంలో మాత్రం జానీ వాకర్ బ్లాక్ లేబుల్ స్కాచ్ విస్కీ బాటిళ్లు చేరుతున్నాయి. ఈ ఎన్నికల్లో 700 నుంచి 9500 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క ఓటరు చేతిలో ఐపాడ్... స్మార్ట్ ఫోన్...రాడో వాచీలు... స్కాచ్ విస్కీల బాటిల్ ఏదో ఒక్కటి చేరనుంది. -
మేం తక్కువా!
వాషింగ్టన్: అమెరికాలో ఏడాది వయసున్న చిన్నారులు సైతం నిత్యం ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని అల్పాదాయ, మైనారిటీ వర్గాలకు చెందిన 350 మంది చిన్నారుల (6 నెలలు-4 ఏళ్లు)పై సాగిన ఈ అధ్యయనంలో ఆదాయానికి సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి మధ్య అంతరం తగ్గిపోతున్నట్లు స్పష్టమైంది. ఏడాది వయసున్న పిల్లలు, చిన్నారులకు అత్యంత ఇష్టమైనవి ట్యాబ్లెట్లేనని.. దాన్ని వారు రోజుకు సగటున 20 నిమిషాలకు పైగానే వినియోగిస్తున్నారని తేలింది. ఫిలడల్ఫియాలో ఓ ఆస్పత్రికి వచ్చిన చిన్నారుల తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. సర్వే ప్రకారం.. 83 శాతం మందికి ట్యాబ్లెట్లు, 77 శాతం స్మార్ట్పోన్లు ఉన్నాయి. చిన్నారుల్లో మూడొంతుల మందికి సొంత మొబైల్ ఉంది. ఏడాది లోపు చిన్నారుల్లో పదిమందిలో నలుగురు, రెండేళ్ల వయసున్న చిన్నారుల్లో 77 శాతం ఎవరి సాయం లేకుండానే మొబైల్లో గేమ్స్ ఆడుతూ యాప్స్ వాడుతున్నారు. -
అంగన్వాడీలకు ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు
న్యూఢిల్లీ: అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపరచడానికి అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను అందించనుంది. పౌష్టికాహార లేమి తీవ్రంగా ఉన్న 162 జిల్లాల్లోని 3 లక్షల అంగన్వాడీలను ఐటీ సర్వీసులతో అనుసంధానించి, పౌష్టికాహార మెరుగుదల ప్రాజెక్టును అమలు చేయడంలో భాగంగా వీటిని సమకూర్చనుంది. ప్రాజెక్టు తొలిదశను ఆంధ్రప్రదేశ్, బిహార్ తదతర 8 రాష్ట్రాల్లో అమలు చేస్తామన్నారు. -
తరగతి గదిలో ‘ఈ’ చదువులు!
స్కూలు బ్యాగులవసరం లేకుండా పాఠ్యాంశాలన్నీ ట్యాబ్లెట్స్లోనే.. - మన దేశంతో పాటు దుబాయ్, దక్షిణాఫ్రికాల్లో సేవలందిస్తున్న ఎడ్యుటర్ - మూడో విడతగా రూ.40 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తొమ్మిదో తరగతి చదివే శ్రీధర్‌కు ఎప్పుడూ లెక్కల్లో 20కి పది మార్కులే వస్తాయి. ప్రతిసారీ మిగతా పది మార్కులు ట్రిగ్నోమెట్రీలోనే పోతాయి. అమ్మానాన్నల దృష్టిలో శ్రీధర్ మ్యాథ్స్‌లో వీక్. కానీ, నిజానికి శ్రీధర్ లెక్కల్లో కాదు కేవలం ట్రిగ్నోమెట్రీలోనే వెనకబడిపోతున్నాడు. ఈ సంగతి వాళ్లకి తెలిసేదెలా? నిఖిత తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులే. పేరెంట్స్ మీటింగ్‌కు హాజరవటం ఇద్దరికీ కుదరదు. మరి కూతురి మార్కులు, హాజరుకు సంబంధించిన సమాచారం వాళ్లకు తెలిసేదెలా? ...ఇలా ఒకటి కాదు రెండు కాదు పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలు. ఇదిగో... ఈ సందేహాలు తీర్చడానికే విద్యావ్యవస్థ అప్‌గ్రెడేషన్ అవసరమని భావించారు రామ్ గొల్లమూడి, రమేష్ కర్ర, ప్రసన్న బోని. అందుకే క్లాస్‌రూమ్‌లో మార్పుల కోసం ‘ఎడ్యుటర్ టెక్నాలజీస్’ను ఆరంభించి ట్యాబ్లెట్ పీసీలతో స్కూళ్లకు ఈ-చదువులను పరిచయం చేస్తోంది. నిజానికి స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ కార్లు, స్మార్ట్ సిటీలూ... అంటూ గత కొన్నేళ్లులో ప్రపంచంలో ఎన్నో మార్పులొచ్చినా క్లాస్ రూంలు, పరీక్షలు, ప్రోగ్రెస్ కార్డులతో నిండిన విద్యా వ్యవస్థలో మాత్రం చెప్పుకోదగ్గ మార్పులు రాలేదు. విద్యార్థి దశలోనే డిజిటలైజేషన్ అలవాటు చేయడానికే తాము ఈ సంస్థను ఆరంభించామంటున్న మిత్ర బృందం ఇంకా ఏం చెబుతోందో వారి మాటల్లోనే... రిటైల్ నుంచి క్లాస్ రూంలోకి... రూ.10 లక్షల పెట్టుబడితో 2010లో ఎడ్యుటర్ టెక్నాలజీస్‌ను ప్రారంభించాం. మొదట్లో కేవలం పాఠ్యపుస్తకాల్లోని సిలబస్‌లను ట్యాబ్లెట్ పీసీల్లో నిక్షిప్తం చేసి విక్రయించే వాళ్లం. మా ఆలోచన న చ్చి చాలా స్కూళ్ల ప్రిన్సిపల్స్... మీ ఆలోచన బాగుంది. ఎందుకు దీన్ని రిటైల్ మార్కెట్ నుంచి క్లాస్ రూమ్‌కు తీసుకురాకూడదని అడిగారు. దీంతో రెండేళ్లు సాఫ్ట్వేర్ అభివృద్ధికి శ్రమించి 2012లో ఇగ్నిటర్ కంటెంట్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశాం. దీంతో కేజీ నుంచి +2 (12వ తరగతి) వరకు అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలు ట్యాబ్లెట్స్‌ల్లో నిక్షిప్తమై ఉంటాయి. దీంతో విద్యార్థులు బ్యాగులు మోసుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆడియో, వీడియో రెండు రకాల సేవలూ ఉంటాయిందులో. కొన్ని కొన్ని సబ్జెక్ట్‌లకు వీడియో ఆధారంగా పాఠాలు చెబితేనే అర్థంమవుతుంది మరి. ఇలాంటి సేవలందించే సంస్థలు ప్రపంచవ్యాప్తంగా నాలుగైదు ఉన్నాయి. కానీ, వాటికి ఇగ్నిటర్కున్న ప్రధాన తేడా ఏంటంటే.. మా సాఫ్ట్వేర్ ఇంటర్నెట్ అవసరం లేకుండానే పనిచేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ అన్ని సిస్టమ్స్నూ ఇగ్నిటర్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది. 60 వేల మంది విద్యార్థులు... మన దేశంతో పాటు దుబాయ్, దక్షిణాఫ్రికాల్లోని పాఠశాలల్లో కూడా ఎడ్యుటర్ సేవలందిస్తోంది. దాదాపు 60 వేల మంది విద్యార్థులు దీని సభ్యులే. పాఠశాలలే కాదు కాలేజీలు, విశ్వ విద్యాలయాలు, కోచింగ్ సెంటర్లూ దీని కస్టమర్లుగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చిరాక్, మెరిడియన్, విద్యానికేతన్, ఇండస్, జైన్ ఇంటర్నేషనల్, గీతాంజలి వంటి కార్పొరేట్ విద్యా సంస్థలున్నాయి. ఆకాశ్ ఇనిస్టిట్యూట్, ఏస్ క్రియేటివ్ లెర్నింగ్, లెర్న్పీడియా, ప్రైమ్స్ వంటి శిక్షణ సంస్థలూ ఉన్నాయి. ఎస్ఆర్ఎం, ఎన్టీటీఎఫ్, గేట్ఫోరం, దక్షిణాఫ్రికాలోని సీటీఐ-ఎంజీఐ గ్రూప్ వంటి విశ్వ విద్యాలయాలూ వినియోగిస్తున్నాయి. ఏడాదికి సాఫ్ట్వేర్, కంటెంట్ కలిపి రూ.3-4 వేల మధ్య చార్జీ ఉంటుంది. తల్లిదండ్రులకు రిపోర్ట్లు... వందల మంది విద్యార్థుల్లో ఏ పిల్లాడు ఏ సబ్జెక్ట్‌లో వెనకబడ్డాడో కనిపెట్టి సరిదిద్దడం కాసింత కష్టమైన పనే. కానీ, ఎడ్యుటర్ ఆ పనిని సులభంగా చేసిపెడుతుంది. రూ.40 కోట్ల నిధుల సమీకరణ.. ఎడ్యుటర్ టెక్నాలజీస్ మూడో విడ త నిధుల సమీకరణపై దృష్టిసారించింది. రెండేళ్ల క్రితం ఎడ్యుటర్ టెక్నాలజీస్‌లో హైదరాబాద్ ఏంజిల్స్ రూ.5 కోట్లు పెట్టుబడులు పెట్టింది. గతేడాది ఢిల్లీకి చెందిన సఫారి గ్రూప్ రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ ఏడాది చివరినాటికి మరో రూ.40 కోట్లు పెట్టుబడులను సమీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే అనంతపురంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పెలైట్ ప్రాజెక్ట్ కింద ఈ సేవల్ని ఆరంభించింది ఎడ్యుటర్. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
చీటీ ఉంటేనే గోలీ..
జహీరాబాద్ టౌన్ : జలుబు, జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి తదితర చిన్న సమస్యలకు గతంలో మెడికల్ దుకాణాల్లో మందులు ఇచ్చేవారు. అయితే పరిస్థితి మారడంతో ఇప్పడు డాక్టర్ చీటీ కావాలంటున్నారు మందుల దుకాణాల వ్యాపారులు. ఒకటీ రెండు మందు గోలీలకు కూడా డాక్టర్ చీటీ ఎక్కడి నుంచి తేవాలని స్థానికులు వాపోతున్నారు. క్వాలిఫైడ్ డాక్టర్ రాసిన చీటీ ఉంటేనే మందులు ఇవ్వాలి. పైగా బిల్లు కూడా ఇవ్వాలని డ్రగ్ ఇన్స్పెక్టర్ విధించిన నిబంధనలు ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. ఇటీవల సంగారెడ్డి డివిజన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ జహీరాబాద్ మందుల దుకాణాల వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇక నుంచి ఎట్టి పరిస్థితిలో మందులను డాక్టర్ చీటీ లేనిదే ఇవ్వరాదని, ఆలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు పట్టణంలోని ఓ మెడికల్ దుకాణానికి నోటీసులు జారీ చేసి వారం రోజుల పాటు దుకాణం తీయవద్దని హెచ్చరించారు. చీటీ లేకుండా మందులు ఇస్తే ఇక నుంచి నెల రోజుల పాటు దుకాణం తీయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో వ్యాపారులు గత్యంతరం లేక దుకాణాల ముందు నోటీసులు అంటించి, డాక్టర్ చీటీ ఉంటేనే మందులు ఇస్తామంటున్నారు. తలనొప్పి జలుబు తదితర చిన్న సమస్యల గురించి డాక్టర్ వద్దకు ఎలా పోయెదని స్థానికులు వాపోతున్నారు. జనరిక్ మందులకు డాక్టర్ చీటీ కావాలంటూ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ హెచ్చరించడం తగదన్నారు. వ్యాపారులు కూడా ఒకటీ రెండు టాబ్లెట్లు ఇవ్వడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. -
గోలీమాల్
చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో 10 వేల మాత్రలు మాయం! స్టాకు రిజిస్టర్లో దిద్దుబాట్లు సిబ్బంది చేతివాటమా..? పొరపాట్లా? ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన పెద్దాస్పత్రికి అవినీతి జబ్బు సోకింది. కంచే చేను మేసిన చందంగా ఆస్పత్రిలో పనిచేసే కొందరు ఉద్యోగులే అక్రమాలకు పాల్పడుతున్నారు. రోగులకు అందాల్సిన మందులు, మాత్రలను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. వైద్యాధికారుల బాధ్యతా రాహిత్యం.. అధికారుల పర్యవేక్షణ లేమి వారికి కలిసొస్తోంది. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో మాత్రల గోల్‌మాల్‌పై స్పెషల్ ఫోకస్.. ఇదంతా నాణేనికి ఒకవైపు... జిల్లాలోనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రి పెద్దది. ఇక్కడ 320 పడకలున్నాయి. రోజుకు వెయ్యి మందికిపైగా ఔట్ పేషెంట్లు వస్తుంటారు. కోట్ల రూపాయల విలువచేసే పరికరాలతో వైద్యం.. నిత్యం రూ.లక్షల విలువచేసే మందుల పంపిణీ.. అబ్బో ఇదంతా చూస్తుంటే కార్పొరేట్ తరహా సేవలే గుర్తుకొస్తుంటాయి. మరి రెండో వైపు.. ఆస్పత్రిలో జవాబుదారీతనం లేదు. కొందరు వైద్యులు ప్రైవేటు సేవలకే పెద్దపీట వేస్తున్నారు. ఉన్నతాధికారులు సొంత క్లినిక్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకున్న కొందరు ఫార్మాసిస్ట్లు ప్రభుత్వం ఇచ్చే మాత్రలు, మందులను మాయం చేస్తున్నారు. దీని వెనుక ఇక్కడ పనిచేసే కొందరి సిబ్బంది హస్తం ఉందని బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తుండగా.. తిరుపతి నుంచి మాత్రలు ఇచ్చేటప్పుడే స్టాకు తక్కువగా వస్తోందని సిబ్బంది చెబుతున్నారు. చిత్తూరు (అర్బన్): జిల్లాలోని పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉప కేంద్రాలతో పాటు ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులకు తిరుపతిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి మందులు, మాత్రలు సరఫరా అవుతుంటాయి. ప్రతి ఆస్పత్రికి కావాల్సిన మందులు అక్కడి అధికారులు ఇచ్చే ఇండెంట్ ప్రకారం పంపిణీ చేస్తుంటారు. ఈ లెక్కన చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి కూడా మాత్రలు అందుతాయి. ఈ మందుల్లో అమాక్సలిన్, కాల్షియం, బీ-కాంప్లెక్స్ తదితర ఖరీదైన మాత్రలు ఉంటాయి. రోగిలో రోగ నిరోధక శక్తిని అంచనా వేసి వైద్యులు యాంటిబయాటిక్ మాత్రలు రాస్తుంటారు. వీటిని తీసుకెళ్లి ఆస్పత్రిలో ఉన్న మందుల డిస్పెన్సరీ(మందుల పంపిణీ కేంద్రం)లో చూపిస్తే మాత్రలు ఇవ్వడం ఆనవాయితీ. అయితే వైద్యులు రాసిచ్చే చీటీల్లో కొన్ని ఖరీదైన మాత్రలు కూడా ఉంటాయి. ఒక్కో రోగికి ఈ మాత్రలను 10 కూడా ఇవ్వాలని చీటీల్లో రాస్తుంటారు. అయితే వీటిని డిస్పెన్సరీకి తీసుకెళితే ఇక్కడున్న కొందరు సిబ్బంది 10 మాత్రలకు బదులుగా 4, 6 మాత్రమే ఇస్తున్నారు. రోగులు దీనిని పట్టించుకోవకపోవడంతో ఆస్పత్రిలో భారీ ఎత్తున మాత్రలు పోగేశారు. ఇలా దాదాపు 10 వేలకు పైగా మాత్రలు ఆస్పత్రిలో కనిపించకుండా పోయాయి. ఇటీవల ఈ-ఔషధిని ప్రవేశపెట్టడం, ప్రతి రోగికీ ఇచ్చే మాత్రలు, మందులు ఆన్లైన్లో పొందుపరచాలనే నిబంధన రావడంతో అసలు విషయం బయటపడింది. దీనికి తోడు మాత్రల స్టాకు పుస్తుకాల్లో సైతం దిద్దుబాట్లు, కొట్టి వేతలు ఉండడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఒక్కోరోజు అమాక్సలిన్ మాత్రలు 400 పంపిణీ చేస్తే, మరుసటి రోజు ఏకంగా 2500 మాత్రలు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫార్మసీ విభాగంలో ఇప్పటికే రెండు గ్రూపులుగా ఉన్న సిబ్బందిలో.. ఓ వర్గం నిత్యం అధికార పార్టీ నాయకుల పేరు చెప్పి మాత్రలను బయటకు తరలిస్తున్నట్లు ఇక్కడున్న సిబ్బంది చెబుతున్నారు. తిరుపతి నుంచి తమకు మందులు వచ్చేటప్పుడే స్టాకు తక్కువగా ఇస్తున్నారని, దాని ఫలితంగా రోగులకు మాత్రలను తక్కువ ఇవ్వాల్సి వస్తోందని మరికొందరు సిబ్బంది చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వాస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ జయరాజ్ మాట్లాడుతూ.. ఈ విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. మాత్రల స్టాకు వివరాలు, పంపిణీపై విచారణ జరిపిస్తామన్నారు. మాత్రలు పక్కదారి పట్టినట్లు తేలితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు ఈ వ్యవహారంపై లోతుగా విచారణ చేస్తే వాస్తవ విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. -
ఈ మాత్రలతో వైకుంఠయాత్రే!
సాక్షి, హైదరాబాద్: జ్వరం వస్తే పారాసిటిమాల్ వేసుకుంటాం.. ఒళ్లు నొప్పులుంటే బ్రూఫిన్. అవి నాసిరకమైతే పెద్ద నష్టమేం లేదులే అనుకుంటాం. కానీ గుండెపోటు వచ్చే సమయంలో ఇచ్చే మందులు కూడా నాసిరకం అని తేలితే... గుండె ఆగినంత పనవుతుంది. ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసిన మందుల్లో 15 రకాల మందులు నాసిరకమేనని తేలింది! ఆఖరుకు అత్యవసర మందుల్లో ప్రధానమైనదిగా చెప్పుకునే (గుండెపోటు వచ్చే సమయంలో ఇచ్చే) ఐసోసార్బైడ్ డైనైట్రేట్ 10 ఎంజీ కూడా నాసిరకమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 2,500 ప్రభుత్వ ఆస్పత్రులకు ఇలాంటి నాసిరకమైన మందులు సరఫరా అయ్యాయి. కొన్ని కంపెనీలు సరఫరా చేస్తున్న మెట్రొనిడజోల్, బ్రూఫిన్, పారాసిటిమాల్ లాంటి తరచూ వాడే మందులూ నాసిరకం అని తేలాయి. ఔషధ నియంత్రణ శాఖ పరీక్షల్లో తేలినవి ఇవి కొన్ని మాత్రమే. ప్రైవేటు ల్యాబొరేటరీ (టెస్టింగ్ ల్యాబొరేటరీల్లో) లలో నాసిరకం అని తేలినా చర్యలుండవు. ఉభయ రాష్ట్రాల్లోనూ 230 రకాల వరకూ ఎసెన్షియల్ మందులు కొంటారు. ఒక్కో మందు (డ్రగ్)కు సంబంధించి ఒక్కో త్రైమాసికానికి 30 నుంచి 50 బ్యాచ్‌లు టెస్టింగ్ ల్యాబొరేటరీకి పంపించాల్సి ఉంటుంది. మనకు ఔషధ నియంత్రణ (డీసీఏ) ల్యాబొరేటరీతోపాటు మరో ఐదు ప్రైవేటు టెస్టింగ్ ల్యాబొరేటరీలు ఉన్నాయి. అయితే ప్రైవేటు ల్యాబొరేటరీల పరీక్షల్లో నాసిరకం అని తేలితే... మౌలిక వైద్యసదుపాయాల సంస్థలో పనిచేసే ఫార్మసిస్ట్‌లు వెంటనే సరఫరాదారుడికి సమాచారమిస్తారు. ఆ సరఫరాదారుడు నాసిరకం బ్యాచ్ ను పక్కన పడేసేలా చేసి, మరో బ్యాచ్‌ను అనాలసిస్‌కు పంపించి ఓకే అనిపిస్తారు. ఇలా కొన్ని వందల రకాల బ్యాచ్‌లు నాసిరకం అని తేలినా జనానికి ఇచ్చి మింగిస్తూనే ఉన్నారు. మూడేళ్ల పాటు నిషేధం 2014-15 సంవత్సరానికి నాసిరకం మందులుగా తేల్చిన వాటిని మూడేళ్ల పాటు నిషేధం విధిస్తూ ఏపీ, తెలంగాణకు చెందిన మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ, టీఎస్ఎంఎస్ఐడీసీ)లు ప్రకటించాయి. నాసిరకం అని తేలిన రోజు నుంచి మూడేళ్లు అంటే 2017 వరకూ ఆయా కంపెనీలు తయారు చేసే మందులను కొనుగోలు చేయకూడదు. నిషేధం విధించిన మందులే కాకుం డా ఆ కంపెనీ తయారుచేసే ఏ ఇతర ఉత్పత్తులను కూడా కొనుగోలు చేయకూడదనే నిబంధన ఉంది. నాసిరకం అని నిర్ధారణ అయినా చాలా ఆస్పత్రుల్లో ఆ మందులు వినియోగం ఇప్పటికీ అవుతున్నట్టు తేలింది. -
జూలై 29న మార్కెట్లోకి విండోస్ 10 ఓఎస్!
న్యూయార్క్: త్వరలోనే విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) మార్కెట్లోకి రానుంది. సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ జూలై 29న అంతర్జాతీయంగా దాదాపు 190 దేశాల్లోని తన వినియోగదారులకు విండోస్ 10 ఓఎస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. విండోస్ 7, విండోస్ 8.1 ఓఎస్ వినియోగదారులు ఉచితంగానే ఈ విండోస్ 10కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, స్మార్ట్‌ఫోన్స్, డెస్క్‌టాప్స్ వంటి అన్ని మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల్లో విండోస్ 10 ఓఎస్ పనిచేస్తుందని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా విండోస్ ఓఎస్‌ను దాదాపు 150 కోట్ల మంది వినియోగిస్తున్నారు. -
హువాయ్‌తో రిలయన్స్ జియో ఒప్పందం
న్యూఢిల్లీ: 4జీ స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు తదితర పరికరాల విషయమై రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికం విభాగం రిలయన్స్ జియోకామ్, చైనాకు చెందిన హువాయ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ జియో ఈ ఏడాది 5 వేల పట్టణాల్లో, 2 లక్షలకుపైగా గ్రామాల్లో 4జీ సేవలను ప్రారంభించడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ కంపెనీ 4జీ స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఇతర పరికరాలను రిలయన్స్ జియోకు ఎప్పటి నుంచి సరఫరా చేసే అంశంపై (భారత్‌కు దిగుమతి చేసే అంశం) ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఒప్పందంపై అటు రిలయన్స్ జియో కానీ, ఇటు హువాయ్ కంపెనీ కానీ స్పందించలేదు. ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్ల తయారీ కంపెనీలతో క్రియాశీలకంగా కలిసి పనిచేస్తామని రిలయన్స్ జియో ఇదివరకే ప్రకటించింది. రిలయన్స్ జియో ఈ మధ్యనే శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్, ఏస్ టెక్నాలజీస్ కార్ప్ నుంచి పలు వస్తు సేవలను పొంద డం కోసం దాదాపు రూ.4,500 కోట్ల నిధులను సేకరించింది. ఏస్ టెక్నాలజీస్ కార్ప్ టెలికం సంబంధిత పరికరాలను, ఇతర సామాగ్రిని రిలయన్స్ జియోకి సరఫరా చేయనుంది. -
ట్యాబ్లెట్ల టార్గెట్ పిల్లలే..!
దేశీ మార్కెట్లో 10% ఈ సెగ్మెంటే వినోద, విజ్ఞాన యాప్‌లతో ఆకర్ష.. కంటెంట్ కోసం ఒప్పందాలు రూ.10 వేల లోపు ధరలతో ప్రచారం రెండేళ్ల కిందట ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ట్యాబ్లెట్ల హవా మామూలుగా లేదు. బీభత్సమైన మోడళ్లతో కంపెనీలు మార్కెట్‌ను ముంచెత్తాయి. కానీ తక్కువ ధరకే పెద్ద స్క్రీన్లను అందించే ఫోన్లు రంగంలోకి రావటంతో పరిస్థితి మారిపోయింది. ట్యాబ్లెట్ల అమ్మకాలు ఆశించినంతగా పెరగలేదు. దీంతో భవిష్యత్ అంచనాలను కూడా సవరించాల్సి వస్తోంది. మరేం చేయాలి? కంపెనీల ఆలోచన ఇదే. బాగా ఆలోచించాక ఇపుడు ట్యాబ్లెట్ కంపెనీలన్నీ పిల్లలపై గురిపెట్టాయి. వినోదంతో పాటు విజ్ఞానం కూడా అందించే ట్యాబ్లెట్లతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా ట్యాబ్లెట్ పీసీల మార్కెట్ ఏడాదికి 40 లక్షల యూనిట్ల మేర ఉంటోందని అంచనా. ఇందులో పిల్లల విభాగం ట్యాబ్లెట్ పీసీల వాటా 8-10 శాతం మేర అంటే దాదాపు 4 లక్షల యూనిట్ల మేర ఉంటోంది. అందుకే కంపెనీలు ఈ వాటా కోసం పోటీ పడుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం భారత్‌లో పిల్లలు రోజులో సగటున రెండు గంటలు టీవీని చూస్తుండగా... అంతకు మించి ఎక్కువ సమయాన్ని తమ తల్లిదండ్రుల స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లలో గేమ్స్ ఆడుతూ గడుపుతున్నారు. మరోవంక టెక్నాలజీని అందిపుచ్చుకునే మధ్యతరగతి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఈ గణాంకాల్లో దాగి ఉన్న వ్యాపారావకాశాలపై ట్యాబ్లెట్స్ కంపెనీలు కన్నేశాయి. దేశీయంగా ప్రస్తుతం మిటాషీ ఎడ్యుటైన్మెంట్, స్వైప్ టెలికం, ఫ్యూజన్ డైనమిక్స్ వంటి సంస్థలు కిడ్స్ ట్యాబ్లెట్స్ను తయారు చేస్తున్నాయి. మెటిస్ లెర్నింగ్ సంస్థ... చిప్ తయారీ సంస్థ ఇంటెల్‌తో కలిసి ఏడీ పేరుతో ట్యాబ్లెట్స్ తయారు చేస్తోంది. మూడేళ్లు పైబడిన పిల్లల కోసం చోటా భీమ్ పేరిట ఫ్యూజన్ డైనమిక్స్ ట్యాబ్లెట్స్ను అందిస్తోంది. పలు కంపెనీలు ఈ మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నాయి. కంటెంట్‌పై కసరత్తు... పిల్లలను ఆకట్టుకుకోవటంతో పాటు వాటిని తప్పకుండా కొనాలని పెద్దలక్కూడా అనిపించేలా ఆకర్షణీయమైన కంటెంట్‌ను అందించేందుకు కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. మెటిస్ లెర్నింగ్ సంస్థ తమ ఏడీ ట్యాబ్లెట్స్‌లో ప్రముఖ విద్యావేత్తలు సూచించినట్లు... రెండేళ్ల నుంచి పదేళ్ల లోపు పిల్లలు నేర్చుకోతగిన 160 పైచిలుకు లెర్నింగ్ యాప్స్‌ను పొందుపర్చింది. వినో దం, విద్య సంబంధ అంశాలను మరింతగా జోడిం చేందుకు మిటాషీ, స్వైప్ సంస్థలు ఎడ్యుకేషన్ యాప్స్ డెవలపర్లతో కలిసి పనిచేస్తున్నాయి. అలాగే వినోదపరమైన కంటెంట్ కోసం డిస్నీ, వార్నర్ బ్రద ర్స్ వంటి సంస్థలతో మిటాషీ చర్చలు జరుపుతోంది. ఆన్లైన్లో విక్రయాలు: చాలా మటుకు ట్యాబ్లెట్స్ విక్రయాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఆన్లైన్ సంస్థల ద్వారానే జరుగుతున్నాయి. స్వైప్‌కు చెందిన జూనియర్ ట్యాబ్లెట్ పీసీ రేటు రూ.5,749గా ఉంది. చోటా భీమ్ ట్యాబ్లెట్లు రూ.8,499 స్థాయిలో, మిటాషీ స్కై ట్యాబ్-2 రూ.5,999 నుంచి, మెటిస్-ఇంటెల్‌కి చెందిన ఏడీ ట్యాబ్లెట్ పీసీల రేట్లు రూ.9,999 స్థాయిలో ఉన్నాయి. అమ్మకాలు 23.45 కోట్లు! ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) అంచనాల ప్రకారం పర్సనల్ కంప్యూటర్ల అమ్మకాలు తగ్గుతుండగా ఆ స్థానాన్ని ట్యాబ్లెట్లతో పాటు ఫోన్లు, ఫ్యాబ్లెట్లు ఆక్రమిస్తున్నాయి. విండోస్ ప్లాట్‌ఫామ్ ద్వారా తనకున్న అనుకూలతను ఆసరా చేసుకుని ట్యాబ్లెట్ రంగంలో మైక్రోసాఫ్ట్ దూసుకెళుతుందని కూడా ఇది అంచనా వేసింది. ప్రస్తుతం 5.1 శాతంగా ఉన్న మైక్రోసాఫ్ట్ ట్యాబ్లెట్ల వాటా అంతర్జాతీయంగా 2019 నాటికి 14 శాతానికి చేరుతుందని ఐడీసీ పేర్కొంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా 2015లో 23.45 కోట్ల ట్యాబ్లెట్లు అమ్ముడవుతాయి. 2014తో పోలిస్తే ఇది 2.1 శాతం ఎక్కువ. 2019 నాటికి అమ్మకాలు 26.9 కోట్లకు చేరుతాయి. - సాక్షి బిజినెస్ విభాగం