చాలా మంది వెన్నునొప్పికీ, నడుమునొప్పికి లాంటి నొప్పులకు పారాసిటమాల్ (అసిటమైనోఫెన్) తీసుకుంటూ ఉంటారు. హానిలేని మందుగా చాలామంది వైద్యులూ దీన్ని ఫస్ట్‌లైన్ ఆఫ్ ట్రీట్‌మెంట్‌గా ఇస్తూ ఉంటారు. నిజానికి తరచూ పారాసిటమాల్ వాడటం కూడా అంత మంచిది కాదంటున్నారు ఆస్ట్రేలియా అధ్యయనవేత్తలు. దాదాపు 1500 మంది వ్యక్తులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. నడుము, వెన్నునొప్పితో బాధపడుతూ ఉన్న ఆ గ్రూపులోని కొందరికి పారాసిటమాల్ ఇచ్చారు.
ఇంకొందరికి కూడా పారాసిటమాల్ మాత్ర ఇచ్చారు కానీ నిజానికి అందులో ఏ మందూ లేదు. అంటే అసిటమైనోఫెన్ మందులేకుండా జాగ్రత్త తీసుకున్నారన్నమాట. పదిహేడు రోజుల తర్వాత పరీక్షించి చూడగా... నిజానికి మందు తీసుకున్నవారిలోనూ, మందుతీసుకోకుండా కేవలం ‘ప్లాసెబో’ఎఫెక్ట్‌తో ఉపశమనం పొందినవారిలోనూ పెద్దగా తేడా ఏదీ లేదని అధ్యయనవేత్తలు గుర్తించారు. అందుకే నడుము, వెన్ను నొప్పి వచ్చినప్పుడు పైపూత మందులు లేదా ఫిజియో వ్యాయామాలే మంచివంటున్నారు నిపుణులు. ఈ అధ్యయన ఫలితాలు ‘ల్యాన్సెట్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment