paracetamol
-
పారాసిటమాల్ నాసిరకం
న్యూఢిల్లీ: ఒళ్లు కాస్తంత వేడిగా అనిపించినా వెంటనే మింగే మాత్ర పారాసిటమాల్. అది నాసిరకం మాత్ర అని కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) తేల్చింది! పారాసిటమాల్ 500 ఎంజీతో పాటు విటమిన్ సి, విటమిన్ డీ3, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి 53 సర్వసాధారణ ఔషధాల నాణ్యత కూడా ప్రమాణాల మేరకు లేదని ప్రకటించింది. తాజా నెలవారీ నాణ్యతా పరీక్షలో ఇవన్నీ ఫెయిలైనట్టు పేర్కొంది. యాంటీబయాటిక్స్, రక్తపోటు ఔషధాలు, విటమిన్ల మాత్రల్లో కూడా నాణ్యత లోపించిందని వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో డ్రగ్ ఆఫీసర్లు ర్యాండమ్‌గా ఆయా విభాగాల ఔషధాలను చెక్ చేసి ఈ మేరకు నిర్ధారించారు. విటమిన్ సీ సాఫ్ట్‌జెల్స్, ఎసిడిటీ నివారణకు వాడే పాన్ డీతో పాటు చక్కెరవ్యాధికి వాడే గ్లిమిపిరిడిన్. బీపీకి వాడే టెల్మీసార్టాన్ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయోటిక్స్, ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మెగ్ లైఫ్‌సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్‌కేర్, హెటెరో డ్రగ్స్ సహా చాలా ఔషధ తయారీ సంస్థల డ్రగ్స్ పరీక్షల్లో ఫెయిలయ్యాయి. జీర్ణకోశ, ఉదర సంబంధ ఇన్ఫెక్షన్లకు అత్యంత ఎక్కువగా వాడే మెట్రోనిడజోల్ (హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్) కూడా నాణ్యత పరీక్షలో విఫలమైంది. షెల్కాల్ (టోరెంట్ ఫార్మాస్యూటికల్స్), క్లావమ్ 625, పాన్ డీ (ఆల్కెమ్ హెల్త్‌కేర్ సైన్సెస్), పారాసిటమాల్ (కర్ణాటక యాంటీబయోటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్), సెపోడెమ్ చిన్నారులకు తీవ్రమైన బాక్టీరియా ఇన్ఫెక్షన్ చికిత్సకు ఎక్కువగా వాడే ఎక్స్పీ50 (హెటిరో–హైదరాబాద్) కూడా ప్రమాణాలను అందుకోలేకపోయాయని సీడీఎస్సీఓ పేర్కొంది. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న 156 ఫిక్స్ డోస్ డ్రగ్ కాంబినేషన్ ఔషధాలు హానికరమంటూ సీడీఎస్సీఓ వాటిని గత ఆగస్ట్‌లో నిషేధించడం తెల్సిందే. సర్వసాధారణంగా వాడే జ్వరం మందులు, నొప్పి నివారిణులు, అలర్జీని తగ్గించే ఔషధాల వంటివి వాటిలో ఉన్నాయి. -
జ్వరం గోలీకి ధరల సెగ!
సాక్షి, హైదరాబాద్: నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇప్పటికే విలవిల్లాడుతున్న సగటు జీవిపై మందుల భారం కూడా పడనుంది. జ్వరం బిళ్ల మొదలు బీపీ గోలీ వరకు సామాన్యులు ఎక్కువగా వినియోగించే దాదాపు 800 రకాల షెడ్యూల్డ్ మందులపై కేంద్రం ధరాభారం మోపింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆయా మందుల ధరలను 10.76 శాతం మేర పెంచుకొనేందుకు అనుమతిచ్చింది. 2020తో పోలిస్తే 2021 క్యాలెండర్ సంవత్సరానికి టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ)లో 10.7 శాతం మేర వచ్చిన మార్పునకు అనుగుణంగా ధరలను సవరించుకొనేందుకు సంబంధిత వర్గాలకు అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) మెమొరాండం విడుదల చేసింది. ఎక్కువ మంది వినియోగించేవే పెరుగుతాయి... జ్వరం, ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, చర్మవ్యాధులు, అనీమియా వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే అత్యవసర ఔషధాల ధరలన్నీ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెరుగుతాయి. ఇవిగాకుండా అత్యధికంగా వినియోగంలో ఉండే పారాసిటమాల్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనిడజోల్ వంటి ఔషధాల ధరలు కూడా పెరుగుతాయి. బలం కోసం వినియోగించే మల్టీ విటమిన్ల మందుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి నుంచే వేగంగా పెరుగుదల... దేశంలో ఔషదాల ధరల పెరుగుదల రెండేళ్లుగా కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి లాక్డౌన్, అనంతర పరిస్థితులకు అనుగుణంగా పలు రకాల మందుల ధరలు 20 శాతం దాకా పెరిగాయి. -
డోలో 650 సంచలనం.. సేల్స్‌తో సరికొత్త రికార్డు!
మన ఇంట్లో ఎవరికైన తలనొప్పి, ఒంటి నొప్పులు, జ్వరం ఇలా ఏదైనా సరే వస్తే వెంటనే మనందరికీ డోలో 650 గుర్తుకొస్తుంది ఇప్పుడు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు దీనిని ఎక్కువగా వాడేస్తునారు ప్రజలు. మన దేశంలో అత్యంత ఆదరణ పొందిన మెడిసిన్‌గా డోలో 650 ఆవిర్భవించింది. ఈ మహమ్మారి కాలంలో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన మెడిసిన్‌గా నిలిచింది. మార్చి 2020 నుంచి అమ్మకాల పరంగా ఈ డోలో 650 తిరుగులేకుండా దూసుకుపోతుంది. డోలో 650 అనేది ఒక ప్రసిద్ధ పెయిన్ కిల్లర్, ఇది దాదాపు ప్రతి ఇంటిలో కనిపిస్తుంది. ఒంటి నొప్పులు, తలనొప్పి, జ్వరాలకు దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. అయితే డాక్టర్ల సూచన లేకుండా ఎక్కువగా వాడడం అస్సలు మంచిది కాదు!. 2020లో కోవిడ్-19 వ్యాప్తి చెందినప్పటి నుంచి భారతదేశం యాంటీ ఫీవర్ ఔషధం డోలో 650లను 350 కోట్ల మాత్రలకు పైగా విక్రయించింది. ఈ మొత్తం 3.5 బిలియన్ మాత్రలను నిలువుగా పేర్చితే ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం కంటే దాదాపు 6,000 రెట్లు ఎక్కువ ఎత్తు లేదా ప్రపంచంలోని ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా ఎత్తుకు 63,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. గత రెండు సంవత్సరాలలో డోలో 1.5 సెం.మీ పొడవైన పారాసెటమాల్ టాబ్లెట్, క్రోసిన్ కంటే చాలా ఎక్కువ అమ్ముడైనది. పరిశోధన సంస్థ ఐక్యూవిఏ గణాంకాలప్రకారం.. 2019 లో కోవిడ్-19 వ్యాప్తికి ముందు కంటే భారతదేశంలో సుమారు 75 మిలియన్ స్ట్రిప్‌ల డోలో మాత్రలను విక్రయించింది. ప్రస్తుతం కోవిడ్-19 రోగులకు సిఫారసు చేసిన ఈ డోలో 2021లో రూ.307 కోట్ల టర్నోవర్ నమోదు చేసినట్లు తెలుస్తుంది. డోలో ప్రస్తుతం భారతదేశంలో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన యాంటీ ఫీవర్ మరియు అనల్జెసిక్ టాబ్లెట్. దీని కంటే ముందు వరుసలో Calpol ఉంది. ఈ ట్యాబ్లెట్ కి సంబంధించి మిమ్స్ కూడా ట్విట్టర్లో తెగ వైరల్ అవుతున్నాయి. #డోలో650 అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ లో ఉంది. 🤣🤣 pic.twitter.com/u983mrmfWx — Bollywoodirect (@Bollywoodirect) January 18, 2022 This is why #dolo650 is trending ? pic.twitter.com/4BywaCnmuc — Nocturnal Soul (@Mirage_gurrl) January 7, 2022 (చదవండి: వచ్చే 12 నెలల్లో రూ.1,50,000కు చేరుకొనున్న బంగారం ధర..!) -
టీనేజర్లకు టీకా తర్వాత పారాసిటమాల్ అక్కర్లేదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టీనేజీ వయసు వారికి ఇస్తున్న కోవాగ్జిన్ కోవిడ్ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ బుధవారం ఒక స్పష్టతనిచ్చింది. ‘కోవాగ్జిన్ టీకా తీసుకున్న టీనేజర్లకు కొన్ని టీకా కేంద్రాలు.. పారాసిటమాల్ 500 ఎంజీ ట్యాబ్లెట్లు మూడు, పెయిన్ కిల్లర్లు తీసుకోవాలని సూచిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. నిజానికి పిల్లలు కోవాగ్జిన్ తీసుకున్నాక వారికి పారాసిటమాల్, పెయిన్ కిల్లర్లు ఇవ్వాల్సిన పని లేదు. అవి అనవసరం’ అని సంస్థ పేర్కొంది. టీనేజర్లు మందులు తీసుకోవాలనుకుంటే వైద్యుణ్ణి సంప్రదించి, వారి సలహా మేరకే తీసుకోవాలని సంస్థ సూచించింది. -
తరచూ పారాసిటమాల్ తీసుకున్నా ప్రయోజనం సున్నా!
చాలా మంది వెన్నునొప్పికీ, నడుమునొప్పికి లాంటి నొప్పులకు పారాసిటమాల్ (అసిటమైనోఫెన్) తీసుకుంటూ ఉంటారు. హానిలేని మందుగా చాలామంది వైద్యులూ దీన్ని ఫస్ట్‌లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా ఇస్తూ ఉంటారు. నిజానికి తరచూ పారాసిటమాల్ వాడటం కూడా అంత మంచిది కాదంటున్నారు ఆస్ట్రేలియా అధ్యయనవేత్తలు. దాదాపు 1500 మంది వ్యక్తులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. నడుము, వెన్నునొప్పితో బాధపడుతూ ఉన్న ఆ గ్రూపులోని కొందరికి పారాసిటమాల్ ఇచ్చారు. ఇంకొందరికి కూడా పారాసిటమాల్ మాత్ర ఇచ్చారు కానీ నిజానికి అందులో ఏ మందూ లేదు. అంటే అసిటమైనోఫెన్ మందులేకుండా జాగ్రత్త తీసుకున్నారన్నమాట. పదిహేడు రోజుల తర్వాత పరీక్షించి చూడగా... నిజానికి మందు తీసుకున్నవారిలోనూ, మందుతీసుకోకుండా కేవలం ‘ప్లాసెబో’ఎఫెక్ట్‌తో ఉపశమనం పొందినవారిలోనూ పెద్దగా తేడా ఏదీ లేదని అధ్యయనవేత్తలు గుర్తించారు. అందుకే నడుము, వెన్ను నొప్పి వచ్చినప్పుడు పైపూత మందులు లేదా ఫిజియో వ్యాయామాలే మంచివంటున్నారు నిపుణులు. ఈ అధ్యయన ఫలితాలు ‘ల్యాన్సెట్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
అమెరికాలో మృత్యుఘోష
వాషింగ్టన్/వూహాన్/లండన్/ఇస్తాంబుల్: అమెరికాలో కోవిడ్–19 విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 18,860 మంది మృతి చెందారు. ప్రాణాంతక ఈ వైరస్ సోకి 40 మందికి పైగా భారతీయ సంతతికి చెందిన వారు మరణించారు. వీరిలో12 మంది వరకు భారతీయ పౌరులు ఉన్నట్టు తెలుస్తోంది. కోవిడ్‌తో కన్నుమూసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఇద్దరు, కేరళకు చెందిన వారు 17 మంది, గుజరాతీయులు 10 మంది, నలుగురు పంజాబీయులు, ఒడిశాకు చెందిన వారు ఒకరు ఉన్నారు. మృతుల్లో అత్యధికులు 60 ఏళ్లకు పై బడిన వారే. 21 ఏళ్ల వయసున్న వ్యక్తి కూడా మృతుల్లో ఉన్నారు. న్యూయార్క్‌లో వెయ్యి మందికిపైగా, న్యూజెర్సీలో 400 మందికి పైగా ఇండియన్ అమెరికన్లకు వైరస్ సోకింది. కోవిడ్ బాధితులకు సాయం చేయడానికి ఇప్పటికే పలు ప్రవాస భారతీయ సంస్థలు రంగంలోకి దిగాయి. స్థానిక యంత్రాంగంతో కలిసి తమ వంతు సాయం అందిస్తున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీలోని మినీ ఇండియాగా పిలిచే ఓక్ ట్రీ రోడ్డులో మృతుల సంఖ్య అత్యధికంగా ఉంది. న్యూయార్క్‌లో 15 మంది, న్యూజెర్సీలో 12 మందికి పైగా, ఫ్లోరిడా, పెన్సిల్వేనియాలో నలుగురు చొప్పున, టెక్సాస్, కాలిఫోర్నియాలో ఒక్కొక్కరు మరణించినట్టు అమెరికాలో స్థానిక అధికారులు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్ని గతంలో ఎప్పుడూ చూడలేదని ఓక్ ట్రీ రోడ్డులో వ్యాపారం చేస్తున్న ప్రవాస భారతీయుడు భవేష్ దవే అన్నారు. ప్రాణాలు కోల్పోయిన భారతీయుల్లో సున్నోవా అనలిటికల్ సీఈవో మారేపల్లి హనుమంతరావు, న్యూజెర్సీ పారిశ్రామికవేత్త చంద్రకాంత్ అమిన్(75), మహేంద్ర పటేల్ (60) ఉన్నారు. మరికొందరు భారతీయుల పరిస్థితి విషమంగా ఉండడంతో ప్లాస్మా డోనర్ల కోసం పలు ప్రవాస భారతీయ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు న్యూజెర్సీలో ఉంటున్న నీల పాండ్య అనే గుజరాతీ మహిళ తన కుటుంబానికి చెందిన అయిదుగురు కోవిడ్‌తో పోరాడుతున్నారని, బెడ్స్ కొరత కారణంగా వారిలో ఇద్దరినే ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారంటూ ఆమె ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. కోవిడ్‌ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని, నిర్లక్ష్యం వద్దంటూ ఆమె పెట్టిన వీడియో భారతీయ సంతతి వారిలో గుబులు రేపుతోంది. మరోవైపు అమెరికా ఒకే రోజు 2,104 మరణాలు నమోదైన తొలి దేశంగా నిలిచింది. యూకేకి పారాసెటమాల్ మాత్రలు యూకేకి తొలి విడతగా 30 లక్షల పారాసెటమాల్ ప్యాకెట్లు ఆదివారం చేరుకోనున్నాయి. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మందుల ఎగుమతులపై ఆంక్షల్ని తొలిగించిన భారత ప్రభుత్వం వెంటనే పారాసెటమాల్ ట్యాబ్లట్లను పంపింది.ఈ మందులు ఆదివారానికి చేరుకుంటాయని బ్రిటన్ విదేశాంగ శాఖ అధికారి వెల్లడించారు. కోవిడ్‌తో బాధపడుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం మరింత మెరుగుపడిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్‌ను జయించిన 93 ఏళ్ల అవ్వ టర్కీకి చెందిన 93 ఏళ్ల వయసున్న అల్యే గుండాజ్ కోవిడ్‌ను జయించారు. పది రోజుల పాటు కోవిడ్‌తో పోరాటం చేసిన ఆమె ఆ వ్యాధి నుంచి బయటపడ్డారు. ఇస్తాంబుల్ ఆస్పత్రి నుంచి ఆ వృద్ధురాలిని డిశ్చార్జ్ చేసిన సమయంలో అందరిలోనూ ఈ మహమ్మారిని ఎదుర్కోగలమన్న ఆశాభావం కలిగింది.. వైద్య సిబ్బంది చేసిన కృషికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. చైనాలో మళ్లీ వైరస్ భయం కరోనా వైరస్ భయం మళ్లీ చైనాలో మొదలైంది. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి వందలాది మంది చైనీయులు తిరిగి స్వస్థలాలకు చేరుకోవడంతో వారి ద్వారా రెండోసారి వైరస్ విజృంభిస్తుందనే ఆందోళనలో ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సోకిన కేసులు 1,183కి చేరుకోవడంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఈ అంకెలు శనివారం రాత్రి 11 గంటలకు.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు: 17,16,674 మరణాలు :1,07,637 కోలుకున్న వారు : 3,95,586 -
కరోనా: పారాసిట్మాల్తో అద్భుత ఫలితం
తిరువనంతపురం : దేశంలో కరోనా వైరస్ రోజురోజుకూ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన ఈ మహ్మమారి.. 11 వేలమందికి పైగా ప్రజలను బలితీసుకుంది. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్‌కు విరుగుడును కనిపెట్టేందుకు ప్రపంచ దేశాల అధినేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఎంతటి రోగానైనా ఆయుర్వేదంతో అడ్డుకట్టే కేరళ కరోనాను నివారించడంలోనూ కొంతమేర విజయం సాధిస్తోంది. ఈసారి ఆయుర్వేద వైద్యం కాకుండా కరోనాపై పారాసిట్మాల్తో యుద్ధం చేసి.. మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. భారత్‌లో నమోదైన తొలి మూడు కేసులూ కేరళ రాష్ట్రంలోనే నమోదైన విషయం తెలిసిందే. అయితే చైనా అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బాధితులుపై పారాసిట్మాల్ను ప్రయోగించినట్లు కేరళ వైద్యులు తెలిపారు. (ట్రంప్ గుడ్‌న్యూస్.. కరోనాకు విరుగుడు..!) కేరళ బాటలో మరిన్ని రాష్ట్రాలు.. తొలుత వైరస్ బారిన పడిన వారు తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరారని, వారందరికీ దగ్గు మందుతో కలిపి పారాసిట్మాల్ వాడినట్లు డాక్టర్ అమర్‌ఫ్టెట్లే వెల్లడించారు. 4 రోజుల పాటు ఇవే మందులను వాడామని, వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చిందని తెలిపారు. మరోవైపు కేరళలో కరోనా బాధితుల సంఖ్య 40 చేరిందని, వారిందరికీ కూడా పారాసిట్మాల్ వాడుతున్నామని చెప్పారు. అయితే ప్రపంచంలోనే కాక భారత్‌లోనూ ఇప్పటి వరకు కరోనాకు సరైన వాక్సిన్ కనిపెట్టకపోవడంతో.. పలు రాష్ట్రాలు కూడా కేరళ బాటలోనే నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ప్రఖ్యాత రాంమనోహర్ లోహియా వైద్యులు కూడా కేరళ వైద్యులను సంప్రదించి.. సలహాలు, సూచనలు తీసుకున్నారు. కాగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికా వైద్యులు తయారుచేస్తున్న వాక్సిన్ మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. -
కరోనాపై పారాసిట్మాల్తో యుద్ధం చేసి..
-
పారాసిటమాల్ మింగి.. దర్జాగా ఇంటికి..!
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి వస్తున్నవారు విమానం దిగాక థర్మల్ స్క్రీనింగ్‌కు దొరక్కుండా ఉండేందుకు జ్వరానికి ఉపయోగించే పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటున్నారు. విమానం దిగేందుకు గంట ముందు ఈ మాత్రలు వేసుకుంటున్నారు. దీంతో శరీర ఉష్ణోగ్రతలు తగ్గి స్క్రీనింగ్‌లో దొరక్కుండా ఇదో ఉపాయాన్ని వెతుక్కుంటున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్న వారిని ‘సీ’కేటగిరీ కింద భావించి నేరుగా ఇళ్లకు పంపుతారు. ఇంటి దగ్గరే ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. (తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు) జ్వరం ఉంటే ఎక్కడ గాంధీ ఆస్పత్రి లేదా క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుందోననే భయంతో మరోదారిలో బయటపడుతున్నారు. ఈ విషయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చింది. ఇదే విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసింది. ఇలాంటి కేసుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రెండ్రోజుల కిందట ఇలాగే దుబాయి నుంచి వచ్చిన ఓ వ్యక్తి పారాసిటమాల్ వేసుకొని, థర్మల్ స్క్రీనింగ్‌కు దొరక్కుండా నేరుగా ఇంటికే వెళ్లాడు. దీనిపై ఒకరు వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు. (కరోనా.. కోటి రూపాయల నజరానా) యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుండంతో విమానాశ్రయాలతో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ప్రదేశాల్లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు, పార్లమెంట్ సహా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. కోవిడ్-19 అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. (కరోనా: తెర వెనుక హీరోపై ప్రశంసలు) -
కరోనా రోగికి ఇచ్చే మందు ఏంటో తెలుసా..?
-
డెంగ్యూనా? 650 ఎంజీ పారాసిటమాల్ వేసుకోండి!
డెహ్రాడూన్: ఎక్కడ చూసినా డెంగ్యూ ఫీవర్ హడలెత్తిస్తోంది. ఉత్తరాఖండ్‌ను డెంగ్యూ వణికిస్తోంది. వందలసంఖ్యలో రోగులు డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతూ.. ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 4,800 మందికి డెంగ్యూ ఫీవర్ సోకినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా డెహ్రాడూన్ ప్రాంతంలో డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ మూడువేల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక తర్వాతి స్థానంలో హల్ద్వానీ ప్రాంతం ఉంది. ఇక్కడ 1100 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ తగ్గడం లేదా.. ఐతే.. ఉత్తరాఖండ్‌ను డెంగ్యూ వణికిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. డెంగ్యూ ఫీవర్ తగ్గకపోతే.. 500 ఎంజీకి బదులు, 650 ఎంజీ పారసిటమాల్ ట్యాబెట్లు వేసుకోవాలని, డెంగ్యూ తగ్గిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. డెంగ్యూ రాష్ట్రంలో తీవ్రస్థాయిలో పెచ్చరిల్లిందని, ఈ నేపథ్యంలో 650 ఎంజీ పారాసిటమాల్ వేసుకొని.. విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గిపోతుందని రావత్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో డెంగ్యూ కారణంగా ఎనిమిది మంది చనిపోయినట్టు గతవారం ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించగా.. సీఎం రావత్ మాత్రం కేవలం నలుగురే చనిపోయారని చెప్పుకొచ్చారు. -
పారాసిట్మాల్తో ఆస్తమా!
మెల్బోర్న్: బాల్యంలో పారాసిట్మాల్ తీసుకున్న వారికి భవిష్యత్తులో ఆస్తమా వచ్చే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. రెండేళ్ల వయసు వరకు పారసిట్మాల్ తీసుకున్న పిల్లల్లో 18 ఏళ్ల వయసు దాటాక ఆస్తమా లక్షణాలు పరిశోధకులు గుర్తించారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేపట్టారు. కుటుంబంలో ఒక్కరికైనా ఆస్తమా ఉన్న వారి పిల్లలను పుట్టక ముందే ఎంచుకున్నారు. ఇలా 620 మంది పిల్లలపై పుట్టినప్పటి నుంచి 18 ఏళ్లు వచ్చే వరకు అధ్యయనం చేపట్టారు. అయితే పారసిట్మాల్ తీసుకోని వారిలో ఆస్తమా లేదని పరిశోధకులు తెలిపారు. ఫలితాలపై స్పష్టత రానందున పారసిట్మాల్ వాడకంపై మార్గదర్శకాలు జారీ చేసేందుకు ఇంకా పరిశోదనలు జరపాల్సి ఉందన్నారు. -
పారాసిట్మాల్ వద్దు.. బీరే ముద్దు
లండన్: బీర్ ప్రియులకు శుభవార్త.... నొప్పులతో బాధపడుతుంటే ఇష్టమైన బీర్‌ను 2 గ్లాసులు తీసుకుంటే చాలు ఎటువంటి పారాసిట్మాల్ అవసరం లేదని ఒక పరిశోధనలో తేలింది. బ్రిటన్‌కు చెందిన గ్రీన్విచ్ యూనివర్సిటీ పరిశోధకులు 404మందిపై పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని కనుగొన్నారు.మెదడు రిసెప్టర్స్పై బీరు ప్రభావం చూపి నొప్పి తగ్గిస్తుందా లేదా ఆత్రుతను తగ్గించి ఇబ్బందిని తొలగిస్తుందా అన్న దానిపై వారు స్పష్టతకు రాలేకపోయారు. బీరును ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత తక్కువ నొప్పి అనుభవించారని వారి పరిశోధనలో తేలింది. నిరంతరం నొప్పితో బాధపడేవారు కొంత మొత్తంలో మద్యం తీసుకోవచ్చని నిర్ధారించారు. -
పారాసిటమాల్‌తో పిల్లలపై దుష్ప్రభావం
లండన్: కాస్త ఒళ్లు వెచ్చబడగానే వేసుకునే ట్యాబ్లెట్ పారాసిటమాల్. అయితే దీనిని గర్భధారణ సమయంలో ఎక్కువగా వినియోగించడంవల్ల పుట్టబోయే పిల్లల్లో దుష్ఫలితాలు కలుగుతాయంటున్నారు వైద్యనిపుణులు. స్పెయిన్‌లోని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎన్విరాన్మెంటల్ ఎపిడమాలజీకి చెందిన పరిశోధకులు 2644 మంది మహిళలపై పరిశోధన చేసి పలు విషయాలను వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. మొదటి 32 వారాలు పారాసిటమాల్ వాడిన గర్భవతులకు పుట్టిన పిల్లల్లో 43 శాతం మంది చిన్నారుల్లో ఏడాదికి, 41 శాతం పిల్లల్లో ఐదేళ్లకు ఈ ప్రభావం కనిపించింది. శారీకంగా రోగనిరోధక శక్తి దెబ్బతినడమే కాకుండా మానసికంగా కూడా దుష్ఫలితాలు కనిపించాయి. ప్రధానంగా ఆటిజం వంటి సమస్యకు పారాసిటమాల్ కారణమని తేలింది. పెద్దగా ఏ విషయంపైనా ఆసక్తి చూపకపోవడం, లేదంటే అతిగా ఆసక్తి ప్రదర్శించడం, తీవ్ర భావోద్వేగాలు వంటివి కూడా పారాసిటమాల్ తాలూకు ప్రభావాలే. -
వికటించిన ఆర్ఎంపీ వైద్యం
► అస్వస్థతకు గురైన కాంబ్లె దేవుబాయి ► ఐటీడీఏ అంబులెన్స్‌లో ఉట్నూర్ ఆస్పత్రికి తరలింపు వారు అమాయక గిరిజనులు.. డాక్టర్లలో ఎంబీబీఎస్‌లు, ఎండీలు, ఆర్ఎంపీలు, పీఎంపీలు ఉంటారని కూడా తెలియని అమాయకత్వం వాళ్లది. వా రి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది డబ్బు పోగుచేసుకుంటున్నారు. వచ్చీరాని వైద్యంతో గిరిజన ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఏడాదో ఆర్నెల్లో ప్రయివేటు ఆస్పత్రిలో పని చేసి మెడలో స్టెతస్కోపు వేసుకుని తిరుగుతున్నారు. కనీస అర్హతలు లేకున్నా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నార్నూర్ : మండల కేంద్రంలోని హరిఓం క్లినిక్‌లో ఆర్ఎంపీ వైద్యుడు గురువారం కొలామా గ్రామానికి చెందిన కాంబ్లె దేవుబాయికి వైద్యం అందించారు. వైద్యం వికటించడంతో ఆమె ఆస్వస్థతకు గురైంది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రభుత్వ వైద్యుడు శ్రీనివాస్ వైద్య పరీక్షలు నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఐటీడీఏ అంబులెన్స్‌లో ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యం వికటించడంతోనే ఆమె ఆస్వస్థతకు గురైందని ప్రభుత్వ వైద్యుడు శ్రీనివాస్ తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు బలిరాం, కాంబ్లె సుభాస్, భగవాన్లు తెలిపిన వివరాల ప్రకారం దేవుబాయికి జ్వరంతో పాటు కాళ్లు, చేతులకు నొప్పులు రావడంతో ఆర్ఎంపీ దగ్గరకి తీసుకెళ్లామని తెలిపారు. గ్లోకోజ్ బాటిల్ ఎక్కించి, మూడు ఇంజక్షన్లు ఇచ్చి రెండు మాత్రలు ఇచ్చినట్లు తెలిపారు. ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని టెస్టుల పేరిట దండుకుంటున్నారని తెలుస్తోంది. మండలంలోని ఉమ్రి గ్రామానికి చెందిన అడే ఆశ్వర్య అనే బాలికను ఈ వైద్యుడే వైద్య పరీక్షలు నిర్వహించారు. మలేరియా నేగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ బాలికను ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించగా వైద్యుడు శ్రీనివాస్ మూడు సార్లు రక్త పరీక్షలు నిర్వహించగా మలేరియా నేగిటివ్గా నిర్ధారించారు. మలేరియా ఉదంటూ ఆర్ఎంపీ వైద్యుడు రూ. 200 తీసుకున్నారని బాలిక తల్లి అడే సంగీత తెలిపారు. కనీస అవగాహన లేని వైద్యులు వైద్యం పేరిట గిరిజన, దళితులను ఎలా మోసం చేస్తున్నారో తెలుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్యశాఖ అధికారులు ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ విషయమై ఆఎంపీ వైద్యుడు సర్కార్‌ను వివరణ కోరగా యాపిల్ ఇంజక్షన్ ఇచ్చి రెండు పారాసిటమాల్ మాత్రలు మాత్రమే ఇచ్చానని తెలిపారు. దేవుబాయి పరిస్థితి బాగానే ఉందని, వైద్యం అందించడంలో ఏ పొరపాటు జరగలేదని ఆర్ఎంపీ వివరణ ఇచ్చారు. -
ఈ మాత్రలతో వైకుంఠయాత్రే!
సాక్షి, హైదరాబాద్: జ్వరం వస్తే పారాసిటిమాల్ వేసుకుంటాం.. ఒళ్లు నొప్పులుంటే బ్రూఫిన్. అవి నాసిరకమైతే పెద్ద నష్టమేం లేదులే అనుకుంటాం. కానీ గుండెపోటు వచ్చే సమయంలో ఇచ్చే మందులు కూడా నాసిరకం అని తేలితే... గుండె ఆగినంత పనవుతుంది. ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసిన మందుల్లో 15 రకాల మందులు నాసిరకమేనని తేలింది! ఆఖరుకు అత్యవసర మందుల్లో ప్రధానమైనదిగా చెప్పుకునే (గుండెపోటు వచ్చే సమయంలో ఇచ్చే) ఐసోసార్బైడ్ డైనైట్రేట్ 10 ఎంజీ కూడా నాసిరకమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 2,500 ప్రభుత్వ ఆస్పత్రులకు ఇలాంటి నాసిరకమైన మందులు సరఫరా అయ్యాయి. కొన్ని కంపెనీలు సరఫరా చేస్తున్న మెట్రొనిడజోల్, బ్రూఫిన్, పారాసిటిమాల్ లాంటి తరచూ వాడే మందులూ నాసిరకం అని తేలాయి. ఔషధ నియంత్రణ శాఖ పరీక్షల్లో తేలినవి ఇవి కొన్ని మాత్రమే. ప్రైవేటు ల్యాబొరేటరీ (టెస్టింగ్ ల్యాబొరేటరీల్లో) లలో నాసిరకం అని తేలినా చర్యలుండవు. ఉభయ రాష్ట్రాల్లోనూ 230 రకాల వరకూ ఎసెన్షియల్ మందులు కొంటారు. ఒక్కో మందు (డ్రగ్)కు సంబంధించి ఒక్కో త్రైమాసికానికి 30 నుంచి 50 బ్యాచ్‌లు టెస్టింగ్ ల్యాబొరేటరీకి పంపించాల్సి ఉంటుంది. మనకు ఔషధ నియంత్రణ (డీసీఏ) ల్యాబొరేటరీతోపాటు మరో ఐదు ప్రైవేటు టెస్టింగ్ ల్యాబొరేటరీలు ఉన్నాయి. అయితే ప్రైవేటు ల్యాబొరేటరీల పరీక్షల్లో నాసిరకం అని తేలితే... మౌలిక వైద్యసదుపాయాల సంస్థలో పనిచేసే ఫార్మసిస్ట్‌లు వెంటనే సరఫరాదారుడికి సమాచారమిస్తారు. ఆ సరఫరాదారుడు నాసిరకం బ్యాచ్ ను పక్కన పడేసేలా చేసి, మరో బ్యాచ్‌ను అనాలసిస్‌కు పంపించి ఓకే అనిపిస్తారు. ఇలా కొన్ని వందల రకాల బ్యాచ్‌లు నాసిరకం అని తేలినా జనానికి ఇచ్చి మింగిస్తూనే ఉన్నారు. మూడేళ్ల పాటు నిషేధం 2014-15 సంవత్సరానికి నాసిరకం మందులుగా తేల్చిన వాటిని మూడేళ్ల పాటు నిషేధం విధిస్తూ ఏపీ, తెలంగాణకు చెందిన మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ, టీఎస్ఎంఎస్ఐడీసీ)లు ప్రకటించాయి. నాసిరకం అని తేలిన రోజు నుంచి మూడేళ్లు అంటే 2017 వరకూ ఆయా కంపెనీలు తయారు చేసే మందులను కొనుగోలు చేయకూడదు. నిషేధం విధించిన మందులే కాకుం డా ఆ కంపెనీ తయారుచేసే ఏ ఇతర ఉత్పత్తులను కూడా కొనుగోలు చేయకూడదనే నిబంధన ఉంది. నాసిరకం అని నిర్ధారణ అయినా చాలా ఆస్పత్రుల్లో ఆ మందులు వినియోగం ఇప్పటికీ అవుతున్నట్టు తేలింది. -
ప్రయోజనం లేని పారాసిటమాల్!
నొప్పి నివారణకు నో యూజ్ చాలా మంది వెన్నునొప్పికీ, నడుమునొప్పికి పారాసిటమాల్ మేలు అనుకుని ముందస్తు చికిత్సగా ఆ మాత్ర మింగుతుంటారు. కానీ నిజానికి పారాసిటమాల్ వాడటం కూడా అంత మంచిది కాదంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన నిపుణులు. సగటు వయసు 45 ఉన్న 1,652 మంది రోగులపై నిర్వహించిన అధ్యయనంలో నడుము, వెన్ను నొప్పితో బాధపడే వారిలో కొందరికి పారాసిటమాల్ ఇచ్చారు. మరికొందరికి పారాసిటమాల్ మాత్ర ఇచ్చారు కానీ అందులో మందు లేదు. 17 రోజుల తర్వాత పరీక్షించి చూడగా... నిజానికి మందు తీసుకున్నవారిలోనూ, మందుతీసుకోకుండా కేవలం ‘ప్లాసెబో’ఎఫెక్ట్‌తో ఉపశమనం పొందినవారిలోనూ పెద్దగా ఎలాంటి తేడా లేదని అధ్యయనవేత్తలు గుర్తించారు. (ప్లాసెబో ఎఫెక్ట్ అంటే మందు వాడకపోయినా వాడామనే అనుభూతి వల్లనే సాంత్వన పొందడం). పై నొప్పులకు ఫిజియోథెరపీయే మంచి చికిత్స అంటున్నారు నిపుణులు.