
మెల్‌బోర్న్: బాల్యంలో పారాసిట్‌మాల్ తీసుకున్న వారికి భవిష్యత్తులో ఆస్తమా వచ్చే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. రెండేళ్ల వయసు వరకు పారసిట్‌మాల్ తీసుకున్న పిల్లల్లో 18 ఏళ్ల వయసు దాటాక ఆస్తమా లక్షణాలు పరిశోధకులు గుర్తించారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేపట్టారు. కుటుంబంలో ఒక్కరికైనా ఆస్తమా ఉన్న వారి పిల్లలను పుట్టక ముందే ఎంచుకున్నారు. ఇలా 620 మంది పిల్లలపై పుట్టినప్పటి నుంచి 18 ఏళ్లు వచ్చే వరకు అధ్యయనం చేపట్టారు. అయితే పారసిట్‌మాల్ తీసుకోని వారిలో ఆస్తమా లేదని పరిశోధకులు తెలిపారు. ఫలితాలపై స్పష్టత రానందున పారసిట్‌మాల్ వాడకంపై మార్గదర్శకాలు జారీ చేసేందుకు ఇంకా పరిశోదనలు జరపాల్సి ఉందన్నారు.