పారాసిట్మాల్ వద్దు.. బీరే ముద్దు
లండన్: బీర్ ప్రియులకు శుభవార్త.... నొప్పులతో బాధపడుతుంటే ఇష్టమైన బీర్‌ను 2 గ్లాసులు తీసుకుంటే చాలు ఎటువంటి పారాసిట్మాల్ అవసరం లేదని ఒక పరిశోధనలో తేలింది.
బ్రిటన్‌కు చెందిన గ్రీన్‌విచ్ యూనివర్సిటీ పరిశోధకులు 404మందిపై పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని కనుగొన్నారు.మెదడు రిసెప్టర్స్‌పై బీరు ప్రభావం చూపి నొప్పి తగ్గిస్తుందా లేదా ఆత్రుతను తగ్గించి ఇబ్బందిని తొలగిస్తుందా అన్న దానిపై వారు స్పష్టతకు రాలేకపోయారు. బీరును ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత తక్కువ నొప్పి అనుభవించారని వారి పరిశోధనలో తేలింది. నిరంతరం నొప్పితో బాధపడేవారు కొంత మొత్తంలో మద్యం తీసుకోవచ్చని నిర్ధారించారు.