
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టీనేజీ వయసు వారికి ఇస్తున్న కోవాగ్జిన్ కోవిడ్ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ బుధవారం ఒక స్పష్టతనిచ్చింది. ‘కోవాగ్జిన్ టీకా తీసుకున్న టీనేజర్లకు కొన్ని టీకా కేంద్రాలు.. పారాసిటమాల్ 500 ఎంజీ ట్యాబ్లెట్లు మూడు, పెయిన్ కిల్లర్లు తీసుకోవాలని సూచిస్తున్నట్లు మాకు సమాచారం అందింది.
నిజానికి పిల్లలు కోవాగ్జిన్ తీసుకున్నాక వారికి పారాసిటమాల్, పెయిన్ కిల్లర్లు ఇవ్వాల్సిన పని లేదు. అవి అనవసరం’ అని సంస్థ పేర్కొంది. టీనేజర్లు మందులు తీసుకోవాలనుకుంటే వైద్యుణ్ణి సంప్రదించి, వారి సలహా మేరకే తీసుకోవాలని సంస్థ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment