![Corona Virus: Covid And Omicron Cases Updates In India - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/1/covid.jpg.webp?itok=OAN_4jXz)
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. నిన్నటితో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కానీ మరణాల సంఖ్య పెరగడం ఒకింత ఆందోళన కల్గిస్తుంది. గడిచిన 24 గంటలలో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 2,54,076మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. అదే విధంగా, మహమ్మారి బారిన పడి 1192 మంది మృత్యువాతపడ్డారు.
ప్రస్తుతం 17,43,059 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 11.69% శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 1,66,68,48,204 మంది వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్నారు.
India's daily cases drop below 2 lakh; the country reports 1,67,059 new #COVID19 cases, 1192 deaths and 2,54,076 recoveries in the last 24 hours
— ANI (@ANI) February 1, 2022
Active case: 17,43,059 (4.20%)
Daily positivity rate: 11.69%
Total Vaccination : 1,66,68,48,204 pic.twitter.com/7yjkgUUMB8
చదవండిః మరిదితో వెళ్లిపోయి.. మూడో భర్త ముందు పతివ్రతనే అని..
Comments
Please login to add a commentAdd a comment