bulletin
-
కేజ్రీవాల్ ఆరోగ్యం.. తీహార్ జైలు కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జైలులో బరువు తగ్గలేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జైలు అధికారులు కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఒక బులెటిన్ విడుదల చేశారు. కేజ్రీవాల్ జైలుకు వచ్చినపుడు 65 కేజీల బరువు ఉండగా ఇప్పుడు కూడా అంతే ఉన్నారని తెలిపారు. రక్తపోటు సాధారణ స్థాయిలోనే ఉందని, షుగర్ లెవెల్స్ మాత్రం హెచ్చుతగ్గులకు గురవతున్నాయని వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్టయిన మార్చ్ 22 నుంచి బుధవారం(ఏప్రిల్ 3) వరకు 4.5 కేజీల బరువు తగ్గారని ఆమ్ఆద్మీపార్టీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ బరువులో ఎలాంటి మార్పు లేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించడం గమనార్హం. ఇదీ చదవండి.. అవమానించేందుకే అరెస్టు చేశారు -
TS: కరోనా కేసులపై దొంగ లెక్కలు?
హైదరాబాద్, సాక్షి: దేశంలో చాప కింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తోంది. తెలంగాణ విషయానికొస్తే.. మొన్నటిదాకా రాజధాని హైదరాబాద్‌లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయని అనుకున్నారంతా. ఇప్పుడది పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చేరింది. భూపాలపల్లి, కరీంనగర్, తాజాగా మంచిర్యాలలో కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. కానీ, అధికారిక లెక్కల్లో మాత్రం వాటిని చూపడం లేదు!. కరోనా వైరస్‌లో జేఎన్.1 వేరియెంట్.. వ్యాప్తి శరవేగంగా ఉంటోంది. చలికాలం.. ఫ్లూ సీజన్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తోంది. అయితే ప్రజలను అప్రమత్తం చేయడంలో మాత్రమే కాదు.. ఆఖరికి కరోనా బులిటెన్‌ను విడుదల చేయడంలోనూ ఆరోగ్య శాఖ పూర్తి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. గత రెండు రోజలుగా కరోనా లెక్కలపై ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటనేం చేయడం లేదు. అధికారుల్ని అడిగితే.. ప్రభుత్వమే ఇకపై గణాంకాలు విడుదల చేస్తుందంటూ ఓ ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం కరోనా లెక్కలపై ఎటూ తేల్చడం లేదు. రెండ్రోజులకొకసారి విడుదల చేస్తారని చెప్పినా.. అందులోనూ స్పష్టత లేదు. మరీ ఇంత తక్కువా? రెండు రోజుల కిందట బులిటెన్‌ను పరిశీలిస్తే.. 1,333 టెస్ట్‌లు చేయగా అందులో ఎనిమిది మందికి మాత్రమే కరోనా పాజిటివ్ గా తేలిందట. మొత్తంగా.. ఆ రోజునాటికి యాక్టివ్ కేసుల సంఖ్యను 63గా పేర్కొంటూ.. రెండు కరోనా మరణాలు సంభవించాయని ప్రకటించి ఆపేశారు. అయితే.. జిల్లా వైద్యాధికారులేమో అధికారిక లెక్కల విషయంలో పొంతనే లేదంటున్నారు. వింటర్ సీజన్.. బస్సుల్లో రద్దీ, మెట్రోలో రద్దీ, పైగా పెళ్లిళ్లతో పాటు పండుగ సీజన్ కావడంతో ఎక్కువగా జనం చేరుతుండటం వల్ల కూడా కేసుల సంఖ్య పెరిగే ఉంటుందని వాళ్లు అంచనా వేస్తున్నారు. వ్యక్తిగతంగా టెస్టులు చేయించుకుంటున్నవాళ్లు.. పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నవాళ్ల లెక్కను అందులో కావాలనే చేర్చడం లేదనే విమర్శా బలంగా వినిపిస్తోంది. మరోవైపు.. వైరస్ విజృంభించే అవకాశాలున్న సమయంలో రాష్ట్రంలో కొవిడ్ కేసులపై దాపరిక ధోరణి సరికాదంటున్నారు వైద్యనిపుణులు. కొత్తగా నియమించబడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ దీనిపై ఏదైనా ప్రకటన చేస్తారేమో చూడాలి. -
ద్రవ్యోల్బణం కట్టడి ఇప్పట్లో సాధ్యమేనా? ఆర్బీఐ కీలక ఆర్టికల్
ముంబై: ద్రవ్యోల్బణంపై పోరాటం చాలా కాలంపాటు కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అక్టోబర్ బులిటెన్‌లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ ఒకటి పేర్కొంది. దీర్ఘకాల ద్రవ్య విధానంసహా, పలు చర్యలు ధరల కట్టడికి పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది. ‘‘మనం ద్రవ్యోల్బణంపై విజయం సాధిస్తే, ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ ఆర్థికాభివృద్ధి అవకాశాలు మరింత సుస్థిరమవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ద్రవ్యోల్బణం సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో భారత్ తగిన స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసినట్లవుతుంది. అలాగే ఈ హర్షణీయమైన పరిణామం విదేశీ పెట్టుబడిదారులను పునరుజ్జీవింపజేస్తుంది. మార్కెట్లను స్థిరీకరించి, శాశ్వత ప్రాతిపదికన భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని పొందేలా చేస్తుంది’ అని డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రాసిన కథనం పేర్కొంది. బులిటన్లో పబ్లిష్ అయిన ఆర్టికల్ అంశాలను ఆర్బీఐ అంగీకరించాల్సిన అవసరం లేకపోవడం గమనార్హం. 2022 సెప్టెంబర్ వరకూ గడచిన తొమ్మిది నెలల నుంచి ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం సెంట్రల్ బ్యాంక్‌కు నిర్దేశిస్తున్న స్థాయి 6 శాతానికి మించి నమోదవుతున్న నేథ్యంలో ఈ ఆర్టికల్ వెలువడింది. కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5 శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనా వేసింది. అక్టోబర్, నవంబర్‌ల్లోనూ ద్రవ్యోల్బణం ఎగువబాటనే పయనిస్తే, తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 సమయంలో ఆర్బీఐ రెపో రేటును మరో అరశాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలలుగా ద్రవ్యోల్బణం కట్టడిలో ఎందుకు లేదన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ త్వరలో ఒక నివేదిక సమర్పిస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ పాలసీ నిర్ణయాల్లో కీలకమైన రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. రేటు పెంపు ప్రభావానికి ఆరు క్వార్టర్లు ఆగాలి: వర్మ ద్రవ్యోల్బణం కట్టడికిగాను ఆర్బీఐ గడచిన మే నుంచి పెంచిన 190 బేసిస్ పాయింట్ల రెపో రేటు ప్రభావం వ్యవస్థలో కనబడ్డానికి 5 నుంచి 6 త్రైమాసికాలు (సంవత్సన్నర వరకూ) పడుతుందని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ ఆర్ వర్మ పేర్కొన్నారు. ‘‘కఠిన ద్రవ్య పరపతి విధానాన్ని అవలంభిస్తున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం తప్పనిసరిగా దిగొస్తుంది’’ అని ఒక టెలిఫోనిక్ ఇంటర్వూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (అహ్మదాబాద్) ప్రొఫెసర్‌గా ఉన్న వర్మ, మాంద్యం భయాలు లేనప్పటికీ, భారత్ ఆర్థిక వృద్ధి వాస్తవానికి చాలా సంవత్సరాలుగా అనుకున్న స్థాయిలో లేదని ఈ సందర్భంగా వర్మ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం కట్టడి-వృద్ధి ప్రస్తుతం పరపతి విధానానికి సవాళ్లు విసురుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ద్రవ్యోల్బణం కట్టడికే ఆర్బీఐ ఎంపీసీ తొలి ప్రాధాన్యతని వివరించారు. భారత్ రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి పడిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు ప్రతి కరెన్సీపై డాలర్ ఇటీవల బలపడిందన్నారు. అమెరికా వాస్తవ ఎకానమీ పటిష్టత, ఫెడ్ అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానం డాలర్ బలపడ్డానికి కారణమని విశ్లేషించారు. అయితే ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల అంశమేనని పేర్కొన్నారు. -
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..! ఎకానమీపై తీవ్ర ప్రభావం..!
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో ఎగుమతులు, విస్తృతంగా నిర్వహిస్తున్న టీకాల ప్రక్రియ, సవాళ్లను దీటుగా అధిగమిస్తున్న ఆర్థిక రంగం ఊతంతో దేశ ఎకానమీ పటిష్టమైన స్థితిలో ఉంది. అయితే, అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ పరిణామాలపరమైన సవాళ్లు మాత్రం పొంచే ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ 2022 బులెటిన్లోని ఒక వార్తాకథనంలో ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వివిధ రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకోవడంతో కరోనా వైరస్ మూడో వేవ్‌ను అధిగమించి, సంవత్ 2079లోకి దేశం అడుగుపెడుతోందని కథనం పేర్కొంది. రాబోయే రోజుల్లో నిలకడగా వృద్ధిని సాధించాలంటే ప్రైవేట్ పెట్టుబడులు ఊపందుకోవడం చాలా కీలకమని వివరించింది. భౌగోళికరాజకీయ రిస్కులు వేగంగా పెరుగుతున్నాయని, సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి నెలకొందని .. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో అంతర్జాతీయంగా పరిస్థితులు అంత ఆశావహంగా కనిపించడం లేదని ఆర్టికల్ వివరించింది. ఇలాంటి అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల ప్రభావాలకు భారత ఎకానమీ అతీతం కాదని తెలిపింది. ‘భారత్‌పై కూడా ఈ పరిణామాల ప్రభావం ఉంటోంది. యుద్ధం (రష్యా–ఉక్రెయిన్ మధ్య), ప్రతీకార ఆంక్షలు మొదలైన వాటి పర్యవసానాలు ఇప్పటికే ద్రవ్యోల్బణం తదితర రూపాల్లో కనిపిస్తున్నాయి. అయితే, దేశీయంగా కొన్ని సానుకూల అంశాలు మాత్రం కాస్త ఉపశమనంగా ఉంటున్నాయి‘ అని కథనం వివరించింది. సరఫరా తగ్గిపోవడం, కమోడిటీల ధరలు.. ముఖ్యంగా ఆహారం, ఇంధనాల రేట్లు ఎగియడం తో ద్రవ్యోల్బణం పెరిగే రిస్కులు ఇప్పటికే కనిపిస్తు న్నాయని వివరించింది. అయితే, ఇందులో పొం దుపర్చిన అభిప్రాయాలన్నీ బులెటిన్ రూపకర్తలవేనని, ఇవన్నీ కచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయాలుగా భావించడానికి లేదని ఆర్బీఐ పేర్కొంది. ఫలితాలిస్తున్న ఆర్బీఐ చర్యలు .. ద్రవ్య పరపతి విధానాల ప్రయోజనాలను బ్యాంకులు సత్వరం వినియోగదారులకు బదలాయించే విషయంలో ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు.. ఫలితాలిస్తున్నాయని బులెటిన్ తెలిపింది. 2019 అక్టోబర్‌లో ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు (ఈబీఎల్ఆర్)తో ఈ ప్రక్రియ మరింత వేగం పుంజుకుందని, రాబోయే రోజుల్లో ఇది ఇంకా మెరుగుపడగలదని పేర్కొంది. అంతర్గత బెంచ్‌మార్క్ రుణ రేట్ల వల్ల బేస్ రేటు/ఎంసీఎల్ఆర్ మొదలైన వాటి లెక్కింపు విషయంలో పక్షపాత ధోరణులు ఉండేవని, ఫలితంగా పరపతి విధాన ప్రయోజనాల బదలాయింపు సరిగ్గా జరిగేది కాదని బులెటిన్ వివరించింది. చదవండి: నోట్ల రద్దుతో అలా..భారత్‌పై ప్రపంచబ్యాంకు కీలక వ్యాఖ్యలు..! -
కొనసాగుతున్న కరోనా ఉధృతి.. తగ్గిన పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 1,61,386 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 2,81,109 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 3,95,11,307 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 16,21,603 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 9.26% శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 167.29 కోట్ల మంది వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్నారు. India reports 1,61,386 fresh COVID cases and 2,81,109 recoveries in the last 24 hours Active cases: 16,21,603 Total recoveries: 3,95,11,307 Daily positivity rate: 9.26% Total vaccination: 167.29 crore pic.twitter.com/QD2jptRtG4 — ANI (@ANI) February 2, 2022 -
Corona Virus: భారత్‌లో స్వల్పంగా తగ్గిన కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. నిన్నటితో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కానీ మరణాల సంఖ్య పెరగడం ఒకింత ఆందోళన కల్గిస్తుంది. గడిచిన 24 గంటలలో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 2,54,076మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. అదే విధంగా, మహమ్మారి బారిన పడి 1192 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 17,43,059 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 11.69% శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 1,66,68,48,204 మంది వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్నారు. India's daily cases drop below 2 lakh; the country reports 1,67,059 new #COVID19 cases, 1192 deaths and 2,54,076 recoveries in the last 24 hours Active case: 17,43,059 (4.20%) Daily positivity rate: 11.69% Total Vaccination : 1,66,68,48,204 pic.twitter.com/7yjkgUUMB8 — ANI (@ANI) February 1, 2022 చదవండిః మరిదితో వెళ్లిపోయి.. మూడో భర్త ముందు పతివ్రతనే అని.. -
కరోనా ఉధృతి: భారత్‌లో 2 లక్షలు దాటిన కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 2,09,918 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 2,62,628 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. అదే విధంగా, మహమ్మారి బారిన పడి 959 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 18,31,268 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 15.77% శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 1,66,03,96,227 మంది వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్నారు. చదవండిః నిర్మలమ్మా.. వీరి ఆశలన్నీ మీ పైనే! India reports 2,09,918 new #COVID19 cases, 959 deaths and 2,62,628 recoveries in the last 24 hours Active case: 18,31,268 (4.43%) Daily positivity rate: 15.77% Total Vaccination : 1,66,03,96,227 pic.twitter.com/ZTN2OJXQbE — ANI (@ANI) January 31, 2022 -
తెలంగాణలో కొత్తగా 2,707 మందికి కరోనా పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 84,280 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,707 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. గత 24 గంటలలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు తెలంగాణలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,049కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న582 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,462 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఒక బులెటిన్‌ను విడుదల చేసింది. చదవండి: కరోనా ఉధృతి.. రాష్ట్ర సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ -
కరోనా కల్లోలం: భారత్‌లో భారీగా పెరిగిన కేసులు..
Covid Third Wave: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 60,405 మంది వైరస్ బారి నుంచి కొలుకున్నారు. అదే విధంగా, మహమ్మారి బారిన పడి 442 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 9,55,319 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 4,868 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. చదవండి: Omicron: ఒమిక్రాన్ ప్రతీ ఒక్కరికి సోకుతుంది -
కరోనా ఉధృతి: భారత్‌లో 1.68 లక్షలు దాటిన కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 1,68,063 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 69,959 మంది వైరస్ బారి నుంచి కొలుకున్నారు. అదే విధంగా, మహమ్మారి బారిన పడి 277 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 8,21,446 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 10.64 శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటలలో 4,461 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. -
కరోనా బీభత్సం.. 1.79 లక్షలు దాటిన కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా బీభత్సన్ని సృష్టిస్తోంది. గడిచిన 24 గంటలలో 1,79,723 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో మహమ్మారి బారిన పడి 146 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 7,23,619 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను ప్రకటిచింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటలలో 4,033 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. చదవండి: కోవిడ్ టీకా సర్టిఫికెట్‌పై ప్రధాని ఫొటో ఉండదు -
కరోనా బీభత్సం.. 1.59 లక్షలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. కరోనా థర్డ్‌వేవ్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటలలో 1,59,632 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో మహమ్మారి బారిన పడి 327 మంది మృతి చెందారు. అదే విధంగా, 40,863 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కోవిడ్ పాజిటీవిటీ రేటు 10.21 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 5,90,611 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇక మరోవైపు ఒమిక్రాన్ కూడా బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే 27 రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,623 కు పెరిగింది. ప్రస్తుతం అత్యధికంగా మహరాష్ట్రలో 1,009 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అదే విధంగా 1,490 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను విడుదల చేసింది. చదవండి: రైల్వేస్టేషన్లలో అదనపు బాదుడుకు ప్లాన్! రైలెక్కినా దిగినా రూ.10 నుంచి 50? -
కోరలు చాస్తున్న కరోనా.. భారత్‌లో ఒక్కరోజులో లక్షదాటిన కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కోరలు చాస్తుంది. కరోనా కేసుల సంఖ్య లక్షను దాటింది. గడిచిన 24 గంటలలో కొత్తగా 1,17,100 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 302 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఎక్కువగా ఉంది. గడిచిన ఒక్కరోజులో అక్కడ 36,265 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 3,71,363 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై బులెటిన్‌ను విడుదల చేసింది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 30,836 మంది, కరోనా మొదలైనప్పటి నుంచి మొత్తంగా 3,43,71,845 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 7.74 శాతంగా ఉంది. తాజాగా నమోదైన 302 మరణాలతో మొత్తం భారత్‌లో 4,83,178 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటిదాకా 149 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని అందించినట్లు కేంద్రం ప్రకటించింది. ఒమిక్రాన్ అప్డేట్ ఇదిలా ఉంటే 27 రాష్ట్రాల్లో 3, 007 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, వారిలో 1,199 మంది పేషెంట్లు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చదవండి: ఒమిక్రాన్ ముప్పు: ఆశలన్నీ బూడిదపాలు.. వారంలో 200 కోట్ల నష్టం!! -
భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తుంది. రోజు వారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 37,379 కేసులు నమోదయ్యాయి. కాగా, కరోనా కాటుకు 12 మంది మృతి చెందారు. గత 24 గంటలలో.. 11,007 కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో.. 1,71,830 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఒమిక్రాన్ కూడా చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు భారత్‌లో 1,892 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. -
Corona Virus: ఏపీలో కొత్తగా 186 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 32,036 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 186 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,448 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 191 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 20 లక్షల 56 వేల 979 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 2,149 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,73,576 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 3,05,39,041 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. -
Corona Virus: ఏపీలో కొత్తగా 138 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 31,065 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 138 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి ఒకరు మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,445 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 118 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 20 లక్షల 56 వేల 788 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 2,157 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,73,390 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 3,05,07,005 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. -
ఏపీలో కొత్తగా 381 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 38,896 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 381 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా ఒక్కరు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,365 కు చేరింది. గత 24 గంటల్లో 414 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 20,46,127 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 4743 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,65,235 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,94,04,281 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. -
Corona Virus: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 30,515 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 429 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి నలుగురు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,029 కు చేరింది. ఒకరోజులో 1,149 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం 9,753 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,53,192 కు చేరింది. ఏపీలో ఇప్పటివరకు 2,84,76,467 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20,29,231 మంది కరోనా నుంచి కోలుకున్నారు. చదవండి: జైకోవ్–డి వ్యాక్సిన్ రూ.1,900 -
Corona Virus: ఏపీలో కొత్తగా 809 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 56,463 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 809 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో కరోనా బారిన పడి 10 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14186 కు చేరింది. ఒకరోజులో 1,160 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం 11,142 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,51,133 కు చేరింది. ఏపీలో ఇప్పటివరకు 2,83,50,167 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20,25,805 మంది కరోనా నుంచి కోలుకున్నారు. చదవండి: వైరల్: కోవిడ్ టెస్ట్ చేయించుకొని.. బిల్లు చూసి షాకయ్యాడు.. -
Corona Virus: ఏపీలో కొత్తగా 1,010 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 58,054 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,010 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో కరోనా బారిన పడి 13 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,176 కు చేరింది. ఒకరోజులో 1,149 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం 11,503కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,50,324 కు చేరింది. ఏపీలో ఇప్పటివరకు 2,82,93,704 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20,24,645 మంది కరోనా నుంచి కోలుకున్నారు. చదవండి: TS: కేంద్రం తోడ్పాటు.. ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్ ఉత్పత్తి -
Corona Virus: ఏపీలో కొత్తగా 1,084 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 57,345 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,084 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో కరోనా బారిన పడి 13 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,163 కు చేరింది. ఒకరోజులో 1,328 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం 11,655 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,49,314కు చేరింది. ఏపీలో ఇప్పటివరకు 2,81,78,305 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20,23,496 మంది కరోనా నుంచి కోలుకున్నారు. చదవండి: కరోనా దెబ్బ.. ఆయుషు తగ్గింది! -
Corona Virus: ఏపీలో కొత్తగా 771 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 45,592 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 771 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 8 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,150 కు చేరింది. గత 24 గంటల్లో 1,333 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 11,912 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,48,230 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,81,78,305 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి: పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్: తెలిసినవారి పేర్లు కూడా మర్చిపోతున్నారా? -
Corona Virus: ఏపీలో కొత్తగా 618 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 38,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 618 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 6 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,142 కు చేరింది. గత 24 గంటల్లో 1,178 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 12,482 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,47,459 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,81,32,713 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి: PM Modi: వ్యాక్సిన్ ఒక సురక్ష చక్రం -
Corona Virus: భారత్‌లో కొత్తగా 30,256 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటలలో దేశంలో కొత్తగా 30,256 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో ప్రకటించింది. దీంతో దేశంలో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 3,34,78,419 కి చేరినట్లు వెల్లడించింది. ఈ మహమ్మారి బారినపడి గత 24 గంటలలో 295 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 4,45,133 కి చేరింది. కరోనా నుంచి తాజాగా, 43,938 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,45,133 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. చదవండి: Covaxin: కోవాగ్జిన్‌పై అక్టోబర్ 6న డబ్ల్యూహెచ్ఓ భేటీ -
ఏపీలో కొత్తగా 1,190 కరోనా పాజిటివ్ కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 11 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 45,533 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం బులెటిన్‌ను విడుదల చేసింది. వైరస్ నుంచి 1,226 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 20,00,877 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడి ఇప్పటివరకు 13, 998 మంది మృతి చెందారు. చదవండి: సెక్యూరిటీ గార్డే డాక్టరైండు.. పేషెంట్‌కు ఇంజెక్షన్