ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి ధాటికి అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. భారత్‌లో వరుసగా తొమ్మిదో రోజు 3.8 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో దేశంలో కొత్తగా 3,86,452 కరోనా కేసులు నమోదైనట్లు తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,87,62,976 కు చేరింది.
గురువారం ఒక్కరోజే 3,498 మరణించినట్లు కేంద్రం తెలిపింది. దీంతో మృతుల సంఖ్య 2,08,330 కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం 1,53,84,418 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. కాగా దేశంలో ప్రస్తుతం 31,70,228 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 15,22,45,179 మందికి వ్యాక్సిన్ అందించారు.
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు..
తెలంగాణలోను కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటలలో కొత్తగా 7,646 కరోనా కేసులు నమోదుకాగా, 53 బాధితులు మరణించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 4,35,606 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3,55,618 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, 2,208 మంది మరణించారు.
తెలంగాణలో ప్రస్తుతం 77,727 కరోనా కేసులు ఆక్టివ్‌గా ఉన్నాయి. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,441, మేడ్చల్ 631, రంగా రెడ్డి 484, సంగారెడ్డిలో 401, నిజామాబాద్ 330, నల్గొండ 285, సిద్దిపేటలో 289, సూర్యాపేట 283, కరీంనగర్‌లో 274 ,మహబూబ్‌నగర్ 243, జగిత్యాల 230, ఖమ్మంలో 212 , నాగర్ కర్నూల్ 198, వికారాబాద్‌లో 189 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment