
ప్రతీకాత్మక చిత్రం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 59,641 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,546 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 15 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,410 కు చేరింది.
గడిచిన 24 గంటల్లో 1,968 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,36,016 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 20,582 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,70,008 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,47,08,540 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment