Corona Virus: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు | AP Government Released The Bulletin On Corona Virus | Sakshi
Sakshi News home page

Corona Virus: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Published Mon, Oct 4 2021 6:12 PM | Last Updated on Mon, Oct 4 2021 6:12 PM

AP Government Released The Bulletin On Corona Virus - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 30,515 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 429 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి నలుగురు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,029 కు చేరింది. ఒకరోజులో 1,149  మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు  19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ  సోమవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం 9,753 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో  పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,53,192 కు చేరింది. ఏపీలో ఇప్పటివరకు 2,84,76,467 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20,29,231 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

చదవండి: జైకోవ్‌–డి వ్యాక్సిన్‌ రూ.1,900

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement