
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటలలో కొత్తగా 36,571 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ మహమ్మారి బారిన పడి గత 24 గంటలలో 540 మంది మృతి చెందారు.
కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,33,589కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,63,605 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్తగా 36,555 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 97.54 శాతానికి పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment