
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటలలో దేశంలో.. కొత్తగా 30,948 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ మహమ్మారి బారిన పడి గత 24 గంటలలో 403 మంది మరణించారు.
ఇప్పటి వరకు దేశంలో 4,34,367 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 3,53,398 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్తగా 38,487 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం రికవరీల సంఖ్య 3,16,36,49 కి చేరింది. ఇప్పటి వరకు 58.14 కోట్ల మంది వ్యాక్సినేషన్ వేయించుకున్నారు.