
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జైలులో బరువు తగ్గలేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జైలు అధికారులు కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఒక బులెటిన్ విడుదల చేశారు. కేజ్రీవాల్ జైలుకు వచ్చినపుడు 65 కేజీల బరువు ఉండగా ఇప్పుడు కూడా అంతే ఉన్నారని తెలిపారు.
రక్తపోటు సాధారణ స్థాయిలోనే ఉందని, షుగర్ లెవెల్స్ మాత్రం హెచ్చుతగ్గులకు గురవతున్నాయని వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్టయిన మార్చ్ 22 నుంచి బుధవారం(ఏప్రిల్ 3) వరకు 4.5 కేజీల బరువు తగ్గారని ఆమ్‌ఆద్మీపార్టీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ బరువులో ఎలాంటి మార్పు లేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించడం గమనార్హం.
ఇదీ చదవండి.. అవమానించేందుకే అరెస్టు చేశారు
Comments
Please login to add a commentAdd a comment