ఢిల్లీ, సాక్షి : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి మరో సందేశం ఇచ్చారు. కేజ్రీవాల్ సలహా మేరకు ఏప్రిల్ 14 న రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ‘సంవిధాన్ బచావో.. తనషాహీ హటావో దివస్’(Samvidhan Bachao,Tanashahi Hatao Divas) ను పాటించనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది .
అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆప్ నాయకులు, కార్యకర్తలు ‘నియంతృత్వాన్ని’వ్యతిరేకిస్తామని, రాజ్యాంగాన్ని కాపాడాలని ప్రతిజ్ఞ చేయాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించినట్లు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘నియంతృత్వాన్ని’ ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కేజ్రీవాల్ సూచించారని అన్నారు.
దీంతో పాటు ఢిల్లీ ప్రజలకు ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా పని చేయాలని ఆప్ ఎమ్మెల్యేలు, వాలంటీర్లను కేజ్రీవాల్ కోరినట్లు ఆ పార్టీ ఎంపీ గోపాల్ రాయ్ అన్నారు.
రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం సతీమణి సునీతా కేజ్రీవాల్‌ను మంగళవారం తీహార్ జైలులో కలిశారని చెప్పారు. సునీతా కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్న పార్టీ సమావేశంలో ఆయన సందేశాన్ని అందించారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment