
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Elections) షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన కొద్ది సేపటికే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్)కు తాము మద్దతిస్తున్నట్లు ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీ సమాజ్‌వాదీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్(Akilesh Yadav) ప్రకటించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ వేరువేరుగా పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేష్ కాంగ్రెస్‌కు కాకుండా ఆప్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. అఖిలేష్ మద్దతు తెలపడంపై కేజ్రీవాల్(Kejriwal) స్పందించారు. అఖిలేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అఖిలేష్ తమ కోసం ఎల్లప్పుడు మద్దతుగా ఉన్నారని, తమ వైపు నిలబడ్డారని పేర్కొన్నారు. ఆప్ ఇటీవల నిర్వహించిన మహిళా అదాలత్ కార్యక్రమంలోనూ అఖిలేష్ పాల్గొని ప్రచారం నిర్వహించారు. కాగా, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణ పోరు జరగనుంది. అయితే ప్రధాన పోటీ మాత్రం ఆప్,బీజేపీ మధ్యే ఉండనుంది. ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుంది.
ఇదీ చదవండి: ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..