న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. విజ్ఞాన్ భవన్‌లో జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు.
ఢిల్లీలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ ఇలా..
జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్
ఎన్నికలకు పోలింగ్.. ఫిబ్రవరి 5
ఎన్నికల ఫలితాలు.. ఫిబ్రవరి 8
నామినేషన్లకు చివరి తేదీ.. జనవరి 17
నామినేషన్ల విత్ డ్రా చివరి తేదీ.. జనవరి 20
#WATCH | Delhi to vote in a single phase on February 5; counting of votes on February 8 #DelhiElections2025 pic.twitter.com/QToVzxxADK
— ANI (@ANI) January 7, 2025
ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటింది. గతేడాది ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం. ఢిల్లీలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు. ఓట్ల తొలగింపు ఆరోపణలను ఖండిస్తున్నాం. ఎన్నికలను పారదర్శంగా నిర్వహిస్తున్నాం. ఈవీఎంల పనితీరుపై పూర్తి విశ్వాసంగా ఉన్నాం. ఈవీఎంల వాడకంలో పారదర్శకత ఉంది. ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగినట్టు ఆధారాలు లేవు. ఈవీఎంల విషయంలో అసత్యాలను నమ్మవద్దు. ఈ ఏడాది తొలి ఎన్నికల్లో ఢిల్లీలో జరగబోతున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly)లో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఏడవది. దీని గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది.
ఢిల్లీకి స్టేట్ స్టేటస్ వచ్చాక 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. అయితే ఐదేళ్ల పాలనలో ముగ్గురు సీఎంలను మార్చింది. ఆపై జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. షీలా దీక్షిత్ సారథ్యంలో హస్తం పార్టీ హ్యాట్రిక్ పాలన సాగించింది. ఇక..2013 నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. దీంతో..
ఈసారి ఎలాగైనా హస్తినను చేజిక్కించుకోవాలని బీజేపీ(BJP) భావిస్తోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆప్ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అధికారంపై కన్నేసింది. హర్యానా ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఆప్-కాంగ్రెస్‌లు మరోసారి ఢిల్లీ ఎన్నికల ముక్కోణ్ణపు పోటీలో తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment