
రంగు రంగుల్లో మెరిసే కూరగాయలకు మనిషి బరువును తగ్గించే శక్తి ఉంటుందట. పచ్చివే తినదగ్గ ఈ కూరగాయలు అదనపు కొవ్వులను తగ్గించి సన్నబరుస్తాయని అంటున్నాయి వివిధ అధ్యయనాలు. టమోటాలు, వివిధ రంగుల్లో లభించే బెల్ పెప్పర్, తాజా ఆకుకూరలకు బరువును తగ్గించే గుణాలుంటాయి. బఠానీలు, ఎర్ర ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయలు, కీరా, గుమ్మడికాయలు.. ఇలా మెరిసే రంగుల్లో ఉండేవి కూడా శరీర బరువును నియంత్రణలో ఉంచాలనుకొనే వారికి నేస్తాలు. అలాగే మిరపకు కూడా బరువును తగ్గించే గుణం ఉంటుందట! వివిధ రంగుల్లో లభిస్తున్న మిరపకాయల్లో బరువును తగ్గించే రసాయనా లుంటాయని గుర్తించారట.
Comments
Please login to add a commentAdd a comment