
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తుంది. రోజు వారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 37,379 కేసులు నమోదయ్యాయి. కాగా, కరోనా కాటుకు 12 మంది మృతి చెందారు.
గత 24 గంటలలో.. 11,007 కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో.. 1,71,830 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఒమిక్రాన్ కూడా చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు భారత్‌లో 1,892 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.