
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కాగా, గడిచిన 24 గంటలలో కొత్తగా 449 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే విధంగా కరోనా మహమ్మారి బారినపడి ఇద్దరు మరణించారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కరోనాపై ఆదివారం బులెటిన్‌ను విడుదల చేసింది.
గత 24 గంటలలో కరోనా నుంచి కొలుకుని 623 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. అయితే, ప్రస్తుతం తెలంగాణలో 8,406 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించింది.