
న్యూఢిల్లీ: దేశంలో కరోనా బీభత్సన్ని సృష్టిస్తోంది. గడిచిన 24 గంటలలో 1,79,723 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో మహమ్మారి బారిన పడి 146 మంది మృత్యువాతపడ్డారు.
ప్రస్తుతం 7,23,619 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను ప్రకటిచింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటలలో 4,033 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.