ప్రయోజనం లేని పారాసిటమాల్!
నొప్పి నివారణకు నో యూజ్
చాలా మంది వెన్నునొప్పికీ, నడుమునొప్పికి పారాసిటమాల్ మేలు అనుకుని ముందస్తు చికిత్సగా ఆ మాత్ర మింగుతుంటారు. కానీ నిజానికి పారాసిటమాల్ వాడటం కూడా అంత మంచిది కాదంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన నిపుణులు. సగటు వయసు 45 ఉన్న 1,652 మంది రోగులపై నిర్వహించిన అధ్యయనంలో నడుము, వెన్ను నొప్పితో బాధపడే వారిలో కొందరికి పారాసిటమాల్ ఇచ్చారు. మరికొందరికి పారాసిటమాల్ మాత్ర ఇచ్చారు కానీ అందులో మందు లేదు.
17 రోజుల తర్వాత పరీక్షించి చూడగా... నిజానికి మందు తీసుకున్నవారిలోనూ, మందుతీసుకోకుండా కేవలం ‘ప్లాసెబో’ఎఫెక్ట్‌తో ఉపశమనం పొందినవారిలోనూ పెద్దగా ఎలాంటి తేడా లేదని అధ్యయనవేత్తలు గుర్తించారు. (ప్లాసెబో ఎఫెక్ట్ అంటే మందు వాడకపోయినా వాడామనే అనుభూతి వల్లనే సాంత్వన పొందడం). పై నొప్పులకు ఫిజియోథెరపీయే మంచి చికిత్స అంటున్నారు నిపుణులు.