ముక్కోణంతో మజిల్స్‌కు బలం | Benefits of Trikonasana | Sakshi
Sakshi News home page

ముక్కోణంతో మజిల్స్‌కు బలం

Published Sat, Dec 14 2024 10:07 AM | Last Updated on Sat, Dec 14 2024 10:07 AM

Benefits of Trikonasana

వెన్నునొప్పిని తగ్గించడానికి, కండరాలను బలోపేతం చేయడానికి త్రికోణాసనం సహాయపడుతుంది. సయాటికా సమస్యను తగ్గించడానికి ప్రభావ వంతంగా పనిచేస్తుంది. ఈ ఆసనంలో వెన్నెముక, చేతులు, ఛాతీ స్ట్రెంచింగ్‌ అవుతాయి. దీనివల్ల కండరాలు దృఢపడతాయి. 

త్రికోణాసనం వేయాలంటే...
∙ముందు పాదాలను దూరంగా పెట్టి నిటారుగా నిల్చోవాలి. ∙తర్వాత చేతులను రెండువైపులకు చాచాలి. దీర్ఘశ్వాస తీసుకోవాలి. ∙నెమ్మదిగా శ్వాస వదులుతూ తుంటి నుంచి శరీరాన్ని కుడివైపునకు వంచాలి. ∙ఇలా వంచేటప్పుడు కూడా నడుము నిటారుగానే ఉంచాలి. 
∙ఎడమ చేయిని పైకెత్తి, కుడి చేతిని కుడి పాదానికి తాకించాలి. ∙చేతులు రెండూ ఒకే వరుసలో ఉండేలా చూసుకోవాలి. ∙తల కుడివైపునకు తిప్పి, ఎడమ చేయిని చూడాలి. ∙తర్వాత శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. ఆ తర్వాత.. మరోవైపున కూడా ఇలాగే చేయాలి. ఈ ఆసనాన్ని రోజూ సాధన చేయడం వల్ల శరీరమంతా స్ట్రెచ్‌ అవడంతో పాటు, మానసిక శారీరక ఒత్తిడులు తగ్గుతాయి. 
– అనూషా కార్తీక్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement