Heath
-
మనిషి మనిషికో ఇంటిమసీ అవసరం
అంజలి, కార్తీక్‌లకు పెళ్లయి మూడేళ్లవుతోంది. అంజలికి ప్రయాణాలంటే ఇష్టం. అడ్వంచర్ ట్రిప్స్ అంటే ప్రాణం. ఎప్పటికప్పడు కొత్త హాబీలను ప్రయత్నిస్తుంటుంది. కార్తీకేమో ఒక పరిశోధకుడు. మెదడుకు పదునుపెట్టే పుస్తకాలు చదవడం, సమకాలీన అంశాలపై లోతుగా చర్చించడం చాలా ఇష్టం. కార్తీక్ తనతో సంతోషంగా లేడని అంజలికి అనిపించేది. అంజలి తన ఆలోచనలను అర్థం చేసుకోవడంలో ఆసక్తి చూపడం లేదని కార్తీక్‌కు అనిపించేది. కానీ ఆ విషయం ఒకరికొకరు చెప్పుకోలేక మథనపడుతున్నారు. రవి సాఫ్ట్వేర్ ఇంజినీర్, మీరా స్కూల్ టీచర్. రవి తన ప్రేమను ముద్దులు, హగ్గులు, బెడ్ టైమ్‌లో వ్యక్తీకరించేవాడు. మీరా రోజువారీ విషయాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ ఉండేది. కానీ రవి తన మాటలు వినడంలేదని అనిపించేది. రవేమో మీరా తనను పట్టించుకోవడంలేదని భావించేవాడు. దీంతో ఇద్దరి మధ్య ఆత్మీయతానురాగాలు దూరమవుతున్నాయి. తరచూ గొడవలు పడుతున్నారు. ఇలాంటి సమస్య మీకూ ఎదురై ఉండవచ్చు. మీరూ మీ భాగస్వామి బాగానే ఉంటున్నా, ఏదో దూరం పెరుగుతోందని అనిపించవచ్చు. అందుకు కారణమేంటో తెలియక ఆందోళన పడుతూ ఉండవచ్చు. అందుకు ప్రధాన కారణం సాన్నిహిత్యం (intimacy) గురించి అవగాహన లేకపోవడమేనని చెప్పవచ్చు. శారీరక సాన్నిహిత్యం ఉంటే అన్నీ సర్దుకుంటాయని చాలామంది అనుకుంటారు. కానీ అంతకుమించి అవసరమైన సాన్నిహిత్యాలు కూడా ఉన్నాయి. వాటిని గుర్తించకపోవడం లేదా పరిష్కరించకపోవడం సమస్యలకు దారితీస్తుంది. దంపతులు పరస్పరం వారి అవసరాలను అర్థం చేసుకుని, సాన్నిహిత్య రకాల మధ్య సమతౌల్యాన్ని కలిగి ఉంటే, సంబంధం మరింత గాఢంగా ఉంటుంది. సమస్యలు తీవ్రమైనప్పుడు ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సహాయం తీసుకోవడం అవసరం. 1. భావోద్వేగ సాన్నిహిత్యంబంధానికి, అనుబంధానికి మూలస్తంభం emotional intimacy ఇద్దరి మధ్య భావాలు, అనుభవాలను నిరభ్యంతరంగా పంచుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు భావోద్వేగ సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అయితే, ఒక వ్యక్తి ఎమోషనల్‌గా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు మరో వ్యక్తి దూరంగా ఉంటే అది అసంతృప్తికి, ఒంటరితనానికి దారితీస్తుంది. మీరా సమస్య అదే. రవి తనతో ఎమోషనల్‌గా కనెక్ట్ కావడంలేదని బాధపడుతోంది. 2. శారీరక సాన్నిహిత్యంPhysical intimacy అంటే కౌగిలింతలు, ముద్దులు, లైంగిక సంబంధాల వంటివి. దీనికి ఎంత ప్రాధాన్యం ఇస్తారనేది వారి వారి స్థాయిల్లో ఉంటుంది. ఒకరికి శారీరక సాన్నిహిత్యం అవసరం ఎక్కువగా ఉంటే, మరొకరికి దాని ప్రాముఖ్యత తక్కువగా ఉండవచ్చు. అప్పుడు ఇద్దరి మధ్యా దూరం ఏర్పడుతుంది. ఉదాహరణకు రవికి ఫిజికల్ ఇంటిమసీ ముఖ్యమైతే, మీరాకు ఎమోషనల్ ఇంటిమసీ అవసరం. వారిద్దరి మధ్య దూరానికి అదే కారణం. 3. మేధో సాన్నిహిత్యంఆలోచనలు, అభిప్రాయాలు, లోతైన చర్చల ద్వారా ఏర్పడేదే intellectual intimacy ఇద్దరు వ్యక్తులు తమ అభిప్రాయాలను పంచుకుంటూ మానసికంగా కలిసి ఉంటే, వారి సంబంధం మరింత బలపడుతుంది. కానీ, ఒకరు మేధోపరమైన చర్చల పట్ల ఆసక్తి చూపితే, మరొకరు ప్రాక్టికల్ విషయాలకే ప్రాధాన్యం ఇస్తే, అది అసంతృప్తికి దారితీస్తుంది. అంజలి, కార్తీక్‌ల మధ్య సమస్య ఇదే. 4. అనుభవైక సాన్నిహిత్యంఒకే విధమైన అనుభవాలను పంచుకోవడం ద్వారాexperiential intimacy ఏర్పడుతుంది. ఉదాహరణకు, కలిసి ప్రయాణం చేయడం, వంట చేయడం లేదా ఇతర హాబీలను పంచుకోవడం. ఇది బంధంలో టీమ్‌వర్క్‌ను పెంపొందిస్తుంది. కానీ, ఒక వ్యక్తి బహుళ అనుభవాలకు ప్రాధాన్యమిచ్చి.. మరొకరు వ్యక్తిగత సమయాన్ని కోరుకుంటే సమస్యలు వస్తాయి.5. ఆధ్యాత్మిక సాన్నిహిత్యంకొందరికి మతపరమైన లేదాspiritual intimacy చాలా ముఖ్యమైనది. కలిసి ప్రార్థనలు చేయడం, ధ్యానం చేయడం లేదా జీవితంపై చర్చలు చేయడం ఈ బంధాన్ని బలపరుస్తాయి. అయితే, ఆధ్యాత్మిక లక్ష్యాల్లో భిన్నత్వముంటే సమస్యలు తలెత్తుతాయి. ఉదాహరణకు.. పరమ భక్తురాలికి నాస్తికుడు భర్తగా ఉంటే ఎలా ఉంటుందో మీరే ఊహించండి. 6. ఆర్థిక సాన్నిహిత్యండబ్బు సంబంధిత విషయాల్లో పారదర్శకత, పరస్పర నమ్మకం కలిగి ఉండటమే financial intimacy. ఒకరు ఆదా చేయడంలో ఆసక్తి చూపుతుండగా, మరొకరు ఖర్చుల పట్ల ఆసక్తి చూపితే అది విభేదాలకు దారితీస్తుంది. -
ముక్కోణంతో మజిల్స్‌కు బలం
వెన్నునొప్పిని తగ్గించడానికి, కండరాలను బలోపేతం చేయడానికి త్రికోణాసనం సహాయపడుతుంది. సయాటికా సమస్యను తగ్గించడానికి ప్రభావ వంతంగా పనిచేస్తుంది. ఈ ఆసనంలో వెన్నెముక, చేతులు, ఛాతీ స్ట్రెంచింగ్ అవుతాయి. దీనివల్ల కండరాలు దృఢపడతాయి. త్రికోణాసనం వేయాలంటే...∙ముందు పాదాలను దూరంగా పెట్టి నిటారుగా నిల్చోవాలి. ∙తర్వాత చేతులను రెండువైపులకు చాచాలి. దీర్ఘశ్వాస తీసుకోవాలి. ∙నెమ్మదిగా శ్వాస వదులుతూ తుంటి నుంచి శరీరాన్ని కుడివైపునకు వంచాలి. ∙ఇలా వంచేటప్పుడు కూడా నడుము నిటారుగానే ఉంచాలి. ∙ఎడమ చేయిని పైకెత్తి, కుడి చేతిని కుడి పాదానికి తాకించాలి. ∙చేతులు రెండూ ఒకే వరుసలో ఉండేలా చూసుకోవాలి. ∙తల కుడివైపునకు తిప్పి, ఎడమ చేయిని చూడాలి. ∙తర్వాత శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. ఆ తర్వాత.. మరోవైపున కూడా ఇలాగే చేయాలి. ఈ ఆసనాన్ని రోజూ సాధన చేయడం వల్ల శరీరమంతా స్ట్రెచ్ అవడంతో పాటు, మానసిక శారీరక ఒత్తిడులు తగ్గుతాయి. – అనూషా కార్తీక్ -
అవును... ఆమెకు కొంచెం ఎక్కువ నిద్ర అవసరం
అందరికీ 7–8 గంటల నిద్ర అవసరమని అందరికీ తెలిసిందే. అయితే ఎనిమిది గంటలసేపు నిద్రపోయిన తర్వాత కూడా, ఉదయం ఇంకా రిఫ్రెషింగ్‌గా లేకుండా, ఇంకా అలసటగా... బద్ధకంగా ఉన్నట్లయితే నిద్ర సరిపోలేదని అర్థం. అయితే స్త్రీల విషయంలోనే! అందరికీ కాదు. వినడానికి విడ్డూరంగా ఉన్నా, ఇది అక్షరాలా నిజం. వైద్య పరిశోధకులు వివరణాత్మకంగా చెప్పిన విషయమే.పురుషులు 7–8 గంటల నిద్రలో బాగా పని చేయగలిగినప్పటికీ, మహిళలకు నిద్రకు మరికాస్త ఎక్కువ సమయం అవసరం. మహిళలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో తెలుసుకునే ముందు, నిద్ర గురించి మరికొంత అర్థం చేసుకుందాం.మంచి నిద్ర ఎందుకు ముఖ్యం?మంచి నిద్ర మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మెరుగైన గుండె ఆరోగ్యం, జీవక్రియలు, చర్మం, జుట్టు నాణ్యతను, దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది. నాణ్యమైన నిద్ర మీ భావోద్వేగాలను మెరుగ్గా నిర్వహించడానికి కూడా మిమ్మల్ని సన్నద్ధం చేస్తుంది. కంటినిండా నిద్రపోయేవారికి ఆందోళన, డిప్రెషన్ స్థాయులు తక్కువ గా ఉండటం వల్ల వారు కార్యాలయాల్లో మెరుగైన పనితీరును కనబరుస్తున్నట్లు రుజువైంది. నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం ఆర్టెమిస్ హాస్పిటల్‌లోని పల్మోనాలజీ అండ్ స్లీప్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ అరుణ్ కొటారు, నిద్ర సమయంలో శరీరం కణజాల మరమ్మత్తు, కండరాల పెరుగుదల, హార్మోన్ నియంత్రణ వంటి ముఖ్యమైన ప్రక్రియలకు లోనవుతుందని అంగీకరిస్తున్నారు. ‘దీర్ఘకాలిక నిద్ర లేమి శారీరక, మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఇది మన మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను దెబ్బతీస్తుంది, ఉత్పాదకత తగ్గుతుంది. ప్రమాదాల ప్రమాదాన్ని పెంచుతుంది‘ అని ఆయన చెప్పారు.పురుషుల కంటే మహిళలకు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవసరమని ఇటీవలి పరిశోధనలో తేలింది. ‘మెదడు కోలుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి నిద్ర చాలా ముఖ్యం. మహిళల్లో నిద్ర, నిద్ర రుగ్మతలకు సంబంధించి తక్కువ డేటా అందుబాటులో ఉన్నప్పటికీ, రోజువారీ కార్యకలాపాల నుండి కోలుకోవడానికి పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర అవసరమని పరిశోధనలు సూచిస్తున్నాయి‘ అని డాక్టర్ చెప్పారు.నిద్రకు సంబంధించి స్త్రీ పురుషులలో వ్యత్యాసం చాలా ఎక్కువని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కానీ వివిధ కారణాల రీత్యా పురుషుల కన్నా స్త్రీలకు కేవలం 11 నుంచి 13 నిమిషాల అధిక నిద్ర సరిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగని వారికి కావలసిన అధిక నిద్రను సమస్యలా చేసి చూపడం లేదా వారికి ఎక్కువ నిద్ర కావాలనడాన్ని అంగీకరించకపోవడం వల్ల అసలే నిద్రలేమితో సతమతమవుతున్న మహిళలు మరింత ఒత్తిడికి గురవుతారు. దీని గురించి ఆలోచిస్తూ వారు సరిగ్గా నిద్రపోలేరు. దీంతో సమస్య మళ్లీ మొదటికొస్తుంది. ఇది చాలా సమస్యలను కొనితెస్తుంది. ఏది ఏమైనప్పటికీ పురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువ నిద్ర అవసరమే అన్నది నిర్వివాదాంశం. అయితే వారు మరికాసేపు ప్రశాంతంగా పడుకునేందుకు పురుషుల సహకారం పూర్తిగా అవసరం. వయసును బట్టి నిద్ర అవసరాలు నవజాత శిశువులు, పసిబిడ్డలకు ఎక్కువ నిద్ర అవసరం. సరైన ఆరోగ్యం, పనితీరు కోసం సగటున, పెద్దలకు సాధారణంగా రాత్రికి 7–9 గంటల నిద్ర అవసరం. వయస్సుతో ΄ాటు నిద్ర అవసరాలు కొద్దిగా తగ్గవచ్చు, వృద్ధులకు ఇప్పటికీ రాత్రికి 7–8 గంటల నిద్ర అవసరం. -
ఆయనకు స్త్రీ లాగా అలంకరించుకోవడం ఇష్టం!
మా ఆయన వయసు 27 ఏళ్లు. మా పెళ్లై ఏడాదయింది. ఒకరోజు రాత్రి నా దుస్తులు ధరించి అద్దంలో చూసుకుంటూ మురిసిపోవడం చూసి షాక్ తిన్నాను. ఏమిటిది అని అడిగితే అలా డ్రెస్ చేసుకుని ఆనందిస్తుంటానని చెప్పారు. నేనెంత గొడవ చేస్తున్నాన, ఆయన మాత్రం అప్పుడప్పుడు అలా చేస్తూనే ఉన్నాడు. రాత్రిపూట నా డ్రెస్ వేసుకుని, ఉదయం మార్చుకుని ఆఫీసుకు వెళుతున్నారు. ఇతరత్రా మేము హ్యాపీగానే ఉన్నాం కానీ ఈ అలవాటు ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని చాలా భయంగా ఉంది. మా వారి ఈ వింత ప్రవర్తనకు ఏదైనా పరిష్కారముందా?– సంధ్య, హన్మకొండమీ వారు ట్రాన్స్ వెస్టిజమ్ అనే ఒక అరుదైన సమస్యకు లోనయినట్లు అర్థమవుతోంది. పురుషుడు స్త్రీగాను, స్త్రీ– పురుషుడుగానూ అలంకరించుకుని లైంగికానందం పోందే ఈ వింత సమస్యకు ఒక ముఖ్య కారణం చిన్న వయసులో తల్లిదండ్రులు అమ్మాయిలు లేరని అబ్బాయిలకు గౌను, జడ వేసి పూలు పెట్టి అమ్మాయిలు లేని లోటును ఇలా తీర్చుకోవటం. మీ దాంపత్య జీవితం బాగానే ఉందన్నారు కాబట్టి కొంతవరకు నయం. మీరు ఆయనను ఎలాగైనా చికిత్సకు ఒప్పించగలిగితే సైకియాట్రిస్టుల పర్యవేక్షణలో బిహేవియర్ మాడిఫికేషన్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లాంటి కొన్ని ప్రత్యేక మానసిక చికిత్సలు చేసి మీ వారిని ఆ ప్రవర్తన నుంచి బయట పడేయవచ్చు. కేవలం మందుల ద్వారా లేదా కౌన్సెలింగ్ ద్వారా ఇలాంటి వింత ప్రవర్తనను మార్చలేము. రెండూ అవసరమే.ప్రేమికుడు దూరమవుతాడేమో...నేను గత రెండు సంవత్సరాలనుండి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఇప్పటివరకు సంతోషంగానే ఉన్నాం కానీ ఈ మధ్య నాలో ఒక కొత్త భయం మొదలయింది. తను ఇంకెవరితో అయినా కొత్తగా బంధాన్ని ఏర్పరుచుకుంటాడేమో అని.. ఈ ఆలోచన నుంచి నేను బయట పడలేక΄ోతున్నాను. దీనికి కారణం ఏంటి? ఎలా ఈ ఆలోచన నుంచి బయటపడాలి?– రాణి, జనగామమీలో ఏర్పడిన ఈ భయం కేవలం మీ ఊహ కావచ్చు. అకారణంగా కొందరిలో ఇలాంటి అభద్రతా భావాలు రావడం సహజమే! ఈ అభద్రత రావడానికి మీ రిలేషన్లో ఇటీవల ఏమైనా ఆ మార్పులు వచ్చాయా? లేక మీరు ఇంకేదైనా ఒత్తిడిలో ఉండి ఇలా ఆలోచిస్తున్నారా అని స్వయం పరిశీలన చేసుకోండి. మీ ప్రేమికుడితో మీ భయాన్ని పంచుకోండి. అతణ్ణి నొప్పించకుండా, నిందించకుండా ఎలాంటి సందర్భాలలో మీకీ భావాలు కలుగుతున్నాయో చెప్పడం ద్వారా అతను కూడా మీ బాధను అర్థం చేసుకుని, మీలోని ఫీలింగ్స్‌ను తగ్గించేందుకు తప్పకుండా సహకరిస్తాడు. మీ అభద్రత భావాన్ని అధిగమించాలంటే ఇద్దరూ కలిసి సమయాన్ని గడపటం, ఇద్దరికీ ఇష్టమైన పనులు చేస్తూ ఉండాలి. దీనివల్ల మీ బంధం మరింత గట్టిపడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు, ఏదైనా కొత్త హాబీ, ధ్యానం, వ్యాయామం లాంటివి చేయండి. ఇదే విషయం గురించి అతిగా ఆలోచించడం మానేసి, అతడిలో మీకు బాగా నచ్చిన విషయాలు లేదా అంశాలు ఏంటో ఒకసారి గుర్తుచేసుకోండి. దీర్ఘకాలం ΄ాటు ఉండే రిలేషన్షిప్స్లో అభద్రత కొంత సహజమే అయినప్పటికీ అది మిమ్మల్ని మరీ బాధించి, మనోవేదనకు గురి చేస్తుంటే మాత్రం ఒకసారి సైకియాట్రిస్ట్‌ను లేదా క్లినికల్ సైకాలజిస్టును మీ ఇద్దరూ కలిస్తే, మీలోని ఈ భయాన్ని, అభద్రతను తగ్గించి, మీ మధ్య సంబంధాన్ని మరింత బలపర్చేందుకు కౌన్సెలింగ్ ద్వారా తగిన సూచనలు, సలహాలు చేస్తారు. ఆల్ ద బెస్ట్!– డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
Balasana: ఒత్తిడిని తగ్గించే బాలాసనం
బాలాసనంలో శరీరం మొత్తం ముందుకు సాగి, చంటి పిల్లలు బోర్లా పడుకున్నప్పుడు కనిపించే భంగిమలో ఉంటారు. దీనిని శశాంకాసనం అనికూడా ఉంటారు. ఈ ఆసనంలో వెన్నెముక సాగి, మోకాళ్లు బలపడతాయి. పోత్తికడుపులోని అవయవాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుం నొప్పి సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి తగ్గి, శరీరం మొత్తం విశ్రాంతి పొందుతుంది.ముందుగా మ్యాట్‌పైన కాలి మడమల మీద హిప్ భాగం ఉండేలా వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి ఎత్తాలి. శ్వాస వదులుతూ తల, పోట్ట భాగాన్ని ముందుకు మెకాళ్ల మీదుగా పూర్తిగా వంచాలి. చేతులను నేలపై తలకిరువైపులా వెడల్పుగా ‘వి’ ఆకారంలో ఉంచాలి. ఈ పోజిషన్లో 30 సెకన్లపాటు ఆగి, విశ్రాంతి ΄పోందాలి. తర్వాత తిరిగి వజ్రాసనంలోకి రావాలి. ఇలా సుమారు 10 సార్లు చేయాలి. ఫలితాలు: రోజువారీ పనుల ద్వారా కలిగే ఒత్తిడి, చిరాకులాంటి సమస్యలు దూరం అవుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పేగులు, కాలేయం, మూత్రపిండాలకు బలం చేకూరుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నవారికి మంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకల సమస్యతో బాధపడేవారు, హైబీపి ఉన్నవారు నిపుణుల సూచనలు తీసుకోవాలి. – జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్ -
ఆకలి... నిద్ర సరిగా లేవా? మెగ్నీషియం లోపం కావచ్చు
మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే మెగ్నీషియం దేహంలో అధికంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్ నుంచి మనకు శక్తి వచ్చేలా చేయడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మంచి శక్తితోపాటు చక్కటి నిద్ర పట్టేలా చేస్తుంది. రక్తంలో చక్కెరలను, హార్మోన్లను క్రమబద్ధీకరిస్తుంది. మెగ్నీషియం తగినంత లేకపోతే కలిగే అనర్థాలేమిటో తెలుసుకుందాం. అనారోగ్యాలు వేధిస్తుంటాయి!శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే ఆకలి వేయదు. వికారంగా... వాంతులు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. నీరసంగా ఉంటారు. హార్ట్ బీట్‌రేట్ లో హెచ్చుతగ్గులు వస్తాయి. కళ్ళు మసక బారుతుంటాయి. కండరాలలో నొప్పి వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర సరిగ్గా పట్టదు. హైబీపీ వస్తుంది. ఆస్తమా రోగులకు మెగ్నీషియం లోపిస్తే ఈ సమస్య తీవ్రంగా మారుతుంది. ఆకుకూరలలోనూ, అవకాడో, అరటిపండ్లు, రాస్ బెర్రీస్, ఫిగ్స్ వంటి పండ్లలోనూ మెగ్నీషియం ఉంటుంది. అలాగే బ్రకోలీ, క్యాబేజి, పచ్చి బఠానీలు, మొలకలు వంటి వాటిలో కూడా ఇది దొరుకుతుంది. బ్రౌన్ రైస్, ఓట్స్, సీఫుడ్స్‌లో మెగ్నీషియం లభిస్తుంది. మెగ్నీషియం వెంటనే రావాలి అంటే ఒక కప్పు కాఫీ తాగాలి. చాక్లెట్ తిన్నా ఫలితం ఉంటుంది. మెగ్నీషియం లోపానికి వెంటనే జాగ్రత్తలు తీసుకోకుంటే అనారోగ్యానికి గురవుతారు.సబ్జా గింజలు, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మెగ్నీషియం లోపించదు. -
ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ పాజిటివ్ అంటే..? ప్రమాదమా..!
నాకు 40 ఏళ్లు. మూడవ నెల ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ పాజిటివేమో అనే డౌట్ చెప్పారు. చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఉమ్మనీరు టెస్ట్ చేస్తామన్నారు. దీనివల్ల అన్నీ కనిపెట్టొచ్చా? బేబీ హెల్దీగా ఉన్నట్టు ఎలా గుర్తించడం? – ఎన్. వైశాలి, షోలాపూర్ ఆమ్నియోసెంటీసిస్ (Amniocentesis) ద్వారా ఉమ్మనీరును టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. తగు జాగ్రత్తలతో ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్.. పొట్టలోపల బేబీకి టెస్ట్ చేసే ప్రక్రియ ఇది. ఈ వైద్య పరీక్షను ముఖ్యంగా క్రోమోజోమల్ సమస్యలేమైనా ఉన్నాయేమో అనే అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి సూచిస్తారు. జన్యు వ్యాధుల విషయంలోనూ ఈ టెస్ట్‌ను చేస్తారు. 40 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ కావడం, మీ బ్లడ్ టెస్ట్‌లలో డౌట్ రావడం వల్ల క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కనిపెట్టడానికి ఈ టెస్ట్‌ని సజెస్ట్ చేసి ఉంటారు. దీన్ని చాలా అనుభవం ఉన్న స్పెషలిస్ట్‌లే చేస్తారు. మీరు మామూలుగా ఫుడ్ తినే ఈ టెస్ట్‌కి వెళ్లొచ్చు. ఔట్ పేషంట్ డిపార్ట్మెంట్లోనే చేస్తారు. అల్ట్రసౌండ్ చేసి.. బేబీ, ప్లాసెంటా, పొజిషన్‌ను చెక్ చేసి వివరించి కన్సెంట్ తీసుకుని చేస్తారు. టెస్ట్ రిజల్ట్స్ 5 నుంచి 15 రోజుల్లో వస్తాయి. వచ్చే రిజల్ట్స్‌ని బట్టి తదనంతర పరిణామాలను మీతో డిస్కస్ చేస్తారు. ఈ టెస్ట్‌లో అన్నిరకాల అబ్నార్మిలిటీస్ని కనిపెట్టలేము. దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి. సెరిబ్రల్ పాల్సీ, ఆటిజం, స్పీనల్ బిఫడా, ఫిజికల్ చేంజెస్‌ను ఇందులో కనిపెట్టలేం. అలాంటివాటికి కొన్నిసార్లు అడ్వాన్స్డ్ స్కాన్ అవసరం అవుతుంది. ఈ ప్రొసీజర్‌లో 0–5 శాతం గర్భస్రావం అయ్యే రిస్క్, ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. యాంటీబయాటిక్స్ ఇస్తారు. ప్రొసీజర్ తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకుని ఇంటికి వెళ్లొచ్చు. మైల్డ్ క్రాంప్స్ ఉంటాయి. పారాసిటమాల్ లాంటివి ఇస్తారు. పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ప్రొసీజర్ తర్వాత బాగా కడుపు నొప్పి వచ్చినా, బ్లీడింగ్ అవుతున్నా.. వాటర్ లీక్ అయినా ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాలి. ఇంటికి వెళ్లాక ఇలాంటి లక్షణాలు కనపడినా.. చలి, జ్వరం ఉన్నా వెంటనే ఎమర్జెన్సీ వార్డ్‌కి వెళ్లాలి. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ ఫీలవకుండా.. పౌష్టికాహారం తీసుకోవాలి. — డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
వెజైనా నుంచి బ్యాడ్ స్మెల్ వస్తే పరిస్థితి అంతేనా..!
నాకు 18 ఏళ్లు. వెజైనా నుంచి బ్యాడ్ స్మెల్ వస్తోంది. నేను హాస్టల్లో ఉంటాను. నా ప్రాబ్లమ్‌కి సరైన మెడిసిన్‌ని సజెస్ట్ చేయగలరు. – అనామిక, హైదరాబాద్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్లో చాలా కామన్‌గా వచ్చేది బ్యాక్టీరియల్ వెజైనోసస్. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. వెజైనా నుంచి బ్యాడ్ స్మెల్ ఉంటుంది. రాషెస్, ఇచింగ్ ఉండవు. ఇది వెజైనాలో ఉండే నార్మల్ బ్యాక్టీరియా ఎక్కువైతే వస్తుంది. పలచగా.. వైట్‌గా డిశ్చార్జ్ కావచ్చు. ఫిషీ స్మెల్ ఉంటుంది. వెజైనా ఎసిడిటీ చేంజెస్ వల్ల వస్తుంది. సువాసనగల సబ్బులు, బబుల్ బాత్స్, వెజైనల్ డియోడరెంట్స్ వాడేవారిలో ఇది ఎక్కువ. ఇన్నర్వేర్ని గాఢమైన డిటర్జెంట్స్‌తో ఉతికినా.. తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురవుతున్నా ఇది ఎక్కువ అవుతుంది. మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే కాటన్ స్వాబ్‌తో వెజైనా నుంచి శాంపిల్ తీసి యూరిన్‌ని కూడా టెస్ట్‌కి పంపిస్తారు. ఆ రిజల్ట్స్‌తో కన్ఫర్మ్ అయితే యాంటీబయాటిక్ మాత్రలు, Doxycycline, Metronidazole లాంటివి ఇస్తారు. డాక్టర్ సలహా మేరకు పూర్తి కోర్స్ వాడాలి. కొంచెం తగ్గగానే మందులు ఆపేస్తే తిరగబెట్టే రిస్క్ పెరుగుతుంది. స్ట్రాంగ్ వెజైనల్ వాషెస్ కూడా వాడకూడదు. రోజుకు నాలుగైదుసార్లు వేడి నీళ్లతో శుభ్రం చేసుకుని.. పొడిగా ఉంచుకోవాలి. కాటన్ ఇన్నర్వేర్నే వాడాలి. ఎక్కువసార్లు ఈ ఇన్ఫెక్షన్ అవుతూంటే యూరిన్ కల్చర్, సెన్సిటివిటీ చెక్ చేయాల్సి ఉంటుంది. — డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ఖననం చేసేముందు కన్ను తెరిచిన పురిటికందు
సాక్షి, కోల్‌సిటీ(కరీంనగర్): చనిపోయాడనుకుని ఖననం చేయడానికి తీసుకెళ్తున్న మగశిశువు శ్వాస తీసుకోవడంతో వెంటనే పిల్లల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖనిలో చోటుచేసుకుంది. మంథని మండలానికి చెందిన ఓ మహిళ 26 వారాల గర్భిణి. నెలలు నిండకున్నా పురిటి నొప్పులు రావడంతో ఆమెను గోదావరిఖని లక్ష్మీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఏప్రిల్ 9న డెలీవరీ డేట్ ఇచ్చినా, పురిటినొప్పులు తీవ్రం కావడంతో వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. తక్కువ బరువుతో మగశిశువు జన్మించాడు. అయితే ఆ శిశువు బతకడం కష్టమని, ఏదైనా పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో శిశువును రాత్రంతా తల్లి వద్దే ఉంచారు బంధువులు. ఆదివారం ఉదయం శిశువును గమనించగా శ్వాస తీసుకోలేదు. దీంతో చనిపోయాడని భావించిన బంధువులు ఖననం చేయడానికి గోదావరి నది ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడికెళ్లాక శిశువుపై ఉంచిన గుడ్డను తీసి చూశారు. శిశువులో కదలిక కనిపించడంతో హుటాహుటిన లక్ష్మీనగర్‌లో గల మరో పిల్లల ఆస్పత్రికి తరలించారు. తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, మెరుగైన వసతులు కలిగిన పిల్లల ఆస్పత్రికి తరలించాల్సి ఉందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. సరిగా పరీక్షించకుండానే శిశువులో శ్వాస ఆడటం లేదని మొదట పురుడుపోసిన ఆస్పత్రి సిబ్బంది చెప్పడం వల్లే తాము ఖననం చేయడానికి తీసుకెళ్లామని శిశువు బంధువులు ఆరోపిస్తున్నారు. జరిగిన ఘటనలో తమ నిర్లక్ష్యమేమీ లేదని, మెరుగైన ఆస్పత్రికి తరలించాలని తాము ముందే చెప్పగా, చనిపోయాడని భావించి బంధువులే శిశువును శ్మశానానికి తీసుకెళ్లారని లక్ష్మీనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు వివరించారు. -
రాగి.. ఆరోగ్యరహస్యమేగి
సాక్షి, అదిలాబాద్: రాత్రి పడుకునే ముందు రాగి చెంబులో నీరు పోసి ఉదయం తాగితే ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతుంటారు. గతంలో రాగి చెంబులను ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రస్తుతం ప్లాస్టిక్ గ్లాస్లులు, ప్లాస్టిక్ ప్లేట్లు, నిత్యావసర వస్తువులన్నీ ప్లాస్టిక్ కావడంతో అనారోగ్యనికి గురవుతున్నారు. మారుతున్న జీవన విధానంలో 30ఏళ్లలోపు వారికి కూడా గుండె జబ్బులు, బీపీ, షుగర్, అల్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. దీంతో పట్టణ ప్రాంత ప్రజలతో పాటు గ్రామీణ ప్రజలు కూడా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. దీంట్లో భాగంగానే రాగి వినియోగం అమాంతం పెరిగింది. ఇళ్లలోనే కాకుండా రెస్టారంట్లలో కూడా రాగి పాత్రలను వాడుతున్నారు. రాగి పాత్రలోని నీరు ఆరోగ్యకరం రాగి పాత్రల్లో నీటిని తాడగం, రాగి ప్లేట్లల్లో భోజనం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి వ్యాధులు కూడా సోకవు. జీర్ణశక్తి పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాగి పాత్రల విలువ తెలుస్తోంది నేను ఇప్పటికీ రాగి చెంబులోనే నీటిని తాగుతా. నాతో పాటు మా ఇంట్లోని వారందరూ కూడా రాగి పాత్రలనే వాడుతారు. రాగి పాత్రల వాడకం వల్ల ఎలాంటి వ్యాధులు రావు. -నల్లా రత్నాకర్ రెడ్డి, రిటైర్డ్ టీచర్ ఆ నీటిని తాగితే ఎంతో మేలు.. ప్రస్తుతం రాగి బాటిళ్లలోనే నీటిని ఎక్కువగా వినియోగిస్తున్నాం. రాగి పాత్రల్లోని నీటిని తాగితే ఆరోగ్యంతో పాటు ఎలాంటి రోగాలు దగ్గరకు రావు. -రాంరెడ్డి, తహసీల్దార్ -
బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే ఇలా చేయండి
బెల్లి ఫ్యాట్.. ప్రతి ఒక్కరిలో కనిపించే సాధారణ సమస్య. పొట్ట చుట్టూ కొవ్వు బాగా పేరుకుపోవడం వల్ల ఇది ఏర్పడుతుంది. సమయానికి భోజనం చేయకపోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం, ఒత్తిళ్లతో కూడిన జీవితం, జంక్‌ఫుడ్ ఎక్కువగా తినడం. వ్యాయామం చేయకపోవడం ఇలాంటి కారణలతో ఈ ఫ్యాట్ ఏర్పడుతుంది. ఓ వ్యక్తి, మహిళ చూడటానికి ఎంత అందంగా ఉన్నా తనకున్న బెల్లి ఫ్యాట్ ఆ అందాన్ని తగ్గిస్తుంది. లేదా ఆ అభిప్రాయాన్ని వెంటనే మార్చుతుంది. దీని నుంచి విముక్తి పొందాలనుకుంటే మాత్రం కొంచెం ఒళ్లు వంచి కాలరీలు కరిగించాల్సిందే. రోజూ ఉదయం అయిదు నిమిషాలు చేసే వ్యాయామం ద్వారా మనం బరువు తగ్గించవచ్చు అన్న విషయం మీకు తెలుసా.. లేదా కేవలం రెండు నిమిషాల పాటు చేసే వ్యాయామం మనలోని కొవ్వును అంతం చేస్తుందన్న విషయం తెలుసా.. అవునండి వాస్తవాలే. అలసటను తగ్గిస్తుంది. ఉదయం పూట చేసే వ్యాయామం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది నిద్రను మెరుగుపరుస్తుందని పరిశోధనలో రుజువైంది. దీనివల్ల బరువు, బెల్లి ఫ్యాట్ కూడా తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలసటను తగ్గించి రోజంతా మనకు ఉల్లాసాన్ని, శక్తిని అందిస్తుంది. అదే విధంగా మానసిక స్థితి మెరుగుదలకు దోహదపడి ఏకాగ్రతను పెంచుతుంది. ఈ వేళలో ప్రసరించే అల్ట్రా వయోలెట్ కిరణాలు ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికడతాయి. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నందునే ఉదయం వేళలో వ్యాయామం చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తారు. అయితే ఉదయం చేసే వ్యాయామం తమ ఫిట్నెస్ దినచర్యకు అనుగుణంగా ఉంటాలని నిపుణులు సూచిస్తున్నారు. (కరోనా: వర్క్ ఫ్రం హోం వాళ్లు ఇలా చేయండి!) బరువు తగ్గడానికి ఉదయం చేసే ఉత్తమ వ్యాయామాలు బెల్లి ఫ్యాట్, బరువు తగ్గేందుకు అయిదు నిమిషాలు రోజూవారి వ్యాయామం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇది నేర్చుకోవడం కూడా ఎంతో సులభం. ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ఎక్కడైన చేయవచ్చు. దీన్ని సులభంగా దినచర్యలో భాగం చేయవచ్చు. ఇది బెల్లి ఫ్యాట్‌ను తగ్గించి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. 1.. పవర్ పుష్-అప్స్ జీవక్రియను పునరుద్ధరించడానికి, బరువు తగ్గడానికి అలాగే కండరాలను బలోపేతం చేయడానికి పుష్అప్స్ సహాయపడతాయి. ఉదయం పూట మీరు చేయగలిగే వ్యాయామాలలో ఇది ఉత్తమైనది. పవర్ పుష్-అప్స్ చేయడం వలన మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటారు. బలమైన ఉదర కండరాలను నిర్మించడంలో ఇది సహాయపడుతుంది. పవర్ పుష్-అప్స్ ఎలా చేయాలి: ► తలక్రిందులుగా ఉన్న ‘V’ భంగిమలో ఉండి, మోకాళ్ళతో వంగి, నడుము వెనక భాగాన్ని పైకి ఉంచి ప్రారంభించండి. ► మీ చేతులను భుజం-వెడల్పు కంటే కొంచెం వెడల్పుగా ఉంచి ఫోటోలో చూపించినట్లు ఉంచండి. ► మీ మోకాళ్ళను వంచి, మీ మోచేతులను పూర్తి పుష్-అప్ స్థానంలో వంచినప్పుడు బరువును ముందుకు ఉంచడి. ► V భంగిమను కొనసాగిస్తూ, మొదట ప్రారంభించినట్లు నడుము వెనక భాగాన్ని పైకి అనండి. ► రెండు భంగిమల మధ్య ముందుకు వెనుకకు బౌన్స్ అవుతూ సుమారు 5 నిమిషాలు వీటిని చేయండి. జంపింగ్ జాక్స్ ఇతర కార్డియో వర్కౌట్ల మాదిరిగా, ఉదయపు వ్యాయామంలో దీని చేర్చడం వల్ల మంచి ఆరోగ్య ఫలితాను ఇస్తుంఇ. ఇది ఆరోగ్యకరమైన గుండెకు ఉపయోగపడుతుంది. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జంపింగ్ జాక్స్ ఎలా చేయాలి: ► మీ పాదాలతో నిటారుగా నిలబడండి. ►ఫోటోలో చూపించినట్టుగా ఒక్కసారిగా పైకి ఎగిరి మీ కాళ్లను కొంచెం దూరంగా విస్తరించడండి. మీ చేతులను మీ తలపైకి తీసుకువచ్చేటప్పుడు భుజం కంటే పైకి తీసుకురండి. ►మళ్లీ మీ చేతులను యధాస్థితికి తీసుకు వచ్చి, మీ కాళ్లను ఒకచోట చేర్చండి. ►ఒకవేళ మీకు ఈ వ్యాయామంలో అనుభవం ఉంటే తక్కువ వేగంతో చేయండి. ఇలా పదిసార్లు కొద్ది కొద్ది సమయం గ్యాప్‌తో చేయండి. ►దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి ప్రతిరోజూ ఈ వ్యాయామం కోసం నిర్ధిష్ట సమయాన్ని కేటాయించండి. కేవలం 10 నిమిషాలు అయినా సరిపోతుంది. ► ఒకవేళ ఉదయం ఈ వ్యాయామం చేయలేకపోతే ఫర్వాలేదు. సాయంత్రం అయినా మీరు ఈ దినచర్యను కొనసాగించండి. -
ఆహారం మారిస్తే...ఆరోగ్యానికీ భూమికీ మేలు!
ఆహారపు అలవాట్లను మార్చుకుంటే చాలు.. భూమిని వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించుకోవడమే కాకుండా.. మన ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుచుకోవచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీల్లోని దాదాపు 43 వేల ప్రాంతాల ప్రజల ఆహారపు అలవాట్లను పరిశీలించిన తరువాత తాము ఈ నిర్ణయానికి వచ్చామని, ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా నీటి వాడకాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని తద్వారా భవిష్యత్తులో భూతాపోన్నతి కారణంగా వచ్చే వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా తగ్గించుకోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. యూరోపియన్ దేశాల్లో పశు ఉత్పత్తులు (పాలు, మాంసం, గుడ్లు) ఎక్కువగా ఉంటాయని వీటిని తయారు చేసేందుకు నీరు ఎక్కువగా వాడాల్సి ఉంటుందని.. వీటి స్థానంలో మాంసం, పశు ఆధారిత కొవ్వులతోపాటు, చక్కెర, నూనెలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి వీటితో నీటిని ఆదా చేయవచ్చునని వివరించారు. తినే ఆహారంలో ఉండే మాంసం, ఇతర పశు ఉత్పత్తులను బట్టి నీటి ఆదా అనేది 11 శాతం నుంచి 55 శాతం వరకూ ఉండవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా కట్టారు. ఒక రోజుకు అవసరమైన ప్రొటీన్లు, కొవ్వులను పరిగణలోకి తీసకుని చేసిన ఈ అధ్యయనం ద్వారా తేలిందేమిటంటే.. కాయగూరలు ఎక్కువగా ఉన్న ఆహారం భూమి నాలుగు కాలాలపాటు పచ్చగా ఉండేందుకు పనికొస్తుందీ అని! -
హలో డాక్టర్..హార్ట్ మిస్సాయే..!
పాలమూరు: మారిన జీవన శైలితో ఎక్కువగా వస్తున్న అనారోగ్య సమస్యల్లో గుండెపోటు ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అలా జిల్లాలో ఎవరికైనా గుండెపోటు వచ్చిందా.. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తీసుకొస్తే చికిత్స అందే పరిస్థితులు లేవు. ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు అయ్యి నాలుగేళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటికీ జనరల్ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగం లేకపోవడం దురదృష్టకరం. నాలుగు జిల్లాల ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఆస్పత్రిలో అత్యంత ముఖ్యమైన విభాగాల్లో అవసరమైన నిపుణులు లేకపోవడంతో అత్యవసర కేసులను హైదరాబాద్ పంపించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు అప్పులు చేయలేక.. ప్రాణాలపై ఆశలు వదిలేసుకుంటున్నారు. సాధారణ వైద్యమే.. మూత్రపిండాల సమస్య ఉందా.. ఆకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చిందా.. కేన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే హైదరాబాద్, లేదంటే ఇతర ఇతర నగరాలకు వెళ్లాల్సిందేనంటూ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రే కాదు.. ఏ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినా వైద్యులు ఇచ్చే సలహా ఇది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీజనల్ వ్యాధులకు చికిత్స చేసే వైద్యులు తప్ప పెద్ద జబ్బులకు ప్రత్యేక వైద్య నిపుణులు లేరు. ఉమ్మడి జిల్లా ప్రజలకు పెద్దదిక్కుగా భావించే మహబూబ్‌నగర్‌లోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఖాళీల కారణంగా పేద ప్రజలు వేదనకు గురవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇక్కడి పోస్టులు భర్తీ కాకపోవడంతో.. తద్వారా అత్యవసర విభాగాల్లోనూ ఎంబీబీఎస్, శిక్షణ పొందుతున్న జూనియర్ వైద్యులతోనే వైద్యం చేయిస్తున్నారు. పరిస్థితి చేజారాక అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువెళ్లాల్సి వస్తే మధ్యలో ప్రాణాలు వదులుతున్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల వచ్చి నాలుగేళ్లవుతున్నా నిబంధనల ప్రకారం ఆస్పత్రిలో ఉండాల్సిన విభాగాలు, వైద్యులు, వసతులు కల్పించకపోవడం గమనార్హం. ప్రైవేట్‌లోనూ లేరు మహబూబ్‌నగర్ పట్టణంలో గుండెకు సంబంధించి అన్ని రకాల వసతులు ఏ ప్రైవేట్ ఆస్పత్రిలోనూ లేవు. ఇక గుండె సంబంధిత నిపుణులు లేకపోవడంతో పేదల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. ఇవీ పోస్టులు గుండె సంబంధిత నిపుణులే కాదు.. జనరల్ ఆస్పత్రిలో ఇతర విభాగాల్లోనూ వైద్యుల కొర త ఉంది. జనరల్ మెడిసిన్ విభాగంలో 12 పోస్టులకు ఒకరే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక జనరల్ సర్జరీలో 14 మందికి ఇద్దరు, ఆర్థోలో ఆరుగురికి ఒకరు, పీడియాట్రిక్‌లో 12 మందికి ముగ్గురు, గైనిక్‌లో 12 మందికి ముగ్గురు, ఈఎన్టీలో ముగ్గురికి ఒక్కరు, డెర్మటాలజీలో ముగ్గురికి ఒక్కరు, అనస్థీషియాలో 14 మంది కి నలుగురు వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నా రు. దీంతో పేదలకు నిరాశే ఎదురవుతోంది. కార్డియాలజీ సేవలు అవసరం జనరల్ ఆస్పత్రిలో ఒక్కరైనా కార్డియాలజిస్ట్ ఉండాలి. ఈ విభాగం లేకపోవడం, వైద్యుల నియామకం జరకపోవడంతో గుండె సంబంధిత వ్యాధులతో ఎవరైనా వస్తే జనరల్ మెడిసిన్ వైద్యులు చూస్తున్నారు అత్యవసరమైతే హైదరాబాద్ రెఫర్ చేస్తున్నారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో నిపుణులను నియమించాల్సి ఉంది. – డాక్టర్ రామకిషన్, సూపరింటెండెంట్ -
హరిత'గీతం'
♦ హరితహారానికి ‘సాక్షి’ చేయూత ♦ ఈదుల గుడ్డంలో ఈత వనాల పెంపకం ♦ నాలుగేళ్లలో పూర్వవైభవం ♦ గీత కార్మికులకు ఉపాధి ఎమ్మెల్యే సోలిపేట తోడ్పాటు ♦ ఈ పండుగలో మంత్రి హరీశ్‌రావు భాగస్వామ్యం సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : చిట్టాపూర్‌లోని ఈదులగుడ్డంలో గతంలో దట్టమైన ఈత వనం ఉండేదట. 70-80 ఏళ్ల కిందట ఈ స్థలంలో పశువులు దూరలేనంతగా దట్టమైన ఈత వనం ఉండేదట. నిండు పున్నమి నాడు వనంలోకి వెళ్లినా అమావాస్య చీకట్లే కనిపించేదట. ఇప్పుడా ఈదులు లేవు. పూర్తిగా అంతరించి బీడుగా మిగిలింది. ఫలితంగా గీత కార్మికుల బతుకులు మోడువారాయి. బీడు భూమికి పూర్వ వైభవం తీసుకొచ్చి, పడావుపడిన గౌడకులస్తుల కల్లు మండ్వాల్లో పచ్చని పంది రి వేసే బాధ్యతను ‘సాక్షి’ భుజానికి ఎత్తుకుంది. ఆకుపచ్చ ఆవరణ.. బంగారు బతుకుల కోసం ‘సాక్షి’ హరితహారం లో భాగం పంచుకుంటోంది. గ్లొబలైజేషన్ ధాటికి కుప్ప కూలిన ఈత వనాలను నిలబెట్టి, ఉపాధికి దూరమై గల్ఫ్ దేశాలకు వలస పోతున్న గీత కార్మికుల బతుకుల్లో పూర్వ వైభవం నింపటం కోసం ‘సాక్షి’ ఓ అడుగు ముందుకేసింది. ‘సాక్షి’ చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తోడయ్యారు. ఆయన తన సొంతూరైన చిట్టాపూర్‌లోని ఐదు ఎకరాల్లో ఈత వనాలు నాటడానికి తొలి అవకాశం కల్పించారు. చిట్టాపూర్‌లో గీత కార్మిక సొసైటీకి 3.30 ఎకరాల భూమి ఉంది. దానికి ఆనుకొని రామలింగారెడ్డి పూర్వీకుల భూమి కూడా కొంత ఉంది. ఈ స్థలాన్ని సొసైటీకి ఇవ్వడానికి ఎమ్మెల్యే ముందుకొచ్చారు. ఎప్పటి నుంచో పడావు పడిన ఈ మొత్తం కలిపి దాదాపు 5 ఎకరాల స్థలంలో ఈత వనా లు నాడటానికి ప్రణాళిక సిద్ధమైంది. గురువారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధి, స్థానిక గీత కార్మికుల నాయకులు, స్థానిక సర్పంచు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఈ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన తన నివాసంలో గ్రామ పెద్దలతో కలిసి సమాలోచన చేశారు. నాటుతున్న మొక్కలు నాలుగేళ్లలోనే కల్లును ఇస్తాయని, వీటి ద్వారా గీత కార్మికులు ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. తన నిధులతో రెండు బోరు బావులను తవ్విస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ రమేశ్‌రెడ్డి, గీత కార్మిక సొసైటీ ముఖ్యులు సర్వయ్యగారి నర్సాగౌడ్, తీగల స్వామిగౌడ్, వెంకటస్వామిగౌడ్, ఇర్కోడు రామాగౌడ్, నాంపల్లి నర్సింహాగౌడ్, ఎలగాని ఎల్లంగౌడ్, బొమ్మ బుచ్చయ్య, ఆగం నర్సింహాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. చిట్టాపూర్‌లో ‘సాక్షి’ హరిత పండుగ.. ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో 15 వేల మంది గీత కార్మికులతో చిట్టాపూర్‌లో హరిత పండుగ నిర్వహిస్తున్నట్టు చిట్టాపూర్ గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడు స్వామిగౌడ్, గౌడ కుల పెద్ద శివగౌడ్ తెలిపారు. ఈ పండుగకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా, ఇతర ప్రముఖులు, గీత కార్మిక నేతలు అతిథులుగా రానున్నారని వారు చెప్పారు. జిల్లాలోని గీత కార్మికులంతా ఈ పండుగలో భాగస్వామ్యం కావాలని వారు కోరారు. -
ప్రజల మనిషి
ఖమ్మం అర్బన్ : ఖమ్మం శివారు ధంసలాపురం అగ్రహారం కాలనీ పరిధిలోని పాఠశాలలో 1.20 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం గల ఓవర్‌హెడ్ ట్యాంకు ఉంది. ధంసలాపురం పంచాయతీగా ఉన్నప్పుడే ఇక్కడ 750 నల్లాలు ఉండేవి. నగరపాలక సంస్థలో ఈ పంచాయతీ విలీనమైనా గత ఏడాది వరకు ఇక్కడి ప్రజలు ఆ ట్యాంకు ద్వారా నీరు అందేది. ట్యాంకుకు నీటి సరఫరా చేసేందుకు ఐదు బోర్లు, ఒక బావిని ప్రభుత్వం ఏర్పాటి చేసింది. అయితే కొంత కాలంగా రెండు బోర్లు, బావిలో నీరు అడుగంటి పోయాయి. దీంతో ట్యాంకుకు నీటి సరఫరా అంతంత మాత్రంగా అందేవి. దీంతో నీరు సరిపోక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగునీటి కోసం అలమటించారు. తమ అవస్థలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయినా వారి సమస్యకు పరిష్కారం లభించలేదు. ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయాడు రైతు ఆళ్ల వెంటకరెడ్డి. కాలనీకి ఆనుకున్న తన వ్యవసాయ బావి నుంచి నీళ్లు ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. కాలనీలోని సుమారు ఐదు వేల మంది జనాభా కలిగిన సుమారు 1400 కుటుంబాలకు ‘జల’ ఔదార్యం చేసేందుకు పూనుకున్నారు. వెంకటరెడ్డి నిర్ణయాన్ని నగరపాలక సంస్థ అప్పటి కమిషనర్ శ్రీనివాస్ అభినందించారు. ఆయన బావి నుంచి ఓవర్‌హెడ్ ట్యాంకుకు నీటి సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. బావికి పైప్లైన్లు ఏర్పాటు చేసి ఓవర్‌హెడ్ ట్యాంకుకు ఎక్కిస్తున్నారు. భూమి బీడుగా మార్చుకుని... వెంకటరెడ్డి తనకున్న రెండెకరాల భూమిలో ఈ బావి ఆధారంగానే వ్యవసాయం చేసుకునే వాడు. ఈ ఏడాది గ్రామానికి నీటి సరఫరా చేయాల్సి రావడంతో పంట నష్టపోయినా పర్వాలేదనుకున్నాడు. ప్రజలు మాత్రం నీటి కోసం ఇబ్బందులు పడొద్దనుకుని నాట్లు వేయకుండా భూమిని బీడుగానే వదిలేశాడు. బావిలో పూడిక తీసి నిరాటకంగా నీటిని సరఫరా చేసేందుకు తాను సిద్ధమేనని కార్కొరేషన్ అధికారులతో ఇప్పటికే చెప్పేశాడు.