సాక్షి, అదిలాబాద్: రాత్రి పడుకునే ముందు రాగి చెంబులో నీరు పోసి ఉదయం తాగితే ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతుంటారు. గతంలో రాగి చెంబులను ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రస్తుతం ప్లాస్టిక్ గ్లాస్లులు, ప్లాస్టిక్ ప్లేట్లు, నిత్యావసర వస్తువులన్నీ ప్లాస్టిక్ కావడంతో అనారోగ్యనికి గురవుతున్నారు. మారుతున్న జీవన విధానంలో 30ఏళ్లలోపు వారికి కూడా గుండె జబ్బులు, బీపీ, షుగర్, అల్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. దీంతో పట్టణ ప్రాంత ప్రజలతో పాటు గ్రామీణ ప్రజలు కూడా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. దీంట్లో భాగంగానే రాగి వినియోగం అమాంతం పెరిగింది. ఇళ్లలోనే కాకుండా రెస్టారంట్‌లలో కూడా రాగి పాత్రలను వాడుతున్నారు.
రాగి పాత్రలోని నీరు ఆరోగ్యకరం
రాగి పాత్రల్లో నీటిని తాడగం, రాగి ప్లేట్లల్లో భోజనం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి వ్యాధులు కూడా సోకవు. జీర్ణశక్తి పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
రాగి పాత్రల విలువ తెలుస్తోంది
నేను ఇప్పటికీ రాగి చెంబులోనే నీటిని తాగుతా. నాతో పాటు మా ఇంట్లోని వారందరూ కూడా రాగి పాత్రలనే వాడుతారు. రాగి పాత్రల వాడకం వల్ల ఎలాంటి వ్యాధులు రావు. -నల్లా రత్నాకర్ రెడ్డి, రిటైర్డ్ టీచర్
ఆ నీటిని తాగితే ఎంతో మేలు..
ప్రస్తుతం రాగి బాటిళ్లలోనే నీటిని ఎక్కువగా వినియోగిస్తున్నాం. రాగి పాత్రల్లోని నీటిని తాగితే ఆరోగ్యంతో పాటు ఎలాంటి రోగాలు దగ్గరకు రావు. -రాంరెడ్డి, తహసీల్దార్
Comments
Please login to add a commentAdd a comment