copper metal
-
రాగి.. ఆరోగ్యరహస్యమేగి
సాక్షి, అదిలాబాద్: రాత్రి పడుకునే ముందు రాగి చెంబులో నీరు పోసి ఉదయం తాగితే ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతుంటారు. గతంలో రాగి చెంబులను ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రస్తుతం ప్లాస్టిక్ గ్లాస్లులు, ప్లాస్టిక్ ప్లేట్లు, నిత్యావసర వస్తువులన్నీ ప్లాస్టిక్ కావడంతో అనారోగ్యనికి గురవుతున్నారు. మారుతున్న జీవన విధానంలో 30ఏళ్లలోపు వారికి కూడా గుండె జబ్బులు, బీపీ, షుగర్, అల్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. దీంతో పట్టణ ప్రాంత ప్రజలతో పాటు గ్రామీణ ప్రజలు కూడా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. దీంట్లో భాగంగానే రాగి వినియోగం అమాంతం పెరిగింది. ఇళ్లలోనే కాకుండా రెస్టారంట్లలో కూడా రాగి పాత్రలను వాడుతున్నారు. రాగి పాత్రలోని నీరు ఆరోగ్యకరం రాగి పాత్రల్లో నీటిని తాడగం, రాగి ప్లేట్లల్లో భోజనం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి వ్యాధులు కూడా సోకవు. జీర్ణశక్తి పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాగి పాత్రల విలువ తెలుస్తోంది నేను ఇప్పటికీ రాగి చెంబులోనే నీటిని తాగుతా. నాతో పాటు మా ఇంట్లోని వారందరూ కూడా రాగి పాత్రలనే వాడుతారు. రాగి పాత్రల వాడకం వల్ల ఎలాంటి వ్యాధులు రావు. -నల్లా రత్నాకర్ రెడ్డి, రిటైర్డ్ టీచర్ ఆ నీటిని తాగితే ఎంతో మేలు.. ప్రస్తుతం రాగి బాటిళ్లలోనే నీటిని ఎక్కువగా వినియోగిస్తున్నాం. రాగి పాత్రల్లోని నీటిని తాగితే ఆరోగ్యంతో పాటు ఎలాంటి రోగాలు దగ్గరకు రావు. -రాంరెడ్డి, తహసీల్దార్ -
డాక్టర్ కాపర్ నుంచి కాపర్ ఫిల్టర్డ్ మాస్క్
లక్డీకాపూల్: డాక్టర్ కాపర్ బ్రాండ్‌తో రాగి ఉత్పత్తులు తయారీలో ఉన్న ఎంఎస్ఆర్ ఇండియా తాజాగా కాపర్ పిల్టర్డ్ ఎన్–95 రీయూజెబుల్ మాస్క్‌తో పాటు పేటెండెడ్ కాపర్ కేర్ కీను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ మెష్ క్లాత్, మాయిశ్చర్ కంట్రోల్, యాంటీ బ్యాక్టీరియల్ ఫినిష్, కాపర్ ఫిల్టర్, ఎన్–95 ఫిల్టర్, కాపర్ క్లాత్ ఫిల్టర్‌తో ఐదు లేయర్లతో కూడిన మాస్క్‌ను రూపొందించినట్టు ఎంఎస్ఆర్ సీఈఒ డాక్టర్ ఎం.మల్లారెడ్డి తెలిపారు. ఎన్–95 మాస్క్ కంటే 90 శాతం మెరుగ్గా ఇది పని చేస్తుందన్నారు. వీటిని అందరికీ అందుబాటు ధరలో ఉంచాలనే ఉద్దేశంతో రూ. 199లకే అందిస్తున్నామని తెలిపారు. 2021 మార్చి నాటికి ఒక కోటి యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మల్లారెడ్డి వెల్లడించారు. -
శ్రీకాకుళం ఏజెన్సీలో ఘరానా మోసం
శ్రీకాకుళం: రైస్ పుల్లింగ్, కాపర్ కాయిల్ పేరుతో శ్రికాకుళం ఏజెన్సీలో రూ. 50 లక్షలు కొల్లగొట్టిన వారిపై కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రికి చెందిన వ్యక్తులంగా నిందితులు చెప్పుకోవటంతో పోలీసులు వారిపై కేసునమోదు చేయడంలేదని సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఓ ఎస్సై పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దోనుబాయి ప్రాంతంలో ఏజెంట్ నెట్వర్క్ ముసుగులో మాయగాళ్లు గిరిజనులకు మస్కా కొట్టారు. అయితే సొమ్ము రికవరీకి పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. పోలీసుల అదుపులో విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన ముగ్గురు నిందితులు ఉన్నారు.