శ్రీకాకుళం: రైస్ పుల్లింగ్, కాపర్ కాయిల్ పేరుతో శ్రికాకుళం ఏజెన్సీలో రూ. 50 లక్షలు కొల్లగొట్టిన వారిపై కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రికి చెందిన వ్యక్తులంగా నిందితులు చెప్పుకోవటంతో పోలీసులు వారిపై కేసునమోదు చేయడంలేదని సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఓ ఎస్సై పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దోనుబాయి ప్రాంతంలో ఏజెంట్ నెట్వర్క్ ముసుగులో మాయగాళ్లు గిరిజనులకు మస్కా కొట్టారు. అయితే సొమ్ము రికవరీకి పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. పోలీసుల అదుపులో విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన ముగ్గురు నిందితులు ఉన్నారు.
శ్రీకాకుళం ఏజెన్సీలో ఘరానా మోసం
Published Sat, Jul 2 2016 2:32 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement