Rice Pulling
-
కుకింగ్ చేస్తే రైస్‘పుల్లింగ్’!
సాక్షి, హైదరాబాద్: చంద్రయాన్–3 పేరుతో హైదరాబాద్‌లో ఒకరిని బురిడీ కొట్టించి రూ. 3 కోట్లు కొల్లగొట్టిన రైస్ పుల్లింగ్ గ్యాంగ్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ కేటుగాళ్ల మోడస్ ఆపరెండీని సీసీఎస్ పోలీసులు వివరించారు. సాధారణ చెంబు, బిందెలకు అతీంద్రియశక్తులు ఉన్నాయంటూ నమ్మించి నిండా ముంచడం వారి శైలి అని... సాధారణ చెంబు/బిందెను ‘రైస్‌పుల్లర్’గా మార్చడానికి ‘కుకింగ్’ చేస్తుంటారని పేర్కొన్నారు. అమోఘ శక్తులంటూ... రైస్ పుల్లింగ్ అంటే బియ్యాన్ని ఆకర్షించి తన వైపునకు లాక్కోవడం. ఇలాంటి శక్తులున్న పాత్రలు, బిందెలు, చెంబుల పేరు చెప్పి మోసగాళ్లు అందినకాడికి దండుకుంటుంటారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వీటికి చేజిక్కించుకుంటే అమోఘ మైన ఫలితాలు ఉంటాయని నమ్మబలుకుతారు. సాధారణంగా కేటుగాళ్లు కస్టమర్లకు రైస్‌పుల్లింగ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలనే చూపిస్తుంటారు. అనేక సందర్భాల్లో తాము విక్రయిస్తున్న పాత్రలను చూసే అవకాశం కొనే వారికి ఇవ్వరు. అయితే ఎవరైనా తమకు ఆ పాత్ర మహిమల్ని ప్రత్యక్షంగా చూపించాలని కోరితే మాత్రం చూపిస్తారు. ఇలాంటి ముఠాలు బియ్యాన్ని తమదైన శైలిలో అన్నంగా వండటం ద్వారా రైస్ పుల్లింగ్ చేసేలా చేస్తారు. బియ్యంలో సన్నని ఇనుప రజను కలిపి బిరుసుగా అన్నం వండుతారు. దీన్ని ఎండబెట్టడం ద్వారా మళ్లీ బియ్యంలా కనిపించేలాగా చేస్తారు. అనంతరం రైస్‌పుల్లర్‌గా పేర్కొనే పాత్ర లోపలి భాగంలో ఎవరికీ కనిపిచంకుండా అయస్కాంతం ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ పాత్రకు దగ్గరగా ఇనుప రజనుతో కూడిన బియాన్ని ఉంచితే అది దానికి అతుక్కుంటుంది. ఇలాంటి షోలు చూపించే ఈ మోసగాళ్లు అమాయకులను బుట్టలో వేసుకుంటుంటారని పోలీసులు వివరిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ముఠాలకు చెందిన వారిలో అనేక మంది తొలుత బాధితులుగా మారినవారేనని పోలీసులు చెబుతున్నారు. తాము నష్టపోయిన మొత్తాన్ని తిరిగి అదే మార్గంలో సంపాదించాలనో, అసలు ఈ రైస్‌పుల్లర్లు ఉన్నాయా? లేవా? అనే అధ్యయనం కోసమో అలాంటి ముఠాలతో జట్టుకడుతున్నారు. ఒకసారి తేలిగ్గా డబ్బు వచ్చిపడిన తర్వాత అదే దందా కొనసాగించేస్తున్నారు. ప్రధానంగా తమిళనాడు, కర్ణాటకతో పాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో రైస్ పుల్లింగ్, డబుల్ ఇంజిన్‌గా పిలిచే రెండు తలల పాములతో మోసాలు చేసే ముఠాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దొంగ సర్టిఫికేషన్లు రైస్ పుల్లింగ్ ముఠాల్లో కొన్ని ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తుంటాయి. వాటి కేంద్రంగానే కొన్ని ఉపకరణాలను కలిగి ఉండి ఆయా రైస్‌పుల్లర్స్‌ను పరీక్షించినట్లు నటిస్తూ ఆయా ఉపకరణాలు నిజమైనవనేలా సర్టిఫికేషన్ ఇచ్చేస్తుంటారు. ఇదంతా దాన్ని కొనే వారి ఎదురుగానే జరుగుతుంది. ఇలాంటి ముఠాల చేతిలో మోసపోయిన వారి సంఖ్య పదుల్లో ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే ఇకపై ఇంకెవరూ మోసపోకుండా అప్రమత్తం చేసిన వాళ్లవుతారని చెబుతున్నారు. కస్టడీకి తీసుకోవాలని నిర్ణయం పోలీసులు అరెస్టు చేసిన విజయ్‌కుమార్, సాయి భరద్వాజ్, సంతోష్, సురేందర్‌లను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించాలని అధికారులు నిర్ణయించారు. -
చంద్రయాన్-3 సక్సెస్ పేరిట రైస్ పుల్లింగ్.. పాత్ర పేరుతో 20కోట్లు..
సాక్షి, హైదరాబాద్: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రయాన్-3 సక్సెస్‌తో ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు మారుమోగ్రుతోంది. అయితే, కొందరు కేటుగాళ్లు చంద్రయాన్-3 పేరును వాడుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ ఉదంతంపై హైదరాబాద్‌లో కేసు నమోదు అయ్యింది. వివరాల ప్రకారం.. కొందరు కేటుగాళ్లు చివరిని చంద్రయాన్-3ని కూడా వదిలిపెట్టలేదు. చంద్రయాన్ సక్సెస్‌కు రైస్ పుల్లింగ్ కారణమని భారీ మోసానికి తెర లేపారు. చంద్రయాన్-3 విజయానికి ఉపయోగించిన పాత్ర అమ్ముతామని కొందరు కేటుగాళ్లు ఓ వ్యాపారవేత్త వద్ద నుంచి ఏకంగా రూ.20కోట్లు దోచేశారు. ఇది మహిళ గల పాత్ర అంటూ కలరింగ్ ఇచ్చి బురిడీ కొట్టించారు. దీంతో, బాధితుడు.. నగరంలోని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి విజయ్ కుమార్ అనే వ్యక్తితో సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: ఉజ్జయిని ఘోరం.. బాధితురాలి దత్తతకు ముందుకు వచ్చిన పోలీసాయన -
నిధుల వేటలో.. మోసం లోతుల్లో!
రైస్ పుల్లింగ్.. పూడు పాములు.. అక్షయపాత్ర.. సంజీవని వేరు.. బంగారు నాణేలు.. పేర్లు వేరైనా మోసం ఒక్కటే. ఊరికే డబ్బు వస్తుందంటే చాలు.. నమ్మడం అలవాటైన వాళ్లు మోసగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును వాళ్ల చేతిలో పెట్టి తీరా మోసపోయాక లబోదిబోమంటున్నారు. ఇక గుప్త నిధుల కోసమని అమావాస్య రాత్రిళ్లు.. పౌర్ణమి వెలుగుల్లో అడవిని జల్లెడ పడుతున్నారు. చారిత్రక ఆలయాలు, ప్రాంతాలను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఖాళీ కుండలు వెక్కిరిస్తున్నా అన్వేషణ మాత్రం కొనసాగుతోంది. గతేడాది పలమనేరు మండలం దేవలంపెంట పురాతన శివాలయం ఎదురుగా ఉన్న నంది విగ్రహంలో కోట్లాది రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయంటూ దాన్ని హైదరాబాద్ ముఠా ధ్వంసం చేసింది. ఇది కేవలం మోసమేనని పోలీసులు నిర్ధారించారు. ఇందుకు కారణమైన వారిని అరెస్టు చేశారు. ఏడాది క్రితం మండలంలోని దొడ్డిపల్లి అడవిలో ఓ ముఠా గుప్తనిధుల తవ్వకాలకు వెళుతూ వేటగాళ్ల కరెంటు ఉచ్చుకు చిక్కి ఇద్దరు గాయపడ్డారు తాజాగా నియోజకవర్గంలో బేలుపల్లి సమీపంలోని శాతపురాళ్ల ఆలయం వద్ద ఓ ముఠా తవ్వకాలు చేపట్టడం కలకలం రేపింది. .. ఇలాంటి ఘటనలు పోలీసుల దృష్టికి వెళితే కానీ విషయాలు వెలుగులోకి రాని పరిస్థితి. పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో తరచుగా తవ్వకాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పలమనేరు: జిల్లాలోని పడమటి మండలాల్లో గుట్టుచప్పుడు కాకుండా గుప్తనిధుల వేట సాగుతోంది. రాత్రివేళల్లో కొన్ని అంతర్ రాష్ట్ర ముఠాలు స్థానికులను ఏజెంట్లుగా నియమించుకొని తమ పని కానిచ్చేస్తున్నాయి. ముఖ్యంగా పురాతన, పాడుబడ్డ ఆలయాల్లో పూర్వీకులు బంగారాన్ని దాచి ఉంటారనే అనుమానంతో ఈ తవ్వకాలు చేపడుతున్నారు. ఈ కారణంగా ఇప్పటికే పురాతన ప్రాశస్త్యం ఉన్న పలు ఆలయాలు ధ్వంసమయ్యాయి. జిల్లాలోని పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాలు ఇటు కర్ణాటక, అటు తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నాయి. దీంతో పక్క రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి ఎన్నో అడ్డదారులు ఉన్నాయి. ఎవరైనా, ఎప్పుడైనా సులభంగా వచ్చే వీలుంది. దీంతో గుప్త నిధుల వేటగాళ్లు ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. గతంలోనూ నకిలీ బంగారు నాణేలు, రైస్‌పుల్లింగ్, పూడుపాములు, అక్షయపాత్ర, సంజీవిని వేరు లాంటి రకరకాల మోసాలు, ఘటనలు ఈ ప్రాంతంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. దుర్గం కొండపై ఉన్న ప్రాచీన ఆధారాలన్నింటినీ అక్రమార్కులు పెకళించారు. కృష్ణమ్మకొండపై సైతం దేవతా మూర్తులను పెకళించి నిధులకోసం అన్వేషించారు. కుప్పం ప్రాంతంలోని కర్ణాటక సరిహద్దు గ్రామాలు.. పుంగనూరు, సోమల, చౌడేపల్లె్ల, రామసముద్రంలో తవ్వకాలు షరామామూలుగా సాగుతున్నాయి. రాత్రి వేళల్లో గుట్టుగా.. ∙పలమనేరు మండలంలోని చెల్లెమ్మ చెరువులో పురాతన కాలంనాటి ఓ పుష్కరిణి గతంలో బయటపడింది. దీంతో బంగారు నాణేలున్నాయని పలువురు గతంలో తవ్వకాలు చేపట్టారు. ∙జగమర్ల అటవీప్రాంతంలో రంగురాళ్లు, వజ్రాల కోసం రాత్రి పూట కర్ణాటక వ్యక్తుల వేట కొనసాగుతోంది. ∙బైరెడ్డిపల్లె మండలంలోని బాపలనత్తం అడవిలో ఉండే పాండవ గుహల్లో ఇప్పటికే పలుమార్లు తవ్వకాలు చేశారు. అందులో ఏమీ దొరక్కపోయినా తవ్వకాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ∙ఇదే మండలంలోని అటవీప్రాంతంలో ధనబండ వద్ద ధనం ఉందని గతంలో తవ్వకాలు జరిగాయి. ∙వీకోట మండలంలోని దుర్గంకొండ, కృష్ణమ్మ కొండ, క్రిష్ణాపురం, మోట్లపల్లె, గోనుమాకులపల్లె, కోటనక్కనపల్లె గ్రామాల్లోని పాత ఆలయాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ∙మోట్లపల్లె వద్ద పంటపొలాల్లో బండల కింద గుప్త నిధులు ఉన్నాయని కర్ణాటకకు చెందిన ఓ ముఠా నాటు బాంబులతో ఆ బండలు పగులగొ ట్టింది. రాతి కింద బొగ్గులు ఉన్న కుండలు అక్కడ బయటపడడం గమనార్హం. అమావాస్య, పౌర్ణమి రాత్రుల్లో అధికం బైరెడ్డిపల్లె మండలంలోని బాపలనత్తం సమీపంలో పాండవ గుహలున్నాయి. సుమారు పదెకరాల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాంతంలో గతంలో పాండవులు నివసించారని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ ఓ ప్రత్యేకమైన చంద్రాకారంలో బండలతో నిర్మించిన గుడులున్నాయి. అయితే వీటి కింద నిధి నిక్షేపాలు ఉన్నాయని పలు ముఠాలు ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేశాయి. ఈ ప్రాంతం అడవిలో ఉండడంతో స్థానికులు సైతం గుర్తించేందుకు వీలుకాని పరిస్థితి. ఈతంతు అమావాస్య, పౌర్ణమి రాత్రుల్లోనే సాగుతోంది. కొన్ని ఆలయాల వద్ద బండలపై చెక్కిన లిపిని పరిశీలించి బంగారం ఉంటుందని కొందరు ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఏదేమైనా ఈ ముఠాల మాటలను నమ్మి ఈ ప్రాంతవాసులే కాకుండా చుట్టుపక్క రాష్ట్రాలకు చెందిన వారు సైతం లక్షలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని ఘటనలో మినహా చాలా వరకు పోలీసుల దృష్టికి కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది. అమాయకంగా నమ్మకండి గుప్తనిధులు, రైస్‌పుల్లింగ్ లాంటి మో సాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. చాలా వరకు అరెస్టులు కూడా చేశాం. పత్రికల్లోనూ వెలుగులోకి వస్తున్నా అమాయకంగా నమ్మి మోసపోతున్నారు. ఇలాంటి ముఠాల కదలికలపై నిఘా ఉంచాం. ఎవరికైనా సమాచారం ఉంటే పోలీసులను ఆశ్రయిస్తే వారి ఆటకట్టిస్తాం. – గంగయ్య, డీఎస్పీ, పలమనేరు -
వీడిన విశాఖ కిడ్నాప్ కేసు మిస్టరీ
-
విశాఖ కిడ్నాప్ కేసు: ఇద్దరు అరెస్టు
సాక్షి, విశాఖపట్నం: రియల్ఎస్టేట్ వ్యాపారి సురేష్ కిడ్నాప్ కేసు మిస్టరీ వీడింది. నిందితులు పల్లపు ప్రసాద్, ప్రతాప్‌రెడ్డిలను విశాఖ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వ్యాపార లావాదేవీలు, రైస్ పుల్లింగ్ వ్యవహారాలే కిడ్నాప్‌నకు ప్రధాన కారణమని తేలింది. విశాఖ కమిషనర్ ఆర్కే మీనా కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘రియల్ఎస్టేట్ వ్యాపారి సురేష్‌ను నలుగురు కిడ్నాప్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. కత్తి, తుపాకీతో సురేష్‌ను బెదిరించారు. డబ్బులు లేవని బంగారం ఉందని అతను కిడ్నాపర్లకి చెప్పాడు. సురేష్ తనభార్యకి ఫోన్ చేసి బంగారం తీసుకు రమ్మన్నాడు. అతని భార్య బంగారం తీసుకువచ్చిన తర్వాత భార్యాభర్తలు గొడవలు పడ్డారు. అదే సమయంలో సురేష్ కొడుకు డయల్ 100 కి ఫోన్ చేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో నిందితులు పారిపోయారు. (చదవండి: వ్యాపారి కిడ్నాప్ కేసు దర్యాప్తు ముమ్మరం) నిందితులు పల్లపు ప్రసాద్ (ఎ 1), ప్రతాప్‌రెడ్డి (ఎ 2)లను అరెస్టు చేశాం. ఈ కేసులో మొత్తం ఏడుగురి పాత్ర గుర్తించాం. మిగిలిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. అరెస్ట్ అయినవారిపై రైస్ పుల్లింగ్ తో పాటు పలు కేసులు ఉన్నాయి. నిందితులలో కొంతమందితో సురేష్ కి రైస్ పుల్లింగ్ ద్వారా పరిచయం ఉంది. సురేష్ పైన కూడా కేసులు ఉన్నాయి. కేసులతో పాటు డబ్బులు ఉన్నవ్యక్తిని కిడ్నాప్ చేస్తే త్వరగా డబ్బులు వస్తాయని నిందితులు ఊహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రసాద్ పై మూడు కేసులు ఉన్నాయి. మరో నిందితుడు ప్రతాప్‌రెడ్డిపై నాలుగు కేసులు ఉన్నాయి. గతంలో ప్రసాద్ కూడా రైస్ పుల్లింగ్ వ్యవహారంలో కిడ్నాప్ కి గురై మోసపోవడంతో ఈజీ మనీ కోసం అదే మార్గాన్ని ఎంచుకున్నాడు. (విభేదాలే కిడ్నాప్‌కి కారణమా..?) -
రైస్ పుల్లింగ్ యంత్రాలతో సైనైడ్ సీరియల్ కిల్లర్ మోసం
-
కోటి రూపాయలు ఇస్తే పది కోట్లు ఇస్తా
న్యూఢిల్లీ : రూపాయి ఇచ్చి పదిరూపాయలు రావాలనుకోవడం దురాశ. ఇలాంటి ఆలోచన చేసే ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త దాదాపు కోటిన్నర రూపాయలు మోసపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన వ్యాపారి నరేందర్‌కు కొన్ని సంవత్సరాల క్రితం వీరేంద్ర బ్రార్, అతని కొడుకు బాబా బ్రార్‌తో పరిచయం ఏర్పడింది. వీరేంద్ర తమ దగ్గర రైస్ పుల్లర్ ఉందని, దాన్ని త్వరలోనే నాసా పరీక్షించనుందని, పరీక్ష విజయవంతమైతే నాసా తమ దగ్గర ఉన్న రైస్ పుల్లర్‌ని 37,500 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయనుందని నమ్మబలికాడు. ఈ రైస్పుల్లర్ని నాసా అంతరిక్ష పరిశోధనల కోసం ఉపయోగిస్తుందని తెలిపాడు. రైస్ పుల్లర్‌ను పరీక్షించడం కోసం శాస్త్రవేత్తలను తీసుకురావాల్సి ఉంటుందని, శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించే సమయంలో ధరించే సూట్‌తో పాటు రైస్ పుల్లర్‌ను పరీక్షించడం కోసం అవసరమైన రసాయనాలు కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపాడు. పరీక్ష విజయవంతమైతే తక్షణమే తనకు వచ్చే 37 వేల కోట్ల రూపాయాల్లో 10 కోట్ల రూపాయలను నరేంద్రకు ఇస్తానని నమ్మబలికాడు. ఒకేసారి అంత పెద్ద మొత్త వస్తుందని ఆశపడ్డ నరేంద్ర, వీరేంద్రతో ఒక ఎమ్ఓయూను కూడా కుదుర్చుకున్నాడు. అనంతరం వీరేంద్రకు 87.2లక్షల రూపాయలను ఇచ్చాడు. డబ్బు చేతికి వచ్చిన వెంటనే వీరేంద్ర హపూర్ ప్రాంతంలో రైస్ పుల్లర్‌ను పరీక్షిస్తానని తెలిపాడు. కానీ ఎటువంటి పరీక్షలు నిర్వహించలేదు. కారణమేంటని అడిగితే ఆ ప్రాంతం అంత సురక్షితం కాదని తెలిపాడు. ఆ రోజు నుంచి ఏదో ఒక సాకు చెప్తూ దాటవేస్తున్నాడు. అదే సమయంలో వీరేంద్ర మాటలు నమ్మి అతనికి డబ్బులు ఇచ్చిన ఇతరులు కూడా తమ డబ్బును తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. వారికి డబ్బులు ఇవ్వడం కోసం వీరేంద్ర, మరోసారి నరేంద్రను ఆశ్రయించాడు. ఇసారి తప్పకుండా రైస్‌పుల్లర్‌ను పరీక్షిస్తామని, అందుకోసం హిమాచల్‌లోని ధర్మశాలలో ఓ ప్రాంతాన్ని ఎన్నుకున్నామని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో డీల్ ఫైనల్ అవుతుందని తెలిపాడు. వీరేంద్ర మాటలు నమ్మిన నరేంద్ర మరోసారి మోసపోయాడు. ఈ సారి మరో 51.1లక్షల రూపాయలను వీరేంద్రకు ఇచ్చాడు. వీరేంద్ర 20 వేల రూపాయలు ఇచ్చి ఇద్దరు నకిలీ శాస్త్రవేత్తలను తీసుకువచ్చాడు. వారు పరీక్షిస్తున్నట్లు నటించి వెళ్లిపోయారు. అనుమానం వచ్చిన నరేంద్ర శాస్త్రవేత్తలుగా వచ్చిన వారిని పట్టుకుని నిలదీయగా అసలు విషయం బయటకు వచ్చింది. దాంతో తాను మోసపోయానని తెలుసుకున్న నరేంద్ర పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రికొడుకులను అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమీషనర్ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. ‘రైస్ పుల్లర్ అనే ఎటువంటి వస్తువు లేదు. కానీ మోసగాళ్లు రాగి పళ్లాన్ని తీసుకుని దానికి అయస్కాంత పూత పూసి జనాలను మోసగిస్తున్నారు. కనుక ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాల’ని తెలిపారు. -
‘మగధీర’ సినిమా చూపించాడు
చాంద్రాయణగుట్ట: మానవతీత శక్తుల పేరుతో అమాయకులను బురిడి కొట్టించి కోట్లాది రూపాయలు కాజేసిన ఘరానా మోసగాడిని మీర్‌చౌక్ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్ గోల్డెన్ కాలనీకి చెందిన మెహతాబ్ హుస్సేన్ అలియాస్ ఆదిల్, అతని మూడో భార్య సకీనా ఫాతీమా ఫర్నీచర్ వ్యాపారం చేసేవారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు భూత వైద్యుడి అవతారం ఎత్తిన అతడికి ఆజం అనే వ్యక్తి ద్వారా యాకుత్‌పురాకు చెందిన వ్యాపారి రుస్తుం పటేల్‌తో పరిచయం ఏర్పడింది. తనకు దివ్యదృష్టి ఉందని, ఆసిఫ్‌జాహి, టిప్పు సుల్తాన్, కుతుబ్‌షాహిల కాలంలో దాచిన గుప్త నిధుల వివరాలు చెబుతానంటూ నమ్మించాడు. కర్ణాటక, మైసూర్ ప్రాంతాలకు తీసుకెళ్లిన అతను వాస్తు దోషాల కారణంగా నిధి బయటికి రావడం లేదని నమ్మించాడు. ఇంతటితో ఆగకుండా మీరు 4000 ఏళ్ల క్రితం గొప్ప రాజు అని, అప్పట్లో మీ భార్యగా ఉన్న మహిళ కూడా మళ్లీ జన్మించిందని.....ఆమె ప్రస్తుతం వేల కోట్లకు అధిపతిగా ఉందని చెబుతూ ఓ మహిళ ఫొటో, హిందీలో రాసిన లవ్ లెటర్‌ను కూడా చూపించాడు. ఆమెతో పెళ్లి జరిపించి కోటీశ్వరుడిని చేస్తానని నమ్మించాడు. అంతేగాకుండా తన వద్ద ఉన్న రైస్ ఫుల్లింగ్ యంత్రం ద్వారా రూ.కోట్లు సంపాదించవచ్చని చెప్పి దాదాపు రూ.3 కోట్లు వసూలు చేశాడు. మరి కొందరినుంచి కూడా భారీగా వసూలు చేశాడు. ఈ డబ్బుతో చిన్న గోల్కొండ ప్రాంతంలో 2000 గజాల స్థలం, చింతల్మెట్లో ఓ భవనాన్ని నిర్మించడంతో పాటు పలుమార్లు విదేశీ పర్యటనలు చేశాడు. కొంతకాలానికి అతడిపై అనుమానం వచ్చిన రుస్తుం పటేల్ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా మెహతాబ్ అతడిని ఎయిర్ పిస్తోల్‌తో బెదిరించాడు. అయినా బాధితుడు ఒత్తిడి చేయడంతో రూ.8.5 లక్షలు హబీబ్‌నగర్ రౌడీషీటర్ మహ్మద్ యూసుఫ్ అలియాస్ జంగ్లీ యూసుఫ్ ద్వారా ఇచ్చి పంపాడు. అయితే ఆ డబ్బులను యూసుఫ్ బాధితుడికి ఇవ్వకుండా తన వద్దే ఉంచుకున్నాడు. దీంతో గత నెల 24న బాధితుడు మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.13.5 లక్షల నగదు, ఎయిర్ పిస్తోల్, రెండు పాస్ పోర్టులు, ఐదు గ్రాముల బంగారం, రైస్ ఫుల్లింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. -
రైస్ పుల్లింగ్ పేరుతో సైబరాబద్లో మోసాలు
-
కోట్లు వస్తాయని నమ్మి..
బంజారాహిల్స్: రైస్‌పుల్లింగ్ యంత్రంతో రూ.10 వేల కోట్లు వస్తాయని నమ్మి మోసపోయానని, ఈ క్రమంలో తాను ఆదాయ పన్ను శాఖను మోసం చేశానని బానాపురం లక్ష్మణ్‌రావు వెల్లడించారు. శనివారం ఆయన ఈ ఘటనపై ’సాక్షి’తో మాట్లాడారు. మూడేళ్ల క్రితం కర్నాటక బెల్గాంకు చెందిన షౌకత్‌అలీ అనే వ్యక్తి తన రియల్ ఎస్టేట్ భాగస్వాములు భాస్కర్‌రావు, రమేష్‌ల ద్వారా పరిచయం అయ్యాడని, తనకు తెలిసిన వ్యక్తి వద్ద రైస్‌పుల్లింగ్ కాయిన్ ఉందని, దాని వల్ల ధనలక్ష్మి తాండవిస్తుందని చెప్పడమే కాకుండా పలు పూజలు కూడా చేయించాడని వెల్లడించారు. ఆయనను నమ్మి తాను రూ.10 వేల కోట్ల వస్తాయని ఆశతో ఆదాయపు పన్ను శాఖాధికారులకు సెప్టెంబర్‌లో లేఖ రాసినట్లు వెల్లడించారు. తన వద్ద 10 వేల కోట్లు ఉన్నాయని ఐడీఎస్ కింద దరఖాస్తు చేసుకున్నానని పేర్కొన్నారు. ఈ విషయంలో మొదటి విడత కట్టేం దుకు ప్రయత్నించగా చిల్లిగవ్వ కూడా దొరకలేదని ఈ లోపు న ఐటీ అధికారులు ఇంటిపై దాడి చేశారని, వారికి ఇదే విషయాన్ని వెల్లడించడం జరిగిందన్నారు. తాను షౌకత్‌అలీని నమ్మి మోసపోయిన విషయాన్ని ఆధారాలతో సహా చూపి ంచానని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం నుంచి షౌకత్‌అలీ రైస్‌పుల్లింగ్ యంత్రం తెస్తానంటూ రూ. 60 లక్షల వరకు వసూ లు చేశాడని, ఉన్నవన్నీ అమ్ముకొని అప్పు తెచ్చి ఈ మొత్తాన్ని ఇచ్చానని పేర్కొన్నాడు. షౌకత్‌అలీ తనను చీటింగ్ చేసిన విషయాన్ని ఐటీ అధికారులతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని, తనకు న్యాయం చేయాలని కోరారు. కట్టు కథేనా.? 10 వేల కోట్ల ఐడీఎస్ కింద ప్రకటించి ఐటీ అధికారులకు చుక్కలు చూపించిన ఫిలింనగర్ సైట్–2 నివాసి బానాపురం లక్ష్మణ్‌రావు చెప్పిందంతా కట్టు కథేనని పోలీసులు భావిస్తున్నారు. పక్కా పథకం ప్రకారం ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును ఉన్నది ఉన్నట్టు ఐటీ అధికారులకు చదివి వినిపించాడని అనుమానిస్తున్నారు. లక్ష్మణ్‌రావు వెనుకాల ఓ బడాబాబు ఉండి ఉంటాడని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపడితే బాగుంటుందని భావిస్తున్నారు. లక్ష్మణ్‌రావు అంత ధైర్యంగా ఐడీఎస్ ప్రకటించడని ముందస్తుగా ఎవరో నల్లధనం ఉందన్న విషయం చెప్పడం వల్లనే ఐటీకి లేఖ రాశారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
కటకటాల్లో రైస్ పుల్లింగ్ ముఠా
హిందూపురం : రాగి పాత్రకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని.. చెబుతూ మోసాలకు పాల్పడుతున్న రైస్ పుల్లింగ్ ముఠా గుట్టురట్టయింది. గోరంట్ల మండలానికి చెం దిన మధురెడ్డి, కొండాపురం సత్యనారాయణ, హస్నాబాద్ గోవింద్, కదిరి ప్రభాకర్, గోరంట్ల మల్లికార్జున ముఠాగా ఏర్పడి రాగి బిందె మార్కెట్లో రూ.150 కోట్లు పలుకుతుందని చెబుతూ, రూ.5 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లిస్తే ఇస్తామంటూ విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం నెల్లూరుకు చెందిన కె.మల్లికార్జునకు అమ్మేందుకు హిందూపురంలోని ఓ లాడ్జీలో బేరం కుదుర్చుకొని తూముకుంట చెక్‌పోస్టు వద్ద లావాదేవీలు జరిపేందుకు వెళ్లారు. టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ ఆంజినేయులు తమ సిబ్బందితో దాడి చేశారు. రాగి బిందెను స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని రూరల్ సీఐ రాజగోపాల్‌నాయుడు తెలిపారు. -
శ్రీకాకుళం ఏజెన్సీలో ఘరానా మోసం
శ్రీకాకుళం: రైస్ పుల్లింగ్, కాపర్ కాయిల్ పేరుతో శ్రికాకుళం ఏజెన్సీలో రూ. 50 లక్షలు కొల్లగొట్టిన వారిపై కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రికి చెందిన వ్యక్తులంగా నిందితులు చెప్పుకోవటంతో పోలీసులు వారిపై కేసునమోదు చేయడంలేదని సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఓ ఎస్సై పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దోనుబాయి ప్రాంతంలో ఏజెంట్ నెట్వర్క్ ముసుగులో మాయగాళ్లు గిరిజనులకు మస్కా కొట్టారు. అయితే సొమ్ము రికవరీకి పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. పోలీసుల అదుపులో విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన ముగ్గురు నిందితులు ఉన్నారు. -
17 రాష్ట్రాల్లో రూ. 150 కోట్లు దోచిన కోహ్లీ
హైదరాబాద్: నగరంలో రైస్ పుల్లింగ్ పేరుతో దొంగ బాబా కోహ్లీ ముఠా ఏకంగా 17 రాష్ట్రాల్లో రూ. 150 కోట్లు దోచింది. యురేనియం, ఇరిడియం లాంటి లోహాలను వెలికి తీస్తామని చెబుతూ డబ్బున్న వారిని లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా కోట్ల రూపాయల వరకు కుచ్చుటోపి పెట్టింది. ‘రైస్ పుల్లింగ్ పాత్రను ఇంట్లో ఉంచుకుంటే డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుందనీ, ఈ పాత్రను ఒక్కసారి కొనుగోలు చేస్తే ఏళ్ల తరబడి లక్ష్మీదేవి కనికరిస్తుంది. కనకవర్షం కురిపిస్తుంది’ అంటూ ప్రధాన నిందితుడు దొంగ బాబా కోహ్లి నమ్మబలికాడు. అతడి మాయమాటలను నమ్మిన జూబ్లీహిల్స్‌కు చెందిన దామోదర్‌రెడ్డి అనే వ్యక్తి అడ్డంగా మోసపోయాడు. దశలవారీగా రూ.4 కోట్లు ఆయన నుంచి కోహ్లీ బాబా వసూలు చేశాడు. దాంతో తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోసపోయిన వ్యక్తి డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేయగా.. కేసును సీఐడీకి అప్పగించారు. రంగంలోకి దిగిన సీఐడీ ప్రత్యేక బృందం బెంగళూరులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిందితులు కోహ్లీ, గంగధారరెడ్డి, రమేష్ బాబు హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. -
సొమ్ముల ‘పుల్లింగ్’
- నగరంలో రైస్ పుల్లింగ్ పేరుతో ఇంకో దోపిడీ - రూ.4 కోట్లకు బురిడీ కొట్టించిన మరో దొంగ బాబా - డీజీపీ అనురాగ్ శర్మకు బాధితుడి ఫిర్యాదు - నిందితుడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్న సీఐడీ సాక్షి, హైదరాబాద్: ‘లైఫ్‌స్టైల్’ భవన యజమానిని 1.33 కోట్లకు బురిడీ కొట్టించిన దొంగ బాబా శివానంద ఉదంతాన్ని మరువకముందే.. ఇదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. శివానంద బాబా మాదిరిగానే రైస్ పుల్లింగ్ పేరుతో మరో దొంగ బాబా హైదరాబాద్‌లో డబ్బున్న వారికి టోకరా వేశారు. ఉత్తరాది నుంచి వచ్చి కర్నూలులో స్థిరపడిన కోహ్లి అనే దొంగ బాబా సుమారు రూ.4 కోట్లకు ఎసరు పెట్టినట్టు సమాచారం. మోసపోయిన వ్యక్తి డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేయగా.. కేసును సీఐడీకి అప్పగించారు. రంగంలోకి దిగిన సీఐడీ ప్రత్యేక బృందం బెంగళూరులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రైస్ పుల్లింగ్తో లక్ష్మీ కటాక్షం: ‘రైస్ పుల్లింగ్ పాత్రను ఇంట్లో ఉంచుకుంటే డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది. ఈ పాత్రనుఒక్కసారి కొనుగోలు చేస్తే ఏళ్ల తరబడి లక్ష్మీదేవి కనికరిస్తుంది. కనకవర్షం కురిపిస్తుంది’ అంటూ దొంగ బాబా కోహ్లి చెప్పిన మాయ మాటలకు జూబ్లీహిల్స్‌కు చెందిన దామోదర్‌రెడ్డి అనే వ్యక్తి మోసపోయాడు. అతీత శక్తులున్న పాత్రను అందజేస్తామంటూ దశలవారీగా రూ.4 కోట్లు ఆయన నుంచి కోహ్లీ బాబా వసూలు చేశాడు. ఇటీవల శివానంద బాబా ఉదంతం వెలుగు చూడటంతో.. తాను కూడా మోసపోయినట్లు గుర్తించిన దామోదర్‌రెడ్డి డీజీపీ అనురాగ్‌శర్మను ఆశ్రయించారు. దీంతో కర్నూలుకు చెందిన కోహ్లి బాబా బెంగళూరు కేంద్రంగా చేస్తున్న రైస్ పుల్లింగ్ డ్రామాలు వెలుగుచూశాయి. దొంగబాబా ఉచ్చులో పడి మోసపోయిన బాధితులు తమకు ఫిర్యాదు చేస్తే విచారిస్తామని సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా ‘సాక్షి’కి చెప్పారు. -
పోలీసుల అదుపులో 'రైస్ పుల్లింగ్' గ్యాంగ్
విశాఖపట్నం: ప్రజలను మోసం చేస్తున్న రైస్ పుల్లింగ్ గ్యాంగ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రదారి సురేష్, జగదీష్‌లను పోలీసులు పట్టుకున్నారు. కొద్దిసేపట్లో పోలీసులు వారిని మీడియా ముందు ప్రవేశపెడతారు. రైస్‌పుల్లింగ్ పాత్రతో బంగారం తయారు చేయవచ్చని ఆశ చూపి దగా చేసే ముఠాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకం ఉన్నాయి. ఇటువంటి ముఠాలు పాత రాగి పాత్రను చూపి దాని ద్వారా బంగారం తయారు చేయవచ్చని ప్రజలను మోసం చేసిన సంఘటనలు ఇటీవల కాలంలో అనేకం వెలుగులోకి వచ్చాయి. -
రైస్ పుల్లింగ్ ముఠా అరెస్ట్
చిత్తూరు (క్రైమ్),న్యూస్‌లైన్ : రైస్‌పుల్లింగ్ పాతరతో బంగారం తయారు చేయవచ్చని ఆశ చూపి దగా చేసే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నిందితులు రామసముద్రం మండలం పెద్దకురప్పల్లెకు చెందిన రత్నప్ప అలియాస్ రఘు (42), రామసముద్రం గ్రామానికి చెందిన వాసన్న, పుంగనూరులోని బీడీ కాలనీకి చెందిన నాగేంద్ర అలియాస్ సురేష్(42),బండ్లపల్లెకు చెందిన చిన్నరెడ్డెప్ప (46), కర్ణాటకలోని కోలారుకు చెందిన బాలప్ప (34)ను అరెస్ట్ చెసి వారి వద్ద నుంచి రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం చిత్తూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ సుధాకర్ రెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు. 20 రోజుల క్రితం నగరంలోని పొన్నియమ్మ గుడివీధికి చెందిన నిఖిల్‌కు కొందరు పరిచయమయ్యారు. రైస్‌పుల్లింగ్ (పాతర) ఉందని, దాంతో బంగారాన్ని గుర్తించవచ్చని చెప్పారు. అందుకుగాను రూ. 5 లక్షలు చెల్లించాలని చెప్పారు. ఆ తరువాత ఈ నెల 10వ తేదీ వారు నిఖిల్‌కు ఫోన్ చేసి రైస్ పుల్లింగ్ పాతర, బంగారు నాణేలు సిద్ధంగా ఉన్నాయని, డబ్బులు తీసుకుని స్థానిక పీవీకేఎన్ కళాశాల వద్దకు రావాలని సూచించారు. ఆ మేరకు అత డు రూ. 5 లక్షలు తీసుకొని అక్కడికి వెళ్లాడు. అక్కడే ఉన్న ఇద్దరికి డబ్బు అందించాడు. దాంతో ఆ ఇద్దరు రైస్‌పుల్లింగ్ పాతరను తీసుకురావాలని వెం టనే ఎవరికో ఫోన్ చేశారు. వెంటనే ఓ కారులో ముగ్గురు వచ్చారు. కారు ఆగగానే వారితోపాటు నిందితులు అక్కడి నుంచి ఉడాయించారు. తరువాత వారి ఫోన్ పనిచేయలేదు. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఒకటో పట్ట ణ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు.