కటకటాల్లో రైస్‌ పుల్లింగ్‌ ముఠా | anantapur rice pulling team arrested in nellore | Sakshi
Sakshi News home page

కటకటాల్లో రైస్‌ పుల్లింగ్‌ ముఠా

Published Sat, Oct 1 2016 11:44 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

anantapur rice pulling team arrested in nellore

హిందూపురం : రాగి పాత్రకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని.. చెబుతూ మోసాలకు పాల్పడుతున్న రైస్‌ పుల్లింగ్‌ ముఠా గుట్టురట్టయింది. గోరంట్ల మండలానికి చెం దిన మధురెడ్డి, కొండాపురం సత్యనారాయణ, హస్నాబాద్‌ గోవింద్, కదిరి ప్రభాకర్, గోరంట్ల మల్లికార్జున ముఠాగా ఏర్పడి రాగి బిందె మార్కెట్‌లో రూ.150 కోట్లు పలుకుతుందని చెబుతూ, రూ.5 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లిస్తే ఇస్తామంటూ విక్రయించేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో శుక్రవారం నెల్లూరుకు చెందిన కె.మల్లికార్జునకు అమ్మేందుకు హిందూపురంలోని ఓ లాడ్జీలో బేరం కుదుర్చుకొని తూముకుంట చెక్‌పోస్టు వద్ద లావాదేవీలు జరిపేందుకు వెళ్లారు. టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ ఆంజినేయులు తమ సిబ్బందితో దాడి చేశారు. రాగి బిందెను స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని రూరల్‌ సీఐ రాజగోపాల్‌నాయుడు తెలిపారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement