సాక్షి, హైదరాబాద్: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రయాన్-3 సక్సెస్‌తో ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు మారుమోగ్రుతోంది. అయితే, కొందరు కేటుగాళ్లు చంద్రయాన్-3 పేరును వాడుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ ఉదంతంపై హైదరాబాద్‌లో కేసు నమోదు అయ్యింది.
వివరాల ప్రకారం.. కొందరు కేటుగాళ్లు చివరిని చంద్రయాన్-3ని కూడా వదిలిపెట్టలేదు. చంద్రయాన్ సక్సెస్‌కు రైస్ పుల్లింగ్ కారణమని భారీ మోసానికి తెర లేపారు. చంద్రయాన్-3 విజయానికి ఉపయోగించిన పాత్ర అమ్ముతామని కొందరు కేటుగాళ్లు ఓ వ్యాపారవేత్త వద్ద నుంచి ఏకంగా రూ.20కోట్లు దోచేశారు. ఇది మహిళ గల పాత్ర అంటూ కలరింగ్ ఇచ్చి బురిడీ కొట్టించారు. దీంతో, బాధితుడు.. నగరంలోని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి విజయ్ కుమార్ అనే వ్యక్తితో సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: ఉజ్జయిని ఘోరం.. బాధితురాలి దత్తతకు ముందుకు వచ్చిన పోలీసాయన
Comments
Please login to add a commentAdd a comment