
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంపై డ్రోన్ ఎగరేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో డ్రోన్ ఎగురవేసిన ఇద్దరు వ్యక్తులను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం.. ఈనెల 11వ తేదీన తెలంగాణ సచివాలయంపై ఇద్దరు వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. దీన్ని గమనించిన ఎస్‌పీఎఫ్ పోలీసులు.. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తాజాగా డ్రోన్లు ఎగురవేసిన వ్యక్తులను సైఫాబాద్‌కు చెందిన వంశీ, నాగరాజుగా గుర్తించారు. దీంతో, వారిద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, సెక్రటేరియల్ అవుట్ పోస్టుతో పాటు సచివాలయం లాన్ ఏరియాను డ్రోన్‌తో చిత్రీకరించినట్టు పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment