ప్రజలను మోసం చేస్తున్న రైస్ పుల్లింగ్ గ్యాంగ్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్నం: ప్రజలను మోసం చేస్తున్న రైస్ పుల్లింగ్ గ్యాంగ్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రదారి సురేష్, జగదీష్లను పోలీసులు పట్టుకున్నారు. కొద్దిసేపట్లో పోలీసులు వారిని మీడియా ముందు ప్రవేశపెడతారు.
రైస్‌పుల్లింగ్ పాత్రతో బంగారం తయారు చేయవచ్చని ఆశ చూపి దగా చేసే ముఠాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకం ఉన్నాయి. ఇటువంటి ముఠాలు పాత రాగి పాత్రను చూపి దాని ద్వారా బంగారం తయారు చేయవచ్చని ప్రజలను మోసం చేసిన సంఘటనలు ఇటీవల కాలంలో అనేకం వెలుగులోకి వచ్చాయి.