Taskforce Police
-
HYD: బయట టీ తాగే వారు జాగ్రత్త.. నకిలీ టీ పౌడర్ ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రోజులో ఒక్కసారైనా టీ తాగినిదే ఏం పని తోచదు చాలా మందికి. ఇంట్లోనే కాదు బయటకు వెళ్లినా సమాయనుసారం టీ చుక్కా నోట్లో పడాల్సిందే. కానీ షాపుల్లో, టీ కొట్టుల్లో ఎక్కువగా లూస్ టీపోడినే వాడుతుంటారు. ఇకపై బయట టీ తాగే సమయంలో చాయ్ లవర్లు కాస్తా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో నకిలీ టీ పొడి తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. నగరంలో టీ దుకాణాలకు తక్కువ ధరకు కల్తీ టీ పొడి సరఫరా చేస్తున్న ముఠాను ఆటకట్టించారు మధ్యమండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు. సనత్‌నగర్‌లోని ఓ కంపెనీపై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. టన్నుల కొద్దీ నకిలీ టీపొడి స్వాధీనం చేసుకున్నారు.నాసిరకమైన టీ పొడిలో కొబ్బరి చిప్ప పొడి, రసాయనాలు, రంగులు, చాక్లెట్ ఫ్లేవర్ మిల్క్ పౌడర్ కలిపి కస్తే టీ పొడి తయారు చేస్తున్న ముఠాకు మధ్య మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ముగ్గురు నిందితులను పట్టుకుని వారి నుంచి 300 పేజీల కల్తీ టీ పొడి, 200 కేజీల కొబ్బరి చిప్పల పొడి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర తెలిపారు. ఫతేనగర్‌కు చెందిన జగన్నాథ్ కోణార్క్ టీ పౌడర్ సేల్స్ ఆండ్ సప్లయర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు.తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ టీ పొడి తయారీకి సిద్ధమ య్యాడు. మార్కెట్ నుంచి కేజీ రూ. 80 ఖరీదు చేసే టీ పొడి, రయనాలు, రంగులు, ఫ్లేవర్స్‌తో పాటు కొబ్బరి చిప్పల పొడి కొనేవాడు. దీన్ని తన దుకాణానికి తీసుకువెళ్లి తన వద్ద పని చేసే ప్రతాప్, పరాదాలకు ఇచ్చే వాడు. వీళ్లు వాటన్నింటినీ కలిపి కల్తీ టీ పొడి తయారు చేసి ప్యాక్ చేసే వారు. ఈ పొడిని కేజ్ రూ.250కి అమ్మే జగన్నాథ్ లాభాలు ఆర్థిస్తున్నాడు.ఈ టీ పొడిని ప్రతినిదులు ఎక్కువగా చిన్న చిన్న దుకాణదారులతో పాటు రోడ్డు వచ్చిన టీ బుధవారం స్టాల్స్ కు అమ్మేవాడు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న కార్యాలయ మధ్య మండల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్ రామకృష్ణ నేతృత్వంలో ఎస్సై డి.శ్రీకాంత్ గౌడ్ వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును సనత్‌నగర్ పోలీ సులకు అప్పగించారు. జగన్నాథ్‌పై ఇప్పటికే మోమిన్‌పేట్, సనత్ నగర్ ఠాణాల్లో మూడు అదే తరహా కేసులు ఉన్నాయని అయిన ప్పటికీ అతడు తన వంతా కొనసాగుస్తున్నాడని టీసీపీ తెలిపారు. కల్తీ పొడితో చేసిన టీ పొడి తాగడం వల్ల కేన్సర్, కామెర్లు సహా అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. -
ముందు వేషం.. ఆపై అవతారం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించిన ఇల్లు, ప్రారంభించిన దుకాణం, శుభకార్యం జరిగే చోట్లకు వచ్చిన హిజ్రాలు దూషిస్తే చెడు జరుగుతుందనే సెంటిమెంట్ చాలా మందికి ఉంటోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు అనేక మంది నకిలీ ట్రాన్స్జెండర్లు రంగంలోకి దిగి బెదిరింపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ దందా వ్యవస్థీకృతంగా సాగుతున్నట్లు ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. శుక్రవారం కార్ఖానా ఠాణా పరిధిలో వరుస దాడులు చేసిన అధికారులు ప్రధాన నిర్వాహకురాలైన నకిలీ హిజ్రా, ముగ్గురు సహాయకులతో పాటు నలుగురు హిజ్రా వేషం వేసుకున్న పురుషులను అరెస్టు చేశారు. ఈ మేరకు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర వివరాలు వెల్లడించారు. ఇటీవల పెరిగిపోయిన నకిలీ హిజ్రాల వేధింపుల నేపథ్యంలో నగర వ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. లాభదాయకంగా ఉండటంతో..ఎవరైతే పుట్టుకతో నపుంసకులుగా ఉంటారో వారిని మాత్రమే హిజ్రాలుగా పరిగణించాల్సి ఉంది. అయితే నగర వ్యాప్తంగా కూడళ్లతో పాటు దుకాణాలు, వాహనచోదకులు, పాదచారులను బెదిరించి, వారి వెంటపడి డబ్బు వసూలు చేసే నకిలీ హిజ్రాలు అనేక మందిని ఆకర్షిస్తున్నారు. ఈ దందా లాభదాయకంగా ఉందని భావించే తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. శివార్లలో తిష్టవేస్తూ తొలినాళ్లల్లో హిజ్రాల వేషం వేసుకుని వసూళ్లు ప్రారంభిస్తున్నారు. ఆపై నిర్ణీత మొత్తం తమ వద్దకు చేరిన తర్వాత ముంబై, పుణే సహా మహారాష్ట్రలోని వివిధ నగరాలకు వెళ్లి శస్త్రచికిత్సలు చేయించుకోవడం ద్వారా నకిలీ హిజ్రాలుగా మారుతున్నారు. ఆపై మరికొంత మందినీ తమతో చేర్చుకుని ముందు వేషం, ఆ తర్వాత అవతారం ఎత్తించి దందా కొనసాగిస్తున్నారు. ఒక్కడు వచ్చి ఆరుగురిని ‘చేరదీసి’..శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలసకు చెందిన సురద కుమార్ కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి యాప్రాల్‌లో స్థిరపడ్డాడు. తొలినాళ్లల్లో హిజ్రా వేషం వేసుకుని, ఆపై శస్త్రచికిత్స చేయించుకుని చాందినీగా మారి దందా నడిపాడు. కొన్నాళ్లకు అనంతపురం జిల్లాకు నల్లన్నగారి రమేష్ ఎత్తప్పగారి మల్తీలను ఆకర్షించి అదే పంథాలో జయశ్రీ,, మనీషాగా మార్చాడు. చాందినీ సహాయకులుగా మారిన వీరు తమ జిల్లాకే చెందిన కె.సురేష్ ఎస్కే బాష, ఎస్కే షఫీ, ఎష్కే ఇషాక్‌లను నగరానికి రప్పించి ఆశ్రయం కలి్పంచారు. ఈ నలుగురితోనూ హిజ్రా వేషం వేయించిన చాందినీ వీరికి చిత్ర, ముంతాజ్, ఆషు, సమీర అనే పేర్లు పెట్టాడు. చాందినీ, జయశ్రీ, మనీషా వీరికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఆహారం, మద్యం తదితరాలు అందిస్తూ వసూళ్లు చేయిస్తున్నారు. అలా వచి్చన డబ్బు తీసుకునే వీరు రోజుకు ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున చెల్లిస్తున్నారు. కొన్నాళ్లకు వీరికీ శస్త్రచికిత్సలు చేయించి నకిలీ హిజ్రాలుగా మార్చేందుకు పథకం వేశారు.సీపీ ఆదేశాలతో రంగంలోకి..రాజధానిలోని రోడ్ల పైన, చౌరస్తాల్లోనూ, దుకాణాల వద్ద ఈ నకిలీ హిజ్రాల ఆగడాలపై వరుస ఫిర్యాదులు రావడంతో కొత్వాల్ సీవీ ఆనంద్ సీరియస్‌గా తీసుకున్నారు. నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాల్సిందిగా టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆదేశించారు. నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.సైదులు నేతృత్వంలో ఎస్సైలు శ్రీనివాసులు దాసు, పి.గగన్‌దీప్ కార్ఖానా ప్రాంతంలో శుక్రవారం వరుస దాడులు చేశారు. ఫలితంగా చాందినీతో పాటు ఇద్దరు సహాయకులు, హిజ్రా వేషం వేసిన వాళ్లు చిక్కారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని స్థానిక పోలీసులకు అప్పగించారు. నగరంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు 100కు లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి సహాయం పొందాలని అధికారులు కోరుతున్నారు. -
వెంచర్లో వ్యభిచారం.. పోలీసుల దాడుల్లో నలుగురు అరెస్ట్
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ వెంచర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడులు నిర్వహించి, నలుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ మధు తెలిపారు, కొన్ని నెలలుగా పట్టణం చుట్టు పక్కల గల ఓపెన్ ప్లాట్స్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి దాడులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. -
‘మాయా’ మసాజ్ సెంటర్లు.. కష్టమర్‌గా ఓ వ్యక్తిని పోలీసులు పంపడంతో..
సాక్షి, కుషాయిగూడ: గుట్టు చప్పుడు కాకుండా బ్యూటీ పార్లర్ పేరుతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఓ మసాజ్ సెంటర్‌పై మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు దాడి చేశాడు. మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాక్టర్ ఏఎస్ రావు నగర్లో గ్లోయిస్ బ్యూటీ కేర్ సెంటర్ పేరుతో కొన్ని రోజులుగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది మంగళవారం రాత్రి కష్టమర్‌గా ఓ వ్యక్తిని పోలీసులు పంపగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మసాజ్ సెంటర్ ముసుగులో పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకుడు మహేశ్‌తో పాటు అందులో పనిచేస్తున్న అసోం, ఆంద్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతానికి చెందిన అయిదుగురు యువతులను రెస్క్యూ చేసి కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు. చదవండి: చిక్కడపల్లి సీఐ, ఎస్ఐపై సస్పెన్షన్ వేటు మసాజ్ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్ దాడి హిమాయత్‌నగర్: నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న మసాజ్ పార్లర్లపై సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. సోమవారం రాత్రి నగర వ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో భాగంగా హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా ఉన్న ఓ స్పాలో రైడ్ చేశారు. ఇక్కడ సరిగా రికార్డులు మెయింటైన్ చేయకపోవడం, కస్టమర్ల వివరాలను సేకరించకపోవడం, సీసీ కెమెరాలు లేకపోవడం, క్రాస్ మసాజ్ లాంటివి జరుగుతుండటంతో ముగ్గురు కస్టమర్లను ఒక రిసెప్షనిస్ట్‌ను అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. చదవండి: ముసురు వానకు పాడైన పంట.. ఆగిన రైతు గుండె -
చిన్నారి కేసులో కీలక మలుపు: పోలీసుల అదుపులో రాజు స్నేహితుడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సింగరేణి కాలనీ ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో కీలక మలుపు తిరిగింది. నిందితుడు రాజు కోసం గాలిస్తుండగా అతడి స్నేహితుడు పోలీసులకు లభించాడు. హైదరాబాద్ టాస్కఫోర్స్ అదుపులో నిందితుడు రాజు స్నేహితుడు దొరికాడు. పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించగా రాజు ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. అయితే రాజుకు తోడుగా ఎల్బీనగర్ వరకు అతడి స్నేహితుడు వచ్చాడు. సీసీ ఫుటేజ్‌లో అతడు కూడా కనిపించాడు. అనంతరం ఎల్బీనగర్ నుంచి రాజు ఒంటరిగా వెళ్లారు. చదవండి: ‘రాజు’ కోసం వేట.. తెలంగాణ పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్ అయితే పారిపోయే ముందు రాజు ఎల్బీనగర్లో ఆటో దొంగతనానికి యత్నించాడు. ఆటో డ్రైవర్ అప్రమత్తతో రాజు పరారయ్యాడు. అక్కడి నుంచి నాగోల్ వరకు బస్సులో వెళ్లాడు. నాగోల్‌లోని ఓ వైన్ షాప్ వద్ద మద్యం సేవించి అటు నుంచి బస్సులో ఉప్పల్ వెళ్లాడు. అక్కడి నుంచి ఘట్కేసర్ వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. అదుపులోకి తీసుకున్న రాజు స్నేహితుడి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రాజు ఎక్కడికి వెళ్లాడు? అని ప్రశ్నిస్తున్నారు. రాజును ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమదైన శైలిలో విచారణ చేపట్టి స్నేహితుడి నుంచి రాజు ఆచూకీ తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుడు చిక్కడంతో రాజు కూడా ఇక చిక్కుతాడని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే.. -
పేకాటలో దొరికిన మంత్రి మల్లారెడ్డి సోదరుడు
సాక్షి, కంటోన్మెంట్(హైదరాబాద్): రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి సోదరుడు చామకూర నర్సింహారెడ్డి (66) పేకాట ఆడుతూ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నర్సింహారెడ్డి గత కొద్దిరోజులుగా తన స్నేహితులతో కలసి న్యూ బోయిన్‌పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్ ప్రాంతంలో ఓ ఫంక్షన్ హాల్లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ బృందం బుధవారం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నర్సింహారెడ్డి (66)తో పాటుగా కౌడి సాయిలు (44), నర్సింహారావు (65), హనుమంతు (58), సుదర్శన్‌రెడ్డి (64), మోహన్‌రెడ్డి (49), భాస్కర్‌రెడ్డి (49), గోవర్ధన్‌రెడ్డి (42), జనార్ధన్‌రెడ్డి (42), శ్రీనివాసరాజు (57), వెంగళ్‌రెడ్డి (43), నర్సిరెడ్డి (64), కృష్ణ (40)లు పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని అరెస్టు చేసి విచారణ నిమిత్తం నిందితులను బోయిన్పల్లి పోలీసు స్టేషన్లో అప్పగించారు. నిందితుల నుంచి రూ.1,40,740ల నగదును 13 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. -
మోస్ట్ వాంటెడ్.. మంత్రి శంకర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : కరుడుగట్టిన నేరస్థుడిగా ముద్రపడిన మంత్రి శంకర్‌ను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. శంకర్‌తో పాటు అతని ముగ్గురు అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రూ. 12 లక్షల నగదు, సిల్వర్ ఆభరణాలు,రెండు వాహనాలు స్వాదీనం చేసుకున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి నేరాలకు పాల్పడడంలో శంకర్ దిట్ట. ఇప్పటివరకు సుమారు 300 దొంగతనాలకు పాల్పడ్డ శంకర్ 30 సార్లు అరెస్ట్ అయ్యాడు. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన మంత్రి శంకర్‌కు అతని స్వగ్రామంలో మంచి దానఖర్ముడని పేరు ఉండడం విశేషం. కాగా హైదరాబాద్‌లో సెటిల్ అయిన మంత్రి శంకర్‌కు ముగ్గురు భార్యలు.. ఆరుగురు సంతానం ఉన్నారు. (చదవండి : గొంతు మార్చి రూ. 36 లక్షలు కొట్టేశాడు) హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. 'ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ముద్రపడిన మంత్రి శంకర్‌ను పట్టుకున్నాం. అతనితో పాటు అనుచరులు అబ్దుల్ లతీఫ్ ఖాన్, మహమ్మద్ మాజీద్, మహమ్మద్ ఇంతియాజ్ అహ్మద్ ను అదుపులోకి తీసుకున్నాం. నిందితుల నుంచి 12 లక్షల 9వేల నగదు, 100 గ్రాముల అర్నమెంట్ బంగారం,రెండు బైకులు స్వాధీనం చేసుకున్నాం. మంత్రి శంకర్ 1979 నుంచి దొంగతనాలు చేస్తున్నాడు. అతనిపై మూడు కమిషనరేట్ల పరిధిలో 250 కేసులు ఉన్నాయి.ఈ గ్యాంగ్ పగలు రెక్కీ చేసి రాత్రి 1 నుంచి 4 గంటల మధ్య దొంగతనాలు చేస్తుంది. ఈ నెల 4న జైలు నుంచి విడుదలైన శంకర్ బయటకు వచ్చి 20 రోజుల్లోనే 6 దొంగతనాలకు పాల్పడ్డాడు. కుషాయిగూడ,వనస్థలిపురం,బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేశారన్నారు. (చదవండి : ఇళ్లు అద్దెకు తీసుకొని..గుట్టుగా వ్యభిచారం) -
హవాలా లావాదేవీలపై టాస్క్ ఫోర్స్ కొరడా
సాక్షి, విజయవాడ : హవాలా లావాదేవీలపై టాస్క్ ఫోర్స్ కొరడా విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొరడా ఝుళిపించారు. హవాలా మార్గంలో విజయవాడ నుంచి గంతకల్లుకి డబ్బులు తరలిస్తుండగా ఓ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేసి కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. హవాలా మూలాలపైటాస్క్ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాసులు కూపీ లాగుతున్నారు. -
కట్నం వద్దంటాడు, కోట్లు లాగేస్తాడు!
సాక్షి, హైదరాబాద్: చదివింది టెన్త్.. కానీ, అతడి మోసాల స్ట్రెన్త్ అంతాఇంతాకాదు. ఆర్మీ మేజర్‌నంటూ నమ్మబలుకుతాడు. దర్జాగా పెళ్లి చూపులకు వెళ్తూ కట్నానికి వ్యతిరేకినంటూ కలరింగ్ ఇస్తాడు. ఆపై అర్జంట్ అవసరం ఉందంటూ భారీ మొత్తంలో వసూలు చేసేవాడు. ఈవిధంగా దాదాపు 17 మంది నుంచి రూ.8.25 కోట్లు కాజేశాడు. ఇదీ ఎంఎస్ చౌహాన్‌గా చెప్పుకున్న నకిలీ ఆర్మీ మేజర్ ముదావత్ శ్రీను నాయక్ ఘరానా మోసం. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ నిందితుడిని హైదరాబాద్ ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ అంజనీకుమార్ పూర్తి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లాలోని పలుకురాళ్ల తండాకు చెందిన శ్రీను నాయక్ 2002లో అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమె గుంటూరులోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో సూపరింటెండెంట్. శ్రీనుకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కొన్ని రకాల వైద్య కోర్సులు చేస్తే తేలిగ్గా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని, అందుకు అవసరమైన కోచింగ్ తీసుకోవాలని భార్య సూచించడంతో 2014లో నగరానికి వచ్చి ఉప్పల్‌లో ఓ రూమ్ అద్దెకు తీసుకున్నాడు. ఈ క్రమంలో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. అందుకు అవసరమైన డబ్బు కోసం మోసాలబాట పట్టాడు. (చదవండి: మైనర్‌తో అసభ్య చాటింగ్) సోషల్‌మీడియా ద్వారా ప్రచారం... ఆర్మీలోని ఈఎంఈ విభాగంలో మేజర్‌గా పని చేస్తున్నానంటూ చెప్పుకున్న శ్రీను నాయక్ ఆ యూనిఫాంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేసుకున్నాడు. ఆర్మీ మేజర్‌నంటూ ఎంఎస్ చౌహాన్ పేరిట నకిలీ గుర్తింపుకార్డును సృష్టించాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేశానని, ఐఐటీ చెన్నై పట్టభద్రుడినని చెప్పుకుంటూ తిరిగేవాడు. వివిధ మ్యాట్రిమోనియల్ సైట్స్, మ్యారేజ్‌బ్యూరోల ద్వారా తమ సామాజిక వర్గానికి చెందిన అవివాహిత యువతుల వివరాలు సేకరించేవాడు. ధనవంతులను టార్గెట్‌గా చేసుకుని ఖరీదైన కారులో పెళ్లిచూపులకు వెళ్లేవాడు. తనకు కట్నకానుకలు వద్దని నమ్మించేవాడు. ఆ తర్వాత అర్జంట్ అవసరం వచ్చిందని, ఆదాయపుపన్ను క్లియర్ చేయాలని అందినకాడికి దండుకుని వారికి చిక్కకుండా తప్పించుకునేవాడు. గుట్టురట్టు చేసిన ‘ఐఐటీ చెన్నై’... ఈ ఘరానా మోసగాడు తన భార్యకూ టోకరా వేశాడు. అర్జంటుగా ఐటీ కట్టాల్సి ఉందంటూ ఓసారి రూ.16 లక్షలు తీసుకున్నాడు. పెళ్లి పేరుతో ఎర వేసి ఓ ఎంబీబీఎస్ డాక్టర్ నుంచి రూ.56 లక్షలు, సచివాలయ ఉద్యోగిని నుంచి రూ.52 లక్షలు, పీజీ పూర్తి చేసిన యువతి నుంచి రూ.70 లక్షలు కాజేశాడు. ఇటీవల వరంగల్‌కు చెందిన ఓ ఎంబీఏ పూర్తి చేసిన యువతినీ ఇలానే నమ్మించాడు. ఆమె తండ్రి నుంచి రూ.2.01 కోట్లు కాజేశాడు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యనభ్యసించిన యువతితో శ్రీను నాయక్‌కు ఇటీవల పరిచయం ఏర్పడింది. ఆమె చెన్నై ఐఐటీలో ఇతడి గురించి ఆరా తీయగా అతడు చెప్పేది అబద్ధం అని తేలింది. ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఉప్పందడంతో ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో పోలీసులు వలపన్ని అతడిని శనివారం పట్టుకున్నారు. వరంగల్‌కు చెందిన యువతితో ఇతడికి ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. శ్రీను నాయక్ ఖరీదు చేసిన సైనిక్‌పురిలోని ఓ విల్లా, మూడు లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై వరంగల్, రాచకొండల్లో రెండు కేసులు ఉన్నాయి. నిందితుడిని బొల్లారం పోలీసులకు అప్పగించారు. ‘ఇలా ఎవరైనా పెళ్లి సంబంధాల కోసం వస్తే వివిధ కోణాల్లో పూర్వాపరాలు పరిశీలించాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసుల సహాయం కోరండి’అని కొత్వాల్ అంజనీకుమార్ పేర్కొన్నారు. (చదవండి: టెన్త్ చదివి.. డాక్టర్‌నంటూ వైద్యం) -
లంగర్‌హౌజ్‌లో డ్రగ్స్ కలకలం
-
లంగర్‌హౌజ్‌లో డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్: సిటీ యువతను టార్గెట్ చేసుకుని విదేశీయులు కొందరు డ్రగ్స్ దందాకు తెరలేపారు. హైదరాబాద్‌లోని వెస్ట్ జోన్ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. లంగర్‌హౌజ్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియా వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్టూడెంట్ వీసా మీద భారత్‌కు వచ్చిన డానియల్ చదువుతూనే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసుల గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 6 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. (చదవండి: తెలంగాణకు సినీ ప్రముఖుల విరాళాలు) -
టెన్త్ చదివిన ‘డాక్టర్’ గుట్టు రట్టు!
సాక్షి, హైదరాబాద్: చదివింది పదో తరగతి. చేసేది డాక్టర్ వృత్తి. అదేంటీ టెన్త్ చదివితే డాక్టర్ అవ్వొచ్చా? అని ఆశ్చర్యపోకండి. మెహిదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బయటపడిన నకిలీ డాక్టర్ వ్యవహారంలో ఇలాంటి ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. అసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఫేక్ సర్టిఫికేట్‌తో డాక్టర్ అవతారం ఎత్తిన ప్రబుద్ధుడి సమాచారం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందింది. దాంతో సదరు ప్రైవేటు ఆస్పత్రిపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అర్ధరాత్రి దాడులు చేశారు. టెన్త్ చదివి డాక్టర్‌గా చలామణి అవుతున్న ఫేక్ డాక్టర్ ముజిబ్, ఆస్పత్రి నిర్వాహకుడు షోహెబ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులను అసిఫ్‌నగర్ పోలీసులకు అప్పగించారు. ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చిందెవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. (కొంపముంచిన ఓఎల్ఎక్స్ బేరం!) -
చిట్టిమాము బర్త్‌డే సెలబ్రేషన్స్.. అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం : బర్త్‌డే సెలబ్రేషన్స్ పేరుతో నగరంలో హల్చల్ చేసిన రౌడీషీటర్ చిట్టిమాము గ్యాంగ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిట్టిమాము బర్త్‌డే సందర్భంగా శనివారం అర్ధరాత్రి అతడి సన్నిహితులు భారీ ఎత్తున వేడుకలు ఏర్పాటు చేశారు. సినీ ఫక్కీలో నగరంలోని రౌడీషీటర్లు, బౌన్సర్లు, మందు, విందుతో నానా హంగామా సృష్టించారు. అయితే ఈ బర్త్‌డే పార్టీ గురించి సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు రైడ్ చేశారు. చిట్టిమాముతో పాటు పార్టీకి హాజరైన వారిని, బౌన్సర్లను అదుపులోకి తీసుకుని దువ్వాడ పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలం నుంచి భారీగా మద్యం, గంజాయి, రూ.1,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. (దివ్య హత్య కేసు: సంచలన నిజాలు) రౌడీల చర్యలను ఉపేక్షించేది లేదు: డీఎస్పీ విశాఖలో రౌడీల చర్యలను ఉపేక్షించేది లేదని టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ త్రినాథరావు పేర్కొన్నారు. నగరంలోని రౌడీల కదలికలపై ప్రత్యేక నిఘా ఉందన్నారు. చిట్టిమాము గ్యాంగ్ బర్త్‌డే వేడుకలకు సంబంధించి పక్కా సమాచారం రావడంతో దాడి చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నగరంలో గ్యాంగ్‌ల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు డీఎస్పీ త్రినాధరావు విజ్ఞప్తి చేశారు. ఇక రౌడీషీటర్ చిట్టిమాముపై పలు మర్డర్ కేసులు ఉన్న విషయం తెలిసిందే. (భార్యను హత్య చేసిన కానిస్టేబుల్) -
దిగివచ్చిన మద్యం సిండికేట్..
మోర్తాడ్(బాల్కొండ): అక్టోబర్ నెల కోసం ప్రత్యేక ధరను అమలు చేసిన మద్యం సిండికేట్ దిగివచ్చింది. ఒక్కో సీసాపై రూ.10 ధర పెంచగా ఆ ధరను ఎత్తివేసి పాత పద్దతిలోనే ఎంఆర్పీ ధరకు మద్యంను విక్రయిస్తున్నారు. గడచిన సెప్టెంబర్ 30తోనే మద్యం దుకాణాల లైసెన్స్‌కు గడువు ముగిసిపోయింది. అయితే కొత్త మద్యం పాలసీ అమలు కావడానికి కొంత సమయం పట్టడంతో అక్టోబర్ నెల కోసం లైసెన్స్‌లను రెన్యూవల్ చేశారు. లైసెన్స్ ఫీజు ఎక్కువ చెల్లించడం, తమకు లాభం తగ్గిపోవడంతో రూ.10 ధర అదనంగా విక్రయించడానికి మద్యం వ్యాపారులు ఎక్సైజ్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఎక్కువ ధరలకు మద్యం విక్రయించడంపై ఫిర్యాదులు అందినా స్థానిక ఎక్సైజ్ అధికారులు పట్టించుకోక పోవడంతో కొందరు హైదరాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించి ఆ అధికారులు మద్యం అమ్మకాలపై నిఘా ఉంచి రెండు దుకాణాల నిర్వాహకులకు రూ.2లక్షల వరకు జరిమానా విధించారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ ఉన్నతాధికారులు హెచ్చరించడంతో మద్యం సిండికేట్ దిగివచ్చింది. మొదట్లో ప్రత్యేక ధరను అమలు చేసినా కేసులకు జడిసి పాత పద్దతిలోనే మద్యం విక్రయాలకు ఓకే చెప్పారు. మద్యం సిండికేట్ దిగివచ్చి ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయిస్తుండటంతో మందు బాబుల జేబులకు చిల్లు పడటం ఆగిపోయింది. -
అభాసుపాలైన టాస్క్‌ఫార్స్..!
సాక్షి, నిజామాబాద్: టాస్క్‌ఫోర్స్.. ఈ పేరు వింటేనే అసాంఘిక శక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుట్టాలి. పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా నియమించే ఈ విభాగానికి సీపీకి ఉండే అధికారాలన్నీ ఉంటాయి. సీపీ పరిధి ఏ మేరకు ఉంటుందో ఆంత పరిధిలో టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు నిర్వహించవచ్చు. స్థానిక పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు నియమించిన విభాగం ఇది. మరి ఇలాంటి విభాగమే జిల్లాలో అభాసు పాలుకావడం ఇప్పుడు పోలీసువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్మూర్ డివిజన్లో భారీ స్థాయిలో కొనసాగుతున్న ఓ పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ విభాగం దాడి చేసింది. ఈ ఘటనలో విభాగం ఇన్చార్జిగా ఉన్న సీఐ సత్యనారాయణ ఇద్దరు అధికార పార్టీ నేతలను కేసు నుంచి తప్పించేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు ఆయనపై ఆకస్మిక బదిలీ వేటు వేశారు. ఆయనను ఏఆర్ వెకెన్సీ రిజర్వుకు బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు ఆ విభాగం పనితీరే ప్రశ్నార్థకంగా మారింది. కమిషనరేట్‌లో ప్రత్యేకం.. ప్రత్యేక అధికారాలు కలిగిన టాస్క్‌ఫోర్స్ విభాగం కేవలం పోలీసు కమిషనరేట్ ఉన్న చోట మాత్రమే ఏర్పాటు చేస్తారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్న విభాగంలో సుమారు పది మంది వరకు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. ఏమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభిస్తే చాలు విభాగం జిల్లా అంతట ఎక్కడైనా ఆకస్మిక దాడులు (రైడ్స్) నిర్వహించవచ్చు. సెర్చ్ వారెంట్ కూడా ఈ విభాగానికి అవసరం లేదు. మరి అంతటి అధికారాలున్న ఈ విభాగం అధికార పార్టీ నేతలకు వంతపాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. స్థానిక పోలీసులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల చెప్పుచేతల్లో పనిచేయడం సర్వసాధారణమై పోవడమే పోలీసుశాఖ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. మరి అలాంటిది ప్రత్యేక అధికారాలు కలిగిన ఈ విభాగం కూడా అదే అధికార పార్టీ నేతలకు తొత్తుగా వ్యవహరించడంతో స్థానిక పోలీసులకు, ఈ ప్రత్యేక విభాగానికి ఏం తేడా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉత్తర్వులు వెనక్కి తీసుకుందామా..? టాస్క్‌ఫోర్స్ సీఐపై బదిలీ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసిన పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయాన్ని మార్చుకునే యోచనలో ఉన్నారు. సీఐని వెకెన్సీ రిజర్వుకు బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసే యోచనలో ఉన్నట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. ఈవిషయమై సీపీ కార్తికేయను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ఆయన స్పందించేందుకు నిరాకరించారు. -
సీఎంవో కార్యాలయ ఉద్యోగి అంటూ వసూళ్లు..
సాక్షి, సిద్ధిపేట : తెలంగాణ సీఎంవో కార్యాలయ ఉద్యోగి పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మోసగాడు రాయబండి సూర్యప్రకాశ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఉద్యోగిగా చెలమణి అవుతూ అతగాడు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాడు. మీడియా సమావేశాలు, అన్నదానాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసేవాడు. అలాగే సిద్ధిపేట సబ్ రిజిస్ట్రార్‌ను రూ.50వేలు ఇవ్వాలంటూ ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డాడు.సదరు వ్యక్తిపై అనుమానం వచ్చిన సబ్ రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. ఇప్పటికే సూర్యప్రకాశ్‌పై 11 కేసులు ఉన్నట్లు సమాచారం. -
ఫిల్మ్‌నగర్‌లో డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్ : ఫిల్మ్‌నగర్‌లోని దుర్గాభవానీ నగర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఫిలింనగర్ బస్తీలలో డ్రగ్స్ విక్రయ కేంద్రాలు కొనసాగుతున్నాయన్న వార్తలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వైజాగ్‌కు చెందిన కడాలి భాస్కర్ అక్కడ తయారు చేసిన గంజాయి ద్రవ్యం(హ్యాష్ ఆయిల్) విషాల్, అభిలాష్ మత్తునిచ్చే టాబ్లెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం దుర్గాభవానీ నగర్లో గాలింపు చేపట్టారు. ఆ సమయంలో గంజాయి మత్తు పదార్థాన్ని కొనుగోలు చేసేందుకు ముగ్గురు యువకలు రాగా పోలీసులు విక్రయిస్తున్న భాస్కర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇటీవల గంజాయిని ద్రవరూపంలోకి మార్చి హ్యాష్ ఆయిల్ పేరుతో విక్రయిస్తున్న విషయం తెలిసిందే. భాస్కర్ గత కొంత కాలంగా వైజాగ్ నుంచి సీసాల రూపంలో తీసుకొచ్చి ఒక్కో సీసాను ’ 2 వేలకు విక్రయిస్తున్నాడు. ద్రవరూపంలో ఉన్న గంజాయిని సిగరెట్లోకి జొప్పించి పీలుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విశాల్, అభిలాష్‌అనే మరో ఇద్దరు మత్తు ట్యాబ్లెట్లు విక్రయిస్తూ పట్టుబడ్డారు. భాస్కర్ నుంచి అయిదు హ్యాష్ ఆయిల్ సీసాలను, విశాల్ నుంచి పది వరకు ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రవిప్రకాశ్ కోసం మూడు బృందాలు
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, డేటాచౌర్యంతోపాటు పలు కేసులు ఎదుర్కొంటున్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. అతని ఆచూకీ కోసం ఇప్పటికే మూడు బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ పోలీసుల బృందం రవిప్రకాశ్ జాడ కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రవిప్రకాశ్‌కు ఏపీలోని కొందరు రాజకీయ నాయకులు ఆశ్రయమిచ్చినట్లు సమాచారం. వారి వద్దే సినీనటుడు శొంఠినేని శివాజీ కూడా ఉన్నట్లు తెలిసింది. ప్రముఖుల అండతోనే శివాజీ తెలంగాణ పోలీసుల విచారణకు హాజరుకాకుండా కోర్టులో మాత్రం ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేస్తూ వస్తున్నారు. ఇందుకోసం లాయర్లు, అనుచరులతో మాట్లాడేందుకు పదేపదే సిమ్‌కార్డులు మారుస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వాట్సాప్ కాల్స్‌ను కూడా వాడుతున్నారని సమాచారం. పోలీసులు అతని కాల్స్‌పై నిఘా పెట్టారు. అయితే, ఆయన నిత్యం ఫోన్లు మారుస్తున్నట్లు గుర్తించారు. ఎవరి కేసు వారిదే..! రవిప్రకాశ్ కేసుల విషయంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. రెండు కేసుల్లో ఒకటి హైదరాబాద్, మరొకటి సైబరాబాద్‌లో నమోదయ్యాయి. శివాజీతో కలసి నకిలీ కొనుగోలు పత్రాల సృష్టి, నిధుల మళ్లింపు, కుట్ర, నకిలీపత్రాల సృష్టి, సంస్థ కార్యదర్శి సంతకం ఫోర్జరీ తదితర ఆరోపణలపై రవిప్రకాశ్‌పై ఐటీ యాక్ట్, 66, 72, ఐపీసీ 406, 420, 467, 469, 471 సెక్షన్ల కింద కేసులు సైబరాబాద్ పోలీసులు నమోదు చేశారు. టీవీ9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్‌మార్కులు 2018 మే నెలలో మీడియా నెక్స్ట్ ఇండియా కంపెనీకి బదలాయించడంపై బంజారాహిల్స్ పోలీస్‌ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో ఐపీసీ 467, 420, 409, 406, 120 (బీ) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండింటిలో నిందితుడు ఒకరే అయినా కేసుల నేపథ్యం వేర్వేరు కావడంతో ఎవరి దర్యాప్తును వారే కొనసాగించాల్సి వస్తోంది. గతంలో ఐటీ గ్రిడ్ వ్యవహారంలో మాదాపూర్, ఎస్సార్‌నగర్ ఠాణాలలో ఫిర్యాదులు అందాయి. నేరస్వభావం ఒకటే కావడంతో ఈ రెండు కేసులను కలిపి విచారించేందుకు పోలీసు విభాగం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండాపోయింది. రవిప్రకాశ్ కోసం పోలీసులు టాస్క్‌ఫోర్స్‌ను కూడా రంగంలోకి దించినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఉద్యోగి ఎంకేవీఎన్ మూర్తి, మోజో టీవీ చైర్మన్ హరికిరణ్‌లు పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారు. రవిప్రకాశ్ విషయంలో పాత ఉద్యోగులను కూడా పోలీసులు పిలిపించి కూపీలాగుతున్నారు. అవకతవకల విషయంలో పలు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. -
శ్రీనివాసులు దొరికాడు
సాక్షి, హైదరాబాద్ : వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా నిర్వహిస్తూ, పీడీ యాక్ట్ ప్రయోగం తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన శ్రీనివాసులును ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బైరామల్‌గూడకు చెందిన శ్రీనివాసులు అనేకమంది మహిళలు, యువతుల్ని వ్యభిచార దందాలోకి దింపాడు. ఈ రకంగా సంపాదించిన సొమ్ముతోనే బైరామల్‌గూడలో 200 గజాల స్థలంలో మూడు పోర్షన్స్తో కూడిన ఇల్లు సైతం కట్టినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఏళ్ళుగా వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఇతగాడిపై మలక్‌పేట, బంజారాహిల్స్, సైదాబాద్, మీర్‌పేట, సరూర్‌నగర్, వనస్థలిపురం ఠాణాల్లో పదికి పైగా కేసులు నమోదయ్యాయి. శ్రీనివాసులు నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ అంజినీ కుమార్ ఐదు నెలల క్రితం పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నోటీసులు తీసుకోకుండా తప్పించుకుని తిరుగుతున్న ఇతగాడి కోసం ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల ముమ్మరంగా గాలించారు. ఈ నేపథ్యంలో కేపీహెచ్‌బీ ప్రాంతంలో తల దాచుకున్నట్లు సమాచారం అందడంతో అదుపులోకి తీసుకుని సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. వీరు అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
ఇచ్చట అన్ని డాక్యుమెంట్లు అమ్మబడును!
సాక్షి, హైదరాబాద్ : అమెరికా వెళ్లేందుకు అవసరమైన వీసా కోసం దాఖలు చేయాల్సిన పత్రాలు నకిలీవి తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సూత్రధారిగాని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న ఏజెంట్ల కోసం గాలిస్తున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. భూపాలపల్లికి చెందిన డి.విష్ణువర్ధన్ బతుకుతెరువు కోసం నగరానికి వలసవచ్చాడు. బీటెక్ మధ్యలోనే మానేసిన ఇతగాడు తొలినాళ్లల్లో అనేక కన్సల్టెన్సీల్లో పని చేశాడు. ఈ నేపథ్యంలోనే విష్ణుకు వీసా ప్రాసెసింగ్‌పై అవగాహన వచ్చింది. దీంతో 2013 నుంచి బంజారాహిల్స్ నెం.12లో తానే ఓ వీసా ప్రాసెసింగ్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు. నగరం, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రస్తుతం విదేశాల్లో 14 మందిని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. సరైన పత్రాలు లేకుండా అమెరికా వెళ్లాలని భావిస్తున్న వారిని ఏజెంట్లు విష్ణు వద్దకు పంపేవారు. ఆ వ్యక్తి పేరుతో యూజర్ ఐడీ క్రియేట్ చేసి వీసా ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేసే విష్ణు అప్లికేషన్ సైతం డౌన్లోడ్ చేసేవాడు. వీసా ఇంటర్వ్యూ పై తర్ఫీదు ఇచ్చేవాడు. వీటితో పాటు ప్రాసెసింగ్‌కు అవసరమైన పత్రాలు నకిలీవి తయారు చేసి అందిస్తున్నాడు. ఈ పంథాలో ఇప్పటి వరకు దాదాపు 100 మందికి ప్రాసెస్ చేసి భారీగా దండుకున్నాడు. ఇతడి వ్యవహారాలపై స మాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు దాడి చేసి విష్ణును ప ట్టుకున్నారు. అతడి నుంచి 18 బోగస్ డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్,ప్రింటర్స్ స్వాధీనం చేసుకుని కేసును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. -
అంతర్రాష్ట్ర చీటింగ్ ముఠా అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ప్రాపర్టీ లోన్స్, మెడిల్ సీట్లు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన ముగ్గురు వ్యక్తులను శుక్రవారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. హైదరాబాద్, చెన్నై నగరాల్లోని 9 పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ప్రజల నుంచి దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు వసూలు చేశారని పోలీసులు తెలిపారు. నిందితులు సతీషన్, రాం నివాస్, హరి నివాస్‌ల వద్ద నుంచి 45 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని సీపీ అంజన్ కుమార్ తెలిపారు. -
240 కిలోల గంజాయి స్వాధీనం
సాక్షి, మాడుగుల : మండలంలో విశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి రెండు కార్లలో తరలిస్తున్న 240 కిలోల గంజాయిని పట్టుకున్నారు. విశాఖ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సీహెచ్.వి.ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు నుంచి గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు తాటిపర్తి చెక్ పోస్టు వద్దకు వెళుతుండగా తమను గమనించిన నిందితులు కార్లు, గంజాయి మూటలను వదిలి పరారయ్యారన్నారు. గంజాయి, కార్లను స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించామని చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్ మెంట్ ఎస్.ఐ నాగేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి తరలిస్తున్నముగ్గురు మహిళల అరెస్ట్ ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ) : గిరిజన ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి ఢిల్లీకి తరలించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు మహిళలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. సర్కిల్ – 4 ఎక్సైజ్ సీఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడుకు చెందిన కొంతమంది ఢిల్లీలో నివసిస్తున్నారు. వీరిలో ఐదుగురు విశాఖలోని గిరిజన ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి ఢిల్లీ తరలించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ వినయ్‌కుమార్ సిబ్బందితో ఎన్ఏడీ కూడలిలో మాటువేసి పట్టుకున్నారు. ఆ సమయంలో ముగ్గురు చిక్కగా, ఇద్దరు తప్పించుకున్నారు. 18 కిలోల గంజాయి, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని చెబుతున్నారు. మహిళలతోపాటు బైక్, గంజా యిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు సర్కిల్ – 4 ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. దీనిపై ఎక్సైజ్ సీఐ రామ్మోహన్‌రెడ్డి కేసు నమోదు చేశారు. -
పెద్దపల్లిలో పేలుడు పదార్థాలు స్వాధీనం
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. జిల్లాలోని బసంత నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దేవునిపల్లి శివారులోని క్వారీలో గురువారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ చేసిన 321 ఎలక్ట్రికల్ డిటోనేటర్స్, 170 కేజీల అమ్మెనియా, 50 లీటర్ల కిరోసిన్, కాంప్రెషర్ ట్రాక్టర్‌ను పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్వారీ యజమానులు రాయిశెట్టి శ్రీనివాస్, చిట్యాల అశోక్, కాంప్రెషర్ యజమాని సంచులు సధాకర్, డ్రైవర్ దేవేందర్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని మంగళవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి భారీగా ఎల్ఎస్డీ, హెరాయిన్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా డ్రగ్స్ ఎక్కడ నుంచి సరఫరా చేస్తున్నారనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
న్యూ ఇయర్ వేడుకలకు భారీగా డ్రగ్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మాదక ద్రవ్యాలపై పక్కా సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద జరిపిన దాడిలో రోహిత్, విక్కీ అనే ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఎల్సీడీ డ్రగ్స్, సిరంజ్, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఈ డ్రగ్స్‌ను గోవా నుంచి నగరానికి సరఫరా చేశారు. న్యూ ఇయర్ వేడుకలు వస్తున్న నేపథ్యంలో నగరానికి భారీగా డ్రగ్స్‌ను తెచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2013 నుంచి నిందితులు డ్రగ్స్‌ను చలామణి చేస్తున్నారు. గోవాలో తక్కువ మెత్తానికి ఎల్సీడీ స్టాంప్స్‌ను తీసుకొచ్చి హైదరాబాద్‌లో వినియోగదారులకు భారీ మొత్తానికి అమ్ముతున్నట్టు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సరఫరాపై మరింత సమాచారం కోసం రోహిత్, విక్కీలను పోలీసులు విచారిస్తున్నారు. (డ్రగ్స్‌తో పట్టుబడిన రోహిత్, విక్కీ) (పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, సెల్ఫోన్లు)