
సిరిసిల్ల క్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర శివారులో రూ.3 కోట్ల కరెన్సీతో ఓ కంటెయినర్ తిరుగుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందులో రూ.500 పాత కరెన్సీ ఉన్నట్లు కూడా సమాచారం.
హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు రూ.2.60 లక్షల పాత కరెన్సీని వేర్వేరు ప్రాంతాల మీదుగా తరలిస్తూ శనివారం సిరిసిల్ల పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టడంతో కంటెయినర్ విషయం వెలుగుచూసినట్లు తెలుస్తోంది. ఈ ఏడుగురిలో హైకోర్టులో పనిచేసే ఉద్యోగి ఉన్నారు.