సాక్షి, హైదరాబాద్: రోజులో ఒక్కసారైనా టీ తాగినిదే ఏం పని తోచదు చాలా మందికి. ఇంట్లోనే కాదు బయటకు వెళ్లినా సమాయనుసారం టీ చుక్కా నోట్లో పడాల్సిందే. కానీ షాపుల్లో, టీ కొట్టుల్లో ఎక్కువగా లూస్ టీపోడినే వాడుతుంటారు. ఇకపై బయట టీ తాగే సమయంలో చాయ్ లవర్లు కాస్తా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో నకిలీ టీ పొడి తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. నగరంలో టీ దుకాణాలకు తక్కువ ధరకు కల్తీ టీ పొడి సరఫరా చేస్తున్న ముఠాను ఆటకట్టించారు మధ్యమండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు. సనత్‌నగర్‌లోని ఓ కంపెనీపై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. టన్నుల కొద్దీ నకిలీ టీపొడి స్వాధీనం చేసుకున్నారు.
నాసిరకమైన టీ పొడిలో కొబ్బరి చిప్ప పొడి, రసాయనాలు, రంగులు, చాక్లెట్ ఫ్లేవర్ మిల్క్ పౌడర్ కలిపి కస్తే టీ పొడి తయారు చేస్తున్న ముఠాకు మధ్య మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ముగ్గురు నిందితులను పట్టుకుని వారి నుంచి 300 పేజీల కల్తీ టీ పొడి, 200 కేజీల కొబ్బరి చిప్పల పొడి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర తెలిపారు. ఫతేనగర్‌కు చెందిన జగన్నాథ్ కోణార్క్ టీ పౌడర్ సేల్స్ ఆండ్ సప్లయర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు.
తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ టీ పొడి తయారీకి సిద్ధమ య్యాడు. మార్కెట్ నుంచి కేజీ రూ. 80 ఖరీదు చేసే టీ పొడి, రయనాలు, రంగులు, ఫ్లేవర్స్‌తో పాటు కొబ్బరి చిప్పల పొడి కొనేవాడు. దీన్ని తన దుకాణానికి తీసుకువెళ్లి తన వద్ద పని చేసే ప్రతాప్, పరాదాలకు ఇచ్చే వాడు. వీళ్లు వాటన్నింటినీ కలిపి కల్తీ టీ పొడి తయారు చేసి ప్యాక్ చేసే వారు. ఈ పొడిని కేజ్ రూ.250కి అమ్మే జగన్నాథ్ లాభాలు ఆర్థిస్తున్నాడు.
ఈ టీ పొడిని ప్రతినిదులు ఎక్కువగా చిన్న చిన్న దుకాణదారులతో పాటు రోడ్డు వచ్చిన టీ బుధవారం స్టాల్స్ కు అమ్మేవాడు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న కార్యాలయ మధ్య మండల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్ రామకృష్ణ నేతృత్వంలో ఎస్సై డి.శ్రీకాంత్ గౌడ్ వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును సనత్‌నగర్ పోలీ సులకు అప్పగించారు. జగన్నాథ్‌పై ఇప్పటికే మోమిన్‌పేట్, సనత్ నగర్ ఠాణాల్లో మూడు అదే తరహా కేసులు ఉన్నాయని అయిన ప్పటికీ అతడు తన వంతా కొనసాగుస్తున్నాడని టీసీపీ తెలిపారు. కల్తీ పొడితో చేసిన టీ పొడి తాగడం వల్ల కేన్సర్, కామెర్లు సహా అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment