Powder
-
HYD: బయట టీ తాగే వారు జాగ్రత్త.. నకిలీ టీ పౌడర్ ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రోజులో ఒక్కసారైనా టీ తాగినిదే ఏం పని తోచదు చాలా మందికి. ఇంట్లోనే కాదు బయటకు వెళ్లినా సమాయనుసారం టీ చుక్కా నోట్లో పడాల్సిందే. కానీ షాపుల్లో, టీ కొట్టుల్లో ఎక్కువగా లూస్ టీపోడినే వాడుతుంటారు. ఇకపై బయట టీ తాగే సమయంలో చాయ్ లవర్లు కాస్తా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో నకిలీ టీ పొడి తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. నగరంలో టీ దుకాణాలకు తక్కువ ధరకు కల్తీ టీ పొడి సరఫరా చేస్తున్న ముఠాను ఆటకట్టించారు మధ్యమండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు. సనత్‌నగర్‌లోని ఓ కంపెనీపై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. టన్నుల కొద్దీ నకిలీ టీపొడి స్వాధీనం చేసుకున్నారు.నాసిరకమైన టీ పొడిలో కొబ్బరి చిప్ప పొడి, రసాయనాలు, రంగులు, చాక్లెట్ ఫ్లేవర్ మిల్క్ పౌడర్ కలిపి కస్తే టీ పొడి తయారు చేస్తున్న ముఠాకు మధ్య మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ముగ్గురు నిందితులను పట్టుకుని వారి నుంచి 300 పేజీల కల్తీ టీ పొడి, 200 కేజీల కొబ్బరి చిప్పల పొడి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర తెలిపారు. ఫతేనగర్‌కు చెందిన జగన్నాథ్ కోణార్క్ టీ పౌడర్ సేల్స్ ఆండ్ సప్లయర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు.తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ టీ పొడి తయారీకి సిద్ధమ య్యాడు. మార్కెట్ నుంచి కేజీ రూ. 80 ఖరీదు చేసే టీ పొడి, రయనాలు, రంగులు, ఫ్లేవర్స్‌తో పాటు కొబ్బరి చిప్పల పొడి కొనేవాడు. దీన్ని తన దుకాణానికి తీసుకువెళ్లి తన వద్ద పని చేసే ప్రతాప్, పరాదాలకు ఇచ్చే వాడు. వీళ్లు వాటన్నింటినీ కలిపి కల్తీ టీ పొడి తయారు చేసి ప్యాక్ చేసే వారు. ఈ పొడిని కేజ్ రూ.250కి అమ్మే జగన్నాథ్ లాభాలు ఆర్థిస్తున్నాడు.ఈ టీ పొడిని ప్రతినిదులు ఎక్కువగా చిన్న చిన్న దుకాణదారులతో పాటు రోడ్డు వచ్చిన టీ బుధవారం స్టాల్స్ కు అమ్మేవాడు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న కార్యాలయ మధ్య మండల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్ రామకృష్ణ నేతృత్వంలో ఎస్సై డి.శ్రీకాంత్ గౌడ్ వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును సనత్‌నగర్ పోలీ సులకు అప్పగించారు. జగన్నాథ్‌పై ఇప్పటికే మోమిన్‌పేట్, సనత్ నగర్ ఠాణాల్లో మూడు అదే తరహా కేసులు ఉన్నాయని అయిన ప్పటికీ అతడు తన వంతా కొనసాగుస్తున్నాడని టీసీపీ తెలిపారు. కల్తీ పొడితో చేసిన టీ పొడి తాగడం వల్ల కేన్సర్, కామెర్లు సహా అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. -
ఈ ‘టీ’తో నష్టాలే!
సాక్షి, హైదరాబాద్: నాసిరకమైన టీ పొడిలో కొబ్బరి చిప్ప పొడి, రసాయనాలు, రంగులు, చాక్లెట్ ఫ్లేవర్, మిల్క్ పౌడర్ కలిపి కల్తీ టీ పొడి తయారు చేస్తున్న ముఠాకు మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ముగ్గురు నిందితులను పట్టుకుని వారి నుంచి 300 కేజీల కల్తీ టీ పొడి, 200 కేజీల కొబ్బరి చిప్పల పొడి స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర బుధవారం తెలిపారు. ఫతేనగర్‌కు చెందిన జగన్నాథ్ కోణార్క్ టీ పౌడర్ సేల్స్ అండ్ సప్లయర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ టీ పొడి తయారీకి సిద్ధమయ్యాడు. మార్కెట్ నుంచి కేజీ రూ.80 ఖరీదు చేసే టీ పొడి, రసాయనాలు, రంగులు, ఫ్లేవర్స్‌తో పాటు కొబ్బరి చిప్పల పొడి కొనేవాడు. దీన్ని తన దుకాణానికి తీసుకువెళ్లి తన వద్ద పని చేసే ప్రతాప్, పరాదాలకు ఇచ్చే వాడు. వీళ్లు వాటన్నింటినీ కలిపి కల్తీ టీ పొడి తయారు చేసి ప్యాక్ చేసే వారు. ఈ పొడిని కేజీ రూ.250కి అమ్మే జగన్నాథ్ లాభాలు ఆర్జిస్తున్నాడు. ఈ టీ పొడిని ఎక్కువగా చిన్న చిన్న దుకాణదారులతో పాటు రోడ్డు పక్కన టీ స్టాల్స్‌కు అమ్మేవాడు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్.రామకృష్ణ నేతృత్వంలో ఎస్సై డి.శ్రీకాంత్ గౌడ్ వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. జగన్నాథ్‌పై ఇప్పటికే మోమిన్‌పేట్, సనత్‌నగర్ ఠాణాల్లో మూడు ఇదే తరహా కేసులు ఉన్నాయని, అయినప్పటికీ అతడు తన పంథా కొనసాగస్తున్నాడని డీసీపీ తెలిపారు. కల్తీ పొడితో చేసిన టీ తాగడం వల్ల కేన్సర్, కామెర్లు సహా అనేక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. -
డ్రాగన్ పౌడర్ టెక్నాలజీ రెడీ!
అధికంగా యాంటీఆక్సిడెంట్లు, పీచుపదార్థం, ఇంకా ఇతర పోషకాలతో కూడిన డ్రాగన్ ఫ్రూట్ ఇటీవల కాలంలో సూపర్ ఫ్రూట్‌గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రారంభమైన 5–7 ఏళ్లలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పాటు మరో 9 రాష్ట్రాలకు డ్రాగన్ సాగు విస్తరించింది. పింక్/రెడ్, వైట్ పల్ప్ రకాలు సాగవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పంటకు ‘కమలం’ అని పేరుపెట్టింది. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) గత ఏడాది డ్రాగన్ జ్యూస్ ఉత్పత్తి సాంకేతికతను రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా, రెడ్/పింక్ డ్రాగన్ ఫ్రూట్‌తో పౌడర్ (పిండి)ని తయారు చేసే టెక్నాలజీని రూపొందించింది. కర్ణాటకలోని కొడగు జిల్లా చెట్టల్లిలోని ఐఐహెచ్‌ఆర్‌కు చెందిన కేంద్రీయ ఉద్యాన పంటల ప్రయోగ కేంద్రం ఈ టెక్నాలజీ అభివృద్ధికి వేదికైంది.డ్రాగన్ పండ్లతో పిండిగా మార్చే ప్రక్రియలో రెండు పద్ధతులున్నాయి. స్ప్రే డ్రైడ్ పద్ధతిలో తయారైన పిండికి కిలో రూ. 4 వేలు, ఫ్రీజ్ డ్రైడ్ పద్ధతిలో తయారైన పిండికి కిలో రూ.12 – 15 వేల ధర పలుకుతోంది. ఈ రెండు పద్ధతుల్లో పిండిని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయాలంటే భారీ పెట్టుబడి అవసరం అవుతుంది. అయితే, ఇందులో సగం ఖర్చుతోనే డ్రాగన్ పిండిని ఉత్పత్తి చేసే టెక్నాలజీని బెంగళూరులోని ఐఐహెచ్ఆర్ ఇటీవల రూపొందించింది.మార్కెట్లో ఉన్న డ్రాగన్ పిండి కంటే అత్యంత పోషక విలువలతో ఉండే విధంగా ఈ టెక్నాలజీతో డ్రాగన్ పిండిని తయారు చేయవచ్చని, ఈ పిండిని సహజ రంగు పదార్థంగా అనేకప్రాసెస్డ్ ఆహారోత్పత్తుల్లో కలపవచ్చని ఐఐహెచ్ఆర్ తెలిపింది. ఐస్‌క్రీమ్‌లు, మిల్క్‌షేక్‌లు, జ్యూస్‌లు, కేకులు, బిస్కట్లు, టీ బ్యాగ్స్, మఫిన్స్ తయారీలో డ్రాగన్ పిండిని విస్తృతంగా వాడుతున్నారు. ఐఐహెచ్ఆర్ రూపొందించిన డ్రాగన్ పొడి సాంకేతికతను అందిపుచ్చుకొని రైతులకు మెరుగైన ఆదాయం తెప్పించేందుకు వాణిజ్య సంస్థలు/ ఎఫ్పిఓలు/ కోఆపరేటివ్లు కృషి చెయ్యాలి. -
బ్రాహ్మి: ఇది.. మీ మెదడుకు మేతలాంటిది!
బ్రాహ్మి ప్రభావవంతమైన ప్రయోజనాలను కలిగిస్తోందని ‘జర్నల్ ఆఫ్ కాంప్లిమెంటరీ మెడిసిన్’ వెల్లడించింది. బ్రాహ్మితోపాటు మరో నాలుగింటిని కూడా తెలిపింది. బ్రాహ్మిని క్యాప్సూల్ రూపంలో, పౌడర్‌గానూ, నీటిలో మరిగించి టీ గా కూడా తీసుకోవచ్చు. ఇది దెబ్బతిన్న న్యూరాన్లను ఆరోగ్యవంతం చేసి నాడీ వ్యవస్థ నుంచి సాగాల్సిన సమాచార ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది.– అశ్వగంధ: మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాల నుంచి స్వస్థత పరిచి జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుందని ‘జర్నల్ ఆఫ్ డైటరీ సప్లిమెంట్స్’ అధ్యయనంలో వెల్లడైంది. కార్టిసోల్ స్థాయులు పెరగడం వల్లనే ఒత్తిడి పెరుగుతుంది. అశ్వగంధ కార్టిసోల్ స్థాయులను తగ్గించి మైండ్‌ను ప్రశాంతంగా ఉంచుతుంది. సమాచారాన్ని అందుకున్న తర్వాత మెడదు వేగంగా స్పందించి చేయాల్సిన పని మీద శ్రద్ధ, కార్యనిర్వహణ సమర్థతను మెరుగుపడుతుంది. అయోమయానికి గురికావడం తగ్గి ఆలోచనల్లో స్పష్టత చేకూరుతుంది. ఇది టాబ్లెట్, పౌడర్‌గా దొరుకుతుంది. నిద్ర΄ోయే ముందు పాలతో లేదా తేనెతో కలిపి తీసుకోవాలి.– పసుపు: పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ సుగుణాలుంటాయి. యాంటీబయాటిక్‌గా పని చేస్తుంది. బ్రెయిన్ హెల్త్‌ని కూడా మెరుగు పరుస్తుందని ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ జీరియాట్రిక్ సైకియాట్రీ’ పేర్కొన్నది. దీనిని కూరల్లో వేసుకోవడం, జలుబు చేసినప్పుడు పాలల్లో కలుపుకుని తాగడం తెలిసిందే. నీటిలో పసుపు, మిరియాల పొడిని మరిగించి తాగితే జీవక్రియలు మెరుగుపడతాయి.– గోతుకోలా: దీనిని సెంట్రెల్లా ఏషియాటికా అంటారు. ఈ ఆకును ఆసియాలోని చాలా దేశాల్లో సలాడ్, సూప్, కూరల్లో వేసుకుంటారు. ఈ ఆకును నీటిలో మరిగించి టీ తాగవచ్చు. క్యాప్సూల్స్ కూడా దొరుకుతాయి. ఇది మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో రక్తప్రసరణ తగ్గడం వల్ల ఎదురయ్యే జ్ఞాపకశక్తి లోపం నివారణ అవుతుందని ‘జర్నల్ ఆఫ్ ఎథ్నోపార్మకాలజీ’ చెప్పింది. మధ్య వయసు నుంచి దీనిని వాడడం మంచిది.– గింకో బిలోబా: దీనిని చైనా వాళ్లు మందుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. వార్ధక్యంలో ఎదురయ్యే మతిమరుపు (డిమెన్షియా) ను నివారిస్తుందని ‘కోష్రానే డాటాబేస్ ఆఫ్ సిస్టమిక్ రివ్యూస్’ తెలియ చేసింది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ ్రపాపర్టీస్ మెదడు కణాల క్షీణతను అరికడతాయి. ఇవి కూడా మాత్రలు, పొడి రూపంలో దొరుకుతాయి. రోజూ ఈ పొడిని నీటిలో మరిగించి తాగితే వయసు మీరుతున్నా సరే మతిమరుపు సమస్య దరి చేరదు.ఇవి చదవండి: Aruna Roy: 'ఈ పయనం సామాజికం'! -
ఈ వెరైటీ వంటకాలను.. ఎప్పుడైనా ట్రై చేశారా..!?
హనీ– మిల్క్ పౌడర్ కప్ కేక్..కావలసినవి..తేనె– 1 కప్పు;మిల్క్ పౌడర్– 1 కప్పు;మైదా పిండి– అర కప్పు;పంచదార– పావు కప్పు (పొడి చేసుకోవాలి, అభిరుచి బట్టి కాస్త పెంచుకోవచ్చు);నెయ్యి, కొబ్బరి కోరు– అర కప్పు చొప్పున;గుడ్లు– 4, చిక్కటి పాలు– 2 టేబుల్ స్పూన్లు;తినే సోడా, వెనీలా ఎసెన్స్– అర టీ స్పూన్ చొప్పున;తయారీ..ముందుగా ఒక బౌల్లో గుడ్లు కొట్టి, పాలు పోసి క్రీమీగా అయ్యేలా బాగా గిలకొట్టుకోవాలి.ఆ మిశ్రమంలో తేనె, మైదా, మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకుని పేస్ట్‌లా కలుపుకోవాలి. తర్వాత తినే సోడా, సగం నెయ్యి, వెనీలా ఎసెన్ ్స వేసుకుని బాగా కలుపుకోవాలి.ఈలోపు మిగిలిన నేతిలో కొబ్బరి కోరు, పంచదార పొడి వేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు మినీ కేక్ బౌల్స్ తీసుకుని, వాటికి నెయ్యి రాసి పెట్టుకోవాలి.తర్వాత వాటిలో కొద్దిగా గుడ్ల మిశ్రమం వేసుకుని మధ్యలో కొద్దిగా కొబ్బరికోరు మిశ్రమం నింపుకుని, మళ్లీ పైన గుడ్ల మిశ్రమాన్ని వేసుకుని నింపుకుని ఓవెన్లో బేక్ చేసుకోవాలి.చల్లారాక క్రీమ్‌తో గార్నిష్ చేసుకుని, పైన గార్నిష్ కోసం.. కొద్దిగా తేనె పోసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఎగ్ – బాదం హల్వా..కావలసినవి..గుడ్లు– 8, బాదం పాలు– 1 కప్పు;కస్టర్డ్ మిల్క్– పావు కప్పు;పంచదార– 1 టేబుల్ స్పూన్ (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు);ఏలకుల పొడి– 1 టీ స్పూన్;నెయ్యి– 4 టేబుల్ స్పూన్లు;కుంకుమ పువ్వు– చిటికెడు;వెనీలా ఎసెన్ ్స– 1 టీ స్పూన్;బాదంపప్పు– 2 టేబుల్ స్పూన్లు (దోరగా నేతిలో వేయించాలి, అభిరుచిని బట్టి జీడిపప్పు, కిస్మిస్ వంటివి జోడించుకోవచ్చు);తయారీ..ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో గుడ్లలోని పసుపు సొనను మాత్రమే తీసుకుని, బాగా గిలకొట్టాలి.అందులో కస్టర్డ్ మిల్క్, బాదం పాలు, పంచదార, ఏలకుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని, పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని, అందులో ఈ మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద ఉడికించుకోవాలి.మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మిశ్రమం సగానికి తగ్గుతున్నప్పుడు కుంకుమ పువ్వు వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి.మళ్లీ మధ్యమధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడుతున్నప్పుడు వెనీలా ఎసెన్ ్స వేసుకుని మరోసారి కలపాలి.ఆ మిశ్రమం మరింత దగ్గర పడుతున్న సమయంలో నేతిలో వేయించిన బాదం పప్పు వంటి వేసుకుని, కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్వీట్‌కార్న్ ఇడియాప్పం..కావలసినవి..స్వీట్ కార్న్ జ్యూస్ (వడకట్టుకోవాలి);బియ్యప్పిండి– 3 కప్పులు చొప్పున;జొన్న పిండి, ఓట్స్ పౌడర్– పావు కప్పు చొప్పున:జీలకర్ర పొడి– పావు టీ స్పూన్;చిక్కటి కొబ్బరి పాలు– పావు కప్పు;నీళ్లు– కొద్దిగా, నెయ్యి– 1 టీ స్పూన్;ఎల్లో ఫుడ్ కలర్– కొద్దిగా (అభిరుచి బట్టి);తయారీ..ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, జీలకర్ర పొడి, స్వీట్‌కార్న్ జ్యూస్, కొబ్బరి పాలు వేసుకుని కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుని, మరోసారి బాగా కలుపుకోవాలి.తర్వాత ఇడ్లీ పాన్ లేదా పెద్ద బౌల్‌కి బ్రష్‌తో నెయ్యి పూసుకోవాలి.అనంతరం మురుకుల మేకర్‌కి సన్నని హోల్స్ ఉండే ప్లేట్‌ని అమర్చి, అందులో ఈ మిశ్రమాన్ని సగానికి నింపుకుని, ఇడ్లీ పాన్ లో లేదా పెద్ద బౌల్లో నూడుల్స్‌లా ఒత్తుకుని ఆవిరిపై ఉడికించాలి.అభిరుచిని బట్టి ఆవాలు, కరివేపాకు, కొత్తిమీరలతో తాళింపు వేసి, కలుపుకుని.. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఇవి చదవండి: ఈ 'తియా శిలాఫలకాలు'.. ఏ కాలంనాటివో తెలుసా!? -
బేబీ పౌడర్‌తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
జాన్సన్ అండ్ జాన్సన్ ప్రొడక్ట్‌లపై తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. కంపెనీ అనుబంధ సంస్థ తయారుచేస్తున్న బేబీ పౌడర్‌లోని టాల్కమ్ స్త్రీల అండాశయ క్యాన్సర్‌కు కారణమవుతుందని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. వాటిని పరిష్కరించడానికి 25 ఏళ్ల వ్యవధికిగాను కంపెనీ సుమారు 6.48 బిలియన్ డాలర్లు(రూ.54వేలకోట్లు) చెల్లించడానికి సిద్ధమైంది.స్త్రీల పరిశుభ్రత కోసం కంపెనీ తయారుచేస్తున్న టాల్కమ్ పౌడర్ ఉపయోగించడం ద్వారా ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై దాడిచేసే మీసోథెలియోమా, అండాశయ క్యాన్సర్ వస్తుందని ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించి కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తమ ఉత్పత్తుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, కోర్టులో దాఖలైన వ్యాజ్యాల్లో ఏమాత్రం నిజం లేదని కంపెనీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: గూగుల్‌లో మళ్లీ లే ఆఫ్స్.. ఎందుకో తెలుసా..బుధవారం అనుబంధ సంస్థ పునర్నిర్మాణానికి 75% మంది వాటాదార్లు సానుకూలంగా ఓటు వేస్తే ప్రీప్యాకేజ్డ్ చాప్టర్ 11 దివాలాకు దాఖలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. మెసోథెలియోమాకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాలను రిఆర్గనైజేషన్ ప్లాన్ వెలుపల పరిష్కరిస్తామని పేర్కొంది. -
Cocaine In White House: వైట్‌హౌస్‌లో కొకైన్ కలకలం.. అధికారులు అప్రమత్తం!
అమెరికాలోని వైట్‌హౌస్ (శ్వేత సౌధం)లో అధికారులు కొకైన్ (మాదకద్రవ్యం)ను గుర్తించారు. ఓ తెల్లటి పదార్ధాన్ని అధికారులు గుర్తించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ఆ పౌడర్ లభ్యమయ్యిందని సమాచారం. వైట్‌హౌజ్‌లోని వెస్ట్ వింగ్ ప్రాంతంలో దీనిని సీజ్ చేశారు. అనంతరం ఆ కాంప్లెక్స్‌లో ఉన్న వారిని మరో ప్రదేశానికి తరలించారు. అయితే కొకైన్‌ను గుర్తించిన సమయంలో వైట్‌హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ లేరు. ప్రస్తుతం ఆయన తన వీకెండ్‌ను క్యాంప్ డేవిడ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది ఆ తెల్లటి పౌడర్‌ను పలు విధాలుగా పరీక్షించారు. ప్రాథమిక పరీక్షలో అది పౌడర్ కొకైన్ అని గుర్తించారు. దర్యాప్తు ముమ్మరం ఆ తెల్లటి పౌడర్ ప్యాకెట్ గురించి మరింతగా తెలుసుకునేందుకు టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు ఆ పౌడర్ వైట్‌హౌస్‌లోనికి ఎలా చేరిందనే దానిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దర్యాప్తు ముమ్మరం చేశారు. వైట్‌హౌజ్ వెస్ట్ వింగ్ అనేది అధ్యక్ష భవనానికి సమీపంలో ఉంటుంది. క్యాబినెట్ రూమ్, ఓవల్ ఆఫీస్, ప్రెస్ రూమ్‌లు కూడా అక్కడే ఉంటాయి. కాగా వెస్ట్ వింగ్ వద్దకు ప్రతి రోజూ వివిధ ప్రభుత్వ పనుల కోసం వందల సంఖ్యలో జనం వస్తుంటారు. ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామన్న రష్యా! -
Mahabubnagar: గుట్టలో గుట్టురట్టు
సాక్షి, మహబూబ్‌నగర్(అచ్చంపేట రూరల్): ఎలాంటి అనుమతి లేకుండా గుట్టుచప్పుడు కాకుండా గుట్టలో నిర్వహిస్తున్న జంతు ఎముకలతో తయారుచేసే పౌడర్ ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. ఈ విషయమై సోమవారం అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో పులిజాల గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఆర్డీఓ పాండునాయక్ ఆదేశాల మేరకు సంఘటన స్థలానికి తహసీల్దార్ కృష్ణయ్య, ఎస్ఐ ప్రదీప్‌కుమార్, ట్రాన్స్‌కో ఏఈ మేఘనాథ్, సిబ్బందితో కలిసి చేరుకున్నారు. అక్కడి మూడు షెడ్లలో జంతువుల ఎముకలను చూర్ణం చేసే యంత్రాలు, కుప్పలుగా ఉన్న వాటి వ్యర్థాలను పరిశీలించారు. చదవండి: (సీఎం కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ) నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూమిలో షెడ్డు నిర్మించడం, స్థానికంగా ఏ శాఖ అనుమతి పత్రాలు లేనందున ఫ్యాక్టరీని సీజ్ చేశారు. అలాగే విద్యుత్ సరఫరా కాకుండా జంపర్లను తీయించారు. కాగా, నిర్వాహకులు మాత్రం ఈ పౌడర్‌ను ఆర్గానిక్ ఎరువులలో ఉపయోగిస్తారని, దీనిని చెట్లకు వాడతారని చెబుతున్నారు. ఎవరికీ ఎలాంటి అపాయం లేకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఇదిలాఉండగా గతంలోనూ అచ్చంపేట మండలంలోని చౌటపల్లి, సిద్దాపూర్ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతి లేకుండా జంతు కళేబరాలతో తయారుచేసే నూనె ఫ్యాక్టరీలను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (కన్నబిడ్డల్ని హత్యచేసిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య) -
Tea Powder: అరే ఏంట్రా ఇది.. టీ పౌడర్ని కూడా వదలరా..?
నిర్మా పౌడర్.. జీడి తొక్కల పొట్టు.. సుద్ద మట్టి.. రంపపు పొట్టు.. కాదేదీ టీ పొడి తయారీకి అనర్హం అన్నట్టుగా ఉంది టీ పొడి తయారీ కేంద్రాల్లో పరిస్థితి. తేయాకుతో తయారు చేయాల్సిన టీ పొడిని.. ప్రజల ఆరోగ్యానికి తూట్లు ‘పొడి’చేలా తయారు చేస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. లూజ్ టీ పొడి పేరుతో గలీజు వ్యాపారాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తక్కువ ధరకు వస్తుందన్న ఉద్దేశంతో టీస్టాల్ నిర్వాహకులు, పేదలు వీటిని వినియోగిస్తూ తమ గొంతుల్లో గరళాన్ని నింపుకొంటున్నారు. సాక్షి, మండపేట: ఏ ఛాయ్ చటుక్కున తాగరా భాయ్.. ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్.. ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్.., ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్.., ఏ ఛాయ్ గరీబుకు విందురా భాయ్.. అంటూ ఓ సినీ కవి ఛాయ్(టీ) గొప్పదనాన్ని ఎంతో బాగా వివరించారు. నిజమే.. ఎందుకంటే చాలా మందికి వేడివేడి టీ తాగనిదే పొద్దు గడవదు.. నిత్యజీవితంలో భాగమైన ఈ టీ అమ్మకాల ద్వారా ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. మరోవైపు టీకి ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని లూజ్ టీపొడి మాటున కల్తీ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు కొందరు. కల్తీ టీ పొడి తయారీకి వినియోగిస్తున్న సుద్దమట్టి జిల్లాలో లైసెన్సుడ్ టీపొడి తయారీ కేంద్రాలు రాజమహేంద్రవరం, మండపేట తదితర చోట్ల కేవలం 11 మాత్రమే ఉన్నాయి. వీరు కేరళ, అస్సాం, కోల్‌కతా నుంచి లూజ్ టీ పొడి తీసుకువచ్చి వాటిని 50 గ్రాములు, 100 గ్రాములు, 250 గ్రాములు తదితర కేటగిరీలుగా ప్యాకింగ్ చేసి విక్రయాలు చేస్తుంటారు. అయితే ఏ విధమైన అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న అనధికార కేంద్రాలు కూడా జిల్లాలోని రాజమహేంద్రవరం, మండపేట, అనపర్తి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ నకిలీ ముఠాలు స్థానిక అధికార యంత్రాంగానికి ముడుపులు ముట్టచెప్పుతుండడంతో వారు వీటి వైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలున్నాయి. చదవండి: (మార్కాపురం కోర్టుకు హీరో సుమంత్, సుప్రియ) కల్తీకి అడ్డదారులెన్నో.. రాజమహేంద్రవరంలో రూ.40 నుంచి రూ.50లకు లభ్యమయ్యే నాసిరకం లూజ్ టీపొడి తీసుకువచ్చి వాటిలో రంగు, రుచి, వాసన కోసం డిటర్జెంట్ పౌడర్, జీడిపిక్కల పొట్టు, చింతపిక్కల పొడి, రంపం పొట్టు, సుద్ద మట్టి, కెమికల్స్‌ను కలుపుతూ కల్తీ టీ పొడి తయారు చేస్తున్నారు. బ్రాండెడ్ టీ పొడి కిలో రూ.600 నుంచి రూ.800 వరకు ఉండగా ఈ లూజ్ టీ పొడి కేవలం రూ.150కు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే లభ్యమవుతుండటంతో టీ స్టాళ్లు, పేదవర్గాల వారు దీనినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో పట్టణాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాలు, సైకిళ్లు, మోటారు సైకిళ్లపై కల్తీ టీపొడి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన కల్తీ టీ పొడి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు జిల్లా నుంచి వ్యాపారులు లూజ్ టీ పొడి తయారు చేసి ఎగుమతులు చేస్తున్నారు. దీని నాణ్యతపై అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా ఉంది. ఇటీవల బిక్కవోలు మండలం ఆర్ఎస్ పేటలో ఫుడ్ సేఫ్టీ, పోలీసు అధికారులు నిర్వహించిన దాడుల్లో విస్మయం కలిగించే విషయాలు వెలుగుచూశాయి. ప్రజారోగ్యానికి చేటు చేసే కెమికల్స్, డిటర్జెంట్స్‌తో నాలుగేళ్లుగా కల్తీ టీపొడి తయారు చేసి ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నట్టు గుర్తించారు. పలు లైసెన్సుడ్ కేంద్రాల్లోనూ టీ పొడిలో రసాయనాలు కలిపి కల్తీ చేస్తున్నారు. చదవండి: (బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోనే ఎక్కువ!) ఆరోగ్యానికి చేటు ప్రమాదకర కెమికల్స్‌ను కలపడం వలన కల్తీ టీపొడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్సర్, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందంటున్నారు. కల్తీ టీ పొడికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కల్తీని ఇలా గుర్తించవచ్చు టీ పొడి కల్తీ జరిగింది లేనిది సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు అంటున్నారు. కొంత టీ పొడిని తీసుకుని గాజు గ్లాసులోని నీటిలో వేసినప్పుడు కల్తీ జరిగితే రంగు కిందికి చేరుతుందని, రంగు దిగలేదంటే కల్తీ జరగలేనట్టుగా గుర్తింవచ్చని సూచిస్తున్నారు. కేసుల నమోదు ఆహార పదార్థాల్లో కల్తీలను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. కల్తీ టీ పొడి తయారీపై ఏడాది కాలంలో జిల్లాలో నాలుగు కేసులు నమోదు చేశాం. ఎక్కడైనా ఆహార పదార్థాలు కల్తీ చేస్తున్నట్టు తెలిస్తే వెంటనే తనిఖీలు నిర్వహించి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపుతున్నాం. కల్తీ ఉన్నట్టు నిర్ధారణ అయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – బి. శ్రీనివాస్, సహాయ నియంత్రణ అధికారి, కాకినాడ కల్తీని ఇలా గుర్తించవచ్చు టీ పొడి కల్తీ జరిగింది లేనిది సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు అంటున్నారు. కొంత టీ పొడిని తీసుకుని గాజు గ్లాసులోని నీటిలో వేసినప్పుడు కల్తీ జరిగితే రంగు కిందికి చేరుతుందని, రంగు దిగలేదంటే కల్తీ జరగలేనట్టుగా గుర్తింవచ్చని సూచిస్తున్నారు. -
రష్యాలో గన్ పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
-
రష్యాలో భారీ పేలుడు, 16 మంది మృతి
మాస్కో: రష్యాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. మాస్కోకు ఆగ్నేయంగా 170 మైళ్ల దూరంలో ఉన్న రష్యాలో ఉన్న రియాజాన్ ప్రాంతంలోని ఎలాస్టిక్ ఫ్యాక్టరీలో శుక్రవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గన్‌పౌడర్ ప్లాంట్ కావడంతో పేలుడు కూడా సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 17 మంది ఉండగా అందులో ఉన్న 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు 50 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమిస్తున్నాయి. స్థానిక మీడియా ప్రకారం.. ప్లాంట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చదవండి: Russia Orders: ఆ వారం రోజులు ఆఫీసులకు వెళ్లకండి.. అయినా జీతాలిస్తాం! -
అరటి పొడి సూపర్: ప్రధాని మోదీ
బెంగళూరు: కరావళి, మలెనాడులో అరటికాయను పొడి చేసి వైవిధ్య ఉత్పత్తులను తయారుచేయడం ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకుంది. తాజాగా ఆకాశవాణి మన్ కీ బాత్‌లో ఆయన ప్రసంగిస్తూ ఇక్కడి మహిళలు అరటికాయలు, పువ్వులతో ఎలా ఆదాయం పెంచుకోవచ్చో చాటిచెప్పారని కొనియాడారు. ఈ అరటి పొడితో దోసె, గులాబ్‌జామ్, బ్రెడ్ వంటివి తయారు చేయవచ్చు. కరోనా సమయంలో కొందరు మహిళలు కొత్తగా ఆలోచించి అరటి పొడిని తయారు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
మీ ఇంట్లో రెడ్ లేబుల్ టీపొడి వాడుతున్నారా..?
చాదర్‌ఘాట్: నకిలీ టీపొడి విక్రయిస్తున్న ఇద్దరు దుకాణదారులపై చాదర్‌ఘాట్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ శేషు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకృపామార్కెట్ లోని శ్రీపవన్ స్తుతి స్టోర్స్ నిర్వాహకుడు దినేశ్‌కుమార్ గోయెల్ నకిలీ రెడ్ లేబుల్ టీపొడి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడం తో కంపెనీ వినోద్ కుమార్ పోలీసులకు ఫిర్యా దు చేశాడు. ఈ నేపథ్యంలో షాప్‌పై దాడులు నిర్వహించిన పోలీసులు రూ.2 లక్షల విలువైన నకిలీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి సరఫరా.. ఈ నకిలీ టీ పొడి మధ్య ప్రదేశ్ నుంచి నగరానికి సరఫరా అవుతుందని, బేగం బజార్ లోని సుమిత్రన్ ఏజెన్సీ అధినేత సర్దా క్రాంతి ద్వారా మలక్‌పేటలోని కృపామార్కెట్కు తరలించి అక్కడ నుంచి హోల్‌సేల్‌గా నగరంలోని దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు నిందితులు సర్దా క్రాంతి, దినేశ్ కుమార్ గోయెల్‌ను అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నిరీక్షణకు మోక్షం
ఖానాపురం: పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఎంతో మంది రైతులకు గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హక్కుపత్రాలిచ్చి దేవుడయ్యారు. ఆయన మరణం అనంతరం పోడు రైతులకు పట్టాలిచ్చే నాథుడే కరువయ్యారు. గతంలో ప్రభుత్వ ఆదేశాలతో ఫారెస్ట్ అధికారులు పోడు రైతులకు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. వాటిని ఎదుర్కొంటూ కష్టపడి సాగు చేసుకున్న భూములను వదిలిపెట్టలేదు. కుటుంబానికి భరోసాగా ఉండే భూములనే నమ్ముకొని పట్టాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ప్రస్తుత అధికారులు అండగా నిలుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాలు ఉన్నాయి. ఈ మండలాల పరిధిలో ప్రధానంగా ఖానాపురం, నర్సంపేట, నల్లబెల్లి, నెక్కొండ, చెన్నారావుపేటతో పాటు ఇతర మండలాల్లో పోడు భూములను అనేక మంది రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రైతులకు అనేక పథకాలను తీసుకువచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు రైతుల విషయంలో ఫారెస్ట్ అధికారులతో ఉక్కుపాదం మోపించారు. నూతనంగా పోడు భూములను సాగు చేయనీయకుండా కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. దీంతో పోడు రైతులు భయాందోళనకు గురవుతూ గతంలో పోడు చేసుకున్న భూములను మాత్రమే సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరంత హక్కు పత్రాల కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లాలో 171 మందికి మంజూరు.. పోడు సాగు చేసుకోని జీవనం సాగిస్తున్న రైతులకు పట్టాల కోసం ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ వస్తున్నారు. వారి నిరీక్షణకు డీఎల్సీసీ కమిటీ, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిలు ఊరట కల్పించారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి భారీగా పోడు రైతులకు పట్టాలు మంజూరి చేసి పొడు రైతుల గుండెల్లో నిలిచిపోయాడు. నాటి నుంచి నేటి వరకు ఎవరికీ పట్టాలు మంజూరి కాలేదు. తాజాగా 13–12–2005 కంటే ముందు పోడు సాగు చేసుకుంటున్న వారికి పట్టాల కోసం డీఎల్సీసీ కమిటీ ద్వారా 261 మందికి నివేదికలు రాగా 171 మందికి హక్కుపత్రాలు మంజూరు చేశారు. మిగతా 90 మందిని రిజెక్ట్ చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో హక్కుపత్రాలు మంజూ రైన రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులకు సహకరించాలి.. 171 మందికి హక్కు పత్రాలు మాత్రమే కల్పించడం జరిగింది. హక్కుపత్రాలు కల్పించిన భూముల్లో యంత్రాలు, కరెంట్‌ను వాడొద్దు. వర్షపు నీటిపై ఆధారపడి మాత్రమే పంటలు పండించుకోవాలి. అడవులకు ఎలాంటి నష్టం కలిగించొద్దు. పత్తి, మిర్చి లాంటి పంటలు పండించొద్దు. హక్కుపత్రాలు వచ్చిన భూముల చుట్టూ అడవులను కాపాడాలి. – కాసిపేట పురుషోత్తం, డీఎఫ్ఓ, వరంగల్ రూరల్ -
ఈ పౌడర్‌తో కార్బన్‌డైయాక్సైడ్‌కు చెక్!
వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను తనలోకి పీల్చేసుకోగల సరికొత్త పౌడర్ ఒకదాన్ని వాటర్లూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఫ్యాక్టరీలు విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఈ పౌడర్‌ను వాడటం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని అంచనా. అంతేకాదు.. కార్బన్‌తో తయారైన ఈ పౌడర్‌లోని రంధ్రాల సైజును నియంత్రించడం, రంధ్రాల సంఖ్యను పెంచడం ద్వారా ఈ టెక్నాలజీని మరింత సమర్థమైన వాటర్ ఫిల్టర్లు, బ్యాటరీల తయారీకి కూడా వాడుకోవచ్చునని ఝాంగ్వీ ఛెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. మొక్కల పదార్థాన్ని వేడి చేయడం.. ఉప్పును వాడటం ద్వారా తాము కార్బన్‌ను తయారు చేశామని, ఈ క్రమంలో ఏర్పడిన సూక్ష్మమైన కర్బన గోళాలపై మీటర్లో పదిలక్షల కంటే తక్కువ సైజున్న రంధ్రాలు ఏర్పడ్డాయని ఛెన్ వివరించారు. ఫలితంగా ఈ కర్బన పదార్థం వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను ఇతర పదార్థాల కంటే రెట్టింపు వేగంగా, తనలో ఇముడ్చుకోగలదని చెప్పారు. వాతావరణంలోకి చేరకముందే కాలుష్యకారక వాయువును నిల్వ చేసుకోవడం వల్ల భూ తాపోన్నతి తగ్గింపునకు ఇదో మెరుగైన తాత్కాలిక పరిష్కారం అవుతుందన్నది తమ అంచనా అన్నారు. -
కేజీ టీపొడి రూ.40 వేలు..
ఏంటీ.. కేజీ టీ పొడి ధర రూ.40 వేలా అని ముక్కున వేలేసుకోకండి. అంత ధర పలికింది ఎక్కడో కాదు.. టీ ఉద్యానవనాలకు స్వర్గధామమైన గువహటిలో.. అసోంలోని గువాహటి టీ వేలం కేంద్రంలో జరిగిన వేలం పాటలో రికార్డు ధర పలికింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని డానియి పోలో టీ ఎస్టేట్‌లో పండించిన అరుదైన గోల్డెన్ నీడిల్స్ టీ పొడి ఈ రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. అస్సామ్ టీ ట్రేడర్స్ ఈ టీపొడిని దక్కించుకున్నారు. గత నవంబర్‌లో డానియి పోలో ఎస్టేట్‌లోని ఓయమ్ గ్రామానికి చెందిన తేయాకు తోటల్లో పండిన టీపొడి కేజీ ధర రూ.18,801 పలికింది. గోల్డెన్ నీడిల్స్ తేయాకు కాడలు చిన్నగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా వాటిని సేకరించాలి. ఆకు పైభాగం బంగారు రంగులో ఉంటుంది. ఆకులు చాలా మృదువుగా, మెత్తగా ఉంటాయి. ఈ పొడితో చేసిన టీ ముదురు బంగారు రంగులో ఉంటుంది. చెరుకు రసంలాంటి సువాసనతో తియ్యగా ఉంటుంది. -
ఆయిల్‌తో చర్మం కాంతివంతం
బ్యూటిప్స్ కొబ్బరి నూనె – అర కప్పు అలోవెరా ఆకు – సగం ఉల్లిపాయలు – రెండు ఉసిరిపొడి – రెండు టీ స్పూన్లు శీకాయ పొడి – రెండు టీ స్పూన్లు పాత్రలో కొబ్బరి నూనె సన్నని మంట మీద పెట్టాలి. దీంట్లో ఆమ్లా పౌడర్, శీకాకాయ్ పౌడర్ ఒకదాని తరవాత ఒకటి వేసి కలపాలి. రెండు నిమిషాల తరవాత కాగుతున్న నూనె మిశ్రమంలో ఆలోవెరా ఆకును చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. మిశ్రమం మరుగుతుండగా ఉల్లిపాయ ముక్కలు వేసి అయిదు నిమిషాలు మరిగించి దింపేయాలి. నూనె మిశ్రమం చల్లారిన తరవాత బాటిల్లో నిల్వ చేసుకోవాలి. అవసరమయినప్పుడు ఈ మిశ్రమం బాడీకంతటికీ పట్టించాలి. 30 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్కసారి చేస్తే శరీరం కాంతివంతం అవుతుంది. గమనిక: కొబ్బరినూనెకు బదులుగా ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, బాదం నూనెలను కూడా ఉపయోగించవచ్చు. -
పౌడర్ తెచ్చిన తంటా..
బాలీవుడ్ నటి రిచా చద్దాకు ఢిల్లీ విమానాశ్రయంలో చేదు అనభవం ఎదురైంది. ఇటీవల ఆమె ముంబై వెళ్లేందుకు ఢిల్లీలో విమానాశ్రయానికి రాగా, బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని సెక్యూరిటీ అధికారులు ఆపేశారు. రెండు గంటలపాటు విచారణ జరిపిన తర్వాత గాని విడిచిపెట్టలేదు. ఇంతకీ ఆమె వద్ద వివాదాస్పదంగా ఉన్న వస్తువు ఏంటో తెలుసా.. ‘పౌడర్’.. అవునండీ.. మీరు చదివింది నిజమే.. రిచా బ్యాగ్‌లో ఉన్న పౌడర్‌పై విమానాశ్రయ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. వాస్తవానికి అది ఆయుర్వేద పద్ధతిలో తయారుచేసిన అందాన్ని సంరక్షించే పౌడరు. రిచా గత ఆరు నెలలుగా తన సౌందర్య రక్షణ కోసం ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రత్యేకంగా తయారుచేసిన ఆయుర్వేద పౌడర్‌ను ప్రయాణ సమయంలో ఆమె నిత్యం తన వెంట తీసుకువెళతారు. అయితే ఈ సారి ప్రయాణంలో ఆ పౌడర్ ఈ అందాల బాలీవుడ్ నటికి తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ విషయాన్ని రిచా ధ్రువీకరించింది.. ‘అవును.. నాకు ఆయుర్వేదంలో విపరీతమైన నమ్మకం. నా వెంట ఎప్పుడూ ఆయుర్వేద ఉత్పత్తులు ఉంటాయి. అయితే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆయుర్వేద పౌడర్‌ను చూసి అనుమానించిన అధికారులకు దాని గురించి పూర్తిగా వివరించాను. రెండు గంటలపాటు వారి అనుమానాలను నివృత్తి చేశాను. వారిపై నాకు ఎటువంటి కోపం లేదు.. వారి పనిని వారు సక్రమంగా నిర్వర్తించారు.. అందుకే వారికి పూర్తిగా సహకరించాను. అయితే అదృష్టం కొద్దీ నా విమానం మిస్ కాలేదు..’ అని ఆమె ముక్తాయించారు. -
‘ముంపు’ ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలి
భద్రాచలం రూరల్, న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతాల్లోని ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి తెలంగాణలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపీ మెడికల్ ఆండ్ హెల్త్ ట్రైబల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కారం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. యూని యన్ జిల్లా రెండవ మహాసభ ఆదివారం పట్టణంలోని రెడ్‌క్రాస్ భవనంలో జరిగాయి. యూనియన్ పేరును ‘తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ట్రైబల్ ఎంప్లాయిస్ యూనియన్’గా మారుస్తూ తీర్మానాన్ని ఈ మహాసభ ఆమోదించింది. ఈ మహాసభలో నాయకులు మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంతంలోని పీహెచ్ఎన్ల ఖాళీలను వెంటనే స్థానిక గిరిజన ఎంపీహెచ్(ఫిమేల్)తో భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండవ ఎంపీహెచ్ఏ(ఫిమేల్)లకు ప్రతి సబ్ సెంటర్‌ను రెండవ సబ్ సెంటర్‌గా చేస్తూ అక్కడే పనిచేస్తున్న రెండవ ఎంపీహెచ్ఏ(ఫిమేల్)లను రెగ్యులర్ చేయాలని, ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని ఆరువేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ఉద్యోగులంతా సంఘటితంగా ఉండాలని కోరారు. నూతన కమిటీ ఎన్నిక యూనియన్ జిల్లా నూతన కమిటీని ఈ సమావేశం ఎన్నుకుంది. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎవి.రమణకుమారి, వాసం నర్సింహారావు, 20మంది సభ్యులుగా ఎన్నికయ్యారు. మహిళా విభాగం అధ్యక్ష, కార్యదర్శులుగా వీసాల ఉమాదేవి, పూనెం సత్యవతి, 20 మంది సభ్యులుగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్ సోమరాజు దొర, జోనల్ కార్యదర్శి గొంది వెంకటేశ్వర్లు, కాంతమ్మ, ఎవి.రమణకుమారి, వీరాస్వామి, కృష్ణయ్య, చిన్నమ్మా యి, చుక్కమ్మ, తుర్రం రామకృష్ణ, దూలయ్య, ఇందిర, జమున, సుమలత పాల్గొన్నారు.